Wednesday, October 1, 2025

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁📿🍁 📿🍁📿 🍁📿🍁
                   *దేహభ్రాంతి*

*ధర్మాచరణకు, దైవాన్వేషణకు శరీరమే సాధనం. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది. అంటే మనసు ప్రశాంతంగా ఉండాలన్నా, మంచి ఆలోచనలతో నిండాలన్నా శారీరక ఆరోగ్యం బాగుండాలి. మంచి ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణ కలిగిన జీవనవిధానం ఆరోగ్యాన్ని క్రమబద్ధం చేస్తాయి. అయితే శరీరం పట్ల ఈ జాగ్రత్త దేహభ్రాంతిగా మారకూడదు. విజ్ఞులైనవారు మేనిని కేవలం ధర్మసాధనంగా మాత్రమే భావిస్తారు.*

*సమస్త సృష్టిలో మరే జీవికీ సాధ్యపడని ఆలోచన, వివేకం, వివేచన మానవుల సొంతం. నిరంతర సాధన, ధర్మవర్తన ద్వారా ఈ జన్మను సద్వినియోగం చేసుకుని మోక్షానికి అర్హమైనదిగా మలచుకోవాలి. వ్యాకులత, దుఃఖం, రోగాలు.. చివరికి మరణం ఇవన్నీ శరీరానికి సహజంగా సంభవించేవే. కాబట్టి వీటిపట్ల మితిమీరిన ఆందోళన అనవసరం.* *ఈ విషయం తెలిసినా కొందరు- నా శరీరం వేరు, దైవం వేరు అనే ద్వైతభావం కలిగి ఉంటారు. దీనికి కారణం దేహభ్రాంతి. ఇది ఉన్నంతవరకు ఏకాత్మ భావం అలవడదు. ఈ దేహం శాశ్వతం కాదన్న సత్యం నిరంతరం మనసులో మెదులుతుండాలి.*

*అహంకారానికి కారణం కూడా దేహాభిమానమే. నేను, నాది అనే భావన ‘నేనే’ అనే అహానికి దారితీస్తుంది. దీన్ని క్రమంగా తగ్గించుకోవాలి. ఈ దేహం ముత్యపు చిప్ప వంటిది. విలువైన ముత్యం ఏర్పడటానికి చిప్పే ఆధారం. కానీ ముత్యం లభించాక చిప్పకు విలువ ఉండదు. అలాగే విలువైన ఆత్మ గురించి తెలుసుకున్నవారు దేహానికి ప్రాధాన్యం ఇవ్వరు. దేహాభిమానం ఉన్నంత వరకు మోహసంద్రంలోంచి బయట పడలేరని వేమన కూడా హెచ్చరిస్తాడు.*

*భగవాన్‌ రమణమహర్షికి రాచవ్రణం లేచినప్పుడు ఆయన బాధపడలేదు. శరీరం మాత్రమే తన కర్మఫలాన్ని అనుభవిస్తోంది అనుకున్నారు. ఒకసారి వాసుదేవానంద సరస్వతి స్వామివారికి అతిసార వ్యాధి వచ్చినప్పుడు భక్తులు అడిగారట.. ‘ఎంతోమంది రోగులకు సాంత్వన కలిగించే మీరు వ్యాధితో బాధపడటమేమిటి స్వామీ’ అని. దానికి ఆయన ‘శరీరమే తాము అని భ్రమించేవారికి, బాధలను అధిగమించలేనివారికి ఉపశమనం అవసరం. ఆత్మస్వరూపులు ఇలాంటివాటికి చింతించరు. దేహాన్ని నేనుగా భావించడంలేదు’ అని సమాధానమిచ్చారట!*

*'తనువు తనువటంచు దపియించు జనులార! తనువులు స్థిరమని తలపరాదం’టాడు వేమన. కేవలం ఇంద్రియాల ద్వారా లభించే సుఖాలకు అలవాటు పడి దేహమే నిత్యమనే భ్రాంతిలో బతుకుతుంటారు చాలామంది. ‘పచ్చికుండ వంటిది మేను’ అన్న తత్వకవుల హెచ్చరికలోని అంతరార్థాన్ని గ్రహించలేరు. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల మానవ రూపం లభిస్తుందంటారు పెద్దలు. దాన్ని భగవత్‌ ప్రసాదంగా స్వీకరించాలి. సద్వినియోగం చేసుకోవాలి. వ్యామోహాలు, రాగద్వేషాలు, భోగలాలస, ఇంద్రియ చాపల్యాలకు దూరంగా ఉండటమే దేహభ్రాంతి అనే భవరోగానికి దివ్యమైన ఔషధం.*
🍁📿🍁 📿🍁📿 🍁📿🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴
 *గౌరమ్మ / బ్రతుకమ్మ పాట*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

*బతుకమ్మను సాక్షాత్తూ ఆదిశక్తి రూపమైన గౌరీదేవిగా కొలుస్తారు. బతుకమ్మ సంబురాల్లో గౌరీ దేవిని కొలుస్తూ పాడే పాటలు అనేకం. వాటిలో ఈ గీతం సుప్రసిద్ధం.*


శ్రీ లక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మ గౌరమ్మ!!


- భారతీ దేవివై బ్రహ్మకిల్లాలివై
పార్వతీ దేవివై పరమేశురాణివై
పరగ శ్రీలక్ష్మివై గౌరమ్మ
భార్యవైతివి హరికినీ గౌరమ్మ!!


- ఎన్నెన్నో రూపాలు
ఏడేడు లోకాలు
ఉన్న జనులకు
కోరికలు సమకూర్చగా
కన్న తల్లివైతివి గౌరమ్మ
కామధేనువు అయితివి గౌరమ్మ!!


- ముక్కోటి దేవతలు
సక్కని కాంతలు
ఎక్కువ పూలు గూర్చి
పెక్కు నోములు నోమి
ఎక్కువ వారైతిరీ గౌరమ్మ!!


- ఈ లోకముల నుండియు గౌరమ్మ
తమరి కంటే ఎక్కువ దైవము ఎవ్వరు లేరు
తమకింపు పట్టింపు సకల లోకంబుల
క్రమముచే పాలించగా గౌరమ్మ
కన్నుల పండుగాయే గౌరమ్మ!!

🕉🌞🌏🌙🌟🚩


*Book For Sale*

 సమూహాలలో ఉన్న పుస్తక ప్రియులకు నమస్కారాలు....... 🌹🌹🌹🌹

నేను ఈ మధ్య చదివిన Self -Help పుస్తకం @ *ప్రశాంతంగా* *ఉండండి* ! ప్రస్తుతం మనం *డిజిటల్ మీడియా లో*  Bussy గా వుంటున్నం దాని లో నుండి ఎలా బయట పడాలి, అనే దాని గురించి ఇంకా  జీవితం లో ఎలా సంతోషంగా ఉండాలి అనే విషయాలు చాలా సింపుల్ గా రచయిత *నిక్ ట్రెంటన్* గారు బాగా చెప్పారు.ఈ బుక్ కావలసినవారు
Rs.300/- + Postal ChargesRs.60/-

Please Contact Me:-
Mididoddi Thirupathi 
Cell: 98497 72509 (P/G (pay))
 🌹🌾🌹🌾🌹🌾🌹🌾🌹

*🌈🌺"ప్రణో దేవీ సరస్వతీ"  అంటూ వాగ్దేవి వైభవాన్ని రుగ్వేదం సముచిత రీతిలో కీర్తించింది. తనకు నమస్కరించే వారినందరినీ కాపాడే "సరస్వతి"  మనల్నీ కాపాడుతుందని దాని అర్థం🚩*. 

*🌈🌺అజ్ఞానమనే చీకటిని దూరం చేస్తూ విజ్ఞాన కాంతి కిరణాలను నిరంతరం వెదజల్లే జ్ఞాన ప్రదాయిని సరస్వతీదేవి. సరస్వతి అంటే- అక్షరం, అక్షయం, ఆద్యంత రహిత శక్తిస్వరూపం. సరస్వతి అమ్మ వీణాపాణి, గీర్వాణి, వేదవాణి, వాక్కులరాణి. సర్వవిద్యలకు, సకల శాస్త్రాలకు అధిదేవత. సర్వత్రా వ్యాపించిన ఒక మహత్తర చైతన్యస్రవంతి*.

*🌺🌈బ్రహ్మాండపురాణం ప్రకారం- మాఘ శుద్ధపంచమి నాడు ఆవిర్భవించిన సరస్వతీదేవిని శరన్నవరాత్రి పూజల్లో మూల నక్షత్రం రోజున ప్రత్యేకంగా ఆరాధించడం దక్షిణాదిన ఆనవాయితీ. ఆరోజు ఆదిశక్తిని మహాసరస్వతి రూపంలో కొలుస్తారు. సరస్వతి తన నాలుగు చేతుల్లో పుస్తకం, మాల, నీటికుండ, వీణలను ధరించి ఉంటుంది*.

*🌈🌺పుస్తకం వేదాలకూ జ్ఞానానికీ ఆధ్యాత్మిక పరిపక్వతకూ చిహ్నం. స్పటికమాల నిరంతర ధ్యానసంపదకు ఆలవాలం. నీటికుండ లోకంలోని మంచిచెడుల విచక్షణకూ జ్ఞానామృతానికీ గుర్తు. 'కచ్చపి' వీణ ప్రపంచంలోని సకల సృజనాత్మక విజ్ఞానానికీ ప్రాతినిధ్యం వహిస్తుంది. సరస్వతీదేవిని పూజించిన వారికి విద్యాసంపదను, ధనధాన్యాలను ప్రసాదిస్తుందంటారు. అందుకే ఆ తల్లిని 'వాజేభిర్వాజినీవతీ, ధీనామ విత్ర్యవతు' అని రుగ్వేదం స్తుతించింది*. 

