Tuesday, June 9, 2026

క్షుద్ర ప్రయోగాలు నిజమా ? శాస్త్రం చెప్పేది ఇదే !

క్షుద్ర ప్రయోగాలు నిజమా ? శాస్త్రం చెప్పేది ఇదే !

Author Name:Vastavam Channel

Youtube Channel Url:https://www.youtube.com/@vastavam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=glhCvuOKTaw



Transcript:
(00:00) నమస్తే ప్రసాద్ గారు శ్రీ మాత్రే నమః అండి. శ్రీ మాత్రే నమః చాందిని మనం ముందు చేసిన వీడియోలో నేను ఒక కామెంట్ చూశాను ప్రసాద్ గారు అందులో ఒకాయన ఏం పెట్టారు అంటే నా మీద క్షుద్ర ప్రయోగం జరిగింది. దీనికి ఏదన్నా సహాయం చేయండి అని చెప్పి పెట్టారు. నేను ఆ కామెంట్ చూసిన తర్వాత కాస్త భయపడ్డాను కాస్త ఆలోచించి ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలని మీ ముందుకు ఈరోజు తీసుకొచ్చాను.
(00:29) నిజంగా ఈ క్షుద్ర ప్రయోగాలు లాంటివి ఉన్నాయి అంటారా ఒకవేళ ఉంటే ఈ కాలంలో వాటి నుంచి మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది అన్నది మీరు మాకు చెప్పగలరా ప్రసాద్ గారు ఇది ఇప్పుడు మీరు చెప్పిన ఈ కామెంట్ ఒకటే కాదు చాందిని దాదాపుగా ఈ రెండు మూడు సంవత్సరాల్లో ఇదే అంశం మీద ఇదే సమస్య మీద చాలా ఈమెయిల్స్ వచ్చినాయి.
(00:56) చాలామంది నాకు కొంచెం పరిచయం ఉన్నవాళ్ళయితే ఫోన్లు చేసి మరి ఈ సమస్య గురించి ఎంతమంది నన్ను అడిగారు అంటే వాళ్ళది తెనాలి ఊరు వాళ్ళు బాగా విపరీతంగా అప్పులు అయిపోయారు. వాళ్ళు చేసిన వ్యాపారాలన్నీ నష్టపోయారు సో ఎక్కడ ఏది ఇన్వెస్ట్ చేసినా గాన అది పోవడం ఆ ఫైనాన్షియల్ గా బాగా దెబ్బ తినేసిన తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరిగింది అనారోగ్యం చేసి ఆయన చనిపోయారు.
(01:22) సో ఆవిడ ఏమంటది అంటే మేమంటే గిట్టని వాళ్ళు మా బంధువులే మాకు తెలిసిన వాళ్లే మా మీద ప్రయోగం చేశారు. దుష్ట ప్రయోగం చేశారు అందుకని మా ఫ్యామిలీలో చితికిపోయింది. దీనికి సొల్యూషన్ ఏంటి అయితే ఇప్పుడు మీరు అడిగిన ఈ ప్రశ్నకి అసలు క్షుద్ర ప్రయోగాలు ఉన్నాయా లేదా ఈ విధంగా క్షుద్ర సాధనలు చేయడం చేసిన సాధకులు ఉన్నారా లేదా? ఉండవచ్చు.
(01:44) అధర్వ వేదం ప్రకారం ఏమిటంటే అలాంటి మంత్రాలు ఉన్నాయి అలాంటి దేవతలు ఉన్నారు. అయితే దాన్ని సాధన చేయాలి అంటే దానిలో సిద్ధి పొందాలి అంటే చాలా కఠినమైన చాలా కఠినమైన నియమాలతోటి ఎంతో కష్టంతోటి ఎన్నో సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు కష్టపడితే తప్ప ఆ మంత్రం సిద్ధించదు ఆ క్షుద్ర మంత్రం యొక్క శక్తిని ఒకళ్ళ మీద ప్రయోగించడానికి కావల్సిన శక్తి లభించదు.
