Friday, February 28, 2025

లవ్ జిహాద్ ఫలితం ! మాధురి గుప్తా భారత విదేశాంగ సేవలో సీనియర్ అధికారిణి.

 

లవ్ జిహాద్ ఫలితం  ! 

మాధురి గుప్తా భారత విదేశాంగ సేవలో సీనియర్ అధికారిణి.

ఆమె వయస్సు 52 సంవత్సరాలు కానీ అవివాహితురాలు. ఆమె ఈజిప్ట్, మలేషియా, జింబాబ్వే, ఇరాక్, లిబియాతో సహా అనేక దేశాలలో సీనియర్ పదవులలో పనిచేసింది.

 ఉర్దూపై ఆయనకున్న మంచి పట్టు కోసం, ఆయనను పాకిస్తాన్‌కు పంపారు, అక్కడ ఆయనకు వీసాతో పాటు మీడియా బాధ్యతలు కూడా ఇచ్చారు. పాకిస్తాన్‌లో నియమించబడిన అధికారులందరిపై నిఘా వర్గాలు నిఘా ఉంచాయి. ఒక పార్టీలో, మాధురి గుప్తా జంషెడ్ అలియాస్ జిమ్మీ అనే 30 ఏళ్ల యువకుడిని కలిశారు. ఆ యువకుడు తన వాక్చాతుర్యం మరియు తెలివితేటలతో మాధురి గుప్తా హృదయాన్ని గెలుచుకున్నాడు మరియు మాధురి గుప్తా అతనితో ప్రేమలో పడింది. ఇది మాత్రమే కాదు, మాధురి గుప్తా ఇస్లాం మతంలోకి కూడా మారారు. మాధురి గుప్తాపై నిఘా వర్గాలు దృష్టి మరింత తీవ్రమైంది. ఆమె ఇమెయిల్‌లు మరియు ఫోన్‌ను నిఘాలో ఉంచారు. అప్పుడు మాధురి గుప్తా జంషెడ్‌తో ప్రేమలో ద్రోహిగా మారిందని మరియు ఆమె భారతదేశ రహస్య సమాచారాన్ని జంషెడ్‌కి చెబుతోందని తెలిసింది. 

నిజానికి, జంషెడ్ ISI గూఢచారి.  మాధురి గుప్తాను ట్రాప్ చేయడానికి ISI అతనికి శిక్షణ ఇచ్చి, అతనిని నియమించింది, ఎందుకంటే మాధురి గుప్తా 52 సంవత్సరాల వయస్సులో అవివాహిత అని ISIకి తెలిసినప్పుడు, ఆమె ఖచ్చితంగా భాగస్వామి కోసం వెతుకుతుంది. ఆ తర్వాత, ఆమెను ఏదో ఒక నెపంతో భారతదేశానికి పిలిపించి, ఆమె ఢిల్లీలో దిగిన వెంటనే అరెస్టు చేశారు.

 ఆమె అన్ని ఆధారాలను చూసినప్పుడు, ఆమె నేరాన్ని అంగీకరించింది మరియు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.

కానీ కోవిడ్ మహమ్మారి సమయంలో, ఆమె కొంతకాలం జైలు నుండి బెయిల్ పొందింది మరియు ఆమె అజ్ఞాతంలో అజ్మీర్‌కు వెళ్లింది, ఆపై మాధురి గుప్తా అజ్ఞాతంలో మరణించిందని, ఆమెకు కోవిడ్, డయాబెటిస్ మరియు అనేక ఇతర వ్యాధులు ఒకేసారి వచ్చాయనే వార్తలు వచ్చాయి.

ఆమె అంత్యక్రియలను స్థానిక ప్రజలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ కూడా నిర్వహించారు. ఆమె మరణం తరువాత, ఏడ్చడానికి ఎవరూ లేరు లేదా అంత్యక్రియలు నిర్వహించడానికి మరెవరూ లేరు.

 ఈ నిజమైన మరియు గత కథను పంచుకోవడంలో ఉన్న ముఖ్య విషయం ఏమిటంటే, ఇంత చదువుకున్న  ఇంత సీనియర్ పోస్ట్‌లో పోస్ట్ చేయబడిన 52 ఏళ్ల పరిణతి చెందిన మహిళ కూడా లవ్ జిహాద్‌లో చిక్కుకుంటుంది, 

అలాంటప్పుడు పద్నాలుగు, పదిహేను, పదహారు సంవత్సరాల వయస్సు గల అమాయక బాలికలు ఏ వలలో చిక్కుకోకూడదని మనం ఎలా ఆశించగలం?

ప్రతిసారీ, లవ్ జిహాద్ మరియు లవ్ జిహాద్‌లో హత్యకు సంబంధించిన ప్రతి సంఘటనకు ప్రతిస్పందన ఏమిటంటే, అది మంచిది, దాని పట్ల మనకు సానుభూతి లేదు.

మనం హిందువులు దాదాపు ప్రతిరోజూ ఇలాంటి సంఘటనలను ఎదుర్కొంటున్నప్పటికీ జాగ్రత్త వహించడంలో విఫలం అవుతూనే ఉన్నాము

Reference - https://www.thehindu.com/news/national/death-of-former-diplomat-buries-spy-case/article37271340.ece

Finally, Scientists Accept That They Are Far Behind The Hindu Sages! Reaction

 Finally, Scientists Accept That They Are Far Behind The Hindu Sages! Reaction

https://youtu.be/7gUnbgR7Yys?si=bgDN2qepvHDfgbtS





 ****

దొరస్వామికి ఏదో అయింది. 
అతడికి ఆడపిల్ల లాగా పావడ, రవిక తొడుక్కోవాలనిపిస్తోంది. 
పూలు పెట్టుకోవాలని కోరికగా వుంది. 
పచ్చటి పొలంలో పనిచేసేప్పుడు ఆడపిల్లల్లా ఊహించుకుంటూ పాటల పాడాలనిపిస్తోంది. 

ఏడో తరగతిలో చంద్రమతి వేషం వేసినప్పుడు పట్టరాని సంతోషం వేసింది .తాను అబ్బాయి అయినా మగ పిల్లల్ని ప్రేమించాలని ఉబలాటంగా వుంది.

అదొక స్వభావం! 
మగ, ఆడ పిల్లల లాగే ఇలాంటి వాళ్ళూ ప్రకృతిలో వున్నారు. 
అక్షరాలా 1, 53, 24 ,000 మంది– 
కజకిస్తాన్, ఈక్వెడార్, కంబోడియా దేశాల జనాభా అంత మంది ఈ భూమి మీద వున్నారు ! 
దొరస్వామి కూడా ఇలాంటి వాడే ! 

దొరస్వామి అత్యంత సహజంగా రేవతిగా మారాడు. 
కానీ ఆ ప్రస్థానం ఎంత దుర్భరమైంది !ఎంత విహ్వలమైంది !ఎన్ని పచ్చి నిజాలు మరెవ్వరికీ తెలియనివీ, తెలిసినా కళ్ళు మూసుకున్నవీ అందులో వున్నాయి!

ఈ కథ సొంత కథ. రేవతి రాసిన “ఉనర్వం ఉరువమం” తమిళ మాతృకను సుప్రసిద్ధ స్త్రీవాద రచయిత్రి సత్యవతి గారు “ఒక హిజ్రా ఆత్మకథ ” పేరుతో తెలుగులోకి తెచ్చారు.( అనువాదానికి మూలం ఆంగ్లంలోని The truth about me-A Hijra life story ). మంచి పుస్తకాల మాతృసంస్థ “హైదరాబాద్ బుక్ ట్రస్ట్” దీన్ని ప్రచురించింది.

దొరస్వామికి వచ్చిన మొదటి సమస్య ఇక తాను ఇంటిలో వుండలేకపోవడం. ఈ శారీరక పరిణామాన్ని అంగీకరించి కొడుకుల్లాగా, కూతుళ్ల లాగా తల్లిదండ్రులు ప్రేమగా, పెంచి పోషించే పరిస్థితి లేదు. నిత్యం ఘర్షణ, తన్నులు, అవమానాలు, గెంటివేతలు! మరోవైపు వుండవట్టనివ్వని శరీరం. వీటి మధ్య రేవతి పడ్డ నరకయాతన మన కడుపు చుమ్మలు చుట్టేస్తుంది. ఇదేమీ కథ కాదు. అమె అనుభవించిన నిజం. పచ్చి నిజం. మన నాగరిక సమాజం దీన్నెందుకు ఒక సంప్రదాయంగా మార్చిందో అర్థం కాక మనసు వికలమవుతుంది.

దొరస్వామి రేవతిగా మారడానికి చాలా తతంగం వుంది. దానికి మొదట తన పురుషాంగ అవశేషాన్ని ఆపరేషన్ చేసుకోవాలి. దీన్ని “నిర్వాణం” అంటారు. ఇందుకోసం ఒక గురువు కావాలి. ఆ గురువుకు కూతురిగా అంటే “చేలా” గా చేరాలి. “పొట్టం” హిజ్రాగా మారడానికి “జమాత్ “సమావేశం కావాలి. ఇది “రేవతి కోసం దీన్ దీన్ ” అని నెమ్మదిగా అనాలి. ఇక అప్పటినుంచి ఈ హిజ్రాకు గురువే సర్వస్వం. ఆ గురువు బంధువులే, శిష్యులే తన బంధుగణం. తర్వాత అన్ని గురువే చూసుకోవాలి. ఆ గురువుకు బిక్షమెత్తి, సెక్స్ వర్క్ చేసి కానుకలు ఇవ్వాలి.

హిజ్రాలు ఏర్పరచుకున్న సొంత సంస్థ ఇది. జమాత్ హిజ్రాల మంచి చెడ్డలు చూచే వ్యవస్థ. దీని పరివార్ లో ఎక్కడెక్కడి వారూ ఇమిడిపోతారు. ఆ పరివార్ లకు తెగలు వుంటాయి. కాకుంటే అందులో కులాలు వుండవు.. (హమ్మాయ్య! వీళ్ళకైనా కులాల బెడద తప్పింది ఈ పుణ్యభూమిలో!) ఇదంతా చదివినప్పుడు మనకు తెలియని సంప్రదాయాలు, కట్టుబాట్లు, వ్యవస్థలు ఇన్ని వున్నాయా అనిపిస్తుంది. హిజ్రాలు ఎంతటి చట్రంలో ఇరుక్కుపోయారా అని ఆశ్చర్యం వేస్తుంది.

శ్రీరాముడు వనవాసాంతరం వీరికి “మీ పలుకు ఎప్పుడూ సత్యమగు గాక” అని వరమిచ్చాడట. హిందీ దేశం వీరిని గౌరవిస్తుందట. పెళ్లికి, ప్రసవాలకు పిలిచి సత్కరిస్తారట. హిజ్రాలు పిల్లల్ని దీవిస్తారట. వరమో శాపమో. గాని ఇదే బాగున్నట్టుంది ! అలా వీళ్ళ జీవితం గడిచినా గౌరవప్రదంగానే వుండేది. కానీ ఏం చేద్దాం అంతటి రాముడి వరమూ హిజ్రాల విషయంలో ఇలా తెల్లారింది .

మహాభారత యుద్ధం మొదలైనప్పుడు ఒక నరుడిని బలి ఇవ్వాల్సి వచ్చిందట. కృష్ణుడు, అర్జునుడు తప్ప అలాంటి వీరుడు ఎవరూ లేకపోతే అర్జునుడికి నాగ కన్యకు పుట్టిన “అరవాన్” దీనికి సరిపోతాడని తీసుకొచ్చారట. బలికి ముందు అరవాన్ తనకు దాంపత్య సుఖం కావాలని పట్టుబట్టాడట. అప్పుడు కృష్ణుడు పెళ్లికూతురై అతన్ని పెళ్లాడట. అరవాన్ చనిపోగానే కృష్ణుడు విధవగా మారి పోయాడట. తమిళనాడులోని విల్లుపురం జిల్లా కూవగంలో చైత్ర పూర్ణిమ రోజు అరవాన్ ఉత్సవం జరుగుతుంది. అక్కడికి వేల మంది హిజ్రాలు చేరుతారు. పట్టుచీరలు కట్టుకొని, పూలు పెట్టుకొని, తాళిబొట్లు ధరించుకొని పండగ చేసుకుంటారు. అరవాన్ బలిపీఠం ఎక్కగానే తాలిబొట్లు తెంచేసి, పూలు విసిరేసి వితంతువుల్లా మారి హృదవిదారకంగా ఏడుస్తారు. అందుకే తమిళంలో హిజ్రాల్ని “అరవాణి” అని పిలుస్తారు. అంటే హిజ్రాలకూ ఒక పురాణం వుంది. ఒక దేవుడున్నాడు. ఒక వారసత్వం వుంది. పాపం ఇవన్నీ ఎన్ని వున్నా వాళ్లకు మిగిలింది మాత్రం కన్నీళ్ళు, కష్టాలు తప్ప ఏమీ లేదు.

రేవతి కథ నిండా అవమానాలూ, వేధింపులూ, ఎవరూ తనకంటూ లేరనే ఒంటరితనం, పూట గడవడం కోసం ఇష్టం లేని పనులు చేయాల్సి రావడం ఒకవైపు కనిపిస్తే ; సమాజంలోని ప్రతి వ్యవస్థ హిజ్రాల పట్ల ఎందుకు అంత క్రూరంగా నీచంగా వ్యవహరిస్తోందన్న ఆవేదన మరొకవైపు కనిపిస్తాయి. వాళ్ల తల్లిదండ్రులే కావచ్చు. పోలీసులే కావచ్చు. విటులే కావచ్చు. సంస్కర్తలే కావచ్చు. తోటి మహిళలే కావచ్చు. నమ్ముకున్న గురువులే కావచ్చు. ఎవరి నుంచి చూచినా, ఏ వైపు నుంచి చూచినా ఒక్కింత సానుభూతీ దొరకని సమాజంలో వీరుండడం హృదయ విదారకమే కాదు, ఏవగింపు కలిగించే అంశం. ఈ ఏవగింపు క్రోధంగా, తిరుగుబాటుగా ఎప్పుడు మారుతుందో మరి! వీళ్ళ కోసం ఏ బుద్ధుడో, ఏ ఏసుక్రీస్తో ఎప్పుడు పుడతారో మరి!

అన్నిటికంటే ముఖ్యమైన కోణం ఒక స్త్రీగా తనకు గుర్తింపు కోసం, గౌరవం కోసం, తోడు కోసం, శారీరక తృప్తి కోసం రేవతి పడే ఆవేదన, అడుగడుగునా చేసే పోరాటం. ఇవన్నీ ఫలించి ఒక తోడు దొరికిందంటే అతడు కూడా పక్కలో పామని తెలిసి రావడం రేవతి జీవితంలో తిరిగిరాని మలుపు! వయసు మీద పడ్డాక మళ్ళీ పాతవృత్తిలోకి పోలేక, అమ్మని వదులుకోలేక, తనకంటూ ఏమీ మిగుల్చుకోక దారీ తన్నూ లేని దశలోనే ఈ ఆత్మకథ ముగిసిపోవడం మనసును మెలిపెట్టేస్తుంది. భారంగా ముగించాక రోజుల తరబడి వెంటాడే పుస్తకమిది!

దీన్ని వీలున్నంతమంది చేత చదివించాలి. కొని చదివించాలి. చర్చించాలి. కనీసం మనకు తెలియని విషాదాలు మన చుట్టూ వున్నాయన్న స్పృహనైనా మనలో ఎంత మందికి పెంచగల్గితే అంత పెంచాలి.

రేవతి మన తెలుగు అమ్మాయే అనిపించేలా సత్యవతి గారు చేసిన అనువాదం అనువాదకులందరికీ అనుసరణీయం, ఆదర్శం!

- విఠపు బాల సుబ్రహ్మణ్యం
 ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*ఇప్పటికీ వెధవనే*
〰️〰️〰️〰️
అదేంటో
నేనిప్పటికీ వెధవనే..
.
నోట్సు వ్రాయలేదని
మాష్టారు బెత్తంతో కొట్టినప్పుడు.‌
నేను వెధవను...
.
ఇప్పుడు
స్టూడెంట్ నోట్సు వ్రాయలేదని
నన్ను పైవాడు తిట్టిపోస్తున్నపుడు..
నేను వెధవనే....
.
ఒంటేలుబెల్లలో
నా కాల్లో ముల్లుగుచ్చుకున్నపుడు...
ఇప్పుడు
ఇంటర్వెల్ లో స్టూడెంట్
రాయితన్నుకు పడ్డప్పుడు..
నేను వెధవనే....
.
మార్కులు రాలేదని
తరగతి లో మాస్టర్
ఇంట్లో నాన్న కొట్టినప్పుడు 
నేను వెధవనే....
.
ఇప్పుడు
కష్టించి బోధించినా
స్టూడెంట్ చదవక
మార్కులు పొందిక పోతే
అధికారి ముందు 
నేనే వెధవను...
.
తరాల విద్యావ్యవస్ధ 
వెర్రితలల విషపుకాటులమధ్య
పంతులుగా
వంతులుగా
వెధవగానే ఉన్నా...!!
.
చదువు
సామాన్యుడి చేతినుండి జారి
కార్పొరేటు కబంధహస్తాలమధ్య
లయం అయ్యేదాకా
నేనెధవనే...!!!
.
....------ శ్రీగోరస
(నాగురించి నేను.. గోక్కుంటున్నాను)
😚😚😚😚😚😚😚😚😚😚😚
 ఆపుగురూ!ఆపు!
****************
విశ్వగురువా!
ఏం చేస్తున్నావ్ గురువా!
నోరువిప్పవే!
సిగ్గెయ్యటం లేదా!
అవమానంగా లేదా!

భారతీయవిద్యార్థులు 
చదువుకోసం వెళితే 
సంకెళ్లు బేడీలువేసి 
యుద్ధవిమానాల్లో 
భారత్ గడ్డమీద 
దించి పోతున్నాడే!

దాన్ని సినిమా తీసి 
ప్రపంచానికి 
ప్రదర్శిస్తున్నాడే !
ఇంత విరగబాటా!
ఏం చేస్తున్నావ్ గురూ!

పంజాబ్ లోనే ఎందుకు?
గుజరాత్ లో దించు!
ఆ సీ ఎం అడిగాడు!
ఆలోచించాల్సిందే!
పంజాబ్ హర్యానా 
ప్రజలతో నీకేమన్నా 
రాజకీయ కక్షా?

ట్రంప్ తో కలిసి 
కుట్ర చెయ్యలేదుకదా!
సొంత దేశీయులకే 
మూతికి ముంత 
ముడ్డికి చీపురు 
కట్టినవాళ్లు మీరు!

మీకు 'వీళ్ళు' ఎంతో 
వాళ్ళకు 'మనం' అంత!
మనవాళ్ళను మనమే 
హీనం చేసుకున్నాం!
బైటోళ్ళు గౌరవిస్తారా?
మనచరిత్ర తెలుసు!

సంకెళ్లు-బేడీలు 
ముంత-చీపురు 
ఏదో సామ్యం 
కనిపిస్తోందికదూ!
మానావమానాల్లేవు 
మీరేదన్నా చేస్తారు!

పాపం!చదువుకోసం 
వెళ్లిన బిడ్డలు!
దొడ్డిదారో!
అడ్డ దారో!
ఇక్కడ పెద్దోళ్ళనుచూసి
అలవాటే కదా!
ఆ దారిలోనే పోయారు!
బతకలేకే కదా?
ఆపు గురూ!
ఈ దారుణాన్ని! 

మన శ్రీ కృష్ణుడే ఉంటే 
చక్రం అడ్డేసే వాడే!
నువ్వుమాత్రం తక్కువా 
నువ్వూ దేవుడవే కదా!
ఏదో ఒకటి చేసి 
ఆపు గురూ!ఆపు!

అపుగురూ!ఆపు!
దేశమంతా 
అవమానంతో 
తలదించుకుంటున్నాం!
నీ విశ్వగురుత్వం 
ఇందుకేనా?
అపుగురూ!ఆపు!
       *******
-తమ్మినేని అక్కిరాజు 
        24-2-2025
 వారానికి 
70 గంటలు పనిచేయాలి 
- అంటాడు ఒక పారిశ్రామిక దిగ్గజం 

వారానికి 
90 గంటలు పని చేయాలి 
అవసరమైతే ఆదివారాలు కూడా పనిచేయాలి 

ఇంట్లో కూర్చుని 
భార్యా పిల్లల మొహాలు చూస్తుంటే 
బోర్ కొట్టదా ....

అని చమత్కరించి 
తన చమత్కృతికి తానే
పడి పడి నవ్వేస్తాడు మరో పారిశ్రామిక దిగ్గజం

*******

పోనీ .... 
ఇలా పనిచేయటం 
దేశ పునర్నిర్మాణం కోసమా అంటే ...

కాదు కాదు 
కొందరి సంపన్నుల 
జేబులు నింపడం కోసం 

కొందరు వ్యాపారవేత్తలను 
ప్రపంచ ధనికుల జాబితాలో 
నిలపడం కోసం ...

********

రోజుకు 
24 గంటలు 

ఎనిమిది గంటలు పని 
ఎనిమిది గంటలు విశ్రాంతి నిద్ర 
మిగిలిన ఎనిమిది గంటలు కుటుంబం కోసం వినోదం కోసం ....

