Friday, May 1, 2026

ప్రేమంటే ఓ వ్యాపార లావాదేవీ కాదు | Love is NOT a Marketplace Deal | Sadhguru Telugu

ప్రేమంటే ఓ వ్యాపార లావాదేవీ కాదు | Love is NOT a Marketplace Deal | Sadhguru Telugu

Author Name:Sadhguru Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=v33__CTO4-k



Transcript:
(00:00) వాళ్ళు ఒకరినొకరు చాలా ప్రేమించుకుంటున్నట్టు ఉంటారు కానీ ఎప్పుడూ లెక్కలే నాకేం వస్తుంది నాకేం వస్తుంది ఆ అవసరం తీరిన మరుక్షణం వాళ్ళని మీరు చూడాలి. మీరు ప్రేమగా మారితే మీకేం వస్తుంది ఏమీ రాదు ఇది తెలివైన మూర్ఖుల కోసం మీరు గనుక అలా చేయకపోతే ఏదో రోజు ప్రేమించబడకుండానే చనిపోతారు. గొప్ప సంభావ్యతలు శాపంగా మారతాయి.
(00:28) ప్రేమలో ఉండాల్సిన సమయం వచ్చింది. బహుశా జీవితంలో అత్యంత ఎక్కువగా కోరుకునే విషయాల్లో ప్రేమ ఒకటి అత్యంత అపార్థం చేసుకోబడిన విషయాల్లో ప్రేమ ఒకటి అత్యంత దుర్వినియోగం చేయబడిన విషయాల్లో కూడా ప్రేమ ఒకటి అవునా ప్రేమలో ఉండటం వేరు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నన్ను ప్రేమించు అనడం వేరు అదొక సంత లావాదేవి నేను నిన్ను ప్రేమిస్తాను నువ్వు నన్ను ప్రేమించు ఒకసారి లావాదేవి మొదలైతే
(01:16) అంచనాలు ఉంటాయి. మరి అంచనా అనేది లాభం కోసమే కదా ప్రేమ లాభదాయకం కాదు అదొక ఎరుకతో చేసే నష్టపు వ్యాపారం మీ దగ్గర ఉన్న ప్రతిదాన్ని కోల్పోవచ్చు మిమ్మల్ని మీరు కూడా ఇది తెలివైన మూర్ఖుల కోసం తెలుసా
(02:02) జ్ఞానానికి వివేకానికి తేడా ఏమిటో తెలుసా జ్ఞానం అంటే మీకుంతా తెలిసినట్టు ప్రవర్తించడం అది ఎలా అంటే టొమాటో ఒక పండు అని మీకు తెలుసు మీకు చాలా గర్వంగా ఉంటుంది ఇది తెలుసు అది తెలుసు అని కానీ వివేకం అంటే టొమాటోని ఫ్రూట్ సలాడ్ లో వాడకపోవడం ఇక ప్రేమ గురించి అందరికీ చాలా తెలుసు కానీ లోపల ఏ స్పందన ఉండదు. ఎందుకంటే ఇది ప్రేమలో ఉండటం గురించి
(02:48) ఎవరినో ప్రేమించడం గురించి కాదు మీరు ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించాలని ఆశిస్తారు. హలో ఒకసారి మీకు అంచనాలు ఉంటే మీరు ఎవరికి ఏం దక్కుతుంది అనే విషయంలో కొంత న్యాయం కోరుకుంటారు. నేను నిన్ను ప్రేమించినంతగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పలేదే పాపం ఆ అమ్మాయి ఆ అమ్మాయి కోసం ఒక కట్ చెప్తాను
(03:35) ఇది భార్యా భర్తల మధ్య జరిగింది ఆమె చాలా జాగ్రత్తగా వినాలి. ఓ ఆదివారం ఉదయం భర్త ఎంతో ప్రేమగా తన గోల్ఫ్ కిట్ ను బయటకు తీశడు. ఒక్కో క్లబ్ ను చక్కగా పాలిష్ చేశాడు. బంతిని తీసుకొని అది కొత్తదైనప్పటికీ ఏవైనా మరకలు ఉన్నాయేమోనని తడి టిష్యూతో ఎంతో జాగ్రత్తగా తుంచి సిద్ధం చేసుకుంటున్నాడు. ద వైఫ్ జస్ట్ అబ్సర్వడ్ హిim అండ్సడ్ అది గమనించిన భార్య నువ్వు ఆ గోల్ఫ్ కిట్ ను అంత సున్నితంగా హ్యాండిల్ చేస్తున్నావ అంటే నాకంటే నీకు గోల్ఫ్ అంటేనే ఎక్కువ ఇష్టంఅని స్పష్టంగా
(04:20) తెలుస్తోంది అని అంది. అతను మామూలుగా చెప్పే మాటలే చెబుదాం అనుకున్నాడు. లేదు బేబీ ప్రపంచంలో అన్నిటికంటే నిన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాను అని కానీ గోల్ఫ్ కిట్ట మాటలు వినడం అతనికి ఇష్టం లేదు. ఒకవేళ అది ఫీల్ అయ్యి కోర్సులో సరిగ్గా ఆడకపోతే ఏం చేయాలి? అప్పుడు అతను మేరీ నేను నిజం చెప్పాలి. నీకంటే నాకు గోల్ఫ్ అంటేనే ఎక్కువ ఇష్టం కానీ అదే సమయంలో నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను.
(04:54) నాకు టెన్నిస్, ఫుట్బాల్, హాకీ, బాస్కెట్ బాల్ ఇలా నువ్వు ఏ పేరు చెప్పినా వాటన్నిటికంటే నిన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాను అన్నాడు. సరేనా కాబట్టి మీ జీవితంలో ఒక ప్రగాఢమైన అనుభూతిగా ఉండాల్సిన దాన్ని లావాదేవిగా మార్చినప్పుడు మీరు చాలా చాలా విలువైన దాన్ని కోల్పోయినట్లే ప్రస్తుతం అంతటా ఇదే జరుగుతోంది. మేము కూడా ఏడు నిమిషాల ధ్యానం రోజుని మీ సొంతం చేసుకోండి అని చెప్తున్నాం.
(05:37) అవునా బహుశా ప్రజల్ని ముందుకు నడిపించాలంటే వాళ్ళకొక క్యారెట్ చూపించాలి. వాళ్ళ ముందు ఒక క్యారెట్ వేలాడదీయాలి. ఎందుకంటే మన దగ్గర కర్ర లేదు. హలో మన దగ్గర కర్ర లేదు అందరూ తప్పనిసరిగా ధ్యానం చేయాలి అని చెప్పేందుకు అందుకే క్యారెట్ సరే పర్వాలేదు ఒక స్థాయిలో ఇది పనిచేస్తుంది.కాజదిస్ ఇస్ జస్ట్ మెటిగేట్మెంటల్ హెల్త్ ఎందుకంటే ఇది కేవలం మానసిక ఆరోగ్యాన్ని తగ్గించడానికి మాత్రమే ఆ మేరకు అది పనిచేస్తుంది.
(06:16) మేము మీరు మానసికంగా జబ్బు పడొచ్చు ఇది చేయండి అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని కరాన్ని చూపిస్తున్నాం. కానీ ధ్యానం అనేది ఒక లావాదేవి కాదు మీకు ఏదో వస్తుందని చేసేది కాదు అలాగే ప్రేమ లావాదేవి కాదు అది మీరు చేసేది కాదు మీరు అలా మారడం మీరు ప్రేమగా మారితే మీకు ఏం వస్తుంది ఏమీ రాదు ఎందుకంటేవాట్ విల్ గెట్ ఓన్లీ ఇంపార్టెంట్ నాకేం వస్తుంది అనేది నిత్యం అసంతృప్తితో ఉండే వాళ్ళకే ముఖ్యం ప్రేమ తాలూకు పరిపూర్ణత మీలోనే ఉంటే ఇంకేం కావాలి మీరేమీ పొందాల్సిన అవసరం లేదు.
(07:02) ఓన్లీ దోస్ హడు నాట్ నో దఫుల్ఫిల్మెంట్ ప్రేమలో ఉండటంలోని పరిపూర్ణత తెలియని వాళ్లే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు నాకేం వస్తుంది అని మీకేమీ రాదు ఏదో ఓ రోజు ప్రేమించబడకుండానే చనిపోతారు. ప్రేమించబడకుండా అని అంటే వేరే వాళ్ళ చేత కాదు మీలో ప్రేమ అనే ప్రకాశం లేకుండా ఎందుకంటే మీరు అంతర్ముఖులు అవడంలో పెట్టుబడి పెట్టకపోతే అలాగే మీ అస్తిత్వపు మూలాన్ని తాకగలిగేలా అవసరమైన పరిస్థితిని సృష్టించుకోకపోతే మీరు అలా చేయకపోతే అప్పుడు ప్రతిదీ ఒక లావాదేవినే
(07:48) బయట సంతలో లావాదేవీలు చేయడం తప్పులేదు కానీ ఇక్కడ లావాదేవీలు ఉండకూడదు. ఇవ్వడానికి తీసుకోవడానికి ఏముంది ఒట్టి చేతులతో ఉంచారు ఒట్టి చేతులతో పోతారు ఇవ్వడానికి లేదా తీసుకోవడానికి ఏముంది మీదంటూ ఏదీ లేదు మీరు నిజంగా దేన్ని సొంతం చేసుకోలేరు దేన్నైనా లేదా ఎవరినైనా మీదిగా భావించడం ఒక మానసిక రుగ్మత చెప్పండి మీదంటూ ఏమైనా ఉందా మీరు అంతక్రియలకు వెళ్ళాలి.
(08:22) మీది రాకముందే వేరొకరి అంచక్రియలకు వెళ్ళాలి. అరే్ నీ వంతు వస్తుంది ఎందుకు నవ్వుతున్నారు నేను చెప్పాం కదా కాయంత స్థానంలో ప్రతి ఒక్కరు కస్టమరే అని హలో కస్టమర్ కాని వారు ఎవరైనా ఉన్నారా? హలో కాబట్టి మీరు అంచక్రియలకు వెళ్లి చనిపోయిన వ్యక్తిని చూస్తే చూడండి మనం చనిపోయిన మనిషి అని అంటాం మనం ఎప్పుడూ చనిపోయిన స్త్రీ అని అన్నాం అవునా అనలేం చనిపోయిన మనిషి స్త్రీగా ఉండటంలో భద్రత అది తెలుసా అక్కడ ఆ చనిపోయిన వ్యక్తిని గమనిస్తే
(09:10) ఆ వ్యక్తి ఏ లావాదేవి చేయడు నవ్వడు మీరు వెళ్లి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు అతను కదిలితే ఇక అంతే మైలు దూరం పరిగెడతారు. హలో అవునా కాదా జీవితం యొక్క స్వభావం ఎలాంటిది అంటే మీరు ప్రేమ, ఆనందం, పారవస్యం అని పిలిచేవి ఇచ్చి పుచ్చుకునే వ్యాపారాలు కావు. మీరు దాంతో ఉప్పొంగిపోతారు లేదా అవ్వరు.
(09:57) మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని చూస్తే ఈ విషయాలు మీకు దూరంగా ఉంటాయి. ఎందుకంటే దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఈ విషయాలు మిమ్మల్ని ఎప్పటికీ తాకవు మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని చూస్తే ఇద్దరు వ్యక్తులకు ఒకే అవసరం ఉన్నట్లయితే వాళ్ళు ఒకరినొకరు చాలా ప్రేమించుకుంటున్నట్టు ఉంటారు. ఆ అవసరం తీరని మరుక్షణం వాళ్ళను మీరు చూడాలి. వాళ్ళు వేరేలా ఉంటారు హలో నేను ప్రపంచంలో జరుగుతున్న ప్రతిదాన్ని చిన్నబుచ్చట్లేదు
(10:40) పర్వాలేదు కానీ నేను చెప్పేది ఏమిటంటే మీ జీవితంలో ఏ క్షణంలోనైనా మీలో ప్రేమ కలిగితే ఏ కారణం చేతనైనా ఏ కారణం చేతనైనా సరే ఒక పురుషుని చూశారు ఒక స్త్రీని చూశారు ఒక చెట్టును చూశారు ఒక కుక్కను చూశారు ఎలా అన్నది ముఖ్యం కాదు మీలో ప్రేమ కలిగితే అలాగే ఉండిపోండి. దేని గురించి అన్నది ముఖ్యం కాదు ఎందుకంటే ఇది మరొక దాని గురించో మరొకరి గురించో కాదు మీలో ఏదో మొలకెత్తడం మొదలవుతుంది అని మీరు దాంతోనే ఉండిపోవాలి.
(11:18) అది ఎలా జరిగింది అన్నది ముఖ్యం కాదు మీరు దాంతోనే ఉండిపోవాలి. కానీ మీరు లావాదేవికి ప్రయత్నిస్తారు. నేను నిన్ను ప్రేమిస్తాను నువ్వు నన్ను అలాగే ప్రేమిస్తావా? హలో అంతే మోతాదులో నేను నిన్ను ఒక కిలో ప్రేమిస్తాను. నువ్వు నన్ను ఒక కిలో ప్రేమిస్తావా దాన్ని నాశనం చేసేసారు. ఎందుకంటే లెక్కలు నడుస్తున్నాయని నాకు తెలుసు అది పర్లేదు సద్గురువు కానీ తెలుసా అతను ఏం చేసాడో ఆమె ఏం చేసిందో డడడ నాకు అవన్నీ తెలుసు వాళ్ళు నాకు ఏం చేయలేదో చెప్పండి అది కాదు విషయం విషయం మీ గురించి వాళ్ళ
