Thursday, June 4, 2026

André Gide’s Philosophy Explained: The Law of Repetition and the Infinite Loop of Life

André Gide’s Philosophy Explained: The Law of Repetition and the Infinite Loop of Life

Author Name:Nagna Satyam

Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=i3RokbwB4gE



Transcript:
(00:06) ఒకటి గమనించండి మీరు చూసేది వినేది ఆఖరికి నువ్వు తాకేది అంటే ఈ ప్రపంచంలో కొత్తదనం అనేది ఉండదు అదిఒక అబద్ధం. ఈరోజు నువ్వు ఏ ఎమోషన్ అయితే ఫీల్ అవుతున్నావో అది లవ్ కావచ్చు, జెలసీ కావచ్చు, బాధ లేదా డిప్రెషన్ కూడా అవ్వచ్చు. అది ఈ భూమ్మీద పుట్టిన మొదటి మనిషి కూడా సేమ్ టు సేమ్ ఫీల్ అయ్యాడు.
(00:27) నువ్వు రాస్తున్న లవ్ లెటర్ అయినా చేస్తున్న ట్వీట్ అయినా చివరికి పడుతున్న బాధ అయినా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్ పిరమిడ్లు కట్టేటప్పుడు అక్కడ పని చేసిన లేబర్ కూడా అలాగే ఫీల్ అయ్యాడు. కాకపోతే అప్పట్లో WhatsAppట్ లేదు ఇప్పుడు ఉంది అంతే తేడా. మన DNAన్ఏ స్ట్రక్చర్ ని తీసుకుంటే కొన్ని లక్షల సంవత్సరాల నుంచి అది పెద్దగా ఏం మారలేదు. సైన్స్ ప్రకారం మోడర్న్ పీపుల్ అంటే హోమో సెపియన్ సెపియన్స్ ఈ భూమి మీదకు వచ్చి దాదాపు మూడు లక్షల సంవత్సరాలు అవుతుంది.
(00:55) ఈ మూడు లక్షల ఏళ్లలో మానవ మెదడు సైజు గాని అందులో కెమికల్స్ రిలీజ్ అయ్యే విధానం గాని అస్సలు మారలేదు. మరి అలాంటప్పుడు కొత్త ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి రావు. నీ బ్రెయిన్ ఒక కంప్యూటర్ లాంటిది. అందులో ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయి ఉంది. దాని పేరే సర్వైవల్ అండ్ రీప్రొడక్షన్ అంటే బతకడం, వంశాన్ని పెంచడం.
(01:17) ఈ రెండు బేసిక్ ఇన్స్టింట్స్ చుట్టూనే మనిషి అనేవాడు కథలు అల్లుకున్నాడు. ఈ కథలనే మనం ఈరోజు రాజకీయం అంటున్నాం, సినిమా అంటున్నాం, మతం అంటున్నాం చివరికి ఫిలాసఫీ అంటున్నాం. ఇవన్నీ ఎప్పుడో క్రీస్తుపూర్వం నాటి గ్రీక్ ఫిలాసఫర్లు సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ లాంటి వాళ్ళు పూస గుచ్చినట్టు మాట్లాడేశారు. ఈవెన్ ఈరోజు మనం మాట్లాడుకునే డెమోక్రసీ అయినా, హ్యూమన్ రైట్స్ అయినా వాళ్ళు అప్పట్లో డిస్కస్ చేశారు.
(01:41) కానీ విచిత్రం ఏంటంటే ఆ కాలంలో కూడా జనాలు వాళ్ళ మాటలు వినలేదు. ఎంతలా వినలేదంటే నిజాలు చెప్తున్నాడని సోక్రటీస్ కి విషం ఇచ్చి మరి చంపేశారు. అంటే అప్పుడు వినలేదు ఇప్పుడు వినట్లేదు. ఇంకా వెనక్కెళ్లి మన హిస్టరీ అండ్ లిటరేచర్ చూడు వ్యాస మహర్షి మహాభారతం రాసినప్పుడు అందులో ఒక మాట అన్నాడు. ఈ ప్రపంచంలో ఏమున్నా అది మహాభారతంలోనే ఉంటుంది. ఇందులో లేనిది ప్రపంచంలో ఎక్కడా ఉండదు అని ఇది నిజమే.
(02:07) నువ్వు మహాభారతంలోని ధర్మరాజు ఈగోని చూడు కర్ముడి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని చూడు దుర్యోధనుడి జెలసీ చూడు సకుని మైండ్ గేమ్స్ చూడు ఇలా చూసుకుంటూ పోతే ఈరోజు నీ చుట్టూ ఉండే వాళ్ళలో వీళ్లే [సంగీతం] కనిపిస్తారు. క్యారెక్టర్స్ అవ్వే బట్ కాస్ట్యూమ్స్ చేంజ్ అంతే బట్ ప్రతి జనరేషన్ ఏమనుకుంటుందంటే మేము చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నామని పెద్ద పెద్ద రికార్డులు కొడుతున్నామని భ్రమ పడుతుంది అంతే ఆ భ్రమే మనిషిని బ్రతికిస్తోంది.
