Friday, February 20, 2026

 *గిరి ప్రదక్షిణ చేసేటపుడు గిరివలం మార్గం లో మీరు దర్శించ వలసిన 44 పుణ్య ప్రదేశాలు:*

అరుణాచలం అనగా అరుణ ఎర్రని, అచలం అంటే కొండ అని పరమార్ధం. అలాగే ఆ ఎర్రని కొండ పాపములను హరింప చేస్తుంది. అణ్ణామలైగా కూడా పిలుచుకునే సకల పాప దోషాలను హరింపచేసే ఈ క్షేత్రంలో స్మరణ మాత్రంచేత పుణ్యం లభిస్తుంది.
ఈ అరుణాచల స్వామి తేజోలింగం, జ్యోతిర్లింగము అందుకే అగ్నిక్షేత్రమని కూడా కొనియాడతారు. 14 కి. మీ. గిరి ప్రదక్షిణ చేయడమంటే ముక్కంటి ప్రదక్షణే. వేదాలు, ఉపనిషత్తులలో కొండ అనగా పెద్ద కొండ శివుడని. ఆ మహేశ్వరుడని సెలవిస్తోంది. గిరిప్రదక్షిణ చేసేమార్గం లో 44 ఆలయాలు దర్శించుకునే క్రమంలో మధ్య మధ్యలో మరికొన్ని చిన్న చిన్న ఆలయాలుంటాయి అన్నీ దర్శించుకుని పెద్దాలయం దగ్గరకు చేరుకుంటే గిరిప్రదిక్షిణ పూర్తైనట్టే...             ఈ కొండకి తూర్పు వైపున అరుణాచలేశ్వరాలయం కన్నా ఈ కొండే అత్యంత మహా అద్భుత ఫలితాలని, ప్రశాంతతని పుణ్యాన్ని ఇస్తుంది భక్తులకి.

  1. *అరుణ గిరి నాథర లింగం* - గిరి ప్రదిక్షిణ ప్రారంభించాల్సిన ప్రదేశం ఇది...

2. *ఇంద్ర లింగం* - ఇంద్రుడు ప్రతిష్టించిన శివలింగం దీనికి శుక్రుడు - సూర్యుడు అధిదేవతలు. ఈ లింగాన్ని దర్శించుకుంటే కెరీర్ కి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి..

3. *అగ్నిలింగం* - అగ్ని తీర్థం - అరుణగిరి చుట్టూ మొత్తం 8 శివలింగాలున్నాయి.. వాటిలో ఏడు రోడ్డుకి ఎడమవైపు ఉంటే అగ్నిలింగం కుడివైపు ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కపకాలంలో ప్రమాదాల నుంచి గట్టెక్కిస్తాడు

4. *శేషాద్రి స్వామి వారి ఆశ్రమం:* - ఈయన కామాక్షి అమ్మవారి స్వరూపంతో జన్మించారని చెబుతారు. అవధూత స్వరూపంలో భక్తులను అనుగ్రహించేవారు.

5. *దక్షిణా మూర్తి* - ఇది చాలా పురాతనమైన, శక్తివంతమైన ఆలయం... దాదాపు 1500 ఏళ్ల క్రితం నుంచి ఈ ఆలయం ఉంది.

6. *రమణాశ్రమం* - ఇక్కడ రమణమహర్షి తల్లి సమాధి ఉంటుంది.. దానికి నమస్కరించుకుని రమణాశ్రమంలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి

7. *మీనాక్షీ, సుందరేశ్వరుడు, గణేశ ఆలయాలు* -పార్వతీ పరమేశ్వరుల శక్తి ఇక్కడుందని భక్తుల విశ్వాసం

8. *ద్రౌపది ఆలయం* - ఇక్కడ నుంచి గిరి దర్శనం అద్భుతంగా ఉంటుంది... జీవితంలో ఎదురుదెబ్బలు తిని విసిగిపోయినవారికి మానసిక స్థైర్యాన్నిస్తుంది ఈ ఆలయం           

9.*యమలింగం* యముడు పూజించిన ఈ శివలింగాన్ని దర్శించుకుంటే అకాలమృత్యువు దరిచేరదు. మృత్యుభయం తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

10. *పృథ్విలింగం* - అరుణాచలం గిరిచుట్టూ ఉన్న 8 శివలింగాల్లో ఇదొకటి...

