Thursday, October 31, 2024

 *మన జీవితంలో వెలుగులు (నేడు దీపావళి సందర్భంగా)*

🌹మన జీవితం లో 'అంధకారం'... అనేది మన 'అఙ్ఙానముకు' మరియు మన 'నిరాశకు' చిహ్నం. అలాగే..,

🌿వెలుగు అనేది మన 'ఙ్ఞానానికి' మరియు మన జీవితంలో 'ఆనందానికి' చిహ్నం.

🌹అఙ్ఞానమనే చీకటి నుంచి... ఙ్ఞానమనే వెలుగులోకి ప్రయాణించడమే ‘దీపావళి’ పండుగలోని అంతరార్ధం.

🌿‘దీప’ అంటే దీపము....‘ఆవళి’ అంటే వరుస... దీప + ఆవళి అంటే.. దీపాల వరుస అని అర్ధం...

🌹దీపం ఐశ్వర్యం అయితే..‌. అంధకారం దారిద్ర్యం .. దరిద్రాన్ని పారద్రోలి, ఐశ్వర్య మార్గంలోకి ప్రయాణిచడమే ‘దీపావళి’ పండుగ...

🌿'దీపం’ త్రిమూర్తి స్వరూపం. దీపంలో మూడు రంగుల కాంతులు ఉంటాయి.

🌹‘ఎర్రని’ కాంతి బ్రహ్మదేవునికి..,
‘నీలి’ కాంతి శ్రీమహావిష్ణువుకి..
‘తెల్లని’ కాంతి పరమేశ్వరునికి ప్రతీకలు.

🌿సాజ్యం త్రివర్తి సంయుక్తం - వహ్నినా యోజితం ప్రియం
గృహాణ మంగళం దీపం - త్రైలోక్య తిమిరాపహం
భక్త్యా దీపం ప్రయచ్ఛామి - దేవాయ పరమాత్మనే
త్రాహిమాన్నరకాద్ఘోరాత్  - దివ్య జ్యోతిర్నమోస్తుతే

🌹ఏ దీపమైనా మూడు వత్తులు వేసి వెలిగించాలి గానీ.. ఒక వత్తు దీపం.... రెండు వత్తుల దీపాలు.. వెలిగించరాదు.

🌿‘మూడు వత్తుల' దీపం.. గృహానికి శుభాలు చేకూరుస్తుంది...

🌹ముల్లోకాలలోని అంధకారాన్ని పారద్రోలి లక్ష్మీ నిలయంలా చేస్తుంది. నరకం నుంచి రక్షిస్తుంది.

🌿దీపం సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపం. అటువంటి దీపాన్ని..ఆవు నేతితోగానీ.. నువ్వుల నూనెతోగానీ..భక్తిగా వెలిగించాలి...

🌹మరెంతో భక్తిగా నమస్కరించాలి అని పై శ్లోకం అర్థం. 

    🌹 దీపం - లక్ష్మీ స్వరూపం 🌹

🌿దీపం ఉన్నచోట  సర్వసంపదలు తాండవిస్తాయి.., ఆనందాలు వెల్లివిరుస్తాయి., సుఖ, సంతోషాలు చోటు చేసుకుంటాయి.

🌸అందుకే నిరంతరం మన పూజామందిరంలో దీపం వెలుగుతూండాలనే నియమం పెట్టారు.

       🌹 దీపం - విజయానికి చిహ్నం 🌹

🌿అందుకే పూర్వకాలంలో యుద్ధానికి వెళ్లే సైనికులకు, రాజులకూ విజయతిలకం దిద్ది విజయహారతులిచ్చి పంపేవారు..

🌸నిజానికి ‘దీపాన్ని’ మట్టి ప్రమిదలోనే వెలిగించాలి. మట్టి ఉష్ణాన్ని తనలో లీనం చేసుకుంటుంది. అందుకే ఎంతసేపు వెలిగినా మట్టి ప్రమిద వేడెక్కదు.

🌿మనం ఆర్భాటం కొద్దీ ఉపయోగించే  వెండి,  ఇత్తడి, రాగి, కంచు ప్రమిదలు దీపం వెలిగించిన కొద్దిసేపటికే వేడెక్కిపోతాయి. ఆ వేడిని భూమాత భరించలేదు, కనుకనే వట్టి నేలపైన దీపం వెలిగించరాదు.

🌸ప్రమిదలో ప్రమిద వేసి మూడు వత్తుల దీపం వెలిగించాలి.

            🌹 ఇది సాంప్రదాయం 🌹

🌿మానవదేహం మట్టి నిర్మితం. అందుకే  మనం ఎంత నలుగు పెట్టుకుని రుద్దినా., ఎన్ని సబ్బులు అరగదీసినా., ఎన్ని షాంపూలతో స్నానం చేసి వచ్చినా.., మన దేహంపై ఎక్కడ రుద్దినా కాస్తో కూస్తో మట్టి రాలుతుంది. గమనించండి.

🌸ఈ మానవదేహం ఓ మట్టి ప్రమిద. ఈ ప్రమిదలో జ్యోతి రూపంతో భాసిల్లేవాడే ‘పరమాత్మ’.

🌿ఆ జ్యోతి ఈ మానవ ప్రమిదలో వెలుగుతున్నంత సేపు ఈ దేహం చైతన్యవంతంగా, ప్రాణంతో ఉంటుంది. దీపం లేని ప్రమిదకు విలువ ఉండదు.

🌸అందుకే మనిషి మరణించిన తర్వాత ఆ పార్థివదేహం తల దగ్గర ఒంటి వత్తు దీపం వెలిగిస్తారు. ఈ దేహంలోని జ్యోతి బయటకు వెళ్లిపోయింది అని తెలియ చెప్పడానికి ఆ దీపం నిదర్శనం.

🌿ఇక్కడ మాత్రం ఒంటి వత్తు దీపాన్నే వెలిగించాలి. కారణం.. 
‘ఏకో పరాత్మా బహుదేహ వర్తిః’
దేహాంతర్గతుడైన పరమాత్మ ఒక్కడే. ఇది వేదాంతార్థం.

🌸ఇక.. అగ్నిదేవుని రూపమే ఈ దీపం. మన హైందవధర్మానికి మూలస్తంభాలు నాలుగు వేదాలు. అందులో తొలివేదం.. ‘ఋగ్వేదం’.

🌿‘అగ్నిమీళే పురోహితం యఙ్ఞస్య దేవమృత్విజమ్ హోతారం రత్నధాతమమ్’

🌸ఇది ఋగ్వేదంలోని తొలి ఋక్కు. ఈ ఋక్కుతోనే వేదం ప్రారంభమవుతుంది. అంటే...

🌿తొలిసారిగా కీర్తించబడిన తొలి దేవుడు ‘అగ్ని’. అంటే ‘జ్యోతి స్వరూపం’. ఈ జ్యోతి స్వరూపమే పురహితాన్ని కోరే తొలి పురోహితుడు.. ఋత్విక్కుడూను. 

🌸మన జీవితంలోని మంచి, చెడులలో మనకు తోడుగా ఉంటూ, మార్గ దర్శకత్వం వహించేది ఈ జ్యోతి ఒక్కటే. కనుక ఆ ‘జ్యోతి' ని ఉపాసించడం., ఆరాధించచడం మన ధర్మం.

🌿నరకాసుర సంహారంతో సకల లోకాలు కష్టాల అంధకారంలోంచి సంతోషమనే వెలుగులోకి వచ్చాయి. అందుకే నరకచతుర్దశి నుంచే మన సుఖ, సంతోషాలను వ్యక్తం చేయడానికి నిదర్శనంగా దీపాలు వెలిగించాలి.

🌸ఆ వెలుగులో మన జీవితం, మన కుటుంబం, మన నవసామాజిక సమాజం పయనించాలి.

🌿ఈ దీపావళి పండుగ రోజున మీకు.. మీ కుటుంబానికి.., సకల దేవతల ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ...

🌸దీపావళి శుభాకాంక్షలతో...     మీ మాధవ కొల్లి.
 కథ... 

ఒక ఊరిలో కొత్తగా పెళ్ళి అయిన జంట ఒక పూరి గుడిసెలో కాపురం ఉంటారు. 

అతని భార్య అందంగా ఉంటుంది. 
పేదరికంలో ఉంటారు. 
రోజు ఆరుబయట వంట చేస్తూఉండేది ఆమె.  

ఆ ఊరిలో ఉన్న మగవారంతా ఆమెను చూస్తూ ఉండేవారు.  భర్తకు ఇదంతా చూసి బాధగా అనిపించేది. అలా భార్య తో ఒకరోజు
మనం చేసేది కూలీ పనేకదా ఈ ఊర్లో పరిస్థితి బాగాలేదు వేరే ఊరు వెళ్లి ఇదే పని అక్కడ చేసుకుందాం అంటాడు. 

భర్త ను గౌరవించే భార్య కనుక సరే అని ఉన్న సామాను అంత సర్ది ఒక ఎద్దుల బండి లో వేసుకుంటారు. 

ఇంకా ఏమైనా ఉన్నాయా అని భర్త అడుగుతాడు.... 
అప్పుడు భార్య బైట పొయ్యి రాళ్లు 3ఉన్నాయి తెచ్చి బండి లో పెట్టండి అంటుంది. 

అప్పుడు భర్త అంటాడు ఈ మాత్రం రాళ్లు అక్కడ ఉండవా అని.

అప్పుడు భార్య అంటుంది ఈ మాత్రం చూసే మగవాళ్ళు ఆ ఊరిలో ఉండరా....? 
*కావాల్సింది నమ్మకం*
మన హద్దులు తప్ప వేరే వాళ్లకు భయపడ కూడదు అంటుంది. 

భర్త అప్పుడు అన్ని సామాన్లు దించి అదే ఊర్లో కాపురం ఉంటారు....!

*భార్యాభర్తల బంధం నమ్మకంతో వుండాలి*

*ఒకరిపట్ల ఒకరికి గౌరవము ప్రేమాభిమానాలు*

ఉండాలి డబ్బు
 పిచ్చి మద పిచ్చి కాదు

కట్టుకున్న భార్య శరీరాన్నే కాక మనసుని ఆమె
మానశిక సౌందర్యానికి ఆరాధ్యుడై ,తోడై అమెకే నీడై
నిలిచి జీవితాన్ని గెలిచే ప్రతి భర్తకీ..భార్యకీ
నా సవినయ వందనం 💐
 శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించినప్పుడు ఆయనకీ ... భూదేవికి జన్మించినవాడే నరకాసురుడు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు, తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలోను మరణంలేని విధంగా వరాన్ని ప్రసాదిస్తాడు.వరగర్వితుడైన నరకాసురుడు అటు దేవతలను ... ఇటు మానవులను నానాబాధలు పెట్టసాగాడు.దేవతలు విష్ణువును సహాయం అర్థిస్తారు.తాను శ్రీకృష్ణావతారంలో నరకుని వధించెదనని విష్ణువు దేవతలకు నచ్చచెబుతాడు. అయితే భూదేవి విష్ణువు నుండి వరం పొంది ఉంటుంది. నరకుడు చాలా కాలం జీవించాలని, అతడు తల్లి అయిన తన చేతులలో మరణించాలని, మరియు అతని పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరగా ఆ కోర్కెలకు విష్ణువు అంగీకరించి వాటిని వరాలుగా ఇస్తాడు. విష్ణువు కృష్ణావతారం ఎత్తినప్పుడు భూదేవి సత్యభామగా అవతరిస్తుంది.నరకుడు దేవతల తల్లి అయిన అదితి కర్ణకుండలాలను అపహరిస్తాడు. పైగా పదహారు వేలమంది రాజకన్యలను కూడా అపహరించి బందీ చేస్తాడు. అదితి సత్యభామకు బంధువు.దీనితో సత్యభామ కోర్కెతో శ్రీకృష్ణుడు నరకునిపై దండెత్తి  యుద్ధం చేస్తాడు, నరకాసురుడు కృష్ణునిపై పెక్కు దివ్యాస్త్రాలను ప్రయోగించగా, కృష్ణుడు వాటిని తిప్పికొట్టి సమ్మసిల్లి పడుకుంటాడు చివరకు సత్యభామ ఆగ్రహించి ధనస్సు ను చేత బట్టి నరకుని సంహరిస్తుంది. అదితికి కుండలాలు తిరిగి వస్తాయి. పదహారువేల మంది కన్యలు రక్షింపబడతారు. లోక కంటకుడైన నరకుడి పీడ వదిలిందనే సంతోషంతో అంతా దీపాలు వెలిగించి మతాబులు కాల్చి సంబరాలు జరుపుకుంటారు. తరతరాలుగా ఇదే విధానం దీపావళి పండుగ పేరుతో కొనసాగుతోంది.మరుసటి రోజు అమావాస్య కావడంతో చీకట్లు ముసురుతాయి. ఆ చీకట్లను పారదోలడానికై ప్రజలు దీపాలు వెలగిస్తారు..ఇక పురాణ సంబంధమైన కథ ఇలా వుంటే, ధర్మ శాస్త్రం మాత్రం దీపావళి పండుగ ఉద్దేశం పితృదేవతలను సంతృప్తి పరచడమేనని చెబుతోంది.దీపాలను వెలిగించి పితృదేవతలకి ఆహ్వానం పలకడం, మతాబులు కాలుస్తూ వారి రాకపట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడం ... తారాజువ్వాలను కాలుస్తూ వారికి ఆకాశ మార్గం స్పష్టంగా కనిపించేలా చేయడమే ఈ పండుగలోని పరమార్థమని అంటోంది.ఈ రోజుల్లో వానలు కురవడం ... చలి పెరుగుతూ వుండటం వలన అనేక రకాలైన క్రిములు వివిధ రకాలైన వ్యాధులను కలిగిస్తుంటాయి. వాటిని నియత్రించడం కోసమే దీపాలను వెలిగించడం, టపాకాయలు పేల్చి ఆ పొగవల్ల అవి నశించేలా చేయడం జరుగుతుందని అంటారు.ఇక ఈ రోజున శ్రీ కృష్ణుడు ద్వారకానగరానికి చెందిన 16000 మంది గోపికలకు నరకాసురుడి చెర నుంచి విముక్తి కలిగించాడు కనుక, అందుకు సంకేతంగా కొంతమంది 16 దీపాలను వెలిగిస్తుంటారు.మరికొందరు 33 కోట్ల మంది దేవతలకు సంకేతంగా 33 దీపాలు వెలిగిస్తుంటారు.

అజ్ఞాన చీకట్లు పారద్రోలే నరక చతుర్ధశి, శ్రీకృష్ణ పరమాత్మ, మహాలక్ష్మీ దేవి ఆశీస్సులతో జీవితంలో వెలుగులు నింపే దీపావళి అందరికీ శుభం చేకూర్చాలని ఐశ్వర్యవంతులు కావాలని కోరుతూ....

దీపావళి శుభాకాంక్షలు...

    *🚩హనుమాన్ దళ్🚩*
            *ఆంధ్రప్రదేశ్*

Wednesday, October 30, 2024

 *నరకాసుర వధ ఎలా జరిగింది? ఎందుకు జరిగింది..?*


🌸 దీపావళి అంటే సంతోషం.. సందడి... సంబరం. దీపావళి రోజున ఉదయం వేళలో ఇళ్లన్నీ పసుపు గడపలతో.. మామిడి తోరణాలతో కళకళలాడుతూ కనిపిస్తాయి. ఇక చీకటిపడే సరికి అందరి ఇళ్లలోనూ అనేక దీపాలు పసిడి వెలుగులను విరజిమ్ముతుంటాయి. 

🌿 ఈ వెలుగులకు భయపడిన చీకటి ఎక్కడా దాచుకోవడానికి చోటులేకపోవడంతో పొలిమేరలు దాటి పారిపోతుంది.

🌸 చీకటిని వెలుగులు తరిమి కొట్టడాన్ని చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చెప్పుకుంటూ వుంటారు. ఇందుకు కారణమైన కథగా మనకి నరకాసుర సంహారం కనిపిస్తుంది.

🌿 శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించినప్పుడు ఆయనకీ... భూదేవికి జన్మించినవాడే నరకాసురుడు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు, తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలోను మరణంలేని విధంగా వరాన్ని ప్రసాదిస్తాడు. వరగర్వితుడైన నరకాసురుడు అటు దేవతలను... ఇటు మానవులను నానాబాధలు పెట్టసాగాడు. 

🌸 ఈ విషయం తెలుసుకున్న శ్రీమహావిష్ణువు, శ్రీకృష్ణుడిగా నరకాసురుడిపై యుద్ధాన్ని ప్రకటించి, సత్యభామగా జన్మించిన భూదేవిని వెంటబెట్టుకుని వెళతాడు. సతీసమేతంగా యుద్ధానికి వచ్చిన కృష్ణుడిని ఎగతాళి చేసిన నరకాసురుడు, ఆమె చేతిలో ప్రాణాలు కోల్పోతాడు.

🌿 లోక కంటకుడైన నరకుడి పీడ వదిలిందనే సంతోషంతో అంతా దీపాలు వెలిగించి మతాబులు కాల్చి సంబరాలు జరుపుకుంటారు. తరతరాలుగా ఇదే విధానం దీపావళి పండుగ పేరుతో కొనసాగుతోంది.

🌸 ఇక పురాణ సంబంధమైన కథ ఇలా వుంటే, ధర్మ శాస్త్రం మాత్రం దీపావళి పండుగ ఉద్దేశం పితృదేవతలను సంతృప్తి పరచడమేనని చెబుతోంది.

🌿 దీపాలను వెలిగించి పితృదేవతలకి ఆహ్వానం పలకడం, మతాబులు కాలుస్తూ వారి రాకపట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడం... తారాజువ్వాలను కాలుస్తూ వారికి ఆకాశ మార్గం స్పష్టంగా కనిపించేలా చేయడమే ఈ పండుగలోని పరమార్థమని అంటోంది.

🌸 ఈ రోజుల్లో వానలు కురవడం... చలి పెరుగుతూ వుండటం వలన అనేక రకాలైన క్రిములు వివిధ రకాలైన వ్యాధులను కలిగిస్తుంటాయి. వాటిని నియత్రించడం కోసమే దీపాలను వెలిగించడం, టపాకాయలు పేల్చి ఆ పొగవల్ల అవి నశించేలా చేయడం జరుగుతుందని అంటారు.

🌿 ఇక ఈ రోజున శ్రీ కృష్ణుడు ద్వారకానగరానికి చెందిన 16000 మంది గోపికలకు నరకాసురుడి చెర నుంచి విముక్తి కలిగించాడు కనుక, అందుకు సంకేతంగా కొంతమంది 16 దీపాలను వెలిగిస్తుంటారు.

🌸 మరికొందరు 33 కోట్ల మంది దేవతలకు సంకేతంగా 33 దీపాలు వెలిగిస్తుంటారు. ధనత్రయోదశి... నరకచతుర్దశి... దీపావళి ... బలిపాడ్యమి... యమద్వితీయ అయిదు రోజుల పండుగలా భావిస్తుంటారు కనుక కొందరు అయిదు దీపాలను వెలిగిస్తుంటారు. 

🌿 భూదేవి దీపం వేడిని భరించలేదట. అందువలన ప్రమిదలో ప్రమిద పెట్టి వెలిగిస్తుంటారు.. ఆ బంగారు కాంతుల్లో అనుబంధాల వాకిట్లో ఆనందాల సందడి చేసేస్తుంటారు..స్వస్తి..🚩🌞🙏🌹.
 *పుత్రోత్సాహం*
   (నేటి బుధవారం స్పెషల్ స్టోరీ)                 

"అమ్మా ! నువ్వు ఇలా నిర్లిప్తంగా కూర్చుని ...నీ ప్రమేయం లేదు అన్నట్టుంటే ...నాకు కాళ్ళూ చేతులు ఆడటం లేదు! నాన్నలేని లోటు పూరించడం కష్టమే కానీ,  నీ మౌనం భరించడం ఇంకా కష్టంగా ఉంది!  అన్ని ఏర్పాట్లు చేసినా ఇంకా ఏదైనామిస్ అయ్యామేమోనని మనసు పీకుతోంది. 12వ రోజు సమారాధన కోసం నాన్నకు ఇష్టమైన ఐటమ్స్ కొన్ని పురమాయించాను! నువ్వు కూడా కొన్ని విషయాలు చెప్తే నాకు బాగుంటుంది!" 

కొడుకు సురేంద్ర మాటలకు దీర్ఘంగానిట్టూర్చింది వర్ధని!

"నాకేం తెలుసురా ఏం చెప్పాలో !ఇన్నాళ్లు నాన్న ఏది చెప్తే అదే మనం  చేసాం. ఆయన ఈ లోకాన్ని విడిచి పోయినా ఆయన ఇష్టాయిష్టాలు ఇంకా నువ్వు గౌరవిస్తున్నావ్ అంటే, అది మా పూర్వజన్మ సుకృతం! నీకు ఏది బాగుంది అంటేఅదే చెయ్యి నాయనా!"