*🌺🌈అమ్మ ధరించే ధవళ వస్త్రాలు స్వచ్ఛతకు, కమలం వికాసానికి సంకేతం. నీటిని వేరుచేసి హంస కేవలం పాలను మాత్రమే ఎలా స్వీకరిస్తుంది, అలా మనం కూడా చెడును వదిలేసి మంచిని మాత్రమే గ్రహించాలనే పరమార్థాన్ని హంసవాహనం సూచిస్తుంది.*

*🌺🌈చదువులతల్లి ప్రఖ్యాత ఆలయాలుగా కశ్మీర్లోని మహాసరస్వతి శక్తిపీఠం, శృంగేరిలోని శారదాపీఠం పేరొందాయి. తెలుగు రాష్ట్రాల్లోని బాసర జ్ఞానసరస్వతి, వర్గల్ విద్యాసరస్వతి, ఇందుపల్లి జ్ఞానసరస్వతి ఆలయాల వంటివి ఎంతో ప్రసిద్ధిగాంచాయి. సరస్వతీదేవిని బౌద్ధంలో మంజుశ్రీగాను, జైనంలో శ్రుతసదనగాను, షోడశ విద్యాదేవతగాను ఆరాధిస్తారు. మనదేశం నుంచి చైనా ద్వారా జపాన్ చేరిన సరస్వతి అక్కడ 'బెంజైటెన్' పేరుతో జ్ఞానదేవతగా పూజలందుకుంటోంది*.

*🌈🌺సరస్వతీ అమ్మ అనుగ్రహం వేదవ్యాసుడితో మహాభారతం రాయించింది. వాల్మీకితో రామాయణాన్ని, ఆదిశంకరాచార్యులతో కనకధారాస్తవాన్ని పలికించింది. త్యాగయ్యను నాదబ్రహ్మను, అన్నమయ్యను పదకవితా పితామహుడిని చేసింది. ఆదికవి నన్నయతో మొదలు పెట్టి ఎందరో కవులు తమ రచనలను సరస్వతీ ప్రార్ధనతోనే శ్రీకారం చుట్టారు. జ్ఞానజ్యోతిని వెలిగించే అక్షరాన్ని ఆరాధించడమే సరస్వతీ పూజ*.

*🌈'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార...' అంటూ పోతన స్తుతించినట్లుగా మనం కూడా నిత్యం సరస్వతి అమ్మను పూజిద్దాం. ఆమె కరుణాకటాక్ష వీక్షణాదులకు పాత్రులమవుదాం!🙏*

🍁🌈🍁🌈🍁🌈🍁🌈🍁

****చూపున్న మాట ఈ హిస్టరీ.. చెరిగిపోదు! బ్రౌజింగ్‌ చరిత్రతో తస్మాత్‌ జాగ్రత్త! ఈ హిస్టరీ.. చెరిగిపోదు!

 చూపున్న మాట 

    ఈ హిస్టరీ.. చెరిగిపోదు!


బ్రౌజింగ్‌ చరిత్రతో తస్మాత్‌ జాగ్రత్త!

ఈ హిస్టరీ.. చెరిగిపోదు!

    ఓ పన్నెండేళ్ల పిల్లాడు ఆడుకుంటానంటూ తండ్రి ఫోన్‌ తీసుకుని ఇష్టారాజ్యంగా పోర్న్‌ వీడియోలు చూసేవాడు. ఈ విషయాన్ని గ్రహించిన తండ్రి ఎంత ప్రయత్నించినా ఆ అలవాటు మాన్పించలేకపోయాడు. ఫోన్‌ ఇవ్వకపోతే బాలుడు తిండి మానేసేవాడు. భయపడ్డ తల్లిదండ్రులు మానసిక వైద్యుడి వద్దకు తీసుకొచ్చారు. పూర్వాపరాలు విచారించిన ఆ వైద్యుడు అసలు విషయం తెలుసుకొని నివ్వెరపోయాడు. పోర్న్‌ వీడియోలు చూసే అలవాటు ఆ తండ్రికి ఉండేది. ఇంటికి వచ్చి ఫోన్‌ పక్కన పెట్టగానే ఆటలాడుకునేందుకు అతని కుమారుడు ఫోన్‌ తీసుకునేవాడు. ఇంటర్నెట్‌ తెరవగానే పోర్న్‌ వీడియోల తాలూకూ చిత్రాలు కనిపించేవి. బాలుడు వాటిని చూడ్డానికి అలవాటు పడ్డాడు. 
    ఓ నడి వయసు వ్యక్తికి అశ్లీల చిత్రాలు చూసే అలవాటు ఉంది. వాటినే ఎరగా వేసిన నేరగాళ్లు ఆయన ఫోన్‌ నంబర్‌ తస్కరించారు. దాని ద్వారా ఓ మహిళను రంగంలోకి దింపి, అశ్లీల సంభాషణ చేయించి, దాన్ని అడ్డం పెట్టుకొని బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టారు.

చేతిలో ఫోన్‌ ఉంది.. అందులో ఇంటర్నెట్‌ ఉంది కదాని... తోచిందల్లా చేస్తే... గూగుల్‌ ఉందని ఇష్టారాజ్యంగా బ్రౌజింగ్‌ చేసేస్తే... చిక్కుల్లో పడ్డట్టే... ఎందుకంటే...  మీ డిజిటల్‌ చరిత్ర చెరిగిపోయేది కాదు.

    మన బ్రౌజింగ్‌ చరిత్ర మనను వెంటాడుతుందన్న విషయం మరవకూడదు. మన బ్రౌజింగ్‌ హిస్టరీని దర్యాప్తు సంస్థలు ఎప్పటికప్పుడు వడపోస్తూనే ఉంటాయి. బాలలకు సంబంధించిన అశ్లీల చిత్రాలు చూడడం, పంచుకోవడం నేరం కాబట్టి ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే పోలీసులు వారిని ఇట్టే పట్టేస్తారు. ఉగ్రవాద సంబంధ సమాచారం వెతికినా దర్యాప్తు సంస్థల కంట్లో పడతారు. 
    అంతర్జాల సంస్థలు కూడా మనం వేటి గురించి వెతుకుతున్నామన్న విషయాన్ని గుర్తించి వాటికి సంబంధించిన ప్రకటనలే మనకు కనిపించేలా చేస్తుంటాయి. ఇదంతా మార్కెటింగ్‌ వ్యూహం. అయితే అడ్డగోలుగా బ్రౌజింగ్‌ చేయడం వల్ల వ్యక్తిగతంగా అనేక నష్టాలు జరుగుతున్నాయి. 

    రుణం గురించి బ్రౌజింగ్‌ చేస్తే ప్రైవేటు రుణ సంస్థలే కాదు, నేరగాళ్లు కూడా రుణం ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తుంటారు. ఒక తండ్రి రుణం కోసం బ్రౌజ్‌ చేస్తే ఆ తర్వాత అతని ఫోన్‌ వాడిన ఇంజినీరింగ్‌ కుమారుడికి ష్యూరిటీ లేకుండా రుణం ఇస్తామంటూ లోన్‌ యాప్‌ల నుంచి వచ్చిన ఆకర్షణీయమైన ప్రకటనలు వచ్చాయి. దాంతో రుణం తీసుకుని అప్పుల్లో కూరుకొని పోయాడు.
    ఇంకాగ్నిటో బ్రౌజర్‌ వాడితే ఎవరికీ తెలియదని అనుకుంటారు. ఇది తప్పు. బ్రౌజింగ్‌ హిస్టరీ ఉపకరణంలో మాత్రమే కాదు, సర్వీస్‌ ప్రొవైడర్‌ వద్ద కూడా పేరుకుపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన బ్రౌజింగ్‌ హిస్టరీ మన వేలిముద్ర లాంటిది. మనం ఎప్పుడు ఏమి చూశామన్నది నమోదవుతూనే ఉంటుంది. 

అలా చేశారో...

    చేతిలో ఫోన్‌ ఉంది కదా అని ఏదిపడితే అది చూడకపోవడమే ఉత్తమం. మనకి ఏది అవసరమో అదే చూడాలి. 
    ఎప్పటికప్పుడు బ్రౌజింగ్‌ హిస్టరీ డిలీట్‌ చేయడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. దీనివల్ల మన ఉపకరణం మరొకరు వాడినప్పుడు ముందు వాడిన వ్యక్తి బ్రౌజింగ్‌ చరిత్ర కనిపించదు. 
    అశ్లీల చిత్రాల మాటున సైబర్‌ నేరగాళ్లు పొంచి ఉంటారన్న సంగతి గుర్తుంచుకోవాలి. హనీట్రాప్‌ మాదిరిగా పాపప్‌ మెనూలతో కవ్విస్తారు. వాటిని క్లిక్‌ చేయగానే ఉపకరణంలో పాగా వేస్తారు. 
    నమ్మకమైన వెబ్‌సైట్లు మాత్రమే చూడాలి. తెలియని లింకులు వస్తే క్లిక్‌ చెయ్యొద్దు. వ్యక్తిగత వివరాలు అడిగితే ఇవ్వొద్దు
 *🕉️🚩 శుభోదయం🙏🚩🕉️*
 ఓం శ్రీ గురుభ్యోనమః卐
*బుధవారం, అక్టోబరు 1, 2025*
*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*      
   *దక్షిణాయనం - శరదృతువు*
  *ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం*   
తిథి      : *నవమి* మ2.23 వరకు
వారం   : *బుధవారం* (సౌమ్యవాసరే)
నక్షత్రం : *ఉత్తరాషాఢ* పూర్తి
యోగం : *అతిగండ* రా10.44 వరకు
కరణం  : *కౌలువ* మ2.23 వరకు
         తదుపరి *తైతుల* రా2.32 వరకు
వర్జ్యం  :  *మ1.19 - 3.00*
దుర్ముహూర్తము : *ఉ11.31 - 12.20*
అమృతకాలం    : *రా11.26 - 1.07*
రాహుకాలం        : *మ12.00 - 1.30*
యమగండ/కేతుకాలం : *ఉ7.40 - 9.00*
సూర్యరాశి: *కన్య* || చంద్రరాశి: *ధనుస్సు*
సూర్యోదయం: *5.54* || సూర్యాస్తమయం:
*5.48* 
👉  *మహర్నవమి* *అపరాజితాపూజా*
           *మహర్నవమి శుభాకాంక్షలతో💐*


 *శ్రీ దేవి శరన్నవరాత్రులలో తొమ్మిదవ రోజు బెజవాడ దుర్గమ్మ*
*మహిషాసురమర్దిని గా దర్శనం యిస్తున్నారు....!!*
🌸🌿🌸🌿

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దేవీ నవరాత్రులు జరుపు కుంటారు. తొమ్మిదవ వ రోజు అంటే ఆశ్వయుజ నవమిని మహర్నవమి. అమ్మవారి నవఅవతారాల్లో మహిషాసుర మర్ధిని దర్శనం..    

