మనకు కలలు ఇతర భాషలలో రావు ఎందుకు ? కలలు మన మాతృ భాషలోనే రావడానికి గల కారణాలు ఏమిటి? ఎందుకు? ఎలా?
ఆదిశంకరులు " బ్రహ్మసత్యం జగన్మిధ్య, జీవో బ్రహ్మ ఏవ నపరః " అంటే బ్రహ్మ సత్యం, జగత్ మిధ్య, జీవుడు బ్రహ్మ వేరుకాదు ( ఒకరే ) అన్నారు.
ఆదిశంకరులని ఒకాయన అడిగారు " ఎప్పుడూ మిధ్య మాయ అంటారు మీరు, మరి అతను కనబడుతున్నాడు, ఇతను మాట్లాడుతున్నాడు, కుక్క కరుస్తూంది కదా " అని. ఆయన అన్నారు " అంతా నీ భ్రమ " అని. మరి కలలోనూ జరుగుతూన్నది ఇదే కదా. ఎక్కడెక్కడో తిరగడం, తినడం, కుక్క వెంటబడడం, పరిగెత్తడం, కాలు విరగడం లాంటివి. ఉదయం లేవగానే " అమ్మయ్య కలే కదా " అని సంతోషించడం.
రాత్రి కలగంటున్నాం. కలలోకి ఓ అమ్మాయి, పాము, ఎద్దు అలా రకరకాల జీవులు వస్తున్నాయి. నిజంగా వారు వస్తున్నారా?. మరునాడు నాకలలోకి ఎందుకు వచ్చి అలా చేసావు అని ఎవరినయనా అడగగలమా?. లేదు, ఎందుకంటే కలలో కనబడినవన్నీ " తనే ( వివిధ రూపాలలో చూసుకుంటున్నాడు )" కనుక, భేదం లేదుకనుక.
అదే మన వేదాలు చెప్పినది. ఇప్పుడు జరుగుతూన్నది, మనం చూస్తూన్నది, మనకు అనుభవమవుతూన్నది బ్రహ్మగారి కల. " బ్రహ్మ సత్యం జగన్మిధ్య ". పైన మన కలలోకి వచ్చినవి అన్నీ మనరూపాలే అనుకున్నాం కదా. అంటే బ్రహ్మగారి కలలో ఉన్నవి అన్నీ ఆయనే ( బ్రహ్మగారే ) అని కదా. అంటే జీవులందరూ ( మనం ) బ్రహ్మస్వరూపాలే. అదే " అహం బ్రహ్మస్మి ". జీవుడే దేముడు. ఇది తెలుసుకుంటే జ్ఞాని, లేకపోతే అజ్ఞాని.
ఇదీ మన సనాతనధర్మ విశిష్టత. ఏ ఇతర ధర్మాలు కనీసం ఇలా ఆలోచించలేవు కూడా.
కలలో మనం చూసేది ఏదయినా మన రూపమే అని కదా తెలిసినది. మరి మాట్లాడే భాష కూడా మనదే అవుతుంది కదా. అందుకే మనం మన మాతృభాషలోనే మాట్లాడుతాం కలలో.
రెండు మూడు భాషలు తెలిసిన వారికయినా హఠాత్తుగా అనుకోకుండా చేసే వ్యక్తీకరణ మాతృభాషలోనే ఉంటుంది. ఇది సహజం.
శుభమస్తు
No comments:
Post a Comment