"ఆయనతోనే నా జీవితం అయిపోయింది. 45 ఏళ్ల దాంపత్యంలో చిన్నపిల్లలా ఆయన చిటికెన వేలు పట్టుకుని తిరుగుతూనే ఉన్నాను. ఆయన ఏది మంచిది అంటే అదే చేశాను. నాకంటూ ప్రాథమ్యాలు, ప్రాధాన్యతలు ఉంటాయనికూడా నాకు తెలియదు! సుమంగళి గా ఉండాలని పూజలు చేశాను, నోములు నోచాను.  ఇహ ఆ భాగ్యం లేకుండాపోతోంది !నన్ను బోడమ్మను చేసి ఇంట్లో కూర్చో పెడతారు! ".. ‌ ఆఖరి మాటలు అంటుంటే దుఃఖం తన్నుకొచ్చింది వర్ధనికి! 

తల్లి మాటలకు కలతచెంది ఆర్ద్రతతో ఆమె తలను తన చేతులతో చుట్టి, గుండెకు పొదువుకున్నాడు కొడుకు! 

"నాన్నలేకపోతే ఏంటమ్మా నేనున్నాను కదా నీకు! నేను అన్నీ చూసుకుంటాను !బెంగ పడకు!"... అంటూ మాటిచ్చాడు సురేంద్ర!

బంధుమిత్రులు, ఇరుగుపొరుగు లు ఎంత ముఖం చిట్లించినా.. తన తల్లి తన మంగళ చిహ్నాలను తీయడం లేదనిసుస్పష్టం చేశాడు!. ఎందుకో ఆమెకే మనసొప్పక మంగళసూత్రాలు, నల్లపూసలు, మట్టెలు తీసేసింది వర్ధని! 

తల్లిని దర్జాగా తీసుకువచ్చి తండ్రి కూర్చునే సోఫా లో కూర్చోబెట్టాడు సురేంద్ర!  వచ్చినవారు చేసేదిలేక కాస్త జీలకర్ర నోట్లోవేసుకుని , ఆమెను పలకరించి భోజనాలకు లేచారు! 

సురేంద్ర  అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ గా ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉన్నాడు. అతనితో పనులు చేయించుకున్న వారు, పనులు ఉన్నవారు , ఉపకారాలు పొందినవారు అతని దృష్టిలో పడడానికి...ఇదో ఒక మంచి అవకాశంగా భావించారు! బస్తాలతో కూరలు బుట్టల తో పళ్ళు డబ్బాలతో నేతి స్వీట్లు, మిఠాయిలు, కేన్ల కొద్దీ పాలు, పెరుగులు నెయ్యిలు, బస్తాలతో  బియ్యం, అపరాలు ఒక్కటేమిటి అవసరానికి మించి వంద రెట్లు తెచ్చిపడేసారు ఇంటినిండా! 

ఎవరేంటి తెచ్చినా కాదనలేదు సురేంద్ర! పరోక్షంగా అవి కొందరు అసహాయుల పోషణార్ధం పనికి వస్తాయనుకున్నాడు! 

దాన ధర్మాలు, బ్రాహ్మణ దక్షిణలు భూరిగా ఇచ్చుకుని.. నలుగురు ‘ఆహా’ అని అనుకునే లాగా పూర్తిచేశాడు పితృకార్యాన్ని సురేంద్ర! ఇంటి పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్ లో వెయ్యి మందికి పైగా సంతర్పణ భోజనం చేశారు! మరో వెయ్యిమందికి వండించి, శివార్లలో ఉన్న వృద్ధాశ్రమాలకు పంపించాడు సురేంద్ర! మిగిలిన  సామానులు...కొంత  విరాళం జోడించి..‌పిల్లలహోమ్  కు పంపేసాడు! 


రెండు రోజుల్లో  బంధువుల నిష్క్రమణతో ఇల్లు ఖాళీ అయిపోయింది! సెలవు అయిపోవడంతో కూతురు ఢిల్లీకి ప్రయాణం కట్టింది! వెళ్లేముందు పదేపదే తల్లి చుట్టూ తిరుగుతూ..." నాన్న నా గురించి ఏదైనా చెప్పారా ?    నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉందా అమ్మ.. " అంటూ అన్యాపదేశంగా ఏదో అడగాలని ప్రయత్నిస్తోంది! తల్లిని తనతో రమ్మని అడిగే ధైర్యం ఆమె చేయలేకపోతోంది! 
ఆ మహానగరంలో తల్లికి అదనపు సౌకర్యాలు కలగజేసే పరిస్థితులు ఆమెకు ప్రస్తుతం లేవు! పైగా కొండంత కొడుకు అండ వదిలి తల్లి తనతో వస్తుందన్న ఆశ కూడా , ఆమెకు లేదు! 

వర్ధనికి కూతురు ఆంతర్యం అర్థమయ్యింది! కోడల్ని పిలిచింది!           "స్వర్ణా!  లాకర్ లో ఉన్న నా బంగారాన్ని నువ్వు సగంతీసుకుని, మిగిలిన సగం మీ ఆడపడుచు కియ్యి".. ‌ అంటూ బ్యాంకు లాకరు తాళం కోడలు చేతిలో పెట్టింది!

"బంగారంలో సగమే  అంటే.. ఈ ఇంట్లో కూడా నాకు సగం ఇచ్చి తీరాలి".... అంటూ... మొహం గంటు పెట్టుకుంది కూతురుధరణి! 

వర్థని జవాబిచ్చే లోగానే, సురేంద్ర  అక్కడ ప్రత్యక్షమయ్యాడు! “స్వర్ణా! అమ్మ కు తాళం ఇచ్చేసేయ్!     ధరణి! అమ్మ ఇప్పుడుబంగారం పంచేసేది ఏమీ లేదు! అవన్నీ అమ్మకు కావాలి!     నాన్న పోవడంతో, అమ్మ జీవితమేమీ ముగిసిపోలేదు!  ముందు ముందు... తన చేతుల మీద జరగాల్సిన శుభకార్యాలు ఉన్నాయి! ఈ ఇల్లు కానీ, ఈ నగలు కానీ అమ్మ   తనచివరి క్షణం వరకు అనుభవించి ..తన తదనంతరం ఆమె కోరుకున్న వారికి ఇచ్చే హక్కు... పూర్తిగా తనదే! ఢిల్లీలో నీ ఫ్లాట్ కోసం పదేళ్ల క్రితమే డబ్బు తీసుకున్నావు! ప్రస్తుతం అమ్మకు మిగిలి ఉన్న ఈ కాస్త ఆస్తి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకు! ఇంటి ఆడపిల్లగా నీకు న్యాయమే చేస్తాం! నీ పుట్టింటి మీద నీకున్న హక్కులన్నీ అలాగే భద్రంగా ఉంటాయి! ఆనందంగావస్తూ పోతూ... పసుపు కుంకుమలు తీసుకుని వెళ్ళు! అమ్మని మాత్రం బాధ పెట్టొద్దు ఏవిధంగాను!" కాస్త గట్టిగాచెప్పాడు సురేంద్ర! 

పక్క గదిలో పెట్టెలు సర్దుకుంటున్న అల్లుడికి ఈ మాటలన్నీ వినిపిస్తూనే ఉన్నాయి! వచ్చినప్పటి నుండి చూస్తున్నాడు. సురేంద్ర ఎంత శ్రద్ధగా పితృకార్యం చేసాడో, ఎంత ఆత్మీయంగా తల్లినీ, ఇతర బంధువులనూ ఆదరిస్తున్నాడో! తల్లి పట్ల సురేంద్ర చూపిస్తున్న ప్రేమ... తన నిబద్ధతను నిలదీసినట్టు గా అనిపించింది అల్లుడికి! 

ఉద్యోగంలోనూ, హోదా లోను, ఆస్తి లోనూ సురేంద్ర కు ఏ మాత్రం తక్కువ కాదు తను! కానీ తండ్రి పోయినపుడు అపరకర్మలన్నీ “మమ” అనిపించి, గయలో పిండం పెట్టి చేతులు దులుపుకున్నాడు!  ఒక్కగానొక్క కొడుకు గా తన తల్లినిఆదరించక పోగా, అన్ని వసతులు ఉన్న రిటైర్మెంట్ హోమ్ లో పెట్టి తన బాధ్యత తీరింది అనుకుంటున్నాడు!     భార్య చేతిలో తోలు బొమ్మలా ఆడుతూ తల్లిని దూరం చేసుకున్నాడు తను! 

ఈరోజు సురేంద్ర మాటలు వింటుంటే, అతనిలో..మాతృ వాత్సల్యం నిద్ర లేచింది ! ఏదో దిశానిర్దేశం జరిగినట్లు అనిపించింది! 

దిగ్గున లేచి పక్క గదిలోకి వెళ్ళాడు! సురేంద్ర భుజంమీద స్నేహంగా చేతితో తట్టి, ”సురేంద్ర నువ్వు చెప్పింది అక్షరాలనిజం ! నీ లాంటి కొడుకు ఉంటే ఏ తల్లి అయినా భర్త లేకపోయినా నిబ్బరంగా గుండెల మీద చెయ్యి వేసుకునిబ్రతకగలదు! చెప్పాలంటే ధరణికి ఏమి లోటు లేదు! ఇలా తండ్రి పోయిన వెంటనే పుట్టింట్లో తన హక్కులను సాధించుకోవడం అంత మంచి పని కాదు!  తన తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను! అత్తయ్య గారు!  మీరు ఎలాంటిబెంగ పెట్టుకోకుండా హాయిగా ఆరోగ్యంగా ఉండండి !మేము ప్రతి రోజు మీతో మాట్లాడుతూ ఉంటాం! ఏ అవసరం వచ్చినా, ధరణి మీకు సహాయంగా వస్తుంది! ఇది నా మాటగా తీసుకోండి!".. ‌‌ మనసు నిండుగా, ఆదరంగా మాట్లాడిన అల్లుడినిచూసి చాలా నిశ్చింతగా అనిపించింది వర్ధనికి! 

మర్నాటి కల్లా ధరణి వెళ్ళిపోయింది! తల్లికి... తమ ఇంట్లో ..గాలి , వెలుతురు ధారాళంగా వచ్చేటటువంటి మంచిగదిని అన్ని సౌకర్యాలతో... తయారుగా ఉంచమని ...స్వర్ణను, పిల్లలను ఇంటికి పంపేసాడు సురేంద్ర! తల్లి కొడుకుల మాత్రమేమిగిలారు ఆఇంట్లో! ఆ రాత్రంతా తండ్రి స్మృతులను  తల్లి తో వల్లె వేశాడు సురేంద్ర! మౌన శ్రోతగా అన్నీ వింటూకూర్చుంది వర్ధని! ఆ స్మృతులలో వీలయినన్ని మంచివే ఏరి మాట్లాడుతూ ఎన్నో చేదుజ్ఞాపకాల ప్రసక్తే తేని కొడుకు సంస్కారానికి ముగ్దురాలయింది ఆమె! 

 ఆమె మరో ప్రస్థానంలో మొదటి ఉషోదయం అయ్యింది! ఆరింటికి తల్లి ఇచ్చిన కాఫీ తాగి.. "అమ్మా! కావలసినవన్నీ సర్దేసు కొన్నావు కదా! మరో గంటలో బయలుదేరాలిమనం!  ఈరోజు నేను ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆఫీస్ లో జాయిన్ అవ్వాల్సి ఉంది! "... అన్నాడు సురేంద్ర! 

కొన్ని క్షణాల మౌనం తరువాత...." నేను కొన్నాళ్ళు ఇక్కడే , మన ఇంట్లో ఉందామని అనుకుంటున్నానురా!  ఇల్లుపాడుపెట్టడం నాకు ఇష్టం లేదు"... తడబడుతూ చెప్పింది వర్ధని కొడుకుతో! 

"ఇల్లేమీ పాడవదు అమ్మా! పని వాళ్ళని పంపి బాగు చేయిస్తూ ఉంటాను! నువ్వు ఒక్కతివే ఒంటరిగా ఇక్కడ ఉండలేవు !నాన్న జ్ఞాపకాలు నిన్ను వదలవు! నువ్వు మాతో ఉండడమే సరి ! నాకు కూడా చాలా నిశ్చింతగా ఉంటుంది!" అన్నాడు సురేంద్ర! 

"లేదు నాన్నా.. నన్ను అర్థం చేసుకో! నేను ఉండగలను! కొత్తమార్పులను వెంటనే తీసుకోలేను! నాకు కొంచెం సమయంకావాలి! ప్లీజ్!".... అంటూ బేలగా అభ్యర్ధించింది కొడుకును! 

బేలగా అన్నా... తల్లి మాటల్లోని దృఢత్వాన్ని గుర్తించాడు అతను! తన మాటలతో ఆమె నిర్ణయం వీగిపోదని అర్థంఅయింది! ఎక్కువ రెట్టించకుండా
"సరే అమ్మా! నీ ఇష్టం! ఏ అవసరం ఉన్నా క్షణాల్లోనే నీ ముందుంటా!” అని, తల్లికిమాటిచ్చి సురేంద్ర కూడా వెళ్ళిపోయాడు! 

  ఇల్లు ఇప్పుడు పూర్తిగా ఖాళీ అయిపోయింది! పెద్దగా దిగులు అనిపించలేదు వర్ధనికి! తోటలోకి వెళ్ళింది. అడ్డదిడ్డంగాపెరిగి, వ్యాపించిపోయిన కొమ్మలతో... 
రకరకాల మందారాలూ, నిత్యమల్లిచెట్లు, వందేళ్ళనాటి ఫలసాయంలేని చెట్లు... తోటంతా నీడలు పరుస్తూ! ఆ చెట్ల వలన ఇరుగుపొరుగులతో శాశ్వత శతృత్వాలు! అయినా మారని భర్త మొండివైఖరి తలుచుకుని భారంగా నిశ్వసించింది వర్ధని. 

ఎంత విచిత్రమయిన మనిషో ఆయన. తా పట్టిన కుందేటికి మూడేకాళ్ళు అనే వ్యవహారం! పురాతనమయిన భావాలూ, ఆచారాలు! పొదుపు పేరిట అతికూడిక... ఇంటి ఆడపడుచులకు కూడా పూచికపుల్ల ఇవ్వనంత! అత్తగారి ఇత్తడి సామాన్లు, రాచ్చిప్పల్లో వంట. పెళ్ళయిన ఇరవై యేళ్ళకు వరకూ కుంపటి వంటే! ఆరోగ్యం పేరు చెప్పి పత్యపు తిండి. నెలకు కేజీ నూనె వాడకం కూడా ఎక్కువే! తన పుట్టిల్లు మధ్యతరగతయినా... సుష్టుగా అన్ని ఆధరువులతో భోంచేసేభోజనప్రియులు! “

“కొడుకు చేతికందే వరకూ ..ఏడాదికి మూడుచీరలే! పోనీ లేదా పోదా అంటే.. ఎగువమధ్యతరగతి నేపధ్యం. మంచిజీతమొచ్చే ప్రభుత్వ ఉద్యోగం! తన అభిప్రాయాలసాధనలో ఒకరకమైన నిరంకుశత్వం ఆయనది! తనకంటూ బంధువులూ, స్నేహబాంధవ్యాలూ నెరిపే అవకాశం ఇవ్వకుండా... ఇంటిని పుస్తిని చేసిన మహానుభావుడు ఆయన!”

“మెరిట్ లో మెడిసిన్ లో సీట్ తెచ్చుకున్న సురేంద్రను , డాక్టర్ అవ్వడానికి పదేళ్ళు పడుతుందని, మెడిసిన్ చెయ్యనివ్వకుండా, బలవంతంగా 
బీ. ఫార్మసీ లో పెట్టారు. ఇరవై యేళ్ళకే ఇంట్లోంచి బయటకెళ్ళిపోయి, స్కాలర్ షిప్స్, పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ, తండ్రి నుండి ఆర్ధికసహాయం ఆశించకుండా ఎంతో పైకి వచ్చాడు కొడుకు. తండ్రి దూరంచేసుకున్న బాంధవ్యాలను తన ఆత్మీయతతో దగ్గర చేసుకున్నాడు. తను జీవితంలో ఎదుగుతూ, ఎందరికో చదువులకూ, ఉద్యోగాలకూ చేయూతనిచ్చాడు. “

“చెప్పాలంటే కొడుకుని చూసే ఇప్పుడు తమను బంధువులు గౌరవించే స్థాయికి , నైతికంగా , సామాజికంగా ఎదిగాడుసురేంద్ర! కూతుర్ని నెత్తిమీద దేవతలా చూస్తూ, ఆడింది ఆట పాడింది పాటగా సాగించి,  కొడుకును మాత్రం ఆంక్షల సంకెళ్ళతో అనుక్షణం క్రమశిక్షణ పేరిట దండిస్తూ, అవమానిస్తూ ఉన్న తండ్రికి ఎప్పుడూ గౌరవం తక్కువ చెయ్యలేదు ! తండ్రి మూర్ఖత్వం, నిరంకుశత్వం వలన తను ఎన్నో కోల్పోయినా, ఒక్కరోజూ తండ్రిని ద్వేషించలేదు!      ఆయన ఇన్నేళ్ళకు కళ్ళుతెరిచి, వాడి మంచితనం అర్ధమయ్యి, కాస్త మృదుత్వం అలవాటుచేసుకుని, కొడుకుతో అనుబంధం పెంచుకునేసమయానికి ... మనిషే లేకుండా పోయారు! “....వర్ధని ఇలాంటి ఆలోచనలతోనే రోజులు గడిపేస్తోంది. 

“ఇప్పుడు తనకు కావలసినది వండుకునే స్వేచ్ఛ ఉంది. కానీ తినడానికి మనసే లేదు. ఎక్కడికయినా వెళ్ళే స్వతంత్రంఉంది. కానీ ఎక్కడికెళ్ళాలో తెలీదు. “ఎంత పరాధీన తను! “.... వేము తిన్నంత చేదు ఆమె మనసులో! వారం కన్నాఎక్కువ ఉండలేకపోయింది ఆ ఇంట్లో ఒంటరిగా! దానికి పరిష్కారమూ సురేంద్రే చేసాడు. 

మంచి ప్రణాళికతో... అన్ని ఏర్పాట్లూ చేసి, వర్ధనినీ, తమతోనే వుండే అత్తగారినీ, ధరణి అత్తగారినీ, ఇద్దరు మేనత్తలనూ కాశీ, ప్రయాగ, చార్ ధామ్, వైష్ణోదేవి యాత్రలకు పంపించే ఏర్పాటుచేసాడు! 

 భర్త పోయి నెలరోజులవ్వక మునుపే యాత్రలంటే లోకం నవ్వుతుందని... వర్ధని ససేమిరా అనేసింది. సురేంద్ర తల్లితోఒకటే అన్నాడు! “అమ్మా! జీవితం చాలా చిన్నది. ఇప్పటికే అరవైయేళ్ళు అసఫలంగా, పంజరంలో చిలుకలా గడిపేసావు. ఇక నుంచి  ప్రతిక్షణం, నువ్వు కోల్పోయిన కాలాన్ని వెనక్కు తెచ్చుకోవాలి! చేద్దామనుకున్నవీ, చూద్దామనుకున్నవీ మొదలుపెట్టాలి! నీకు నేనున్నానమ్మా! జీవితం మళ్ళీ మొదలుపెట్టు!! వెళ్ళిపోయిన వారి గురించి వగస్తూ కూర్చుని లాభంలేదు” అంటూ తల్లికి ధైర్యం చెప్పాడు! 

వర్ధనికి తన జీవితంలో రెండవ అధ్యాయంమొదలయ్యింది! 

 రెండునెలల యాత్రలు, మరో రెండునెలలు ధరణి దగ్గర గడిపాకా.... సంతృప్తి చెందిన మనసు, మొట్టమొదటిసారి లోకాన్ని చూసిన ఆనందం, తన చుట్టూ ఇంత నాగరికత ఉందా అన్న విభ్రమంతో తిరిగివచ్చింది వర్ధని. 

ఇల్లు బాగుచేయిస్తున్నానని, తల్లిని తమింట్లోనే పెట్టాడు సురేంద్ర! స్వర్ణతల్లి విద్యావంతురాలు, మంచి క్రియాశీలకురాలు. వర్ధనికి ఓపిగ్గా వివరిస్తూ...ఫోన్ లో ఫేస్ బుక్, వాట్సప్ పరిచయం చేసింది. ఎందరో పరోక్ష మిత్రబృందాలతో, సాహితీసౌరభాలతో వెలుగులీనే ఫేస్ బుక్ వర్ధనికి చక్కని కాలక్షేపంగా మారింది. 
కొడుకు సేకరించిన ఎన్నో అపురూపమైన పుస్తకాల నిధి మరో పెన్నిధి అయ్యింది ఆమెకు. భర్త తనలో పెంచి, పోషించిన నిర్లిప్తత, నిరాశ, విరక్తి.... మెల్లమెల్లగా కరిగిపోతున్నాయి! జీవితం నవనవోన్మేషంగా మారుతోంది. పిల్లలూ, పువ్వులూ, పుస్తకాలూ, పరిసరాలూ ఎన్నోనేర్పుతున్నారు! 