11. *వాలమూరి గణపతి* - తొండం కుడివైపు తిరిగిఉండే ఈ గణపయ్యను దర్శించుకుంటేఅదృష్టం వరిస్తుంది                               

12. *దూర్వాస ఆలయం* - ఇక్కడ దూర్వాసుడిని కుంతీ దేవి ప్రతిష్టించిందని చెబుతారు - ఇక్కడున్న వేపచెట్టుకి పసుపుదారాలు కడితే సంతాన భాగ్యం కలుగుతుందని...రాళ్లు పేరిస్తే ఇల్లు కట్టుకుంటారని భక్తుల విశ్వాసం.

13. *కాట్టు శివాశ్రమం* - అటవీ అధికారుల అధీనంలో ఉండే ఈ ప్రదేశానికి వెళ్లాలంటే అనుమతులు తీసుకోవాలి. గిరి ప్రదక్షిణలో భాగంగా ఈ ఆశ్రమాన్ని రోడ్డుపైనుంచి దర్శనం చేసుకుని వెళిపోవచ్చు..                      

  14. *అప్పు నంది* - పంచభూతాలకు సంబంధించిన నందుల్లో ఇది జలసంబంధ నంది... వివాదాలను సమసిపోయేలా చేసి బంధాలను వృద్ధి చేస్తుంది ఈ నంది దర్శనం

15. *తేయునంది* - ఈ నందినుంచి చూస్తే గిరి చతుర్ముఖ దర్శనం ఉంటుంది... బ్రహ్మదేవుడు జీవుల సృష్టికి కావాల్సిన జ్ఞానం ఇక్కడి నుంచి పొందారని చెబుతారు. అందుకే ఇక్కడి నుంచి బహ్మదేవుడిలా కనిపిస్తుంది గిరి                                          

16. *శోణ తీర్థం* - ఇక్కడ రెండు నందులుంటాయి. ఇక్కడున్న వినాయకుడిని జ్యోతి వినాయకుడు అంటారు..రమణమహర్షి గిరిప్రదిక్షిణ చేసేటప్పుడు సేదతీరిన ప్రదేశం ఇది.. ఆ మహనీయుడు కూర్చోవడం వల్ల ఈ ప్రదేశం అత్యంత ప్రశాంతంగా ఉంటుంది...

17. *నైరుతి లింగం* - అష్ట లింగాల్లో నాలుగోది ఇది..రాక్షసరాజు నిరుతి ( నైరుతి దిక్కుకి అధిపతి) ప్రతిష్టించిన విగ్రహం ఇది. ఈ క్షేత్రానికి అధిపతి రాహువు..ఇక్కడ స్వామిని దర్శించుకుంటే రుషగ్రహబాధలు తొసగిపోయి కీర్తి ప్రతిష్టలు వస్థాయి          

 18. *నంది ముఖ దర్శనం* - ఇక్కడి నుంచి గిరివైపు చూస్తే..నంది ముఖంలా కనిపిస్తుంది                     

19. *ఎదిర్ నేర్ అన్నామలై* - సరిగ్గా ఇది గిరికి వెనుకవైపు ఉంటుంది.. ఇక్కడి నుంచి గిరిని చూస్తే శవశక్తి దర్శనం అవుతుంది.. అంటే శివుడు ఓ కొండగా, శక్తి మరోకొండగా కనిపిస్తారు..

20. *ఆకాశ నంది* - పంచభూతాల్లో భాగంగా ఉండే నందుల్లో నాలుగోది ఆకాశనంది            

21. *పళని ఆండవార్ ఆలయం*- కుమారస్వామి ఇక్కడ తపస్సుచేసి స్వయంభుగా వెలశాడని చెబుతారు..అందుకే ఈ ప్రదేశం అత్యంత పవర్ ఫుల్      

  22. *రాజ రాజేశ్వరి ఆలయం* - ఇది చిన్న ఆలయమే కానీ మహాశక్తివంతమైన ఆలయం..ఇక్కడి నుంచి కొండను చూస్తే పార్వతీదేవి కొండ మాత్రమే కనిపిస్తుంది...

23. *సింహ తీర్థం, సింహ నంది* - పంచభూత నందుల్లో ఇది ఐదోది. ఇక్కడున్న సిం

హతీర్థంలో నీరు తాగితే ఎంతటి వ్యసనం అయినా మానేయగలుగుతారు... ఓ సారి ప్రయత్నించి చూడండి భక్తితో...

24. *కన్నప్ప గుడి* - ఇది కూడా అటవీశాఖ అధీనంలో ఉంది. రోడ్డుపైనుంచి నమస్కారం చేసుకోవడమే..