(12:04) గురించి కాదు ఎందుకంటే ఇది అందంగా మారాలంటే ఇది విలువైందిగా మారాలంటే ఊరికే ఇక్కడ ఉంటే చాలు అయితే భావోద్వేగ పరంగా మీరు ప్రేమలో ఉండాలి వేరే మార్గమే లేదు. నిన్ను నేను ఏదో రోజు ప్రేమిస్తాను నువ్వు నిజంగా నేను కోరుకున్నట్టుగా ఉన్నప్పుడు ఆ ఆ రోజు ఎప్పటికీ రాదు ఎందుకంటే అది బయట నుండి రాలేదు మీరు సరిైన వాతావరణాన్ని సృష్టిస్తే అప్పుడు అది మొలకెత్తుతుంది.
(12:46) మరి మీరు ప్రేమలో ఉంటే మీ కళ్ళు ప్రతిదాన్ని ప్రేమతో చూస్తాయి. లేదు లేదు నేను ఈ ఒక్క వ్యక్తినే ప్రేమతో చూస్తాను వేరే వాళ్ళను చూస్తే అలా కుదరదు మీరు ప్రేమలో ఉంటే చెట్టును చూస్తే అద్భుతంగా కనిపిస్తుంది. పర్వతాన్ని చూస్తే అద్భుతంగా కనిపిస్తుంది. ఆకాశాన్ని చూస్తే అద్భుతంగా కనిపిస్తుంది. మిడతకేం తక్కువ అద్భుతమైన మిడత దాన్ని మీరు ప్రేమిస్తారు ఎందుకంటే ప్రేమ ఒక చర్య కాదు ప్రేమ మీరు చేసేది కాదు
(13:34) అది మీరు అలా మారగలగడం మీరు అలా మారకపోతే మీరు చాలా దుర్భరమైన జీవితం గడిపారని చాలా దుర్భరమైన జీవితం నేను మీకు ఒక వెయ్యి సార్లు గుర్తు చేసి ఉంటాను ఇది చాలా చిన్న జీవితం ఇందులో ఎన్ని లెక్కలు అవునా మీరు సొంతలో ఉన్నట్లయితే స్టాక్ మార్కెట్ వ్యవహారాల్లో మీకు కావలసినన్ని లెక్కలు వేసుకోండి అందరికన్నా బాగా లెక్కలు వేయండి అది మంచిదే కానీ
(14:18) మీలోని ఒక ప్రగాఢమైన పార్శ్వం లెక్కలతో పనిచేయదు తెలుసా మేము మీకు చెప్పడం ఒక పొరపాటే దానికి ఒక కారణం ఉంది కానీ ఇప్పటికీ మీరు ధ్యానం అంటే 15 నిమిషాల శూన్య ధ్యానం అని అనుకుంటున్నారు. ధ్యానలింగం అంటే 15 నిమిషాలు 12వ నిమిషానికే మిమ్మల్ని లేపడం మొదలెడతారు. 12 నిమిషాలు 12 అనేది మంచి సంఖ్య అందుకే అలా చేస్తున్నారు. కాబట్టి
(15:04) మిమ్మల్ని మేలుకొలపాల్సి వచ్చిందని మీరు ఒప్పుకుంటున్నారు. సో దిస్ హోల్ బిజనెస్ ఆఫ్ లైఫ్ ఈ జీవితం అనే వ్యవహారం అంతా మన చేతుల్లోనే ఉంటుంది. కేవలం ఇక్కడ కూర్చుని శ్వాస తీసుకుంటూ దాన్ని ఒక చాలా అందమైన ప్రక్రియగా మార్చడమా లేదా దాన్ని చాలా కష్టమైన పనిగా మార్చడమా అన్నది మన చేతుల్లోనే ఉంది. అండ్వెన్ యు హవ్మేక్ యవెన్ యు హవ్ మరి మీకు ప్రతిదాన్ని లావాదేవిగా ప్రతిదాన్ని ఇచ్చి పుచ్చుకునే బేరంగా
(15:50) మార్చే అలవాటు ఉన్నప్పుడు అప్పుడు మీరు తలలో వేసుకోవలసిన లెక్కల సంఖ్య మిమ్మల్ని ఏ విధంగాను వికసించనివ్వదు ఎందుకంటే ఎల్లప్పుడూ లెక్కలు నడుస్తూనే ఉంటాయి నేనేం ఏం చెప్పాను ఆమె ఏం చెప్పింది అతనేం చెప్పాడు అతనేం చేశాడు నేనేం చేశాను నేను అతనికన్నా ఎక్కువ పని చేశానా అతనికి ఎక్కువ ప్రతిఫలం వస్తుందా ఇది ఎడతెరిపి లేకుండా సాగుతూనే ఉంటుంది.
(16:20) ప్రతి దాని గురించి కాబట్టి ప్రేమగా మారడానికి మీకేం కావాలి మీకేమీ అక్కర్లేదు దానికి ఏం అవసరం లేదు కేవలం మీకు కొంత మేధస్సు కావాలి కనీసం ఈ మాత్రం మేధస్సు ఉండాలి మిమ్మల్ని మీరు అసహ్యంగా చేసుకొని 100 బిలియన్ డాలర్లు సంపాదించినా దానికి అర్థం లేదని మీరు ఇక్కడ కూర్చుంటే మీ దగ్గర ఏది ఉన్నా లేకపోయినా మీరు ప్రేమతో ఆనందంతో ఉప్పొంగుతుంటే
(17:04) అప్పుడు మిగతా విషయాలు మన అవసరాన్ని బట్టి లేదా సామర్థ్యాన్ని బట్టి ఏదో ఒకటి చేస్తాం. మనం లావాదేవీలను మన జీవితంలో ప్రధాన అంశంగా చేసినప్పుడు మన మనసు మనసు కాదు అదొక సంత. సంతలో మీరు భీభత్సంగా సంపాదించాలి. అవును లేకపోతే మీరు సంతలో తెలివైన వారు కారు. మీరు సంతకు వెళితే మీరు తెలివిగా ఉండాలనే నేను కోరుకుంటాను. కానీ మీ లావాదేవీలను ఒక స్థాయిలో ఎలా చేయాలో వాటిని దూరంగా ఎలా ఉంచాలో తెలిస్తే మీలోకి ప్రవేశించకుండా బయట కార్యకలాపాలు మీరు ఎవరనేది నిర్ణయించకూడదు మీరు ఎవరనేదే
(17:51) మీరు ఏం చేస్తున్నారు అనేదే నిర్ణయించాలి. ప్రేమ అంటే ఇదే మీరు ప్రేమలో ఉంటే మీరు ఎవరు మీరు ఎలా ఉన్నారు అనేదే మీరు చేసేదాన్ని నిర్ణయిస్తుంది. లేకపోతే మీరు చేసేదే మీరు ఎవరనేది నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్నదంతా ఇదే వాళ్ళుఏదో చేస్తారు దాంతో వాళ్ళు అలా అవుతారు. లేదు లేదు మీరు ఇలా ఉన్నారు కాబట్టి ప్రపంచంలో మీరు చేయగలిగింది చేస్తారు.
(18:25) కాబట్టి ఈ సమస్యలన్నీ కేవలం అంతర్ముఖులై తమ అస్తిత్వపు మూలాన్ని తాకడంలో ప్రజలు తగినంతగా పెట్టుబడి పెట్టకపోవడం వల్లే ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ లైఫ్ బయట లావాదేవీల జీవితం మిమ్మల్ని ఎంతగా ఆక్రమించేసిందంటే అంతకన్నా లోతైనది ఏది జరగలేదు. ఒకసారి మీరు లాభనష్టాల వ్యాపారంలోకి దిగితే దాన్ని అదుపులో ఉంచలేరు ఇది కొనసాగుతూనే కొనసాగుతూనే ఉంటుంది.
(19:03) కేవలం డబ్బు గురించే కాదు చాలా విషయాల గురించి కానీ ఇది ఎంత తెలివి తక్కువతనం మీకు స్పష్టంగా తెలిసినప్పుడు ఓసారి దీన్ని పరిశీలిద్దాం. మీరు వేటితో వచ్చారో నాకు తెలియదు. బికాజ ఇన్ అవర్ ట్రెడిషన్ ఎందుకంటే మన సంప్రదాయంలో పిల్లలు శంకు చక్ర గదా లాంటి వాటన్నిటితో పుట్టారనే కథలు ఉన్నాయి మీరు వేటితో వచ్చారో తెలీదు మీరందరూ ఇక్కడికి ఒట్టి చేతులతో వచ్చారా లేక హలో ఏమీ పట్టుకు రాలేదా అటువంటప్పుడు లాభం ఎక్కడుంది నష్టం ఎక్కడుంది ప్రతిదీ లాభమే ప్రతి శ్వాస లాభమే హలో ప్రతి అదనపు శ్వాస ఒక అద్భుతమైన లాభం
(19:50) అవునా కాదా కానీ ఎప్పుడూ లెక్కలే నాకేం వస్తుంది నాకేం వస్తుంది ఆమెకు నాకన్నా ఎక్కువ వచ్చిందా ఏమైంది ఏమైంది ఏమైందిఅమెంట్ సంథింగ్ వాట్ హపెన్ యు న వాట్ హపెన్ యు న వాట్ హపెన్స్ తమిళనాడు వస్పీక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్వాట్ హపెన్ యు నో ఎన్నడిచి తెరియమా ఎన్నడిచి తెరిమా అవునా ఈ జీవితంలో మీరు ఏం కనుగొంటారు? ఎవరైనా ప్రేమలో ఉన్నారా లేదా అని నిరూపించడానికి ఏదైనా మార్గం ఉందా?
(20:36) ఓసారి ఇలా జరిగింది. ఒక ఎక్స్రే స్పెషలిస్టు తన పేషెంట్లలో ఒకరిని పెళ్లి చేసుకున్నాడు. ఇక ఊరంతా అసలు ఆమెలో ఏం చూశాడు అని తెగ ఆశ్చర్యపోయారు. ఏ ఎక్స్రే ఏ శవ పరీక్ష ఏది ఇందులో ఏమి కనుక్కోలేదు. హలో మీరు కేవలం కోసి అవయవాలను పాడు చేయగలరు అంతే ఇంకేమీ కనుక్కోవడానికి లేదు ఒట్టి రక్త మాంసాలే హలో అవునా కాదా నేను మిమ్మల్ని కోస్తే మీరు చాలా అందంగా ఉంటారు అని అనుకుంటున్నారా
(21:22) లేదు మీరు చాలా కానీ అది అలానే తయారైంది. పర్వాలేదు నేను ఏమంటానంటే అలా కనుగొనడానికి ఏమీ లేదు ఎందుకంటే జీవం బాహ్య వాస్తవికతలో లేదు జీవం దాని అంతర్గత అనుభూతిలో ఉంది. మీకు ఒక నిర్దిష్ట రకమైన వేలు నిర్దిష్ట రకమైన జుట్టు నిర్దిష్ట రకమైన ముక్కు ఉన్నంత మాత్రాన మీరు ఏదో అయిపోరు. బహుశా ఒక నిర్దిష్ట పరిశ్రమలో అయితే అవ్వచ్చు.
(21:57) కానీ జీవం విషయంలో దానికి అర్థం ఏమీ లేదు. విషయం ఏమిటంటే ఒక సంభావ్యత ఉంది మీరు దాన్ని పోషిస్తేఇట్ విల్బికమన్ ఓవర్ఫ్లోయింగ్ అది మీరు ఎవరనే దాని పట్ల ఒక ఉప్పొంగే ముంచెత్తే ఆహ్లాదకరమైన భావనగా అద్భుతంగా మారుతుంది. లేకపోతే అదొక అదొక కఠినమైన ప్రయాణం మానవ జీవితం ఒక కఠినమైన ప్రయాణం మీరు ప్రేమలో పారవస్యంలో తడిసి ముద్దవ్వకపోతే అవును అది కఠినమే కేవలం పరమ మూర్ఖుడు మాత్రమే హలో అమ్మాయిలు అవును అవును అని దేనికి
(22:44) అంటున్నారు వాళ్ళు ఎవరి గురించో ఆలోచిస్తున్నారు అవును ఆ వ్యక్తి పరమ మూర్ఖుడు అని నా ఉద్దేశం అది కాదు ఓన్లీ someవన్ హఇస్టూస్పిడ్ టుథింక్ ఈ జీవితం నుండి ఏదో పోగు చేసుకొని వెళ్తామని అనుకునే బుద్ధిహీనుడే అలాంటి మూర్ఖుడు మాత్రమే తన జీవితం పట్ల పిచ్చి ఉత్సాహంతో ఉండగలడు. లేకపోతే చూడగలిగే మేదస్సు కొంచెం ఉంటే ఇది ఎక్కడికి వెళ్ళడం లేదని తెలుస్తుంది.
(23:19) అయినా ఇదంతా చేయాలంటే మీరు నిరాశకు గురవుతారు. కుంగిపోతారు. కాబట్టి ఈ విషయాలను దాటి వెళ్ళడానికి ఏకైక మార్గం మీరు ప్రేమలో పారవస్యంలో తడిసి ముద్దవ్వాలి అప్పుడు ఏ ప్రయోజనం అక్కర్లేదు. మీరు చేయగలిగిందంతా చేస్తారు. చేయలేనిది ఎలాగో చేయరు హలో హే ఇక్కడ కొందరు ఉన్నారు. వాళ్ళు ఉదయం చేసే సాధన గురించి ఆలోచిస్తున్నారు ఎలాగో నేను చేయలేనిది నేను చేయను అని లేదు లేదు అది మీరు చేయగలిగే వాటి
(24:10) జాబితాలోకే వస్తుంది.అదఎక్క్ట్lyవాట్ ఐబీన్ టెలింగ్ యుదట్ ఇదే నేను మీకు చెబుతూ వస్తున్నది. మిమ్మల్ని మీరు మార్చుకొని మీలోని లోతైన మూలాన్ని స్పృషించడంలో మీరు పెట్టుబడి పెట్టకపోతే అప్పుడు మీరు లావాదేవీల్లో అయినా మునిగిపోతారు లేదా వేరే వాళ్ళ కన్నా కాస్త మెరుగ్గా ఉన్నామనో వేరే వాళ్ళ కన్నా మీ దగ్గర కాస్త ఎక్కువ డబ్బు సంపద ఉందనే వక్రమమైన ఆనందాన్ని పొందుతారు.