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజున మంగళవారం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శన మిచ్చారు.

నవ అవతారాల్లో మహిషాసురమర్దినిని మహోగ్రరూపంగా భావిస్తారు. మహిషాసురుని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని ‘మహర్నవమి’గా జరుపు కుంటారు. 

సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది.

ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. 
మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. 

సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. ఈ తల్లి అనుగ్రహం కలిగితే లోకంలో సాధించలేనిది ఏదీ ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి.

అసాధారణమైన శక్తికలిగిన మహిషుడుని ఒంటరిగానే ఎదుర్కొంది జగన్మాత. అవతలి వ్యక్తి శక్తిని చూసి భయపడితే విజయం ఎప్పటికీ దూరంగానే ఉంటుందనే సత్యాన్ని మహిషాసురమర్దిని ఆచరణాత్మకంగా చూపిస్తుంది. 

మహిషమస్తక నృత్తవినోదిని, స్ఫుటరణన్మణి నూపుర మేఖలా, జననరక్షణ మోక్షవిధాయినీ, జయతి శుంభనిశుంభ నిషూదినీ 

శ్లోకాన్ని పఠించాలి. 
నైవేద్యంగా రవ్వతో చక్రపొంగలి, చక్కర పొంగల్ సమర్పించాలి...
🌸🌿🌸🌿🌸🌿
*శ్రీ మహిషాసుర మర్ధని అష్టోత్తర శతనామావళి*
🌳🌳🌳🌳
ఓం మహత్యై నమః
ఓం చేతనాయై నమః
ఓం మాయాయై నమః
ఓం మహాగౌర్యై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మహోదరాయై నమః
ఓం మహాబుద్ద్యై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాబలాయై నమః
ఓం మహాసుధాయై నమః (10)

ఓం మహానిద్రాయై నమః
ఓం మహాముద్రాయై నమః
ఓం మహోదయాయై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహాభోగ్యాయై నమః
ఓం మహామోహాయై నమః
ఓం మహాజయాయై నమః
ఓం మహాతుష్ట్యై నమః
ఓం మహాలజ్జాయై నమః
ఓం మహాదృత్యై నమః (20)

ఓం మహాఘోరాయై నమః
ఓం మహాదంష్ట్రాయై నమః
ఓం మహాకాంత్యై నమః
ఓం మహా స్మృత్యై నమః
ఓం మహాపద్మాయై నమః
ఓం మహామేధాయై నమః
ఓం మహాభోదాయై నమః
ఓం మహాతపసే నమః
ఓం మహాస్థానాయై నమః
ఓం మహారావాయై నమః (30)

ఓం మహారోషాయై నమః
ఓం మహాయుధాయై నమః
ఓం మహాభందనసంహర్త్ర్యై నమః
ఓం మహాభయవినాశిన్యై నమః
ఓం మహానేత్రాయై నమః
ఓం మహావక్త్రాయై నమః
ఓం మహావక్షసే నమః
ఓం మహాభుజాయై నమః
ఓం మహామహీరూహాయై నమః
ఓం పూర్ణాయై నమః (40)

ఓం మహాచాయాయై నమః
ఓం మహానఘాయై నమః
ఓం మహాశాంత్యై నమః
ఓం మహాశ్వాసాయై నమః
ఓం మహాపర్వతనందిన్యై నమః
ఓం మహాబ్రహ్మమయ్యై నమః
ఓం మాత్రే నమః
ఓం మహాసారాయై నమః
ఓం మహాసురఘ్న్యై నమః
ఓం మహత్యై నమః (50)

ఓం పార్వత్యై నమః
ఓం చర్చితాయై నమః
ఓం శివాయై నమః
ఓం మహాక్షాంత్యై నమః
ఓం మహాభ్రాంత్యై నమః
ఓం మహామంత్రాయై నమః
ఓం మహామాకృత్యై నమః
ఓం మహాకులాయై నమః
ఓం మహాలోలాయై నమః
ఓం మహామాయాయై నమః (60)

ఓం మహాఫలాయై నమః
ఓం మహానీలాయై నమః
ఓం మహాశీలాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం మహాకలాయై నమః
ఓం మహాచిత్రాయై నమః
ఓం మహాసేతవే నమః
ఓం మహాహేతవే నమః
ఓం యశస్విన్యై నమః
ఓం మహావిద్యాయై నమః (70)

ఓం మహాస్త్యాయై నమః
ఓం మహాగత్యై నమః
ఓం మహాసుఖిన్యై నమః
ఓం మహాదుస్వప్ననాశిన్యై నమః
ఓం మహామోక్షకప్రదాయై నమః
ఓం మహాపక్షాయై నమః
ఓం మహాయశస్విన్యై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహావాణ్యై నమః
ఓం మహారోగవినాశిన్యై నమః (80)

ఓం మహాధారాయై నమః
ఓం మహాకారాయై నమః
ఓం మహామార్యై నమః
ఓం ఖేచర్యై నమః
ఓం మహాక్షేమంకర్యై నమః
ఓం మహాక్షమాయై నమః
ఓం మహైశ్వర్యప్రదాయిన్యై నమః
ఓం మహావిషఘ్మ్యై నమః
ఓం విషదాయై నమః
ఓం మహాద్ర్గవినాశిన్యై నమః (90)

ఓం మహావ్ర్షాయై నమః
ఓం మహాతత్త్వాయై నమః
ఓం మహాకైలాసవాసిన్యై నమః
ఓం మహాసుభద్రాయై నమః
ఓం సుభగాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహాసత్యై నమః
ఓం మహాప్రత్యంగిరాయై నమః
ఓం మహానిత్యాయై నమః
ఓం మహాప్రళయకారిణ్యై నమః (100)

ఓం మహాశక్త్యై నమః
ఓం మహామత్యై నమః
ఓం మహామంగళకారిణ్యై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహామాత్రే నమః
ఓం మహాపుత్రాయై నమః
ఓం మహాసురవిమర్ధిన్యై నమః (108)
🌸🌸🌸🌸🌸
 శ్రీ అమ్మవారి స్ధల పురాణం

