కుండలిని రహస్యం 🔥 ఎన్నో గ్రంథాలు, పుస్తకాలు చదివినా అర్థం కాని ప్రశ్నలు | ReSearch On Kundalini 💠 02
Author Name:My Journey Sg
Youtube Channel Url:https://www.youtube.com/@SaiGaneshRudrakshala
Youtube Video URL:https://www.youtube.com/watch?v=7zQjcH8ziZ8
Transcript:
(00:03) [సంగీతం] కుండలిని రహస్య విద్య కుండలిని అనగానే అందరి మనసులో భయం ఉంటుంది. లేదా ఆశ లేదా ఆశ్చర్యం ఏంటి ఇది నిజంగా నిజమేనా అని ఏ పుస్తకం చదివినా ఏ వ్యక్తి వివరించినా పూర్తిగా అర్థం కాకుండా రహస్యంగా దాచబడిన సాధన ఇది అదే కుండలిని ఎన్నో శాస్త్రాలు ఆధ్యాత్మిక అనుభవాలు గురువులు శాస్త్రవేత్తలు పరిశోధనలు వీటిలో ఏది కూడా స్పష్టంగా కుండలిని గురించి దాని రహస్యాన్ని వివరించలేకపోయింది.
(00:36) ఎందుకంటే అది ప్రమాదం. మన అనుభవాలకి అర్థం కాని అతీతమైన శక్తి అది నీ శరీరంలో జరిగే అద్భుత మార్పులకి మూలం అది. ఈ విశ్వంలో ఉన్న అనంతమైన శక్తిని నీలో దర్శించగల అనుభవం అది. ఆశతో కోరికలతో ఉన్నవాడు ఆ శక్తిని చెడుకి స్వార్థానికి ఉపయోగిస్తాడు. ఆశ లేనివాడు ఆ శక్తికి లోబడడు. తన మన అన్న స్థాయిని దాటిన వాడిని మాత్రమే ఆ కుండలిని శక్తి వరిస్తుంది.
(01:04) స్వార్థం నాశనానికి వినాశనానికి మొదలు వాడి ఆశ పిచ్చి కోరికలు ఇవి అన్నీ సాధనకు అక్కర్లేని సామర్థ్యాలు అందుకే మాయలో పడతాడు. అజ్ఞానంలో ఆనందాన్ని వెతుకుతాడు. చివరికి అతీతమైన శక్తుల కోసం పిచ్చివాడైపోతాడు. మూర్ఖుడు కూడా ప్రయత్నించే వీలు ఉంటే ఇది రహస్యం ఎందుకు అవుతుంది? అందుకే ఇలా జరగకూడదు అని చాలా గుప్తంగా ఈ విద్య గురువులు సమర్ధులకు అనుగ్రహిస్తారు.
(01:32) గ్రంథాలు శాస్త్రాలు కుండలినికి సంబంధించిన పుస్తకాలు ఏవి కూడా నీకు పూర్తి జ్ఞానాన్ని ఇవ్వదు ఎందుకంటే అవి రహస్యం. ఎందుకంటే అవి అక్షరాలు కాదు అది ఒక కోడ్ ఆ అక్షరాలు సాధారణమైనవి కానీ వాటి మధ్యలోనే గ్రహించేవాడికి సామర్థ్యం ఉన్న సమర్ధుడికి వాటి మధ్యలో అసాధారణమైన మార్గం కనిపిస్తుంది. వాడికి సాధనా మార్గం బోధపడుతుంది.
(01:56) అయితే ఈ వీడియోలో మనం కుండలిని అంటే ఏంటి అని ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ సిరీస్ లో కుండలినికి సంబంధించిన అనేకమైన ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. కుండలిని అంటే వెన్నుపూస అడుగు భాగంలో పాములాగా ఉన్న శక్తి అని మనం వింటాం. కానీ అది నిజంగా పామా లేక మనలో దాగి ఉన్న సప్రెస్డ్ కాన్షియస్నెస్ కుండలిని అంటే ఒక మిస్టరీ కాదు ఇది మనిషి చైతన్యానికి సంబంధించిన మ్యాప్ ఇది యోగ క్లాసెస్ కే పరిమితం కాదు.