ఇదీ ...
మానవ శరీర నిర్మాణ అధ్యయన వేత్తలు 
మానవ మనోవిజ్ఞానవేతలు 
పరిశోధించి తేల్చిన నిజం 

**********

ఎనిమిది గంటల పని కోసం...
సమాన వేతనాల కోసం ...
పనిచేసే చోట మెరుగైన సౌకర్యాల కల్పన కోసం ...
కార్మికుల శ్రామికుల ఉద్యోగుల భద్రత కోసం ...

చరిత్రలో 
ఎన్నెన్ని త్యాగపూరితమైన 
పోరాటాలు జరిగాయో
బహుశా తెలిసుండకపోవచ్చు ప్రస్తుత తరానికి 

**********

అందరికీ విద్య 
అందరికీ ఉపాది
అందరికీ ఆరోగ్యం 
అందరికీ విశ్రాంతి వినోదం ...
అందరికీ సమానమైన అవకాశాలు ....
కల్పించే ఒకానొక వ్యవస్థ కోసం ....
చేయాల్సిన ప్రణాళికా బద్ధమైన పోరాటాన్ని ....
ఒకానొక మహనీయుడు ప్రపంచానికి అందించాడు అన్న విషయం కూడా ఎప్పటి తరానికి తెలిసి ఉండకపోవచ్చు 

*********

ప్రపంచ కార్మికులారా ... ఏకం కండి
పోరాడితే పోయేదేమీ లేదు. బానిస సంకెళ్లు తప్ప 

అన్న సంకల్ప మంత్రాన్ని 
ఉపదేశించాడు అన్న సంగతి కూడా 
ఇప్పటి తరానికి తెలిసి ఉండకపోవచ్చు 

అందుకే ....
పైన చెప్పిన వ్యాపార దిగ్గజాలు 
ఇచ్చిన పిలుపులు 

దేశభక్తి పూర్వకమైన 
ఉపదేశాల్లా అనిపిస్తున్నాయి కొందరికి
ఇప్పటికీ 

- రత్నాజేయ్ (పెద్దాపురం)

****2035 . ముచ్చర్ల న్యూరో సిటీ , హైదరాబాద్ ! రాగిణి !

 2035 . ముచ్చర్ల న్యూరో సిటీ ,  హైదరాబాద్ !
  
రాగిణి !

 47 ఏళ్ళ వయసు . 
 క్వాంటం కంప్యూటింగ్ కంపెనీ లో పని చేస్తోంది . 
నెలకు ఇరవై లక్షల జీతం . 
స్మార్ట్ హోమ్ . 
నాలుగు బెడ్ రూమ్స్ విల్లా.

  ఐఐటీ ముంబై లో చదివినప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండేది . 
సంవత్సరానికి బ్రేక్ అప్ అయ్యింది . 
పురుషాధిక్యతను భరించలేక పోయింది . 
ఇక జీవితం లో ... లివ్ ఇన్...  పెళ్లి లాంటి ... జంజాటాలు వద్దనుకొంది.

 నాన్న నాలుగేళ్ళ క్రితం...  అమ్మ...  మూడేళ్ళ క్రితం పోయారు .
అప్పట్లో ..  పెళ్లి చేసుకోమని  వారు చెబుతుంటే...  చిరాకు పడేది. 
వారి మాటల విలువ ఇప్పుడు   అర్థమవుతోంది . 

"మిడ్ లైఫ్ మేట్స్"  అనే వివాహ సంస్థకు అప్లై చేసింది . 
తనకంటే వయసులో మూడేళ్లు చిన్నవాడు రాకేష్ .
 మొదటి భార్యతో విడాకులు తీసుకొన్నాడు . 

ఇద్దరూ పెళ్లి చేసుకొన్నారు . 
తమకు పొసగదని ఆరునెలల్లోనే ఇద్దరూ గ్రహించి విడాకులు తీసుకొన్నారు .

రాగిణిది...  తిరిగీ...  ఒంటరి జీవితం . 
" ఏ  వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి . ఇరవైలోనే  ముడిపడితే పొందికగా కలిసుంటారు .వయసు  పెరిగే కొద్దీ బంధాలు నిలవడం కష్టం. 
 ఒంటరి జీవితం నరకం "... 
 ఇరవై అయిదేళ్ల  ఏళ్ళ క్రితం అమ్మమ్మ చెప్పిన మాటలు .

 అప్పట్లో...  చాదస్తం అని తాను తీసిపడేసిన మాటలు ..
 ఇప్పుడు పదేపదే గుర్తొస్తున్నాయి .

 తన కంపెనీ లో రోబో బైట్ అనే  పెద్ద కాంటీన్  ఉంది   . 
  రోబో చెఫ్ . రోబో సెర్వింగ్ అసిస్టెంట్స్ .

  బ్రేక్ ఫాస్ట్ మొదలు  రాత్రి  డిన్నర్  దాక .. అన్నీ అక్కడే ఫ్రీ గా దొరుకుతాయి .
ఒక్కో పూట  ఇరవై ముప్పై  ఫుడ్ ఐటమ్స్ బఫెట్ .
 వారం లో ప్రతి రోజు కొత్త మెనూ .  

అయినా తిన బుద్ధి పుట్టదు .
 ఆ ఫుడ్ తిని తిని ..  బోర్ కొట్టేసింది . కాంటీన్ వాసన సోకితేనే వాతొస్తుంది.
  ఫుడ్ డెలివరీ అప్స్ లో ఆర్డర్ ఇస్తే...  అది ఇంకా చెత్తగా ఉంటోంది . 

 ఫాటీ లివర్ వచ్చింది .
"  రిఫైన్డ్ కార్బ్స్, ట్రాన్స్ఫాట్స్ ఎక్కువ తింటున్నారు . షుగర్ ఫ్రీ అడిటివ్స్ ... ఆర్టిఫిషల్ కలర్స్ కూడా ఎక్కువగా తింటున్నట్టున్నారు   . కాన్సర్ కు  అతి దగ్గరలో వున్నారు"  అని  రోబో డాక్టర్...  హెల్త్ చెక్ అప్ లో భాగంగా హెచ్చరించాడు .

తన కంపెనీ కాంటీన్  లో ఆర్గానిక్ ఫుడ్ ఆప్షన్ కూడా ఉంది .
 అయినా ఏదీ...  తిన బుద్ధి కాదు . 

ఆ రోజుల్లో అమ్మ చేతి వంట ఎంత బాగుండేదో  . 
 నాన్నమ్మ   వంట నేర్చుకోమని చెబితే తాను పడీపడీ నవ్వేది .  
బామ్మ మాట బంగారు మాట...  అని తనకు ఇప్పుడు అనిపిస్తోంది .

 రాగిణి .. వర్క్ ముగించుకొని రాత్రి పన్నెండుకు పడుకొంది. 
నిద్ర పట్టడం లేదు . 
ఈ మధ్య కాలం లో గట్టిగా మూడు గంటలు నిద్రపోలేక పోతోంది . 
అప్పటికీ ... ఇన్సొమ్నియా మందులు తింటోంది .

 తెల్లవారు జామున మూడు గంటలు .
 బెడ్ పై అటు ... ఇటు దొర్లుతోంది .

 అమ్మ...  నాన్న...  అమ్మమ్మ...  నాన్నమ్మ ... చెప్పిన మాటలు పదేపదే గుర్తొస్తున్నాయి . 

నెలకు ఇరవై లక్షల జీతం .
 తిండి సహించదు . 
నిద్ర పట్టదు . 
 ఒళ్ళు రోగాల పుట్ట .
 మెడికల్ ఇన్సూరెన్సు ఉన్నా...  సంపాదనలో సగం ఆసుపత్రులకు పోతోంది .

 ఒంటరి   జీవితం.
 తనదీ ఒక బతుకేనా ? 
ఎందుకు బతుకుతున్నట్టు ?
 ఎవరి కోసం బతుకుతున్నట్టు ? 
ఇంత చదువు చదివి తాను సాధించింది ఏంటి ?

కంపెనీ కూలి .
 కాదు కాదు ..
 కూలి...  పనయ్యాక ఇంటికెళ్లి పోతాడు . 
తానేమో   కంపెనీ కి బానిస .
కంపెనీ కోసం . కంపెనీ  ద్వారా  కంపెనీ చేత .. 
ఇదీ తన బతుకు.

 
   ఏడ్చి ఏడ్చి దిండు తడిచిపోయింది .

తెల్లవారుతోంది . కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ .. ఏడ్చి ఏడ్చి  మొఖం   ఉబ్బి పోయింది .
 కనీసం ఓదార్చేవాళ్ళు లేరు . 
ఇదీ నా బతుకు అనుకొంటూ .. లేచి కూర్చొని ఫోన్ తీసుకొంది.

 రామ్  ఆన్లైన్ లో ఉన్నాడు. 
ఆఫీస్ కొలీగ్ . 
తనదీ ఒంటరి జీవితం . ఇద్దరి మధ్య  అర గంట చాటింగ్ . 
చివర్లో  కొన్ని లింక్స్ పంపాడు . 

రాగిణి వాటి గురించి..  చాట్ బాట్ ద్వారా మరింత సమాచారం పొందింది .

1 . తాయారమ్మ బంగారయ్య ! 

ఇదో ఎమోషనల్ వెల్నెస్ కంపానియన్ కంపెనీ . 
అచ్చ తెలుగులో చెప్పాలంటే..  అద్దెకు ఆమ్మ నాన్న .

గంట సర్వీస్ కు పదివేలు . 
బుక్ చేసుకొంటే అరవై - డెబ్భై లో   ఉన్న ..ఒక జంట .. అంటే తన ఆమ్మ నాన్న బతికుంటే ఎంత వయసులో ఉండేవారో అదే వయసు వారు  ఇంటికి వస్తారు .
 వారిని "అమ్మా" " నాన్న"   అని పిలవొచ్చు .
 మనసు విప్పి మాట్లాడొచ్చు .
 తన బాధల్ని వారు శ్రద్ధగా వింటారు . 
ఓదార్చుతారు .
ఆమ్మ ఒడిలో పడుకొని ఏడవొచ్చు . కన్నీళ్లు తుడుస్తుంది. నాన్న తల నిమురుతాడు . భుజం తడుతాడు.
ఇదీ క్లుప్తంగా తాయారమ్మ బంగారయ్య సర్వీస్ వివరాలు .   
  ఇది ఈ మధ్య బాగా పౌపులర్ అవుతోందని రేట్ కాస్త ఎక్కువగా ఉన్నా మంచి ఫలితం ఉంటుందని రామ్  చెప్పాడు .

రెండో సర్వీస్ .. 
 2 . బొమ్మరిల్లు !

ఇదో లోన్లినెస్ కేఫ్ .
తెలుగులో చెప్పాలి అంటే పూట కూళ్ళ  భోజనం .

 ముందుగా బుక్ చేసుకోవాలి .
 ఆదివారలైతే సంవత్సరం దాక స్లాట్లు బుక్ అయిపోయాయి .
 వారం దినాల్లో అయితే ఇప్పుడు ప్రీమియం రేట్స్ .
 ఒక ఇంటికి...  ఒక రోజుకు ... ఒకరు లేదా ఇద్దరు మాత్రమే .

 పొద్దునే ఇచ్చిన చోటు...  అంటే పెద్ద వారి ఇంటికి  వెళ్ళాలి .
 అక్కడ బామ్మ లాంటి వ్యక్తి  తలంటి స్నానం చేయిస్తుంది .
 తలకు సాంబ్రాణి వేస్తుంది . 
అటు పై నష్టా.. కట్టె పొంగలి.. సాంబారు...  గట్టి చట్నీ . 
టిఫిన్ అయ్యాక కాసేపు కబుర్లు . వైకుంఠ పాళీ .. దాయాలు.. 

  మధ్యాహ్నం ...  రాత్రి అరిటాకు భోజనాలు   . 
ఆమ్మ లాంటి  వ్యక్తి కొసరి కొసరి  కొసరి వడ్డిస్తుంది  . 
అచ్చం ఆమ్మ చేతి వంట .
 అమృతం .  

 రాత్రి ఆరుబయట వెన్నెల్లో డిన్నర్ .డిన్నర్ అయ్యాక కబుర్లు . లాలి పాటలు . 

 ఒక రోజు సర్వీస్  కు కేవలం లక్ష . 
ఆదివారాలు ఇంకా తత్కాల్ బుకింగ్ అయితే రెండు లక్షలు మాత్రమే .

౩, బడి పంతులు !
ఇదో పర్సనలైజ్డ్ కౌన్సిలింగ్ కంపెనీ . 
తెలుగులో చెప్పాలంటే  మీ ఇంట్లో మాస్టారు ! 

జనాలు పాసైకియాట్రిస్టు ల తో విసిగిపోయారు . 
ప్రతి చిన్న దానికి గంపెడు మందులు రాసి...  కొండ నాలుకకు మందేస్తే అసలు  నాలుక ఊడినట్టు చేస్తున్నారు . 

అందుకే ఈ కంపెనీ కి బాగా డిమాండ్ పెరిగింది .
 ఒక విధంగా ఇది కూడా తాయారమ్మ బంగారయ్య కంపెనీ లాంటిదే .
 అక్కడ పెద్దలు తన బాధల్ని వింటారు .ఓదార్చుతారు .
 బడిపంతులో కంపెనీ ద్వారా వచ్చిన పెద్ద ... బాధల్ని వినడమే కాకుండా వాటికి చక్కటి పరిష్కార మార్గాలు చూపుతాడు .

తన సమస్యలకు బడిపంతులు కంపెనీ ద్వారా నే మంచి పరిష్కారం దొరుకుతుందని  రాగిణి .. అప్ ద్వారా బుక్ చేసింది . నెల తరువాత స్లాట్ దొరికింది . 

ఆ రోజు...  ఒకాయన ఇంటికొచ్చాడు .
రాగిణి చెప్పింది శ్రద్ధగా విన్నాడు .

" కిందబోసి .. ఏరుకోవడం...  అని దీన్నే అంటారు . నా లాంటి వాళ్ళు ఆరోజుల్లో వివాహం కుటుంబ వ్యవస్థల గురించి చెబితే పెద్దగా పట్టించుకొనే వారు కారు . 
ఇప్పుడు అనుభవిస్తున్నారు . 
రాగిణీ...  నీ సమస్యలకు ఒకటే పరిష్కారం . నీకు నాలుగు బెడ్ రూమ్స్ విల్లా ఉంది కదా  . ఇందులో నువ్వు  ఒకతే.
 ప్రకటన ఇవ్వు .
 సెంట్రల్ జైలు లో ఏకాంత కారాగార శిక్ష అనుభవిస్తున్న వారిలా ... ఈ రోజు కోట్లమంది . 
ఇంటర్వ్యూ  చేసి ముగ్గురిని ఎంపిక చేసుకో . 
వారు కూడా నీ వయసు...  నీ మెంటాలిటీ ... ఉన్నవారు కావాలి .
 చెరి ఒక్కరికి ఒక్కో బెడ్ రూమ్ . 

హాల్ ...  కిచెన్...  అందరికీ  కామన్ . 

కలిసి వంట చెయ్యండి .
 నీ కంపెనీ వాడు ఫుడ్ ఫ్రీ గా పెట్టి నిన్ను కట్టుబానిస చేసాడు .
 ఫుడ్ ఫ్రీ గా వస్తుందని నువ్వు పొద్దునుంచి రాత్రి దాక అక్కడే ఉంటున్నావు . 

ఇల్లు అనేది ఒకటుంది .  
అది లేక పొతే మనిషి లేడు. 

పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడిపే రోజులు పోయాయి . బతకడం కోసం పని .. డబ్బు .
 కానీ ఇప్పుడు నీలాంటి వారు పని కోసమే బతుకుతున్నారు .
 నీ పే ప్యాకేజి నీ జీవితానికి ఉరితాడు అయ్యింది . 

   ఇంటికి వంటగది ముఖ్యం . 
పూజ గది కన్నా అది పవిత్రం . 
మరో ముఖ్యమయిన చోటు డైనింగ్ టేబుల్ .

 వారం లో ఏడు రోజులు . 
రోజుకు మూడు పూటలు . అంటే 21 .
 కనీసం 19  సార్లు ఇంట్లోనే వంట చెయ్యాలి . 
కలిసి తినాలి . అందరూ కూర్చొని మాట్లాడాలి .

 మనసు విప్పి...  బేషజాలు లేకుండా ఆత్మీయంగా మాట్లాడుకోవాలి .
 షో ఆఫ్ లు వద్దు . 
బడాయి మాటలు వద్దు . 
లక్షాది కారి అయినా లవణ మన్నమే. 

మనం తినే తిండే మన ఆరోగ్యం .
 మనం మాట్లాడుకొనే మాటలే మన మానసిక ఆరోగ్యం . 

ఈ కంపెనీ ని నా  ఆలోచన మేరకు నా విద్యార్థులు  స్టార్ట్ చేసారు .

 నేను ఫ్రీ గా సర్వీస్ ఇస్తున్నాను . 
ఇదిగో బుక్ చేసేటప్పుడు నువ్వు కట్టిన లక్ష ఫీజు .
 నా సర్వీస్ నీకు ఫ్రీ . 

పదేళ్ల క్రితం బాలమిత్ర అని క్లాసులు స్టార్ట్ చేశా . ప్రారంభం లో పెద్దగా పట్టించుకొనేవారు కారు .
 ఇదిగో ఇప్పుడు కొండవీటి చేంతాడు అంత వెయిటింగ్  లిస్ట్ . 

పదో రౌండ్ బాలమిత్ర క్లాసులు నడుస్తున్నాయి . పోయిన వారమే సూర్యాపేట , ఖమ్మం , వరంగల్ కరీంనగర్ క్లాసులు అయ్యాయి . నెక్స్ట్ వైజాగ్ వెళుతున్నా.. ఈ లోగా ఈ రోజు  జిం కు వెళ్ళాలి " అంటూ బడిపంతులు మెరుపు వేగం తో వెళ్ళిపోయాడు .

రాగిణి ఆలోచనలో పడిపోయింది . 
పది పదహైదు ఏళ్ళ క్రితం ఈ బడిపంతులు తనకు తారసపడి ఉంటే నా జీవితం ఏ రోజు అడవి కాచిన వెన్నెల అయివుండేది కాదు  .. నా ఖర్మ"  అనుకొంటోంది . 

శుభోదయం .

Thursday, February 27, 2025

 *_ఒకరి స్థానం అనేది వారు వేసుకునే రంగు రంగుల బట్టలు లేదా... వారు ధరించిన ఖరీదైన వస్తువులను బట్టి మారదు..._*

*_ఒకరు సింపుల్ గా సాదాసీదాగా కనిపించినంత మాత్రాన వారి స్థాయేమీ తగ్గిపోదు... మరొకరు  హుందాగా నిండుగా కనిపించినంత మాత్రాన వారిగౌరవం ఏమీ పెరిగిపోదు..._*

*_స్థాయిని బట్టి నిజమైన గౌరవం గుర్తింపు వస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ... గుణాన్ని బట్టి గౌరవం మాత్రం కచ్చితంగా వస్తుంది..._*

*_అందుకే నీ స్థాయి మారినా నీ సంస్కారాన్ని  మాత్రం ఎప్పటికి మర్చిపోకు... ఆ సంస్కారమే నీకు విలువను పెంచుతుంది. కాస్త కష్టమైన... అదే నీ స్థాయిని నిర్దేశిస్తుంది._*

*_మనల్ని అందరూ కలుపుకోవాలి... ప్రేమగా చూసుకోవాలి. మనకంటూ ఓ మర్యాద గుర్తింపు, గౌరవం ఇవ్వాలి అనుకోవటంలో తప్పులేదు కానీ..._*

*_నీతో వుండే ప్రతి ఒక్కరిలో ఆ ప్రేమను, ఆ ఆప్యాయతను, ఆ గుర్తింపును ఆ గౌరవాన్ని వెతుకు..._*

*_నిజానికి అర్హత లేని ఎంతోమంది నీ జీవితంలో నీకు తారస పడుతుంటారు. కానీ, నువ్వు అనుకున్న బంధాలు, ఆప్యాయతలు నమ్మకాలు మాత్రం అవతలి నుంచి కనపడటం కొంచెం కష్టమే సుమీ... కొంచమేంటి చాలా కష్టమే..._*

*_అవతలి నుంచి అవసరం మాత్రమే కనిపిస్తుంది... అందుకే ఈ నమ్మకం లేని మాటలు, బాధ్యత లేని బంధాలు, విలువ లేని, విలువ ఇవ్వని మనుషులు, బాధ్యత లేని బంధాలు అంటే గౌరవం లేని  మనసులు వ్యర్థం..._*

*_కాబట్టి నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకో... ఎందుకంటే కొందరికి మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య కాబట్టి... మెత్తని కత్తిలా మనకు తెలియ కుండానే... పొడిచిపోతారు._*

 *_అదేనండి బాబు వెన్ను పోటు... పొడుస్తారు. తస్మాత్ జాగ్రత్త. నీకే చెబుతుంది అర్థమైందా...☝️_*

     *_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌸🦑🌸 🌹🙇🌹 🌸🦑🌸
 

ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కోడలు, Queen Of Marathas గా కీర్తించబడిన మహారాణి శ్రీమతి తారాభాయ్ భోంస్లే గారి సమాధి పరిస్థితి ఇది ... మన దేశం లోకి చొరబడి, మనల్ని బానిసలుగా చేసుకుని, అతి క్రూరంగా హింసించి, హతమార్చిన వారికి కొన్ని ఎకరాలలో అందమైన సమాధులు ... తారాభాయ్ గారి సమాధి మాత్రమే కాదు ఎందరో దేశ భక్తులు, మహాత్ముల పరిస్థితి ఇలానే ఉంది ...