విజయవాడ పట్టణంలో దుర్గాదేవి వెలసిన పర్వతం పేరు ఇంద్రకీలాద్రి, పర్వత రూపుడైన కీలుడు దుర్గాదేవి ఉపాసకుడు. ఆ దుర్గాదేవిని తన హృదయ కుహరంలో (గుహలో) నివశించమని అపార తపస్సు చేశాడు. కీలుని భక్తికి కరుణారస ప్రపూర్ణ అయిన జగదంబ దుర్గ కనకదుర్గగా వాని హృదయ కుహరంలో స్వయంభువుగా వెలసింది. స్వర్ణ మణిమయ కాంతులతో ప్రకాశిస్తున్న ఆ కనకదుర్గను ఇంద్రాది దేవతలు వచ్చి, శ్రీ కృష్ణ రూపిణి అయిన కృష్ణవేణీ నదిలో స్నానమాడి కనక దుర్గను పూజించి ప్రణమిల్లారు. నాటి నుండి కీలాద్రి ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందింది. దుర్గమాసురుని సంహరించిన దుర్గ కీలాద్రిన నిలచిపోగా ఈశ్వరుడు జ్యోతిర్లింగ రూపముతో స్వయంభువుడుగా ఈ ఇంద్రకీలాద్రి మీద వెలశాడు. బ్రహ్మాది దేవతలు ఆ లింగమును మల్లికా కదంబ పుష్ఫాలతో పూజించగా అప్పటి నుండి మల్లేశ్వరుడుగా పిలువబడుతున్నాడు.
అర్జునుడు ఈ కీలాద్రి మీద తపస్సు చేసి శివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొంది విజయడైనాడు. కనుక ఈ క్షేత్రానికి ఫల్గున క్షేత్రమని, విజయపురి అనే పేర్లు పురాణ ప్రసిద్ధాలైనాయి. దుర్గాదేవి శుంభ నిశుంభులను వధించి జయం పొందటం చేత జయవాడ అని పేరున్నదని ఒక ఇతిహాసమున్నది. ఆ కాలములోనే కనకవాడ అని కూడా పిలువబడేదని కూడా కొన్నిచోట్ల చెప్పబడినది.
పూర్వమెన్నడో సృష్టికర్త అయిన బ్రహ్మ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి హరీ! కలియుగమ్లో జనులు అనేక పాప చింతనలతో ధర్మమార్గం తప్పి చరిస్తారు. కనుక వారికి తరించే మార్గం ఏదైనా చెప్పుమని కోరాడు. బ్రహ్మ మాటను మన్నించి హరి తన అంశతో కృష్ణను సృజించాడు. ఆమె రూపలావణ్యాలకు ఆశ్చర్యపడిన బ్రహ్మ ఆమెను తన కూతురిగా ఇమ్మని అడిగాడు. కృష్ణను విష్ణువు బ్రహ్మకు ఇవ్వగా కృష్ణ బ్రహ్మపుత్రి అని పిలువ బడుతున్నది.
కొంతకాలనికి కలియుగం పాప భూయిష్టం కాగా ఆ పాప పరిహారార్ధం విష్ణువు మరల కృష్ణను తనకిమ్మని బ్రహ్మను అడిగాడు. విష్ణు స్వాధీన అయిన కృష్ణను ఎక్కడ వుంచాలని ఇంద్రాది దేవతలను హారి అడిగాడు. అప్పుడు వారు భూమినంతా పరిశీలించాడు. అప్పుడు శ్రీహరిని కోరి ఒకచోట పర్వత రూపంలో ఘోర తపస్సు చేస్తున్న సహ్యమునిని చూపించారు. దేవతలు వెంటనే సహ్యముని వద్దకు వెళ్ళి సహ్యమునీ నీవు ఏ కోరికతో పర్వత రూపం ధరించి ఘోర తపస్సు చేస్తున్నావో ఆ విఘ్ణవే భూమిని ఉద్భవించటానికి విఘ్ణరూపిణి అయిన కృష్ణతో సహా వచ్చి ఉన్నాడు. కృష్ణ సకలాభీష్ట ప్రదాయిని అని చెప్పారు. పరమానందభరితుడైన సహ్యముని విఘ్ణవును విఘ్ణ స్వరూపిణి అయిన కృష్ణను షోఢశోపచారాలతో పూజించాడు. దేవతలారా! నేను శ్రీ మహా విఘ్ణవు కోరి తపస్సు చేస్తున్నాను. మీరు సమస్త ఫలదాయిని అయిన కృష్ణతోపాటుగా విష్ణువును ఇక్కడకు తీసుకొని వచ్చారు. నా జన్మతరించింది. నేను కృష్ణా నదీమ తల్లిని సేవించి నిశ్చల భక్తిని జ్జానాలను పొందుతాను. హే విష్ణూ! కృష్ణతో కూడి దయతో నా మీద నిలచి నన్ను కృతార్ధుడిని చేయమని వేడుకున్నాడు. అతని ఆత్మ నివేదనను కృష్ణ అనుగ్రహించింది. సహ్యమునీంద్రా నేను నా అంశతో ఈ సహ్యాద్రి మీద నివశిస్తాను. నీ తపస్సు ఫలించి లోకోపకారం అయింది. నీ ఉపకారం వల్ల లోకాలు పునీతం అవుతాయని పరమిచ్చింది. విష్ణువు కూడా సంప్రీతుడై పర్వత రూపంలో వున్న నీమీద (సహ్యాద్రి మీద) నిత్య నివాసం ఏర్పరచుకుంటానని ఇద్దరూ ఆ సహ్యాద్రి మీద పాదం మోపారు. సహ్యముని వారిని రత్నాలతోనూ పరిమళ పుష్ఫాలతోనూ అర్చించాడు.
శ్రీ మహ విష్ణువు శ్వేతాశ్వత్ధ వృక్షంగా (తెల్ల రావి చెట్టుగా) సహ్యాద్రి మీద ఆవిర్భవించాడు. ఆ రావిచెట్టు అంతర్భాగాన రెండు వైపుల ధవళాకృతిలో నదీమ తల్లిగా కృష్ణ ఆవిర్భవించింది. పడమటి కనుమలలో బ్రహ్మగిరి, వేదగిరి అని రెండు శిఖరాలున్నాయి. బ్రహ్మ ఒకప్పుడు బ్రహ్మ గిరి మీద నారాయణుని గురించి తపస్సు చేయగా నారాయణుడు తెల్ల రావిచెట్టు రూపంలో ప్రత్యక్షం అయినాడు. తరువాత విధాత వేదగిరి మీద తపస్సు చేయగా పరమేశ్వరుడు ఆమ్ల(ఉసిరి) చెట్టుగా ప్రత్యక్షం అయినాడు. శ్వేతాశ్వత్థ వృక్షం (నారాయణుడు) కృష్ణ గానూ ఆమలక వృక్షం (ఈశ్వరుడు) వేణి గానూ ఒకదానితో ఒకటి కలసి కృష్ణవేణి నదిగా ప్రభవించినట్లు విఘ్ణ పురాణంలో చెప్పబడినది. ఈ జలాలు సహ్యాద్రి నుండి శ్రీశైలం వరకూ గంగతో సమానమనీ, భగవత్ నిలయమైన శస్య శ్యామల క్షేత్రమని, ఆధ్యాత్మిక సంపదలకు ఆలవాలమనీ ప్రసిద్ధి చెందినది. అటువంటి క్షేత్రాలలో విజయవాడ ఎన్నదగినది.
సహ్యాద్రి పర్వతం మీద పుట్టిన ఓషధాలను బీజాలను తన ప్రవాహములో తరలించుకొని పోవుచుండగా కీలాద్రి అడ్డుపడి అక్కడే నిలచిపోగా ఆ బీజాలు మొలకెత్తి ఆ ప్రదేశము సస్యశ్యామలమైనది. సాగర సంగమాభిలాషతో ఉరకలుగా వచ్చిన కృష్ణవేణీ నది తనకు దారి ఇమ్మని కీలుని కోరినది. కీలుడు అంగీకరించలేదు. దేవతలు వచ్చి కీలునికి నచ్చ చెప్పగా సొరంగ మార్గం మాత్రం ఇవ్వడానికి అంగీకరించాడు. ఆ ప్రవాహ వేగానికి కీలాద్రి నుండి ఒక ముక్క విరిగి ప్రవాహా వేగములో రెండు క్రోసుల దూరము కొట్టుకుపోయి నిలచినది. ఈ రెండు క్రోసులదూరమును ఫల్గున తీర్ధమనీ, ఆ కొండ ముక్కకు తేలుకొండ (తేలిన కొండ) అని పేర్లు అని సహ్యాద్రి ఖండంలో చెప్పబడినది. అది యనమలకుదురు అని విజయవాడకు ప్రక్క గ్రామము ఈ ఇంద్రకీలాద్రి పర్వతము మంగళాచలము (మంగళగిరి) వరకు వ్యాపించివున్నది.
దుర్గా దేవి కుడికన్ను సూర్యుడు. ఎడమ కన్ను చంద్రుడు. కనకవర్ణంతో ప్రకాశించే పొలము రాత్రింబవళ్ళకు నడిమీ సంధ్య. దుర్గాదేవి తన చూపులతో శత్రువులను క్షోభ పెట్టిన చోట్లన్నిటికీ ఒక్కొక్క దృష్టి. ఆయా నామాలతో నేటికి ప్రసిద్ధాలై ఉన్నవి. కార్వేటి వంశ పల్లవ కేతు భూపాల శాసనానుసారము దుర్గా మల్లేశ్వరుల మహాత్యము, అనుగ్రహము మనకు తెలుస్తున్నవి. విజయవాడ మాధవ శర్మ పాలనలో వున్నప్పటి ఒక ఉదంతం కనకదుర్గా మల్లేశ్వరుల అనుగ్రహానికి నిదర్శనంగా చెప్పబడినది. మాధవ శర్మ కుమారుడు ఒకనాడు రథం మీద వెళ్ళుచుండగా ఆ రథము క్రింద చింత చిగురు అమ్ముకునే ఒక అభాగ్యురాలి కొడుకు పడి మరణించాడట. ధర్మ సంరక్షణా నిరతుడైన మాధవ వర్మ తన కుమారుని హత్యా నేరస్తునిగా ఉరిశిక్ష విధించినాడట. మాధవ శర్మ ధర్మ దీక్షకు కనకదుర్గా మల్లేశ్వరులు సంతసించి ఆ మరణించిన బాలురిద్దరి మీద కనక వర్షము కురిపించి ప్రాణదాన మొనరించగా కనకదుర్గా పండితుని ప్రభావాన్ని కూడా వెల్లడించినది. అప్పుడు విజయవాడ వేంగ రాజుల పాలనలో ఉన్నది.
కనకదుర్గా మల్లేశ్వరుల పరభక్త శిఖామణి ఆరాధ్య పండితుడు శ్రీ పతి పండితయ్య. ఆయన తాను కాంశీపుర వాసిననీ అయిననూ విజయవాడ మల్లిఖార్జున పాదపద్మారాధకుడననీ చెప్పుకున్నావాడు. శివ తత్వసారమనే మహా గ్రంధకర్త. శివుడు గాక వేరు దైవము లేడను పరమ భక్తుడు. అందుచేత ఊరి ప్రజలు అతని మీద అసూయ ద్వేషాలు పెంచుకున్నారు. యజ్ఞయాగాది క్రతువులకు పిలవటం మానివేశారు. ఆయనకు ఊరిలో నిప్పు కూడా పుట్టకుండా కట్టడి చేశారు.
అయినా శ్రీపతి పండితయ్య ఏ మాత్రమూ చింతించలేదు. తన ముక్కంటి దొరను ( త్రినేత్రుడైన శివుని) ప్రార్థించి అగ్నిని తన ఉత్తరీయములో మూటకట్టి ఒక జమ్మి చెట్టు కొమ్మకు వ్రేలాడ కట్టి, నగరంలో అగ్నిహోత్రుడు వెలగరాదని శపించాడు. తాను మాత్రము నియమము తప్పక అగ్నికార్యమును కొనసాగించుకొంటూనే ఉన్నాడు. ఆ కాలంలో వేంగీ రాజు అనంతపాలుని పాలనలో ఉన్నది నగరం. అంతట ప్రజలు అందరూ ప్రభువును ముందుంచుకొని శ్రీపతి పండితయ్యను అగ్నికి విడువుమని ప్రార్థించాడు. పండితయ్య అనుగ్రహించాడు. ఈ నాటికీ జమ్మిదొడ్డిగా పిలువబడుతున్న ప్రాంతమే ఆ నాడు పండితయ్య నిప్పును వ్రేలాడదీసిన శమీ వృక్షమున్న చోటు ఈ శాసనము కూడా అక్కడే లభించినది.
వేప చెట్టు మహాలక్ష్మీ. రావి చెట్టు విఘ్ణవు. శమీ వృక్షం (జమ్మిచెట్టు) శివ శకైక్య స్వరూపం. ఆ శమీ వృక్షం ఆదిపారాశక్తి అంశ వనదుర్గ. ఆమే రూపుదాల్చిన కుండలీని శక్తి. వివిధ శాఖావృతమైన శమీవృక్ష శిరోభాగమే భయంకర భుజంగ (సర్ప)రూపము. అనంతంగా విస్తరించిన వృక్షాగ్రం పగటిని సైతం రాత్రిగా చేయగల కాల స్వరూపం. శమీ వృక్షం వనదేవత. శుభకర తరువు. సంతాన ప్రదాయిని. సర్వశత్రు వినాశిని.
పుత్రదం సర్వ పాపఘ్నం సర్వ శత్రు వినాశకం అని శమీ వృక్షం చెప్పబడినది. బ్రహ్మ విఘ్ణవు మొదలైన దేవతల చేత ఆవరించబడి, ఢాకినీ మొదలైన భూత గణాలచే రక్షించబడుతూ ఉంటుంది. వనదుర్గ స్థలదుర్గ జలదుర్గ అని దేవికి పేర్లు. అన్నింటిలోకి వనదుర్గ సుఖప్రద. వనదుర్గా రూపంలో ప్రభవించి ప్రకాశించే శమీవృక్షం అనేక దేవతా నిలయం మహా మాయా సంపద కలది. అందుకే పాండవాగ్రజుడైన ధర్మరాజు వారి అజ్ఞాతవాసం ప్రారంభించే ముందు వారి ఆయుధాలను శమీ వృక్షం మీద దాచిపెట్టి వనదేవతారూపిణి అయిన వనదుర్గనిలా ప్రార్థించాడు. విషస్ఫురిత భుజంగ భంగి భయంకర రూపంతో మా ఆయుధాలను కనుపింప చేయమని కోరాడు.
చిత్త క్షోభం కలిగించే దీని ఆకృతి దేవీ స్వరూప స్వభావాలకు ప్రతీక. సమస్త ప్రాణులలోనూ వ్యాపించి చిత్త వికారాలను కలిగించే భ్రమరాంబ అష్టాదశ పీఠాలలో ఒకటైన శ్రీశైలపీఠశక్తి. శాకినీ, ఢాకినీ మొదలైన యోగినీ గణాలతో ఆవృతమై అరణ్య మధ్యంలో నెలకొన్న వనదుర్గా రూపమీ శమీ తరువు. కనుకనే ధర్మరాజు అజ్ఞాత వాసంలో భీముని ఆ గ్రహ ప్రవృత్తిని నిగ్రహించుకొనే విధంగా శాశించు తల్లీ అని వన దేవతా రూపిణి అయిన శమీ వృక్షాన్ని ప్రార్థించి తగిన నివేదనలు సమర్పించాడు. శత్రువులు ఎవరూ ఆ శమీ వృక్షాన్ని దాటి రాకుండా చూడుమని అర్థించాడు. శమీ వృక్షం శివ శకైక స్వరూపం కనుకనే మహా దేవ శక్తి పాశు పతాస్త్రాన్ని ధరించి భరించింది.
నాటికీ, నేటికీ శమీ పూజ పార్వేట వాడ వాడలా నవరాత్ర ఉత్సవాల ముగింపుగా జరుగుతూనే వున్నది. ఎందుకనగా గ్రామ దేవతా మూర్తులు లేని మరుమూల గ్రామాలలో కూడా రావి, వేప, శమీ వంటి వృక్షాలే వనదేవతలుగా గ్రామాలను కాపాడుతాయి అనే ప్రగాఢ విశ్వాసమే యుగయుగాలుగా చాటిన సత్యం.
దేవీ దుర్గ మహిషాసురుని వధించి మహోగ్రంగా కనిపిస్తుండగా దేవతలందరూ అమ్మా నీవు లోకాలను రక్షించే తల్లివి. ఇంతటి మహోగ్రరూపం మహిషాసురుని వంటి రాక్షస వధకే గాని మేమెట్లు భరించగలం? మూల ప్రకృతినైన నిన్నెట్లు సమీపించగలం? తల్లీ నీవు శాంతి రూపిణివై లోకాలను కపాడుమని వేడుకున్నారు. ఆ తల్లి కరుణారస సంపూర్ణ అయిన రాజ రాజేశ్వరిగా అవతరించింది. కాలాంతములో జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు మహోగ్ర శక్తులను శ్రీ చక్రము నందు నిక్షిప్తం చేసి, శ్రీ అమ్మవారి పాదాల చెంత శ్రీ చక్రరాజమును స్థాపన చేయటమైనది.
ప్రతి సంవత్సరము ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి మొదలు నవమి వరకు దుర్గోత్సవం అను పేరుతో దేవీ శరన్నవరాత్రోత్సవములను, సంవత్సరారంభంలో చైత్ర శుద్ధ పాఢ్యమినుండి నవమి వరకు వసంత నవరాత్రోత్సవములను పేరుతో నన్ను ఆరాధించినా నా చరిత్రను వినినా ఇహలోకాన ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో, పుత్ర పౌత్రాభి వృద్ధితో సమస్త సుఖశాంతులు పొందగలరని వరమిచ్చింది.
నాటి నుండి దుర్గమ్మ రాజరాజేశ్వరిగా లోకాలను పాలిస్తూ, బాలా త్రిపురసుందరిగా కోరికలీడేరుస్తూ, అన్నపూర్ణగా ఆకలి తీరుస్తూ, లలితగా లాలిస్తూ, సరస్వతిగా సకల విద్యలూ ప్రసాదిస్తూ అనేక అంశలతో అర్భామూర్తిగా ఆరాధించబడుతూ వున్నది. ‘ద’ కారం దైత్యనాశకం. ‘ఉ’ కారం విఘ్న నాశకం. ‘ర్’ కారం రోగ నాశకం. ‘గ’ కారం పాప నాశకం. ఆ భయనాశక వాచకం. కనుకనే అమ్మవారికి పర్యయపదమైన దుర్గా నామమును ఉచ్చరించినా, స్మరించినా పాపాలూ నశిస్తాయని సాక్షాత్తూ పరమ శివుడు చెప్పిన మాట అని సకల లోక పితామహుడు సృష్టి కర్త అయిన బ్రహ్మ మార్కెండేయ మహర్షికి చెప్పిన ప్రమణమున్నది.
ఈ విధంగా మహిషాసుర మర్థినీ బ్రహ్మ తేజస్విని శుద్ధ స్పటిక రూపిణి అయిన కనకదుర్గ కృష్ణా తీరాన వెలసి తూర్పున ఐంద్రి, పడమర వారుణి, ఉత్తరాన కౌమారి, దక్షిణ దిక్కున శ్రేష్ఠ ధర్మ దేవతా స్వరూపిణి అయిన హంసవాహినిగా లోకాలను కాపాడుతూ ఉన్నది. కొలచిన వారికి కొంగు బంగారము, సర్వర్థ ధాత్రి, మూల ప్రకృతి, సౌకుమార్య సౌందర్యలహరి, మల్లేశ్వర హృదయ సామ్రాజ్య పట్ట మహిషి అయిన చల్లని తల్లి అయిన దుర్గమ్మ. దూర దూరాల నుండి వచ్చే నీ బిడ్డలు అయిన భక్తుల మీద కరుణాంతరంగవై సుభశాంతులను వర్షించుచూ, జ్ఞానా సిద్ధిని ప్రసాదించుమని నిత్యము సేవించుకుందాము.

“ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే”

Maha Geeta 01-91 Discourses - OSHO World



https://oshoworld.com/maha-geeta-by-osho-01-91
 *శ్రీ దేవి నవరాత్రులు - 9వ రోజు*
🍃🌷 *అమ్మవారు ఈ రోజున "శ్రీ మహాదుర్గ దేవి" గా పూజలు అందుకుంటుంది.*     

దుర్గాష్టమి దసరా పండుగ రోజు చేసే దుర్గా పూజను ప్రత్యేకంగా భావిస్తారు. వివరాల్లోకెళ్తే.. దసరా నవరాత్రులు వేళ దుర్గా పూజ అత్యంత ముఖ్యమైనది. దుర్గ అంటే.. దుర్గములను అంటే కష్టాలు, అడ్డంకులను నాశనం చేసేది అని అర్థం. దుర్గాదేవి అమ్మవారు మహిషాసురుడునే/దుర్గముడునే రాక్షసులుని సంహరించి లోకాన్ని రక్షించినందుకు గుర్తుగా ఈ పూజ ఆచరిస్తారు. ఈ దసరా నవరాత్రుల వేళ అమ్మవారిని మహాకాళి, మహాలక్ష్మీ, సరస్వతి, కాత్యాయనీ ఇలా రోజుకో రూపంలో ఆలకరించి శక్తి స్వరూపిణిగా ఆరాధిస్తారు. పూజలో ముఖ్యంగా అమ్మవారికి షోడశోపచార పూజ, మంత్ర పారాయణం, భజన వంటివి చేస్తారు.

⚜️అలంకరించే చీర: ఎరుపురంగు
⚜️నైవేద్యం: కదంబం/కలగలుపు కూర
⚜️అర్చించే పుష్పాలు: ఎరుపురంగు  
⚜️చదవవలసిన శ్లోకం/ స్తోత్రం: దుర్గా అష్టోత్తరం, దుర్గా సూక్తం, దుర్గాసప్తశతీ పారాయణ.       
🍃🌷పంచ శక్తులు:
పరాశక్తి అయిన జగన్మాత లోకసంరక్షణార్ధం వేఱువేఱు సందర్భాలలో వేఱువేఱు నామరూపాలతో ఆవిర్భవించింది. ఆయా దేశకాలాలలో తన దైన "దివ్య ప్రణాళిక" ను నిర్వహించే నిమిత్తం 'దుర్గ'గా , 'రాధ'గా, 'లక్ష్మి' గా, 'సరస్వతి'గా, 'సావిత్రి'గా అవతరించింది. ఈ ఐదు సన్నివేశాలలో వ్యక్తమైన దేవతామూర్తులకే "పంచశక్తులు "అని పేరు.
🍃🌷దుర్గాదేవి (శాకాంబరీ దేవి):
దేవీ మహిమలను శ్రద్ధాళువై అలకిస్తున్న జనమేజయ మహారాజు వ్యాసమహర్షికి కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ "మహర్షీ! పరాశక్తి ప్రభావాన్ని గురించి ఎంతగా విన్నా తనివి తీరడం లేదు. ఆశ్రయించిన వారికి అనంత సంపదలను అనుగ్రహించే ఆ తల్లి వాత్సల్య విశేషాలను తెలియజేసి నన్ను తరింప చేయండి" అని ప్రార్థించాడు.