(02:15) ఎన్నో సంవత్సరాలు అది 10 ఏళ్ళు పట్టొచ్చు 20 ఏళ్ళు పట్టొచ్చు 30 ఏళ్ళు కూడా పట్టొచ్చు. జీవితం మొత్తం దానికి త్యాగం చేసేయాలి వాళ్ళు అధర్వ వేదంలో అలాగే కొన్ని ఆగమ శాస్త్రాల్లో తంత్ర శాస్త్రాల్లో కూడా అభిచార కర్మలు గురించి చాలా వివరణ ఉంది. అభిచార కర్మలు అంటే ఏమిటంటే ఇతరులని ఇబ్బంది పెట్టడానికి ఉపయోగించే కొన్ని రకాల కొన్ని రకాల కర్మలు అంటే ఇతరులని బాధించడం ఇతరుల జీవితాలని పతనం చేయడం ఇతరులను స్తంభింప చేయడం వాళ్ళు ఏ పని చేయనీయకుండా వాళ్ళని న్యూట్రలైజ్ చేయడం అన్నమాట ఇలాంటివన్నీ కూడా ఎలా చేయాలి అనేది డెఫినెట్ గా వివరాలన్నీ
(02:58) ఉన్నాయి ఆ శాస్త్రాల్లో ఇంకా కొన్ని తాంత్రిక శాస్త్రాల్లో అయితే షట్కర్మల గురించి వివరించారు షట్కర్మలు అంటే ఆరు రకాల కర్మలు అవి ఏంటంటే ఆ వశీకరణం ఉచ్చాటనం మారణం శాంతి అని ఇట్లా ఒక ఆరు రకాల షట్కర్మలు ఉన్నాయి. అయితే ఆ షట్కర్మల్ని చాలా కష్టపడి సాధించాలి ఇంతకు చెప్పినట్టు వాళ్ళకి వేరే ఏమీ ఉండదు లైఫ్ లో అంత కష్టపడి అలాంటి ఒక క్షుద్ర శక్తిని క్షుద్ర మంతాన్ని సాధన చేసినవాడు ఇన్ని సంవత్సరాలు సాధన చేసినవాడు ఆ శక్తిని ఉపయోగించి ఎవరి మీదనా ప్రయోగం చేయాలంటే ఏ లాభాన్ని ఆశించి ప్రయోగం చేస్తాడు.
(03:37) డబ్బా డబ్బు అనుకుందాం ఫస్ట్ సో డబ్బు అనుకుంటే ఇప్పుడు నేను మీకు చెప్పిన ఈ సమస్యలు కొంతమంది సమస్యలు కావచ్చు మీరు చెప్పిన ఆ కామెంట్ లో కావచ్చు వీళ్ళ స్థాయి ఏంటి ఒక మామూలు మనుషులు మామూలు సాధారణమైన వ్యక్తులు వీళ్ళ మీద ఆ ప్రయోగం చేస్తే ఆ చేయించిన వాడు ఎంత ఇవ్వచ్చు వీళ్ళకి ఎంత డబ్బును ముట్ట చెప్పొచ్చు నిజంగానే వాళ్ళకి అంత శక్తి ఉంటే దాన్ని వ్యాపారంగా చేయదలుచుకుంటే ఇలాంటి చిన్న చిన్న సాధారణ వ్యక్తుల జోలికి వెళ్లి వాళ్ళ మీద ఎందుకు వాళ్ళ శక్తిని వృధా చేసుకోవాలి రాజకీయ నాయకులు ఉన్నారు.
(04:11) వాళ్ళ ప్రత్యర్థులని గనుక ఈ విధంగా జస్ట్ ఒక మంత్ర ప్రయోగం ద్వారా ఆ ప్రత్యర్థులని లేకుండా చేయడం లేకోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేయగలిగితే లక్షలు కాదు కోట్లు ఇస్తారు అవునా కాదా అవునండి మీరు చెప్తుంటే అనిపిస్తుంది నిజంగా అంత శక్తివంతమైన ప్రయోగాలు ఈ కాలంలో ఉన్నట్లయితే ఎంతో మంది పేరు పలుకుబడి ఉన్నవాళ్ళు గాని డబ్బు ఉన్నవాళ్ళు గాని వాటిని ఉపయోగించి ఎన్నో రకాలుగా లాభం పొందవచ్చు.