(02:25) కుండలిని శక్తి ఒక్కసారిగా జరిగే అద్భుతం కాదు. కుండలిని అనేది కరుణాక్ అసలుకే కాదు అది అద్భుత శక్తులను ఇవ్వదు. నిన్ను నీకు పరిచయం చేస్తుంది. కొంతమందికి సడన్ గా జీవితంపై విరక్తి కలుగుతుంది. నేను ఎవరు ఎందుకు పుట్టాను ఏం చేస్తున్నాను ఏం చేయాలి ఇలా అనేకమైన ప్రశ్నలు ఆలోచనలు వస్తూ ఉంటాయి. డబ్బు ఉన్నవాడు లేనివాడు అనే భేదం ఈ విశ్వానికి నీ లోపల దాగి ఉన్న ఆ శక్తికి లేదు.
(02:54) నీకు ఈ ప్రశ్నలు రావటమే అదృష్టం నీ అన్వేషణ నీ సాధన మొదలైనట్టే ఏదో YouTube లో వినే కథలు కాదు మనం వినేది అసలు కుండలిని మూలాలు తెలుసుకుందాం. దాని అర్థం దాని వెనుక దాగి ఉన్న శక్తులు ప్రమాదాలు ప్రతి విషయం సూక్ష్మంగా తెలుసుకుందాం. అసలు కుండలిని అంటే ఏంటి? కుండల అంటే చుట్టుకొని నిద్రిస్తున్న శక్తి అని అర్థం. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి ఉంది.
(03:21) అది నిజంగా పామా లేక పాముతో పోల్చిన ఒక ఉపమానమా? పాము తన చర్మాన్ని వదులుతుంది అంటే పునర్జన్మ. పాము నేల మీద అలల వలె కదులుతుంది అంటే శక్తి ప్రవాహం. పాము ప్రమాదం కూడా అంటే శక్తి సరైన అవగాహన లేకపోతే ప్రమాదం అని. [సంగీతం] కుండలిని అనేది శరీరంలో ఒక కరెంట్ కాదు. అది మానవ పరిణామ శక్తికి ఇచ్చిన ఒక సంకేత పదం. మనిషికి సాధారణంగా భయం అసూయ అహంకారం ఇలా చాలా రుగ్మతలు ఉంటాయి.
(03:47) ఆ స్థాయిలోనే జీవిస్తుంటాడు. ఇది సర్వైవల్ మోడ్ కానీ ఒక దశలో జీవితం గురించి లోతైన ప్రశ్నలు మొదలవుతాయి. నేను ఎవరు ఈ జీవితానికి అర్థం ఏమిటి? సంతోషం ఎందుకు శాశ్వతం కాదు నిజమైన సంతోషం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలు మొదలైన చోటే కుండలిని యొక్క విత్తనం ఉంది. అయితే కుండలిని యొక్క చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం. కుండలిని అనేది యోగా క్లాస్ లో పుట్టిన కాన్సెప్ట్ కాదు.
(04:13) ఇది తంత్ర సాంప్రదాయాల్లో పుట్టింది. ముఖ్యంగా శైవ శాక్త సంప్రదాయాల్లో ఇది ఉంది. హతయోగ ప్రాదీపిక మరియు శివ సంహిత వంటి గ్రంథాల్లో కుండలిని గురించి వివరంగా ఉంది. ఆ శక్తి మోక్షానికి ద్వారం అని ప్రస్తావించబడింది. కాశ్మీర్ శైవ తత్వంలో మహా తత్వవేత్త అభినవ్ గుప్త ఒక ఆసక్తికరమైన దృక్కోణాన్ని చెప్పారు. చైతన్యం తనని తాను మర్చిపోవడం బంధనం గుర్తు చేసుకోవడం విముక్తి.
(04:40) ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినండి. కుండెలిని లేచింది అంటే శక్తి పైకి వెళ్ళటం కాదు చైతన్యం తనను తాను గుర్తు చేసుకోవటం కుండలిని లేచింది అంటే శక్తి పైకి వెళ్ళటం కాదు చైతన్యం తనను తాను గుర్తు చేసుకోవటం చాలామంది ఈ కుండలిని అనుభవించిన వారు ఇలా చెబుతుంటారు. నా భయాలు బయటిక వచ్చాయి. నా పాస్ట్ ట్రామాస్ మళ్ళీ వచ్చాయి. నేను నా భావాలు నేను అనే వ్యక్తిత్వం కుప్పకుపోయినట్టు అనిపిస్తుంది.