జనమేయుని మాటలకు సంతోషించిన వ్యాసమహర్షి "రాజా! దేవి యందు గల భక్తి శ్రద్ధలతో నీ వడిగిన ఈ కోరిక సంతోషం కలిగించింది. సావదాన చిత్తుడవై ఆలకించు "అని దుర్గాదేవి కథను ఈ విధంగా వివరించాడు.

"పూర్వం హిరణ్యాక్షుని వంశంలో దుర్గముడనే రాక్షసుడు పుట్టాడు. దేవతలకు వేదమే బలమని గుర్తించిన అతడు, వేదాలను తుదముట్టించి దేవతలను నాశనం చేయవచ్చునని ఆలోచించాడు. ఒక పథకం ప్రకారం వేయి సంవత్సరాలు బ్రహ్మను గురింతి తీవ్రమైన తపస్సు చేశాడు. కేవలం వాయి భక్షణతోనే జీవయాత్ర సాగిస్తూ, అతడు తపస్సును కొనసాగించాడు. అతని కఠోర తపశ్చర్యకు లోకం అల్లకల్లోలమైంది. బ్రహ్మా అతనికి ప్రత్యక్షమయ్యాడు వేదాలను తనకు అనుగ్రహించ వలసిందిగా, దేవతలను జయించ గల శక్తినిఉ తనకు ప్రసాదించ వలసిందిగాను వరం కోరుకున్నాడు దుర్గముడు. బ్రహ్మదేవుడు "తథాస్తు" అని మాయమయ్యాడు.

బ్రహ్మ యిచ్చిన వరప్రభావం వల్ల రాక్షసుడైన దుర్గమునికి వేదాలన్నీ స్వాధీనమయ్యాయి. ఆ నాటి నుండి విప్రులు వేదాలను మరచిపోయారు. భూలోకంలో వేజధర్మాచరమ క్షీణించింది. స్నానసంధ్యాదులు, జపహోమాదులు, యజ్ఞ యాగాదులు అన్ని అంతరించాయి. వేదవాఙ్మయ విజ్ఞానం తమకు దూరమై పోవడంతో బ్రాహ్మణులకు యజ్ఞనిర్వహణ అసాధ్యమైపోయింది. యజ్ఞాలు లేకపోవడం వల్ల దేవతలు నిర్వీర్యులయ్యారు. రాక్షస గణం దేవలోకాన్ని అక్రమించింది. ఇంద్రుడు స్వర్గాన్ని విడిచి, కొండల్లో, కొనల్లో అజ్ఞాతవాసం చేస్తూ పరాశక్తిని ప్రార్థించ సాగాడు. బ్రాహ్మణులందఱూ హిమాలయాలకు వెళ్ళి భవానీ మాతను ప్రార్థించి, తమ అపరాధాలను క్షమించి, దయచూడ వలసిందిగా వేడుకున్నారు. తెలియక చేసిన తప్పులను మన్నించి, కనికరించ వలసిందిగా ప్రాధేయ పడ్డారు.

వారి ప్రార్థనలు విని జగన్మాత ప్రత్యక్ష మయింది. నిలువెల్లా కన్నులతో దివ్య కాంతులతో ప్రత్యక్షమయింది. తన బిడ్డలైన ప్రాణికోటి కష్టాలను చూడలేత శతనేత్రాలతో తొమ్మిది రోజుల పాటు ధారాపాతంగా కన్నీరు కారుస్తూ రోదించింది. తన బిడ్డల బాధ చూడలేక కన్నీరు మున్నీరుగా ఆమె విలపించగా, ఆమె కన్నీటి దారల చేత చెట్లన్నీ చిగురించి, పుష్పించి, ఫలించి, ఆర్తులకు మధుర ఫలాలను అందించాయి. అంతట జగన్మాత స్వయంగా తన చేతులతో వివిధ ఫలాలను, రకరకాల శాకాలను ఆర్తుల నోటికి అందించి, వారి ఆకలిని తీర్చింది. 

ఆనాటి నుండి ఆ దేవిని "శతాక్షి"అని, "శాకంభరి "అని పిలుస్తూ, దేవతలందఱు ఆమెను పూజింపసాగారు.     

ఈ వృత్తాంతం విన్న దుర్గముడు రాక్షస సమూహాలను వెంటబెట్టుకొని వెళ్లి దేవతలను, బ్రాహ్మణులను చుట్టుముట్టి, పరిపరి విధాలుగా వేధిస్తూ, వారిని భయ భ్రాంతులను చేయసాగాడు. దేవతలు, బ్రాహ్మణులు ఆర్తితో శతాక్షీదేవిని ప్రార్థించారు.

వారి మొఱలు ఆలకించి, జగన్మాత తేజోరాశి అయిన చక్రాన్ని సృష్టించి రాక్షసులతో యుద్ధం ప్రారంభించింది. దేవ దానవ సంగ్రామం భయంకరమైన , వారు పరస్పరమూ ప్రయోగించుకొనే శరపరంపరలతో సూర్య మండలం మూసుకు పోయింది. అగ్నిజ్వాలలు ఆకాశాన్ని అంటుకున్నాయి. రాక్షసులు మరింతగా విజృంభించారు. అపుడు దేవి కనుబొమలు ముడిచి, హుంకారం చేసింది. ఆమె దివ్యదేహం నుండి అజేయమైన శక్తులు అనేకం ఆవిర్భవించాయి. 

అలా ముప్ఫయి రెండు శక్తులు ఆవిర్భవించి, రాక్షసులను చీల్చి చెండాడాయి. పదిరోజులు యుద్ధం సాగిన తర్వాత దానవ సైన్యం అంతా నశించింది. దుర్గముడు ఒక్కడే మిగిలాడు. దుర్గముడు అతి కోపంతో దేవి పైకి విజృంభించాడు. అపుడు శతాక్షీదేవి తీక్షణమైన చూపులను ప్రసరింపచేసి, దుర్గమునిపై బాణవర్షం కురిపించింది. దుర్గముని రథాశ్వాలను, సారధిని వధించింది. ఆ పై మరో ఐదు బాణాలు ప్రయోగించి దుర్గముణ్ణి సంహరించిది. 

అప్పుడు దేవతలు, త్రిమూర్తులు ఆ దేవిని ..

“శాకంభరీ దేవి! నమస్తే శతలోచనే!
సర్వోపనిషదుద్ఘషే! దుర్గమాసుర నాశిని!"

అని సంస్తుతించారు.

అంతట ఆ దేవి వానితో " దేవతలారా ! వేద విప్రులారా ! మీరిప్పుడు చూస్తున్న ఈ నా రూపం చాలా పవిత్రమైనది. ఈ రూపాన్ని చూడనందు వల్లనే ఇంత కాలమూ మీరు ఇన్ని కష్టాలు పడ్డారు. దుర్గమాసురుణ్ణి చంపిన నన్ను 'దుర్గ' అనే పేరుతో పూజిస్తూ, మీ కష్టాలను దూరం చేసుకొని సుఖంగా ప్రశాంతంగా జీవించండి" అని అభయమిచ్చి, అంతర్ధానం మైంది.  ఆ నాటి నుండి దేవతలు, వేదవిప్రులు యథావిధిగా తమ తమ ధర్మాలను నిర్వర్తిస్తూ, ప్రశాంతంగా జీవయాత్ర సాగిస్తూ, ఆ దేవిని దుర్గగా, శతాక్షీ దేవిగా, శాకంభరిగా వ్యవహరిస్తూ, ఆమెను ఆరాధించి, ఆమె అనుగ్రహంతో తమ జీవితాలను చరితార్ధం చేసుకున్నారు.

ఈ కథ విశేషాన్ని వినిపించి, వ్యాసమహర్షి ఇలా అన్నాడు..

“జనమేజయ మహారాజా! పవిత్రమైన ఈ శతాక్షీ మహిమా వృత్తాంతం విన్న వారికి దేవీ భక్తి కలుగుతుంది. కష్టాలు తొలిగిపోతాయి. ఆమె అనుగ్రహం పొందితే, సర్వమూ సిద్ధించినట్లే. నీవు కూడా ఆమెను పూజించి, కృతార్ధతను పొందు”.

ఇందుచేతనే  నవరాత్రులలో ఒక రోజు అమ్మవారిని అనేక రకాల కాయగూరలతో, ఫలాలతో, శాస్త్ర ప్రకారం అలంకరించి శాకాంబరీ అవతారం గా కొలిచి దేవాలయాల్లో అర్చనలు జరుపుతుంటారు. 

అయితే శాకాంబరీ దేవిని ఆషాఢంలో పూజించడం మరింత విశేషం.  ఏరువాక పూర్ణిమ అంటే భూమిని దున్నటం ప్రారంభించేరోజు. పూర్వం ఈరోజును పండగలా చేసుకునేవారు. ఇప్పటికి కొన్ని గ్రామాలలో ఈ పండగను  జరుపుకుంటూనే ఉన్నారు. ఈ పండుగ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష పూర్ణిమనాడు వస్తుంది. ఈ సమయానికి ఋతుపవనాలు ప్రవేశించి తొలకరిజల్లులు కురుస్తాయి. దీనితో వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. జ్యేష్ఠ మాసం తరువాత వచ్చే ఆషాఢ మాసంలో జగన్మాతను శాకంబరీదేవిగా పూజించడం ఆచారం.  

మార్కడేయ పురాణంలోని చండీసప్తశతితో పాటు దేవీ భాగవతంలో శాకాంబరీ దేవి గురించిన ప్రస్తావన ఉంద.

శ్రీమాత్రే నమః….🙏🙏
 శ్రీ దుర్గా నమోస్తుతే!