ఇక శ్రీమతి తారాభాయ్ గారి గురించి క్లుప్తంగా ...

' రైన్హా దొస్ మరాఠా ' గా పోర్చుగీస్ చేత కీర్తింపబడిన క్వీన్ ఆఫ్ మరాఠాస్ ' తారాభాయ్ భోంస్లే '..

ఆవిడ గుర్రం మీద వెళ్తుంటే వెనుక ఉన్న వారికి దుమ్ముతప్ప గుర్రం కనబడేది కాదట..కరవాలం తిప్పుతుంటే ఆవిడ మీద విసిరిన వడ్లగింజలు ఆవిడ ఒంటిని తాకలేక పోయేవట..
నేటికీ మాల్వా ప్రాంతంలో ఆవిడ జానపదుల పాటల్లో సజీవంగా ఉన్నారు.. 

శివాజీ మహారాజ్ చిన్న కొడుకు రాజారాం భోంస్లే భార్య..
మరాఠా సర్లష్కర్ ( సర్వసేనాని ) హంభీరావ్ మోహితే కుమార్తె..
శంభాజీ మహరాజ్ ను ఔరంగజేబ్ క్రూరంగా హింసించి చంపిన తర్వాత శివాజీ మహరాజ్ చిన్న కొడుకు రాజా రాం రాయ్ ఘడ్ కోటనుంచి నేటి తమిళనాడు జింగీ కోటకు వలస వెళ్లారు..
అక్కడ నుంచే ఆయన మరాఠా సామ్రాజ్యాన్ని పాలించేవారు..దురదృష్టవశాత్తూ ఆయన ఊపిరితిత్తుల వ్యాదితో అక్కడే మరణించారు..

అప్పటికి మహారాణి తారాభాయ్ భోంస్లే వయసు కేవలం 25 ఏళ్ళు..
ధైర్యం కోల్పోకుండా తిరిగి రాయ్ ఘడ్ కు చేరుకొని మరాఠా సైన్యానికి నాయకత్వం వహించి కోల్పోయిన కోటలన్నీ తిరిగి రాబట్టారు..

ఆవిడ ప్రతి కోటనూ తన నియంత్రణలోకి తెచ్చుకొని కొత్తగా మాల్వా ప్రాంతాన్ని ( ఉజ్జయిన్..బుర్హాంపూర్..సిరోంజీ..ముంద్రా ) తన అధీనంలోకి తెచ్చుకున్నారు..

ఒక స్త్రీ ఇద్దరు చిన్నపిల్లలతో వచ్చి తననేమి గెలవగలదని మదంతో  తారాభాయ్ మీద యుద్ధానికి వచ్చిన నాటి ఔరంగజేబ్ సేనాని ఆలంగీర్ గుండెల మీద తన గుర్రాన్ని పైకి లేపి  డెక్కలతో కొట్టి కిందపడేసిన సివంగి మన మహారాణి తారాభాయ్..
బతుకుజీవుడా అని పారిపోయి తిరిగి తన జీవితకాలంలో మరాఠాల మీదకు యుద్ధానికి వచ్చే సాహసం చేయలేదు పిరికి ఆలంగీర్..
తన బావ శంభాజీ..భర్త రాజారాం ల మరణంతో నీరసించిన వీర మరాఠా సైన్యాన్ని పునర్నిర్మించి అజేయంగా మలచి ..కోటలను శత్రు దుర్భేద్యంగా నిర్మించి 27 ఏళ్ళు పాటు మరాఠా హిందూ సామ్రాజ్యాన్ని అవిచ్చన్నంగా ఏలిన ' వారియర్ క్వీన్ '..
భారత్ లో ఒక రాణి ఝాన్సీ..కాకతీ రుద్రమ్మ..చౌతా అబ్బక్క ల సరసన చేర్చదగ్గ వీరవనిత మహారాణి తారాభాయ్ '..🙏
జై మరాఠా.....
హరహార మహదేవ్......

దేశాన్ని ధర్మాన్ని కాపాడిన ఈ భూమి పత్రికకు అవమానకర సమాధి..🙏😢
 *25వ రోజు విషయం నరక లోక శిక్షలు* 

*🌺🔥||నరక లోక శిక్షలు||🔥🌺*

*"గురుదేవా! పాపం చేసినవారంతా నరకానికి పోతారు. అక్కడ అనేక రకాలుగా శిక్షింపబడతారు అంటారు కదా! ఏ ఏ పాపం చేసిన వాళ్ళు ఏ నరకానికి పోతారు. ఏ రకమైన శిక్ష అనుభవిస్తారో వివరించండి" అన్నాడు కృష్ణశర్మ. వివరించటం ప్రారంభించాడు రత్నాకరుడు.*

*మనోవాక్కాయ కర్మల చేత చేసిన తప్పుల వల్ల పాపం కలుగుతుంది. ఆ పాపాలకు మరణానంతరము మానవులు నరకంలో శిక్షలు అనుభవిస్తారు. మొత్తం ఇరవై ఎనిమిది రకాల నరకాలున్నాయి.*

1. *'తామిస్ర' నరకము గాడాంధకారముగా ఉంటుంది. ఇతరులను హేళన చేసేవారు. ఇతరుల ధనాన్ని అపహరించేవారు ఇక్కడ రకరకాలుగా శిక్షింపడతారు.*

2. *భర్తలను ప్రలోభపెట్టి, లేదా మోసపుచ్చి వారి భార్యలను అనుభవించేవారు 'అంధతామిస్ర' నరకంలో ఘోరంగా శిక్షింపబడతారు.*

3. *కుటుంబ పోషణ కోసము ఇతరులను మోసం చేసేవారు 'గౌరవ' నరకంలో విషజంతువులచే పీడించబడతారు.* 

4. *దయ దాక్షిణ్యము లేకుండా ధనార్జన చేసేవారు 'మహారౌరవ నరకంలో పీడించబడతారు.*

5. *ఎలుకలను, ఉడతలను చంపి తినేవాళ్ళ 'కుంభీపాక' నరకంలో సలసలా కాగే నూనెలో త్రోయబడతారు.*

6. *పెద్దలను, పండితులను దూషించేవారు 'కాలసూత్ర' నరకంలో మాడిపోయే ఇసుకలో పడవేయబడతారు.*

7. *వేద విరుద్ధమైన పనులు చేసేవారు. 'అసిపత్రవ్రతము' అనే నరకంలో కత్తుల బోనులో పడేసి, ఇనుప కొరడాలతో కొట్టబడతారు.*

8. *అమాయకులను దండించిన న్యాయాధికారులు 'సూకర ముఖము' అనే నరకంలో శరీరము నుగ్గునుగ్గు అయ్యేటట్లు కొట్టబడతారు.*

9. *జంతుజాలాన్ని హింసించేవారు 'అంధకూప' నరకంలో శిక్షించబడతారు. తేళ్ళు, జెర్రులు, నల్లులు, దోమలు, వాళ్ళ రక్తం పీల్చి పిప్పి చేస్తాయి.*

10. *సంపద కలిగి కూడా ఇతరులను ఆదరించనివారు 'క్రిభోజనము' అనే నరకంలో క్రిమి కీటకాలతో బాధించబడతారు.*

11. *బ్రాహ్మణ ద్రవ్యము, విలువైన వస్తువులు దొంగతనం చేసేవారికి 'సందళన' నరకములో ఎర్రగా కాల్చిన కడ్డీలచే పొడిచి, చర్మము వలచబడుతుంది.*

12. *వావివరుసలు లేకుండా చరించినవారిని 'తప్తసూర్మి' నరకంలో ఎర్రగా కాల్చిన లోహపు విగ్రహాలను కౌగిలించుకోమంటారు.* 

13. *మదంతో పశువులతో రమించేవారిని 'వజ్రకంటక' నరకంలో ముళ్ళ పాదలలో పడదోస్తారు.*

14. *అధర్మపరులైన ఉద్యోగులను, వేదబాహ్యులైన బ్రాహ్మణులను వైతరిణి నదిలో తోస్తారు. అది చీము, నెత్తురులతో, క్రిమికీటకాదులతో నిండి ఉంటుంది.*

15. *కులాచారములు పాటించనివారిని 'పూయాదన' అనే మలమూత్రములతో నిండిన సముద్రంలో తోస్తారు.*

16. *కుక్కలను పెంచి వేటయే వృత్తిగా గల బ్రాహ్మణులను 'ప్రాణరోధ' నరకంలో కత్తులతో పొడుస్తారు.*

17. *జంతువులను పశువులను చంపి తినేవాళ్ళు 'వైశస' నరకంలో పడరాని పాట్లు పడతారు.*

18. *కామాంధుడై, భార్య నోటియందు వీర్యమును వదిలినవాడికి 'లాలాభక్షణ' నరకంలో వీర్యాన్నే తినిపిస్తారు.*

19. *ఇళ్ళకు నిప్పు పెట్టేవారు, విషం పెట్టేవారు. దారిదోపిడీ చేసేవారిని 'సారమేయోదన' నరకంలో పదునైన కోరకలు గల కుక్కలు చీల్చి వారి రక్తం త్రాగుతాయి.*

20. *దొంగ సాక్ష్యాలు చెప్పేవారు. వ్యాపారంలో మోసం చేసేవారు. 'అవిచింతమనే నరకంలో కొండలమించి తలక్రిందులుగా క్రిందికి త్రోయబడ్డారు.*

21. *దీక్షలు పూని మద్యపానం చేసే బ్రాహ్మణుని 'ఆయు:పాన' నరకములో సలసలాకాచిన ఇనుముని త్రాగిస్తారు.*

22. *తమకన్నా పెద్దవారిని నిర్లక్ష్యంగా చూసేవారిని 'క్షారకర్ణ' నరకంలో తలక్రిందులుగా వ్రేలాడదీసి బాధిస్తారు,*

23. *మనుష్యులను, పశువులను చంపేవారిని 'రక్షోగణ భోజన' నరకంలో పదునైన కత్తులతో ముక్కలు ముక్కలుగా నరుకుతారు.*

24. *అడవి జంతువులను, ఊర జంతువులను చంపేవారిని 'శూలప్రోత' నరకంలో శూలాలతో పొడిచి ఉరి వేస్తారు.*

25. *సాటి మానవులను హింసించేవారిని 'దండసూకర' నరకములో హింసిస్తారు.*

26. *మనుషులను చెరబట్టేవారిని, బంధించేవారిని 'అవధ నిరోధనీ' నరకములో పొగలో పడేస్తారు.*

27. *భోజన సమయంలో వచ్చిన అతిధులను దూషించిన వారిని 'పర్యావర్తన' నరకంలో కళ్ళు కాకులతో పొడిపిస్తారు.*

28. *ధనగర్వముతో ఇతరులను దూషించేవారిని 'సూచేముఖ' నరకంలో సూదులతో గ్రుచ్చి హింసిస్తారు.*

*నరకములో ఎన్ని బాధలు పడినా పాపి చావడు. ఎత్తైన కొండ నుండి క్రిందికి*

*సినప్పుడు అతడి శరీరము ముక్కలు ముక్కలవుతుంది. అతడు ఆ బాధ అనుభవిస్తాడు. కాని ఆ ముక్కలన్నీ మళ్ళీ అతుక్కుని. తరువాత శిక్షకు సిద్ధమవుతుంది. అంటూ నరకలోక శిక్షలను వివరించి ఎనిమిదవ అశ్వాసము పూర్తి చేశాడు రత్నాకరుడు.*

*రేపటి శీర్షికలో 🌺 వైవస్వత మనువు🌺 విషయము గురించి తెలుసుకుందాం...*

*┈┉┅━❀꧁జై శ్రీకృష్ణ꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🕉️🌺🕉️ 🌺🙏🌺 🕉️🌺🕉️
 *పునర్జన్మ అనేది వాస్తవమేనా?*

*మనమందరం ఆధ్యాత్మిక జీవులం లేదా ఆత్మలం, మన శరీరాల ద్వారా మన పాత్రలను పోషిస్తున్నాము. మన స్వభావం లేదా సంస్కారాల ఆధారంగా మన ఆధ్యాత్మిక ఆలోచనలు, మనం విజువలైజ్ చేసేది, ప్రవర్తించేది వేర్వేరుగా ఉంటాయి.  అలాగే, మనం ఎప్పటికప్పుడు భౌతిక వస్త్రాలు లేదా శరీరాలను మార్చుకుంటూ జనన-మరణ చక్రంలోకి వస్తాము అనేది సాధారణంగా అంగీకరించబడిన వాస్తవం. దీన్నే పునర్జన్మ అంటారు.* 

*అదే సమయంలో పునర్జన్మను నమ్మని మరియు ఇది కేవలం ఒక ఊహ అని భావించే వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. జీవితం ఒక భౌతిక విషయం మాత్రమే మరియు అన్ని ఆలోచనలు మరియు విజువలైజేషన్ మెదడు చేత చేయబడుతుంది కానీ ఆత్మ కాదని అంటారు వాళ్లు. సంస్కారాలు లేదా స్వభావం అనేది మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రుల నుండి వారసత్వంగా పొందిన భౌతిక జన్యువులు తప్ప మరొకటి కాదని, అవి ఆత్మ ద్వారా తీసుకువెళ్ళబడవని కూడా వారు నమ్ముతారు.*

*భగవంతుడు కూడా మనలాగే ఆధ్యాత్మిక శక్తి అని, వారు జనన-మరణ చక్రంలోకి  రారని ఆధ్యాత్మికత మనకు ముఖ్యమైన జ్ఞానాన్ని ఇస్తుంది. వారు నిరంతరం పరంధామంలో ఉంటారు. భూమి మీదకు ఒక్కసారి మాత్రమే దిగి వస్తారు, అది ప్రపంచం దాని ఆధ్యాత్మిక శక్తిని కోల్పోయి, లక్షణాలలో దిగజారినప్పుడు వస్తారు. భగవంతుడు భూమిని మరియు భూమిపై తమ పాత్రను పోషించే ఆత్మలందరినీ తన ఆధ్యాత్మిక సుగుణాలతో నింపి, ప్రపంచాన్ని మళ్లీ ఉన్నతంగా చేస్తారు. వారు ఇనుప యుగం లేదా కలియుగాన్ని స్వర్ణ యుగం లేదా సత్యయుగంగా మారుస్తారు, దీనిని స్వర్గం లేదా హెవెన్ అని కూడా పిలుస్తారు.*

*భగవంతుడు భూమిపైకి వచ్చినప్పుడు పునర్జన్మ యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. స్వర్ణయుగం ప్రారంభం నుండి ఇనుప యుగం ముగింపు వరకు వివిధ భౌతిక వస్త్రాల ద్వారా ఆత్మలు తమ పాత్రలను ఎలా పోషిస్తాయో మనకు చెప్తారు. భగవంతుడు ఆత్మలను స్వచ్ఛంగా చేసిన తరువాత మళ్లీ తిరిగి స్వర్ణ యుగంలో పాత్రను పోషిస్తాయి. స్వర్ణయుగం నుండి ఇనుప యుగం వరకు ఈ చక్రం మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుంది.*

*┈┉┅━❀꧁జై శ్రీకృష్ణ꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🌷🌷🌷 🙏🕉️🙏 🌷🌷🌷
 *👉 ఒక సారి మనసు పెట్టి ఆలోచించండి... మాయలో పడి జీవిస్తున్నావ్.! సంపాదిస్తున్నావ్.! దేనికి... ఎవరికోసం... ఈ కుళ్ళు కుతంత్రాలు... అహంకారం... అర్భటాలు.!?*  

*👉 ఇదొక మాయ ఇది ఒక మాయ నీవు స్వార్థంతో సంపాదించేది, సాధించేది ఏది నీది కాదు... మరొకరి పాలవుతుంది. ఈ బంధాలు అనుబంధం కూడా నీది కాదు... నీ శరీరంలో జీవం ఉన్నంత వరకే తరువాత అందరూ ఎవరికి వారే అవుతారు.*

*👉 కాళీ చేతులతో ఈ భూమిపైకి వచ్చావ్... అదే కాళీ చేతులతో వెళ్లి పోతావ్... నీ వెంట ఏది రాదు. ఎవరు రారు... ఏ బంధం రాదు... చావు దగ్గర పడ్డాక అప్పుడు దేవుడు గుర్తుకి వస్తాడు. ప్రయోజనం ఏమిటి.!? అని... వాస్తవం, సత్యం తెలుసుకో...*

*┈┉┅━❀꧁జై శ్రీకృష్ణ꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మనందం* 
🙏🙏🙏 🙏🕉️🙏 🙏🙏🙏
 *_తెలివి తక్కువ తనం  నీటిలో ఈదుతున్న చేపకు తెలియదు ఎర వల్ల తనకు ప్రాణం పోతుందని._*

*_నోటిదురుసు కప్పకు తెలియదు తనుచేసే శబ్దం వల్లనే పాముకు ఆహారం అవుతుందని._*

*_అహంకారం జింక అందాన్ని పులి చూడదు. ఆకలిని చూస్తుంది కాబట్టి ఎక్కడ ఎలా తెల్సుకుని మెదలాలో తెలుసుకొని మసలాలి..._*

*_తొందరపాటున కుడితే చస్తుందని తేలుకు తెలుసు కానీ కుట్టకుండా ఉండలేదు... ఈ తొందరపాటు వల్లే త్వరగా చస్తుంది..._*

*_కాబట్టి తెలివి తక్కువ, నోటిదురుసు అహంకారం, తొందరపాటు ఇవే మనిషి పతనానికి కారణం..._*

*_ఆకలి కోసం వేటాడే పులికి బలం దాని పంజాలో వుంటే, ప్రాణం నిలుపుకోవడం కోసం పరిగెత్తే జింకకు బలం దాని కాళ్ళలో వుంటుంది..._*

*_నా బలం ముందు ఆ జింక ఎంత అని పులికి పొగరు తలకెక్కి వేగం తగ్గితే... జింక చేజారిపోతుంది కదా..._*

*_దాని కన్నా నేను బలహీనమైన దానిని అని జింక భయపడి ఆగిపోతే... పులికి ఆహారం ఐపోతుంది..._*

*_కాబట్టి నీ సమస్య ఏదైనా... నీ ముందు ఎంత బలవంతుడున్నా ఒక  సమస్య నీకు ఎదురైనప్పుడు నువ్వు నీ బలహీనతను పక్కన పెట్టి... నీకున్న బలాన్ని నువ్వు ఆయుధంగా మార్చుకుని ఆ సమస్యలపై పొరాడగలిగితేనే నీ అంతటి వీరుడు ఈ లోకాన ఉండడు._*

*_జీవితంలో నీవు గెలవాలంటే... ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలియాలి. అలాకాకుండా ఎప్పుడైతే బలాన్ని కాకుండా బలహీనత మీద నీకు ద్యాస మళ్లిన రోజున నీవు ఓడినట్టే.☝️_*

     *_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌺🐯🌺 🦌🙇🦌 🌺🐯🌺
 *మహా శివుడు స్థాపించిన పురాతన నగరం... వారణాసి*

*"వారణాసి చరిత్ర కంటే పురాతనమైనది, సంప్రదాయం కంటే పురాతనమైనది, పురాణం కంటే కూడా పురాతనమైనది, మరియు అవన్నీ కలిపితే రెండింతలు పురాతనమైనది.*

*శివుడు ఈ కాశీ నగరాన్ని సుమారు 5000 సంవత్సరాల క్రితం స్థాపించాడు. అంతే కాదు, 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వనాథుని రూపంలో శివుడు ఇక్కడ భక్తులతో పూజలందుకుంటున్నాడు. నేటికీ బనారస్ హిందువులకు ప్రధాన పుణ్యక్షేత్రం కావడానికి ఇదే కారణం. ఈ నగరం స్కాంద పురాణం, రామాయణం, మహాభారతం, పురాతన వేదం, ఋగ్వేదంతో సహా అనేక హిందూ గ్రంథాలలో ప్రస్తావించబడింది.*

*ది లాస్ట్ స్టాప్ " గా పరిగణించబడే ప్రదేశం ప్రపంచంలో మరెక్కడా లేదు, చనిపోయి మోక్షాన్ని పొందడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే నగరం ఇది. మీరు భారతదేశంలో నివసిస్తున్నా లేదా భారతదేశాన్ని సందర్శిస్తున్నా, మీ జాబితాలో తప్పనిసరిగా ఉండవలసిన ఒక ఆత్మీయ నగరం ఇది. ఈ నగరం వైవిధ్యమైనది, రంగురంగులద్ది మరియు దిగ్భ్రాంతికరమైనది.*
 *_నాకు తెలిసి... నేటి కాలంలో నిజాయితీగా ఉన్న స్నేహాలు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు._*

*_నేను వాస్తవాలను చెబితే మీకు కాస్త బాధ  అనిపించొచ్చు. కానీ తప్పదు. నాకు తెలిసి ఇదే నిజం._*

*_నేటి స్నేహాలన్నీ స్టేటస్ ను బట్టి, ధనాన్ని బట్టి, వారికున్న పలుకుబడి బట్టి  మాత్రమే చూసి వారి మధ్యన స్నేహబంధం ముడిపడి ఉంది. ఇదే నిజం... ఇదే లోకం తీరు._*

*_స్వార్థంతో ముడిపడి ఉన్న స్నేహాలు, నీవున్న పరిస్థితిని చూసి, జాలి పడడం తప్ప, నిన్ను నిన్నుగా ప్రేమించలేని స్నేహం ఉన్న ఒకటే లేకున్నా ఒకటే._*