(05:05) అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే మనలో చాలా భావోద్వేగాలు నొక్కిపెట్టబడి ఉన్నాయి. మనసులోని అవగాహనకి రాని ఈ భాగాన్ని సైకాలజీలో అన్కాన్షియస్నెస్ అంటారు. కార్ల్ జంగ్ ఒకసారి ఇలా హెచ్చరించాడు. అన్కాన్షియస్నెస్ విషయాలు ఒక్కసారిగా పైకి వస్తే మనిషి అస్థిరం కావచ్చు. అంటే పిచ్చివాడ అవ్వటం అని లేదా మతిస్థిమితం కోల్పోవటం అని చెప్పవచ్చు.
(05:28) అందుకే కదా యోగులు ఋషులు ఈ కుండలితో ఆటలు ఆడుకోవద్దు అని చెప్పేది. యోగులు సబ్టిల్ బాడీ అంటారు. సైకాలజిస్ట్లు అన్కాన్షియస్నెస్ అంటారు. భాష వేరు కానీ చెప్పింది ఒకటే కుండలిని అనుభవం అనేది చాలాసార్లు మనసులో దాచుకున్న భయాలను విడుదల చేస్తుంది. అందుకే కొందరికి భయం మరికొందరికి బాధ కొందరికి అనంతమైన ఆనందం. మరి కుండలిని ప్రమాదకరమా అని అడిగితే నా సమాధానం శక్తి స్వతహా ప్రమాదకరం కాదు ఇంబాలెన్స్డ్ గా ఉంటేనే ప్రమాదం.
(05:59) ఒక వ్యక్తి మానసికంగా బలహీనంగా ఉంటే పాస్ట్ ట్రౌమాస్ ఉంటే అహం పటిష్టంగా లేకపోతే అప్పుడే గాఢమైన ధ్యానం ఆర్ బలవంతపు ప్రాణాయామం వల్ల బావోద్వేగాలు ఒక్కసారిగా బయటకి రావచ్చు. దానిని కొందరు కుండరణి సిండ్రోమ్ అని అంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి అది శక్తి సమస్య కాదు అది సిద్ధత లేకపోవటం. నిజమైన ఆధ్యాత్మిక వికాసం మనిషిని మరింత స్థిరంగా చేస్తుంది.
(06:22) అస్థిరంగా చేస్తే అది అపూర్ణ ప్రక్రియ. మనం కుండలిని శక్తిని లేపాలని ప్రయత్నిస్తున్నాం కానీ అసలు ప్రశ్న మన జీవితం స్థిరంగా ఉందా అని మన జీవితం అసత్యంతో ఉంటే సంబంధాలు బంధనాలు అయితే మనసు అస్థిరంగా ఉంటే అప్పుడు గాఢమైన ధ్యానం సాధ్యమా ఆ కుండలిని శక్తిని తట్టుకోగలమా కుండలిని అనేది మాంత్రిక అనుభవం కాదు అది ఒక అంతర్గత శుద్ధి ప్రక్రియ శుద్ధి ఎప్పుడూ సులువు కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి కుండలిని అనేది వెన్నులో పాము కాదు అది మనిషి అవగాహన పరిణామ మానికి ఇచ్చిన ఒక ప్రతీక దాన్ని వెంబడించాల్సిన అవసరం లేదు.
(06:59) దానికి సిద్ధం కావాలి అంతే జీవితాన్ని సత్యంగా బ్యాలెన్స్డ్ గా పూర్తి అవగాహనతో జీవిస్తే అది సహజంగానే మేల్కొనే ప్రక్రియ. మరి ఎవరైనా కుండలిని బలవంతంగా మేలుకొలపాలి అని చూస్తే ఏమవుతుంది? అయితే ఈ టాపిక్ ని వచ్చే వీడియోలో తెలుసుకుందాం. చాలా ప్రమాదాలతో కూడిన ఈ ప్రయాణాన్ని చేసింది ఎవరు? ప్రవజం ప్రజయా నాశయగవాహం ప్రవజం ప్రజయా నాశయగవాహం
No comments:
Post a Comment