(04:34) కానీ అలా చేయలేకపోతున్నారు కదా మీరు చెప్తుంది ఆలోచిస్తుంటే నాకు అది నిజమే అనిపిస్తుంది. మరి వాళ్ళందరూ చేయించుకోవచ్చుగా అసలు ఈ రాజకీయాల్లో ఈ రాజకీయ పోరాటాల్లో శత్రువులని చాలా ఈజీగా చాలా ఈజీగా అణచివేయొచ్చు కదా మరి అలా జరగడం లేదే ఏంటి అసలు ఇది మరి మంత్రాలు ఉన్నాయా సాధనలు ఉన్నాయి అన్ని ఉన్నాయి. కానీ ఎందుకు ఇలాగ చేయరు అంటే ఇంకొక అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ అధర్వణ వేదంలో చెప్పింది అది కూడా ఎవరైనా గాని ఒక క్షుద్ర శక్తిని సాధన చేస్తే ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఆ కఠిన నియమాలతోటి నిరంతర సాధనతోటి దాన్ని సాధించారు అనుకుందాం సిద్ధి పొందారు
(05:16) అనుకుందాం వాళ్ళు గనుక ఆ శక్తితోటి ఎవరినైనా గనుక హాని చేస్తే ఎవరికైనా గనక హాని చేసి వాళ్ళని ఏదన్నా గనుక ఆ బాధ పెడితే అది తిరిగి వాళ్ళకే తగులుతుందని అదే వేదంలో ఉంది. తాంత్రిక శాస్త్రంలో కూడా ఇదే చెప్పారు ఉన్నాయి చాలా రకరకాల దేవతలు ఉన్నారు దానికి దానికి అంటూ చాలా రకాల శక్తులు ఉన్నాయి వాటి వాటిని వశపరుచుకోవచ్చు ఆ సాధన ద్వారా కానీ ఎవరినైనా గనుక హాని చేస్తే ఎవరికైనా గనుక ఆ శక్తిని ఉపయోగించి హాని చేస్తే అది తిరిగి ఆ హాని చేసిన వాళ్ళకి అంటే ఏ సాధకుడు అయితే ఆ ప్రయోగం చేశాడో ఆ సాధకుడినే తినేస్తుంది.
(05:57) అంటే ఆ సాధకుడు కూడా చాలా ఘోరమైన ఇబ్బందులు పడతాడు అసలు ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుందన్నమాట ప్రాణాపాయం కూడా ఉంటుందంట ఆ మంత్ర సిద్ధి సాధించిన సాధకులకి సిద్ధులకి సో అలాంటి చాలా ప్రమాదకరమైన సాధన సిద్ధి అసలు ఆ సబ్జెక్ట్ అలాంటి అంత గొప్ప శక్తిని సాధించిన సిద్దులు ఇలా మామూలు మన సమాజంలో కూర్చొని చిన్న చిన్న వాటికి ఇరుగు పొరుగు వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఆ చిన్న చిన్న సాధారణమైన మనుషులని ఇబ్బంది పెట్టి వాళ్ళని పతనం చేయడానికి వాళ్ళ శక్తులని ఉపయోగిస్తే ఫన్నీగా ఉంది చాలా సిల్లీగా ఉందిది దానికి కారణం లేదు.
(06:35) వాళ్ళు అలాంటి సిద్ధులు ఎక్కడ ఉంటారంటే ఎక్కడో హిమాలయాల్లో పర్వతాల్లో చాలా రిమోట్ ఏరియాల్లో అటవీి ప్రాంతాల్లో అలాంటి చోట వాళ్ళ జీవితాన్ని గడపడానికి వాళ్ళు ఇష్టపడతారు. వాళ్ళ అన్ని బంధాలు పోతాయి వాళ్ళకి ఆ అన్ని సంవత్సరాల ఆ సాధన ప్రయాణంలో ఆ క్రమంలో వాళ్ళ వాళ్ళ జీవితంలో ఉండే అన్ని రకాల బంధాలకి దూరమైపోతారు వాళ్ళకి ఇష్టం ఉండదు.