(24:42) అదే మీకు ఉండే ఏకైక ఆనందం. లేకపోతే మీరు బతకలేరు. వివేకవంతమైన జీవితాన్ని గడపలేరు. నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను ఒట్టి చేతులతో వచ్చి ఒట్టి చేతులతో వెళ్తారని మీకు తెలిసినప్పుడు ఇది వాస్తవమే కదా నేను దీని నుంచి ఏదైనా తత్వాన్ని సృష్టిస్తున్నానా ఒట్టి చేతులతో వస్తారు ఒట్టి చేతులతో పోతారు ఇది మీకు నిజంగా తెలిస్తే దీని పట్ల ఎరుకతో ఉంటే జీవితంలోని ప్రతీక్షణం నేను లాభం పొందుతున్నానా నష్టపోతున్నానా లాభమా నష్టమా లాభమా నష్టమా అని ఆలోచించడం మీకు ఏమైనా సమంజసంగా అనిపిస్తుందా ఉందా హలో చాలా కొద్దిమంది లేదు అన్నారు.
(25:30) శబ్దం నెమ్మదిగా ప్రయాణిస్తుంది కదా అందుకే అలా దూరంగా ఉన్నారుగా so whenెన్ there is noోసensity inన్మోట్ ఆఫ్ ద యక్టివిటీద hూమన్ beంగ్హ అయితే మనుషులు రోజూ చేసే చాలా పనుల్లో సందర్భ పరంగా చూస్తే ఒట్టి పనిపరంగా కాదు వాటిలో అర్థం పర్థం ఉండవు నన్ను అడిగితే ఏ పని అర్థరహితమైంది కాదు ప్రతి పనికి ఏదో ప్రయోజనం ఉంటుంది.
(26:04) కానీ మీరు దాన్ని ఏ సందర్భంలో చేస్తున్నారు అనేదే అసలు విషయం. మీరు ప్రేమతో నిండి ఉంటే ఏది అవసరమో అది చేస్తారు. హలో ప్రపంచం ఇలాగే ఉండాలి కదా ఏది అవసరమో దాన్ని సంతోషంగా చేస్తాం అంతే లేదు నేను ఇదే చేస్తాను అది ఎవరికీ అక్కర్లేదు కానీ నేను అదే చేస్తాను. అది తెలివి తక్కువ పనే ఎందుకంటే ఒకసారి మీరు ఎలా ఉండాలనేది మీరు చేసే పని ద్వారా నిర్ణయించబడితే అదే జరుగుతుంది. నేను అదే చేస్తాను అంటారు.
(26:41) లేదు ఈరోజు ఏది అవసరమో అదే చేస్తాను అనగలగాలి. దానిలోని ఆ సార్యం మీలో ప్రేమ ఉప్పెంగేలా చేస్తుంది. ఎందుకంటే పని అనేది మిమ్మల్ని మీరు వ్యక్తపరుచుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం ప్రతిరోజు మనం ఒకరి ముందు ఒకరు కూర్చొని ఐ లవ్ యు యు లవ్ మీ ఐ లవ్ యు యు లవ్ మీ అని చెప్పుకుందాం. అలా కూడా కాదు ఓసారి ఇలా జరిగింది. అమెరికాలో ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నారు.
(27:18) అది ఎక్కడా రాయలేదు కానీ సమాజంలో ఒక పద్ధతి ఉంది రోజులో కనీసం 21 సార్లు మీ భార్యకు గాని భర్తకు గాని ఐ లవ్ యు అని చెప్పాలి. అందుకని ఐ లవ్ యు జాన్ ఐ లవ్ యు మేరీ ఐ లవ్ యు జాన్ ఐ లవ్ యు మేరీ ఇలా జరుగుతుంది. కానీ తర్వాత అతనికి పనిలో తీరిక లేకుండా పోయింది. పగలు ఐ లవ్ యు చెప్పలేడు. సాయంత్రం వచ్చి లెక్క పెట్టి అన్నిసార్లు చెప్పేవాడు.
(27:46) అలా నెమ్మదిగా ఐ లవ్ యు అంటే ఐ లవ్ యు టూ అయింది. ఓ ఆరు నెలల తర్వాత ఫోన్లో మెసేజ్ పంపుతాడు ఐ లవ్ యు ఆమె డిట్టో అంటుంది. ఎందుకు కాదు ప్రతిదానికి ఒక సంక్షిప్త రూపం ఉంటుంది కదా ఇక ఆ తర్వాత కొంత కాలానికి ఇద్దరు డిటో డిటో డిటో డిటో అయిపోయింది ఇక్కడ కూడా అంతే అది మీరు చేసేది కాదు మీరు అలా మారాలి మీరు అలా మారితే అది చాలా అందంగా ఉంటుంది.
(28:29) దాన్ని చేయడానికి ప్రయత్నిస్తే అవసరాలు తీర్చుకోవాల్సి వచ్చినప్పుడు అది బాగున్నట్టు కనిపిస్తుంది. ఆ అవసరం పోగానే అది చాలా విధాలుగా వికారంగా మారుతుంది. అవసరం కేవలం శారీరకమైన కానక్కర్లేదు శారీరక సామాజిక మానసిక భావోద్వేగపరమైన రకరకాల అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలను తీర్చుకోవడానికి మనం ఈ మాటలను జపిస్తూ ఉండొచ్చు లేదు దాన్ని పనికిమాలిందిగా చేయకండి.
(28:58) ఇది చాలా ముఖ్యం జీవితంలోని ప్రగాఢమైన విషయాలు పవిత్రంగా ఉండటం దీన్ని తేలిగ్గా వాడకండి ఎందుకంటే మీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం నాకు తెలుసు. ఐ లవ్ ఇట్ దాన్ని ఎలా చెప్తారు? ఐ లవ్ ఇట్ కానీ మీరు అటు ఇటు చూస్తే తెలుసు కదా ఏప్రిల్ నెలలో అటు ఇటు చూస్తే అది కరిగి మీ చెయ్యి మీదగా కారిపోతుంది. అప్పుడు ఇక మీకు అది నచ్చదు. హలో కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యం ప్రగాఢమైన స్వభావం ఉన్నదాని పట్ల కొంత పవిత్రత ఉండేలా చూసుకోవాలి లేకపోతే ప్రతిదీ చెత్తతో కలిసిపోతుంది.
(29:44) తెలుసా ఈ మధ్య జరిగింది. ఏదో ఏదో ఇన్ఫ్లయెన్సర్స్ అంటారే వాళ్ళంతా వాళ్ళని వాళ్ళు ఏమని పిలుచుకుంటారో నాకు తెలియదు. యూట్యూబర్ లు Instagramర్ లు టెలిగ్రామర్లు ఇంకా టిక్టాకర్లు ఇంకా ఏవేవో వాళ్ళు తమ పరిమితులను దాటి మాట్లాడటం మొదలుపెట్టారు. తప్పేమిటి? ఈ జీవితంలో తప్పు అనేది ఏమీ ఉండదు. అది కేవలం సముచితమా కాదా అనేదే విషయం.
(30:15) హలో మీలో కొంత నాగరికత ఉంది. ఏది సముచితమో ఏది కాదో తెలుసుకుంటారు. మీలో అలాంటిది ఏమీ లేకపోతే ఇక ఏది తప్పు కాదు ఏం చేసినా తప్పేముంది అది మీ ముఖానికి తగిలేంతవరకు ఎందులోనూ తప్పు లేదు అది తగులుతుంది కూడా ఎందుకంటే మనిషిగా ఉండటంలో 90% నేర్చుకున్న ప్రవర్తనే కేవలం 10% మాత్రమే మీకు సహజంగా తెలుస్తుంది.
(30:49) 90% నేర్చుకున్న ప్రవర్తన కాబట్టి ఈరోజు మనం ఎవరో అది పూర్తిగా మనది కాదు లక్షలాది తరాల ప్రజలు మనం వాళ్ళ పట్ల ఎరుకతో సంబంధం కలిగి ఉండకపోవచ్చు కానీ ఏదో విధంగా వాళ్ళు చేసినా చెప్పినా రాసినా ప్రతిదీ మీరు దాన్ని చదవకపోయినా అది మీలోకి ఇంకిపోయింది అవునా కాదా వెయ్యి రకాలుగా అది మీలోకి చేరిందా లేదా ఒకవేళ మేము మేము మిమ్మల్ని అన్ని మానవ సమాజాల నుండి వేరుగా ఉంచితే మీ చిన్నతనం నుండి మీరు పెద్దయ్యే వరకు మీరు జంతువులా ప్రవర్తిస్తారా లేదా? ఖచ్చితంగా ఎందుకంటే మీకు సహజంగా తెలిసిన ఆ 10 శాతం చాలా వరకు పశు ప్రవృత్తే
(31:33) మనిషిగా ఉండటం అనేది 90 శాతం నేర్చుకున్న ప్రవర్తన కాబట్టి మీరు ఏం నేర్చుకుంటారు అనేది ముఖ్యం కాదు మీరు ఎలా నేర్చుకుంటారు అనేదే ముఖ్యం. ఒకవేళ మీలో ప్రేమ ఉంటే మీరు నేర్చుకున్నది ఏదైనా సరే మీతో పాటు అందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది. మీలో ప్రేమ లేనట్లయితే అదే విషయాన్ని ఈ భూమి మీద ఉన్న ప్రతిదాన్ని నాశనం చేయడానికి వెయి రకాలుగా ఉపయోగించచ్చు చూడండి ప్రస్తుతం మన దగ్గర సైన్స్ ఉంది.
(32:03) ఈరోజు మనకు తెలిసిన ఆధునిక విజ్ఞానం భౌతిక శాస్త్రం ఉంది. దాన్ని తెలుసుకోవడం అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పినట్లుగా టొమాటో ఒక పండు అని మీకు తెలుసు కానీ అది ఫ్రూట్ సలాడ్ లో ఉండకూడదని తెలియకపోతే గజిబిజిగా అవుతుంది అవునా ఇది వేల రకాలుగా జరిగింది. అతి స్పష్టమైన ఉదాహరణలు చెప్పాలంటే న్యూక్లియర్ సైన్స్ ఏది అది చెప్పొచ్చు ఒక అపారమైన అవకాశం కానీ అందరికీ ఎంతో ముక్కు ఎందుకు దాన్ని చేసేవాళ్ళు ప్రేమతో లేరు కాబట్టి వాళ్ళు ఒక ధోరణలో ఉన్నారు నీ మీద ఆధిపత్యం చలాయించడం వల్ల ఏదో ఒక ప్రత్యేక ప్రదేశానికి వెళ్తామని వాళ్ళు అనుకుంటున్నారు.
(32:48) వాళ్ళందరూ ఒక ప్రత్యేక ప్రదేశానికి వెళ్తామని నమ్ముతారు. అది అంత ప్రత్యేకమైనది అయితే వాళ్ళు ఇంకా ఎందుకు వెళ్ళలేదో నాకు అర్థం కావట్లేదు. మీకు రిజర్వేషన్ ఉందని తెలిస్తే చాలా ప్రత్యేకమైన ప్రదేశంలో నేను వచ్చి మీ సీటు తీసుకునే లోపు మీరు వెళ్ళిపోవాలి అవునా హలో కాదా అంటే మీ బుకింగ్ కన్ఫర్మ్ కాలేదన్నమాట అందుకే గొప్ప గొప్ప విషయాలు గొప్ప సంభావ్యతలు శాపంగా మారతాయి ఎందుకంటే మీరు ప్రేమ ప్రేమలో లేరు మానవ మేదస్సుకు పట్టిన దుస్థితి ఇది మీ
(33:36) మేదస్సు ఒక ప్రబలమైన శక్తి మీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని తెలివి తక్కువ వాళ్ళని అంటున్నా ఈ భూమిమీద ఉన్న ఇతర ప్రాణులతో పోలిస్తే మీ మేదస్సు ఒక ప్రబలమైన శక్తే కానీ భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన విషాదకరమైన విషయం ఇదే మీరు ప్రేమలో లేకపోతే మీరు ప్రేమలో లో ఉంటే ఈ మేధస్సు ఒక అద్భుతమైన విషయం అది ఎన్ని పనులు చేయగలదో కానీ ప్రస్తుతం చాలామంది ఇలా అంటున్నారు.
(34:08) మూర్ఖులే ప్రేమలో పడతారు. తెలివైన వాళ్ళు లావాదేవీలు చేస్తారు అని హలో ఇది ప్రస్తుత సమాజంలోకి బలంగా చొచ్చుకుపోయింది. దానికి మనం మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అందువల్లే ఈవేళ మనం మానసిక అనారోగ్య మహమ్మారిని తగ్గించడం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి ఒక ముఖ్యమైన అంశం ఇదే మేధస్సు అంటే ఒక తెలివైన లావాదేవిలో ఉండటం అని తెలివి తక్కువతనం అంటే ప్రేమలో పడటం భక్తులుగా మారడం లేదా అలాంటిది ఏదో అవ్వడం అని అనుకోవడం కాబట్టి ఒకసారి మీలో అలాంటి దృక్పథం ఏర్పడినప్పుడు సహజంగానే మీరు
(34:55) మానసిక అనారోగ్య మహమ్మారి వైపు వెళ్తారు ఇంకెక్కడికి వెళ్తారు దీన్ని మార్చాల్సిన సమయం సమయం వచ్చింది ప్రేమలో ఉండాల్సిన సమయం వచ్చింది
 *🛕🔱పంచ కేదారాలు..!!*

