అరుణాచలం:
నాకు నచ్చింది చాలా !!
మీకూ నచ్చుతుందనుకుంటా !!
ఓ ఐదు నిముషాలుj వినియోగించగలరా .
దీన్ని చదవడంలో !!!
💐💐"ఆనందం ఖరీదు - ఆలోచన"💐💐
( గొల్లపూడి మారుతిరావు )
చాలామంది ఆనందానికీ, ఖరీదుకీ లంకె వుంటుంది. ఖరీదయిన కారూ, ఖరీదయిన సూటూ, ఖరీదయిన భోజనం,ఖరీదయిన పరుపూ- మీ యిష్టం -
ఏదయినా దాని చివర వున్న చీటీని బట్టి మనస్సులో ఆనందానికి తూకం వుంటుంది. మా ఆవిడ షాపులో చీరెల రంగులూ, నాణ్యాన్ని చూసే ముందు ధరని చూస్తుంది. ఖరీదు నాలుగంకెల్లో వున్నాక-
ఆమెకి మెల్లగా చీరె నచ్చడం ప్రారంభిస్తుంది.
ఆ తరువాతే రంగు, మన్నికా వగైరా. ఓసారి నేను తెచ్చిన చీరెని ఆనందంగా అందుకుంది. తృప్తిగా కట్టుకుంది. ఖరీదుని దాచి నెలరోజుల తర్వాత చెప్పాను-ఫలానా మార్కెట్లో చవకగా తీసుకున్నానని.
ఆ క్షణం నుంచీ ఆ చీరెమీద ఆమెకి మక్కువ పోయింది.
మా పెద్దబ్బాయి అన్నిటా వాళ్ళమ్మ పోలిక. ఓసారి బూట్లు దరిద్రంగా వున్నాయన్నాను. నన్ను జాలిగా చూసి-ఆవి ఫలానా బ్రాండువి- యింగ్లండులో ఆక్స్ ఫర్డ్ స్ట్రీట్ లో 10 రూపాయలకి కొన్నానని గర్వపడ్డాడు. మొన్న స్విట్జర్లాండు నుంచి వస్తూనే ఓ కళ్ళజోడు చూపించాడు.
“దీని ఖరీదు చెప్పు?” ఆన్నాడు- కంటి మీద అటూ యిటూ తిప్పుతూ. మా ఆవిడ సంగతి తెలిసినవాడిని కనుక పదివేల దగ్గర మొదలెట్టాను. మా వాడు తప్పిపోయిన అనాధని చూస్తున్నట్టు నన్ను క్షమిస్తూన్నట్టు నవ్వాడు.
ఇది ఫలానా వీధిలో ఫలానా షాపులో కొన్నానన్నాడు. దాని ఖరీదు 75వేల రూపాయలు. బ్రిటిష్ ప్రధాని గార్డెన్ బ్రౌన్ దగ్గర్నుంచి మెడోన్నా దాకా అంతా అక్కడే కళ్ళజోళ్ళు కొంటారట. అసలు స్విట్జర్లాండు నుంచి తిరిగి వస్తూ లండన్లో ఆగడానికి కారణం- ఆ కళ్ళజోడుని ఖరీదు చెయ్యడం.
ఓసారి బదరీనాధ్ నుంచి కారులో ఢిల్లీ చేరాం. ఉదయం చెన్నై విమానం. ఆ రాత్రి మా అబ్బాయితో ఐదు నక్షత్రాల హొటల్లో వున్నాను. రాత్రి 11 గంటలకి కేవలం పెరుగూ అన్నం తెప్పించుకున్నాను. దాని బిల్లు చూశాక అన్నం నోటికి పోలేదు. బిల్లు 750 రూపాయలు! అయితే- ఆ మాట విన్నాక మావాడికి ఆ హొటల్ మీద మోజు పెరిగింది.
అనుభవించే ప్రతి వస్తువూ ముందు ఆలోచనల్లో అనందాన్ని పంచాలి- చాలామందికి.
ఏ ఖరీదూ అక్కరలేని చందమామ వెన్నెల బొత్తిగా చవకగా వుంటుంది. ఆల్ఫ్స్ ని చూస్తూ-డాలర్ల ఖర్చుతో హొటల్ గది వరండాలోకి తొంగిచూసే వెన్నెలకి మాత్రమే ఆ రుచి వుంటుంది.
నేనూ ఏ వస్తువయినా కొనేముందు ధరని చూస్తాను-అర్ధంలేని ఖరీదునీ, అవసరంలేని స్థాయినీ మించిపోతుందేమోనని.
పదివేల రూపాయల లండన్ బూట్లు నా కాళ్ళను కరుస్తాయి. అంతకంటె వెయ్యిరూపాయల విశాఖపట్నం బూట్లు నమ్మకంగా నాకు సుఖాన్ని పంచి నాలుగుసార్లు కొత్తవి కొనుక్కునే వనర్లని జేబులో మిగులుస్తాయి.