(02:32) నిజానికి ఏ జనరేషన్ కొత్తగా ఏమి చేయట్లేదు. పాత జనరేషన్ చేసిన తప్పుల్ని మళ్ళీ కొత్తగా చేస్తోంది. అసలు మ్యాటర్ ఏంటంటే జనాలు ఎందుకు వినరు ఆండ్రే గీడేమో ఎవరు వినట్లేదు కాబట్టి మళ్ళీ చెప్పాలి అన్నాడు. కానీ నా పాయింట్ ఏంటంటే వినకపోవడమే మనిషి నైజం. ఎందుకంటే ప్రతి మనిషికి తనకంటూ ఒక సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి.
(02:55) నువ్వు ఒక చిన్న పిల్లోడికి వెళ్లి అరే బాబు అక్కడ నిప్పు ఉంది. అది ముట్టుకుంటే కాలుతుంది. ఆల్రెడీ చరిత్రలో చాలా మంది ముట్టుకొని కాల గర్భంలో కలిసిపోయారు అని ఎంత క్లాస్ తీసుకున్నా ఆ పిల్లోడు వినడు. వాడు వెళ్లి ఆ నిప్పుని ముట్టుకొని చెయ్యి కాల్చుకొని ఏడ్చినప్పుడే వాడికి అర్థమవుతుంది. మానవ సమాజం కూడా సరిగ్గా ఈ పిల్లోడు లాంటిదే. ప్రతి తరం తన సొంత తప్పులు తాను చేయాలి.
(03:16) తన సొంత గాయాలు తాను అనుభవించాలి. అందుకే హిస్టరీ రిపీట్స్ ఇట్సెల్ఫ్ అంటారు. మొదటి ప్రపంచ యుద్ధం జరిగాక కోట్లాది మంది చచ్చిపోయారు. అప్పుడు లీగ్ ఆఫ్ నేషన్స్ పెట్టి అందరూ పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చి ఇకపై యుద్ధాలు వద్దు శాంతి ముఖ్యం అని ప్రపంచానికి ఆల్రెడీ చెప్పారు. కానీ జనాలు విన్నారా వినలేదు. జస్ట్ 20 ఏళ్లలోనే మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం చేసుకున్నారు.
(03:38) హిట్లర్ వచ్చాడు హిరోషిమా మీద బాంబ్ పడింది. దాని తర్వాత మళ్ళీ ఐక్యరాజ్య సమితి అదే యూఎన్ పెట్టారు మళ్ళీ శాంతి ప్రవచనాలు చెప్పారు. కట్ చేస్తే ఈరోజు 2026 లో కూడా రష్యా యూక్రైన్ అంటున్నాం మిడిల్ ఈస్ట్ అంటున్నాం ఎక్కడో ఒక చోట బాంబులు పడుతూనే ఉన్నాయి. జనాలు చస్తూనే ఉన్నారు. అంటే అర్థం ఏంటి మనిషికి ఎంత చెప్పినా వినడు.
(04:01) వాడు మళ్ళీ మళ్ళీ నాశనమై మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. అదొక ఇన్ఫినైట్ లూప్ అన్నమాట. ఈ ఇన్ఫినైట్ లూప్ ని అర్థం చేసుకోవడమే అసలైన ఫిలాసఫీ ప్రకృతి డిజైనే అంతా నువ్వు ఒక సినిమా చూస్తావు. అందులో హీరో, విలన్, ఒక లవ్ స్టోరీ, క్లైమాక్స్ ఉంటుంది. ఈ ఫార్ములా కొన్ని వేల సినిమాల్లో నువ్వు చూసేసి ఉంటావు. అయినా సరే రేపు ఇంకో కొత్త సినిమా వస్తే మళ్ళీ థియేటర్ కి వెళ్లి ఎందుకు కూర్చుంటావ్? ఎందుకంటే ఆ రెండు గంటల ఎంటర్టైన్మెంట్ నీకు కావాలి.
(04:27) అలాగే ఈ జీవితం కూడా అంతా పాతదే అని తెలిసినా ప్రతిరోజు పొద్దున్నే లేచి మళ్ళీ అదే రొటీన్ లైఫ్ బతకాలి. ఆండ్రే గీడ్ అన్నట్టు ఎవరు వినట్లేదు కాబట్టే ఆర్జివి లాంటోళ్ళు మళ్ళీ మళ్ళీ సినిమాలు తీస్తున్నారు మళ్ళీ ఇంటర్వ్యూలో అదే ఫిలాసఫీ చెప్తున్నారు. ఒకవేళ అందరూ ఒకేసారి వినేసి మారిపోయి పర్ఫెక్ట్ అయిపోతే ఈ ప్రపంచం చాలా బోర్ కొట్టేస్తుంది. అప్పుడు అసలు లైఫే ఉండదు.
(04:50) గొడవలు లేని తప్పులు లేని ఈగోలు లేని ఒక పర్ఫెక్ట్ సమాజం అనేది ఒక స్మశానంతో సమానం అక్కడ ఏ చలనము ఉండదు. కాబట్టి అంతా ఆల్రెడీ చెప్పబడింది అనేది ఎంత ఫాక్టో దాన్ని ఎవరు వినడు అనేది అంతకంటే పెద్ద ఫాక్ట్ కానీ ఆ వినని జనాల కోసమే మనం మళ్ళీ మళ్ళీ మొదలు పెట్టాలి. ఎందుకంటే ఆ ప్రాసెస్ లోనే ఒక కిక్ ఉంది. నువ్వు క్వశ్చన్లు అడుగుతావ్ ఎందుకంటే నీకు లైఫ్ మీద కన్ఫ్యూజన్ పోదు అని నీకు తెలుసు.
(05:16) ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటూ పోవడమే జీవితం. ఈ నిజాన్ని యక్సెప్ట్ చేస్తే నీకు ఏ అంచనాలు ఉండవు ఏ బాధ ఉండదు.

No comments:

Post a Comment