*కురుక్షేత్ర యుద్ధం ముగుసిసిన తరువాత పాండవులు బ్రహ్మహత్యా పాతకం, దాయాదులను చంపిన పాపం పోగొట్టు కోవడానికి శివ దర్శననానికి వెళ్ళారు వారికి దర్శనం ఇవ్వడానికి ఇష్ట పడని ఈశ్వరుడు కాశీ విడిచి నంది రూపం ధరించి ఉత్తర దిశగా పయన మయ్యాడు. పాండవులు పట్టు వదలక వెంబడించగా గుప్త కాశీ ప్రాంతంలో నంది రూపంలో కనిపించిన ఈశ్వరుని పట్టుకోవడానికి భీమశేనుడు ప్రయత్నించగా ఈశ్వరుడు మాయమయ్యాడు. అప్పుడు ఈశ్వరుని శరీర భాగాలు ఐదు ఛోట్ల ప్రతిష్ఠితమై అవి పుణ్య క్షేత్రాలుగా భాసిల్లాయి. శివ పురాణంలో వర్ణించబడిన పంచ కేదారాలను పంచఆరామాలని పిలుస్తుంటారు. అవి వరసగా కేదారినాధ్, తుంగ నాధ్, రుద్ర నాధ్, మధ్య మహేశ్వర్, కల్పేశ్వర్. నేపాల్ లోని ఘోరక్ నాధ్ తెగ వారు పంచకేదార యాత్రకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. భారతీయులూ ఈ యాత్రకు ప్రాధాన్యత ఇస్తారు. కాఠ్మండు లోని పశుపతి నాధ్ ఆలయ నిర్మాణానికి ఈ పొంచ కేదారాల నిర్మాణానికి పోలికలు ఉంటాయి.*