*_నిన్ను నిన్నుగా... నిన్ను నీలాగ ప్రేమించే స్నేహబంధం ఒక్కరు ఉన్నా చాలు. స్నేహమనే పదం చాలా అత్యుత్తమమైనది, అతి ఉకృష్టమైనది, పవిత్రమైనది. దాని విలువ తెలిసిన వాడికే నిజమైన స్నేహమనే బంధం అర్థం మవుతుంది._*

*_మనకున్న స్నేహం ఓ నీడ లాంటిది. వెలుతురు ఉన్నంత వరకే వెంటాడుతూ ఉంటుంది. చీకటి (మనదగ్గర ఏమి లేనప్పుడు)రాగానే కనుమరుగు అవుతుంది ఇదే నిజం, ఇదే జీవిత సత్యం. కాదంటారా.?_*

*_జీవితం ఓ పెద్ద అబద్ధం. ఈ భూమి మీద మనలను ఎన్ని రోజులు ఉంచుతుందో  ఆ దైవం తెలియదు... మృత్యువు ఎలా ఉంటుందో... ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి అర్థం కాదు..._*

*_మన చుట్టూ ఉన్న సమాజం, మన పరివారం, మన స్నేహితులు ఓ... నాటక రంగం. నవరసాలు పండించి నిట్టనిలువునా ముంచేస్తారు సుమీ..._*

*_అయినా బ్రతకాలనే కోరికలతో బాధల బంధికానాలో బలౌతూనే... మన జీవనం సాగిస్తాం. బ్రతకాలంటే తప్పదు మరి... ఆఖరి పిలుపు వచ్చేవరకు. నటించే సమాజం ముందు, స్నేహితుల ముందు  మనము నటిస్తూ..._*

*_రాని నవ్వుని ముఖమున తగిలించుకుని ఈ గ్యారెంటీ, వారెంటీ లేని బతుకు బతకడమే... ఈ జీవితం._*

*_ఈ నాటకీయ రంగానికి తెరదించేది ఎప్పుడు. జీవితమే ఒక నాటక రంగం. తెరదించాక బాధపడితే లాభం లేదు. నాకు తెలిసి అంతా ఒక బూటకం ఇదో ఓ... నాటకం.☝️_*

      *_సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌹🌷🌹 🪷🙇🪷 🌹🌷🌹
 *_నీకు నీవే గొప్ప అనుకుంటే... నీ అంత మూర్ఖుడు ఈ జగతిలో లేడు. గొప్పలు చెప్పుకునే గొప్ప వాళ్లంతా కూడా భూగర్భం లో కలిసిపోయారు. అందులో నువ్వెంత.?_*

*_మనిషికి అహంకారం ఉండొచ్చు, అది మనిషి సహజ లక్షణం కూడా తప్పులేదు కానీ, అతీ అహంకారం మనిషి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి పతనానికి చేరుకుంటాడు._*

*_నాకు నేనే గొప్ప నాకు ఎవ్వడి అవసరం లేదు, నాకు ఎవడి అవసరం రాదు  అని విర్రవీగకు. కాలము చాలా శక్తివంతమైంది కాలానికి అతిథులు ఎవరు కారు._*

*_అవతారపురుషుడు, పురుషోత్తముడు రాముడంతటివారే 14 సంవత్సరాలు వనవాసమేగాడు. మహా భక్తుడు రామదాసు అంతటివారే చెరసాల్లో బంధించబడి కొరడా దెబ్బలను భరించాడు. కాలం అతి శక్తివంతమైనది._*

*_లంకాదీశుడు రావణుడు మరణమే లేని వరం కోరుకుని, ఈ సృష్టికి నేనే కర్తను నా అంతటి వాడు ఈ లోకంలో ఎవడు లేడు అనే అహంకారంతో విర్రవీగీ... సీతామాతను చెరబడితే చివరికి రామ బాణానికి బలైయ్యాడు. మృత్యుగర్భములో వాలిపోయాడు._*

*_అహంకారంతో విర్రవీగి నేనే దేవున్ని, నేనే మిమ్ములను నడిపిస్తున్నాను. నేనే మిమ్ములను పోషిస్తున్నాను. నన్నే మీరు పూజించాలి, సేవించాలి అని అహంకరించిన హిరణ్యకశ్పుడు. చివరికి పొట్ట చీల్చి చంపబడ్డాడు._*

*_మిత్రమా... ఆఖరిగా ఒక్క మాట... రేపటికి రూపం లేని జీవితాలు మనవి. ఏ సమయము ఎలా మారునో జీవితం ఏది చెప్పి, తెలిసి రాదు. చివరికి ఉంటామో... పోతామో. తెలియని క్షణిక కాల జీవితం మనది._*

*_అందుకే సాధ్యమైనంతవరకు ప్రేమించు, ప్రేమను పంచు. అహంకారముతో విర్రవీగకు... అహంకారంతో విర్రవీగిన వాళ్లు బాగుపడినట్లు చరిత్రలో లేదు. ముందు గతిని తెలుసుకొని నీ గతిమార్చుకో.☝️_*

     *_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🙏🙏🙏 🌷🙇🌷 🙏🙏🙏
 ఇక పెళ్లిళ్లు అయినట్లే : సిబిల్ స్కోర్ తక్కువ ఉందని.. పెళ్లి రద్దు చేసుకున్న అమ్మాయి...

హైదరాబాద్ : ఇక పెళ్లిళ్లు అయినట్లే : సిబిల్ స్కోర్ తక్కువ ఉందని.. పెళ్లి రద్దు చేసుకున్న అమ్మాయి
పెళ్లి అంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలనేది పాత సామెత.. మారుతున్న కాలంతో అమ్మాయికి అబ్బాయి.. అబ్బాయికి అమ్మాయి నచ్చితే చాలు అనే వరకు మొన్నటి వరకు ఇచ్చింది. నిన్నటి వరకు మాత్రం అమ్మాయి అయితే చాలు.. అబ్బాయి అయితే చాలు అనే వరకు వచ్చింది.. ఇప్పుడు కొత్తగా సిబిల్ స్కోర్ ఎంటర్ అయింది. అవును మరి.. అబ్బాయి సిబిల్ స్కోర్ (మన లావాదేవీలకు సంబంధించి ఇచ్చే రేటింగ్) (Cibil Score) వరకు వచ్చింది. అబ్బాయి సిబిల్ స్కోర్ సరిగా లేదని.. స్కోర్ చాలా తక్కువగా ఉందనే కారణంతో ఏకంగా పెళ్లినే రద్దు చేసుకున్నది అమ్మాయి కుటుంబం. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.

మహారాష్ట్ర రాష్ట్రం ముర్తిజాపూర్ ప్రాంతానికి చెందిన కుర్రోడు. ఐటీ ఉద్యోగి. ఉద్యోగానికి తగ్గట్టు.. జీతానికి తగ్గట్టు నాలుగు, ఐదు లోన్లు తీసుకున్నాడు. దర్జాగా బండి, ఇల్లు కొన్నాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని సంబంధాలు చూశారు ఇంట్లో పెద్దలు. ఓ సంబంధం వచ్చింది. రెండు కుటుంబాలకు నచ్చింది. జాతకాలు కూడా కలిశాయి. కట్నకానుకలు, పెట్టుబడులు, కళ్యాణ మండపాలు అన్నీ మాట్లాడుతున్నారు. మంచి ముహూర్తంలో పెళ్లికి రెడీ అయ్యాయి రెండు కుటుంబాలు.

పెళ్లి సంబంధం అంతా ఒకే అనుకున్న సమయంలో.. అమ్మాయి నాన్నకు ఓ డౌట్ వచ్చింది. అబ్బాయి బ్యాంక్ అకౌంట్, పాన్ నెంబర్ తీసుకుని సిబిల్ స్కోర్ చెక్ చేశాడు. అబ్బాయి సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని రిపోర్ట్ వచ్చింది. షాక్ అయ్యాడు. ఆర్థిక లావాదేవీలు సరిగా లేవని.. అప్పులు ఎక్కువగా ఉన్నాయని.. ఇలాంటి అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చేది లేదని డిసైడ్ అయ్యాడు. పెళ్లి రద్దు చేసుకున్నాడు.

అబ్బాయి మాత్రం లబోదిబో అంటున్నారు. EMIలు ఉన్నాయని.. బండి, ఇంటికి ఈఎంఐ కడుతున్నానని.. దుబారా కోసం అప్పులు చేయలేదని.. దీని వల్లే సిబిల్ స్కోర్ తక్కువగా వచ్చిందంటూ నెత్తీనోరూ బాదుకున్నాడు. అయినా సరే.. అమ్మాయి తండ్రి మాత్రం పెళ్లి రద్దు చేసుకున్నాడు. క్రెడిట్ కార్డు బిల్లులు కూడా నువ్వు సరిగా చెల్లించటం లేదు.. అలాంటి నీకు పెళ్లి ఎందుకు అంటూ వెళ్లిపోయింది ఆ సంబంధం. 

దేశంలోనే మొదటి సారి ఇలా సిబిల్ స్కోర్ కారణంగా పెళ్లి రద్దు కావటం. ఇది చర్చనీయాంశం అయ్యింది. అసలు సిబిల్ స్కోర్ అంటే ఏంటీ అంటే.. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ అందించే స్కో. ఇది సాధారణంగా 300 నుంచి 900 పాయింట్ల వరకు ఉంటుంది. స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు అంత ఎక్కువగా.. త్వరగా అప్పులు ఇస్తాయి. తీసుకున్న అప్పులకు మనం చెల్లించే విధానాన్ని బట్టి ఈ స్కోర్ ఉంటుంది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకులు అప్పులు త్వరగా ఇవ్వకపోగా.. ఇచ్చేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. 

మొత్తానికి భారతదేశంలో ఫస్ట్ టైం.. సిబిల్ స్కోర్ ఆధారంగా పెళ్లి రద్దు కావటం. ఇప్పుడు సిబిల్ స్కోర్ కూడా ఓ అర్హతగా లిస్టులో చేరిపోయింది కాబట్టి.. ఇక మగాళ్లకు పెళ్లిళ్లు అయినట్లే..
 *_జీవితంలో మనం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ  ఉంటాం కొన్ని సార్లు ఆ ప్రక్రియలో తప్పులు చేస్తూ ఉంటాం... కానీ చేసిన తప్పులు తెలుసుకోవాలే  కానీ లక్ష్యం వైపు మనం చేసే ప్రయాణం ఆగకూడదు..._*

*_నిజమైన ఎదుగుదల ఎప్పుడు సాధ్యమంటే... మనం చేసే పనులు తెలియకపోవడం తప్పుకాదు... నేర్చుకోకపోవడం తప్పు. భయపడటం తప్పు కాదు... భయాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయకపోవడం తప్పు... లోపాలు ఉండటం తప్పుకాదు... వాటిని సరిదిద్దుకోకపోవడం తప్పు._*

*_మనం ఏ అంశంలో వెనకబడి ఉన్నామో ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ తప్పులు తెలుసుకుంటూ గుణపాఠాల నుంచి నేర్చుకుంటూ... అందులో మెరుగవుతూ ఉంటేనే జీవితంలో నిజమైన ఎదుగుదల సాధ్యమవుతుంది._*

*_జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మన మంచికే... కాలికి తగిలే దెబ్బ ఎలా నడవాలో నేర్పిస్తుంది... కడుపు మీద తగిలిన దెబ్బ ఎలా కష్టపడాలో నేర్పిస్తుంది._*

*_మనసుకు తగిలే దెబ్బ ఎదుటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. బ్రతుకు మీద తగిలే దెబ్బ ఎవరిని నమ్మాలో నేర్పిస్తే, జీవితం మీద తగిలిన దెబ్బ ఎవరిని ఎలా ఎదుర్కొవాలో నేర్పిస్తుంది.☝️_*  
                               
       *_సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌺🪷🌺 🌷🙇🌷 🌺🪷🌺
 #Chhaavaa:- మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన #ఛత్రపతి *శివాజీ* మహారాజ్  కుమారుడు శివాజీ తర్వాత ఆయన వారసునిగా *శంభాజీ* మరాఠా సామ్రాజ్యాన్ని పాలించాడు.  #శంభాజీ మహారాజ్ అతని సలహాదారు *కవికలష్‌* లను ఔరంగజేబు సేనాని ముకర్రబ్‌ఖాన్‌ సంగమేశ్వర్‌ వద్ద *కుట్ర* చేసి బంధించాడు. వారిని ఒంటెలకు కట్టేసి రాళ్లూ, పేడ విసిరి అవమానించారు. మరాఠా సామ్రాజ్యంలోని కోటలన్నిటినీ తనకు స్వాధీనం చేసి, #ఇస్లాంలోకి మారితే శంభాజీని #వదిలేస్తానని బేరం పెట్టాడు వెుఘల్‌ చక్రవర్తి.   ఐతే..తన కంఠంలో ప్రాణం ఉండగా #మతంమారనంటూ శివుణ్ని కీర్తించాడు శంభాజీ. దాంతో వారిని నలభై రోజులపాటు జైల్లో ఉంచి #చిత్రహింసలు పెట్టారు. కనుగుడ్లు, గోళ్లూ పీకారు. బతికుండగానే చర్మం వలిచారు. ఏం చేసినా మతం మారననీ ఒక్క కోటనూ స్వాధీనం #చేయననీ ధైర్యంగా చెప్పాడు. చివరకు మార్చి 11, 1689న అసువులు బాశాడు. అంతటితో ఔరంగజేబు కోపం చల్లారలేదు. శంభాజీ శవాన్ని #ముక్కలుముక్కలు చేసి నదిలో పారేయమన్నాడు.  అక్కడికి దగ్గరలోని గ్రామస్థులు నదిలోకి దిగి శంభాజీ శరీర ఖండాలను వెదికి దొరికిన వాటిని అతికించి ఘనంగా #అంతిమసంస్కారాలు జరిపించారు. తండ్రికి ఛత్రపతి బిరుదు ఉన్నట్టే శంభాజీని #ధర్మవీర్‌ గా గౌరవిస్తారు... ఇదీ #అసలు జరిగిన కథ  నేడు విడుదల ఐన #Chhaava చిత్రం మాత్రమే కాదు  మన చరిత్ర అందరు తప్పక చూడండి.తెలుసుకోండి భవిష్యత్ తరాలకు అలాంటి బానిసత్వం రాకుండా వీరులుగా తీర్చిదిద్దండి.  ఛత్రపతి శాంభజి మహరాజ్ ను #Chhaava  అంటే సింహం పిల్ల.🐅  ఔరంగజేబు క్రూరత్వం నికి లొంగని సింహం బిడ్డ శాంభజి మహరాజ్ కు రోజుకో అవయవం కోస్తూ ఉప్పు కారం అద్ధుతూ 45 రోజులు హింసించి హింసించి చంపాడు నీచుడు ఔరంగజేబ్ ... మన చత్రపతి  శివాజీ మహరాజ్ తనయుడు శంభాజీ మహరాజ్ ని ... ముస్లింగా మారితే   ప్రాణం తో పాటు.. సగం భారతదేశం ఇస్తా అన్నా మతం మారటానికి ఒప్పుకోలేదు శంభాజీ....   నా కంఠంలో ప్రాణమున్నంత వరకూ నేను హిందువునే అంటూ ప్రాణం వదిలిన మరాఠ యోధుడు *శంభాజీ* మహరాజ్.⚔️🚩⚔️  ధర్మం కోసం, దేశం కోసం... ఎంతో మంది.. ఇలా మన కోసం త్యాగం చేసారు..
👇👇👇
*వీరందరికీ కన్నీటి నివాళులు.*
🙏🙏😰🙏🙏
 ఎవడిని పడితే వాడ్ని దేశానికి రానిస్తే తంతాం...

ఇక్కడి భూమి పుత్రులు...రక్త సంబంధం...వందల సంవత్సరాల అనుబంధం ఉంటేనే పౌరుడవుతాడు...

ఇక్కడ పుట్టిస్తే... ఇక్కడ పుట్టేస్తే సరిపోదు...

శరణార్థుల పేరుతో దేశంలో తిష్ఠ వేసి దొబ్బి తినడం ఇంకెంత మాత్రం కుదరదు...

ఇస్లాం వ్యతిరేకత..తీవ్ర జాతీయత మా ఎజెండా...

ఇవ్వన్నీ బీజేపీ మాటలు కాదు...

జర్మనీలో ఉదారవాద లౌకికవాద తలలేని పార్టీలను దుయ్యబడుతూ...సగం సగం జాతీయవాద పార్టీ CDU నుంచి బయటకి వచ్చి..

కేవలం పది సంవత్సరాలలో ఎన్నికల్లో రెండో స్థానానికి దూసుకెళ్లిన AFD పార్టీ మాటలు అవి...

బీజేపీ గాంధేయ సోషలిజం లాంటి అధిక బరువును వదుల్చుకున్నట్టే...AFD కూడా సోషలిజం తోటకూర లాంటి ఎక్స్ట్రాలు వదిలేసి...

మా జర్మనీ మాది..మా చరిత్ర మాది అంటూ ఇప్పుడు ఎన్నికల్లో 20 శాతం ఓట్లు కొల్లగొట్ట బోతోంది...

దాని మాతృ సంస్థ సగం జాతీయవాద పార్టీ 29 శాతం ఓట్లతో ముందంజలో ఉంది...

ఈ రెండే కలిసి ప్రభుత్వం ఏర్పరిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి...

బుర్ఖా వద్దన్నందుకు ఫ్రాన్స్ ను తగలెట్టిన శాంతి మతం పోకడలు చూసి జర్మనీ కళ్ళు తెరిచింది...

లండన్ ప్రధాన వీధుల్లో ట్రాఫిక్ ఆపేసి నమాజులు చేసి...తిరిగి వెళ్తూ...

కంటికి నదరుగా కనపడిన అమ్మాయిలను వేధించడం... బాగున్న కార్లను పగలగొట్టడం వంటి పన్లు చేసే క్రమశిక్షణ కలిగిన యువకుల్ని చూసిన జర్మనీ మేలుకుంది...

ఈ AFD పార్టీ మొదట టార్గెట్ చేసింది కమ్యునిజం... వోకిజం ప్రచారం చేసిన యూనివర్సిటీ ప్రొఫెసర్లను...

ఈ మెదడు తక్కువ దద్దమ్మలు దేశానికి అరిష్టం అని.. అధికారానికి వస్తే...వీళ్లనే మొదట తన్ని తరిమేస్తాం అని చెప్పింది...

జర్మన్ ప్రజలు చప్పట్లు కొట్టారు...

మా దేశం మా జాతి మాకు ముఖ్యం...

ఎర్ర కబుర్లు మా దేశాన్ని నాశనం అంచున నిలబెట్టాయి...దాన్ని...అది మద్దతు ఇచ్చే రాడికల్ ఇస్లామిక్ ముష్కరులను వదుల్చుకోవడం చాలా అవసరం అని ఈ పార్టీ ప్రచారం చేసింది...

ఈ AFD నాయకుడు అలెగ్జాండర్ మాట్లాడుతూ...మేం మళ్ళీ హిట్లర్ రోజులకు తీసుకుని వెళ్తాం అని ప్రచారం చేసే సన్నాసులకు ఒకటే చెబుతున్నాం...వెయ్యేళ్ళ మా చరిత్రలో పన్నెండేళ్ళ హిట్లర్ పాలన పిట్ట రెట్టంత...దాన్ని పట్టుకు వెళ్లాడుతారు.. యూజ్లెస్ ఫెలోస్...అన్నాడు...

మనువాదం...హిట్లర్ మాటలు మాట్లాడే మన భారత కమ్యూనిస్టుల నెత్తిమీద కూడా ఏనుగు పెంట వెయ్యాలి...మనం...

ఒక్కొక్క యూరోపియన్ దేశం నిద్ర లేవడం మొదలయ్యింది...

ప్రపంచం నుంచి అభినందనల వెల్లువ స్టార్ట్ అయ్యింది...యూదు ఇజ్రాయిల్ నెతన్యాహూ కూడా ఆ పార్టీకి వెల్కమ్ చెప్పాడు...

ఇప్పుడు అక్కడి ప్రతిపక్ష నేత మెర్జ్...చిల్లర ఉదార వాద పార్టీలతో దోస్తీ కట్టేకంటే..పూర్తి జాతీయవాద పార్టీ AFD తో జట్టు బెటర్ అని అన్నాడు...

యూరోప్ చీకటి గదుల్లోంచి బయటికి వస్తోంది...

