Friday, February 20, 2026

 *ఎంత కష్టకాలంలో కూడా ఆశ్ర యించ  కూడనివారు*

1- *షండుడు*
సకాలంలో స్నానం చేయని వాడు,దేవతలను, తల్లిదండ్రులను గౌరవింపనివాడు.

2 *మార్జానుడు*-
అహంకారం తోను,నిర్లక్ష్యం తోను,జప,తపాలు చేసేవాడు.

3 *అఖువు* 
కావలసినన్ని సంపదలు ఉన్నా తాను తినక,ఇతరులకు పెట్టని వాడు.

4 *కుక్కుటుడు*
పక్షపాతం తో తీర్పులు చెప్పేవాడు.

5 *పతితుడు*
తన ధర్మం  విడిచి  పరధర్మం ఆచరించేవాడు.

6 *అపవిద్దుడు*
గో హత్య,స్త్రీ హత్య మొ:లగు పాతకాలు చేసే వాడు.

7 *నగ్నుడు* దైవ భక్తి లేనివాడు.

8 *ఛండాలుడు*
ఎంతో ఆశతో వచ్చినవానికి,తాను సహా యపడక ,ఇతరులు కూడా సహాయపడకుండా  అడ్డుపడే వాడు,మరియూ శరణు కోరి వచ్చేవానిని  గాలికి వదిలేసేవాడు.

9 *అధముడు* బంధువులు, స్నేహితులు, ఉత్తములు  మొదలగువారికి దూరమైనవాడు.

ఇలాంటి వారిని ఎంత కష్టదశలో ఉన్నా  వారిని ఆశ్రయించరాదు 

కొండమడుగు శివసుబ్రహ్మణ్య శర్మ
వేద వాస్తు జ్యోతిష్య పండితులు 
☎️9000193596☎️

No comments:

Post a Comment