కేదారినాధ్......

ద్వాదశ జ్యీతిర్లింగాలలో ప్రసిద్ధి చెందింది పంచ కేదారాలలో మొదటిది కేదారనాధ్. పాండవులకు అందకుండా పారి పోయిన శివుని మూపురభాగం ఉన్న చోటు. ఇందుకు నిదర్శనంగా ఇక్కడి లింగం ఎనిమిది గజముల పొడవు, నాలుగు గజముల ఎత్తు, నాలుగు గజముల వెడల్పు ఉంటుంది. ఈక్కడి లింగం త్రిభుజాకారంలో ఉంటుంది. పాండవులు తమ అంతిమ దశలో స్వర్గారోహణ ఇక్కడ నుండి ప్రారంభించారు. ఆదిశంకరాచార్యులు మోక్షం పొందిన క్షేత్రం ఇదే. సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తెరచి ఉంచే ఈ ఆలయం ప్రతి సంవత్సరం అక్షయత్రుతియ నాడు తెరుస్తారు. కార్తీక మాసంలో వచ్చే యమద్వివిధియ నాడు మూసి వేస్తారు. ఈ మధ్య కాలంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని యూకీ మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 11,758 అడుగుల ఎత్తులో ఉంటుంది. హృషీకేశ్ వరకు రైలు మార్గం ఉంటుంది. అక్కడి నుండి దాదాపు 250 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించి గౌరీ కుండ్ చేరుకుని అక్కడి నుండి శిఖరానికి 14 మైళ్ళ దూరం కాలి నడకన చేరాలి. కానీ భక్తులు అనేక మంది డోలీలు, గుర్రాలపై ప్రయాణించి ఆలయం చేరుకుంటారు.

సోనప్రయాగకి దగ్గరలోని ఫటా అనే గ్రామం నుంచి కేదార్నాథ్ ఆలయం సమీప ానికి హెలీకాప్టర్ సదుపాయం అందుబాటులో ఉంది.

తుంగనాధ్......

పంచ కేదారాలలో రెండవది తుంగనాధ్. శివుని చేతులు లింగ రూపంలో వెలసిన క్షేత్రం ఇది. ఇది సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఉంటుంది కేదారానికంటే ఎత్తైన ప్రదేశం. తుంగనాధుడంటే శిఖరాలకు అధిపతి అని అర్ధం. ఈ ఆలయంలోని లింగం ఒక అడుగు ఎత్తున చేతులను పోలి ఉంటుంది. స్వల్పంగా ఎడమ వైపు వాలి ఉంటుంది. గర్భగుడిలో శివునితో వ్యాస, గణపతి అష్టధాతు విగ్రహాలు ఉంటాయి. ప్రమధ గణాల విగ్రహాలు ఉంటాయి. పాండవుల చిత్రాలు గోడలో చెక్కి ఉంటాయి. ఆలయానికి కుడి వైపున పార్వతీ దేవి ఆలయం ఉంటుంది. వేరొక వైపున ఐదు ఆలయాలు ఉంటాయి . అవి పంచకేదారెఆల నమూనాలు. ఈ ఆలయాన్ని అర్జునుడు నిర్మించారని స్థల పురాణం చెప్తుంది. శీతా కాలంలో ఉత్సవ విగ్రహాలను ముకునాధ్ మఠానికి తరలించి పూజలు నిర్వహిస్తారు.

రుద్రనాధ్.......

పంచ కేదారాలలో మూడవది రుద్రనాధ్. నంది రూపంలో ఉన్న శివుని ముఖ భాగం వెలసిన చోటు ఇదే. అరమోడ్పు కన్నులతో భువనమోహనంగా ముఖ లింగ రూపంలో ఉండే స్వామిని నీలకంఠ్ మహాదేవ్ అని భక్తులు పిలుస్తారు. తెల్ల వారు ఝామున అభిషేక వేళలో స్వామి వెండి తొడుగు తొలగిస్తారు. నిజరూప దర్శననానికి భక్తులు ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 7,500 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయానికి వెనుక భాగంలో వైతరణీనది ప్రవహిస్తుంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు తమ పూర్వీకులకు మోక్షం ప్రసాదించమని వెడుకునేవారు.

*🌷🌾శ్రీ లక్ష్మీ నృసింహ* *కరావలంబ స్తోత్రము🌾🌷* *( ఆది శంకరాచార్య విరచితం)* (*🙏🏻తాత్పర్యము &* *ఫల శృతి🙏🏻👇*)

 🌾🇮🇳🌾🇮🇳🌾🇮🇳🌾🇮🇳🌾

*🌺🌾ఈ స్తొత్రము చదివిన, మనకు మానసిక ఆనందం, ఆరోగ్యం గ్రహబాధ నివారణకి  ఈ పారాయణ వల్ల విముక్తి లభిస్తుంది🌾🌺*

*🌷🌾శ్రీ లక్ష్మీ నృసింహ*
      *కరావలంబ స్తోత్రము🌾🌷* 
*( ఆది శంకరాచార్య విరచితం)*
(*🙏🏻తాత్పర్యము &*
     *ఫల శృతి🙏🏻👇*)

🌷🌾శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే
భోగింద్రభోగమణిరంజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

🌷🌾బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి
సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత
లక్ష్మీలసత్ కుచసరోరుహ రాజహంస
లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్

🌷🌾సంసారసాగర విశాల కరాళకామ
నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య
మగ్నస్య రాగలసదూర్మినిపీడితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

🌷🌾సంసారఘోరగహనే చరతో మురారే
మారోగ్రభీకర మృగ ప్రవరార్దితస్య
ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

🌷🌾సంసారకూప మతిఘోర మగాధమూలం
సంప్రాప్య దుఃఖ శతసర్పసమాకులస్య
దీనస్య దేవ కృపయా శరణాగతస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

🌷🌾సంసారభీకర కరీంద్ర కరాభి ఘాత
నిష్పీడ్యమానవపుష స్సకాలార్దితస్య
ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

🌷🌾సంసార సర్పవిషదుష్ట భయోగ్రతీవ్ర
దంష్ట్రాకరాళ విషదగ్ధ వినష్టమూర్తేః
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

🌷🌾సంసారజాలపతితస్య జగన్నివాస
సర్వేందియార్ధబడిశస్థ ఝుషాత్మనశ్చ
ప్రోత్తంభిత ప్రచురతాలుక మస్తకస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

🌷🌾సంసారవృక్ష మఘబీజ మనంతకర్మ
శాఖాయుతం కరణపత్ర మనంగ పుష్పమ్
ఆరుహ్య దు:ఖ జలధౌ పతతో దయాళో
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

🌷🌾సంసారదావ దహనాకుల భీకరోగ్ర
జ్వాలావళీభి రభిదగ్ధ తనూరుహస్య
త్వత్పాదయుగ్మ సరసీరుహ మస్తకస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

🌷🌾సంసారసాగర నిమజ్జన మహ్యమానం
దీనంవిలోకయ విభో కరుణానిధే మామ్
ప్రహ్లాదఖేద పరిహార పరావతార
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

🌷🌾సంసార యూథ గజసంహతి సింహదంష్ట్రా
భీతస్య దుష్టమతిదైత్య భయంకరేణ
ప్రాణప్రయాణభవభీతినివారణేన
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

🌷🌾సంసారయోగి సకలేప్సిత నిత్యకర్మ
సంప్రాప్యదు:ఖ సకలేంద్రియ మృత్యునాశ
సంకల్ప సింధుతనయాకుచకుంకుమాంక
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

🌷🌾బద్ధ్వా కశై ర్యమభటా బహు భర్త్సయంతి
కర్షంతి యత్ర పథి పాశశయై ర్యదా మామ్
ఏకాకినం పరవశం చకితం దయాళో
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

🌷🌾అంధస్యమే హృతవెవేకమహాధనస్య
చోరై ర్మహాబలభి రింద్రియనామధేయైః
మోహాంధకారకుహరే వినిపాతితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

🌷🌾లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో
యఙ్ఞేశ యఙ్ఞ మధుసూదన విశ్వరూప
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

🌷🌾ప్రహ్లాద నారద పరాశర పుండరీక
వ్యాసాంబరీష శుక శౌనక హృన్నివాస
భక్తానురక్త పరపాలన పారిజాత
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

🌷🌾ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ
మన్యేన సింధుతనయా మవలంబ్య తిష్ఠన్
వామేతరేణ వరదాభయహస్తముద్రాం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

🌷🌾ఆద్యంతశూన్య మజ మవ్యయ మప్రమేయ
మాదిత్యరుద్ర నిగమాది నుత ప్రభావమ్
త్వాంభోధిజాస్య మధులోలుప మత్తభృంగం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