అంతటా విస్తరించిన శక్తి తత్వాన్ని జగన్మాత ఆకృతిలో దర్శించి, ఆరాధించే సాధనా సంవిధానాలు- దేవి శరన్నవరాత్రులు. జడత్వాన్ని వీడి చేతనత్వాన్ని సంతరించుకో వాలి. అజ్ఞానమనే చీకటి నుంచి జ్ఞాన వీచికల దిశగా పురోగమించాలి. కర్తవ్య దీక్షతో కార్యోన్ముఖులు కావాలి- అనే చైతన్య స్ఫూర్తిని నవరాత్రులు అందిస్తాయి. సమస్త శక్తుల సమన్వయ రూపిణిగా దుర్గాదేవి వర్ధిల్లుతోందని దేవీ భాగవతం పేర్కొంది దుర్వికారాలను ఉపశమింపజేసి, దుర్గతులను రూపుమాపే మాతృశక్తి- దుర్గ. మహాదే వుడి అమేయ శక్తి స్వరూపమే దుర్గ. ప్రతికూల భావాలను, వ్యతిరేక ధోరణులను నివారించి సానుకూల, సౌజన్యయుత అంశాలను దుర్గాశక్తి పెంపొందిస్తుంది. మంత్ర, తంత్ర, యంత్ర సమ్మిళితమైన లోకశుభంకరి- దుర్గా మహేశ్వరి!

దుర్గ, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ రూపాలు- పంచ ప్రకృతి శక్తులు. ఈ అయి దింటికి మూలకారక శక్తి దుర్గ. సకల సృష్టిలోని తేజస్సు ఆమెను ఆశ్రయించి ఉంటుం దని దుర్గాసూక్తం ప్రస్తుతించింది. అందుకే తనను సర్వప్రకాశ స్పూర్తిగా పేర్కొంటారు. అఖిలాండకోటి బ్రహ్మాండంలో చైతన్యాన్ని దుర్గాంశగా సంభావిస్తారు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియాత్మక శక్తులకు ఆలంబనగా ఆద్యశక్తి దుర్గాదేవి అలరారుతోంది. జ్ఞాన దీప్తికి సంకేత మైన వేదాలను దుర్గమాసురుడు అపహరిం చాడు. దుర్గముణ్ని సంహరించి, వేదాలను పున రుద్దరించడానికి త్రిమూర్తుల దివ్య యశస్సుతో విజయ విలాసినిగా దుర్గ సాకారమైంది. అజ్ఞా నాంధకారానికి ప్రతిబింబమైన దుర్గముడి అంతంతో, లోకంలో విజ్ఞాన కాంతులు ప్రసరిం చాయి. జీవులకు శక్తిని అందిస్తూ, వాటిని పోషిస్తూ జీవోద్దరణ చేసే మహాదేవి, దుర్గాష్టమి నాడు జగదంబగా అవతరించింది.
లోకంలో జీవత్వాన్ని, జాగృతిని నిలువరించి, జడత్వాన్ని పెంపొందించాలని అసురగణం ప్రయత్నించినప్పుడు కాలాత్మికగా, శతాక్షిగా శ్రీమాత ఆవిర్భవించింది. విశ్వ చక్రాన్ని పురోగ మింప చేయడానికి విశ్వేశ్వరిగా వ్యక్తమైంది.

'వాంçసమధికం'- అని దుర్గాదేవిని సౌందర్యలహరిలో జగద్గురు ఆదిశంకరులు కీర్తిం చారు. కోరిన దానికన్నా అధికంగా వరాల సిరులను అనుగ్రహించే కల్పవల్లి- శ్రీ దుర్గ.

ప్రాణమయి, ప్రాణధాత్రి, ప్రాణేశ్వరి అనే దుర్గా నామాలకు ప్రతీకాత్మకమైన, ప్రాకృ తికపరమైన సంకేతం- బతుకమ్మ! ప్రకృతిలోని సాఫల్యతకు, సజీవత్వానికి బతుకమ్మ అద్దంపడుతుంది. ప్రాణులలోని జీవశక్తిని బతుకమ్మగా జానపదులు దర్శిస్తారు. పూల పొదరిళ్లలో పుష్ప సౌందర్యంతో బతుకమ్మ పరిమళిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా మహాలయ అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు తన్మయభరితంగా ఆటపాట లతో మహిళలు బతుకమ్మను ఆరాధిస్తారు. దేవీ నవరాత్రులలో నిర్వహించే శ్రీ చక్రా ర్చనకు మరో రూపమే బతుకమ్మ. చైతన్య కుసుమప్రియగా భాసిల్లే బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పేరిట ఈ సంబురాల్లో చివరి రోజు కనువిందు చేస్తుంది. చద్ది అంటే చలువ, శీతలత్వం, క్షేమంకర భావన. పూలపుంతగా, తీరొక్క పువ్వుల దొంతరగా గోచ రమయ్యే చద్దుల బతుకమ్మ, సస్యకారక శక్తిగా ప్రకటితమవుతుంది. సమష్టి ఆధ్యాత్మిక చైతన్యానికి, సామరస్య జీవన సంవిధానానికి ప్రతీక- బతుకమ్మ వేడుక!