ప్రపంచం మారుతోంది...మరి భారత్....!! 🚩
 వత్తిడిని జాయిస్తేనే విజయం 

వ్యక్తిత్వ వికాసకులు జాలాది మోహన్ 

ఈ రోజు జిల్లా గ్రంధాలయం ఒంగోలు నందు చదవటం మా కిష్టం కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమం లో ప్రముఖ వ్యక్తిత్వ వికాసకులు జాలాది మోహన్ మాట్లాడుతూ వత్తిడిని జాయిస్తే విజయం మీ ముంగిట్లోకి వస్తుందని,మారుతున్న సమాజంలో వస్తున్న మార్పులు వత్తిడిని కలుగజేస్తున్నాయని వ్యక్తిగత ఆలోచనలు కుటుంబ ఉద్యోగ సామజిక రంగలలో చోటుచేసుకున్న పరిణామాలు మనసిక వత్తిడిని పెంచుతున్నాయని అన్నారు 
శక్తికి మించిన లక్ష్యాలు,తగాదాలు,చదువులో వెనకపడడం,చెడు అలవాట్లు,వృత్తి,ఉద్యోగ సమస్యలు,టీజింగ్,రాగ్గింగ్ వల్ల వత్తిడివంటి సమస్యలు వస్తున్నాయని అన్నారు 
వత్తిడివల్ల అసహనం జ్ఞాపకాశక్తి తగ్గడం,భయం,కోపం,ఆశాంతి,అందోళన ఆస్తిరత్వం వంటి మనసిక సమస్యలు వాంతులు,తలనొప్పి,ఆకలి తక్కువగా ఉండడం,నిద్రలేమి,ఉబాకాయంవంటి మనసిక సమస్యలు వస్తాయని వత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామలు ధ్యానం,యోగా రిలేక్షేషన్ ప్రక్రియలు,లలితకలలు,ఆటలు,పాటలు,డాన్స్ పెయింటింగ్,సంగీ తము,తోడ్పాడతాయని,ముందుగా ప్రణాళిక వేసుకోవాలని,పని ఆరంభిమాచాటానికి ముందే అన్నీ సమాకుర్చుకోవాలని పనిని వాయిదా వేయకూడదని పెద్దప నులనుచిన్న చిన్న భాగాలుగా చేసి పూర్తిచేయాలనీ అన్నారు జాగ్రత్తగా వత్తిడిని తగ్గించుకొని  తప్పక అను కున్నది సాధించవచ్చని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రందాలయ సిబ్బంది బొమ్మల కోటేశ్వరి,అనిల్ తదితరులు పాల్గొన్నారు
 మనస్సులో మాలిన్య దోషాలు, దేహాది అహంకారము పోతే చిత్త శుద్ధి కలుగుతుంది. అప్పుడు సాధనలో పురోగతి లభిస్తుంది. 

విహిత కర్మలను, అంటే, చెయ్యవలసిన పనులను కర్తవ్యతా బుద్ధితో చెయ్యడమే కర్మయోగమంటే. 

మనస్సు అంతర్ముఖమై, పరమాత్మ ఆశ్రయమైనపుడు, ఇంద్రియాల చేత చెయ్యబడే పనులవల్ల ; మనోవృత్తులు ఉదయించవు♪ గనుక, కామ వాసనలూ ఉండవు. కాబట్టి అది నిష్కామ కర్మ అవుతుంది. 

అట్టి మనోవృత్తులు ఉదయించని స్థితినే ఆకర్మము అని అంటారు. 

అందుకే కర్మకు ఫలము కూడ ఉండదు♪. సంకల్పంతో కలసి అంతః కరణంలోవృత్తులు జనించినపుడే ఆ కర్మ బంధకారణం అవుతుంది.*

*కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, అంతరింద్రియ సంబంధమైన పనులన్నీ శరీరంతో చేయబడుతున్నాయి. 

ఈ పనులలో ఆసక్తి లేకుండా గనుక చెయ్యగల్గితే, అవి కర్మఫలాలను కలిగించ లేవు. 

అట్టివాడే అన్ని శాస్త్రముల యందూ అధికారి. జ్ఞానికి ఫలాపేక్ష, దేహేంద్రియాభిమానము, కర్తృత్వాభిమానమూ లేకుడటం వల్ల కర్మలు చేసినా ; కొంచెమైనా కర్మము చెయ్యని వాడే. 

అట్టి వాడు లోకసంగ్రహార్ధం/ శరీర యాత్రకోసం కర్మలను చేసినా దోషం లేదు. 

సమస్త కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యడం వల్ల దోషముండదు. 

జ్ఞాన సిద్ధికి కర్మమార్గము సాధనమని చెప్పబడింది. నిష్కామ కర్మయోగంతో కూడిన విహిత కర్మలను చెయ్యటం అందరికి యోగ్యమే♪.*

*కర్మయోగి ఏ సిద్ధాంతాన్నీ నమ్మనక్కర లేదు. 

స్వార్ధ రాహిత్యాన్ని మాత్రం కర్మాచరణ ద్వారా స్వయంగా సాధించాలి. 

అహంకారం వదులుకొన్నపుడే నిష్కామ కర్మాచరణం సాధ్యం♪. 

నేను, నా వారు అనే భావం లేకుండా ఉండాలి. 

అహంకారంతో చేసే పనులు ప్రవృత్తి. 

అహంకార మమకారాలను వదలి చేసే పనులు నివృత్తి ; 

ఈ పనులకు కర్మత్వం ఉండదు.*
*ప్రవృత్తి వల్ల సంసారము, నివృత్తి వల్ల మోక్షమూ లభిస్తాయి.*

*తామరాకుపై నీటిబిందువు నిలిచి ఉన్నా అది తామరాకును అంటనట్లు ; కర్మయోగి ఎట్టి పనిచేసినా ఏ కర్మనూ చెయ్యనివాడే. 

కోరికలను జయించక సన్యసించినవాడు ఏకాంతవాసములో ఉండి ఏకర్మనూ చెయ్యకున్నా, సమస్త కర్మలూ చేసిన వాడే అవుతున్నాడు. 

కర్మయోగులకూ, కోర్కెలు లేని వారికీ భగవదనుగ్రహం వల్ల హృదయ గ్రంధి క్షీణించి అహంకార మమకారాలు నశిస్తాయి. 

జనన మరణ సంసార చక్రం నుంచి విముక్తి కలుగుతుంది. కర్మయోగం వల్ల చిత్తశుద్ధి, చిత్తశుద్ధి వల్ల తత్త్వ జ్ఞానము, తత్త్వజ్ఞానం వల్ల ముక్తీ కలుగుతాయి.*

🦢🪷🦢🪷🦢🪷🦢
 ఉపనిషద్దర్శనం -21

అద్వైతం... ఆత్మజ్ఞానప్రదా యకం 
మాండూక్యోపనిషత్తు 
హరిః ఓమ్... ఓంకార స్వరూపాన్ని, ప్రాముఖ్యాన్నీ, వివిధ దశలనూ వివరించే మాండూక్యోపనిషత్తు అధర్వణ వేదంలోనిది.    కేవలం పన్నెండు మంత్రాల చిన్న ఉపనిషత్తు అయినా  ప్రధానమైన పది  ఉపనిషత్తులలో ప్రము ఖ స్థానాన్ని పొందింది.   సూత్రప్రాయంగా ఉన్న ఈ ఉపనిషత్తుకు ఆదిశంకరుల గురువైన గౌడపాదాచార్యులు వివరంగా కారికలు రాశారు. శంకరాచార్యుని అద్వైత ప్రతిపాదనలో మాండూక్యం ప్రధా నపాత్ర వహించింది.    ఓంకారాన్ని ‘ప్రణప్రవం’ అంటారు.       అనగా నిత్యనూతనం. అ, ఉ, మ అనే  మూడు సాకారమైన అక్షర ధ్వనుల చివర వినపడే   నిరాకార ధ్వనితో ఆత్మజ్ఞానాన్ని, పరబ్రహ్మతత్త్వాన్నీ మెలకువలో, కలలలో, గాఢనిద్రలో  అన్ని దశలలో అందించే  ఓంకారం ధ్వనితరంగాలతో ఏకాగ్రతను, శాంతినీ సాధించే  శాస్త్రీయ మైన  నాదోపాసన.   కులమతాలతో, స్త్రీపు రుష భేదాలతో, వయస్సులతో సంబంధంలేని స్వచ్ఛధ్యానయోగకేంద్రం మాండూక్యం. 

విశ్వమంతా  ఓంకారమే.     భూత, వర్తమాన, భవిష్యత్తులు అంతా ఓంకారమే. మూడుకాలాలకూ, అతీతమైన స్థితి కూడా ఓంకారమే.     ఓంకారమే   పరబ్రహ్మ  . పరమాత్మ. ఇదినాలుగు పాదాలుగా అనగా నాలుగు స్థానాల్లో ఉంటుంది.    మొదటిది  మెలకువగల బాహ్యప్రజ్ఞ.      ఇదిఅగ్నిస్వరూపం.    అగ్నికి   ఏడు అంగాలు, పందొమ్మిది  ముఖాలు ఉంటాయి.     స్థూలమైన అనగా భౌతిక దృష్టి  కలిగి  ఉంటుంది. 
రెండవది  స్వప్నస్థానం.    అంతఃప్రజ్ఞతో ఇది తేజోమయమైఉంటుంది.    ఈ తైజసరూపానికి  కూడా ఏడు అంగాలు, పంతొమ్మిది  ముఖాలు ఉంటాయి.   ఈ తైజసమైన ఆత్మ స్వప్నావస్థలో ఏకాంతమైన మనోలోకంలో విహరిస్తూ ఉంటుంది. 
ఏ కోరికలూ, కలలూ లేని గాఢనిద్రను  ‘సుషుప్తి’ అంటారు.    ఇదిమూడవ స్థానం. పరబ్రహ్మ  సుషుప్తస్థితిలో, ఒకేఒక్కడుగా, ‘ ప్రజ్ఞాన ఘనుడుగా, ఆనందమయుడుగా ఆనందాన్ని అనుభవిస్తూ, మనోముఖుడై, ప్రాజ్ఞుడై  ఉంటాడు. 
ఏష సర్వేశ్వరః ఏష సర్వజ్ఞ ఏషోతర్యామ్యేష యోనిః సర్వస్య ప్రభవాప్యయౌ హిభూతానామ్ 
ఇతడే  సర్వేశ్వరుడు. సర్వజ్ఞుడు. అంతర్యామి.   అన్నిటి   పుట్టుకకు, నాశనానికి  మూలకారణం ఇతడే.    అద్వైతస్థానం నాలుగవది.    ఇదేపరమాత్మ. అంతఃప్రజ్ఞకు,   బహిఃప్రజ్ఞకు, ఉభయ ప్రజ్ఞకు అన్నిటికీ  అతీతం.    ప్రజ్ఞాసహితమూ  కాదు. రహితమూ కాదు. కనపడదు. కదలికలు ఉండవు.    పట్టుకోవడానికి  దొరకదు.     ఏ లక్షణాలూ ఉండవు. ఊహకు అందదు. వర్ణనాతీతం. ఏకైకం. పంచజ్ఞానేంద్రియ  రహితం.    శాంతం, మంగళప్రదం  , అద్వైతం (రెండుకానిది) అయినది ఆత్మ.   దానిని తెలుసుకోవాలి.    దానికి  ఓంకారమే  ఆధారం.
 వైశ్వానర, తైజస, సుషుప్త, తురీయస్థానాల్లో ఉన్న ఆత్మలో  లీనం కావడానికి మానవులకు ఆధారమైనది  ఓంకారం.    ఆత్మయొక్క నాలుగుదశలూ ఓంకారంలో ఉన్నాయి. శబ్దబ్రహ్మాన్ని ఏకాగ్రతతో ఉపాసించినవాడు రసాత్మకమైన పరబ్రహ్మం  అవుతాడు.    ఆనంద మయుడు అవుతాడు.    శబ్దరూపమైన పరబ్రహ్మ మే  ఓంకారం.     ఓంకారంలో మూడు మాత్రలు  ఉన్నాయి.   (మాత్ర అంటే చిటిక  వేసినంత  కాలం).    అవి అ, ఉ, మ్ అనే  మూడుపాదాలు. అ+ఉ గుణసంధితో ఓ అవుతాయి.    దానికి  మకారాన్ని కలిపితే  ఓమ్   అయింది.    దాని చివర నామరూపరహితమైన ధ్వని నాలుగోపాదం.    దానితో ఓంకారం సంపూర్ణ   పరబ్రహ్మం  అవుతుంది.
 ఓంకారంలోని మొదటిపాదం   ‘అ’.    ఇది   జాగ్రత్ స్థానంలో ఉన్నా వైశ్వానరుని (అగ్ని) రూపం.    వ్యాప్తి, ప్రథమ స్థానం అనే  లక్షణాలు అగ్నికీ, ‘అ’ కారానికీ  సరిపోతాయి. ఇది  తెలుసుకొని ఓంకారాన్ని ఆరాధించినవాడు అన్నిటినీ పొందుతాడు.   సాధకులలో ప్రథముడు అవుతాడు.    ప్వప్నస్థానంలో ైతెజసరూపంలో ఉన్న ఉ కారం రెండవపాదం అవుతుంది.   మాత్ర ఎక్కువదనం వల్ల,    రెండిటిమధ్య (అ, ఉ మ్) ఉండటం వల్ల ఉకారానికి  తేజస్సుకీ  పోలికలున్నాయి.    ఈ విషయాన్ని తెలుసుకుని ఓంకారాన్ని ఉపాసించినవాడు నిత్యజ్ఞానియై   ద్వందాలకు (సుఖదుఃఖాలు, లాభనష్టాలు, నిందాస్తుతులు మొదలైనవి) అతీతుడు అవుతాడు. అతని వంశంలో బ్రహ్మ  జ్ఞానం లేనివాడు పుట్టడు. 

సుషుప్త స్థానంలో ప్రాజ్ఞరూపంలో ‘మ’కారం మూడోపాదం అవుతుంది.   కొలత కొలిచే  నేర్పు, గ్రహింపగల శక్తీఉన్న ‘మ’కారం ప్రాజ్ఞునితో సమానం.    ఇది   తెలుసుకున్నవాడు   దేనినైనా అంచనా వేసి  తెలుసుకో  గలుగుతాడు.   
 అమాత్ర శ్చతుర్థో వ్యవహార్యాః 
ప్రపం చోపశమః శివోద్వైత 
ఏవ మోంకార ఆత్మైవ! 
సంవిశత్యాత్మనాత్మానం
య ఏవం వేద, య ఏవం వేద.

 నామరూపరహితమైన నాలుగోపాదాన్ని ఎవరూ వర్ణించి చెప్పలేరు.    అది వ్యవహారాలకు అందదు.    జ్ఞానేంద్రియా లు     ఉపశమించి శాంతించి ఉంటాయి. మంగళప్రదమూ, అద్వైత  స్వరూపమూ అయిన ఓంకారాన్ని ఆత్మగా తెలుసుకున్నవాడు తానే పరబ్రహ్మ  మని తెలుసుకుంటాడు.    ఇలా ఓంకారాన్ని గురించి నాలుగుదశలను గురించి తెలుసుకున్న వాడే  నిజమైన జ్ఞాని.    ఓంకారోపాసన నిరంతరమూ చేసేవానికి   బ్రహ్మ  జ్ఞానం స్వయంగా 
లభిస్తుం ది.    ఏ గురువూ, ఏ విద్యా అవసరం లేకుండా ఓంకారధ్యానం లోనుంచి అది ఉద్భవిస్తుం ది.   సర్వజనులకూ అద్వైతాత్మజ్ఞాన  ప్రదా  యిని మాండూక్యోపనిషత్తు. 
ఓం శాంతి

Tuesday, February 25, 2025

****శ్రీ వేంకటేశ్వరస్వామి సందేశం.

శ్రీ వేంకటేశ్వరస్వామి సందేశం.  ( మీరు ఎలా వచ్చారోనన్న ఎరుక మీకున్న ఎన్నో అర్ధం కాని ప్రశ్నలలో ఒక భాగానికి సమాధానం మాత్రమే. మీరు పరిష్కరించాల్సినవి ఎన్నో అద్భుతమైనవి, ఆసక్తికరమైనవి ఉన్నాయి. కానీ మీ అందరికి కూడా సహజావబోధన లేదు. మీ “సహజావ బోధనలు" అంటే మీ శారీరక అవసరాలు కాదు. మీరు స్విచ్ లు ఆపేసి కూర్చున్న మీ ఆధ్యాత్మిక సందేశాలు అవి ఏమిటి?                                                                                                                            ఇవి మీ సహజావబోధనలు ----> ఎందుకో అలా అనిపించడాలూ, అతీంద్రియ చెప్పడాలూ, మీ కలలూ ఇవన్నీ మీరు పట్టించుకోకుండా వదిలేసిన మీ అద్భుతమైన ఆయుధాలు. ఇక్కడిలా మీరు వికలాంగులై పోయారు - కాలు, చెయ్యి ఆడనివారైపోయారు. దారి తప్పిపోయారు. మీరు అసలు ఎందుకు బ్రతుకున్నారో మీకు తెలీకుండా పోయింది. అన్ని రకాల సమస్యలతో హింసకు గురి అవుతున్నారు. “శరీరం” అని పిలువబడే గుడి అనారోగ్యంపాలై నాశనమైపోయింది. అది అలా ఎందుకయిందో మీకు తెలీదు.                             అవును, మీరు పరిగెత్తిపోవటం మొదలు పెట్టారు. మీ నుంచి మీరు పారిపోయే గొప్ప నాటకాన్ని బ్రహ్మాండంగా ఆడుతున్నారు. ఇవాళ మీరింత దుర్భర పరిస్థితులలో ఉండడానికి కారణం అదే. నేను ఆరాటంగా కోరుకునేది ఏమిటంటే ప్రాఠకులలో ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం ఆగి ఆలోచించుకోవాలి. "నా మంచి కోసం నేను ఏదన్నా ఒక్క పని చేశానా? నాతో నేను నిశ్శబ్దంగా ఎప్పుడన్నా కూర్చున్నానా?” అని ఆలోచించాలి.                                                                                                                 “లేదు” , “ఎప్పుడన్నా” లాంటి సమాధానాలు వస్తే నేను ఆశ్చర్యపోను! ఎందుకంటే మీరు అంతా చిన్నతనం నుంచీ ఇతరులు మీకు ఏది మంచిదంటే అలా ఉండటానికే అలవాటు పడ్డారు. మీకు మాట్లాడ్డం వచ్చిన క్షణం నుంచి మీ ఇష్టం వచ్చినట్లు మీ జీవితాన్ని గడిపే స్వేచ్ఛను మీరు చాలా కృత్రిమంగా లోపల ఒక రకంగా బయటికి ఇంకో రకంగా జీవిస్తూ ఎప్పుడు చూసినా మీ నుంచి మీరు దూరంగా పరిగెత్తిపోతున్నారు. వంటరిగా కొన్ని నిమిషాల పాటైనా నిశ్శబ్దంగా కూర్చోవడానికి మీరు భయపడిపోతున్నారు. అలా ఉండటం సమయాన్ని వృధా చేసుకోవటమేనని మీరు భావిస్తున్నారు. మీరు ఎప్పుడూ ఏదో ఒక “పని” చేస్తూ ఉండాలనీ, అప్పుడే మీ వల్ల “ఉపయోగం” అనీ మీరు అనుకుంటున్నారు. ఇలాగనే మీకు చిన్నప్పటి నుంచీ నేర్పించారు.