🌷🌾వారాహ రామ నరసింహ రమాదికాంతా
క్రీడా విలోల విధిశూలి సుర ప్రవంద్య
హంసాత్మకం పరమహంస విహారలీలం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

🌷🌾మతా నృసింహశ్చ పితా నృసింహ:
భ్రాతా నృసింహశ్చ సఖానృసింహ:
విద్యా నృసింహో ద్రవిణం నృసింహ:
స్వామీ నృసింహ: సకలం నృసింహ:

🌷🌾ప్రహ్లాద మానససరోజ విహారభృంగ
గంగాతరంగధవళాంగ రమాస్థితాంగ
శృంగార సంగర కిరీటలసద్వరాంగ
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

🌷🌾శ్రీశంకరాచార్యరచితం సతతం మనుష్య:
స్తోత్రం పఠేదిహ తు సర్వగుణప్రపన్నమ్
సద్యో విముక్త కలుషో మునివర్యగణ్యో
లక్ష్మీపతే: పద ముపైతి స నిర్మలాత్మా

🌷🌾యన్మాయ యార్జితవపు:ప్రచుర ప్రవాహ
మగ్నార్త మర్త్యనివహేషు కరావలంబమ్
లక్ష్మీనృసింహ చరణాభ మధువ్ర తేన
స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ

🌷🌾శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ
తాపత్రయోపశమనాయ భవౌషధాయ
తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగరోగ
క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే

🌷🌾యే తత్పఠంతి మనుజా హరిభక్తియుక్తా-స్తే యాంతి తత్పదసరోజమఖండరూపమ్ ||

*🌾తాత్పర్యము🌾:*

*🌷🌾పాలకడలిలో ఆదిశేషునిపై భోగముతో చక్రమును ధరించి, రత్నములతో శోభిల్లే, పుణ్యమూర్తి యైన, యోగులను శాశ్వతముగా కాపాడే, ఈ సంసార సాగరాన్ని దాటించే నావయైన, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము*.

*🌷🌾బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు, సూర్యుడు మొదలగు దేవతల కిరీటములు మోడిన పాదములు కల, మెరిసే పాదములు శోభను ఇనుమడించగా, లక్ష్మీ దేవి స్తన ద్వయము వద్ద రాజహంస యైన, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము*.

*🌷🌾మురహరి! సంసారమనే అంధకారములో నేను పయనిస్తూ, కామము అనే సింహముచే దాడి చేయబడి, స్పర్ధ అనే వేడిమిచే బాధ పెట్టబడి ఉన్నాను. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము*.

*🌷🌾ఓ ప్రభూ! సంసారమనే భయంకరమైన, లోతైన బావి అడుగుకు చేరాను. వందలాది దుఖములనే సర్పములచే బాధించబడి, దుఃఖముతో, నిస్సహాయుడనై దీనుడనైతిని. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము*.

*🌷🌷ఓ ప్రభూ! అనంతమైన వెడల్పుగల ఈ సంసారమనే సాగరంలో చిక్కుకున్నాను. ఈ సాగరంలో కాలమనే నల్లని మొసళ్ళ నోట చిక్కి వాటిచే చంప బడుతున్నాను. మోహమనే అలలలో, రుచి మొదలగు వాసనలు వశుడనై ఉన్నాను. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము*.

*🌷🌾ఓ ప్రభూ! పాపమనే బీజము మొలిచి, వృక్షమై, పూర్వ జన్మల కర్మ ఫలములనే క్రొమ్మలు కలిగి, నా శరీర భాగములు ఆకులుగా కలిగి, శుక్రుని ఫలితముగా పుష్పములు కలిగి (వీర్యము అని అర్థము), దుఖమనే ఫలములు కలిగి యుండి. కానీ, నేను దాని పై నుండి వేగముగా జారుచున్నాను. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము*.

*🌷🌾ఓ ప్రభూ! సర్పముల శత్రువైన గరుత్మంతుని వాహనముగా కల, అమృత తుల్యమైన పాల కడలిలో నివసించే ఓ దేవా! సంసారమనే విషసర్పము తన భయంకరమైన నోరు తెరచి విషపు కోరలను నాపై చూపి నన్ను నాశనము చేయుచున్నది. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము*.

*🌷🌾ఓ ప్రభూ! సంసారమనే దావాగ్ని నా శరీరమును, దానిపై ఉన్న ప్రతి రోమమును దహించుచున్నది. నీ పాద పద్మములను శరణు అంటిని. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము*.

*🌷🌾ఓ ప్రభూ! నేను సంసారమనే వలలో చిక్కుకున్నాను. నా ఇంద్రియములు ఈ వలలో చిక్కుకున్నవి. ఈ ఇంద్రియములనే కొక్కెము నా తలను నా నుండి నుండి వేరు చేయుచున్నది. కావున, కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.*

*🌷🌾ఓ ప్రభూ! మాయ అనే మత్త గజముచే నేను దెబ్బ తిన్నాను. నా ముఖ్య🌷🌾 అవయవములు పూర్తిగా దెబ్బ తిన్నవి. నేను ప్రాణ భీతితో వ్యాకులుడనై యున్నాను. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము*.

*ఓ ప్రభూ! ఇంద్రియములనే చోరులు నా వివేకమును దొంగిలించుట వలన నేను అంధుడ నైతిని. అంధుడనైన నేను మోహమనే కూపములో పడి కొట్టుకుంటున్నాను. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము*.

*🌷🌾ఓ ప్రభూ! యముని భటులు నన్ను రాగ పాశములచే మెడను బంధించి ముక్కున లాగుతున్నారు. నేను ఏకాకిని, అలసితిని. భీతితో ఉన్నాను. దయాళో! లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము*.

*🌷🌾లక్ష్మీపతీ! కమలనాభ!సురేశ! విష్ణో! వైకుంఠ వాసా! కృష్ణ! మధుసూదన! కలువల వంటి కనులు కలవాడా! బ్రహ్మము తెలిసిన వాడా! కేశవా! జనార్దన! వాసుదేవ! లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము*.

*🌷🌾ఒక చేతిలో చక్రము, రెండవ చేతిలో శంఖము కలిగి, ఇంకొక చేతితో లక్ష్మీ దేవిని పట్టుకొని, మరొక చేతితో అభయము, వరములు ఇచ్చే లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.*
*ఓ ప్రభూ! నేను సంసారమనే సాగరములో మునిగి యున్నాను. ఆర్త రక్షకా! ఈ దీనుడను కాపాడుము*. 

*🌷🌾ప్రహ్లాదుని దుఖములు పోగొట్టుటకు అవతారమెత్తిన లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము*.
*ఓ ప్రభూ! ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు మొదలగు వారి హృదయములలో మెలిగే దేవా! భక్త ప్రియా! భక్తులను కాపాడే కల్ప వృక్షమా! లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము*.

*ఫల శృతి:-*
*🌷🌾లక్ష్మీ నృసింహుని చరణార విందముల మధువును గ్రోలిన తేనెటీగ అయిన శంకరులచే రచించ బడిన ఈ స్తోత్రము పఠించిన జనులకు శుభము కలుగును. ఈ స్తోత్రము నుతించిన హరి భక్తులకు ఆ పరబ్రహ్మ పాదపద్మముల కైంకర్యము కలుగును.*
 *ఆత్మీయ బంధుమిత్రులకు లక్ష్మి నృసింహ జయంతి మరియు గురువారపు   శుభాకాంక్షలు 💐💐🥭🥭🌹🌹..*                                                 విశ్వ గురువులు గీతాచార్యులు శ్రీకృష్ణ భగవానుల వారు, శ్రీ లక్ష్మి నారసింహ స్వామి వారు,పూజ్య గురువులు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, పూజ్య గురుశ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారు జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులవార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..        *ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్నా ఆత్మీయులకు శుభాకాంక్షలు* 💐🌹🥭🍫🍇


     తప్పు చేసే అవకాశం రోజుకు వంద సార్లు వస్తుంది, *కానీ మంచి చేసే అవకాశం ఎప్పుడో కానీ రాదు.* కాబట్టి మనకు మంచి చేసే *అవకాశం* వచ్చినప్పుడు *దానిని* జార  విడుచుకోకూడదు...... 

     ఎదుటి వాళ్ళు మనకు *నచ్చిన పనులు* చేస్తే వారు *మంచోళ్ళు.* అదే మనకు *నచ్చని పనులు* చేస్తూ వాళ్ళకి నచ్చినట్లు ఉంటే *చెడ్డోళ్ళు.* మన ఇష్టాయిష్టాలే ఎదుటివారి *వ్యక్తిత్వం* ఇదే నేటి *మనిషి తత్వం..* 

      ఒకరిని *అపార్థం* చేసుకోడానికి కొన్ని 
*సెకండ్ల సమయం* చాలు *కానీ* అర్థం చేసుకోడానికి *రోజులు* పడుతుంది, అందుకే *అపార్థం* చేసుకోవడంలో *ఒక వంతు అర్థం* చేసుకోడానికి ప్రయత్నించండి. *బంధాలు* బలపడతాయి *కలకాలం* నిలబడతాయి

       తన కొమ్మలకు పూసిన *పూలు* రాలిపోతున్నాయని యే *మొక్క* బాధపడదు.. రేపటి రోజున కొత్త *పువ్వులు* పూయించటానికి ఉత్సాహంగా తీరికలేకుండా *కష్టపడుతుంది*..గడిచిపోయిన రోజులు గురించి *చింతించటం* కాదు రాబోయే రోజుల గురించి *పనిచేయటమే* జీవితం..ఆ పూల మొక్కే మనకు ఆదర్శం కావాలి..

        దేముడా..*ఆదాయం* తక్కువైనా అవసరం మేరకు *ఆహారం* ఇవ్వు..
*ఆయుస్సు* తక్కువైనా రోగం లేని *ఆరోగ్యం* ఇవ్వు.
*వసతి* తక్కువైనా ప్రియమైన *తోడును* ఇవ్వు..
*డబ్బులు* లేకపోయినా నిన్ను *పూజించే* మనస్సు ను ఇవ్వు..
*బంధాలు* తక్కువైనా నమ్మకమైన *స్నేహం* ఇవ్వు 🙏🙏                                                 
                                                             
       ఏ *రాత* రాసినా కాగితం తనలో *దాచుకుంటుంది*..కాని కొన్ని *రాతలు* మాత్రమే *కాగితాన్ని* మనం *దాచుకునేలా* చేస్తాయి.. అలాగె కొన్ని *పరిచయాలు* తోటి రైలు *ప్రయాణికులు* లాగ ఉంటాయి. మరికొన్ని పరిచయాలు *మనస్సు* పోరల్లో *దాగి* ఉంటాయి..