తండ్రి సంవత్సరీకాలు కూడా ఎంతో శ్రద్ధగా పూర్తిచేసాడు సురేంద్ర! మాఘమాసం రాగానే, “రా అమ్మా! నీ ఇల్లుచూసుకుందువు గాని”... అంటూ వర్ధనిని బయలుదేరదీసాడు! ఆ వీధిలో బీటలువేసిన , నాచుపట్టిన గోడల్లోంచి రావిచెట్లు తొంగిచూస్తూ, అడవిలాంటి తోటతో , దిష్టిబొమ్మలా ఉండే తమ ఇల్లు- ఎంతో అందంగా, అధునాతనంగా, విశాలంగా తయారయ్యి ఉండడం చూసి, ఆమె సంభ్రమమొందింది. ముందుగా ఆమెను ఆకర్షించినది నందన వనంలాంటి తోట. 

“అయ్యో! మామిడిచెట్టు, చింతచెట్టు ఏవిరా?”.... అంది కొడుకుతో! “అమ్మా! నేను కొన్నిరోజులు వాటితో మాట్లాడానమ్మా. మీరు పెద్దవారయిపోయారు. మీవలన ఈ స్వార్ధపూరిత అనాగరికులకు ఇబ్బందిగా ఉంది. మీ అనుమతితో మిమ్మల్ని తొలిగించవచ్చా! మీ కొమ్మలకు అంట్లు కట్టించి... నా తోటలో మీ వంశాన్ని కొనసాగిస్తా!”.... అంటూ వాటిని ప్రార్ధించేవాడినమ్మా! నమ్మూ, నమ్మకపో.... అవి రెండునెలల్లో వృద్ధాప్యం వచ్చినట్టు పూర్తిగా వడలిపోయి, మోడులయ్యాయి! అప్పుడే వాటిని కొట్టించి, ఆ కలపంతా మనింటికే వాడాను.“ అన్నాడు సురేంద్ర! 
వర్ధనికి ఏమీఆశ్చర్యం అనిపించలేదు. కొడుకు అచ్చం తన పోలికే! కష్టమొచ్చినపుడు ఆ మాకులతోనే పంచుకునేది. అవి కూడా విన్నట్టేఉండేవి! 

 క్రింద మూడు, పైన మూడు అత్యంత సౌకర్యకరమైన పడకగదులు వేయించాడు. లేలేత భానుకిరణాలు పడుతుంటే ధ్యానం చేసుకోవడానికి అనువుగా చక్కని సన్ రూమ్ , తను కోరుకునే విధంగా.. విశాలమయిన పూజామందిరం, అందమైన తంజావూరు దేవతామూర్తుల పటాలతో మనోజ్ఞంగా చేయించాడు! అన్నిటికన్నా మిన్న వంటగది! మొత్తం అధునాతనంగా, సౌకర్యంగా! ఆనుకున్న పాంట్రీలో.... అన్ని వరుసల్లో... రకరకాల సైజుల్లో... అమర్చినస్టీలుడబ్బాలను, గాజుసీసాలను చూసి... వర్ధని కళ్ళలో మెరుపు, పెదాల మీద చిన్నచిరునవ్వు మెలిచాయి! ఇవన్నీ భర్తహయాంలో తన తీరని కోరికలు! సరుకులన్నీ చిన్నచిన్న పొట్లాలు కట్టించి, చెక్కబీరువాలో   పెట్టించి తాళం వేసే వారాయన- తను దానధర్మాలు, దుబారా చేస్తుందని! 

“నా కొడుక్కు అన్నీ తెలుసు తన గురించి! తన మనసులోని ప్రతి భావన, స్పందన, కోరిక, ఉద్వేగం...సమస్తం ఎరుకే ఈ పిల్లవాడికి!”... అనుకుంటూ 
ఆ అమ్మమనసు పుత్రవాత్సల్యంతో ఉప్పొంగిపోయింది! 

 ఒక మంచిరోజు తల్లిని యజమానురాలి హోదాలో... గౌరవంగా ...తమజంటతో సమానంగా,పీటలమీదకూర్చుండపెట్టి గృహప్రవేశం చేయించాడు సురేంద్ర! తండ్రి తదనంతర ఆస్థులన్నీ తల్లి పేరిటకు మార్పించాడు! వర్ధని, స్వర్ణ తల్లితో పాటూ... ధరణి అత్తగారు కూడా ఆ ఇంటికే మారిపోయారు! ఇంట్లో పనులకు, వంటకు హెల్పర్స్ ను పెట్టాడు. వారికి సౌకర్యవంతంగా ఉండే విశాలమైన కారు కొని, డ్రయివర్ తో సహా, గుమ్మంలో పెట్టాడు! మేడమీద కు స్వర్ణా, పిల్లలతో... దిగిపోయాడు! 

 గృహప్రవేశం నాడు మేనత్తలు ముగ్గురినీ పిలిచి, వారు గతంలో అన్నగారిని అడిగి, భంగపడ్డ తమ తల్లిగారిబంగారం, మూడెకరాల భూమిపత్రాలు వారి చేతిలో పెట్టి,...” అత్తా! ఇది మీ అందరి ఇల్లూ కూడా! మీకు కావలసినన్నిరోజులు ఇక్కడకు వచ్చి విశ్రాంతి తీసుకోండి. మీకు ఏ అవసరానికయినా ఈ మేనల్లుడు ఉన్నాడని మర్చిపోకండి!”.... అంటూ ఆప్యాయంగా చెప్తుంటే.... వాళ్ళు కన్నీటితో...పరమానందభరితులయ్యారు! 

“వదినా! నీ కడుపున రాములవారే పుట్టారు వీడి రూపాన! మా అన్నయ్యకు ఈ పుత్రోత్సాహం చూసే యోగం లేదు. వీడిని రాముడని ఎందుకు అన్నామంటే, ఒకవేళ దశరధుడు , కౌసల్య తన తోనే ఉండివుంటే.. సంపద ఉన్నా, లేకపోయినా... అయోధ్యలో నయినా , అడవిలోనయినా రాములవారు తల్లితండ్రులను ... అదే ప్రేమతో, వైభవంతో, అక్కరతో... లోటనేది రానీయకుండా చూసుకుని వుండేవారు నీ కొడుకులా!”...అంటూ... ఆ కన్నతల్లి కడుపు సంతోషంతో నింపేసారు! 

 ఆ విధంగా తల్లికి స్వయంప్రతిపత్తిని కల్పించి, సాధికారంగా, స్వతంత్రంగా, స్వేచ్ఛగా బ్రతకడానికి మార్గం సుగమం చేసిపెట్టాడు సురేంద్ర! తల్లి మనసులో తండ్రిచేసిన ప్రతి అవమానాన్ని, ప్రతి గాయాన్ని తన బాధగా అనుభవించాడు అతను ఇన్నాళ్ళూ! తనకు శక్తి ఉన్నా... కొడుకు స్వార్జితంతో పూచికపుల్ల కూడా ముట్టననే తండ్రిఅసహనంతో, విచిత్ర వైఖరితో సర్దుకుంటూ...అతను పడ్డ మనక్షోభ ఇన్నాళ్ళకు ఉపశమించింది. ఆయనకు సజీవంగా ఏమీ చెయ్యలేకపోయినా, ఆయన మరణానంతరం ఆయన పేరిట పేదవిద్యార్ధులకు స్కాలర్ షిప్, వృద్ధాశ్రమాలకు విరాళాలరూపంలో ఇస్తూ... పితృూణం తీర్చుకుంటున్నాడు! 

ఇది మలుపులున్న కధ కాదు! కానీ ఆదర్శవంతుడైన ఒక కొడుకు కధ! ఎందరో స్ఫూర్తిగా తీసుకోవలసిన ఒకనీతికథ! తల్లిదండ్రులు, సమాజం నాకేమిచ్చిందని... ప్రశ్నించకుండా... ‘వీరికి  నేనేమి చెయ్యగలను’... అని ఆలోచిస్తూ , బాధ్యతలు సక్రమంగా, సంతోషంగా నిర్వహిస్తూ, కార్యాచరణలో పెట్టే క్రియాశీలి కధ! 

పుత్రోత్సాహము తండ్రికీ
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని బొగడగా
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!              
 *ధ‌నం మూలమిదం జ‌గ‌త్?*
                 
