*ప్రామాణికమైన ఉపనిషత్తులు పదకొండు మాత్రమే*
*ఈశ,కేన,కఠ,ప్రశ్న,ముండక,మాండుక్య,తైత్తిరీయ,ఐతరేయ,ఛాందోగ్య,బృహదారణ్యక మరియు శ్వేతాశ్వ తరోపనిషత్తులు.ఇవియే వేదానుకూ
లముగా నున్నవి.మహర్షి దయానం
దసరస్వతి ఋగ్వేదాది భాష్యభూమి
కలోని గ్రంథప్రామాణ్యప్రప్రామణ్య విషయములో పది ఉపనిషత్తులనే
ఉటంకించారు.అంతిమముదైన శ్వే
తాశ్వతరోపనిషత్తును గణించ లేదు.అయితే సత్యార్థ ప్రకాశము
లో పలుచోట్ల శ్వేతాశ్వతరోపనిష
త్తు శ్లోకములు ఉటంకించారు. ఇందు శ్లోకములు తక్కువగాను, యజుర్వేదమంత్రములు అధికము గాను గలవు.ఈ శ్వేతాశ్వతరోపనిష త్తు కృష్ణయజుర్వేదీయ శాఖాంతర్గ తము.యజుర్వేదమునకుగల
108 ఉపనిషత్తులలో పదకొండు మినహాయిస్తే, మిగతా (97) ఉపని షత్తులు ప్రమాణము కాదు.పురాణ ముల మాదిరిగానే,అక్కడక్కడ ఈ ఉపనిషత్తులలోను వేదానుకూల విషయములు గలవు.అయినను
అధికముగా వేదవిరుద్ధ విషయము
లు గలవు.అందుకే,ఆర్యసమాజ మూర్ధన్య విద్వాంసులు,యోగి, సార్వదేశిక్ ఆర్యప్రతినిధి సభ అధ్యక్షులు,నిజాం వ్యతిరేక యోద్ధ మహాత్మా నారాయణస్వామి దశో పనిషత్తులకు హిందీలో ఉపనిషద్ రహస్య ములు పేర అద్భుత భాష్యమును చేశారు.కాగా వ్యాక రణ విద్వాంసులు పండిత భీమసేన్ శర్మ శ్వేతాశ్వతరోపనిష త్తునకు హిందీ భాష్యం చేశారు.ఇక తెలుగులో తొలుత పండిత అన్నే కేశవార్యశాస్త్రిగారు దశోపనిష త్తులకు భాష్యం చేశారు.కాని అవి ప్రస్తుతం లభ్యం కావడం లేదు.ఆ తదుపరి పండిత గోపదేవశాస్త్రిగా ఏకదశ ఉపనిషత్తులకు తెలుగు భాష్యం చేశారు.ఇవి అంబాదర్శన గ్రంథమాల కూచిపూడివారు ము ద్రించారు.ఇవి అందుబాటులో గలవు.
…..ప్రభాకరశర్మ. *
No comments:
Post a Comment