Reference - https://youtube.com/watch?v=Rhh8HvCAF9A&lc=UgwTgzpy7ky_7GdO1p14AaABAg&si=DooMQtzr8NalRi07

****మాట జారితే వచ్చే సమస్యలు | మాట్లాడే మనుషుల్లో రెండు రకాలు | communication skills with Kanth’Risa

మాట జారితే వచ్చే సమస్యలు | మాట్లాడే మనుషుల్లో రెండు రకాలు | communication skills with Kanth’Risa




ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏందంటే హ్యూమన్ మైండ్ గురించి బిహేవియర్ గురించి ఇది నా పర్సనల్ అబ్సర్వేషన్ ఈ భూమి మీద రెండు రకాల వ్యక్తులు నాకున్న ఈ చిన్న లైఫ్ లో కనిపించారు అంటే ఒకసారి కళ్ళు మూసుకుంటే ఇప్పటికి కనిపిస్తున్నారు ఫస్ట్ కేటగిరీ ఏందంటే అసలు లోపట కుట్రలు కుతంత్రాలు కుళ్ళు అంతా ఉంటది కానీ మంచిగా మాట్లాడుతారు సూపర్ మాట్లాడుతారు మన జెఎం లో ఉండే హాస్టల్ పేరు ఎందుకులే అంటే లోపట అంతా నీ గురించి ఏ మంచి భావన ఉండదు లోపట అంతా గలీజ్ అనుకుంటాడు కానీ వెంకటేశ్వర్ బాగున్నారా అసలు భలే ఉందని పని గానిస్తారు అన్నమాట ప్రపంచంలో చాలా బాగా సర్వైవ్ అవుతారు వాళ్ళకి మానవ సంబంధాలు ఎక్కువ కాలం ఉండవు కానీ ఏమంటారు ఆ అందినంత గుంజుకొని దొబ్బేస్తారు అంతే ఇదొక క్యాటగిరి సెకండ్ అసలు ఏ హృదయంలో నీ పట్ల నెగిటివిటీ ఉండదు ఏమి ఉండదు పాపం మంచోళ్ళు కానీ ఎట్లా మాట్లాడాలో తెలియదు దానివల్ల చాలా బాస్ పాలు అయితారు అంటే నోటి తీಟ ఉంటది కొంత ఇప్పుడు ఒకసారి నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది ఒక ఇంట్లో బంధువులందరూ వచ్చారు పెళ్లికి అంత ఆహ్లాదకరంగా ఉంది ఆమె మంచి అసలు యోగి కానీ భాషా సంస్కరణ లేదు డిస్కషన్ వచ్చింది ఈ జంతికాయలు చేసుకుందామా లేకపోతే అరిసెలు చేసుకుందామా లేకపోతే ఇట్లా అంటే అందరూ కలిసి కన్ఫర్మ్ చేసుకున్నారు ఏమంటారు దాన్ని కారం చుట్టలు అంటారు ఏమంటారు కారం చుట్టలు కారపూస కారపూస చేసుకుందాం అంతే అది చేసుకున్నాను అప్పుడే ఒక ఆవిడ వచ్చింది ఏం చేసుకుంటున్నారు కారపూసలు చేసుకో చేసుకోకండి అబ్బా లేట్ అయితది ఆ అంటే ಈ ಮಂಚಾಮೆ ಈ ಅಬ್ಬಾ నువ్వు పుల్ల పెట్టక అబ్బా అన్నది నన్ను పుల్ల పెట్టక అంటావా నువ్వు ఆ పెద్ద గొడవై ఒక్క మాట ఒక్క మాటకి ఈమె ఏం చెప్తుంది అంటే ఊకేనే అన్నబ్బా నాకు ఊత పదవా అందరి ముందు ఎట్లా అంటావ్ అట్లా ఎట్లా అంటే నువ్వు ఎంత చెప్పినా నువ్వు అట్లా అనకూడదు కదా అనకూడదు కదా ఇప్పుడు ఆ వచ్చిన వ్యక్తి ఎవరు ఐ యామ్ వెరీ కన్నింగ్ పర్సన్ ఆ కానీ మంచిగా మాట్లాడుతది పైకో బాగా పైకి ఆ పైకి సూపర్ మంచిగా మాట్లాడుతది అసలు అంటే మెచ్చుకోవడము తర్వాత పని కానించుకోవడము నీతో ఏదైనా అందించుకోవడము ఏదైనా డబ్బు అవసరమైతే నిన్ను ఎట్లా అట్లా పోగిడి లాగడం ఇదే ఉంటది వాళ్ళ అలర్ట్ గా ఉంటాడు కొందరు ఏమంటారు ఈజీ గోయింగ్ పీపుల్ లోపట ఏమి ఉండదు కానీ బయటికి ఒక చిన్న మాట అనడమో లేకపోతే ఆ మనకి ఏ మాత్రం సంబంధం లేదు అయినప్పటికీ చిన్న జోక్ చేయడం అట్లా దొరికి అట్లా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటారు నాకు ఈ మధ్యన అట్లా కొన్ని విషయాలు గుర్తొచ్చినాయి ఒకసారి ఊరికే ఎప్పుడైనా ఏకాంతంగా ఉన్నప్పుడు మనం కుమ్మేళ నుంచి బస్సులో వస్తున్నప్పుడు ఏం టైం పాస్ కాక ఒకసారి చిన్నప్పటి నుంచి మనకి ఎవరెవరు ఎంతమంది గుర్తున్నారు అని ఊరికే ఆలోచించుకుంది అసలు మనం మనకి ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు కలిసిన వ్యక్తులు అట్లీస్ట్ కొందరు గుర్తొస్తారు కదా క్రోనోలాజికల్ గా అటు చూస్తే నాకు ఈ రెండు కేటగిరీలు కనిపించారు అంటే చాలా దారుణమైన మైండ్ ఉండి మంచి మాట ఉన్నోడు సర్వైవ్ అవుతున్నాడు ప్రపంచంలో కానీ మంచి హృదయం ఉండి ఏ కల్మషం లేనోడు మాట చక్కగా లేక పరేషాన్ అయిపోతున్నాడు అందుకే కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఒక్క విషయం బాలు డిప్లమాటిక్ ఉండడం నేర్చుకోవాలి కానీ తెలియాలి అది మనం కొన్నిసార్లు చేస్తేనే తెలుస్తుంది రాదు ఎట్లా వస్తది అయ్యో పెద్ద పెద్ద సిఈఓ లకి ట్రైనింగ్ ఉంటది స్టిల్ దేర్ ఇస్ సో మచ్ టు లెర్న్ అందులో ఏం డౌట్ లేదు కానీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఒక ఎరుకలో ఉండి మాటలు వాడాలి తప్ప ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు అట్లా మాట్లాడితే కచ్చితంగా ప్రాబ్లం వస్తది ఆ ఇప్పుడు ఏ పని లేని కాలే తిని తిరిగేటోడికి ఏమైనా అరుచుకోవచ్చు చేసుకోవచ్చు కానీ జీవితంలో పని ఒకటి ఇంపార్టెంట్ అని తెలుసుకున్న వాడికి వాడికి అనవసరం కాదు ఇదంతా అట్లాంటి వాడు ఎక్కడ ఎవరితో ఎలా అని గుర్తుపట్టి మాట్లాడే ఒక ఒక ಒಂದು ఒక ಒಂದು ఒక ಒಂದು ఒక ಒಂದು ఒక ಒಂದು ఒక ಒಂದು ఒక ಒಂದು ఒక ಒಂದು ఒక ಒಂದು ఒక ಒಂದು ఒక ఆర్ట్ అనేది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ప్రకృతిలో ఏ బ్రాండ్ భాష లేదా మాట అసలే లేదా ఆయే భాష ఉందేమో మేబీ మాట లేదా అందుకని నీకు జరిగిందా అట్లా ఎప్పుడైనా అంటే నీ ఉద్దేశం అది కాదు కానీ మామూలుగా అంటే కూడా దాన్ని తక్కువ తీసుకున్న జనాలు చానా తీసుకుంటారు ఏదైనా ఒక్కటి చెప్పు పేర్లు చెప్పకుండా ఎట్లా చెప్పాలో నాకు రావట్లేదు అదే చెప్పు ఉన్నది చెప్తే ఇబ్బంది అవుతది కానీ అట్లా అందుకోసం నాకు అబద్ధాలు ఆడమ ఉమ్ నేను అన్నది నిజం నిర్భయంగా చెప్పాలనిపిస్తది వాడు కొట్టిన తిట్టిన గాని సరే నీకు అయిందా ఎప్పుడైనా ఉమ్ అట్లా ఒక టాపిక్ అంటే దాని గురించి చెప్తా నేను చెప్పు చెప్పొచ్చా చెప్పు కానీ ఎవరి పేర్లు చెప్పకు సినిమా కథలా చెప్పు అట్లా రావట్లేదు స్వామి నాకు ఉన్నది కల్పించుకోవట్లేదు అరే పేర్లు చెప్పకబ్బా నేను చేసే ఒక ఆఫీస్ లో ఒక అతను గొడవ పడ్డాడు అన్ని చెప్పాను చేశాను నా మీదకి అన్ని చెప్పి చేసిండు చేసి ఆఖరికి నేను అన్ని చూస్తున్నా ఎట్లా అంటే కర్త భావంతో చూసా సాక్షి చూసా ఇందాక నిన్ననే తెలిసింది వాడు తనటానికి వచ్చిన కొట్టడానికి వచ్చిన అన్ని చూసిన రారా తందు రారా అని కూడా వాడి ముందు సరెండర్ కూడా అయినా సరేలే వాడే సైడ్ అయిపోయిండు ఇందాకనే ఫోన్ వచ్చింది వేరే ఒక లేడీ వాడిని చెప్పుతో కొట్టి గందరగోళం చేసింది ఆ ఆఫీస్ లోనే సరే మనం డిస్కస్ చేసిన టాపిక్ అది కాదు ఇది వేరే ఇది రియల్ సిట్యువేషన్ నేను అంటున్నది ఏ సందర్భము లేదు ఇప్పుడు నువ్వు ఒక మనిషి ఉన్నావ్ నీకు అర్థమైందా బాల ఏం చెప్తున్నాను ఇదేమో సందర్భం ఇది నువ్వు ఆ డీప్ షిట్ గురించి మాట్లాడుతున్నావ్ అది అది ఉంది ప్రాబ్లం ఇక్కడ నటించేది ఏమి లేదు దేర్ ఇస్ ఏ ప్రాబ్లం అట్లా కాకుండా నేను ఏం చెప్తున్నా మనం ముగ్గురం నీవు జెన్యూన్ మంచి పర్సన్ ఆయన గురించి గాని నా గురించి గాని ఏ దురభ దురభిప్రాయము లేదు ద్వేషం లేదు లేకపోతే చెడుగా ఆలోచన లేదు ఏం లేదు మంచి హృదయం ఉంది నీకు కానీ నోరు తెరిస్తే చిన్నప్పటి నుంచి అలవాటు అయిన ఒక భాష ధోరణి ఉంటది కదా అది ఉండటం వల్ల సమస్యలు క్రియేట్ అవుతున్నాయి ఇది నేను చెప్పాలనుకున్నది నువ్వు చెప్పింది ఒక సమస్య సమస్య ఉంది కాబట్టి దానికి మనుషుల రియాక్షన్ అది ఉంటది నేను చెప్పేది ఏంటంటే జనరల్ గా ఇట్లాంటి ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ అభావం వల్ల వచ్చే ప్రాబ్లం గురించి ఫండమెంటల్ ఇది నేను చెప్పేది అంటే మనం ఇంకా సమస్య వైపు వెళ్ళలే ఉత్తగానే నువ్వు ఉన్నావ్ బాలు ఉన్నాడు నీ హృదయం నీ లోపల ఏ కల్మషం లేదు ఈ మధ్య కొంచెం పొట్ట గిట్ట పెట్టినవు లావైనట్టు నువ్వు అన్నావు అనుకో అది తప్పు అనిపించింది అనుకో ఇస్ దేర్ ఎనీవే ఎలాగో చెప్పక తప్పదు దాన్ని ఎలా చెప్తే బాగుంటది ఇది ఇప్పుడు లోపట ఒక కుట్రలు కుతంత్రాలు ఉన్నోడు వచ్చాడు వీడు పందిలాగా బలిసింది ఈ మధ్యన అని అనుకోని ఏమో స్మార్ట్ గానో కొంచెం ఆ అంటే వాడి ఉద్దేశం అది కాదు వాడు లోపట అనుకుంటున్నదంతా నెగిటివ్ ఆ పైకి అలా పైకి మాత్రం వాడు ఇప్పుడు బాలుతో పని ఉంటది వాడికి ప్రతి చోట అవసరమే వాడు చూసేది ఇప్పుడు బాలతో లిఫ్ట్ ఇప్పించుకోవడం లేకపోతే నెక్స్ట్ ఏదైనా పని చేయించుకోవడం అందుకని వాడు మాటను ఒక మాధ్యమంగా వాడుకుంటాడు ప్రపంచమంతా దానికి వాల్యూ ఇస్తుంది పర్సనల్ డెవలప్మెంట్ లో ఇట్ ఇస్ క్లియర్లీ సెడ్ నటించు అంతే సత్యంతో పని లేదు నువ్వు నటిస్తేనే పని అయితది నీ మనసులో ఏముంది ఒక వ్యక్తి గురించి అనేది నువ్వు అక్కడనే పెట్టుకో నోటి నుంచి బయటికి వచ్చింది మాత్రం స్వీట్ గా రావాలి బ్యూటిఫుల్ గా చెప్పాలి ఆ కోతి లాగా ఉన్న అందంగా ఉందమని చెప్పాలి అట్టి తీసి వలిసి ఆ అంటే నువ్వు ఒక వర్డ్ ప్లే చేయాలని చెప్తుంది సమాజం వాయిస్ నేను దీన్ని అంగీకరిస్తున్నా అవును కరెక్ట్ నువ్వు ఎట్లనే ఉంటా అంటే నీ జీవితం నువ్వు ఎక్కడో హిమాలయాల్లో ఉండిపో ఇంకా మనుషుల మధ్య ఉన్నప్పుడు అవును వి హావ్ టు అండర్స్టాండ్ ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ లేకపోతే కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా వస్తది ఇదే నేను చెప్పాలనుకున్నది ఇది నీకు అర్థమైందా బాలు నువ్వు అసలు చెప్పు అంటే నేను ఏం చెప్పాలనుకున్నాను అనేది కన్వే అయిందా లేదా చెప్పాలంటే నాకు అర్థమైంది ఎంత ఉద్దేశంతో అయినా గాని తీసుకునే అంటే రెండు కేటగిరీస్ చెప్పి డిఫైన్ చెయ్ అంటే వాట్ ఇస్ టు కేటగిరీ సందర్భాన్ని బట్టి అవకాశం తీసుకొని అక్కడ ఉన్న యూటిలైజ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతారు ఒక కైండ్ ఆఫ్ కాదు కాదు కాదు నేను ఏం చెప్పు నువ్వు అన్నది కరెక్ట్ నేను ఒక వ్యక్తికి ఏ నెగిటివ్ ఫీల్ లేదు లోపట కానీ వాడి మాట తీరు బాగాలేని కారణంగా తప్పు తీసుకోబడుతుంది ఎవడు వాడి భావాలను పట్టించుకోవట్లేదు అరే వాడు జస్ట్ నోరుతో అట్లా అన్నాడు కానీ వాడు మంచోడయ్యా అని సమాజం అనుకోదు మాట పట్టుకుంటున్నారు రెండో వాడు మహా కన్నింగ్ దొంగనా కొడుకు వాడు లోపట వాడిని వినాశనమే కోరుతున్నాడు బయటికి మాత్రం తేనె పూసిన కత్తి లాగా మంచి మాటలు మాట్లాడుతున్నాడు వాడు సో ఇట్లాంటి వాళ్ళకి చెల్లుబాటు మోస్ట్ ఆఫ్ ది పొలిటిషియన్స్ డూ దిస్ లోపట ఏముందో జనాలకి ఎందుకు చెప్పు ఈ రెండు కేటగిరీస్ ఏంది సైలెంట్ అయిపోయింది నువ్వు చెప్పురా బాగా ఒకసారి లోపల ఏ మంచి ఉద్దేశం లేకుండా వాళ్ళు మాత్రం వాళ్ళ మాటని యూస్ చేసుకొని వాళ్ళ మాటను యూస్ చేసుకొని ఆ సందర్భాన్ని పెట్టుకుంటూ వెళ్ళిపోతారు అంతే అదే అన్ని మంచిగా ఉన్నవాడు కూడా సందర్భం మంచిగా ఉన్న కూడా వాడు ఏదో చిన్నది వాడికి మాట ఏ మాట అని మొత్తం ఖరాబ్ చేసుకుంటారు ఇంకొకటి పాముకి కోరలోనే విషం ఉంటది స్వామి మనిషి ఏ టైం లో ఎప్పుడు పొంగుతాడో తెలియదు ఎప్పుడు కాటేస్తాడో కూడా తెలియదు తెలియదు మొత్తం నిలవల విషయమే ఇప్పుడు నేనైతే ఏం చూస్తా నా లైఫ్ చెప్తా ఫైనల్ స్టేట్మెంట్ నేను ఎప్పుడు మాటను పట్టించుకోను లోపట ప్యూర్ ఉందా లేదా అని మాత్రం చూస్తా రెండవది వాడు ఎంత బాగా నన్ను మాట్లాడింది వాడు ఇన్సైడ్ ప్యూర్ లేడు అనుకో వాడికి కూడా తెలియదు వాడిని వదిలేసినట్టు ఇప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారు చెప్పు నాకు నా క్లాస్మేట్స్ గాని మా ఊరి వాళ్ళు గాని ఎవ్వరితో ఎందుకు లేను అంటే మనిషి దొరకడం కష్టమైపోయింది అన్ని దొరుకుతున్నాయి ఐఫోన్ అల్ట్రా మోడ్రన్ ఫోన్ దొరుకుతుంది మంచి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ దొరుకుతుంది అమ్యూస్మెంట్ పారుతుంది మనిషి ఎక్కడ అంతా కుట్రలు కుతంత్రాలు కల్లిబుల్ కబుర్లు పైకి ఒకటి లోపల ఒకటి మోసం చేయడం ఎట్లా అట్లా బెనిఫిట్ కావాలనుకోవడం లేకపోతే ఎక్స్పెక్టేషన్ స్వార్ధం వాడు చూసుకోవడం దాంట్లో అంటే చాలా మంది అడుగుతారు నన్ను అరేయ్ నీకు ఇంత జర్నీలో అట్లీస్ట్ సాండ్ ఆర్ట్ చేసిన ఇంత మంది క్లైంట్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు అట్లీస్ట్ నేను రోజుకి ఒక పార్టీ అయినా పోవాలి అట్లీస్ట్ ఇప్పుడు నాకున్న నెట్వర్క్ కి అందులో ఏం మజా కనపడలేదు నాకు సో బివేర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ డేంజరస్ క్రియేచర్ అది

విరాట్ కోహ్లి🏏#viratkohli Power of #vegetarianism #viratkohli #vegetarian





hi guys um I just wanted to record a little message for all of you uh firstly beginning with uh the the time that I turned vegetarian uh I had a lot of people um opposing what I wanted to do what I decided to do and you know a lot of people said oh you're not gonna have enough energy you're not gonna have enough stamina and um you know your struggle you're gonna struggle playing Sport and all those kind of things but um I think the fun in doing the things that are not you know sort of stereotypical is that you have a chance to create something which people don't believe in before and then you set an example and I was convinced that it is possibly a myth and that I definitely can break that myth and I've never felt better in my life ever since I turned vegetarian so I'm really really proud of that decision and um you know that I stuck to something that I decided to do so as I said the 
 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🦑🦑🦑 🦑🦑🦑 🦑🦑🦑
             *సంస్కార సౌరభం*

*'సూర్యచంద్రులవలె మానవులు సమున్నత మార్గంలో నడవాలి. గతి, నియతి తప్పకుండా సూర్యచంద్రులు సంచరిస్తున్నట్లే మనిషి సన్మార్గంలో ముందుకు కొనసాగాలి. సర్వప్రాణుల్లో అత్యంత శ్రేష్ఠమైన జీవి- మనిషి.*

*సత్సాంగత్యంతో, సద్బుద్ధితో, సాధుగణాలతో నీతిమంతంగా మనిషి జీవించాలి. ఈ సంస్కారాలన్నీ మానవ జీవితాన్ని మహోజ్జ్వలంగా తీర్చిదిద్దుతాయి’- అని అధర్వవేదం అభిలషించింది. తల్లిదండ్రులను, ఆచార్యుడిని త్రివిధ దేవతలుగా శాస్త్రాలు అభివర్ణించాయి. వ్యక్తిత్వ నిర్మాణానికి, సౌశీల్య సాధనకు సంస్కారం అత్యంత ఆవశ్యకం. ఒక జాతి సౌభాగ్యం, పురోగతి ఆ జాతి వారసుల సంస్కారాన్ని బట్టి ఉంటాయని స్వామి వివేకానంద పేర్కొన్నారు.* 

*సంపూర్ణ మానవులు అంటే సంస్కార ప్రపూర్ణులు. సమాజ పురోగతి, అభ్యున్నతి- రాశి పరంగా కాదు, వాసి పరంగా గణించాలి. వ్యక్తి సాంఘికంగా ఎదగడమంటే నైతికంగా ఉత్తమ స్థితికి చేరుకోవడం. ఈ జన్మలో చేసిన సత్కర్మల వల్ల గత జన్మలో చేసిన పాపాలన్నీ నివారణ చెందుతాయన్నాడు శ్రీరాముడితో వసిష్ఠుడు యోగ వాసిష్ఠంలో! అరిషడ్వర్గాలు అనే అడ్డంకుల్ని అధిగమించిన తరవాత ఆధ్యాత్మిక వికాసం అలవడుతుంది. ఆధ్యాత్మిక చింతన అనేది వ్యక్తుల్లో సంస్కార సౌరభాల్ని వెదజల్లు తుంది. ఏ దేశ మర్యాదలైనా ఆ దేశ ప్రజల జీవన వ్యవహార ధర్మాలపై ఆధారపడి ఉంటాయి. అందుకే జీవితంలో సత్ప్రవర్తన, సదాచారాల్ని మూలభూమికగా స్వీకరించాలి. సముచితమైన మానవ సంబంధాల వల్ల ఇతరులతో సానుకూల బాంధవ్యాలు ఏర్పడతాయి. అందరితో సౌజన్యయుతమైన, సామరస్యపూరితమైన వైఖరితో మసలుకోవడం అద్భుతమైన జీవన కళ! ప్రతి వ్యక్తి జీవిత లక్ష్యం కేవలం జీవించడం మాత్రమే కాదు. ఆదర్శవంతంగా జీవించినవారే చరితార్థులవుతారు. ఇది ఎందరో మహనీయుల విషయంలో నిరూపితమైన సత్యం!*

*అంతరంగ శుద్ధి, అమలిన ప్రేమభావన, అనితర సాధ్యమైన భావ నియంత్రణ- ఈ మూడు అంశాలూ వ్యక్తుల సంస్కార స్థాయుల్ని నిర్ణయిస్తాయి. విశాల హృదయులను, అందర్నీ తమతో కలుపుకొనిపోయే వ్యక్తులకు మిత్రులు అధికంగా ఉంటారు. ఆ మిత్ర బృందానికి వారే ఆదర్శనీయులవుతారు. అలాగే, నిష్కల్మషమైన ప్రేమభావజాలం వ్యక్తుల్ని అభిమానించేలా చేస్తుంది. విచక్షణ, ప్రజ్ఞ, విజ్ఞత, ఓర్పు అనేవి భావ నియంత్రణకు ప్రధానమైనవి. స్థితప్రజ్ఞ, సమయోచిత స్ఫూర్తి వ్యక్తులకు ప్రత్యేకతను ఆపాదిస్తాయి. లౌకిక జీవితంలో పై స్థాయికి ఎదగాలంటే వివిధ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే సాధకుడికి, సంస్కారవంతుడికి పరీక్షలు ఎదురవుతుంటాయి. ఇవి ఆధ్యాత్మిక ఉన్నతికి గీటురాళ్లవంటివి. సాధకుల నిగ్రహాన్ని, ఓర్పును ఇవి నిగ్గుతేలుస్తాయి.*