```
డ‌బ్బు నేటి ప్ర‌పంచాన్ని శాసిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాని అది ఉన్న ప్ర‌తిఒక్క‌రూ ప్ర‌శాంతంగా జీవిస్తున్నారా అంటే.. అయ్యుండొచ్చు అనిపిస్తుంది.

కౌటిల్యుడు(చాణక్యుడు) త‌న అర్థ శాస్త్రంలో ‘ధ‌నం మూలం ఇదం జ‌గ‌త్’ అనే మాట‌ను వినియోగించారు. కాని దాని అర్థం నేడు మ‌నం ఉప‌యోగిస్తున్న ప్రామిస‌రీనోట్లు(డబ్బు) కాదు.

ఒక‌ప్పుడు ధ‌నం అంటే బంగారం, వెండి, వ‌జ్రవైఢూర్యాలు. నేటికి స్టాక్ మార్కెట్లో వాటిదే రాజ్యం. ఎందుకంటే అవి శాశ్వతంగా నిలిచి ఉండేవి.

కానీ ప్రామిసరీ నోట్లు కాలిస్తే బూడిదవుతాయి. తడిస్తే ముద్ద అవుతాయి. ఏదో ఒకరోజు కనుమరుగు అవుతాయి.

కౌటిల్యుడి ఉద్దేశం ప్రపంచమంతటా వ్యవస్థ నడవడానికి ధనం కావాలి. ఆ ధనమే బంగారం. ఏ దేశంలో ఎంత ఎక్కువ బంగారం ఉంటే ఆ దేశం అంత ధనిక దేశం.

బంగారానికి అనుగుణంగా ప్రామిసరీ నోట్లను ప్రచురిస్తారు. ఇది ఆర్థికవేత్తలు చెప్పే మాట. సాధారణ ప్రజలకు అవగాహన తక్కువే ఉంటుంది.
బంగారం విలువ ఎన్నటికీ తరగనిది. పెరగడమే తప్ప తగ్గడం తెలియదు.

అలా అని మనం బంగారం తినలేము. వ్యవసాయమే ఆధారం. ఆ వ్యవసాయం వ్యాపారం అయ్యిందనేది బాధాకరమైన విషయం.

కానీ ఆ బంగారం కారణంగా మన దగ్గర ప్రామీసరి నోట్లు(డబ్బు) నేడు వ్యవసాయాన్ని శాసిస్తున్నాయి. ఆహార పంటల నుంచి వాణిజ్య పంటల వరకు డబ్బే అవసరమవుతుంది.
అంటే డబ్బు అవసరంగా మారింది. అది కాదనలేని విషయం. డబ్బు కావాలి. ఎలాంటి డబ్బు కావాలి అనే దానికి కూడా మన పెద్దలు స్పష్టమైన సూచనలు చేశారు.

మనం చూస్తూనే ఉన్నాం అన్యాయంగా ఎంత సంపాదించినా హాస్పిటళ్లకు తిరిగేవారు ఎక్కువ. న్యాయంగా నాలుగు రాళ్లు వెనకేసుకున్నవాడు ఆరోగ్యంగా ఉంటున్నాడు.

ఒక్కసారి డబ్బును సంపాదిస్తే డబ్బే డబ్బును సంపాదిస్తుందనే మాటలు ఏదో సినిమాలో చెప్పారు. కానీ మనం అన్యాయంగా సంపాదించే డబ్బు మనకు ప్రశాంతతను దూరం చేస్తుందని మరువద్దు.

భారతీయులు ఎంత సంపాదించినా దానధర్మాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దైవ చింతనకే వినియోగిస్తారు. అందుకే మన పూర్వీకులు ఆనందంగా ఉండేవారు.

కానీ ‘ధనం మూలం ఇదం జగత్’ అనే మాటను మనలో చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. డబ్బుంటేనే అన్ని అనే విధంగా భావిస్తున్నారు.

డబ్బు అవసరం నుంచి వ్యసనంగా మారుతోంది. బంధాలు, బంధుత్వాలు, బాంధవ్యాలు, స్నేహం, కుటుంబం అన్ని డబ్బు ఆధారంగానే సాగుతున్నాయి.
ప్రజల్లో స్వార్థం వెర్రి తలలు వేస్తోంది. అది సమాజ విచ్ఛిన్నం, వినాశనం వైపు వడివడిగా తీసుకెళ్తోంది.
వ్యక్తిత్వానికి, నైతికతకు, నిజాయితీకి, ఆత్మగౌరవానికి కాలం కాకుండా అవుతుంది.
అనైతిక విధానాల్లో సంపాదన కారణంగా.. అర్థాంతరంగా లేదా అనారోగ్యంతో ముగుస్తున్న జీవితాలు ఎక్కువ అవుతున్నాయి.

దారి తప్పిన సంపాదన విధానం డబ్బుతో పాటు కొత్త సమస్యలను తీసుకొస్తుంది.
కాబట్టి డబ్బు సంపాదించాలి.. కానీ ధర్మబద్ధంగా సంపాదించాలి.

సమాజం నుంచి మనం పొందిన దానిలో కొంత అదే సమాజహితానికి కేటాయించాలి.

మన పూర్వీకుల బాటలో మనం కూడా నడవాలి. న్యాయంగా సంపాదించిన సొమ్ము ద్వారా చేసే సేవ ఇతరులకు కూడా మేలు చేస్తుందని గుర్తుంచుకోవాలి.

కష్టే ఫలి అని చెప్పిన పెద్దల మాటలను నెమరువేసుకుంటూ డబ్బు అనే అవసరాన్ని నిజాయితీగా తీర్చుకోవాలి. ‘శ్రమయేవ జయతే’ అనుకుంటూ ధనాన్ని పోగు చేసుకోవాలి.
ఆధ్యాత్మిక చింతనతో జీవితాన్ని ఆనందంగా గడపాలి.```.        
 *భగవద్… వాసనలు:*
                

*వేదాంత పరిభాషలో వాసనలు మూడు రకాలు. దేహ వాసన, లోక వాసన, శాస్త్ర వాసన. అసలీ వాసన అంటే ఏమిటో, అది ఎలా వస్తుందో తెలుసుకుందాం.*

*శరీరం ధరించిన ప్రతివాడికీ ఆ శరీరం ఉన్నంతవరకు ఏదో ఒక పని చేస్తూ ఉండక తప్పదు. కానీ గరిటతో కలపవలసిన సాంబారు చేత్తో కలిపితే ఆ చేతికి వాసన అంటుకున్నట్టు, శరీరంతో చేయవలసిన పనులకు మనస్సును జత చేస్తే మనస్సుకు ఆ వాసన అంటుకుంటుంది.*

*శరీరానికి ఆకలి వేసిందనుకోండి, తినగలిగిన పదార్ధం అప్పటికి ఏది దొరికితే అది లోపల వేస్తే ఆ ఆకలి తీరిపోతుంది. కానీ ఆ సమయానికి మనం ఏ శరవణ భవన్    కో వెళ్ళామనుకోండి, శరీరం ఆకలి తీరటంతోపాటు అక్కడ వంటకాలు బాగుంటాయి అనే ఒక గుర్తు మనస్సులో నాటుకుపోతుంది….అదే వాసన!* 

*అయితే మీరు మనస్సు పెట్టి తినకపోతే ఈ వాసన అంటదు. నిజానికి ఆకలి వేయటం, ఆహారం తినటం, కడుపు నిండటం ఇవన్నీ కేవలం దేహానికి సంబంధించిన విషయాలు.* 

*కేవలం ఒక దేహ క్రియగా ఉండవలసినదానికి మనసు చేర్చటంతో అది వాసనగా అంటుకొని చివరికి కర్మగా మారుతుంది.*

*ఇక దేహ వాసన అంటే ఈ దేహం నేను అనే నిశ్చితమైన నమ్మకం. అది ఈ దేహానికి పెట్టుకున్న పేరుపై కూడా అంతే గాఢంగా ఉంటుంది. నా పేరు ప్రసాదు అనుకోండి, పిలిచేది నన్నే అని తెలిసినా ప్రసాదరావు అంటే పలకను. పేరు కేవలం దేహానిదే అయినా, అది కేవలం సౌలభ్యం కోసం పెట్టుకునన్నదే అయినా, మహాత్ముల సన్నిధిలో కూడా దాని మీద అభిమానాన్ని వదులుకోలేము.*

*శాస్త్ర వాసన అంటే మనం చదువుకున్న పుస్తకాలలో, విన్న విషయాలలో ఉన్న విజ్ఞానమే సర్వస్వం అని బలంగా విశ్వసించటం. పరిమితమైన మానవ జీవితకాలంలో పరిపూర్ణ విజ్ఞానాన్ని కేవలం చదువుద్వారా పొందటం ఎవరికీ సాధ్యం కాదు. కేవలం తనను తాను తెలుసుకొన్న బ్రహ్మజ్ఞానికే సర్వం తెలియబడుతుంది. కానీ మనం మనకున్న పరిమిత జ్ఞానంతోనే అనంతుడైన భగవంతుణ్ణి, ఆయన ప్రతిరూపాలైన అవతార పురుషుల్ని, మహాత్ముల్ని అంచనా వేయాలని చూస్తాం. మనకు తెలిసిన గుప్పెడు ధర్మ సూత్రాలతో ధర్మాధిష్టానమైన పరమాత్మనే అంచనా వేస్తూ రాముడు అలా ఎందుకు చేసాడు? కృష్ణుడు ఇలా ఎందుకు చేసాడు? అని వాదిస్తాం. అనంత విశ్వంలో అతి చిన్న భాగమైన మన సమాజపు కట్టుబాట్లతో అనంతుడైన భగవంతుణ్ణి బంధించాలని చూస్తాం. మనమీద కరుణించి ఆ భగవంతుడే ఏ కుక్క రూపంలోనో ప్రత్యక్షమైతే శాస్త్రాలలో చెప్పిన ఆకారంలో రాలేదని గుర్తించటానికి నిరాకరిస్తాం. తులసీదాసు అంతటి మహాభక్తుడికే ఈ పరిస్థితి తప్పలేదు.*

*ఇక లోక వాసన - ఈ లోకంలో ఎన్నో ఏళ్లుగా ఉంటూ కొన్ని అభిప్రాయాలూ అలవాట్లూ ముందే ఏర్పరుచుకొని ప్రతిదానిని ఆ కోణంలోనే చూస్తాం. ఒక వ్యక్తి మనకు ఏదో మంచో చెడో చేస్తే, అలాంటి వేషభాషలు, ఆ కులం, ఆ మతం, ఆ జాతికి సంబంధించిన వారందరికీ, వాళ్ళెవరో మనకు తెలియకపోయినా, అవే గుణాలు అంటగడతాం. సిగరెట్టు కోసం పరాయి వాళ్ళని అగ్గిపెట్టె అడగడానికి కూడా సిగ్గుపడం కానీ ఏ ఆశ్రమనికో సత్సంగానికో వెళ్ళాలంటే నలుగురూ ఏమనుకుంటారో అని సిగ్గుపడతాం.*

*మన కంటికి కనపడకుండా ఎక్కడో గోడవతల ఉన్న పువ్వు వాసన కూడా మనదాకా చేరినట్లు, ఈ వాసనలు మనను జన్మజన్మలదాకా వెంటాడుతూనే ఉంటాయి.* 

*సాధనద్వారా మన మనస్సు ప్రక్షాళన చేసుకొనేదాకా ఈ వాసనలు తప్పవు.*.        
 తన భక్తుల కొరకు భగవంతుడైన శ్రీకృష్ణుడు చేయు పనులు విచిత్రములై వింత గొలుపుచుండును. 

పాండవులు తన పాదములు నమ్మిన భక్తులు. వారు బాధలు పడుచుండగా రక్షించుటకై వారి దూతగా బయలుదేరి వెళ్ళెను. 

అప్పుడు పాండవుల విరోధులైన కౌరవులు కృష్ణుని పట్టి బంధించుటకు సన్నాహము చూపిరి.  

కృష్ణుడు వారిని ఎదుర్కొనలేదు‌. ఎదుర్కొని నశింపజేయలేని బలహీనుడు కాడు. అసమర్థుడు కాడు. వారిని జయించు సంకల్పము లేకకాదు. 

ఆ సభలో శస్త్రాస్త్ర విద్యలలో గొప్పవారు, గొప్పవంశములలో పుట్టినవారు మొదలుకొని పలు విధములుగా గర్వపడుచు, అభిమానము పెంచుకున్న వీరులెందరో కలరు. వారు తలకొక విధముగా సజ్జనులను బాధపెట్టుచున్నారు. 

వారందరును సైన్యములతో గూడ ఒక్కమారు చనిపోయినచో భూభారము తగ్గును.  

అట్లు జరుగుటకు యుద్ధము సంభవింపవలెను. 

దాని కొరకై సమయము కోసం వేచి ఉన్నవాడు కనుక కృష్ణుడు కౌరవులు పలుకు దుర్భాషలకు కోపింపక,  అమసర్థుని వలె ప్రవర్తించెను.

శక్తిమంతులు సమయంకోసం ఎదురు చూచుట వారి సమర్ధతేకాని వారి అసమర్ధత కాదు.
శ్రీమద్భాగవతము. 3-71.
      🪷🦚🌼              

*అఖండశక్తితో మహోన్నతంగా స్థిరంగా నిలబడాలి.*

*పరిస్థితులు అనుకూలంగా ఉంటే అందరూ మంచిగానే ప్రవర్తిస్తారు. కానీ ఏదైనా వ్యతిరేకత ఎదురైనపుడు కూడా మనిషి ధైర్యంగా నెట్టుకు రాగలిగితేనే విజేతగా నిలుస్తాడు.*

*ఆపద కలిగినపుడు దాని నుండి పారిపోయి మరియొక సమస్య తెచ్చుకోవడం సరియైనది కాదు. భగవంతుని మార్గదర్శనం చేయమని నిజాయితీగా ప్రార్థించాలి.*

*మనం ఆ శ్రీమన్నారాయణునితో ఎంతగా సంబంధాన్ని ఏర్పరచుకుంటే అంతగా శక్తిశాలురం అవుతాము. ఇంక అప్పుడు ఏ బలహీనతలూ మనల్ని బాధించలేవు.*. 
 🍁ఆప్తవాక్యాలు  🍁

4):మధుమతీం వాచముదీయమ్ 

మధురమైన మాటలను పలకాలి(అథర్వణవేదం)

వాక్కు మన హృదయాన్ని, సంస్కారాన్నీ ప్రతిఫలింపజేసేది. అది 'మధురంగా’
ఉండాలని వేదం చెప్తోంది.

అంటే తీయగా మాట్లాడితే చాలు అని అర్థం చెప్పుకోవడం సరిపోదు. మనస్సులో
చెడు తలపుల్ని దాచుకొని, పలుకులు మాత్రం కమ్మగా ఉంటే అది 'మధుర' వాక్కు
కాదు.

మనస్సులోని మధుర భావాలను(సత్ భావాలను) మాటలో ప్రతిఫలింపజేయడమే ‘మధురంగా మాట్లాడడం'. సత్యం, ప్రియం, హితం - ఇవే మాధుర్యాలు. ఈ మాధుర్యాలు మన మాటల్లో ధ్వనించాలి. అని వేదమాత
శాసిస్తోంది.

మాటతో ప్రపంచంలో అన్ని కార్యాలూ సాధించవచ్చు. 'సర్వస్య కారణమ్' -
అన్నారు పెద్దలు. అలాంటి మాటను ఎలా సంస్కరించుకోవాలో భారతీయ సనాతన
వాఙ్మయం అనేక చోట్ల బోధిస్తోంది.
ఉద్విగ్నత లేకుండా, సత్యంగా, ప్రియంగా, హితంగా మాట్లాడడం 'వాచిక తపస్సు’
అవుతుందని - భగవద్గీత వచనం. పలుకులో ఆప్యాయత, శుభాకాంక్ష లేకుండా
ఎదుటివారిని గాయపరిచేటట్లు మాట్లాడడం కొందరి నైజం. వారి పలకరింపులే
పెళుసుగా, పుల్ల విరిచినట్లుంటాయి. ఎదుటివారి మనస్సుకి ఆహ్లాదం కలిగించేలా
పలకరించడం కూడా మాటలో మాధుర్యం పలికించడమే. కసురుకోవడాలు. తిట్టడాలు,
అవాచ్యాలు వాక్కులో దొర్లితే - అది మన మనస్సు నైజాన్ని చెప్పడమే కాకుండా.
మన వ్యక్తిత్వాన్నే భయంకరం చేస్తుంది.

స్మితభాషి, ప్రియభాషి, పూర్వభాషి - అని మహాపురుషుల వాక్ లక్షణాన్ని వర్ణించాయి
ఇతిహాసాలు. చిరునవ్వుతో ప్రియంగా మాట్లాడడం, ఎవరైనా కలిస్తే 'ముందు వాళ్ళు పలకరిస్తే, ఆ తరువాత మేము పలకరిస్తాం' - అనే అహంకృతి లేకుండా, ముందుగా తానే మాట కలుపుకొనే స్నేహ శీలతని 'పూర్వభాషి' అంటారు. ఈ లక్షణాలు గల వాక్కునే 'మధురవాక్కు' అని చెప్పాలి.

భగవంతుని గుణ వైభవ మహిమలని పేర్కొనడం, ఉత్తమవిషయాల గురించి
మాట్లాడడం కూడా 'మధుమయ వాక్కు'కి లక్షణం.

తనవున విరిగిన యలుగలు
ననువున బుచ్చంగవచ్చు, నతి నిష్ఠురతన్
మనమున నాటిన మాటలు
విను మెన్ని యుపాయములను వెడలునె యధిపా - అని మహాభారతం నీతి.

“యుద్ధంలో శరీరానికి తగిలే బాణాలు విరిగి శరీరంలో ఉండిపోతే, యుక్తితో వాటిని తొలగించవచ్చు. కానీ, మనస్సులో నాటుకున్న నిష్టూరపు మాటలు తొలగడం
అసాధ్యం" - అని భావం.

కొందరికి నోరు తెరిస్తే అశుభాలే పలుకుతాయి. ఏ పనైనా చేయబోతే "అదేమీ
జరిగేనా, పెట్టేనా" అనో, “ఇది మంచి ఫలితం ఇస్తుందో, లేదో” అనో నిరుత్సాహపరచడం వంటివి కూడా మాటలోని చేదుదనాలే. శుభాన్ని ఆశించమని, శుభాన్ని పలుకమనీ మన శాస్త్రాలు ఘోషిస్తాయి.

 'భద్రం కర్ణేభిః శ్రుణుయామః' -

‘మంచినీ, క్షేమాన్నీ విందాం', 'మంచినే చూద్దాం' - అని ఆశించే సంస్కృతి మనది.
ఆశావాదం, ప్రోత్సాహం, సానుకూలధోరణి (పాజిటివ్ యాటిట్యూడ్) అనేది మన
మాటలో ధ్వనించాలి.

ఎదుటివారి వెన్ను తట్టేలా ఉండే మాట 'మధుమయ వాక్కు' అవుతుంది. వెన్ను
విరిచేలా ఆడే నిరుత్సాహ వచనాలు శల్యసారథ్యాలై విషవాక్కులౌతాయి.

మాట ఇచ్చే ధైర్యం, ఓదార్పు, స్ఫూర్తి అనన్య సామాన్యం.

స్థూలంగానే కాక, సూక్ష్మ జగత్తులో కూడా మధుమయ వాక్కులు దేవతలకూ
ప్రీతి కలిగిస్తాయి. కాబట్టి మంచి మాట్లాడమనీ, దేవతలే ఆ వాక్కులు వింటారని -
'తథాస్తు' అంటారనీ, మన దేశాచారాలు బాల్యం నుండి 'మంచిగా ఆలోచించడం',
'మంచిగా మాట్లాడడం' అనే సంస్కారాలని వివిధ విధాలుగా అభ్యాసం చేయించాయి.     
 Vedantha panchadasi:
ఇద మంశశ్చ సత్యత్వం శుక్తిగ రూప్య ఈక్షతే ౹
స్వయంత్వం వస్తుతా చైవం విక్షేపే వీక్షతేఽ న్యగమ్ ౹౹34౹౹

34. "ఇది రజితము"అనే భ్రాంతియందు వాస్తవముగ చూడబడినది ముత్యపు చిప్పయే.ఇదే సత్యముగ చూడబడినది.

నీలపృష్ఠ త్రికోణత్వం యథా శుక్తౌ తిరిహితమ్ ౹
అసంగానందతాద్యేవం కూటస్థేఽ పి  
తిరోహితమ్ ౹౹35౹౹

35. ముత్యపు చిప్ప యొక్క నల్లటి వెనుక భాగము,త్రికోణాకారము, అదృశ్యములైనట్లే,కూటస్థ చైతన్యపు అసంగత్వము, ఆనందము మొదలగునవి కూడ అవిద్యావరణ వలన భాసింపవు.

ఆరోపితస్య దృష్టాంతే రూప్యం నామ యథా తథా ౹
కూటస్థాధ్యస్తవిక్షేపనామాహమితి నిశ్చయః ౹౹36౹౹

36.  ఉదాహరణమున ఆరోపింపబడినది రజతము.అట్లే విక్షేపశక్తీచే కూటస్థముపై ఆరోపింపబడినది అహంత"నేను"అనే భావము.

ఇదమంశం స్వతః పశ్యన్ రూప్యమిత్యభిమన్యతే ౹
తథా స్వం చ స్వతః పశ్యన్నహమిత్యాభిమన్యతే ౹౹37౹౹

37.  "ఇది" అనునంశమును చూచుచు దానిని రజితమని భ్రమించును అట్లే తనను తాను ఉద్దేశించుచు "నేను"అని అభిమానపడును.

సత్యత్వము వాస్తవమునకు లేనట్టి రజితమునకు అన్వయింపబడినది.
అట్లే కూటస్థ చైతన్యపు వస్తుత్వము స్వయంత్వము అనునవి కల్పితములైన శరీరములకు, అనగా జీవునకు, అవిద్యచే అన్వయింపబడుచున్నవి.

మాలిన్యములను తొలగించినప్పుడు యథార్థమగు పదార్థము అభివ్యక్తమగు విధముగాను,రాత్రిచీకటిని తొలగించినప్పుడు చీకటిచే కప్పబడిన వస్తువులు స్పష్టముగా కనిపించువిధముగాను,
అవిద్యావరణ తొలగినప్పుడు "బ్రహ్మచైతన్య" అసంగత్వము, ఆనందము తెలియబడును.

శుద్ధచైతన్యమే విక్షేపశక్తి వలన
'నేను'అను మలిన భావనను పెట్టుకొని నిజముగా అసత్యమైనను
(నేను అను)అహంకారము,అది యథార్థముగా ఉన్నట్లు నమ్మి భ్రాంతిజెందును.తనను తాను ఉద్ధేశించుచు "నేను"అని అభిమానపడును.

నేను అనుకొనునపుడు మనస్సున ఉండునవి శరీల లక్షణములే,
ఇంత అందగాడును,బలశాలిని, సంపన్నుడను,అధికారిని మొదలగునవి.
 
"ఇది రజతము"అనే భావములో "ఇది" అని చూడబడినది ముత్యపు చిప్ప. కాని దానిపై ఆరోపింపబడినవి రజతలక్షణములు.అట్లే "నేను"అనుటచే ఉద్దేశింపబడినది కూటస్థ చైతన్యమే.కాని దానిపై ఆరోపింపబడిన శరీర లక్షణములచే అహంత కలుగుచున్నది.

"అహం" యొక్క స్వీయతత్త్వము తెలిసినప్పుడు,అది అటుపైన అహంకారముగా అగుపించదు, అపరిచ్ఛిన్నతత్త్వముగానే అగుపించును.
వాస్తవముగా"నేను"గా వేరయిన "వ్యక్తి-తత్త్వము" లేదు.

ఈ సత్యము నిర్మల మనస్సుతో వ్యక్తికి అభివ్యక్యమయినప్పుడు అతని అజ్ఞానము తత్ క్షణమే తొలగును.

ఇట్లు"నేను"ఒక ప్రత్యేకవ్యక్తిగా అసత్యమని తెలిసినప్పుడు మానవుడు దానికి సంబంధించిన అన్యభావనలు ఎట్లు నమ్మగలడు?

ఆ విధముగా"నేను" ఉన్నంతకాలము వ్యక్తి జీవితములో దుఃఖమే ఉండును. మరియు "ఆత్మజ్ఞానము"ద్వారా తప్ప ఈ "నేను"అను భావనను వదిలించుకొనుట సాధ్యము కాదు.

వ్యక్తి ఈ   "అహంతా" పిశాచావిష్టుడయినప్పుడు శాస్త్రములు,మంత్రములు ఏవియు అతనిని ఆ పిశాచమునుండి విడిపించుకొనుటకు సమర్థుని గావింపవు.

ఆత్మ అపరిచ్ఛిన్న చైతన్యమునందు కేవల ప్రతిబింబమను సత్యమును నిరంతరము గుర్తించూకొనుటవలన మాత్రమే 
"అహంతా"వృద్ధి నశించును.        
 🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
నా ఆజ్ఞా చక్ర అనుభవాలు - 2


మూలం : కపాల మోక్షం అనే గ్రంథం


అనుభవం : పవనానంద సరస్వతి


