Friday, February 20, 2026

 Pasupula Pullarao...8919291603.
     నామ, రూప, ధ్యాన, మంత్ర, తంత్ర, యంత్ర విజ్ఞానంలు అన్ని పెద్దలు,గురువులు, విజ్ఞులు అంతరంగ ప్రవేశానికి మార్గాలు గా సూచించారు వారి వారి అనుభవ పూర్వకంగానే వచ్చిన జ్ఞానంతో.
     మనందరం ధ్యాన మార్గంలో పయనించి అంతరంగ ప్రవేశం గురించి ధ్యాన సాధన చేయడం జరుగుతుంది.
    ఎంత ఎక్కువ ధ్యాన ప్రచారాలు చేస్తే అంత ఎక్కువగా శాకాహారులు గా మారుతారు.. ధ్యానం చేసిన ప్రతి ఒక్కరూ ఆటోమేటిక్ గా శాకాహారులు అవుతారు.
     అందుకే ధ్యాన ప్రచారాలు ఎక్కువగా చేసి అందరితో ధ్యానం చేయించడం ద్వారా ధ్యాన విశిష్టతను,ప్రాముఖ్యాన్ని తెలుసుకొని సాధన చేస్తారు. ఎందుకంటే సరైన సాధన ద్వారా వ్యక్తిగత ప్రయోజనాలు అమోఘం, అపూర్వం, అధ్బుతంగా ఉంటాయి గనుక..
     అందరితో ధ్యానం చేయించి అందరికీ అనుభవపూర్వకంగా ధ్యానం యొక్క విశిష్టతను విస్తృతంగా  ప్రచారం చేయాలి.
     అపుడే ధ్యాన,శాకాహార జగత్ సాధ్యం.
     మొక్కుబడి ప్రచారాలు, ర్యాలీలు వలన ఫలితాలు శూన్యం.
     ఒకసారి సరైన సాధన చేయించడం ద్వారా వారు ఆటోమేటిక్ గా శాకాహారులు గా మారుతారు.
     ధ్యాన ప్రచారాలు ద్వారా మాత్రమే శాకాహారులు గా మారుతారు గాని శాకాహార ర్యాలీలు ద్వారా ధ్యానులు తయారు కారు.
     ర్యాలీలో కొందరి చేతనైన ధ్యానం చేయిస్తే ఫలితాలు అధ్బుతంగా ఉంటాయి... ధ్యానం యొక్క విశిష్టత పెరుగుతుంది.

No comments:

Post a Comment