Pasupula Pullarao..8919291603.
ఒకే ఒక్క పాజిటివ్ ఆలోచన లోనె చిదంబర రహస్యం, విశ్వ ప్రణాళిక, విశ్వ శక్తి దాగి యున్నది... మనసు నిలకడగా ఉన్నపుడే పాజిటివ్ ఆలోచనలు చేయడం అలవాటు అవుతుంది... మనసును నిలకడగా నిశ్శబ్దంగా ఉండడానికి సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం..
భూమి గుండ్రంగానే అయస్కాంత శక్తిని కలిగి ఉంది... సూర్యోదయం సూర్యాస్తమయం లు భూమి తన చుట్టూ తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండడం వలన మాత్రమే.. ఆ విషయాలు పరిశోధన ల ద్వారా మాత్రమే ప్రపంచానికి తెలిసాయి.
అధ్యాత్మిక రంగంలో కూడా సరైన సాధన ద్వారా మాత్రమే అమూల్యమైన, అఖండమైన విషయాల ను తెలుసుకుంటూ పొందవచ్చు.
అంతరంగం ఒక అద్భుతమైన పుస్తక భాండాగారం.... ఆ పుస్తకాలు చదవలన్నా అందులోని జ్ఞానం విజ్ఞానం పొందాలన్న ముందుగా అంతరంగం అనే గ్రంధాలయం లోకి వెళితే అర్దం పరమార్థం అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరుగుతుంది. గ్రంధాలయం నకు వెళ్ళడానికి ముందుగా శ్వాస మీద ధ్యాస అనే వాహనాన్ని ఎంపిక చేసుకోవాలి.
No comments:
Post a Comment