...ఆగస్టు 15: ఈరోజు నాకు ధ్యానంలో విచిత్రంగా నేను పూజించే దుర్గా యంత్రం కనిపించినది. అందులోనుంచి ఒక మూడు సంవత్సరముల ఒక బాలిక రూపంలో బయటికి వచ్చి నా తొడ మీద కూర్చున్నట్లుగా అనిపించింది. కనిపించినది. కాకపోతే ఎవరో నా తొడ మీద కూర్చుని ఉన్నట్లుగా అనిపించినది. ఏదో తెలియని అనుభూతి కలిగింది.

ఆగస్టు 20: ఈ రోజు నాకు ధ్యానములో ఎరుపు జాకెట్టు పసుపు రంగు లంగా వేసుకున్న 8 సంవత్సరముల బాలిక రూపంలో నవ్వుతూ నా దగ్గరకు వచ్చినట్లుగా అనిపించినది. ఇది నిజమా లేదా కలలాంటి అనుభవమా నాకు అయితే అర్థం కాలేదు.

సెప్టెంబర్ 10: ఈ రోజు దుర్గాష్టమి. దుర్గా యంత్రము పూజ చేస్తున్నాను. పైగా దేవీ నవరాత్రుల దీక్షలో ఉన్నాను. సుమారుగా 28 నుండి 32 సంవత్సరాల వయస్సులో ఉన్న ఒక స్త్రీ మూర్తి యంత్రము నుండి బయటికి వచ్చి
 అటు ఇటు తిరుగుతూ మళ్లీ ఈ యంత్రం లోనికి వెళ్లిపోవడం నా కనులారా సజీవమూర్తిగా చూడడం జరిగినది. మొదట నాకు ఆశ్చర్యం వేసినది. ఆ తర్వాత భయము వేసినది.

సెప్టెంబర్ 25: ఈ రోజు నాకు ధ్యానములో అలాగే మా ఇంటికి 45సంవత్సరముల వయస్సు ఉండి నల్లని చీరతో ఒక ఆవిడ వచ్చింది. మా అమ్మ దగ్గర ఉన్న నల్లని చీర అడిగి తీసుకుని వెళ్ళినది అని అమ్మ చెప్పింది.ఈ మధ్య ఈ దేవతా స్త్రీ మూర్తులు నా వెంట ఎందుకు తిరుగుతున్నారో మా గురు దేవుడిని అడగాలని అనుకున్నాను. 


సెప్టెంబర్ 28: నాకు కలిగే స్త్రీ  మూర్తి దేవత అనుభవాలు గూర్చి చెప్పినప్పుడు ఆయన పెద్దగా నవ్వి “నాయనా! ప్రకృతి మాత అయిన బాలా త్రిపుర సుందరి దేవి స్వరూపాలు నీవు చూసిన మూడు సంవత్సరములు బాలిక "బాల", ఇరవై ఎనిమిది సంవత్సరములు "త్రిపుర" ,45 సంవత్సరములు "సుందరి", 80 సంవత్సరములతో ఉన్న మూర్తి "దేవి" ...అనియూ...అవే ఈ  రూపాలు అని చెప్పటం జరిగినది. ఈమె సాక్షాత్కార మాయలో నిన్ను ఉంచాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోందని గ్రహించు...! నిన్ను తన ప్రకృతి అయిన జీవ మాయ దాటకుండా చేస్తోందని గ్రహించు. నేను ఇప్పటిదాకా ఈమె మాయను కూడా దాటలేకపోయినాను. 

అలాగే రామకృష్ణ పరమహంసకి కాళీ మాత అనే ప్రకృతి మాత మాయను దాటించడానికి తోతాపురి అనే సద్గురువు వచ్చినారని తెలుసుకో! సద్గురువు అంటే ఆత్మ సాక్షాత్కారమును పొంది ఇతరులకు శక్తి పాత సిద్ది ద్వారా అనుగ్రహించే గురువు అని గ్రహించు. కాకపోతే ఇలాంటి మీ సద్గురువు కోసం మీకు ఈ చక్రం యొక్క 4 ఉప చక్రాలు అయిన గుణ, కర్మ,కాల, బ్రహ్మ చక్రములను దాట వలసి ఉంటుంది. అది కూడా తాంత్రిక విధి విధానంలో అనగా పంచ మకారాలు అంటే మద్యము, మాంసము, మత్స్యము, ముద్ర, మైధునము అనే ప్రక్రియలు చేయాల్సి ఉంటుంది.వీటికి నా తల్లి అనుమతి ఇవ్వకపోవడంతో వీటిని చేయలేకపోవడంతో ఈ ప్రకృతి మాయను దాటలేకపోయినాను  అని ఆయన నిజాయితీగా చెప్పేసరికి నాకు నోట మాట రాలేదు...! 

 
అక్టోబర్ 10: ఈరోజు పురాణపురుష అయిన శ్రీ లాహిరి మహాశయులు జీవిత అనుభవాలు గ్రంథము చదవటము జరిగినది.ఈ నాలుగు ఉప చక్రాల కోసం తాంత్రిక విధానమే కాకుండా దక్షిణాచారం లో కూడా విధి విధానాలు ఉన్నాయని చెప్పడం జరిగినది. అనగా మన కొండ నాలిక యందు స్రవించే అమృతమును సేవించుట మద్యపానం అని అలాగే ఖేచరీ ముద్ర సిద్ది పొందటమే మాంసభక్షణ అని అలాగే ఆజ్ఞాచక్రము లోని త్రికోణంలోని
త్రివేణీ సంగమ స్థానం అనగా గంగ, యమున, సరస్వతి నదుల సంగమ స్థానం అని ఇందులో సంచరించే శ్వాస ప్రశ్వాస అనే చేపలు తినటం మత్స్యము అని అలాగే చిన్ముద్ర సాధన సిద్ది ముద్ర అని మణిపూరక చక్రంలోని  'రం'  అనే బీజాక్షరము మరియు ఆజ్ఞా చక్రములోని 'మ' అనే బీజాక్షరము అనుసంధానించడమే మైధునం అని చెప్పటం జరిగినది. ఈ విధముగా దక్షిణాచారంలో సాధన చేసి ఈ నాలుగు ఉప చక్రాలను దాటవచ్చునని చెప్పటం జరిగినది.

అక్టోబర్ 18: ఈ రోజు నా కుడి చెవి నుండి ఏదో నాదము లీలగా వినపడుతుంది.కానీ అది అర్థం కావటం లేదు. కానీ వినాలని నా మనస్సు తాపత్రయపడుతోంది.

అక్టోబరు 28: ఈ రోజు నా కుడి చెవి నుండి చాలా స్పష్టంగా ఓంకారనాదం వినబడ సాగినది. ఆశ్చర్యమేసింది. ఆనందం వేసింది. 

నవంబరు 10: ఈ రోజు నా భ్రుకుటి స్థానము నందు ఏదో మిలమిల మెరుస్తూ ఒక నక్షత్రం కనపడినది. బొట్టు ఉండవలసినస్థానము నందు నక్షత్రం ఉండటం ఏమిటో నాకైతే అర్థం కాలేదు.

నవంబర్ 22: ఈ రోజు నాకు కనిపిస్తున్న నక్షత్రం కాస్త పెద్దది అవుతూ కోడి గుడ్డు ఆకారము అంత పరిమాణంలో కనపడినది. నాకు ఆశ్చర్యము వేసే సరికి నాకు ధ్యానము భంగమైనది.

నవంబర్ 23: ఈ రోజు నాకు ముదురు వంకాయ రంగులో "ఓం" మధ్య బీజాక్షరము గా ఉన్న రెండు దళాలు ఉన్న పద్మము లీలగా కనిపించసాగింది.

నవంబర్ 25: ఈ రోజు అర్ధరాత్రి నా శరీరము నుండి నాలాంటి రూప ధారి తెల్లని శరీరం బయటికి వచ్చి తిరిగి ఆ తర్వాత నా శరీరము లోనికి ప్రవేశించడం నా భౌతిక నేత్రములు ద్వారా చూడటం జరిగినది. ఆశ్చర్యము, భయం వేసింది .

నవంబరు 28: పుస్తకాలు చదివితే అది సూక్ష్మశరీరం అని తెలిసినది. అది ఎవరో ఏమిటో తెలుసుకుంటే అదియే ఆత్మ సాక్షాత్కారము అవుతుందని గ్రహించాను. కాకపోతే దీనికి సద్గురువు అనుగ్రహం ఉండాలని అలాగే దైవ సాక్షాత్కార మాయలను దాటాలని చెప్పటం జరిగినది.

డిసెంబరు 5: నా చుట్టూ అలాగే నా ఇంటి చుట్టూ దైవ శక్తి తిరుగుతుందని నా చుట్టూ ఉన్న వారు గ్రహించటం మొదలుపెట్టినారు. దీనిని ఇంతటితో ఆపకపోతే నన్ను ఒక దేవుడుగా చేసి పూజలు చేయటం చేస్తారు.

డిసెంబర్ 12: ఈ రోజు ఒక తాంత్రిక స్త్రీ గురువుతో మాట్లాడటం జరిగింది. ఆమె సహాయ సహకారాలతో దక్షిణాచారంలో నా 4 ఉప చక్రాలు అయిన గుణ, కర్మ, కాల, బ్రహ్మ చక్రాలను దాటాలని నిశ్చయించుకున్నాను.  (గమనిక: ఈ నాలుగు ఉప చక్రాలు జాగృతికి,శుద్ధికి మాకు నాలుగు సంవత్సరముల పైన పట్టినది అని గ్రహించండి.)

ఫిబ్రవరి 10: ఇంతటితో నా నాలుగు ఉప చక్రాలు గుణ, కర్మ, కాల, బ్రహ్మ చక్రాలు జాగృతి, శుద్ధి అయినాయి.


మార్చి 27: ఈరోజు ధ్యానము అంతా కూడా కర్మ చక్రం మీద పెట్టినాను. ఈ చక్ర దైవం అయిన శ్రీ రామ దర్శనం అయినది. ఇదే సమయంలో దుర్గాదేవి మంచి సౌందర్య యవ్వనవతిగా నగ్నముగా లజ్జా గౌరిగా దర్శనము ఇచ్చినది. కవ్వించడం మొదలుపెట్టినది. నవ్వి ఊరుకున్నాను.

ఏప్రిల్ 25: ఈ రోజు అంతా కూడా నా ధ్యానం బ్రహ్మ చక్రం మీద పెట్టినాను. విచిత్రంగా "ఏకపాదుడు" అనే రూపము కనిపించినది. ఆపై దుర్గాదేవి 80 సంవత్సరాల వృద్ధ స్త్రీ మూర్తిగా ముదురు ఆకుపచ్చ రంగు చీరలో కనిపించి దీవించి శూన్యము నందు అదృశ్యమైంది. ఆయా చక్ర దేవతలు చివరికి శూన్యము నందు లీనం అవటం కూడా జరిగినది.

మే 10: ఈ రోజు నాకు కలలో భవిష్యవాణి సూచన అనుభవాలు కలిగాయి. అవి నిజమేనా అన్నట్లు చనిపోయిన నా కుక్క పునర్జన్మ యొక్క కుక్క రూపము లీలగా కనిపించినది.
మే 13: నాకు కలలో కనిపించిన భవిష్య అనుభవాలు నిజమేనని తెలుస్తోంది .వామ్మో! ఇది ఏమిటి. ఈరోజు నాకు ధ్యానములో కనిపిస్తున్న కుక్క  నాకు ఇలా కనపడి మా ఇంటికి తీసుకొని రావటం అయినది.

మే 18: నాకు జరగబోయే భవిష్యత్ దృశ్యాలు కలలో ధ్యానములో కనబడుట ఆరంభమయ్యాయి. అవి నిజమవుతూ వస్తున్నాయి.  ఇదే త్రికాల జ్ఞాన సిద్ధి కాబోలు.

మే 20: దీనికి సంబంధించిన గ్రంథాలు చదివితే ఇదియే "త్రికాలజ్ఞాన సిద్ది" అని మన త్రినేత్రం యందు జరగబోయే భవిష్యత్తు దృశ్యాలు లీలగా కనబడతాయని వీటిని చూస్తూనే మన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు కాలజ్ఞానం వ్రాసినారు అని తెలుసుకున్నాను. అంటే ఈ చక్రం లో ఉండే త్రినేత్రం తెరుచుకుందా? తెరుచుకుంది కాబట్టి నాకు దైవ సాక్షాత్కార దర్శనాలు తెలిసినాయి అని నాకు అర్థమైనది. 


ఆగస్టు 5: ఈ రోజు నేను నా కుటుంబ సభ్యులతో కలిసి కాశీ యాత్రకు మొట్ట మొదటిసారిగా దర్శించుకోవటానికి బయలుదేరినాను.

ఆగస్టు 6: ఈరోజు కాశీలో నేను మానస సరోవర ఘాట్ నందు ధ్యానం చేస్తూ ఉండగా నా మనోనేత్రంలో ఎవరివో పెద్ద పాదాల దర్శనం అయినది. ఇది ఎవరివో అర్థం కాలేదు.

ఆగస్టు 7: ఈ రోజు ఈ పాదాలు ఉన్న వ్యక్తి మోకాళ్ళ వరకు దర్శనమిచ్చి ఏదో గుడికి వెళుతున్నట్లుగా ధ్యానములో కనిపించినది. ఇదే రోజు మేము కాశీ విశ్వనాథ శివలింగ దర్శనం చేసుకోవడం జరిగినది. 

ఆగస్టు 10: ఈ రోజు ఈ పెద్ద పాదాలు ఉన్న వ్యక్తి ఏవో మెట్లు ఎక్కి పైకి వెళుతున్నట్లుగా దర్శనం అయినది. ఎక్కడివో ఈ మెట్లు... ఈ ఘాట్ ఏమిటో నాకు తెలియ రాలేదు.

ఆగస్టు 11: ఈ రోజు గయ యాత్ర చేయడం జరిగినది. బుద్ధగయ లో బుద్ధుడు జ్ఞానము పొందిన బోధి వృక్షము చూడటము జరిగినది. అలాగే అక్కడ జప ధ్యానాలు చేస్తున్న లామాలు కనిపించారు. విచిత్రముగా అందరూ చూస్తుండగా ఈ రావి చెట్టు నుండి ఒక ఆకు నా నెత్తి మీద పడినది.అక్కడున్న లామాలు ఈ ఆకును పవిత్రముగా తాగుతూ బుద్ధ భగవాన్ అనుగ్రహం మీకు కలిగినదని అంటూ నన్ను దీవించారు. నాకు ఆశ్చర్యం , ఆనందం వేసింది. ఆ రావి ఆకు అక్కడ నుండి తెచ్చుకోవటం జరిగినది.

ఆగస్టు 12: ఈరోజు అయోధ్య యాత్ర చేయడం జరిగినది. శ్రీరాముడు నివసించిన ఇల్లు, సీతాదేవి ఉపయోగించిన వంట పాత్రలు, వారి  దుస్తులు ఇలాంటివి చూడటం జరిగింది. అయోధ్య, వివాదాస్పద మసీదు ప్రాంతం కూడా చూడటం జరిగింది. అలాగే రాబోవు కాలం రామ మందిరం నిర్మాణ కట్టడాలు చెక్కుతున్న శిల్పాలు చూడటం జరిగినది.

ఆగస్టు 13: ఈరోజు నైమిశారణ్య యాత్ర చేయడం జరిగినది. లలితాదేవి దర్శనము, బ్రహ్మ చక్ర దర్శనము, రుద్ర వనము,సూత ముని ఆశ్రమం అక్కడే శ్రీ వేదవ్యాస భగవానుని అనుగ్రహ దర్శన ప్రాప్తి పొందడం జరిగినది.

ఆగస్టు 14: ఇలా తొమ్మిది రాత్రులు కాశీ నందు పూర్తి అయ్యేసరికి ఈరోజు వెనుతిరగడం జరిగినది.కానీ నాకు ధ్యానంనందు  కనిపించిన ఆ పాదాలు ఎవరివో తెలుసుకోలేక పోయానని బాధ మాత్రం ఉన్నది.

సెప్టెంబర్ 10 :  ఈ రోజు ఒక పుస్తకము నందు నాకు కాశీలో ధ్యానములో కనిపించిన పాదముద్రలు ఉన్న శ్రీ త్రైలింగ స్వామి చరిత్ర కథనం చదవటం జరిగింది. అంటే ఈయనే నాకు సద్గురువు అని నాకు అర్థం అయింది. ఎవరికైతే ఆజ్ఞా చక్రం జాగృతి, శుద్ధి ఆధీనం కోసం ఈ చక్ర క్షేత్రమైన కాశీ యాత్ర చేస్తారని తెలుసుకున్నాను.

నవంబర్ 20: ఈ రోజు మా అన్న తో కలిసి రెండవసారి కాశీ యాత్రకు బయలుదేరినాను. కాశీ కి చేరుకున్నాను.

నవంబర్ 21: ఈ రోజు నాకు ధ్యానం నందు పాదాలు కనిపించాయి. ఈసారి శ్రీత్రైలింగ స్వామి వారి మఠం దర్శనం చేసుకోవడం జరిగినది.

అక్టోబరు 19: మళ్ళీ ఒక సంవత్సరం తరువాత మా శ్రీమతి తో కలిసి మూడవ సారి నలభై ఒక్క రోజుల పాటు కాశీలో ఉండే విధంగా కాశీయాత్ర చేయటం జరిగినది.

నవంబర్ 9: ఈరోజు శ్రీ త్రైలింగ స్వామి మఠం చేరుకున్నాను. నా గాయత్రి మంత్ర ధ్యానం చేసుకుంటున్న సమయంలో నా ధ్యానం నందు తిరిగి దుర్గాదేవి దర్శనాలు అవ్వటం మొదలైంది. నాలో దిగులు మొదలైంది. అంటే ఈమెను నేను ఇంకా దాటలేదని ఆవేదన నాలో మొదలైంది. చచ్చిపోవాలని ఒక విధమైన నిరాశ నిస్పృహ నన్ను ఆవరించింది. ఇంతలో శ్రీ స్వామివారు ఉన్న గదికి మా ఇద్దరిని లోపలికి పంపించినారు. అక్కడున్న చిన్నపాటి సమాధి లాంటి దాని మీద నా తల బాదుకోవడం ప్రారంభించాను. నుదుటికి గాయమైంది. రక్తం చిమ్మింది. దుర్గాదేవి సాక్షాత్కారం ఆగిపోయింది. ఆపై నా మనస్సు కాస్త ఆత్మయందు లీనమైనట్లుగా అనుభవం అవుతుండగా ఆత్మ కాస్త శ్రీ వేదవ్యాసుడిగా రూపాంతరం చెందేసరికి “పవనానందా! పరమహంస పవనానంద! లే లే! నేనే నీవు నీవే నేను” అనే మాటలు లీలగా వినిపిస్తుండేసరికి నాలో నాకే తెలియని మగత ఆవరించింది.సుమారు మూడు గంటల పైగా నేను మామూలు స్థితికి రాలేదు. అంటే నా ఆత్మ వేదవ్యాస అంశ అని నాకు అర్థం అయింది. ఈరోజు "పరమహంస పవనానంద" దీక్షా నామమును పొందటం జరిగినది. 


 నవంబర్ 11: కోడిగుడ్డు ఆకారం పరిమాణంలో దివ్య జ్యోతి  ఈ రోజు నాకు ధ్యానము నందు కనిపించినది.  నా సూక్ష్మ శరీరము నీలి వర్ణంలో కనిపించినది. గత జన్మల స్మృతులు స్పురణకి రావటం
మొదలైంది. వివిధ జంతు వృక్ష మానవ జన్మలు అనగా సుమారు 27 దాకా లీలగా కనిపించాయి. ఆ తర్వాత భవిష్యత్ జన్మలుగా మరో 27 దాకా కనిపించినాయి.  సాధనలో విఫలమైతే భవిష్య జన్మలు ఉంటాయి అనే ఆలోచన రాగానే నాకు ధ్యానం భంగమైనది. అంటే నాకు "రుద్రగ్రంధి" విభేధనం అయినదని గ్రహించాను.

నవంబర్ 15: ఈ రోజు కాశీ యందు నా భవిష్యత్తు జన్మ అయిన... అమెరికాలోని లాస్ వేగాస్ లోని  ఆర్కిటెక్చర్ జన్మ యొక్క తల్లిదండ్రులు నాతో పాటుగా వేద కాశి యాత్ర చేసినారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే గత రాత్రి ఈ ఇంగ్లీషు దొర దంపతులు నా రాబోవు జన్మకి నా కన్న తల్లిదండ్రులు అని కలలో కనిపించారు.

నవంబరు 25: నేను ఈరోజు ధ్యానములో 16 గంటలపాటు నిర్విఘ్నముగా ఉండిపోయాను. అంటే సవికల్ప సమాధి స్థితిని పొందినాను అని నాకు అర్థం అయింది.

డిసెంబర్ 5: ఈ రోజు నాకు సంపూర్తిగా దుర్గాదేవి దర్శనాలు ఆగిపోయాయని నేను ప్రకృతి మాత మాయను దాటినానని నాకు సవికల్ప సమాధి స్థితి కలిగినదని మా గురుదేవులు చెప్పడం జరిగినది. అలాగే ఒకసారి పంచభూత ధారణ ముద్రలు వేస్తే నాకు పంచభూతాలు అనగా భూమి, జలము, అగ్ని, వాయువు,ఆకాశము ఆధీనమై ప్రకృతి నేను చెప్పినట్లుగా వింటుంది అని చెప్పటం జరిగినది. ఇలా ఈ చక్రము నందు పంచభూతాలు తన ఆధీనంలో ఉంచుకుని ఆజ్ఞాపించే స్థితికి సాధకుడు వస్తాడని అందుకే ఈ చక్రమును ఆజ్ఞాచక్రము అంటారని చెప్పటం జరిగినది. అసలు నిజంగానే పంచభూతాలు ఆధీనం అవుతాయా? అనే  సందేహము నాలో మొదలైనది.

డిసెంబరు 25: ఈ ప్రకృతిలో నాకు చాలా బాగా ఇష్టమైనది ఏది? అలా అనుకోగానే స్పటిక శ్రీ చక్రం నా చేతిలో సృష్టించబడినది. పంచ భూత జయం జరిగింది కాబట్టి, ఇలా నాచే పదార్ధ సృష్టి జరిగిందని అర్ధమైంది.        
 "ఆత్రేయగీత"

మూడువ భాగం

“జ్ఞాన మంజరి” (వేదవిజ్ఞాన వీచికలు)

4వ భాగము.

శ్రీ శాస్త్రి ఆత్రేయ

అసలు కర్మ అంటే ఏమిటి? పరిశీలిద్దాం!

ఒకడు ఒక వంటకాన్ని వండేడు (కర్త)! ఒక వంటకం తయారైంది (క్రియ)! అయితే దాన్ని తిన్నప్పుడు అనుభవించే రుచి (ఫలం) ఎక్కడ నుండి వచ్చింది? వంట చేయడం ద్వారా వచ్చిందా? లేదా చేసే విధానం ద్వారా వచ్చిందా?

చేయడం ద్వారా కాదు, చేసే విధానంతో రుచి (ఫలం) ఏర్పడింది కదా! కర్మ అంటే ఇదే! అందుకే కర్మ ఫలాన్ని అనుభవించాలి అంటారు! కర్త అంటే చేసేవాడు! క్రియ అంటే ఫలితం! కర్మ అంటే చేసే విధానం! అంటే చేసే విధానాన్ని బట్టీ “ఫలం” వుంటుందని అర్ధమౌతుంది.

క్రియ లోనే వుంది కర్మ! క్రియా ఫలితమే కర్మ ఫలం! క్రియ లేకపోతే కర్మ వుండదు!

దేహంతో, వాక్కుతో, మనస్సుతో చేయబడే క్రియను కర్మ అంటారని తెలిసింది. అయితే కర్మను నిర్వహించేది శరీరం అయినప్పటికీ చేయించేది, అనుభవించేది మనస్సు కాబట్టీ కర్మ ఫలం మనస్సుకే వుంటుంది.

అయితే ఆ మనస్సుకి కర్త ఎవరు అని ఆలోచిస్తే - “నేను - నాది” అన్న సమాధానం వచ్చింది.

ఆలోచిస్తే ఈ నేను (I/Self) అనేది శరీరం కాదు, ప్రాణం కాదు, జీవం కాదు, మనస్సు కాదు. ఇవన్నీ కూడా “నేను”కి “నావి” మాత్రమే! వాటన్నింటికీ కర్తగా అసలు “నేను” వేరుగా వుంటుందని అర్ధమైంది.

ఆ నేను అనేది పరమాత్మ అని అర్ధమైంది. పరమాత్మ జీవునికి పరిపూర్ణమైన జ్ఞానం ప్రసాదించినప్పటికీ మనోబుధ్యహంకార వికారముల వలన సాక్షాత్ పరమాత్మ స్వరూపుడైన జీవుడు అనేకమైన కర్మలు ఆచరించేడు కాబట్టి వాటి ఫలం అనుభవించడానికి ఇంకో దేహం ధరించవలసి వస్తుందని అర్థమైంది.

కర్మ - జన్మ, ఒక దానిని ఇంకోటి వెంటాడుతూనే వుంటుంది! కర్మ వున్నంతవరకు జన్మ వుంటుంది!

అయితే కర్మలు జడం కాబట్టి వాటికి ఫలము నిచ్చే శక్తిలేదు! పరమాత్మే కర్మఫల ప్రదాత! కారణం జీవుడు ఆచరించే అన్ని కర్మలకు అతడే సాక్షి! అందుకే తప్పక ఆచరించాల్సిన కర్మలను జ్ఞానంతో ఆచరించమని, ఎటువంటి భావన లేకుండా ఆచరించమని భగవద్గీత చెబుతుంది.

