*ॐ హనుమజ్జయంతి ప్రత్యేకం*
*హనుమజ్జయంతి శుభాకాంక్షలు*
*ఈ రోజు వైశాఖ బహుళ దశమి. హనుమ జన్మించినరోజు.*
*హనుమంతుని తండ్రి పేరు కేసరి. అందువలన కేసరి నందనుడు.*
*అంజన ఆ కేసరి యొక్క భార్య.*
*అంజన యొక్క కుమారుడు ఆంజనేయుడు.*
*హనుమంతుడు, అంజనాదేవి గర్భాన - వాయుదేవుడు - శివతేజస్సును ప్రవేశపెట్టడం వలన జన్మించాడు.*
*అందుచేత పవనతనయుడు, మారుతి వంటి పేర్లు కలిగియున్నాడు.*
*భాగం : 9/15*
*IX.హనుమ - లంకలో జయఘోష*
*1.जयत्यतिबलो रामो*
*लक्ष्मणश्च महाबलः।*
*राजा जयति सुग्रीवो*
*राघवेणाभिपालितः।। 42/33*
*1.జయత్యతిబలో రామో*
*లక్ష్మణశ్చ మహాబలః I*
*రాజా జయతి సుగ్రీవో*
*రాఘవేణాభిపాలితః ৷৷ 42/33*
*అతిబలసముపేతుడైన శ్రీరామునికి జయము,*
*మహాబలసంపన్నుడైన లక్ష్మణునకు జయము.*
*రాఘవునిచే పాలింపబడు సుగ్రీవ మహారాజుకు జయము.*
*Glory to Sri Raama of invincible might!*
*Glory to powerful Lakshmana abd to Sugriva who is ruling under the protection of Raama!*
*2.दासोऽहं कोसलेन्द्रस्य*
*रामस्याक्लिष्टकर्मणः।*
*हनुमान्शत्रुसैन्यानां*
*निहन्ता मारुतात्मजः।। 42/34*
*2.దాసోహం కోసలేన్ద్రస్య*
*రామస్యాక్లిష్టకర్మణః I*
*హనుమాన్శత్రుసైన్యానాం*
*నిహన్తా మారుతాత్మజః ৷৷ 42/34*
*సజ్జన క్లేశవిదూరమైన కృత్యములొనరించు కోసలాధినాథుడగు శ్రీరామునకు నేను సేవకుడను.*
*శత్రుసైన్యములను పరిమార్చు శక్తివంతుడనైన నేను వాయుపుత్రుడను. హనుమంతుడను పేరుగలవాడను.*
*I am Hanumaan, the servant of that Raama.*
*The son of the Wind-god that I am, I can decimate the armies of enemies,*
*and accomplish anything with utmost ease.*
*3.न रावणसहस्रं मे*
*युद्धे प्रतिबलं भवेत्।*
*शिलाभिस्तु प्रहरतः*
*पादपैश्च सहस्रशः।। 42/35*
*3.న రావణసహస్రం మే*
*యుద్ధే ప్రతిబలం భవేత్ I*
*శిలాభిస్తు ప్రహరతః*
*పాదపైశ్చ సహస్రశః ৷৷ 42/35*
*వేలకొలదిగ శిలలతోడను వృక్షములతోడను ప్రహరించుచు యుద్ధము చేయునట్టి నాకు*
*వేయిమంది రావణులు వచ్చినా, నాతో సమానమైన ప్రతివీరులు కాజాలరు.*
*Even a thousad Raavanaas cannot face me in battle when I attack with rocks and trees in many ways.*
*4.अर्दयित्वा पुरीं लङ्काम्*
*अभिवाद्य च मैथिलीम्।*
*समृद्धार्थो गमिष्यामि*
*मिषतां सर्वरक्षसाम् ।। 42/36*
*4.అర్దయిత్వా పురీం లంకామ్*
*అభివాద్య చ మైథిలీమ్ I*
*సమృద్ధార్థో గమిష్యామి*
*మిషతాం సర్వరక్షసామ్ ৷৷ 42/36*
*ఇచ్చటి రాక్షసుల కళ్ళెదుటనే లంకానగరమంతనూ ధ్వంసముచేసి,*.
*మా సీతమ్మకి మ్రొక్కి, నేను తలపెట్టిన కార్యాన్ని సాధించుకొని వెడలుతాను.*
*Even when all the Raakshasaas are looking with their eyes open,*
*I shall shake Lanka, meet Seeta, salute her and*
*return after accomplishing my task.*
*=x=x=x=*
*— రామాయణం శర్మ*
*భద్రాచలం*
No comments:
Post a Comment