*జీవితం అశాశ్వతం, యౌవనం, ధనం అస్థిరాలు. కుటుంబ బంధాలన్నీ తాత్కాలికం. అయితే లోకంలో శాశ్వతమైనవి, నశించనివి- వ్యక్తులు తమ సంస్కార వైభవంలో చేసిన ధర్మం, ఆ సంస్కార ఫలంగా సాధించిన కీర్తి! సంస్కార సుశోభితులైన వారే అసలైన కీర్తిశేషులు! సంస్కారమే ఆభరణంగా ధరించిన వ్యక్తులు దేదీప్యమానమైన తేజస్సుతో యశస్సుతో నిరుపమాన రీతిలో ప్రకాశిస్తారు.*
🦑🦑🦑 🦑🦑🦑 🦑🦑🦑
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴
 .            🔔 *శరణాగతి* 🔔

*నా తండ్రి శివయ్య గురించి ఏమని చెప్పను ఎంతని చెప్పను కర్మానుసారం ఎన్నో ఆపదలు నన్ను చుట్టుముట్టకుండా చంటి బిడ్డల చేయి పట్టి కాపాడతాడు ప్రతి క్షణం.*

*గత జన్మల కర్మానుసారం నా జీవన పయనంలో మలుపులెన్నో ప్రతి మలుపులోనూ తన ఉనికిని తెలిపాడు మరుపును వరంగా ఇచ్చాడు. నేనున్నా భయమేల నీకు అని భరోసా ఇస్తాడు.*

*బంధాలను అనుబంధాలను అద్భుతంగా మలిచాడు. ఉన్నతమైన జీవన విధానం వరంగా ఇచ్చాడు. తెలిసీ తెలియక కూడా నా తండ్రికి నచ్చని పని చేయలేదు. కర్మానుసారం చేసిన నా తండ్రికి నేను సమాధానం చెప్పగలను. నా తండ్రి ఆజ్ఞ లేనిదే ఏ ఆలోచన నా దరిచేరదు.*

*నేను నీ బిడ్డను అని గర్వంగా చెప్పుకుంటున్నాను నీవు నీ బిడ్డ అనుకున్నావు కనుకే నీ గురించి చెప్పే అవకాశం ఇచ్చావు ఇక్కడ ఇలా ఇన్ని ఇచ్చినా ఇన్ని చేసినా నీకు నేను ఏమివ్వగలనయ్య నాది అంటూ ఏముందయ్యా అసలు నీకు ఇవ్వటానికి నీ ఒంటికి రాసుకోవడానికి నా చితాభస్మం తప్ప పరమేశ్వర...👏*

*శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి.*

*┈┉┅━❀꧁శివోహం꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🙏🙏🙏 🔔🕉️🔔 🙏🙏🙏
 *🌹•శివపార్వతుల కళ్యాణము•🌹*
*┈┉┅━❀꧁శివోహం꧂❀━┅┉┈*

*కొన్ని కోట్లమంది అన్ని లోకములనుండి ఆ పెళ్ళికి బయలుదేరి పోతే ఆ బరువు ఒక్కచోటికి వెళ్ళిపోయేటప్పటికీ ఇంకా శేషుడు భూమిని పట్టుకోలేక ఒక పక్కకి వంగిపోయాడు. ఆ సమయంలో దేవతలందరూ శంకరుని దగ్గరకు వచ్చి ‘శంకరా, ఇప్పుడు నీ నిజరూపమును చూసి పరిపూర్ణమయిన మనస్సుతో మేనకా హిమవంతులు పరవశించి పోయి కన్యాదానం చేసేస్తారు.*

*అలా చేయగానే మోక్షం వచ్చేసి వారికి ఆ రూపం పోతుంది. అప్పుడు హిమశైలం ఉండదు. హిమశైలం అనేక రత్నములకు, బంగారమునకు ఆలవాలం. ఆ శైలం మీద ఎందఱో ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. అది లేకపోతే భూమికి శోభ ఉండదు.*

*కానీ నీకు నిండు మనస్సుతో కన్యాదానం చేయకుండా ‘ఏమిటి బాబోయ్ ఇలాంటి అల్లుడు వచ్చాడు’ అనే అర్థ మనస్సుతో నీకు కన్యాదానం చేసేటట్లుగా వాళ్ళ మనస్సు నీవే మార్చు శంకరా’ అని అడిగారు. అపుడు శంకరుడు మీ అందరికీ హిమవత్పర్వతము కావలసివస్తే తప్పకుండా నేను అలాగే ప్రవర్తిస్తాను’ అన్నాడు. అందరూ కలిసి బయలుదేరారు.*

*ఈలోగా హిమవంతుడు తానూ శుభలేఖలు వేయించి బంధువులందరికీ పంపించాడు. ఆయన తన కుమార్తె పెండ్లి శుభలేఖలను లోకములన్నిటిలో ఉన్న పర్వతములన్నిటికీ పంపించాడు.*

*హిమవంతుడు ఎంత గొప్పగా తన కూతురి వివాహం చేస్తాడో చూడాలని పిలవబడిన ఆ పర్వతములన్నీ తమతమ కుటుంబములు, బంధు మిత్రులతో బయలుదేరాయి. పెళ్ళికి నదులన్నీ వచ్చాయి. నదులతో పాటు రాజ్యములు, అరణ్యములు, అన్నీ బయలుదేరాయి. ఇంతమంది బయలుదేరి పార్వతీ కళ్యాణమునకు హిమవత్పర్వతము మీదికి చేరుకున్నారు. వీళ్ళందరినీ చూసి హిమవంతుడు పొంగిపోయాడు. తన పురమును చక్కగా అలంకరింపచేశాడు. ఇళ్ళముందు సువాసనలతో కూడిన జలములను ప్రతి వీధిలో జల్లారు. ముత్యములతో ముగ్గులు పెట్టారు. ప్రతి ఇంట్లో హేమకుంభములను ఎత్తారు. శంకరుడు చూసి పొంగిపోవాలని నందీశ్వరుని పటములను గీసి ఊరు ఊరంతా పెట్టేశారు. ఎవరికి వచ్చిన వాద్యములు వారు వాయిస్తున్నారు.*

*ఈలోగా పెళ్ళికొడుకు వచ్చేస్తున్నాడన్నారు. హిమవంతునితో ఎదురు సన్నాహమునకు వెళ్ళడానికి ఉద్యుక్తులవుతున్నారు. ఈలోగా మేనకాదేవికి దూరం నుంచి అల్లుడిని ఒకసారి చూద్దామని అనిపించింది. అంతఃపుర గవాక్షం నుంచి చూస్తూ ‘నారదా వచ్చే వారిలో మా అల్లుడు ఎవరో చెప్పవలసినది’ అని అడిగింది. నారదుడు చాలా తమాషా అయిన మనిషి. ఎప్పుడూ లోకకళ్యాణం కోసం ప్రవర్తిస్తూ ఉంటాడు. భూతప్రేత గణములు వస్తున్నాయి. వాటి మధ్యలో ఒంటిమీద బట్ట లేకుండా దిగంబరుడై పుర్రెల మాల వేసుకుని, ఒకాయన ఎగురుతూ ఆడుతూ వస్తున్నాడు. ఆవిడ మొహం తిప్పుకుంది. అపుడు నారదుడు ‘అలా మొహం తిప్పుకుంటావేమిటి’ చూడు ఆయనే మీ అల్లుడు’ అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు.*

*ఆవిడ వెంటనే బాధతో అంతఃపురంలోకి వెళ్ళి పార్వతీ దేవిని పిలిచి ఇందుకోసం తపస్సు చేశావా?అని అడిగింది. పార్వతీదేవి అమ్మా, నీకు వచ్చిన బాధ ఏమిటి? అని అడిగింది. మేనకాదేవి ‘అమ్మా, వాడు పెళ్ళికొడుకు ఏమిటి? ఒంటి మీద బట్ట కూడాలేదు. ఆయన అల్లుడేమిటి? ఆ ఎగురుడు ఏమిటి? ఆ నాట్యం ఏమిటి? ఇంతమంది జనంలో ఒక్కడూ నచ్చలేదా నీకు! ఈ దిగంబరుడు నచ్చాడా? ఒక్కనాటికీ నిన్ను వీనికిచ్చి కన్యాదానం చేయను’ అని చెప్పింది. ఇపుడు దేవతలు కోరిన కోరిక తీరిపోయింది. అందరూ విడిదికి వెళ్ళిపోయారు. తరువాత శంకరుడు మరల స్వస్వరూపమును పొందేశాడు. ఇప్పుడు మేనకాదేవిని ఎదురు సన్నాహమునకు వెడదాము రమ్మనమని కబురు చేస్తే తాను ఒక్కనాటికీ రానని చెప్పింది. పార్వతీదేవి అయ్యో ఇదేమిటి చిట్టచివరకు వచ్చి స్వామి మరల ఇలాంటి మెలికపెట్టారు. అది దేవకార్యము అని తెలుసుకుంది. అప్పుడు మళ్ళీ అరుంధతీదేవి వచ్చింది. ఆమె మేనకాదేవితో ‘అమ్మా, పిచ్చిదానా, నీకు శంకరుడంటే ఏమి తెలుసు? ఆయన కృపాళువు.*

*మహానుభావుడు. ఆయన దేవతలకార్యమై ఇలా చేయవలసి వచ్చింది. శంకరుని సహజమయిన రూపం అది కాదు. నిజంగా శంకరుడు ఎలా ఉంటాడో చూడడానికి నీవు ఎదురు సన్నాహంలో మధుపర్కం పట్టుకుని పెద్దలయిన వాళ్ళతో కలిసి వెళ్ళి చూడు అని చెప్పింది. ఇపుడు మేనకాదేవి ఎదురు సన్నాహంలో పెద్దలతో కలిసి వెడుతోంది. కానీ అల్లుడు ఎలా వస్తాడో ఏమిటోనని రుసరుసలాడుతోంది. అటునుంచి శంకరుడు పెళ్ళికుమారుడిగా వస్తున్నాడు. కోటి సూర్యప్రకాశం సర్వావయవ సుందరం – విచిత్రవసనంచ్ఛాదా నానాభూషణ భూషితం’ అయి ఆయన విడిదిలోంచి బయటకు వచ్చే ముందే కోటి సూర్యుల కాంతి వచ్చింది. ఇప్పుడు బంగారు సరిగంచు పంచె కట్టాడు. అటువంటి ఉత్తరీయం వేసుకున్నాడు.*

*అనేకమయిన భూషణములు ధరించాడు. బంగారు కంకణములు, హారములు, కేయూరములు అన్నీ పెట్టుకుని వస్తున్నాడు. ఆ వస్తున్నా శంకరుని నిజ స్వరూపం ఇది. నవ్వుతూ ఉన్నాడు. ముట్టుకుంటే కందిపోతాడేమో అనేలా ఉన్నాడు. చిన్ని చిరునవ్వు నవ్వుతున్నాడు. సూర్యుడు గొడుగు అయ్యాడు. చంద్రుడు గొడుగుకి దండం అయ్యాడు. శంకరుడు వస్తున్నప్పుడు గంగాదేవి, యమునాదేవి ఇద్దరూ రెండు పక్కలా శంకరుడికి వింజామరలు వీస్తూ వస్తున్నారు. ఇలా బయలుదేరి వచ్చేసరికి మేనకాదేవి చూసి పొంగిపోయింది. కానీ చిన్న అనుమానం. త్రికరణ శుద్ధి లేకపోవడం వలన హిమవంతుడిని పరమాత్మ అట్టేపెట్టాడు. ఇప్పుడు పెళ్ళికొడుక్కి ఎదురు వచ్చి వీళ్ళందరూ ఆయనకు నమస్కారం చేశారు. మేనకాదేవి ఆయన అందం, లావణ్యం, చూసి మురిసిపోయింది. ఇప్పటివరకు మూతులు తిప్పిన వాళ్ళందరూ అమ్మ బాబోయ్ – శంకరుడు ఎంత చమత్కారో’ అని అనుకున్నారు. స్వామికి మధుపర్కం ఇచ్చి, మేళతాళములతో ఆ దేవతలనందరినీ తోడ్కొని అంతఃపురంలోకి తీసుకుని వస్తున్నారు.*

*అలా తీసుకు వస్తుంటే శ్రీమహావిష్ణువు శంకరుని దగ్గరకు వచ్చి ‘శంకరా, మొత్తం అన్ని లోకములలో ఉన్న దేవతలు, దానవులు దైత్యులు యక్షులు కిన్నరులు కింపురుషులు సాధ్యులు సిద్ధులు పర్వతములు నదులు సముద్రములు జంతువులు సమస్త చరాచర ప్రపంచము ఇక్కడికి నీ పెళ్ళికి వచ్చేసింది.*

*దానితో దక్షిణదిక్కు పైకి లేచిపోయింది. ఉత్తర దిక్కు వంగిపోతోంది. దక్షిణదిక్కు ఈ పెళ్ళి నేనెందుకు చూడకూడదన్నట్లు క్షణక్షణమునకు పైకి లేచిపోతోంది. భూమిని ఇప్పుడు సమతలం చేయాలి. మీరు తొందరపడి ఏదో ఒకటి చేయండి’ అన్నాడు. శంకరుడు అన్నాడు ‘సముద్రమును ఆపోశనపట్టినవాడు, అపారమయిన శక్తి సంపన్నుడు, లలితాసహస్రనామ స్తోత్రమును ఉపదేశం పొందినప్పుడు శ్రోత, పంచాక్షరీ మహా మంత్రమును కొన్ని కోట్లు చేసినవాడు,*

*ఏ మహానుభావుడి ఆశ్రమంలో పులులు, ఆవు దూడలు కలిసి ఆడుకుంటాయో ఏ మహానుభావుడు నడిచి వెడుతుంటే సమస్త జగత్తు నమస్కారం చేస్తుందో,*

*ఎవడు ఒక్కసారి కడుపు మీద రాసుకుని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని వాతాపిని జీర్ణం చేసుకున్న వాడో అటువంటి వాడు, నాకు మహాభక్తుడు అయిన అగస్త్యుడి దివ్యమయిన బరువు*

*ఒక్కటిచాలయ్యా – అందుకని అగస్త్యుడిని దక్షిణ దిక్కుకు వెళ్ళమనండి. అపుడు భూమి మళ్ళీ కుదురుకుంటుంది. ఆయన దివ్యతేజస్సు అటువంటిది’ అన్నాడు. అపుడు అగస్త్యుడు శంకరా, నాకు నీ కళ్యాణం చూసే భాగ్యం లేదా? అని అడిగాడు. అపుడు శంకరుడు నీకు తప్పకుండా నా కళ్యాణం గోచరం అవుతుంది వెళ్ళవలసినది అని చెప్పారు.*

*ఆనాడు అగస్త్యుడు దక్షిణ దిక్కుకు వచ్చాడు. భూమి సమతలంగా నిలబడింది.  ఇప్పుడు పెళ్లి మంటపంలోకి శంకరుడిని తీసుకువెళ్ళి పెళ్ళి కొడుక్కి, పెళ్ళి కూతురుకి మంగళ స్నానములు చేయించాలి. పార్వతీ దేవికి మంగళ స్నానం చేయిస్తున్నారు. ఇలాంటివి విన్నంత మాత్రం చేత ఇంటికి తోరణములు నిలబడతాయి. పార్వతీ దేవి మంగళ స్నానం అంటే మాటలు కాదు. అది అభిషేకం కాదు. అమ్మవారికి చక్కగా నూనె పెట్టించి, వొళ్ళు నలిపించి గోరువెచ్చటి నీటితో స్నానం చేయించారు.*

*కళ్యాణ మండపం చుట్టూ చక్కగా ముగ్గులు పెట్టారు. రత్నపీఠం తెచ్చి దాని మీద పార్వతీదేవిని కూర్చోపెట్టారు. అమ్మవారికి ముత్తైదువలందరూ అక్షతలు వేసి తలస్నానం చేయిస్తున్నారు.*

*పెద్ద ముత్తైదువలు వచ్చి కుంకుడు పులుసు పోస్తుంటే తల్లిగారు స్వయంగా అమ్మవారి తల రుద్దింది. ఏమి తల అది. ఆ జుట్టు కనపడితే చాలు అజ్ఞానం పోతుంది. ఏమీ తెలియని దానిలా అందరి మెడలలో మంగళ సూత్రములు నిలబడడానికి కారణం అయిన సర్వమంగళ ఆ రోజున తానే పెళ్ళికూతురు అయింది.*

*తలస్నానం చేయించి పొడి బట్టతో చక్కగా ఒళ్ళంతా తుడిచారు. అనేక రత్నహారములు, అలంకారములు చసి అమ్మవారికి పట్టుబట్టలు తొడిగారు. పేరంటాండ్రు అందరూ వచ్చేసరికి ఆ తల్లిని తీసుకువచ్చి అక్కడ కూర్చోపెట్టారు.*

*ఈ రత్నాలంకారములన్నీ చేసి అమ్మాయిని కూర్చోపెట్టాక మేనకాదేవికి బెంగ కలిగింది. మా అమ్మాయి ఇంత అందగత్తె. దిష్టి తగిలిపోతుందేమోనని ముఖం కనపడకుండా ఎక్కువ అలంకారం చేసేయమని మేనకాదేవి చెప్పేసరికి అక్కడి స్త్రీలు ఆమెకు అలా అలంకారం చేసేశారు.*

*అమ్మవారిని బుట్టలో కూర్చోబెట్టి బ్రహ్మగారు ముందు, లక్ష్మీనారాయణులు పక్కన నడుస్తుండగా అమ్మవారిని తీసుకుని మేళతాళములతో పువ్వులు జల్లుతుండగా అక్కడికి తీసుకు వచ్చారు.*

*┈┉┅━❀꧁శివోహం꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🌷🦚🌷 🙏🕉️🙏 🌷🦚🌷
 *శివలింగం.....*

*"శివం" అనే పదానికి అర్థం శుభప్రథమైనది. "లింగం" అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రథమైనది. శుభప్రథమైన దేవుడు.*

*శివలింగం శారికంగా శిలామయం. అయినా శివలింగాన్ని దర్శించి, అబిషేకించి, అర్చించి, ఆరాధించిన ఏ వ్యక్తి! అయినా శిలను పూజించానని భావించరు. శిలలో సైతం శివుణ్ని చూచే సంస్కృతి మనది.*

*శివలింగములో మూడు భాగాలు ఉంటాయి. బ్రహ్మ భాగము భూమిలో, విష్ణు భాగం పీఠంలో, శివ భాగం మనకు కనిపించే పూజా భాగముగా శిల్పులు ఆగమ శాస్త్రాలలో సూచించిన విధముగ సరియైన రాతిలో గాని ఇతర పదార్ధాలతో నిర్మిస్తారు.*

*ఒకసారి భృగుమహర్షి శివుడి దగ్గరికి వస్తాడు. కానీ శివుడు తాండవం చేస్తూ మహర్షిని పట్టించుకోలేదు. దీంతో కోపోదృక్తుడైన మహర్షి “నేటి నుండి నీ శివలింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు, నీ ప్రసాదం నింద్యం అవుతుంది” అని శపిస్తాడు. అప్పటి నుండి శివుడిని లింగరూపంలో కొలుస్తారు.*

*శివుడికి రూపం కూడా ఉండకపోవటం వల్ల, ఆయన నిరాకారుడు, సాకారుడు కూడా. ఈశ్వరుడు నిరాకారుడు కాబట్టి నిరాకారమైన లింగమందు పూజింపబడుతున్నాడు.*

    *🙏🌹శుభ శివోదయం🌹🙏* 
        *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🌺🪷🌺 🪷🌺🪷 🌺🪷🌺
 #ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు............!!
అప్పట్లో మన దేశములో ఆది వారం సెలవు దినం కాదు.
నెలలో పున్నమి, అమావాస్య రోజుల్లో మాత్రమే సెలవులు ఇచ్చేవారట. ఇదే  తరువాత రోజుల్లో నానుడి అయింది  -అమావాస్యకో పున్నమికో అంటుంటాము కదా? ఇక పోతే  నేడు మనం సెలవు దినంగా  భావించే ఆదివారము ఆంగ్లేయుల కాలం నుండి మొదలయింది . ఆదివారం మనకి చాలా శక్తివంతమైన దినం. ఈ ఆదివారము మనకు సూర్యారాధన దినము , చాలామంది అప్పట్లో సూర్యారాధన చేసేవాళ్ళు . భారతీయులు యొక్క మేధస్సుకు, శక్తికి ఈ ఆదివార దీక్ష కారణం అని తెలుసుకున్న తెల్లవారు బలవంతంగా మనకి ఆదివారం సెలవును పులిమారు. ఇపుడు ఆది వారం అంటే సెలవు దినం , మందు మాంసాల దినం అయింది కానీ అంతకు ముందు అదో సుదినం మనకు . 

అప్పటిలో ఉన్న వృత్తి విద్యల్లో ఉన్నవాళ్ళకి సెలవులు అంటూ  ప్రత్యేకంగా ఏమి ఉండేవి కావు. విద్యార్థులకు మాత్రం  గురుకులా ల్లో పక్షానికి నాలుగు దినాలు- పాడ్యమి, ఆష్టమి, చతుర్దశి, పూర్ణీమ- అమావాస్య  రోజులు  అవిద్య దినాలని విద్య నేర్పే వారు కాదు. మనం వాల్మీకి రామాయణములో  అశోకవనంలో ఉన్న  సీతమ్మను "ప్రతిపద్ పాఠశిలస్య విద్యేవ తనుతాంగతా" అని వర్ణించాడు మహర్షి . పాడ్యమినాడు పాఠాలు చదివే వాడి చదువులాగ సన్నగా  చిక్కిపోయిందట సీతమ్మ. కనుక, పాడ్యమినాడు అయితే  చదువుగాని, చింతనం గాని ససేమిరా ఉండేవి కావు. చింతన మంటే జరిగినపాఠాన్ని మరొకరితో పాటు చదువుతూ పరిశీలించడం కూడా అసలు ఉండేవి కావు. ఆదివారం నాడు  విధిగా సూర్య ఉపాసన చేసేవారు.  