25. *గౌతమ ఆశ్రమం* - గౌతముడు తపస్సు చేసిన ప్రదేశం ఇది

26. *సూర్య లింగం* - అరుణగిరిపైనుంచి వెళ్లిన సూర్యుడు తేజస్సు కోల్పోయి ఇక్కడ తపస్సు చేసి మళ్లీ తేజస్సు పొందాడని చెబుతారు. ఇక్కడ ఆదిత్య హృదయం చదువుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్య అయినా పరిష్కారం అవుతుంది..                                         

27. *వరుణ లింగం* - వరుణ లింగానికి అధిదేవత శని... గ్రహదోషాలు తొలగించే శక్తి ఉన్న లింగం ఇది                                      

28. *మాణిక్య వాచకర్ ఆలయం* - మాణిక్యవాచకర్ శివభక్తుడు.. ఈయన కీర్తిస్తుంటే పరమేశ్వరుడు ఆ శ్లోకాలను రచించి భద్రపరిచాడని చెబుతారు

29. *ఆది అణ్ణామలై ఆలయం* - బ్రహ్మదేవుడు ప్రతిష్టించిన ఈ శివలింగం అరుణాచలేశ్వరుడి కన్నా ముందే ఉందట..         

30. *వాయులింగం* - ఈ ఆలయంలో కూర్చుంటే బయట ఎండగా ఉన్నా లోపల చల్లగా ఉంటుంది..ఈ క్షేత్రానికి అధిదేవత కేతువు..

31. *వాయు నంది* - వాయునంది చాలా శక్తివంతమైనది

32. *భగవాన్ బ్రిడ్జ్* - రమణ మహర్షి సేదతీరిన ప్రదేశం ఇది..

33. *చంద్ర లింగం* - చంద్రుడు ప్రతిష్టించిన శివలింగం ఇది... దీనిని దర్శించుకుంటే మీ జీవితంలో ఉండే కష్టనష్టాలు బాధలు తొలగిపోతాయి...

34. *అధికార నంది* - *శ్రీశైలంలో సాక్షి గణపతిలా అరుణాచలంలో అధికారి నంది అలా ను అన్నమాట.. నంది చెవిలో గోత్రనామాలు చెప్పుకోవాలి*                      

35. *అగస్త్య ఆశ్రమం -* ఇక్కడి నుంచి కొండను చూస్తే శివపార్వతులు ఇద్దరూ కలసి కనిపిస్తారు.ఇక్కడ దర్శనం చేసుకుంటే వివాహం, సంతాన దోషాలు తొలగిపోతాయి          

36. *కుబేర లింగం* - లక్ష్మీదేవి ఈ లింగాన్ని ఆరాధించి కుబేరుడికి అప్పగించింది. ఇక్కడ శివయ్యను దర్శించుకుంటే భోగభాగ్యాలు కలుగుతాయి.

37. *ఇడుక్కు పిళ్లయార్ (మోక్ష మార్గము):* - చిన్నగా కనిపించే ఇది ఆలయం కాదు. లోపల రెండు యంత్రాలు అమర్చారని...గిరిప్రదిక్షిణ వల్ల వచ్చిన అలసట ఈ ప్రదేశం మాయం చేసేస్తుందని నమ్మకం.

38. *పంచముఖ దర్శనం* - ఇక్కడి నుంచి గిరిని చూస్తే ఐదు ముఖాలుగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతిని కలిగించే ప్రదేశం ఇది

39. *ఊసి లింగం* - ఊసి అంటే తమిళంలో సూది అని అర్థం..ఇక్కడ శివలింగం సూది ఆకారంలో ఉంటుంది..

40. *పచ్చయ్యమ్మ గుడి* - ఇక్కడ శ్యామలాదేవి పచ్చయ్యమ్మన్ స్వరూపంలో కొలువైంది...      

 41. *ఈశాన్య లింగం, యజమాన నంది* - ఇక్కడితో అష్టదిక్పాలకుల లింగాల దర్శనం పూర్తవుతుంది.

42. *షణ్ముఖ ఆలయం* - ఇక్కడ స్వామివారు ఆరుముఖాల్లో దర్శనమిస్తాడు..                   

43. *దుర్గాలయం, ఖడ్గ తీర్థం* - ఇక్కడ అమ్మవారు మహిషాసురుడిని సంహరించాడని చెబుతారు

44. *ప్రవాళ పర్వతం* - గిరిప్రదిక్షిణలో ఆఖరి ప్రదేశం ఇది..రమణమహర్షి తల్లికి ఉపదేశం చేసిన ప్రదేశం ఇది .  ఇదీ గిరిప్రదిక్షిణ చేసే      విధానం                      

నిత్యమూ, అన్నివేళలా ఎంతోమంది
గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరమునకు, శివస్మరణవల్ల మనస్సుకూ, శివనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత ప్రాప్తి.

*అరుణాచల శివ సన్నిధి*

No comments:

Post a Comment