డాక్టర్ కావూరి రాజేశ్ పటేల్
 దుర్గాష్టమి ప్రాధాన్యత- విశిష్టత 

ప్రతినెలా దుర్గాష్టమి వస్తుంది. కానీ ఆశ్వయుజ మాసంలో వచ్చే శుక్లపక్ష అష్టమి దుర్గా దేవి అమ్మవారికి పరమ ప్రీతికరమైన రోజు. దీనినే మహాష్టమి లేదా మహా దుర్గాష్టమి అని కూడా పిలుస్తారు. ఈసారి ఈ దుర్గాష్టమి పండుగ సెప్టెంబర్‌ 30వ తేదీన జరుపుకోనున్నారు. 9 రోజుల పాటు జరిగే దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అష్టమి రోజు దుర్గాష్టమి పర్వదినం ఆచరిస్తారు. అలాగే.. చాలా మంది ఈరోజున దుర్గా దేవి అనుగ్రహం కోసం దుర్గాష్టమి వ్రతం ఆచరిస్తారు. అలాగే ఆయుధ పూజ నిర్వహిస్తారు. ఈ దుర్గాష్టమి రోజు భక్తిశ్రద్ధలతో ఆచరించే ఆరాధనలు, పూజలు అమ్మవారికి ప్రీతికరమైనవి, అత్యం పవిత్రమైన దుర్గాష్టమి రోజు చాలా మంది కన్యా పూజ లేదా కుమారి పూజ ఆచరిస్తారు. త శుభకరమని నమ్ముతారు.
దసరా నవరాత్రుల్లో అత్యంత విశిష్టమైన రోజుగా, అపారమైన శక్తులకు ప్రతీకగా దుర్గాష్టమి పర్వదినాన్ని ఆచరిస్తారు. ఈరోజున పూజించే అమ్మవారి రూపం మహిషాసురమర్దిని. అంటే మహిషాసురుడిని సంహరించిన దుర్గాదేవి అని అర్థం. ఇక దుర్గాష్టమి రోజు ఆచరించే దుర్గాష్టమి కథ విషయానికొస్తే..
పూర్వం రంభుడు అనే రాక్షస రాజు ఉండేవాడు. అతడు మహిషి (గేదె) రూపంలో ఉన్న రాక్షసిని మోహించి వివాహం చేసుకుంటాడు. వారికి జన్మించినవాడే ఈ మహిషాసురుడు. గేదె తల, మనిషి మొండెం కలిగిన ఈ రాక్షసుడు అపారమైన శక్తియుక్తులతో లోకాలను జయించాలనే కోరికతో బ్రహ్మదేవుడి కోసం కఠోర తపస్సు చేస్తాడు. మహిషాసురుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీరు కోరిన వరం ఇస్తానని హామీ ఇస్తారు. అప్పుడు మహిషాసురుడు 'నాకు పురుషులు లేదా దేవతల చేతిలో మరణం లేకుండా వరం ఇవ్వండి' అని కోరుతాడు. వెంటనే బ్రహ్మ ఆ వరాన్ని ఇచ్చాడు. వరం పొందిన తర్వాత మహిషాసురుడు అహంకారంతో దేవలోకాన్ని ఆక్రమించాడు. దేవతలందరినీ నానా రకాలుగా ఇబ్బందిపెడుతుంటాడు. మహిషాసురుడి అరాచకాలను తట్టుకోలేని దేవతలు త్రిమూర్తులకు మొరపెట్టుకుంటారు. అప్పుడు త్రిమూర్తులు, దేవతలు అందరూ బాగా మథనం చేసిన తర్వాత శక్తి, తేజస్సుతో ఒక దివ్య శక్తి ఉద్భవిస్తుంది. అనంతమైన తేజస్సుతో, అపారమైన సౌందర్యంతో ఆవిర్భవించిన ఆ శక్తే దుర్గా దేవి. దివ్యశక్తులతో ఉద్భవించిన దుర్గాదేవికి మహిషారుసుడిని సంహరించడానికి దేవతలందరూ తమ తమ శక్తివంతమైన ఆయుధాలను సమర్పిస్తారు. అవేమిటంటే.. శివుడు - త్రిశూలం, విష్ణువు - సుదర్శన చక్రం, వరుణుడు - శంఖం, వాయుదేవుడు - బాణాలు, ధనుస్సు, ఇంద్రుడు - వజ్రాయుధం, హిమవంతుడు - సింహం ఇలా పది చేతుల్లో శక్తివంతమైన ఆయుధాలు ధరించి సింహ వాహనాన్ని అధిరోహించిన దుర్గాదేవి భయంకరమైన ఒక్క గర్జన చేసింది.. ఆ గర్జనకు ముల్లోకాలు కంపించాయి.
మహిషాసుర సంహారం
దుర్గాదేవి గర్జన విన్న మహిషాసురుడు ఒక స్త్రీ తనపై యుద్ధానికి వచ్చిందని గర్వంగా భావించి ఆమె శక్తిని తక్కువ అంచనా వేశాడు. తన అనుచరులను, సేనలను, రాక్షస వీరులను దుర్గాదేవిపై యుద్ధానికి పంపిస్తాడు. దుర్గాదేవి అసామాన్య పోరాట పటిమతో ఒక్కొక్క రాక్షసుడిని సంహరిస్తూ వస్తుంది. చివరగా మహిషాసురుడే యుద్ధానికి వచ్చాడు. అతనికి ఉన్న మహిమల వల్ల గేదె, సింహం, మనిషి ఇలా రూపాలు మార్చుకుంటూ అమ్మవారిని కలవరపెట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ దుర్గా దేవి దివ్యశక్తితో అతని ప్రతి మాయను ఛేదిస్తూ వస్తుంది. చివరిగా మహిషాసురుడు గేదె రూపంలో ఉన్నప్పుడు ఆ రూపం నుంచి మనిషి రూపంలో బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు దుర్గాదేవి త్రిశూలాన్ని అతని గుండెలపై దింపి.. శిరస్సును ఖండిస్తుంది. అంతటితో ఆ రాక్షసుడి పీడ విరగడవుతుంది. దీంతో లోకంలో శాంతి నెలకొంటుంది. అలాగే.. మహిషాసురుడిపై దుర్గాదేవి విజయం సాధించిన రోజునే దుర్గాష్టమిగా జరుపుకుంటారు.
ఈ సంవత్సరం దుర్గా అష్టమి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున మేష రాశి నుంచి మీన రాశి వరకు మొత్తం 12 రాశుల వారు శుభ ఫలితాలను పొందుతారు. అయితే కొన్ని పరిహరాలను చేయడం వలన అమ్మ రెట్టింపు అనుగ్రహాన్ని ఇస్తుంది. ఈ రోజు దుర్గాదేవి చీకటి, అహంకారంపై సాధించిన విజయాన్ని సూచిస్తుంది. ఈసారి చంద్రుడు బృహస్పతి రాశి .. ధనుస్సు రాశిలో ఉంటాడు. దీంతో ఈ ఏడాది దుర్గా అష్టమి రోజున ఆధ్యాత్మిక జ్ఞానం, విశ్వాసం, భావోద్వేగ ధైర్యాన్ని పెంచుతుంది. ఈ దుర్గాష్టమి రోజున ప్రతి రాశిపై దుర్గమ్మ ఆశీస్సులు ఉంటాయి. రాశి ప్రకారం కొన్ని పరిహారాలు చేయడం శుభప్రదం.
దుర్గాష్టమి రోజున ధనుస్సు రాశిలో చంద్రుని స్థానం దుర్గాదేవి శక్తిని, బృహస్పతి జ్ఞానాన్ని ఏకం చేస్తుంది. ఈ పవిత్ర సంగమం ప్రతి ఒక్కరూ ధైర్యంతో జీవించడం, సత్యాన్ని స్వీకరించడం, భయాన్ని విడిచిపెట్టడం నేర్పే వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ రోజున వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడినవారు అస్త్ర పూజ చేస్తారు. తమ వృత్తికి సంబంధించిన సామగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజ చేస్తారు.  పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచివెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. శత్రువులను జయించి విజయుడయ్యాడు. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు పవిత్రతను సంతరించుకుంది. కనుకనే ఇప్పటికీ జమ్మిచెట్టుకు భక్తిగా పూజలు చేస్తారు. కాళీ అమ్మవారి నుదిటి భాగం నుంచి దుర్గ ఉద్భవించిందని కొందరు చెబుతారు. అందుకే కనకదుర్గను కాళీ, చండీ, రక్తబీజగా కొలుస్తారు. మహాష్టమి నాడు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను అర్చిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నార్సింగి, ఇంద్రాణి, చాముండి - అనే ఎనిమిది శక్తి రూపాలను కొలుస్తారు. 
వృత్తి, ఉద్యోగాలలో ఉండేవారు తమ సామగ్రిని, ఆయుధాలను అమ్మవారి దగ్గరుంచి పూజిస్తారు.  "లోహుడు" అనే రాక్షసుడిని దుర్గాదేవి వధిస్తే లోహం పుట్టిందని..అందుకే ఈ రోజు లోహపరికరాలని పూజిస్తారని చెబుతారు. 
దుర్గ అంటే దుర్గమైనది దుర్గ
దుర్గతులను తొలిగించేది దుర్గ
దుర్గతిని దూరం చేసి సద్గతిని ఇచ్చే తల్లి కనకదుర్గ
లలితా సహస్రనామంలో అమ్మవారికి ‘సద్గతి ప్రదా’ అనే నామం ఉంటుంది..
దుర్గ అనే నామం ...గత జన్మ వాసనలను పూర్తిగా తుడిచేసి దుర్గుణాలను సద్గుణాలుగా మారుస్తుందని..సంతోషాన్నిస్తుందని చెబుతారు
దుర్గాదేవి ఆరాధన వల్ల దుష్టశక్తులు,భూత , ప్రేత , పిశాచ , రాక్షస బాధలుండవు. 
మొదటి 3 రోజులు దుర్గా రూపం - అరిషడ్వర్గాలను జయించేందుకు
4,5,6 రోజులు లక్ష్మీ రూపం - ఐశ్వర్యం కోసం 
చివరి మూడు రోజులు సరస్వతీ రూపం - జ్ఞాన సముపార్జన కోసం
 వాగ్దేవికి వందనం

సరస్వతీ దేవి విద్యాధిదేవత. చదువుల తల్లి. విద్యను మూడో నేత్రంతో పోల్చారు జ్ఞానకోవిదులు. మనిషి రెండు కళ్లతో ప్రపంచాన్ని చూడగలిగితే, 'విద్య' అనే మూడో కంటితో లోకంలోని మంచి చెడులను తెలుసుకుంటూ ముందుకెళ్లాలన్నదే దానికి అర్థం. సరస్వతిని జ్ఞానశక్తికి అధిష్ఠాన దేవతగా కొలుస్తారు. జ్ఞానం, వివేకం ఈ రెండిం టినీ అనుగ్రహించే ఆ వాగ్దేవిని భాష, భగవతి, భారతి ఇత్యాది పేర్లతో పిలుచు కుంటాం. విద్యాప్రదాత్రి అయిన ఆమె అనుగ్రహం లేనిదే ఏ వ్యక్తిలోనూ జ్ఞానదీపం వెలగదు. ఆమె కృపకు పాత్రులైనవారు మాత్రమే ఆ అవకాశాన్ని అందుకోగలరు. విద్య, విజ్ఞానం, వివేకం ఈ మూడింటి వికాసానికి అమ్మ దయ అవసరం. వీణాపాణి, పుస్తకధారిణి అయిన వాణిని భక్తి ప్రపత్తులతో కొలిచే వారిలో జ్ఞానదీపాన్ని ఆ తల్లి తన చేత్తోనే వెలిగిస్తుందని విశ్వామిత్ర మహర్షి పేర్కొన్నాడు. అక్షరమ్ముక్క తెలియని మనిషిని తన అనుగ్రహంతో కవికుల శ్రేష్ఠుడైన కాళిదాసుగా తీర్చిదిద్దింది ఆ జ్ఞాన స్వరూపిణి. 'ప్రణోదేవీ సరస్వతీ... అంటూ విద్యాధిదేవతను కీర్తించింది రుగ్వేదం. ప్రణమిల్లే వారిని కాపాడే తల్లి అని దానికి అర్థం. అంతేకాదు, వేదం- వాగ్దేవిని అన్నప్రదా యినిగా అభివర్ణిస్తూ ధనదాయినిగా కూడా కీర్తించింది. చైతన్యవంతమైన విద్య పరబ్రహ్మ సాక్షాత్కారానికి దారిచూపుతుంది.

సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే విశేషార్థం ఉంది. ప్రవాహం చైతన్యానికి ప్రతీక. నీరు జీవశక్తికి సంకేతం. సర్వ జీవ రాశికీ ప్రాణాధారం. ఇలా జల రూపంతో సైతం సరస్వతీదేవి మానవాళి మనుగడకు ఆధారమవుతూ నదీమ తల్లిగా నమస్కారాలు అందుకుంటోంది.. పూజాదికాలలో కలశపూజ చేసేటప్పుడు సరస్వతీ నది పేరును ఉచ్చరించడం తెలిసిందే.
మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి అని పూజించుకునే ముగ్గురమ్మల్లో సరస్వతీ దేవి బాలచంద్రుణ్ని సిగలో పూవుగా ధరించి ఉంటుంది. తక్కిన దేవతల్లాగ ఈమె చేతిలో ఏ ఆయుధమూ ఉండదు. బ్రహ్మవైవర్త పురాణం సరస్వతీ దేవిని అహింసకు నాయి కగా పేర్కొని సర్వశుక్లాం, శుద్ద రూపాం అని స్తుతించింది. ధవళమూర్తిగా మందస్మిత వదనంతో పద్మంపై ఆశీనురాలై ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంటుంది.

బ్రహ్మదేవుడి నాలుగు ముఖాలూ నాలుగు వేదాలు. వేదాలకు జీవం వాక్కు. ఆ వాక్కే బ్రహ్మముఖంలో నివసించే భారతి అని శాస్త్రవచనం. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు సరస్వతీ దేవి నిలయాలు. ఆమె వాహనం హంస. జగత్తులో విజ్ఞాన సత్తును ప్రత్యేకంగా గ్రహించగలిగినప్పుడే మనిషి హంస ధర్మం కలవాడవుతాడ న్నది జ్ఞానుల వివరణ. విద్యార్థులు అందరూ ఆ తల్లికి శరణాగతులై ఉండాలి. ఏ ఇంట వాగ్దేవిని పూజిస్తారో ఆ ఇల్లు సిరిసంపదలకు, శాంతికి నిలయమవుతుంది. అందుకే 'విద్యారూపే విశాలాక్షి విద్యాం దేహి నమోస్తుతే!' అని మనసారా ప్రార్థిద్దాం. ఆ తల్లి ఆశీస్సులు పొందుదాం.

యం.సి.శివశంకరశాస్త్రి