భావన లేదు కాబట్టీ, తప్పకా దాన్ని ఈశ్వరుడు స్వీకరించవలసిందే! అప్పుడది కర్మయోగంగా మారిపోతుంది! పరమాత్మ అనుగ్రహం పొందడానికి జీవుల ముందున్న ఏకైక మార్గం ఇదే! సంసారికైనా, సన్యాసికైనా ఆత్మానుభూతికి ఈ నిష్కామకర్మే పునాది!            
 శ్రీమద్భాగవతం - 97 వ భాగం

బలరాముడు హస్తినాపురమును గంగలో త్రోయబూనుట:

దుర్యోధనునకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు లక్షణ. ఆమెకు ఒకానొక సమయంలో వివాహమును నిర్ణయం చేశారు. కృష్ణ పరమాత్మ కుమారుడయిన సాంబుడు దుర్యోధనుని కుమార్తె అయిన లక్షణను తన వీరత్వమును ప్రకటించి ఆమెను తీసుకుని ద్వారకానగరం వైపుకి వచ్చేస్తున్నాడు. అపుడు దుర్యోధనుడు అందరూ సైన్యంతో వెళ్లి అతనిని ప్రతిఘటించండి అని తన సైన్యమును ఆజ్ఞాపించాడు. వాళ్ళు వెళ్లి సాంబుడిని ప్రతిఘటించారు. అపుడు సాంబుడు వారితో గొప్ప యుద్ధం చేశాడు. సాంబుడి ధనుస్సు విరిచేసి అశ్వములను కూలద్రోసి ఆయన సారధిని నిర్జించి సాంబుడిని సాంబుడు తీసుకుపోతున్న కన్యయైన లక్షణను బంధించి తీసుకువచ్చి దుర్యోధనునకు అందజేశారు. ఆయన వాళ్ళిద్దరిని ఖైదు చేశాడు. ఈవార్త ద్వారకా నగరమునకు చేరింది. వెంటనే కృష్ణ భగవానుడు సర్వ సైన్యములతో దుర్యోధనుని మీదికి యుద్ధానికి బయలుదేరుతున్నాడు. 

బలరాముడికి కౌరవులంటే కొంచెం పక్షపాతం ఉంది. దుర్యోధనుడు తన దగ్గర శిష్యరికం చేసినవాడు. ఈమాత్రం దానికి యుద్ధానికి వెళ్ళనవసరం లేదు. నేను వెళతాను. దుర్యోధనునకు నాలుగుమంచి మాటలు చెప్పి లక్షణను మన కోడలిగా తీసుకువస్తాను’ అని చెప్పి పెద్దలతో కలిసి బయలుదేరి వెళ్లి ఊరిలోకి ప్రవేశించకుండా ఊరిబయట ఉండే ఒక ఉద్యానవనంలో విడిది చేశారు. బలరాముడు మహా బలవంతుడు. బలరాముడితో పాటు ఉద్ధవుడు కూడా వచ్చాడు. భాగవతంలో పరమాత్మ అవతార సమాప్తి చేసేటపుడు ఉద్ధవుడిని పిలిచి వేదాంత బోధ చేస్తాడు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. బలరాముడు ఉద్ధవుడిని దుర్యోధనుని వద్దకు రాయబారిగా పంపాడు. ఉద్ధవుడు వెళ్లి ఒకమాట చెప్పాడు. “మీ అందరిచేత పూజింపబడవలసిన వాడయిన బలరాముడు పెద్దలయిన వారితో ఇవాళ ఈ పట్టణమునకు విచ్చేసి హస్తినాపురమునకు దూరంగా ఉండే ఒక ఉద్యానవనంలో విడిది చేసి ఉన్నాడు. కాబట్టి మీరు వెళ్ళి ఆయనను సేవించ వలసినది’ అని చెప్పాడు. బలరాముడు వచ్చాడు అని తెలియగానే దుర్యోధనుడు కౌరవ పెద్దలను తీసుకొని బలరాముడు విడిది చేసిన ఉద్యానవనమునకు వెళ్ళాడు. బలరామునికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సేవించాడు. బలరాముడిని పొగిడాడు. అపుడు బలరాముడు ‘నా తమ్ముడయిన శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు నీ కుమార్తె అయిన లక్షణను చేపట్టాలని ప్రయత్నం చేస్తుంటే నీవు వానిని నిగ్రహించి ఖైదు చేశావని తెలిసింది. అందుకని నీవు నా తమ్ముని కుమారుని, కోడలిని విడిచిపెట్టి నాతొ పంపవలసింది’ అన్నాడు. వెంటనే దుర్యోధనుడు ‘ఏమి చెప్పావయ్యా బాలరామా, కాలగతిని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మేమెక్కడ! యాదవులయిన మీరెక్కడ! మీరు పశువులను తోలుకునే వారు మీకు రాజ్యాధికారం లేదు. మీకు మా పిల్ల కావలసి వచ్చిందా! నీ మాటలు వింటుంటే నాకు ఏమనిపిస్తోందో తెలుసా? కాళ్ళకి తొడుక్కోవలసిన చెప్పులు తలకెక్కాలని కోరుకుంటే ఎలా ఉంటుందో నువ్వు కోరిన కోరిక అలా ఉంది’ అని యయాతి శాపం చేత అసలు యాదవులయిన మీకు రాజ్యాధికారం చేసే అధికారం లేదు. కానీ మీరు రాజులు ధరించే ఛత్ర చామరాదులు అన్నీ ధరిస్తున్నారు. రాజభోగములనన్నిటిని అనుభవిస్తున్నారు. ఇంతటి గౌరవమును పొందారు. కృష్ణుడిని చూసి మిమ్ములను చూసి ఎవరూ గౌరవించలేదు. కౌరవులతో మీకు సంబంధం ఉంది కాబట్టి మీరు దుర్యోధనుడి గురువుగారు అని మిమ్మల్ని గౌరవిస్తున్నారు. రానురాను ఆ గౌరవమును పక్కన పెట్టి మాతోనే వియ్యమందాలని కోరిక పుట్టిందే మీకు! కాబట్టి ఇది జరిగే పని కాదు. మీ హద్దులో మీరు ఉండడం మంచిది’ అని చెప్పి దుర్యోధనుడు అక్కడినుండి వెళ్ళిపోయాడు. బలరాముడు చెప్పిన జవాబు వినడానికి కూడా అక్కడ లేదు. ఆయనతో మాటలాడడమేమిటన్నట్లుగా వెళ్ళిపోయాడు. అపుడు బలరాముడు అక్కడ ఉన్న కౌరవ పెద్దలను చూసి దుర్యోధనుని మాట తీరు మీరు చూశారు కదా! ఎవరి వలన ఎవరికి గౌరవం కలిగిందో చెప్తాను వినండి. 

ఏ కృష్ణ భగవానుడి దగ్గరకు వచ్చి నరకాసురుని వధించాలని అనుకున్నప్పుడు యింద్రాది దేవతలు వచ్చి స్తోత్రం చేస్తారో, దేవేంద్రుడంతటి వాడు కూడా ఈవేళ భూలోకంలో తిరుగుతున్న కృష్ణుడంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని గౌరవించి భజించి స్తోత్రం చేస్తున్నాడో, ఎ పరమేశ్వరుని మందిరం కల్పవృక్షముల తోటయో, అక్కడకు వచ్చిన వారి కోరిక తీరకపోవడం అనేది ఉండదో, ఎ మహాత్ముడి కనుసైగ చేత అందరి కోరికలు తీరుతాయో, ఏ పరమేశ్వరుని పాదయుగళిని ప్రతినిత్యము సేవించాలని లక్ష్మీదేవి అంతటిది తాపత్రయ పడుతుందో, నిరంతరమూ సేవిస్తోందో, ఏ పరమేశ్వరుని అంశభూతముగా నేను చతుర్ముఖ బ్రహ్మ వంటి వారము జన్మించామో, అట్టి పరమేశ్వరుడు దుష్ట సంహారకుడయిన శ్రీకృష్ణ పరమాత్మ గొప్పతనం చేత ఇవ్వాళ ఉగ్రసేనుడు రాజ్యం చేస్తూ ద్వారకా నగరమును ఏలగలుగుతున్నాడు’. అది పరమ యథార్థము. కానీ ఇవాళ దుర్యోధనుడు మాకు కృష్ణుని వలన వైభవం రాలేదని అంటున్నాడు. ఇంతటి దుర్మార్గంగా మాట్లాడే వానికి తగిన బుద్ధి చెప్పి తీరాలి. అని లేచి గంగానది ఒడ్డుకు వెళ్లి ఈ హస్తినాపురము నంతటిని నాగలితో పట్టి లాగి తీసుకువెళ్ళి గంగానదిలో కలిపివేస్తాను’ అని తన నాగలిని హస్తినాపుర నేల లోపలికంటా గుచ్చి లాగ

ాడు. లాగితే సముద్రములో పడవ తరంగములకు పైకి తేలినట్లు యిన్ని రాజసౌధములతో ఉండే హస్తినాపురము అలా పైకి లేచింది. దానిని గంగానదిలోకి లాగేస్తున్నాడు. అంతఃపురము కదిలింది. దుర్యోధనుడు ఏమి జరిగింది అని అడిగాడు. నీవు అనిన మాటకి బలరాముడు హస్తినాపురిని నాగలికి తగిలించి గంగలో కలుపుతున్నాడు’ అన్నారు. అప్పుడు భీష్మ, ద్రోణ, కృపాచార్యులు వంటి పెద్దలందరినీ తీసుకుని దుర్యోధనుడు బలరాముని వద్దకు పరుగుపరుగున వచ్చాడు.

ఇప్పుడు దుర్యోధనుడు బలరాముని స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. నా తప్పు మన్నించండి అని ప్రార్థించాడు. అప్పుడు బలరాముడి కోపం చల్లారింది. బలరాముడికి అనేకమైన కానుకలను యిచ్చి లక్షణను సాంబుడిని రథము ఎక్కించి పంపించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జీవితంలో ఈ విషయములను బాగా గుర్తుపెట్టుకో అని చెప్పడం కోసమని హస్తినాపురం దక్షిణం వైపు ఎత్తుగా ఉంటుంది. ఉత్తరం వైపు పల్లంగా ఉంటుంది. ఆనాడు ఆ యుగంలో బలరాముడు తన నాగలితో ఎత్తిన భూమి మానవాళికి ఒక పాఠం చెప్పడానికి అలానే ఉండిపోయింది.

బలరాముడు తీర్థయాత్రకు జనుట :

బలరాముడు ఒకసారి చాలా ఆశ్చర్యకరమయిన లీల చేశాడు. ఆయన సూతుడిని చంపివేశాడు. సూతుడు పురాణములను చెప్తూ ఉండే మహానుభావుడు. సత్త్వ గుణమునకు పేరెన్నిక గన్నవాడు. భగవత్కథలు చెప్పుకునే సూతుడిని బలరాముడు చంపివేయడం ఏమిటి> అనగా బలరాముడంతటి మహాత్ముడు కూడా కోపమును నిగ్రహించుకొనక పొతే ఎంత పొరపాటు జరిగిపోతుందో ఈ కథలో మనకి చూపిస్తారు. ఒకనాడు నైమిశారణ్యంలో దీర్ఘసత్రయాగం జరుగుతుంటే బలరాముడు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ సూతుడు పురాణ ప్రవచనం చేస్తున్నాడు. అక్కడ ఆయన దగ్గర ఉన్న పెద్దలందరూ ఆయన ప్రవచనం వింటున్నారు. బలరాముడు అక్కడికి వచ్చినప్పుడు అందరూ లేచి నమస్కారం చేశారు. ఒక్క సూతుడు మాత్రం నమస్కారం చేయలేదు. బలరాముడు చూసి యితనికి బుద్ధి చెప్పాలి అని అనుకుని సూతునికి దగ్గరగా వచ్చి అక్కడ ఒక దర్భనొక దానిని చేతిలోకి తీసుకొని ఆ దర్భతో సూతుని కంఠం మీద కొట్టాడు. కొడితే సూతమహర్షి కంఠం తెగిపోయి కిందపడిపోయాడు. సభలో హాహాకారములు చెలరేగాయి. బలరాముడు ‘నాపట్ల అధిక్షేపించి ప్రవర్తించాడు కాబట్టి నేను ఆయన కంఠమును నరికేశాను’ అన్నాడు. అక్కడ పురాణమును వింటున్న వాళ్ళు ‘బాలరామా, నీవలన జరుగకూడని అపచారం జరిగింది. సూతుడు ధర్మాధర్మ వివక్షత తెలిసి ఉన్నవాడు. మహానుభావుడు. ఆయన లేవకపోవడానికి కారణాలు మేము చెప్తాము “నీకు తెలియని రహస్యములున్నాయా! నీకు తెలియని ధర్మ సూక్షములున్నాయా! ఆయనకు మేము బ్రహ్మాసనమును ఇచ్చాము. ఆయన బ్రహ్మయై కూర్చుని ఉండగా నీవు సభలోనికి వచ్చావు. ఎవరు బ్రహ్మగా కూర్చుని ఉన్నాడో అటువంటి వాడు లేఛి నిలబడవలసిన అవసరం లేదు. అందుకని సూతుడు కూర్చున్నాడు. సూతునియందు దోషం లేదు. యిప్పుడు నిన్ను పాపం పట్టుకుంది. నీవు చేసినది సామాన్యమయిన పాపం కాదు’ అని చెప్పారు. 

అపుడు బలరాముడు తానుచేసిన పనికి చాలా బాధపడి యిప్పుడు నేను ఏమి చేయాలి? మీరు నాకు ప్రాయశ్చిత్తం చెప్పండి’ అని అడిగాడు. అప్పుడు మహర్షులు ‘నేను అనంతుడను’ అని అన్నావు కదా ఆ ఈశ్వర శక్తితో సూతుడికి మరల ప్రాణం పోయవలసింది అన్నారు. అప్పుడు బలరాముడు ‘నిజమే సూతుడు బ్రతక వలసిన వాడు. లోకమునకు పనికివచ్చేవాడు. కాబట్టి ఈ సూతుడిని నా యోగ శక్తిచేత బ్రతికిస్తాను’ అన్నాడు. యికపై సూతునకు రోగమనేది ఉండదు. బుద్ధియందు ధారణాశక్తి చెడిపోవడం అనేది ఉండదు. అపారమైన విద్యాబలంతో ఉంటాడు. గొప్ప శక్తి కలవాడై ఉంటాడు. అటువంటి సామర్థ్యములను సూతునకిచ్చి పునఃజీవితమును ఇస్తున్నాను అని మరణించిన సూతుని బ్రతికించాడు. నేను చేసిన తప్పు పనికి నా మనస్సు బాధ తీరలేదు. మీరు యింకా ఏదయినా అడగండి. చేసిపెడతాను అన్నాడు. పొరపాటు ప్రతివాడు చేస్తాడు. పొరపాటు చెయ్యడం తప్పుకాదు. మనుష్య జీవితంలో పొరపాటు చేయనివాడు ఉండడు. పొరపాటు చేసిన వాడు బలరాముడిలా ప్రవర్తించాలి. తప్పు తెలుసుకుని ఆ తప్పును అంగీకరించి దానిని సరిద్దిద్దుకోవాలి. అది జీవితమునకు వెలుగునిస్తుంది.   
 గాఢనిద్రలో నీకు ప్రపంచం లేదు..
కానీ నీవున్నావు...సుఖంగా కూడా ఉన్నావు!
నిద్రనుండి మేల్కొన్న తరువాతనే నీకు సుఖం 
పోయింది....ఎందువలన?
మేలుకోవడంతో అహంకారమనేది క్రొత్తగా వచ్చింది..
నిద్రలో ఈ అహంకారం లేదు..అహంకారం పుట్టుకే
వ్యక్తి పుట్టుక గా చెప్పబడుతున్నది.. అహంకారాన్ని
నశింపజేస్తే మిగిలేది ఆత్మ, ఆత్మానందమే!

🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹
 
 పంచమహాభూతములు కలిసిమెలిసి
జీవించే దివ్యక్షేత్రం నీ శరీరం.
నీ శ్వాసే ఓంకారం!

అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏
 *ప్రశాంతమైన నీటిలోనే*
*ప్రతిబింబం చూడగలం*
*పరిశుభ్రమైన మనసే*
*పవిత్రమైన* *మందిరమవగలదు!*

*భావనలు భవ్యమైతే*
*చేతలు దివ్యమేగా!*
*నలుగురూ మెచ్చితే*
*నడతలు మంచివేగా!*

*మనసెలా వుంటే*
*మనమలా!*
*మనమెలా ఉంటే*
*మనకలా!*

*అనుకూలమనుకుంటే*
*అన్నీ మనవే!*
*ప్రతికూలమనుకుంటే*
*అన్నీ అవే!*

*ఆలోచనలే ఆధారం*
*ఆచరణకు!*
*ఆమోదమే ఏమొచ్చినా!*
*అనుభవానికి!*

*మనమనుకున్నది*
*అందకపోతే*
*మనకవసరమైనది*
*ప్రాప్తిస్తుంది!*

*దారి తప్పక నడిపే*
*తూరుపు వేలుపు* 
*ఏరి కోరి మనకిచ్చే,*
*కానుకంటి వేకువకు!*

     *🌹|| శుభమధ్యాహ్నం ||🌹*
🙏🙏🪷 🪷🙏🪷 🪷🙏🙏
 రామాయణమ్. 99
..
వశిష్ఠ మహర్షిని అల్లంతదూరములో చూడగనే భరద్వాజమహర్షి ఒక్కుదుటున లేచి శిష్యులను అర్ఘ్యము అర్ఘ్యము అని తొందర పెడుతూ మహర్షికి ఎదురేగినాడు.
.
వశిష్ట మహర్షి భరతుని ఈతడు దశరధకుమారుడు అని పరిచయం చేసిన తరువాత వారందరి క్షేమం భరద్వాజుడు విచారించి భరతునితో ఇలా అన్నాడు...రాజ్యమును పరిపాలించుకొనే నీవు ఇచటికి ఎందుకు వచ్చావు ?
నా కేదో అనుమానముగా ఉన్నది నీ గురించి!
.
 తండ్రిమాటకోసమై అడవులుపట్టి వెళ్ళిపోయిన సీతారామలక్ష్మణుల విషయమై నీవేమీ పాపపుతలంపుతో ఇచటకు రాలేదుకదా! .
.
ఆ మాటలు భరతుని హృదయాన్ని ఈటెల్లాగా చీల్చివేయగా హృదయమందు అప్పటికే గంగానదిలా ప్రవహిస్తున్న దుఃఖము మరింతవేగంగా ఉబికి బయటకు వచ్చి కన్నీరుగా ప్రవహించగా ,తడబడేమాటలతో భరద్వాజుని చూసి ...
.
పూజ్యుడవైన నీవుకూడా నన్ను ఇలాగ భావించినచో నన్ను చంపివేసినట్లే! మహాత్మా నావలన ఏ దోషమూలేదు! నన్ను నీవు ఈ విధముగా తలంచకుమయ్యా!
.
నేను లేని సమయములో నా తల్లిపలికిన మాటలన్నీ నాకు ఇష్టములుకావు ,వాటిచే నాకు సంతోషముకలుగలేదు.వాటిని నేను సమ్మతించను.
.
నేను ఇప్పుడు పురుషశ్రేష్ఠుడైన రాముని పాదములకు నమస్కరించి ఆయనను అనుగ్రహింపచేసుకొని మరల అయోధ్యకు తీసుకు వెళ్ళటానికి వచ్చిఉన్నాను. మహర్షీ రాముడెక్కడున్నాడో ఎరుకపరుపుము!.
.
సత్ప్రవర్తన,వినయముతో కూడిన భరతుని ఆ మాటలు విని ప్రసన్నుడై రఘువంశములో పుట్టినవాడు మాట్లాడే విధంగానే మాట్లాడావు అవి నీకు తగి ఉన్నవి.
  నీ హృదయం తెలుసుకుందామనే అలా అన్నాను ! అని పలికి నీ సోదరుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు ..
.
రాముడు చిత్రకూటపర్వతమందు నివసిస్తున్నాడు ,నీవు రేపు అచటికి వెళ్ళవచ్చును ఈ రాత్రికి మాఆశ్రమమందే విశ్రమించు అన్న భరద్వాజుని కోరికమేరకు ఆ రాత్రికి అక్కడనే విడిదిచేసినాడు భరతుడు.
.
అప్పుడు భరద్వాజుడు భరతునితో నేనిచ్చే విందు స్వీకరించుము అని అడిగాడు.
.
 స్వామీ అరణ్యములో లభించేవాటిని మీరిప్పటికే నాకు అనుగ్రహించారుకదా ఇంక వేరే విందు ఏమివ్వగలరు ? అని బదులు పలికాడు భరతుడు.
.
మహర్షి చిరునవ్వుతో, భరతా !నీవు అల్పసంతోషివి అని నేనెరుగుదును. నీవు అన్నిసత్కారములకు అర్హుడవు ! నీకు నీసేనకు ఏమిచ్చినచో సంతుష్టులగుదురో ఆ విందు ఇవ్వవలెననే కోరిక నాకున్నది . 
అవునూ ! నీ సైన్యాన్నంతా దూరంగా వదిలి ఒక్కడవే ఇక్కడికి వచ్చావేమిటి? అని ప్రశ్నించాడు భరద్వాజుడు.
.
స్వామీ మీకు తెలియునుకదా రాజుకానీ ,రాజపుత్రుడు కానీ  ఎల్లవేళలా మునివాటికలకు దూరంగా సంచరించవలెను అని కదా నియమము! 
.
(( ఇది ఆనాటి ధర్మం! ఈ రోజున విశ్వవిద్యాలయాల గ్రౌండ్సు అన్నీ కూడా రాజకీయ సభలకు ఇవ్వాల్సిందే ,ఇవ్వకపోతే రచ్చరచ్చ ఏ కాలంలో నాగరికత ,మర్యాద ఉన్నదో గమనించండి ? 
We are modern but not civilized)).
.
నా సైన్యములో మదించిన ఏనుగులు సంచరిస్తున్నాయి అవి మీ ఆశ్రమప్రాంగణంలోని వనాన్ని ధ్వంసం చేయరాదనే తలంపుతో నేనొక్కడనే వచ్చినాను.అది విని సంతసించారు మహర్షి.
.
అప్పుడు మహర్షి అగ్నిగృహములో ప్రవేశించి దీక్షలో కూర్చొని విశ్వకర్మను ఆహ్వానించాడు ,దేవేంద్ర,యమ,వరుణ,కుబేర అనే లోకపాలకులని కూడా ఆహ్వానించి నేను భరతునకు ఆతిధ్యమివ్వదలుచుకున్నాను కావున మీరు వచ్చి తగు ఏర్పాట్లు గావించండి అని కోరినాడు. 
.
మహర్షి సంకల్పానికి అనుగుణంగా అక్కడ క్షణాల్లో ఒక మహానగరం ఏర్పాటయ్యింది.
.
గంధర్వులైన విశ్వావసు,హాహాహూహూలూ దేవజాతికి చెందిన అప్సరసలు .
వారిలో ఘృతాచి,విశ్వాచి,మిశ్రకేశి ,అలంబుస,నాగదంత,హేమ,
హిమ ...అనే స్త్రీలు ఉన్నారు.సకల దేవతా స్త్రీ లను అక్కడకు రావించాడు .
.
మైరేయము అనే మద్యము నదిగా పారింది ! 
బాగా తయారు చేయబడిన "సుర" మరొక నది అయ్యింది ,
చెరకురసాలు నదులుగా పారాయి.
.
చంద్రుడు చక్కని అన్నము తెచ్చాడు అది పంచభక్ష్యపరమాన్నాలతో కూడినటువంటుది.
.
భరద్వాజుడి సంకల్పానికి తగ్గట్లుగా అప్పటికప్పుడు అక్కడ ఒక సుందరమైన లోకం ఇంద్రభవనాలతో దేవేంద్ర వైభవంతో సృష్టింపబడింది. 
ఇదివున్నది, అదిలేదు అనిలేదక్కడ! ఎవరికి ఏది కావలిస్తే అది .
.
మహర్షి అనుమతితో భరతుడు రాజసభలోకి ప్రవేశించాడు..
ఆ సభలో ఒక సమున్నతమైన ఆసనం !
దానికెదురుగా మంత్రిసామంతదండనాధులు కూర్చునుటకు వీలుగా సముచిత సుఖాసనాలు అమర్చారు.
