*క్షమాగుణం*
తప్పు చేయడం మానవ సహజం, క్షమించడం దైవీ లక్షణం అన్నారు విజ్ఞులు. తెలిసో తెలియకో ప్రతివారూ తప్పులు చేస్తారు. వాటిని పట్టించుకోకుండా ఆ వ్యక్తిని క్షమించడం గొప్ప. దానికి ఓర్పు, సహనం ఉండాలి. ఓర్పు ఉన్న స్త్రీలను ధరిత్రితో పోలుస్తారు. తనను ఎంతగా బాధించినా, అపవిత్రం చేసినా. ఇంకా ఏన్ని
రకాలుగా ఇక్కట్ల పాల్జెసినా క్షమిస్తుంది భూమి.
అలాగే అనుభవిస్తున్న బాధలను గురించి
చింతించకుండా, విసుగు చెందకుండా అన్నింటినీ
సహించేది స్త్రీ మాత్రమే.
అందుకే క్షమాగుణానికి ఆమెను ప్రతీకగా చెబుతారు.
రావణుడిపై విజయం సాధించిన తరవాత ఆ విజయవార్తను తీసుకుని సీతాదేవి దగ్గరకు వెళ్ళాడు హనుమంతుడు. రాముడి సందే శాన్ని ఆమెకు వినిపించి, అన్నాళ్లూ ఆమెను ఇబ్బందులకు గు చేసిన రాక్షస స్త్రీలను వధిస్తాను అనుజ్ఞ ఇమ్మని కోరాడు. దానికి సీతాదేవి 'వారు ఇతరుల ఆజ్ఞలను పాటిం చేవారు మాత్రమే. వారిపై కోపగిం చడం సమంజసం కాదు, అపరాధం చేయని వారెవరూ ఉండరు. పాపి అయినా, పుణ్యాత్ముడైనా, వధిం పదగిన అపరాధమే చేసినా అందరి పట్ల దయ చూపించ వలసిందే' అని పలికింది.
మహాపురుషులైనవారు తమ పట్ల ఇతరులు చేసిన అపరాధాలను లెక్క చేయరు.
మనుషుల మధ్య విభేదాలు సహజం. తమను ఇబ్బంది పెట్టినవారిని క్షమించగలిగే ఔదార్యం మనకుండాలి. క్షమించడo గతం మరిచిపోవడం కష్టం కాదు. ఎదుటి మనిషిని క్షమించమని అడగడానికి అహంకారం. వదులుకోవాలి. క్షమించమని అడగడం ఓటమినిఅంగీకరించడం కాదు, బలహీనత, చేతకానితనం
అంతకన్నా కాదు. అదొక శక్తిమంతమైన ఆయుధం.
అది వ్యక్తిత్వాన్ని ఇనుమడింపజేస్తుంది.
పరశురాముడు కార్తవీర్యార్జునుడిని సంహరించి కామ
ధేనువును ఆశ్రమానికి తీసుకు వచ్చి తండ్రికి చెబుతాడు. అప్పుడు పరశురాముడి తండ్రి జమదగ్ని క్షమ కలిగి ఉండాలని బోధిస్తాడు. ఆ సందర్భంలో కుమారుడితో 'క్షమ కలిగి ఉంటే సంపద కలుగుతుంది. విద్య అబ్బుతుంది. సుఖాలన్నీ కలుగుతాయి. దయామయుడైన శ్రీహరి సైతం సంతోషిస్తాడు' అని క్షమ గొప్పతనాన్ని చెబుతాడు.. ఆదిత్యయోగి...
విశిష్టాద్వైత స్థాపకులైన శ్రీరామానుజులవారికి గురువు యామునాచార్యులు. ఈయన రంగనాథుని భక్తాగ్రేసరుడు. ఆ రాజ్యంలో కొందరికి ఆచార్యులపై ద్వేషం అసూయ ఉంది. ఒక రోజు ఆయన కావేరిలో స్నానం చేసి వచ్చే మార్గంలో అడ్డంగా పాదరక్షల తోరణాన్ని కట్టారు. యామునాచార్యులు ఆది గమనించి ఏ మాత్రం కోపం తెచ్చుకోలేదు. పైగా సాగిలపడి ఆ పాదరక్షల తోరణానికి
నమస్కరించాడు.
ఆయన నోటి వెంట ఒక శ్లోకం వెలువడింది. దాని భావం...
'సమర్థులైన కొందరు పుణ్యాత్ములు, కర్మయోగాన్ని అనుసరిస్తారు. మరికొందరు మహానుభావులు జ్ఞానయోగాన్ని అనుసరిస్తారు. నాలాంటి ఏ యోగమూ అనుసరించలేని అసమర్థులకు వారి పాదరక్షలే గతి. వాటిని ఆశ్రయించిన నావంటివారు ఉద్ధతి పొందుతారు' అని ఆ శ్లోక భావం. ఇదంతా గమనిస్తున్న ఆకతాయిల హృదయం పశ్చాత్తాపంతో మనసు నిండిపోయింది. వారిలో ద్వేషం మంచులా కరిగిపోయింది. ఆయన పాదాలపై పడి క్షమించమన్నారు.
ఆయన చిరునవ్వుతో వారినిక్షమించారు. అదీ క్షమాగుణం గొప్పతనం..*
No comments:
Post a Comment