Thursday, June 25, 2020

ఇది ఆనందం కాదా! ఇందులో ఆనందం లేదా?

ఇది ఆనందం కాదా!
ఇందులో ఆనందం లేదా?

కళ్ళు- కాళ్ళు, ముక్కు- మొగము
అన్నీ సరిగా ఉన్నాయి చాలదా
ఇది ఆనందం కాదా!
ఇందులో ఆనందం లేదా?

రోగాలు- రొచ్చులు , వ్యాధులు-బాధలు లేవు
రాళ్లు తిన్నా ఆరాయించుకునే శక్తి ఉంది చాలదా
ఇది ఆనందం కాదా!
ఇందులో ఆనందం లేదా?

అన్నమో రామచంద్రా! అని అలమటించే వారున్నారు
అన్నం తిన్నా అరాయించుకోలేని వారున్నారు
ముక్కల్తో ముప్పూటలా తింటున్నాము ఆరాయించుకుంటున్నాము
ఇది ఆనందం కాదా!
ఇందులో ఆనందం లేదా?

అక్షరంముక్క రాని వారున్నారు
ఆలోచించలేని వారున్నారు
చక్కగా చదువుకున్నాం, ఏదో ఒకటి చేస్తున్నాం
ఇది ఆనందం కాదా!
ఇందులో ఆనందం లేదా?

చక్కగా చదివి,చేత మంచి డిగ్రీలు పట్టిన వారున్నారు
మన కంటే గొప్పగా మంచి మార్కు లున్నవారున్నారు
అయినా వాళ్ళు రోడ్డు మీదుండొచ్చు
మనం మారాజుల్లా బతుకుటుందొచ్చు
ఇది ఆనందం కాదా!
ఇందులో ఆనందం లేదా?

మన చుట్టూ పెళ్లికాని వారున్నారు
పెళ్ళైతే ..పిల్లలు లేని వారున్నారు
మనకి పెళ్ళాం పిల్లలు ఉండొచ్చు
వారితో హాయిగా గడుపుతుండొచ్చు
ఇది ఆనందం కాదా!
ఇందులో ఆనందం లేదా?

డబ్బుల్లేని వారున్నారు
డబ్బులున్నా..జబ్బులతో బాధ పడేవారున్నారు
మనకి అవసరానికి డబ్బు అందితే చాలు
జబ్బుల గబ్బు లేకుంటే అదే పదివేలు
ఇది ఆనందం కాదా!
ఇందులో ఆనందం లేదా?

నిలువ నీడ లేని వారున్నారు
గుడ్డ గుడిసె గూడు లేని వారున్నారు
మనకి ఉండటానికి అద్దె ఇళ్లయినా ఉన్నాయి
గుడ్డ గుడిసె గూడు అన్నీ ఉన్నాయి
ఇది ఆనందం కాదా!
ఇందులో ఆనందం లేదా?

ఉన్నదానితో ఆనందించటం నేర్చుకోవాలి
లేనిదానికి అర్రులు చాచటం మానుకోవాలి

అందని దానికి ఆరాటం వదులుకోవాలి
అందినదాని విలువ తెలిసి మసలుకోవాలి

నీలో ఉన్న ఆనందం కోసం బయటెక్కడో వెదకకు
బయట ఉన్న బురదను నీలోకి తెచ్చుకోకు.

ఆనందం అంటే .. కొత్త పదం కాదు కొనుక్కోవడానికి
ఆనందం అంటే..పాతపదం
వెదుక్కోవటానికి.
👏👏👏👏👏

Source - Whatsapp sandesam

No comments:

Post a Comment