.
అక్కడి దివ్యమైన సమున్నత ఆసనానికి భరతుడు ప్రదక్షిణ చేశాడు అక్కడ రాముడున్నట్లు ఊహించుకొని ఆయనకు నమస్కారము చేసి ఆ ఆసనానికి వింజామరతో వీచి తాను మంత్రికూర్చునే ఆసనం మీద కూర్చున్నాడు.
.
( మనసా వాచా కర్మణా ఆయనకు రాముడే రాజు ఆయన పరోక్షంలో కూడ భరతుడికి సింహాసనం మీద మోహం లేదు!)
.
వూటుకూరు జానకిరామారావు 
.
 30-10-2024-బుధవారము - శుభమస్తు..
🌹🌹🌹🌹 గుడ్ మార్నింగ్ 🌹🌹🌹🌹
జీవితము యొక్క నిజము ప్రస్తుతమే. ఇందులో గాఢ అనుభూతిని కలిగిస్తూ నేను అనిపించే శరీరముతోనే జీవించాలి అనేది నూటికి నూరుపాళ్ళు సత్యము వాస్తవము.
ఈ శరీరానికి అవసరమైన ధన సంపాదన - కుటుంబము అన్నీ అత్యవసరాలు..........
దేనిని అశ్రద్ధ చేయకూడదు. ధర్మముగా వీలైనంత స్వప్రయత్నముతో  అన్నిరకములుగా సుఖముగా, సంతోషముగా, శాంతిగా జీవించే ప్రయత్నం ఎప్పుడు చేయాలి...............................
ఈ ప్రయత్నలోపాలు - అశ్రద్దలు - అడ్డదారులు - అధర్మాలు మనను, మన కుటుంబాన్ని ఇబ్బందుల వైపు నెడతాయి..
ఇలా ఇబ్బంది, బాధ, దుఃఖము, భయము, అశాంతి లేకుండా జీవించటానికి అనువైన విషయాలను, అనేక విధములుగా విడమరచి మనుషులకు చెప్పే ప్రయత్నం అనుభవశీలురైన మనుషులే చేసారు.....
ఆ ప్రయత్నమే జ్ఞానము............
ఈ జ్ఞానానుభవములో - శరీరమునకు ఆధారముగా శక్తి వున్నది అన్న సత్యాన్ని అనుభూతి చెంది - మరల ఆ జ్ఞానాన్నిఅనేక రకాలుగా సామాన్య మనిషికి అర్ధమయ్యేలా తెలియచేసే ప్రయత్నం చేశారు.......
ఆ ప్రయత్నమే ఆధ్యాత్మికము.................
ఎన్ని రకాలుగా ఎంత మంది ఎన్ని చెప్పినా - మనము ఎన్ని రకాలుగా వాటిని తెలుసుకొని,అర్ధం చేసుకొని, ఆచరించే ప్రయత్నం చేస్తున్నా అది శరీరముతోనే - ఇప్పుడే,ఇక్కడే,ఈ జీవితములోనే చేయాలి. 
దీనినే సాధన అన్నారు.....................
జ్ఞానము,ఆధ్యాత్మికత, సాధన జీవితానికి భిన్నమైనవి కావు......................
నిత్య జీవితములోనే ప్రతి విషయములో వీటిని ఉపయోగిస్తూ - కుటుంబ జీవితం సక్రమముగా శరీరము ఉన్నంత వరకు జీవించాలి.................................
దీనినే తపస్సు అంటారు..................
ఇలా అందరితో, అందరి మధ్యలో సంతోషముగా, శాంతిగా జీవించగలిగితే 
వారిని జీవన్ముక్తులు అంటారు....
ఇదే మోక్షము.......................
ఇదే ఒక మనిషి చేరగలిగిన, పొందగలిగిన అంతిమ స్థితి.............................
ఇక్కడితో జీవితపు ఆట పూర్తి అవుతుంది.
ఆట ఎలా ఆడుతారు అన్నది - ఎవరిష్టం వారిది. ఎవరి ఆట వారిది...
🌹🌹🌹🌹 god bless you 🌹🌹🌹🌹

Tuesday, October 29, 2024

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

   *తల్లితండ్రులు- పిల్లల బాధ్యత*
               ➖➖➖✍️


*తల్లి తండ్రులకు  కంటనీరు పెట్టించిన వారు ఎంత దురదృష్టవంతులో ఆనంద భాష్పాలు తెప్పించిన వారు అంతటి అదృష్టవంతులు.*

*వాళ్ళు ఉన్నంత కాలము మనము ఉంటాము. మనం ఉన్నతం కాలము వాళ్ళు ఉండరు.*

*బిడ్డలు శక్తి సామర్ధ్యాలు పొందే కాలంలో   తల్లి తండ్రులకు శక్తి సామర్ధ్యాలు తగ్గిపోతాయి.*

*బిడ్డలకు ఉన్నతమైన భవితపై ఆశలు చిగురించే సమయంలో తమ భవితపై అంతులేని అనిశ్చితికి లోనయ్యే సమయం వారిది.*

*బిడ్డలకు కొత్త కొత్త ప్రపంచాలు ఏర్పడే కాలంలో  బిడ్డలే తమ ప్రపంచంగా మారే కాలం తల్లి తండ్రులది.*

*రేపటి అంతులేని ఆశ బిడ్డలది. రేపటిపై అర్ధంకాని అయోమయం తల్లి తండ్రులది.*

*తమ జీవితాలని పెట్టు బడిగా పెట్టి పిల్లల భవితను తీర్చి దిద్దిన తల్లితండ్రులకు కొంత ప్రేమ మరికొంత ఆసరా ఇంకొంత ధైర్యం కలిగించవలసినది ఆ బిడ్డలే!*

*తమకంటూ ఏమి మిగుల్చుకోని తల్లి తండ్రుల త్యాగాలను గుర్తించకున్నా బాధ పడని తల్లితండ్రులు ఏవోవో కోరికలతో అత్యాశలతో స్థాయికి మించి పిల్లల కోరికలతో నిష్టురంగా మాట్లాడితే కలిగే బాధ వర్ణనాతీతము.*

*జీవితాన్నిచ్చిన తల్లితండ్రులకు రెండు పూటలా తిండితో పాటు రెండు మాటలు ప్రేమతో మాట్లాడితే ఎంత ఆనందిస్తారో ..!*

*ఏ తల్లి తండ్రులు బిడ్డలకు భారంగా మారాలని కోరుకోరు. తమ పనులు తాము చేసుకుంటూ దాటిపోవాలనే ఆశిస్తారు. అలా జరగనప్పుడు వారి ఆఖరి ప్రయాణానికి అంతులేని ప్రేమను పంచి ఆనందంగా ముగించటం బిడ్డల బాధ్యత.*

*ఆ దేవుడు కూడా మెచ్చుకొనేది అటువంటి జీవులనే.   తల్లి తండ్రులను గౌరవించని వాడు ఎన్ని పూజలు చేసినను ఆ దేవదేవుడు స్వీకరించడు.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
 🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃
*Sri panjarla Mahendra Reddy*

👉 *మొదట గాంధీ మరణించారు, వేల సంఖ్యలో బ్రాహ్మణులు చంపబడ్డారు!*

👉 *రెండవ గాంధీ మరణించారు, వేలాది మంది సిక్కులు చంపబడ్డారు.*

👉 *మూడవ గాంధీ మరణించారు, వేలాది మంది తమిళులు చంపబడ్డారు.*

👉 *గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది!!*

👉  *నన్ను ప్రధానిని చేయండి- నాల్గవ గాంధీ.*

 🤠 *అప్పుడు హిందువుల వంతు చావడం!!??*

 *మీరు సజీవంగా ఉండాలనుకుంటే, తెలివిగా ఓటు వేయండి.*

* *దేశం ముందు*

*హిం.దూ ని..ర్మూల..నకు కాం..గ్రె.స్ చేసిన కృషి..!*
=====================

*1. 1950 లో ఆర్టికిల్ 25 తెచ్చి.. మతమార్పిళ్ళకు తలుపులు బార్లా తెరిచింది.*

*2. అదే 1950 లో ఆర్టికిల్ 28 తెచ్చి.. హిందువులను తమ ధార్మిక విద్య నుండి దూరం చేసి.. అదే చేత్తో.. ఆర్టికిల్ 30 అమల్లోకి తెచ్చి, మైనారిటీలు తమ మౌఢ్యవిద్యను బాలోన్మాదులకు నూరిపోసేందుకు అనుమతిచ్చింది.*

*3. మతమార్పిళ్ళకు అనుమతిచ్చినా & ధార్మిక విద్యకు తమను దూరం చేసినా హిందువులు మూసుక్కూచ్చోడంతో.. తనకెదురు లేదని నిశ్చయించుకొని.. హిందూ నిర్మూలనలో అసలైన అంకానికి 1951 లో తెరతీసింది.. అదే HRCE (Hindu Religious and Charitable Endowment Act) చట్టం. పెద్ద హిందూ ధార్మిక సంస్థలను కాపాడడం కోసమని చెప్పి తెచ్చిన ఈ చట్టం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 4 లక్షల హిందూ ఆలయాలపై పెత్తనం చెలాయించే అధికారం చేజిక్కించుకొంది బ్రి.టిష్‌కాంగ్రెస్. తద్వారా హిందూ ఆలయాల స్థిరచరాస్థులను తమ కబంధ హస్తాల్లోకి తెచ్చుకొని.. వాటి నుండి సమకూరే ఆదాయంతోనే ప్రభుత్వాలను నడపడం ప్రారంభించింది. అదే సమయంలో హిందూయేతర మతపరమైన సంస్థల గోడ మీది సున్నపు పెచ్చు కూడా ప్రభుత్వాలు పీకలేని విధంగా వాటికి సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చాడానెహ్రూగాడు.*

*4. పై చట్టాల ద్వారా.. హిందువుల ధార్మిక మూలాలపై కోలుకోలేని విధంగా విజయవంతంగా  సమ్మెటపోటు వేసిన తర్వాత.. ఇక హిందువుల వ్యక్తిగత & కుటుంబ వ్యవహారాల్లోకి వేలు పెట్టడం మొదలెట్టాడా శృంగారోన్మాది నెగ్రూ. హిందువుల వ్యక్తిగత & కుటుంబ వ్యవహారాలను బ్రి.టిష్‌కాంగ్రెస్ కంపెనీ నియంత్రణ క్రిందకు తేవడానికి.. తద్వారా "చ.ర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ & వా.టికన్" లు హిందూ కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చి పెత్తనం చేసేందుకు వీలుగా.. 1956 లో "హిందూ కోడ్" బిల్లు తెచ్చాడు. కానీ "ముస్లిం పర్సనల్ లా" వాసన కూడా చూడకుండా వారి ఇష్టానికే ఒదిలేశాడు. అంటే ఒకే దేశంలోని మెజారిటీ ప్రజలేమో రాజ్యాంగాన్ని తు.చ తప్పక అనుసరించాలి. మైనారిటీలేమో తమ మతగ్రంథానుసారం పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కని, తలాక్ చెప్పి, మళ్ళీ పెళ్ళి చేసుకొని మళ్ళీమళ్ళీ పిల్లల్ని కనే వెసులుబాటు కల్పించాడు.*

*5. దేశాన్ని ముక్కలు చేసిన అనుభవాన్ని వృధాగా పోనీయకుండా.. రిజర్వేషన్ల పేరుతో దేశంలోని హిందువులందరినీ SC, ST, OBC లుగా విభజించేందుకు సహకరించాడు.*

*6. ఇక 1976 లో ఇందిరమ్మ.. దేశంలో ఎమర్జెన్సీ విధించి, పార్లమెంటులోని ప్రతిపక్ష నేతలందరినీ జైల్లో కుక్కి, ఎలాంటి చర్చ లేకుండా.. ఎంతో పవిత్రమైనది, ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడానికి వీల్లేదంటూ అంబేద్కర్ స్వయంగా రూపొందించిన "రాజ్యాంగ పీఠిక" లోనే 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా "సెక్యులర్ & సోషలిస్ట్" అనే పదాలను చేర్చి దేశంలోని హిందువుల నిర్మూలనకు కీలకమైన ఆఖరి అధ్యాయానికి తెరతీసింది. దాంతో, భారతదేశం హిందూ మెజారిటీ దేశమైనప్పటికీ హిందూ దేశంగా పిలవబడే వీల్లేకుండా చేసిపడ దొబ్బింది. ప్రపంచంలోని ప్రతి దేశమూ.. క్రిస్టియన్ లేదా ఇస్లామిక్ దేశంగా ఠీవిగా చెప్పుకొంటుండగా.. హిందువులకు మాత్రం భూగ్రహంపై తమకంటూ ఒక దేశం లేకుండా చేసేసింది. కొన్ని దేశాలు పైకి మాత్రం సెక్యులర్‌గా డ్రామాలాడినా నిజానికి అవన్నీ క్రిస్టియన్ రాజ్యాలే. ముస్లింలు మెజారిటీలైన దేశాల సంగతైతే చెప్పనే అఖ్ఖర్లేదు. వాళ్ళ డిక్షనరీ లోపలా బయటా ఎక్కడా.. కాగడా పెట్టి భూతద్దంతో వెతికినా సెక్యులర్ అనే పదం కనిపించదు. వారికి మతమే అత్యున్నతం. దేశం అనే భావనే లేదు. ఉంటేగింటే ప్రపంచమంతా తమదేననే.. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా తమదేననే.. ఉన్మాదవాదం వారిది. ఈ 42 వ రాజ్యాంగ సవరణనడ్డుపెట్టుకొనే.. హైదరాబాద్ తీవ్రవాద కవలల్లో పెద్దోడు.. పదే పదే.. ఈ దేశం సెక్యులర్, దేశానికి మతం లేదు.. అనే ఉన్మాదకూతలతో.. పార్లమెంట్ లోపాలా బయటా.. పేట్రేగి పోతుంటాడు. తన సముదాయంలో ఉన్మాదాన్ని రగిలిస్తుంటాడు.*

*7. తర్వాత ఒంతు.. రాజ్యాంగంలో హిందువులకున్న కాస్తోకూస్తో వెసులుబాట్లు మరియు వారి నాగరికత, సంస్కృతులదైంది. ఇందుకోసం 1991 లో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసుకొచ్చింది. దీని కారణంగా.. హిందువులు.. కబ్జాకు గురైన.. తమ వారసత్వ సంపదైన ఆలయాలను తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు/అవకాశం కోల్పోయారు. దీని కారణంగా.. శతాబ్దాల ఉత్కృష్ఠమైన చరిత్ర, పవిత్రత , విశిష్ఠత కలిగిన 40 వేలకు పైగా ఆలయాలపై హక్కు కోల్పోయారు హిందువులు.*

*8. ఆ తరువాత.. 1992 లో ఒచ్చిందే మైనారిటీ కమిషన్ యాక్ట్. దీని కారణంగా మైనారిటీలకు ప్రభుత్వ పథకాల్లో పెద్ద పీట వేసి వారిని ప్రత్యేక ప్రయోజనాలతో బుజ్జగించే అధికారం కాజేసింది బ్రి.టిష్‌కాంగ్రెస్. అలాగే సిక్కులు, జైనులు, బుద్ధిస్టులను మైనారిటీల్లో చేర్చి హిందువుల్లో విభజన తెచ్చి.. మరోసారి తన విభజన అనుభవాన్ని వినియోగంలోకి తెచ్చుకొంది. అందునా దేశం సెక్యులర్ ఐనప్పుడు మెజారిటీ, మైనారిటీలనే విభజన ఎందుకు..?*

*9. ఇక హిందువుల గుండెల్లో గునపం దించిన చట్టం "వక్ఫ్ యాక్ట్ 1954" ను రద్దు చేసి సరికొత్త కోరలతో నూతన "వక్ఫ్ యాక్ట్ 1995" ను అమల్లోకి తెచ్చింది. హిందువులు ఆ చట్టం నుండి తప్పించుకొని పోకుండా చూడ్డానికి.. దేశంలోని ఏ స్థిరాస్థైనా తమదేనని ప్రకటించే వక్ఫ్ నిర్ణయాన్ని ఎదిరించే దమ్మూ ధైర్యం ఈ భూప్రపంచంలో ఎవరికీ లేకుండా చేసే అధికారంతో.. అంటే కోర్టులు కూడా కలుగజేసుకునే అధికారం లేకుండా చేసిన సవరణతో.. 2013 లో ఆ కోరలకు మరొకసారి పదును పెట్టింది. రైల్వేస్, రక్షణ శాఖ తర్వాత వక్ఫ్‌బోర్డ్ దేశంలోకెల్లా అతిపెద్ద భూయజమానిగా రూపొందింది.*

*10. 2004 లో అధికారంలోకొస్తూనే.. హిందువులకు మిగిలిన ఇతిహాసాలపై కన్నేసిన కాంగ్రెస్.. రాముడు, రామాయణం కల్పితం అని, రామసేతు బూటకమని కోర్టులో అఫిడవిట్ సమర్పించింది. దీనికి మెచ్చిన హిందువులు 2009 లో మరోసారి అధికారం అప్పజెప్పడంతో.. మరియు.. వారి సంస్కృతి సాంప్రదాయాలు, వ్యక్తిగత జీవితాలపై ఇన్ని కౄరదురాగతాలు చేసినా హిందువులు నపుంసకులవలే పడుండంతో.. "మతకలహాల నియంత్రణ బిల్లు ( Prevention of Communal Violence Bill) పేరుతో.. హిందూనిర్మూలనలో అసలైన ఆఖరి అంకానికి తెర తీసింది దుష్టకాంగ్రెస్. ఈ బిల్లు ప్రకారం, దేశంలో ఎక్కడ మతకలహాలు జరిగినా, మతకలహాలకు ఏ మతం వారు కారకులైనా, అక్కడి హిందువులనే దోషులుగా నిర్ణయించి బొక్కలో వేస్తారు. మళ్ళీ తాము దోషులం కాదని నిరూపించుకోవాల్సిన మహద్భాగ్యం కూడా హిందువులదే. హిందువులు తమ సాంస్కృతిక కార్యక్రమాలు.. అంటే పండుగలు, పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటే తమ పక్కనున్న అన్యమతస్తుల అనుమతి తప్పనిసరి. కానీ ఆ అన్యమతస్తులకు ఇలాంటి నిబంధన ఏదీ లేదు.. వారి వారి ఉన్మాదాన్ని గ్రవాదాన్ని ప్రదర్శించుకోవడానికి ఎవరి అనుమతీ అక్కర్లేదు. అదృష్టవశాత్తూ అప్పటి బీజేపీ ఎంపీ సుష్మా స్వరాజ్ గారు ఈ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటులో అపరకాళిక వలే తిరగబడ్డంతో, ఆ బిల్లు చట్టరూపం దాల్చలేదు. దేశీయంగా హిందువులను అన్ని కోణాల్లోంచి అణగద్రొక్కినా.. అంతర్జాతీయంగా విస్తరిస్తున్న సనాతనసౌరభాన్ని, హిందువుల ఎదుగుదల, పేరుప్రతిష్ఠలను చూసి.. ఓర్వలేని నీచకాంగ్రెస్.. అంతర్జాతీయంగా హిందువులను అప్రతిష్ఠపాల్జేసేందుకు.. హిందువులపై తీవ్రవాదులుగా ముద్రవేసి.. అసలైతే హిందువులు లష్కర్-ఎ-తోయిబా కంటే భయంకరమైన తీ.వ్రవా.దులుగా పేర్కొని.. రాగుల్‌బూందీ గాడితో ప్రపంచమంతా ప్రచారం చేయించింది.*

*ఐనా.. ఇప్పటికీ దేశంలోని హిందువులకు.. కాంగ్రెస్ అంటే జాంగ్రీ.. దాన్నేమన్నా అంటే యాంగ్రీ..!*
*జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ భారత్ మాతాకీ జై*
*మీ పెంజర్ల మహేందర్ రెడ్డి*
*అఖిలభారత ఓసి సంఘం*
*మరియు (ఈడబ్ల్యూఎస్)* *ఎకనామికల్ వీకర్ సెక్షన్*
 *జాతీయ అధ్యక్షుడు*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
 🙏సూర్యాంజనేయం..అంటే...???.

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿శ్రీఆంజనేయం, ప్రసన్నాంజనేయం అనే స్తోత్రాలు చదివాం, విన్నాం కానీ ఈ సూర్యాంజనేయం అంటే? సూర్యుడు, ఆంజనేయుడికి ఉన్న సంబంధం మనం తెలుసుకోవలసిందే.

🌸 వాల్మీకి రామాయణం, ఇతర పురాణాలు సూర్యుడికీ, హనుమంతుడికీ ఉన్న అనుబంధాన్ని సవివరంగా తెలియజేశాయి/ హనుమంతునికి సూర్యునితో ఉన్న అనుబంధం మరెవ్వరితోనూ కనబడడు..

🌿బాలాంజనేయుడికి సూర్యుడు ఆహారం : హనుమంతుడు బాలుడుగా ఉన్నప్పుడు ఒకసారి ఉదయభానుడిని చూసి ఆకలిగా ఉన్న బాలాంజనేయుడు ఎఱ్ఱని సూర్యబింబాన్ని పండుగా భ్రమించి ఆరగించడానికి ఆకాశానికి ఎగిరాడు. కాని ఇంద్రుని వజ్రఘాతం వల్ల అతని ప్రయత్నం విఫలమైన విషయం మనకు తెలిసిందే. దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే సూర్యుడు బాల్యంలోనే హనుమంతుని ఆకర్షించాడు. ఇది సూర్యాంజనేయుల మొదటి అనుబంధం.. 

🌹 సూర్యశిష్యరికం 🌹

🌸బాల్యంలోనే గాక విద్యార్థి దశకు వచ్చాక కూడా హనుమంతుని దృష్టిని సూర్యుడు ఆకర్షించాడు. తనకు తగిన గురువు సూర్యుడేనని నిర్ణయించుకొని ఆంజనేయుడు ఆయన వద్దకు వెళ్ళి నమస్కరించి విద్యనూ అర్థించాడు. నిత్యం సంచరించే తన దగ్గర విద్య నేర్చుకోవడం అంత సులభం కాదని సూర్యుడు హనుమంతునికి నచ్చజెప్పటానికి చూశాడు. 

🌿కాని చివరికి హనుమంతుడి విద్యా జిజ్ఞాసను అర్థం చేసుకొని శిష్యుడిగా చేసుకోవడానికి సూర్యుడు అంగీకరించాడు. హనుమంతుడు సూర్యుని వద్ద విద్యనూ అభ్యసించిన వివిధ పురాణాలు వేరు వేరుగా చెబుతున్నాయి. 

🌸ఉదయాద్రిపై ఒక పాదం, అస్తాద్రిపై ఒక పాదం ఉంచి నిత్యం సంచరించే సూర్యుని దగ్గర హనుమంతుడు వేదవేదాంగాలు, ఆరు శాస్త్రాలు, దర్శనాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, నాటకాలంకారాలు, 64 కళలు అభ్యసించాడు (గడియకు లక్షా డెబ్బై వేళ యోజనాల వేగంతో ప్రయాణించే సూర్యరథంతో సమానంగా సంచరిస్తూ హనుమంతుడు విద్యాభ్యాసం చేశాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి).