(07:00) సాత్విక మంత్ర దేవతలను ఉపాసించే వాళ్ళు సాత్విక దేవతల యొక్క మంత్ర సాధన చేసేవాళ్లే ఆ జర్నీలో ఆ ప్రయాణంలో ఎందుకంటే ఆ సాధన కూడా ఎన్నో సంవత్సరాలు పడుతుంది పూర్తిగా సిద్ధి అనేది కలగడానికి ఆ ప్రయాణంలో మన కుటుంబంలో మన చాలా దగ్గర రిలేషన్స్ మనం వదులుకుంటాం. అంటే కావాలని వదులుకోవడం అని కాదు ఆటోమేటిక్ గా ఏంటంటే మనకు డిటాచ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది.
(07:27) పూర్తిగా ఎవరితోటి కూడా మనకు ఆ రిలేషన్ అనేది ఇంట్రెస్ట్ కలిగించదు. ఇదిగో ఇలా ప్రశాంతంగా వచ్చి ఎక్కడో ఇలా చెట్ల మధ్య పుట్ల మధ్య కొండల్లో ఇలా ఉండాలి ఇలాగే ఉండాలి ఏకాకిగా ఉండాలన్న ఆలోచన ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇలాంటి క్షుద్ర దేవతల్ని తీవ్ర దేవతల్ని ఉపాసించేవారు అలాంటి మంత్ర సాధనలు అలాంటి తంత్రాలను చేసేవాళ్ళు ఇంకా ఎంత దూరం వెళ్ళిపోతారో తెలుసా సమాజానికి కుటుంబానికి సమాజానికి కూడా చాలా దూరం వెళ్ళిపోతారు వాళ్ళు అవును ఈ కాలంలో అలాంటి ప్రయోగాలు ఉన్నాయి అనుకోవటం కాస్త అమాయకత్వం ఉండొచ్చు కానీ జనసంచారంలోన ఇలా బయటికి ఉంటాయి అని చెప్పి
(08:10) అనుకోవటం లేదు నేను కూడాని కాబట్టి అందరూ కొంచెం అది అది గమనించుకొని అవగాహనతో కాస్త ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. మరి ఆలోచించండి. ప్లస్ ఏంటి అదే ఇప్పుడు నేను చెప్పినట్టుగా అధర్వ వేదం కావచ్చు ఆ కొన్ని ఆగమ శాస్త్రాలు కావచ్చు తాంత్రిక శాస్త్రాలు కావచ్చు వీటన్నిటిలో కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఈ శక్తులని సాధించిన వాళ్ళు మహాశక్తి మహా విపరీతమైన శక్తి కలిగిన వాళ్ళు అయి ఉంటారు కానీ వాళ్ళు ఆ శక్తిని గనుక మరొకళని ద్వేషంతోటో మరో దాని కోసమో స్వార్థం కోసమో గనక వాళ్ళని పతనం చేసి వాళ్ళ మీదగన
(08:44) ప్రయోగిస్తే వీళ్ళకి దానికి మించిన దానికి మించిన అపకారం జరుగుతుంది. కాబట్టి మీకు ఏదైనా సమస్య వస్తే అనారోగ్యం సమస్య కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు ఇంట్లో ఇంకా ఇతరతర ప్రాబ్లమ్స్ ఏమి వచ్చినా సరే ముందు దాని మూల కారణాన్ని అన్వేషించండి. ఇలాంటి మూఢనమ్మకాలని ఎవరో మన మీద ప్రయోగం చేశారనో అదనో ఇదనో ఇలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలతోటి మీరు వాస్తవాన్ని గుర్తించకుండా ఆ సమస్యనిగా చిటిలం చేసుకుంటున్నారు.