      మీకు *సహాయం* చేసిన వారిని మరచిపోవద్దు, నిన్ను ప్రేమించేవారిని *ద్వేశించవద్దు* . నిన్ను నమ్మిన వారిని *మోసం* చేయవద్దు.
     🙏🕉️🙏
 గురు తత్వాన్ని ఇలా అర్థం చేసుకోవాలి శిష్యులు 
గురు అనేది కేవలం ఒక వ్యక్తి కాదు —
అది ఒక దివ్య శక్తి, ఒక జ్ఞాన దీపం, ఒక ఆత్మ మార్గదర్శి.
- గురువు మనకు బయట కనిపించే రూపంలో ఉన్నా, గురువు యొక్క అసలు స్వరూపం మన అంతరంగంలో వెలిగే చైతన్యం.
* గురువు ఏమి చేస్తారు?*
అజ్ఞాన అంధకారాన్ని తొలగించి,
మనలోని దైవత్వాన్ని మేల్కొలుపుతారు. జీవితానికి సరైన దిశ చూపిస్తారు
* శిష్యుడు ఎలా ఉండాలి?*
గురువులపట్ల సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. వినయం, శరణాగతి కలిగి ఉండాలి. గురువు చెప్పిన మార్గాన్ని నిష్ఠతో అనుసరించాలి. 
*గురు అనుగ్రహం లభిస్తే:*
మనసు ప్రశాంతం అవుతుంది.
జీవితం సార్థకం అవుతుంది.మనలో జ్ఞానమనే ఆత్మ జ్యోతి వెలుగుతుంది.
గురువు అనేది వెలుపల కనిపించే ఒక రూపం కాదు — మనలోనే వెలిగే పరమ సత్యం.గురువుద్వారా మాత్రమే మనలో నిలిచిపోయే నిత్య సత్యం.
*-శృంగేరీ జగద్గురువుల నిత్య సత్యాలు నుండి.*

 *జపము ఎలాచేస్తే ఎంతఫలితం వస్తుంది.....*

*జపము ఎక్కడ చేస్తే ఎంత ఫలితం .........*

*జకారో జన్మ విచ్ఛేదః పకారః పాపనాశకః* |

*జన్మపాప వినాశత్వాత్ జప ఇత్య భి ధీయతే* || 


*'జ'కారం జన్మ లేకుండా చేస్తుంది. 'ప'కారం పాపాలను నశింపచేస్తుంది. జన్మరాహిత్యాన్ని పాపపరిహారాన్ని చేహడంవల్ల 'జప'మనబడుతోది.*


*జపం మూడు విధాలు. వాచికం, ఉపాంశువు, మానసికం.* 


మంత్రం సమీపంలోని వారికి వినబడునట్లు ఉచ్చరిస్తే వాచిక జపం.పెదవుల కదిల్కద్వారా దగ్గరుండే వారికి మాత్రమే వినబడేటట్లుగా జపిస్తే ఉపాంశు జపం.

ధ్యానంలో పరవశిస్తూ జపించడం మానసిక జపం.


వాచిక జపం కంటే ఉపాంశు వెయ్యి రెట్లు అధికం, దీనికి వెయ్యి రెట్లు అధిక ఫలం మానసిక జపం వలన కలుగుతుంది. కాబట్టి మానసిక జపమే శ్రేష్టం.


"న దోషో మనసే జాపే సర్వ దేశే ఫై సర్వధా!" అంటే మానసిక జపానికి ఏ దోషం అంటదు అటువంటి వ్యక్తికీ ఎటువంటి హానీ కలుగదు అంటోది తత్వశాస్త్రం.


యక్షో రక్షః పిశాచాశ్చ గ్రహం సర్వేచ భీషణాః |

జాపినం నొప సర్వంతి భయ భీతా స్సమంతతః ||


జపేన పాపం శమయే దశేషం యత్తత్క్రుతం జన్మపరం పరాసు |

జపేన భోగానె జయతేచ మృత్యుం జపేన సిద్ధి లభతేచ ముక్తిం ||


యక్షరాక్షస పిశాచాది భయంకర గ్రహాలు జపం చేసేవారిని చూసినంత మాత్రానే భయపడి దూరంగా పరిగెత్తుతాయని, జన్మాంతర సంచిత పాపం నశిస్తుందని, సుఖ-శాంతులు మరియు ముక్తి లభిస్తాయని లింగపురాణం అంటోంది.


అంతటి మహత్యం కలది కాబట్టే శ్రీ కృష్ణభగవానుడు యజ్ఞానం జప యజ్ఞోస్మి అంటూ గీతలో జపాన్ని యజ్ఞంతో పోల్చి చెప్పాడు. 


వివిధ స్థానాల్లో మంత్రజప ఫలం :


ఇంట్లో చేసే జపం జప సంఖ్యతో సమాన ఫలితాన్నిస్తుంది.

గోశాలలో అయితే జపసంఖ్య కన్నా నూరు రెట్లు ఎక్కువ.

నదీతీరంలో అయితే జపసంఖ్య కన్నా లక్షరెట్లు ఎక్కువ.


సాగర తీరాలు, దేవ జలాశయాలు, పర్వత శిఖరాలు, పవిత్ర ఆశ్రమాలు, శివ సాన్నిధ్యం, సూర్యబింబంలో నారాయణుని దర్శిస్తూ, అగ్నిసన్నిధిలో, దీపం వద్ద, గురుసన్నిధిలో జపం చేయడం వీశేష ఫలప్రదామని లింగ పురాణం చెబుతోంది. అలాగే తులసీవనం, అశ్వద్ధ వృక్షము, ఉసిరి, మారేడు వృక్షములలో చేసే జపం విశేష సిద్ధి ప్రదామని పురాణాలు చెబుతున్నాయి. 


జపపూసలు మరియు సంఖ్య


జప సాధనకు జపమాల, దానిలో 108 పూసలుంటాయి. సూర్యులు ద్వాదశాదిత్యులని 12 విష్ణు స్వరూపులు. సూర్యునికి ద్వాదశ రాశులుంతాయి. ఆ సూర్యుడే బ్రహ్మ స్వరూపము. బ్రహ్మ సంఖ్య 9. 12 సంఖ్యలు గల సూర్యునితో బ్రహ్మను గుణిస్తే 108 సంఖ్య అవుతుంది. 108 యోగము 1+8=9 అవుతుంది. నవ సంఖ్య బ్రహ్మకు ప్రతీకము. అందువలననే బ్రహ్మవేత్తలైన సన్యాసులు నామములకు మునుపు బ్రహ్మకు ప్రతినిధిగా 108 అని వ్రాస్తున్నారు. 


జపమాలను బొటన వ్రేలితో కలిపి ఎట్టి ప్రస్థితులలోనూ చిటికెన వేలుతో తిప్పరాదు. అది పూర్తిగా నిషిద్ధము. తర్జనివ్రేలు, శత్రువినాశకరమని, అంగుష్టము మోక్షదాయకమని, మధమాంగుఌ ధనదాయకమని, అనామిక శాంతిప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. అతి తప్పనిసరిగా బొటనవ్రేలును ఉపయోగించాలి. 


జపమాల జారటం, తెగటం అనేవి జరగకుండా తగు జాగ్రత్త వహించాలి.


తూర్పు ముఖ జపం వశీకరణ కారకం.

దక్షిణ ముఖ జపం అభిచారిక (గారడి) కారకం.

పడమర ముఖ జపం సంపద కారకం.

ఉత్తర ముఖ జపం పౌష్టిక కార్యాలు, శాంతి, మోక్ష కారకం.


మానసిక జపానికి ఎక్కువ నియమాలు లేవు. 'మానసిక జపో నియమోనాస్తి' అని శాస్త్రం చెబుతోంది.


అశుచిర్యా శుచిర్వాః గచ్ఛం స్తిష్ఠన్ స్వజన్నపి |

మంత్రైక శరణోవిద్వాన్ మన శైవం సదాభ్యసేత్ ||

నదోషో మనసే జాపే సర్వదేశేపి సర్వదా |

జపనిష్టో ద్విజశ్రేష్ఠో జప యజ్ఞఫలం లభ్యత్ ||


పవిత్రునిపై కాని అపవిత్రునిపై కాని, నడచుచూ కాని, నిలబడి కాని, పరుండి కాని మనసులో మంత్రాన్ని జపించవచ్చును. మానవ జపము సర్వకాల, సర్వదేశ, సర్వావస్థల్లో చేయవచ్చు. అట్టివారు సర్వ యజ్ఞ ఫలితాన్ని పొందుతారు.


క్రుష్ణాజిన ఆసనం జ్ఞాన సాధకం.

చిత్రాసనం సర్వార్ధ సాధకం.

కుశాసనం మంత్రసిద్ధి.

వ్యాఘ్రాసనం పురుషార్ధ సాధకం.

జింక చర్మంపై జపం భగందర రోగం నయం.


ఒకరు ఉపయోగించిన ఆసనం వేరొకరు ఉపయోగించరాదు. 


నేలపై కూర్చొని చేసే జపం దుఃఖ కారకం.

పీటపై దౌర్భాగ్యం.

వెదురుచాప దరిద్రం.

గడ్డిపై ధన, కీర్తి హాని

చిగురుటాకులు లేక పెద్ద ఆకులూ చిత్తాన్ని చలింపచేస్తాయి.


ఆసనం అంటే -- 'ఆ'సనం అంతే ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించేది. ఆ'స'నం సర్వరోగాలను బాగుపరిచేది ఆస'న' నవ నిధులను ప్రసాదించేది అని అర్థం. జప, తపస్సు, దేవతారాధన మరియు సంధ్యావందనమునకు ఆసనం ప్రధానం.       