కొందరు విమానాల్లొ క్లబ్ క్లాసుల్లో ప్రయాణాలు చేస్తారు. నేను ప్రయత్నించి మరీ “ఎకానమీ” లో కూర్చుంటాను. సుఖం కంటె తన అంతస్థు “లేబుల్” వారిని ఆనందపరుస్తుంది. అంతకంటె గర్వపరుస్తుంది.
ఉపాధికీ, పట్టెడన్నానికీ నోచుకోలేని కోట్లాదిమంది వున్న మన సమాజంలో-
ఈ ’లేబుల్’ కాస్త ఎబ్బెట్టుగా, హాస్యాస్పదంగా వుంటుంది. అయితే చాలామందికి సుఖం అన్నది వస్తువు చివర అంటించిన ధర చీటీ. అవసరాన్ని తీరిస్తే చాలదు. తమ అతిశయాన్ని రెచ్చగొట్టగలగాలి.
విచిత్రమేమిటంటే- ఒక్క భారతదేశంలోనే పేదరికానికి చాలా సంపన్నమయిన అర్ధం వుంది. డబ్బు లేకపోవడం అంటే మరే దేశంలోనయినా దరిద్రానికి గుర్తే.
కాని ఒక్క భారతదేశంలోనే దాని అర్ధం వేరు. ఇక్కడ ’లేమి’కి అర్ధం వైభవం. ఆ వైభవం స్థాయి-ఆ వ్యక్తి స్థాయి, సంస్కారం, మానసిక పరిపక్వతని బట్టి పెరుగుతుంది. పరమాచార్య వుంటిమీద బట్ట ఖరీదు పట్టుమని పదిరూపాయలుండదు.
భగవాన్ రమణ మహర్షి – మనిషికీ పశువుకీ తేడాని తెలిపే చిన్న ఆఛ్ఛాదన- కౌపీనం చాలునని తను జీవించి నిరూపించారు.
అడవిలో, ఆశ్రమంలో కందమూలాలు తిని తపస్సు చేసుకునే భరద్వాజ మహర్షి- శ్రీరాముడిని రాజ్యానికి ఆహ్వానించడానికి భరతుడు సైన్యంతో తరలి వచ్చినప్పుడు-అందరికీ మృష్టాన్న భోజనంతో విందుని చేశాడు. కందమూలాలు తిని బతికే బైరాగి చేసిన ఘనమయిన విందు ’భరద్వాజ విందు’గా పురాణాలలో శాశ్వతంగా నిలిచిపోయింది. కోరుకుంటే తను ప్రతీ రోజూ ఆ స్థాయిలో విందుని అనుభవించ వచ్చుకదా? ఆ అవసరం- ఆ పరిపక్వ దశలో ఆ ఋషికి అనవసరం. కాని దేశాన్ని పాలించే మహారాజుకీ, అయన పరివారానికీ అది మర్యాద.
అస్థి, అంతస్థు, అర్ధంలేని కీర్తి, సౌఖ్యం- అన్నీ పతనానికి దారితీస్తాయి. మార్లిన్ మన్రో దగ్గర్నుంచి నిన్న మొన్నటి మైకేల్ జాక్సన్ దాకా ఎన్నయినా ఉదాహరణలున్నాయి. అందుకే టాటాలూ, బిర్లాలూ గుడులు కట్టించీ, ట్రస్టులు నెలకొల్పీ ఎప్పటికప్పుడు తమ దృక్పధాన్ని సంస్కరించుకుంటూంటారు
.
చూపు బేధంలోనే ఆనందపు రహస్యం వుంది. కాలికి తొడుక్కునే లండన్ బూట్లలో కాదు. అమెరికాలో పీటర్ జి.పీటర్సన్ ఆనే వ్యాపారికి నడిమంత్రపు సిరి ఎత్తుకుని కోట్లు సంపాదించాడు. ఆయన ఈ మధ్య ప్రజా సేవకి బిలియన్ డాలర్ల ట్రస్టుని ఏర్పాటు చేశాడు. ఆయన ఎప్పుడూ ఆనందంగా,తృప్తిగా కనిపించే తన డ్రైవర్ని అడిగాడట:
“ఎప్పుడూ ఆడిటర్లతో, పన్నుల ధ్యాసతో, బాంకుల చెక్కుబుక్కులతో నేను సతమతమవుతూంటాను. నువ్వు ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావ”ని.
డ్రైవరు నవ్వి అన్నాడట:”మీకు లేనిది- ఒకదాన్ని నేను సమృద్ధిగా సంపాదించుకున్నాను సార్” ఆని.
“ఏమిటది?”
“ఇంకచాలు అనే ఆలోచనని” అన్నాడట.
ఆనందాన్నీ,తృప్తినీ, సుఖాన్నీ- ఆలోచనలో ఎంత గొప్పస్థాయిలోనయినా నిలుపుకోవచ్చు.
దానికి భగవాన్ రమణ మహర్షి, పీటర్సన్ డ్రైవరూ-
యిద్దరూ రెండు రకాలయిన ఉదాహరణలు.
( సేకరణ :-- గొల్లపూడి మారుతీరావు జీవన్ కాలమ్ నుండి )
Source - Whatsapp Message

No comments:
Post a Comment