Friday, September 18, 2020

నేను-మనం

నేను-మనం
విక్రమపురి ని పరిపాలించే ప్రతాపవర్మ అత్యంత విలాసవంతమయిన జీవితము గడుపుతూ,ఇంద్రియ సుఖములయందు అత్యంత ఆసక్తి గల వాడై ఉండేవాడు . ..అనేక ఇతర వ్యసనాలకు బానిసగా జీవిస్తూ ఉండేవాడు .... “మనిషి జన్మ లభించటం అంత సులభమైన విషయం కాదు.అందువల్ల వీలైనంత లౌకిక సుఖాలను ,ఇంద్రియ సుఖాలను అనుభవించే ప్రయత్నం చెయ్యాలి.  జీవితంలోని ఆనందాలన్నీ పూర్తిగా అనుభవించేవిధంగా కాలాన్ని గడపాలి “అని అందరికి చెబుతూ ఉండేవాడు.

ఆ రాజ్యం మంత్రి గారు చాలా  తెలివైన వ్యక్తి.

రాజు యొక్క ఈ విలాస జీవితం ,అతని అలోచనా విధానం మంత్రికి చాలా బాధ కలిగిస్తూ ఉండేది.
అవకాశం దొరికినప్పుడల్లా రాజుకి తగిన సలహా ఇవ్వటానికి మంత్రి ప్రయత్నిస్తూ ఉండేవాడు .కానీ రాజు యే మాత్రం అర్ధం చేసుకునే వాడు కాదు .మంత్రి గారి సలహా వినే వాడు కాదు ..

అతని పరిపాలనలో ప్రజలు భయం తొ బ్రతుకుతూ ఉండేవారు.
ఎవ్వరూ కూడా అతన్ని ఎదిరించే సాహసం చేసే వారు కాదు.

ఒక రోజున మంత్రి చేసిన ఒక పని రాజుకి  చాలా ఆనందాన్ని కలిగించింది .అందుకు బహుమానంగా రాజు మంత్రికి ఒక ఖరీదైన ,విలువైన శాలువాను బహూకరించాడు ...కాసేపటికి మంత్రి ,రాజు గారు ఇచ్చిన ఖరీదైన శాలువా తో ముక్కు తుడుచుకోవటం గమనించాడు ...

మహారాజు వెంటనే మంత్రితో.. .”నేను బహూకరించిన ఖరీదైన శాలువా తో ముక్కు చీదుకోవటానికి నీకు ఎంత ధైర్యం ?” అని ప్రశ్నించాడు .మంత్రి దానికి ఎంతో గౌరవంగా “ప్రభూ !మీరు నేర్పిన విధంగానే నేను ప్రవర్తించాను!” అన్నాడు .
“అగౌరవంగా ప్రవర్తించమని నేను నెర్పించానా ? యే విధంగా ?”,అని అడిగాడు మహా రాజు
“ఈ శాలువా కంటే ఎంతో విలువైన జీవితాన్ని ,
భగవంతుడు మీకు ప్రసాదించాడు .అంత విలువైన జీవితాన్ని మీరు యే మాత్రం గౌరవం,నీతి నియమాలు లేకుండా  ఇంద్రియ సుఖాలకోసం  ,లౌకిక మైన ఆనందాల కోసం  ఉపయెగించటం నాకు  ఇలా శాలువాను దుర్వినియోగం చేయటం నేర్పింది.. ” అని ఎంతో వినయంగా బదులు ఇచాడు మంత్రి.
ఈ విధంగా మంత్రి గారి యుక్తి ఫలంచింది!

రాజు తన తప్పుని గ్రహించాడు  .ఆ క్షణం నించి మహారాజు జీవనవిధానం ,రాజ్యపాలనా విధానం పూర్తిగా మంచిగా మారిపోయింది.

బుద్దుడికి రావి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్లు,
యోగి వేమన కు కొండ గుహలో జ్ఞానోదయం అయినట్లు,

మనకు కూడా ఏదో ఒక రోజు, ఏక్కడో ఓక చోట, ఏదో ఓకవిదంగా జ్ఞానోదయం ప్రసాదించమని భగవంతున్ని కోరుకుందాం.

ఇంత అపురూపమైన, అమూల్యమైన మానవజన్మను వృధాగా, నిస్ ప్రయోజనంగా ముగించకుండా,
కనీసం మనకు చేతనయినంత మంచిని చేద్దాం.
సమాజ హితానికి పాటుపడదాం.

పనిగట్టుకొని మంచి పని చేయకపోయినా పరవాలేదు కానీ, దురుద్దేశంతో చెడు పని మాత్రం చేయకూడదు.

అది మానవాళి మనుగడకు అంత మంచిది కాదు.

చరిత్రలో మన లాంటి వాళ్ళు చాలామంది వచ్చారు, పోయారు అలా కాకుండా కనీసం మనల్ని మన చుట్టూ ఉన్న వారైనా గుర్తుంచుకునే విధంగా ప్రవర్తిదిద్దాం.

నేను-నాది అనేది స్వార్థం మనది-మనము అనేది ప్రజాహితం.

నేను అనుకుంటే నిన్ను నీవు మాత్రమే గుర్తు పెట్టుకుంటావు మనము అనుకుంటే మనల్ని
సమాజం గుర్తు పెట్టుకుంటుంది మరియు గౌరవిస్తుంది.

మనకు ఏమి కావాలి అన్నది
మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది.

సర్వేజనా సుఖినోభవంతు.


Source - Whatsapp Message

No comments:

Post a Comment