 🌿జిజ్జ్వల్యమానంగా ప్రకాశించే నిత్య గమనశీలి సూర్యుని వద్ద శిష్యరికం చేసిన ఘనుడు వాయుపుత్రుడు ఒక్కడే. సూర్యుని శిష్యరికం వల్లనే శ్రీరాముని మొదటి సమగామంలోనే తన సంభాషణా చాతుర్యంతో హనుమంతుడు ఆకర్షించగలిగాడు. మైనాకుని వినయంతోను, సింహికను శక్తితోను, సురసను యుక్తితోను జయించగలగడం సూర్యుని దగ్గర నేర్చుకున్న 64 కళల ఫలితమే.. 

🌹సూర్యుపుత్రునికి స్నేహితుడు 🌹

🌸సూర్యభగవానుని శిష్యుడైన హనుమంతుడు సూర్యపుత్రుడైన సుగ్రీవునికి మంత్రిగా, మిత్రునిగా సలహాలను, సహాయాన్ని అందించాడు. వాలికి భయపడి దేశాలు పట్టి తిరిగిన కాలంలో సుగ్రీవునికి చేదోడు వాదోడుగా మెలిగాడు. సూర్యపుత్రుడైన సుగ్రీవునికి, సూర్యవంశీయుడైన శ్రీరామునికి చెలిమి ఏర్పడటానికి కారకుడు ఆంజనేయుడే. అంతేగాక రావణ సంహారానికి తోడ్పడే నరవానర మైత్రికి బీజం వేసినవాడు కూడా హనుమంతుడే.. 

🌿సూర్యుని మనుమడు : కొన్ని పురాణాల ప్రకారం హనుమంతుని తల్లి అంజనాదేవి సూర్యుసుతుడైన సుగ్రీవునికి సోదరి. అంటే హనుమంతుడు సుగ్రీవునికి మేనల్లుడు. కనుక సూర్యుడు హనుమంతుడికి తాత.. 

🌹సూర్యుని అల్లుడు : 🌹

🌸వాల్మీకి రామాయణంలో హనుమంతుని వివాహం గురించి కాని, భార్య గురించి కాని ఎటువంటి ప్రస్తావన లేదు. కొన్ని పురాణాల ప్రకారం సూర్యభగవానుని కుమార్తె సువర్చల ఆంజనేయుని భార్య. అంటే సూర్యాంజనేయుల మధ్య మామా అల్లుళ్ళ సంబంధం కూడా ఉంది. పార్వతీదేవి అంశతో అయోనిజగా సువర్చల జన్మించింది.. 

🌹సూర్యవంశీయుని భక్తుడు :🌹

🌿 హనుమంతుని ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు సూర్యవంశీయుడు కావడం విశేషం. తన గురువు వంశంలో అవతరించిన మహాపురుషుని సేవించుకునే మహాద్భాగ్యం హనుమంతునికి దక్కింది. గురువు ఋణం తీర్చుకోవడానికి ఇది గొప్ప అవకాశం.

 🌸శ్రీరామునితో పరిచయమైనా నాటినుండి హనుమంతుడు రాముని సేవకే అంకితమయ్యాడు. అనితర సాధ్యమైన సముద్ర లంఘనం చేసి, శత్రు దుర్భేద్యమైన లంకలో సీతమ్మ జాడ కనిపెట్టడం ద్వారా శ్రీరామునికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు. సంజీవినిని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడాడు. సీతారాములను హృదయంలో నిలుపుకోవడం హనుమంతుని భక్తికి పరాకాష్ట. శ్రీరామభక్తులకు హనుమంతుడు సర్వదా సంరక్షకుడిగా ఉంటాడు.. 

🌿త్రిమూర్తుల శక్తి : సూర్యవంశ సంజాతుడైన శ్రీరాముడు మహావిష్ణువు అవతారం. హనుమంతుడు శివాంశ సంభూతుడు. అంటే రామాంజనేయుల అనుబంధం శివకేశవుల అభేదానికి ప్రతీక. హనుమంతుని భవిష్యబ్రహ్మగా కూడా పురాణాలు పేర్కొన్నాయి. కనుక వీరిద్దరి కలయికతో త్రిమూర్తులు ఏకామైనట్టే. 

🌸సూర్యుని కూడా త్రిమూత్రుల స్వరూపంగా శాస్త్రాలు నిర్వచించాయి. కాబట్టి శ్రీ సూర్యరామాంజనేయులను ద్విగుణీకృతమైన శక్తికి సంకేతంగా అభివర్ణించ వచ్చు. ఇలా గురుశిష్య బంధంగా మొదలైన సూర్యాంజనేయుల అనుబంధం త్రిమూర్త్యాత్మకంగా విస్తరించింది...🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
 *🙏🪔ఐదురోజుల దీపావళి 🪔🙏*

1 - ధన్వంతరీత్రయోదశి - వాడుకలో ధన త్రయోదశి అని అంటూ ఆ రోజు బంగారం కొనాలనే ఆశ పడుతున్నాం!!కానీ ఆరోజు "ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి మూల పురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన "ధన్వంతరీభగవాన్"
జయంతి ! పాల సముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృతభాండముతో అవతరించాడు !!

2 - నరకచతుర్దశి - నరక యాతనల నుండి రక్షించమని యముడి ప్రీతి కొరకు మరియు పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలి ! నరకుడు చనిపోయిన రోజు కూడా ఇదే రోజు!!శ్రీకృష్ణ భగవానుడు - సత్యభామ(భూదేవీ అవతారం)తో కలసి గరుడారూడుడై వచ్చి శక్తి ఉపాసకుడైన నరకుని శక్తి (సత్యభామ) సహకారంతో సంహరించాడు ! నరకుని పీడ విరగడైంది కావున ఇది 'నరక చతుర్దశి' !!

3 - దీపావళీ - రావణ సంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన శుభ సంధర్భఁగా దీపావళి జరుపు కోవాటం , నరకుని బాధలనుండి విముక్తి లభించిన ఆనందంలో దీపావళిని జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం !!
దీపం - లక్ష్మీ స్వరూపం - ఐశ్వర్య స్వరూరం - జ్ఞానస్వరూపం అందుకే మనం దీపావళీ రోజు లక్ష్మీపూజలు చేస్తాము !! వ్వాపారస్తులు కొత్త లెక్కలు వ్రాసుకుంటారు !!

4 - బలిపాఢ్యమి - వామనావతారంలో శ్రీమన్నారాయణుడు బలి చక్రవర్తిని 'మూడు అడుగుల' నేలను దానమడిగాడు !వామన వటువు కు దానమిచ్చాడు బలి, "ఇంతింతై వటుడింతై నభోరాశిపై నల్లంతై" అన్నట్లుగా ఒకపాదంతో భూమిని, ఇంకోపాదంతో ఆకాశాన్ని ఆక్రమించిన 'త్రివిక్రముడు' వేరొక పాదంతో బలిని పాతాళానికి అణచాడు ! సంవత్సరానికి ఒకసారి బలి పాడ్యమి రోజున బలి భూలోకానికి వచ్చి ఇక్కడి దీపకాంతులను చూసి మనమంతా సుఖశాంతులతో వుండాలని ఆశీర్వదించి వెలతాడట ఇదీ ఆయనకు వామనుడిచ్చిన వరం !!

5 - యమద్వితీయ
సూర్యభగవానునికి యముడు - శనిదేవుడు ఇద్దరు పుత్రులు ! యమున అనే ఒక పుత్రిక కలదు !యముడు - యమున ఇద్దరూ అన్నా చెల్లెలు కదా ! తనపని (జీవులను ఆయువు మూడిన తర్వాత తన యమపాశం తో ఈడ్చుక వచ్చి వారి వారి కర్మాను సారం వారి వారికి తగిన శిక్షలు విధించే పని)లో పడి పాపం చెల్లెలింటికి వెళ్ళటం లేదు యముడు !! చెల్లి బతిమాలింది ఒకసారి మా ఇంటికి రా అన్నయ్యా !! అని బతిమాలింది చెల్లెలు!! కార్తీక శుద్ఘ విదియ{మంగళవారం} రోజు తీరిక చేసుకుని తన చెల్లెలింటికి వెల్లి హాయిగా కొద్ది సేపు వుండి భోజనం చేసి వచ్చాడు యముడు !! చెల్లెలైన యమున అన్నయ్యను ఒక వరం అడిగింది ! ఎవరైతే ఈరోజు చెల్లెలింటికి వెల్లి చెల్లెలికి కట్నకానుక లిచ్చి వాల్లింట్లో భోజనం చేసి వస్తారో వారికి యముని బాధలు లేకుండా చేయి అని అడిగింది !! ఈ యమునమ్మనే యమునా నది ! కృష్ణ భక్తురాలు ! .🙏🪔🪔🪔🪔🙏

****భార్యాభర్తల అనుబంధం

 *భార్యాభర్తల అనుబంధం*

నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు.

తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ... తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే.

అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు.
అహంకారి భార్య దొరికితే అంబానీ అయినా సన్యాసంలో కలవాల్సిందే.

ప్రతి భర్త తన భార్యను... మరో తల్లి రూపంగా భావిస్తే..
ప్రతి భార్య తన భర్తను.. మొదటి బిడ్డగా పరిగణిస్తుంది...
ఇదే మధురమైన బంధం... ఇప్పటికీ... ఎప్పటికీ...

భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం
బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం.

సంసారం అంటే కలసి ఉండడమే కాదు.
కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ తోడూ వీడకుండా ఉండడం.

ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడు ఏమో కానీ
అర్థం చేసుకునే భర్త
ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని...
మళ్లీ తన భార్య కళ్లలో
కన్నీరు రాకుండా చూసుకుంటాడు.

భార్యాభర్తల సంబంధం శాశ్వతం.
కొంతమంది మధ్యలో వస్తారు.
మధ్యలోనే పోతారు.
భార్యకి భర్త శాశ్వతం.
భర్తకు భార్య శాశ్వతం.

ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణీ...
గొప్ప విద్యావంతురాలి కిందే లెక్క...!

అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు.
భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు.

మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ల బంధం
ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది 'మాంగల్య బంధం'.

బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే
ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి.
మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి.

మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది.
కానీ, తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది.

కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా... సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది.
భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది.

నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే.
నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే.

ప్రేమ అనేది చాలా విలువైనది.
దాన్ని 'వివాహం' అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.

సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం - కుటుంబం.

గొడవ పడకుండా ఉండే బంధం కన్నా...
ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం.

పెళ్లి అనేది అందమైన పూలవనం లాంటిది.
ఆ వనంలో మనం నాటే చెట్లు అందమైన పువ్వులనిస్తాయి.

వివాహ వార్షికోత్సవం అంటే
ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పు ల సంగమాన్ని పండుగ చేసుకోవడమే.

నేలకు జారిన తారకలై
ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు!!

సప్తపది ఏడు అడుగులు
మొదటి అడుగు - అన్న వృద్ధికి
రెండవ అడుగు - బలవృద్ధికి
మూడవ అడుగు - ధన వృద్ధికి
నాల్గవ అడుగు - సుఖవృద్ధికి
ఐదవ అడుగు - ప్రజాపాలనకి
ఆరవ అడుగు - దాంపత్య జీవితానికి
ఏడవ అడుగు - సంతాన సమృద్ధికి

కోరుకున్న ఇంతి... నేడు నీ సతి...
నేడు పట్టుకున్న ఆమె చేయి...
విడవకు ఎన్నటికీ.

వివాహాన్ని సుఖమయం చేసుకోవడానికి మీరెంత పొందికగా ఉన్నారనేది కాదు.
పొందిక లేని విషయాలను మీరెలా సర్దుకుంటున్నారనేది ముఖ్యం.

కలిమి లేములతో...
కలసిన మనసులతో...
కలివిడిగా మసలుకో..
కలకాలం సుఖసంతోషాలు పంచుకో...

బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది.
పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే.
ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ...
మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు.

మగవాడు గాలి పటం
(అందని ఎత్తులకు ఎదగడం తెలుసు, కానీ తనను తాను నియంత్రించుకోవడం తెలీదు)
ఆడది దారం, అతడికి ఆధారం
(ఆమెకు వెన్నంటి ప్రోత్సహించడం తెలుసు, కానీ ప్రతిభను పదిమందికి ప్రదర్శించడం తెలీదు)
విడివిడిగా దేనికీ విలువ లేదు
ఒకటైతే ఇద్దరికీ తిరుగులేదు.

భర్తకి భార్య బలం కావాలి
బలహీనత కాకూడదు
భార్యకి భర్త భరోసా కావాలి
భారం కాకూడదు
భార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి
అయోమయం కాకూడదు.

మనసులోని ప్రేమని, బాధని కళ్లలో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు.

అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే
ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే.

పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా, కష్టం- సుఖం గురించి కాదు.
ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం.

ప్రతీ అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం.
కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం.....
29-10-2024-మంగళవారము - శుభమస్తు. 
🌹🌹🌹🌹 గుడ్ మార్నింగ్ 🌹🌹🌹🌹
జీవితపు ఆటలో ఉండేది నిరంతర కదలిక అంటే మార్పు. దీనిని నియంత్రించటం - అనుకూలముగా మార్చుకోవటం వీలుకాదు అని తెలిసి - ఏ పరిస్థితినైనా అంగీకరించి ఉండగలగటం జ్ఞానము..........................
మన జీవితములో లేక మన వారి జీవితాలలో జరిగే ఏవైనా - మన గత పనులను బట్టి వచ్చే ఫలితాలు..................
అవి ప్రస్తుత అనుభవాలు కావచ్చు - భవిష్యత్తుకు మలుపులు కావచ్చు - జీవితం నేర్పే పాఠాలు కావచ్చు - ఇచ్చే కానుకలు కావచ్చు - ఆధ్యాత్మిక ప్రయాణానికి దారులు కావచ్చు -చేసిన తప్పులకు శిక్షలు కావచ్చు.
ఈ కావచ్చు అనుకోవటం - అప్పటి మన మానసిక స్థితిని బట్టి, భావించటం, జీవించటం తప్ప - మార్పు తప్పదు...........
ఈ సత్యం అర్ధమయ్యేలా చెప్పి - పనులను బట్టి వచ్చేవి ఫలితాలు కనుక - మన భావనలు, పనులు మంచిగా ఉండేలా జీవించమని చెప్పేది ఆధ్యాత్మికత.  మంచిగా జీవిస్తున్నప్పుడు మన జీవితములో జరిగే మార్పులు ప్రస్తుతానికి మనము మంచివి అనుకున్నా - చెడ్డవి అనిపించినా - భవిష్యత్తుకు అవి మంచి దారులే అనేది ఆధ్యాత్మిక చెప్పే సత్యము.
అందువలన మంచి వారు ఆందోళనలకు గురి అవ్వవలసిన అవసరము లేదు.....
చెడ్డవారు ఆందోళన పడినా ఉపయోగము లేదు... మంచిగా జీవిద్దాము..
............    Good only is god  ............
🌹🌹🌹🌹 god bless you 🌹🌹🌹🌹

 రామాయణమ్.98
...
ఇందీవరశ్యాముడు!సార్వభౌమకులసంజాతుడు,సర్వలోకప్రియుడు,ప్రియదర్శనుడు,అసలు దుఃఖమునకు అర్హుడేకాని రాఘవుడు అన్నిసుఖాలు పరిత్యజించి నేలపైపడుకొన్నాడు కదా !లక్ష్మణుడు ధన్యుడు ఈ సమయంలో ఆయన వెంట ఉన్నాడు.
.
రాముడు అరణ్యములో ఉన్నా ఆయన బాహుబలమే అయోధ్యకు రక్ష! అందుచేతనే ఎవ్వరికీ దీనిని ఆక్రమించాలనే ఆలోచన రాదు .ఈనాడు అయోధ్య ప్రాకారమునకు రక్షణలేదు,చంతురంగబలాలలో యుద్ధసన్నద్ధతలేదు ,పట్టణద్వారాలన్నీ తెరచి ఉన్నాయి అయినా ఒక్కడికి అయోధ్యను కన్నెత్తి చూసే ధైర్యం లేదు అంటే అది రాముడి శౌర్యప్రతాపాలవల్లకాక మరిదేనివల్లనూ కాదు.
.
రాముడు నారచీరలు ధరించి అరణ్యములో ఉంటే నాకు ఈ పట్టువస్త్రములెందుకు నేను కూడా జటలు,నార చీరలు ధరించి ,కందమూలములు తింటూ ,నేలపై నేటినుండి శయనింతును గాక అని తీర్మానించుకొన్నాడు భరతుడు.
.
ఆ రాత్రి గంగా తీరమందే నివసించి మరునాడు తెలవారుతుండగనే శత్రుఘ్నుని లేపి ఇంకా నిదురపోతున్నావేమి త్వరగా గుహుని పిలుచుకొని రా అని తొందరచేశాడు.
.
అప్పుడు శత్రుఘ్నుడు భరతునితో అన్నా ,అన్న రామన్న అడవులలో ఉంటే నాకు నిదుర ఎలా పడుతుంది? నా మనస్సునిండా రామన్న ఆలోచనలే నేను మేల్కొనే ఉన్నాను ! నీ ఆజ్ఞకోసమే ఎదురు చూస్తున్నాను ..అని అన్నాడు
.
అదే సమయానికి గుహుడు వచ్చి భరతుడి ఎదురుగా నిలుచొని వారిని కుశలప్రశ్నలు వేశాడు.
.
భరతుడికి  సమయం గడుస్తున్నకొద్దీ తొందరహెచ్చవుతున్నది ,గుహుడిని త్వరగా నది దాటించమని కోరాడు.
.
భరతుడి తొందర గమనించాడు గుహుడు.వెంటనే తన నగరులోకి వెళ్ళి వందలకొద్దీ పడవలను నౌకలను సన్నద్ధం చేశాడు.
.
బయలు దేరటానికి భరతుని ఆజ్ఞ అయ్యిందని తెలుసుకొన్న కొందరు నదిలో దూకి ఈత కొడుతూ బయలుదేరారు,కొందరు అప్పటికే తయారుచేసుకొన్న తెప్పలు నదిలో దించారు.కొందరు కడవల సహాయంతో నీటిలో తేలుకుంటూ వెళ్ళారు.
.
గుహుడు తెప్పించిన నావలన్నీ శ్రేష్టమైనవి.వాటిపేర్లు స్వస్తికములు! అత్యంత దృఢమైన నావలవి.
.
అందరూ నావలెక్కారు,కొన్నింటి యందు రధ,గజ,తురగాలు ఎక్కించారు ,కొన్ని నావలలో జనమంతా ఎక్కి నిల్చున్నారు ,కొన్నిటి యందు దశరధాంతఃపురవాసులు ఎక్కారు.
.
హైలెస్సా హైలో హైలెస్సా అంటూ గంగలో ప్రయాణము చేస్తున్నాయి ఆ నావలన్నీ .కొంతమంది నావలను నడిపే వారు వాటిని చిత్రవిచిత్రరీతులో నడుపుతున్నారు .
నది అంతా నావలు ఆక్రమించి జలముమీద ఒక మహానగరము నిర్మింపబడెనా అన్నట్లున్నది.
.
భరతుడి నావ   మైత్రీముహూర్తమందు ఆవలిఒడ్డును చేరుకుంది.గుహుడుకూడా వారి వెంట ఉన్నాడు.
..
(మైత్రీ ముహూర్తమంటే ఉదయం 7.04 ని నుండి 8.36 ని
రోజును పదిహేను భాగాలు చేయగా అందులో మొదటి మూడవ భాగము మైత్రీ ముహూర్తము అనబడుతుంది.అనగా రెండు గడియలు).
.
అల్లంత దూరాన భరద్వాజ మహర్షి ఆశ్రమము కనపడుతున్నది.
సైన్యాన్ని అక్కడే ఉంచి మహర్షివశిష్ఠుల వారితో కలిసి భరతుడు ఆశ్రమము వైపుగా అడుగులు వేశాడు.
.
వూటుకూరు జానకిరామారావు