 *ప్రేరణమార్గ*             (ఆధ్యాత్మిక కుటుంబం స్పెషల్ ఫీచర్)                   *ఒకదాన్ని గొప్పదిగా చేయాలి అంటే.. మరో దానితో పోల్చి ఆ రెండో దానిని తక్కువ చేయడం ద్వారా మొదటి దాన్ని గొప్పదిగా చిత్రీకరించటం కన్నా మెరుగైన విధానం ఇప్పటివరకు మానవ మేధస్సు కనుగొనలేకపోవడం మేధస్సుకే అవమానం. గొప్పదనాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేని నిస్సహాయతను ఇలాంటి పోలికలు తెలియజేస్తాయి.*          *కమలం ఆకులపై నీటి బిందువులు పడినట్లే*
*వారికి అజ్ఞానులతో అనురాగం, స్నేహం లభించవు*

*కమలం ఆకుపై పడిన బిందువులు దానిపై నిలిచి ఉండనట్లే, దుష్టులకు నీతిమంతులతో ఉన్న స్నేహం కూడా నిలిచి ఉండదు.*              *ప్రతిరోజు మంచి రోజు కాదు, ఎలాగైనా జీవించు*

*నువ్వు ప్రేమించే వారందరూ నిన్ను తిరిగి ప్రేమించరు, ఎలాగైనా ప్రేమించు*

*అందరూ నీకు నిజం చెప్పరు, ఎలాగైనా నిజాయితీగా ఉండు*

*అన్ని ఒప్పందాలు న్యాయంగా ఉండవు, ఎలాగైనా న్యాయంగా ఆడండి.            

*మరణం - పునర్జన్మ* :

 ప్రశ్నోపనిషత్ లో ఇలా ఇటువంటి మంత్రం ఒకటి వుంది.

*మరణం - పునర్జన్మ* : 

ప్రశ్నోపనిషత్ 3 వ ప్రశ్న 

9) మం. తేజో హ వా ఉదానస్తస్మాదు పశాంతతేజాః పునర్భవ మింద్రియైర్మ నసి సంపద్యమానైః 

నిజంగా తేజస్సే ఉదానం అనే వాయువు. తేజస్సు అంటే అగ్ని. అగ్నిలో వేడి వెలుగు రెండూ ఉంటాయి. కాబట్టి సూర్యుని తేజస్సులో ఉండేది ఉదానమే. 
ఎవరిలో యీ ఉదానము శాంతించి పోతుందో (వేడిమి తేజస్సు తగ్గి పోతాయో) అట్టివారు మనస్సులో విలీనమైయున్నట్టి ఇంద్రియాలతో సహా మరియొక శరీరాన్ని పొందటానికి పోతారు. అంటే ఉదానం శాంతించటంతోనే చనిపోతారు. అప్పుడు వాక్కు మొదలైన ఇంద్రియాలన్నీ మనస్సులో లీనమై పోతాయి. ఆ మనస్సు ఈ శరీరాన్ని వదలి ఇంకొక శరీరాన్ని పొందటానికి పోతుంది.

10) మం. యచ్చిత్త స్తేనైష ప్రాణమాయాతి, ప్రాణస్తేజసా యుక్తః॥ సహాత్మనా యథాసంకల్పితం లోకం నయతి 

మరణ కాలంలో మానవునికి ఏ ఆలోచన ఉంటుందో ఆ ఆలోచనతో సహా అతడు (జీవి) ముఖ్య ప్రాణమును పొందుతాడు. ఆ ముఖ్యప్రాణమే అగ్నితో (ఉదాన వాయువుతో) కలిసి జీవాత్మను సంకల్పానుసారమైన కోరికలకు అనురూపమైన) లోకాలకు తీసుకుపోతుంది.

(మానవుని ఆత్మ అయిదు కోశాలతో ఆవరింపబడి ఉంటుంది.  1. అన్నమయ 2. ప్రాణమయ 3. మనోమయ 4. విజ్ఞానమయ 5. ఆనందమయ కోశాలు

i) అన్నమయకోశం ఈ స్థూలశరీరం.

ii) ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు మూడూ కలిసి సూక్ష్మశరీరం.

iii) ఆనందమయకోశం కారణ శరీరం.

జీవించి ఉండటమంటే ఆత్మ కారణశరీరంలో, కారణశరీరం సూక్ష్మ శరీరంలో, సూక్ష్మశరీరం స్థూలశరీరంలో ఉండటం. మరణించటం అంటే స్థూలశరీరం నుండి సూక్ష్మకారణ శరీరాలు రెండూ వేరైపోవటం, మరొక జన్మ కలగటానికి ఇట్లా వేరైపోయిన సూక్ష్మశరీరమే కారణం. కాబట్టి, మరణ సమయంలో ఏ మనోభావంతో ఉందో ఆ మనోభావంతోనే జీవాత్మ ప్రాణమయ కోశం వద్దకు వస్తుంది - పునర్జన్మను పొందుతుంది).        
 భగవద్గీత 9.19–20 — తాత్త్విక విశ్లేషణ

శ్లోకం 9.19

> తపామ్యహమహం వర్షం
నిగృహ్ణామ్యుత్సృజామి చ ।
అమృతం చైవ మృత్యుశ్చ
సదసచ్చాహమర్జున ॥


భావార్థం

నేనే వేడిని ఇస్తాను, వర్షాన్ని నిలిపివేస్తాను, విడుదల చేస్తాను. నేనే అమృతం, మృత్యువు, సత్ మరియు అసత్.


శంకరభాష్య సారం

1. “తపామి” (వేడి ఇవ్వడం)

సూర్యరూపంలో ఈశ్వరుడు

జీవన చక్రానికి మూలం


2. “వర్షం నిగృహ్ణామి ఉత్సృజామి”

వర్ష నియంత్రణ → జీవన సమతుల్యత

సృష్టి-స్థితి నియంత్రణ


👉 ప్రకృతి కూడా స్వతంత్రం కాదు, ఈశ్వరాధీనమే


3. “అమృతం చ మృత్యుః చ”

అమృతం → మోక్షం

మృత్యువు → సంసారం


👉 రెండూ ఒకే పరమసత్యంలో


4. “సత్ మరియు అసత్”

సత్ → వ్యక్తం (ప్రపంచం)

అసత్ → అవ్యక్తం (కారణ స్థితి)


👉 కారణం, కార్యం రెండూ బ్రహ్మస్వరూపమే


ఉపనిషత్ ప్రతిధ్వని 📖

ఛాందోగ్య ఉపనిషత్ (6.2.1)

> “సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్”



ప్రారంభంలో సత్ మాత్రమే ఉంది

👉 అదే సత్ ప్రపంచంగా వ్యక్తమవుతుంది


శ్లోకం 9.20

> త్రైవిద్యా మాం సోమపాః పూతపాపాః
యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే ।
తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం
అశ్నంతి దివ్యాందివి దేవభోగాన్ ॥


భావార్థం

మూడు వేదాలు తెలిసిన వారు, యజ్ఞాలు చేసి పాపాలు తొలగించుకుని స్వర్గాన్ని కోరుకుంటారు. వారు స్వర్గలోకాన్ని చేరి దివ్యభోగాలను అనుభవిస్తారు.


శంకరాచార్యుల వ్యాఖ్యానం

1. “త్రైవిద్యా”

ఋగ్, యజుర్, సామ వేదజ్ఞులు

కర్మకాండంలో నిమగ్నులు


2. “సోమపాః, పూతపాపాః”

యజ్ఞఫలంగా పుణ్యం సంపాదించేవారు

తాత్కాలిక శుద్ధి


3. “స్వర్గగతిం ప్రార్థయంతే”

వారి లక్ష్యం → స్వర్గసుఖం

మోక్షం కాదు


4. “దివ్య భోగాలు”

స్వర్గానుభవం

కానీ నశ్వరమైనది


👉 శంకరుడు స్పష్టం చేస్తాడు:
ఇది పరమ గమ్యం కాదు, కేవలం తాత్కాలిక ఫలం మాత్రమే


ఉపనిషత్ ప్రతిధ్వని 📖

కఠోపనిషత్ (1.2.10)

> “శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యం ఏతః”



ప్రేయస్ → ఇష్టమైనది (స్వర్గం, భోగం)

శ్రేయస్ → మోక్షం


👉 జ్ఞాని శ్రేయస్సే ఎంచుకుంటాడు


తత్త్వసారం

ఈ రెండు శ్లోకాలలో గీతా రెండు స్థాయిలను చూపుతోంది:

1. పరమసత్యం (శ్లోకం 19)

ఈశ్వరుడు → సర్వద్వంద్వాతీతం

జీవితం, మరణం, సత్, అసత్ అన్నీ ఆయనలోనే


2. అవిద్యా స్థాయి (శ్లోకం 20)

మనుషులు → భోగం కోసం యజ్ఞాలు

లక్ష్యం → స్వర్గం (తాత్కాలికం)



ఆధునిక అన్వయం 🌿

మనిషి ఈ రోజుల్లో కూడా అదే చేస్తున్నాడు:

డబ్బు → స్వర్గం

స్టేటస్ → స్వర్గం


కానీ అవి కూడా తాత్కాలిక భోగాలే.

👉 గీత చెబుతోంది:
“నువ్వు దేవుణ్ని కోరుకుంటున్నావా? లేక దేవుణ్ని ఉపయోగించి భోగాల్నే కోరుకుంటున్నావా?”

ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలిగితేనే జ్ఞానం మొదలవుతుంది. 🧘‍♂️.  
 🌺🙏 *ఓం నమో భగవతే వాసుదేవాయ* 🙏🌺*

*_🌴 ఆనందకరమైన జీవనానికి శారీరక ఆరోగ్యము పాటు                  మానసిక ఆరోగ్యము కూడా అత్యవసరము. మానవునికి దేవునియందు విశ్వాసము దృఢముగా ఉన్నపుడే తాను మానసికముగా దృఢముగా ఉండగలడు. దేవుని యందు విశ్వాసము జీవనానికి ఒక బరోసా. చెట్టు కొమ్మపై వాలిన పక్షి ఎట్టి ఆందోళన లేకుండా హాయిగా కూర్చుంటుంది. చెట్టు కొమ్మ విరిగిపోతుందేమో లేదా పెద్ద గాలి వచ్చి తను కిందకి పడిపోతానేమో అనే భయం దానిలో కొంచమైనా ఉండదు. కారణం దాని రెక్కలపై దానికున్న నమ్మకం. అలానే మనకు భగవంతునిపై దృఢమైన విశ్వాసము ఉన్నపుడు మనము దేనికినీ భయపడవసిన పనిలేదు. తనని నమ్మిన వారిని ఎప్పుడు, ఎక్కడ ఎలా ఆదుకోవాలో అయనకు బాగా తెలుసును. మనం కేవలము విశ్వసించి ఉంటే చాలు. మిగతా భారం ఆయనే చూసుకుంటాడు.🌴_*