మనకు ప్రపంచములో ఉన్న ఇతర నాగరికతలో కూడా సూర్యారాధన ఉన్న విషయం తెలిసిందే. మన నుండే ఈ సూర్యారాధన ఇతర దేశాలకు కూడా వెళ్ళింది . అప్పట్లో దుకాణాలు కూడా పౌర్ణమి, అమావాస్యలకు మూసేసేవారు. ఆదివారం నాడు నేడు జల్సాలు చేస్తున్నట్టు చేయకూడదని మనకు మన వేదాలలోనే కాదు  "స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి"   అంటూ మన సూర్యాష్టకం లో ఉంది . మన కర్మ వశాత్తు మానవుడు ఏమి ఆ రోజు చేయకూడదని చెప్పారో నేడు అదే  దారిలో మనం ఆచరిస్తూ ములిగిపోతున్నాము. అందరికి చెప్పడానికి  శక్తీ సరిపోదు. వందమందితో ఒకరిద్దరు గుర్తించినా ఈ పోస్ట్ సార్ధకత పొందినట్టే...🙏🙏🙏
 _* *శివుడిని లింగ రూపం లోనే ఆరాధించాలి-లింగ పురాణం*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



లింగ పురాణం శివుడిని లింగ రూపం లోనే ఆరాధించాలి, బ్రహ్మ, విష్ణు మహేంద్రాది దేవతలు, మహర్షులు అందరు శివుడిని లింగ రూపం లో పూజించి, వేద జ్ఞానం పొందారని, ప్రణవ స్వరూపి యైన పరమాత్మను లింగ రూపంలో ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు, సుఖ శాంతులతో బాటు ముక్తి లభిస్తుందని చెబుతుంది ఈ పురాణం.

ఇందులో కొన్నిచోట్ల శివ లింగాన్ని ఎలా పూజించాలో, ఎలాంటి కర్మాచరణ అవసరమో శివుడే స్వయంగా చెబుతాడు. ఈ పురాణం ఐదు భాగాలుగ ఉన్నది. ఆ ఐదు భాగాలలో ఏముందో చూద్దాం.

1. సృష్టి ప్రారంభం కాకముందు, ప్రళయకాల జలధిలో గతం గుర్తులేని బ్రహ్మ విష్ణువు.. నేను గొప్ప అంటే నేను గొప్ప అని పోట్లాడుకోవటం మొదలు పెడతారు. ఆ సమయం లో ఒక బ్రహ్మాండమైన, ఆద్యంతాలు లేనట్టి జ్వాలా లింగం వారి ముందు ప్రత్యక్ష మయిందట. అందులో ఓంకారం గోచరించింది. ఆ ప్రణవ నాదం లోంచి వేదాలు ఆవిర్భవిస్తాయి. వాటిని గ్రహించిన బ్రహ్మ విష్ణువులకు జ్ఞానోదయమయిందట. ఆ జ్వాలా లింగం మధ్యలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై చతుర్విధ పురుషార్ధాలు బొధిస్తాడు. ఈ భాగం లోఇంకా శివకళ్యాణం, సూర్య చంద్రుల కథలు, విష్ణువు యొక్క వరాహ, నృసింహ అవతార కథలు ఉన్నాయి.

2.ఇందులో సృష్టి ప్రారంభం గురించీ. విష్ణువు ప్రాధాన్యత గురించీ బ్రహ్మ దేవుడు రోదసిని, గ్రహ నక్షత్రాలనుసృష్టి చేయటం గురించి,ఇంకా శివుడు ఏ యుగం లో ఎలా అవతరించాడు కథలు, దధీచి మహర్షి కథ, శిలాదమహర్షి తపస్సు కథ వంటివి ఉన్నాయి..

3.నందీశ్వర ఆవిర్భావ కథ, కలియుగ ప్రారంభం, సప్త ద్వీపాల వర్ణన, అనేక పర్వత రాజముల గురించి, బ్రహ్మ దేవుడు సూర్యుడు మొదలైన దేవతలకు లోకాలను పాలించే బాధ్యతలు ఇవ్వటం గురించి కథలు ఉన్నాయి..

4.సూర్య చంద్ర వంశాల చరిత్రలు, మహా భక్తుడు ధృవుని చరిత్ర.,శివుడు తొలుత అంధకుని గణ నాయకుని గా నియమించుట. జలంధరుదు మొదలైన రాక్షసులను సంహరించి భూదేవిని రక్షించుట.. తదుపరి గణేశ జననం శివుడు అతనిని గణాధిపతిగా నియమించుట.

5. ఉపమన్యుని చరిత్ర,, ద్వాదశాక్షరీ మంత్ర మహిమ , షడక్షరీ మంత్ర మహిమ, శివలింగము స్థాపించు విధానం, శివశక్తి సూర్యుని రూపములో వ్యక్తమగుట, (చిన్నమస్తా) వజ్రేశ్వరీ విద్య
వివిధ యోగ మార్గాల వివరణ అంశాలు ఇందులో ఉన్నాయి.
సందర్భానుసారంగా ఈపురాణం లో కాశీ క్షేత్ర మాహాత్మ్యం, యముని గర్వభంగం, దధీచి,దూర్వాసుని వంటి శివ భక్తుల కథలు, అనేక శివ స్తోత్రాలు, శివ సహస్ర నామావళి, ఆదిత్య హృదయం, శివరాత్రి మాహాత్మ్యం,శివ పూజా మహిమ, కిరాతార్జునీయం, వ్యాసుడు కాశి నుండి బహిష్కరింప బడటం వంటివి అనేక కధలు చెప్పబడ్డాయి. లింగం అంటే ఒక సంకేతం (గుర్తు) లింగా కారాన్ని పూజించడమంటే నిర్గుణ బ్రహ్మను ఆరాధించడ మవుతుంది. అంటే నిర్వికార నిర్గుణ పరబ్రహ్మమును ఆరాధించుటే యని పురాణ సారం.

*ఓం సత్యం శివం సుందరం. శివోహం*.          
 _*లింగావిర్భావం*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో బ్రహ్మాదులు స్తుతించిన మహాలింగ స్తుతి ఇది.

అనాదిమల సంసార రోగ వైద్యాయ శంభవే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!

ఆదిమధ్యాంత హీనాయ స్వభావానలదీప్తయే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!

ప్రళయార్ణవ సంస్థాయ ప్రళయోత్పత్తి హేతవే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!

జ్వాలామాలావృతాంగాయ జ్వలనస్తంభరూపిణే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!

మహాదేవాయ మహతే జ్యోతిషేనంతతేజసే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!

ప్రధాన పురుషేశాయ వ్యోమరూపాయ వేధసే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!

నిర్వికారాయ నిత్యాయ సత్యాయామలతేజసే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!

వేదాంతసార రూపాయ కాలరూపాయ ధీమతే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!


_*లింగావిర్భావం :*_


ఒకనాడు లింగావిర్భావకాలమునందు ఒకానొక కల్పంలో బ్రహ్మకి శ్రీ మహావిష్ణువుకి ‘నేను అధికుడను అంటే నేను అధికుడను’ అని వాదోపవాదం జరిగింది. వీరి మధ్య వాదోపవాదం జరుగుతుండగా అది తీవ్రస్థాయిని పొందుతుంటే దేవతల మొరవిన్న పరమేశ్వరుడు ఒక జ్యోతి స్తంభంగా వారిమధ్య ఆవిర్భవించాడు. దాని ఆది కనుక్కోవడానికి శ్రీమహావిష్ణువు వరాహరూపంలో భూమిని తవ్వుకుంటూ వెళ్ళారు. బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి దాని చివర కనుక్కుందుకు వెళ్ళారు. బ్రహ్మగారు వెళుతూ ఉండగా కేతకీ పుష్పం(మొగలి పువ్వు) ఒకటి క్రింద పడింది. దానిని నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు?” అని అడిగారు. అపుడు మొగలిపువ్వు ఎవరో ఒక మహానుభావుడు పరమభక్తితో నన్ను శంకరుడి మీద వేశాడు. అక్కడి నుంచి నేను క్రింద పడ్డాను. మీరు ఎక్కడికి వెడుతున్నారు?” అని అడిగింది. అపుడు బ్రహ్మగారు నాకొక ఉపకారం చేస్తావా?’ అని అడిగాడు. ఏమిటి కావాలి మీకు?” అని అడిగింది మొగలిపువ్వు. ఆయన “క్రింద శ్రీమన్నారాయణుడు ఉంటారు. నేను ఆ పైభాగమును చూశానని సాక్ష్యం చెప్తావా? అని అడిగాడు. చెప్తాను అన్నది మొగలి పువ్వు. బ్రహ్మగారు మొగలిపువ్వుతో కలిసి క్రిందకు వచ్చారు. శ్రీమహావిష్ణువును ఆయన చూసి వచ్చారా? అని అడిగారు. అపుడు విష్ణువు నాకు కనపడలేదు. ఎంతదూరం వెళ్ళినా నేను కనుగొనలేకపోయాను అన్నారు.
అపుడు బ్రహ్మ గారు నేను చూసి వచ్చాను. సాక్ష్యం ఈ కేతకీ పుష్పం అన్నారు. ఇప్పుడు జ్యోతి స్తంభంగా ఉన్న పరమాత్మ సాకారమును పొంది బ్రహ్మగారితో బ్రహ్మా నీకు దర్శనం అయిందని అబద్ధం ఆడావు. కాబట్టి నీకు భూమియందు పూజ లేకుండుగాక! కానీ బ్రహ్మ స్థానమని ఒక స్థానం ఉంటుంది. ఆ స్థానమునందు ఆవాహన పొంది నీవు గౌరవింపబడుతుంటావు. మహావిష్ణువు నేను చూడలేదు అని చెప్పారు కాబట్టి నాతో సమానంగా ఆయనకు వైభవోపేతంగా పూజలు ఉంటాయి. ఆ ఉత్సవములకు నీవు ఆధిపత్యం వహిస్తూ ఉంటావు. అందుకే బ్రహ్మోత్సవం అని బ్రహ్మగారి రథం ఉత్సవములకు ముందు నడుస్తుంది. కేతకీ పుష్పం అబద్ధం చెప్పింది కాబట్టి ఈ పుష్పం నా పూజయందు వినిమయం అవకుండుగాక! ఇప్పుడు కేతకీ పుష్పం నాకు పూజార్హత లేదా అని బాధపడింది. నాకు పూజింపబడవు కానీ నా భక్తులయిన వారు నిన్ను తలలో ధరిస్తారు. వారు ధరిస్తే నేను ఎక్కువ ప్రీతి పొందుతాను. పూజ జరిగే ప్రాంగణం మొగలి పువ్వులతో అలంకారం చేస్తే ప్రీతి పొందుతాను. అని చెప్పాడు. అలా ఏర్పడిన శివలింగం జ్యోతి స్తంభంగా ఏర్పడినదే మహాశివరాత్రి. ఇది మెల్లమెల్లగా లింగాకృతి తగ్గిపోయి కంటిచే చూడదగినటువంటి లింగాకృతిని పొందిన రూపమే అరుణాచలంలో ఉన్న కొండ. ఆ శివుడు నిర్దేశించిన తరువాత పూజ ప్రారంభమయిన రోజే మహాశివరాత్రి. కాబట్టి భగవత్ స్వరూపములు అన్నీ సమానములే. ఎన్ని దీపములు వెలుగుతున్నా వెలుగుతున్నది ఒక్క జ్యోతి రూపమే. ఇన్ని రూపములుగా ఉన్నది ఒక్కటే అని మీరు తెలుసుకోవాలనే జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. 
శివలింగమునకు ఒక విశేషం ఉంది. మొట్టమొదట అన్నిటికన్నా గొప్పదయినా లింగమును స్వయంభూ లింగము అని పిలుస్తారు. ఆ లింగమును ఒకరు ప్రతిష్ఠ చేయరు. తనంత తాను వెలుస్తుంది. శ్రీశైలాది క్షేత్రములు ఇందుకు ఉదాహరణ. 
రెండవది దివ్య లింగములు ఇవి దేవతలు ప్రతిష్ఠ చేసినవి. కుమారస్వామి ప్రతిష్ట చేసిన సామర్లకోటలోని కుమారారామం ఇందుకు ఉదాహరణ. మూడవది మానుష లింగములు. ఇవి మనుష్యులు ప్రతిష్ఠ చేసినవి. తరువాత ఆర్ష లింగములు. ఇవి మహర్షులు ప్రతిష్ఠ చేసినవి. రాక్షస లింగములు. రాక్షసులు ప్రతిష్ఠ చేసినవి. దైవిక లింగములు వాటంతట అవి ఏర్పడతాయి. అరకువేలీలోని బుర్రా గుహలలో పైనుండి నీటి బిందువులు క్రిందపడతాయి. కొండ ఉపరితలం ఎక్కడో పైన ఉంటుంది. పైనుండి నీటి బిందువు ఒకేచోట బయలుదేరి క్రింద ఒకేచోట పడుతుంది. ఆ నీటి బిందువు పడినప్పుడల్లా క్రింద ఉన్న భూమి కొద్దికొద్దిగా పైకి లేస్తూ శివలింగంగా మారిపోతుంది. ఇది క్రమక్రమంగా పెరిగి చివరకు ఎక్కడి నుండి నీరు పడుతోందో ఆ ప్రదేశమును తాకి ఇంక నీరు పడకుండా ఆపేస్తుంది. అలా అది మర్రిచెట్టు ఊడలా పెరిగిపోతుంది. దీనిని దైవిక లింగం అంటారు. బాణ లింగములు అని ఉంటాయి. అవి నర్మదానది ప్రవాహము ఒరిపిడి చేత ఏర్పడతాయి. 
లింగము

ి. ఉపాసనలో లింగోపాసన ఒక మెట్టు పైన ఉంటుంది. మీకు శివలింగమును చూపించి ఆ శివలింగం ఎటువైపు చూస్తోంది అని అడిగినట్లయితే దానికి సమాధానం చెప్పడం తేలికయిన విషయం కాదు. యథార్థమునకు మీరు శివాలయంలోపల కూర్చుని శివలింగమునాకు అభిషేకం చేయడం కన్నా రుద్రాధ్యాయంతో అర్చక స్వాములు అభిషేకం చేస్తుండగా బయట కూర్చుని కైమోడ్చి నమస్కరిస్తే దానివలన మీరు ఎక్కువ ప్రయోజనమును పొందుతారు. ఇది సాక్షాత్తు చంద్రశేఖరపరమాచార్య స్వామివారు చెప్పినమాట. 
శివలింగంలో తూర్పుకు చూస్తున్న దానిని తత్పురుష ముఖము అంటారు. ఇది వాయువుకు అధిష్ఠానంగా ఉంటుంది. దీనివలన అజ్ఞానం కలుగుతుంది. దక్షిణమునకు చూసే ముఖమును అఘోర ముఖము అంటారు. ఇది అగ్నిహోత్రమును శాస్తిస్తుంది. అది అగ్నిహోత్రంగా ఉంటుంది లయం చేస్తుంది. ఇది మీ అజ్ఞానమును దహించేస్తూ జ్ఞానమును కూడా ఇస్తుంది. పశ్చిమానికి ఒక ముఖం చూస్తుంది. దీనిని సద్యోజాత ముఖం అంటారు. పశ్చిమ ముఖం నుండి పాలు, నీళ్ళు విభూతి, పళ్ళరసములు కారిపోతుంటే అది తడిసినప్పుడల్లా మీకు పరమేశ్వరుని అనుగ్రహం కలిగేస్తూ ఉంటుంది. అది భూసంబంధంగా ఉంటుంది. అది సృష్టికి కారణం అవుతుంది. అందుకే లోకంలో పిల్లలు పుట్టలేదని అంటే సుందరకాండ పారాయణం చేసుకోమని గాని, శివాభిషేకం చేసుకోమని గాని చెప్తారు. దుష్ట నక్షత్రంలో పిల్లాడు పుట్టాడు అని చెప్తే సుందరకాండ పారాయణ/శివాభిషేకం చేసుకోమని చెప్తారు. అపమృత్యువు వస్తుందేమోనని భయంగా ఉంది అంటే సుందరకాండ పారాయణం చేసుకోమని గాని, శివాభిషేకం చేసుకోమని గాని చెప్తారు. పీడకలలు వస్తున్నాయని చెప్తే సుందరకాండ పారాయణం చేసుకోమని గాని, శివాభిషేకం చేసుకోమని గాని చెప్తారు. ఈ రెండు క్రియలె చెప్తారు. ఎందుచేత? హనుమ శివాంశ. వర్షములు పడకపోతే శివలింగామునకు అభిషేకం చెయ్యండని చెప్తారు. అభిషేకం చేస్తే వామదేవ ముఖం కానీ తడిసినట్లయితే పరమేశ్వర అనుగ్రహం వలన వర్షములు పడతాయి. పైకి ఒక ముఖం చూస్తూ ఉంటుంది. దానిని ఈశానముఖం అంటారు. దీనిని సదాశివ అని పిలుస్తారు. ఇది ఆకాశ స్వరూపియై ఉంటుంది. ఇదే మోక్షమును కటాక్షిస్తుంది. ఈ అయిదు ముఖములతో పంచభూతములను శాసిస్తోంది. సృష్టి స్థితి లయ అజ్ఞాన మోక్షములకు కారకం అవుతుంది. సమస్త ఫలితములను ఇస్తుంది. కాబట్టి శివలింగం చల్లబడడం ఊరంతా చల్లగా ఉండడమే. 
అసలు లింగమునకు బాహ్యమునందు ఏమీ లేదు. బ్రహ్మాండములన్నీ లింగాకృతిలోనే ఉన్నాయి. లింగమునకు పూజ చేస్తే సమస్త లోకములకు పూజ జరిగినట్లే. శివాలయమునకు వెళ్ళినపుడు ముఖ్యంగా ఎనిమిది కనపడతాయి. మనం ఒక అపచార ధోరణి చేస్తూ ఉంటాము. శివాలయం గోడకు ఆనుకోవడం, స్తంభాలను ఆనుకోవడం చేస్తుంటాము. ఆ గోడలు, స్తంభములు అన్నీ ఈశ్వర స్వరూపమే అయి ఉంటాయి. దేవాలయ గోడను కొట్టినట్లయితే శాస్త్రం ప్రకారం శివుడిని కొట్టినట్లుగానే పరిగణింపబడుతుంది. శివాలయం నందు ఎనిమిది రూపములలో లింగం ఉంటుంది. అందుకే పూర్వం పెళ్ళిళ్ళు గాని, జరిగితే ధ్వజస్తంభం ఎక్కడివరకు కనపడుతోందో అక్కడ మేళతాళములు ఆపుచేసేవారు. గోపురంగా శివుడే ఉంటాడు. రెండవది శివుడు గర్భాలయ శిఖరంగా ఉంటాడు. ధ్వజస్తంభం శివుడు. ఇప్పటికీ కొన్ని దేవాలయములలో బలి పీఠమునకు, ధ్వజ స్తంభానికి అభిషేకం చేస్తారు. లోపల ఉన్న శివలింగమును మహాలింగం అని పిలుస్తారు. పెద్ద పెద్ద దేవాలయములలో కొన్ని మహాలింగముల మీద చారికలు ఉంటాయి. ఆ గీతలను బ్రహ్మసూత్రములు అని పిలుస్తారు. అవి సాధారణంగా స్వయంభూ లింగముల మీద ఉంటాయి. 
శివాలయంలో ఉన్న ప్రధాన లింగమును ‘మూల లింగము లేక మహాలింగము’ అని పిలుస్తారు. చందీశ్వరుడు ఒక లింగము. ఇవి కాకుండా అర్చక స్వామి ఒక లింగము. అందుకే నందికి శివుడికి మధ్య అర్చకుడు వెళ్ళవచ్చు. శివాలయంలో దేవతామూర్తులు స్థానములు మారడానికి వీలులేదు. ఎంత పెద్ద శివాలయం అయినా సరే నైరుతిలో విఘ్నేశ్వరుడు, పడమట సుబ్రహ్మణ్యుడు, ఉత్తరమున చండీశ్వరుడు, దక్షిణమునందు దక్షిణామూర్తి, ఆగ్నేయం నందు సోమస్కందుడు, ఈశాన్యము =నందు నటరాజు కాని, భైరవ మూర్తి కాని ఉండాలి. 
శివ లింగారాధనం ఎలా చేయాలి అని తెలిసి చెయ్యగలిగితే వాడంత అదృష్టవంతుడు సృష్టిలో లేడు. అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై నీటిని సన్నటి ధారగా పోయాలి. అంతేకానీ పంచపాత్రలో నీళ్ళు తీసుకుని ఉద్ధరిణతో పోయకూడదు. అభిషేక జలం తొక్కకూడదు. శివాభిషేకం గురు ముఖతః చేయడం చాలా మంచిది. ఫేంటు ధరించికాని, తోలు బెల్టు పెట్టుకుని గానీ గర్భాలయం లోపలి వెళ్ళకూడదు.