(09:16) కాబట్టి మూల కారణాన్ని గుర్తించి ఆ సమస్యకు పరిష్కారాన్ని వెతకండి. మన నమ్మకాల్ని మన బలహీనతలని క్యాష్ చేసుకొని మనల్ని ఇంకా భయపెట్టి మన దగ్గర నుంచి సంపాదించే డబ్బు సంపాదించే ప్రక్రియలో ఉండేవాళ్ళు మన సమాజంలో ఉన్నారు అది మన దురదృష్టం చాలా దురదృష్టకరం అది మీరు వెళ్లి ఏం చేస్తున్నారు ఈ పిచ్చి పిచ్చి నమ్మకాలతోటి అవగాహన లేని నమ్మకాలతోటి వాళ్ళ చేతిలో చిక్కుంటున్నారు.
(09:40) అలాంటి వాళ్ళకి వ్యాపారానికి ఇంకా ఆస్కారం ఇస్తున్నారు. చూడండి మనకు సమాజంలో ఇలాంటి నమ్మకాలని బాగా ప్రచారం చేసి అందరి మనసుల్లో కూడా ఇలాంటి భయాల్ని భయాలని చొప్పించి వాళ్ళ పబ్బం గడుపుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి దేవతలను నమ్ముకోండి దేవీ దేవతలని నమ్ముకోండి మీ ఇష్ట దేవతను ప్రార్థించండి తప్పకుండా మీ ప్రార్థన ఫలిస్తుంది దీనికన్నా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మూఢ నమ్మకాల వల్ల ఈ అపోహల వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి కరెక్ట్ గా నిన్నట అంటే నిన్న అంటే నిన్ననే జూన్ ఆరవ తారీకున న్యూస్ లో నేను ఒకటి విన్నాను పార్వతీపురం జిల్లాలో ఒక గ్రామంలో ఒక 30 ఏళ్ల యువకుడిని
(10:27) చిల్లంగి అనే ఒక దుష్ట ప్రయోగం క్షుద్ర ప్రయోగం చేశాడనే ఆ అనుమానంతోటి కొట్టి కొట్టి కొట్టి చంపేశారు. అలా చంపేసి అతని శరీరాన్ని స్మశానంలో తగలబెట్టడం కూడా జరిగిపోయింది. అతనికి భార్య పిల్లలు ఉన్నారు. అతనికి ఏ మాత్రం ఇలాంటి విషయాల మీద నాలెడ్జ్ లేదు ఏమీ లేదు. సో వాళ్ళ ఊర్లో అంట అందరికీ జ్వరాలు వస్తున్నాయంట అందరూ ఒక రకమైన రుగ్మతకి గురవుతున్నారంట అనారోగ్య పాలైపోతున్నారంట వాళ్ళ ఊర్లో చాలామంది అయితే అందులో కొంతమందికి వీడి మీద అనుమానం వచ్చింది వీడేదో చేస్తున్నాడు ఊర్లో అందరినీ ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి వాని ఆ విధంగా అన్యాయంగా అబ్బాయిని ఆ
(11:05) వ్యక్తిని చంపేశారు. పోలీసులు ఆ 16 మందినేమో అరెస్ట్ చేసి కేస పెట్టి దాన్ని విచారణ చేస్తున్నారు. ఏమన్నా అర్థం ఉందా అండి మన మూఢ నమ్మకాలు మనల్ని పతనం చేయడమే కాకుండా అన్యాయ అన్యాయంగా అమాయకులని బలి తీసుకోవడం కుటుంబాలు ఇలాంటి సంఘటనలు చాలా ఉంటాయి మీరు ఇంతకుముందు కూడా న్యూస్ లో చూడండి ఆ ఇలాంటివి చేశారని చెప్పి చేతబళలు చేశారని వశీకరణం చేశారని పిచ్చి పిచ్చి అనుమానాలతోటి పనికిమాలిన మూఢ నమ్మకాలతోటి ఎంతమందిని ఈ విధంగా చంపేశారు చాలా వాల్యబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ప్రసాద్ గారు నిజంగా ఈ విషయం అందరికీ తెలియాలని మాకు అనిపిస్తుంది. ఈ వీడియో
(11:42) చేసినందుకు నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మళ్ళీ మంచి మంచి వీడియోస్ మళ్ళీ మనం చేసుకుందాము. ఇంకా చాలా చాలా డౌట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో ముందుకు వెళ్దాం ప్రసాద్ గారు శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః

No comments:

Post a Comment