ఆరెస్సెస్ శాఖ మీద దాడి చేస్తే ఏమొస్తుంది...
కొద్దిసేపు నీకు ప్రచారం వస్తుంది...ఆ తరువాత నీకు ఆయాసం వస్తుంది...
కేసయితే పోలీసు స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది...ఆ తరువాత నీకు నీరసం వస్తుంది...
మహా అయితే నీలాగే పావు మెదడు గాళ్ళు నువ్వు ఓడిపోయే చోట ఓ వార్డు కి కౌన్సిలర్ సీటు ఇస్తారు..
లేదా నువ్వు నాకిపోవడానికి సరిపడ చిల్లర వస్తుంది...
ఇది నీ వైపు జరిగేది...
ఇంకో వైపు జరిగేది నీకు అస్సలు తెలీదు...
అది తెలిస్తే నువ్వు నీ పిచ్చి మూక ఇలాంటి పనులకు తెగబడరు...
అసలు ఆ శాఖలో ఏం జరుగుతూ ఉండి ఉంటుంది...అది తెలిసినా నువ్వు ఈ తెలివిమాలిన పనికి దిగి ఉండవు...
ఆ శాఖ లేదా కార్యక్రమం బహిరంగంగా జరుగుతూ ఉంది...
కాస్సేపు ఆ మీటింగులో కూర్చుని ఉండాల్సింది...
వాళ్ళు ఏ మతాన్ని అయినా కించపరచారా... ఏ వ్యక్తులను అయినా తూలనాడారా...
పోనీ నువ్వు అలా జరిగిందని అబద్ధం ప్రచారం చేద్దామన్నా అది బహిరంగంగా జరిగింది కాబట్టి నువ్వు అబద్ధం చెప్పలేవు...
ఒక నాలుగు రోజులు నువ్వు గొట్టం ఛానెల్స్ ముందు మందు బాబులు ఊదినట్టు ఉఫ్ ఉఫ్ అని ఊదగలవు...అంతే...
నువ్వు చరిత్ర చదివినవాడివి కాదు...కనీసం బెంగాల్ కేరళ మీ వాళ్ళ అనుభవాలు తెలుసుకున్న వాడివి కూడా కాదు...
వాళ్ళే ఇలాంటివి చేసి చేసి అలసి పోయి.. పులుసు కారిపోయి ఉన్నారు...
బ్రిటిష్ వాళ్ళ నుంచి మొదలయ్యి..నెహ్రూ ఇందిరా లాలూ...జ్యోతిబసు..స్టాలిన్ ఇలా శక్తిమంతమైన రాజ్యాధికారం పోలీసు బలాలు ఉండి కూడా ఏమీ చెయ్యలేక కాళ్ళెత్తేశారు...
కారణం ఆరెస్సెస్ శాఖలో..లేదా సమావేశాల్లో అసలు ఏమీ ఉండదు...నువ్వు సోషల్ మీడియాలో చూసినంత కారం ఉప్పు మిరియాల ఘాటు కూడా ఉండదు...
కాస్సేపు కబడ్డీ ఆడి... భారత మాతకు జయకారం చేసి...ఒక పాట పాడుకుని పోయే నలుగురు వ్యక్తులు తప్ప ఇంకేమీ ఉండదు....
ఒక నెల పొద్దున్నే లేచి పో...విసుగు వచ్చి నీలాంటోడు గోచీ ఊడి పరిగెత్తక పోతే చూడు...
నెహ్రూ జైల్లో పెట్టి...విడుదల అయిన తరువాత...ఆగ్రహంతో ప్రభుత్వం అంతు చూడాలి అన్న ప్రజలతో ఆరెస్సెస్ చీఫ్ గురూజీ...నాలుక పంటి కింద పడి గాయపడింది అని పల్లూడగొట్టుకుంటామా అన్నారు...
ప్రభుత్వం కూడా మనదే అన్నారు...
ఆరెస్సెస్ ఇంకో మాట అంటుంది...ఒకడు ఈరోజు స్వయంసేవక్...ఎదురుగా తలపడుతున్నవాడు కాబోయే స్వయంసేవక్ అని...
అంత ఆత్మవిశ్వాసం అంత ధైర్యం...అంత నమ్మకం...
ఆరెస్సెస్ కు శత్రువులు ఉండరు అందుకే...
ఆరెస్సెస్ సత్యాగ్రహం..ధర్మాగ్రహం చాలా గట్టిగా సాలిడ్ గా లోతుగా ఉంటుంది...
రేపు రేపు నీ ఇంట్లో వాళ్ళే నిన్ను అసహ్యించుకునేంతగా...నీ వాడే నిన్ను వెలివేసేంతగా...
పంజాబ్ లో మోగా లో తీవ్రవాదులు శాఖ మీద దాడి చేసి పసి వాళ్ళ వృద్ధుల ప్రాణాలు తీసిన మరునాడు యధావిధిగా శాఖలు జరిగిన చరిత్ర ఆరెస్సెస్ ది.✍️🙏🚩🚩
అన్నమనేని శ్రీనివాసరావు
No comments:
Post a Comment