Saturday, April 30, 2022

🌹 ఒక బౌద్ధ మహిళ (పటాసార) కథ 🌹

🌹 ఒక బౌద్ధ మహిళ కథ 🌹

🥀'సకల దుఃఖాలకూ హేతువు కోరికే!' అని బుద్ధభగవానుడు నొక్కివక్కాణించాడు. లోకం దుఃఖభూయిష్టమైనదని అరచేతిలో ఉసిరికాయలా కొట్టొచ్చినట్టు చూపించాడు. సమస్త దుఃఖాల నుండి విడివడటం కోసమూ, నిర్వాణం అని బౌద్ధం సూచించే ఉన్నతోన్నత స్థితి అయిన పరమానందమైన ముక్త స్థితి పొందడానికోసమూ పురుషులను స్త్రీలను వ్యత్యాసం లేకుండా సన్న్యాస జీవితాన్ని స్వీకరింపజేశాడు. బుద్ధుడు స్థాపించిన సన్న్యాస సంఘం ప్రపంచ చరిత్రలో సాటిలేనిదిగా భాసించింది.

🥀బుద్ధుని అనుగ్రహం పొందిన వేలాదిమంది జీవితంలో శ్రేయస్సును ప్రాప్తించుకోగలిగారు. వారిలో సన్న్యాస జీవనం స్వీకరించి, ఆరాధనీయులైన స్థాయిని చేరుకున్న మహిళలూ ఉన్నారు.

🥀బౌద్ధ భిక్షుణీలలో మహాత్ముల స్థాయిలో పరిగణించి నాడూ నేడూ ఆరాధింపబడుతున్న వారిలో పటాసార అనే మహిళ ఒకరు.

🥀పటాసార అంటే నిర్దుష్టమైన సత్ప్రవర్తన సంతరించుకొన్నదీ, కర్తవ్యాలను తు.చ. తప్పక నిర్వహించేదీ అని అర్థం చెప్పుకోవచ్చు. ఈ నామధేయం ఆమెకు సన్న్యాసాశ్రమం స్వీకరించిన తదుపరి కలిగింది. ఆమె పూర్వాశ్రమ నామధేయం తెలియరావడం లేదు.

🥀పూర్వం శ్రావస్తి అనే ఖ్యాతి గాంచిన నగరం ఒకటి ఉండేది. ఆ నగరంలోని ఒక సంపన్న కుటుంబంలో పటాసార జన్మించింది.

🥀పెరిగి పెద్దదైన పటాసార వివాహ వయస్కురాలయింది. అప్పుడు ఆమెకు తన తండ్రి వద్ద ఉద్యోగంలో ఉన్న ఒక యువకుడిపై మనస్సు కలిగింది.

🥀ఈ విషయం ఆమె తండ్రికి తెలియదు. ఆయన తన అంతస్తుకు, హోదాకు తగిన కుటుంబంలోని వరుణ్ణి నిశ్చయించి కుమార్తె వివాహం వైభవంగా జరిపించాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

🥀ఈ స్థితిలో ఏం చెయ్యాలో పాలుబోక పటాసార, ఆమె మనసిచ్చిన ఆ యువకుడు శ్రావస్తి నగరం నుండి పారిపోవాలని నిశ్చయించుకున్నారు. ఆ ప్రకారం ఒకరోజు ఇద్దరూ రహస్యంగా నగరం వదలి దూరంలో ఉన్న ఒక గ్రామం చేరుకున్నారు. అక్కడ భార్యాభర్తలుగా జీవితం ప్రారంభించారు.

🥀కొంతకాలం గడిచింది. పటాసార గర్భవతి అయింది. ఆమెకు పుట్టింటికి వెళ్ళాలని ఎంతో ఉబలాటం కలిగింది. అందుచేత ఆమె, "మొదటి బిడ్డ పుట్టబోయే ఈ సమయంలో నేను పుట్టింట్లో ఉండాలనుకొంటున్నాను” అని భర్తకు చెప్పింది. కాని ఆమె భర్త అందుకు ఒప్పుకోలేదు. కాబట్టి మొదటి బిడ్డ గ్రామంలోనే జన్మించింది.

🥀పటాసార రెండవసారి గర్భం ధరించింది. అప్పుడూ ఆమె పుట్టింటికి వెళ్ళాలని ఎంతో ఆశపడింది. మునుపటి మాదిరే ఆమె భర్త అందుకు ఒప్పుకోలేదు. కాని ఈసారి పుట్టింటికి వెళ్ళి తీరాలని పటాసార మొండిపట్టు పట్టింది. చివరికి భర్త అందుకు సమ్మతించాడు.

🥀ఇద్దరూ గ్రామం నుండి శ్రావస్తి నగరానికి బయలుదేరారు. కాని పుట్టింటిని చేరుకోవడానికి ముందే, మధ్య దారిలోనే పటాసారు. ప్రసవించింది.

🥀ఆ స్థితిలో తల్లికీ, పుట్టిన బిడ్డకూ రక్షణగా ఒక గుడిసె నిర్మింపదలచాడు భర్త. గుడిసె నిర్మాణానికి కావలసిన చెట్టుచేమలు, తీగలు మొదలైనవి సేకరించడానికి పక్కనే ఉన్న ఒక దట్టమైన అడవిలోకి వెళ్ళాడు. దురదృష్టవశాత్తు అడవిలో అతణ్ణి ఒక తాచుపాము కాటువేసింది. క్షణాల్లో అతడు విలవిల తన్నుకుంటూ నేలకొరిగి ప్రాణాలు విడిచాడు.

🥀ప్రసవంతో నీరసించి ఉన్న పటాసార భర్త రాక కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురుచూడసాగింది. అడవిలోకి వెళ్ళిన భర్త ఎంతసేపటికీ తిరిగి రాకపోయేసరికి పటాసారకు దిగులు, భయం పట్టుకున్నాయి. కాచుకొని కాచుకొని ఇక లాభం లేదనుకొని స్వయంగా తానే వెళ్ళి వెతకడానికి ఆమె ఉద్యుక్తురాలయింది.

🥀నడిచే శక్తి కూడా అప్పుడు ఆమెలో లేదు. అయినప్పటికీ మెల్లగా లేచి భర్త కోసం అడవిలో వెదకసాగింది. కాసేపటికల్లా భర్త విగతజీవుడై పడి ఉన్న దృశ్యం చూసింది! అంతే! లోకమే విరిగి తన తలమీద పడ్డప్పటికీ పటాసార అంత దిగ్భ్రాంతికి గురి అయ్యేది కాదు. పెద్ద ఆఘాతం! తన హృదయం వెయ్యి ప్రక్కలైనట్లు ఆమెకు అనిపించింది. ఇంతటి ఘోరం కలలో సైతం ఆమె ఎదురుచూసి ఉండదు.

🥀ఆ తరువాత పెద్ద బిడ్డను ఒక చేత పుచ్చుకొని, మరో చేత్తో శిశువును ఎత్తుకొని పటాసార పుట్టింటికి బయలుదేరింది.

🥀దారిలో ఒక ఏరు అడ్డం వచ్చింది. బిడ్డలిద్దరినీ చేతుల్లోకి తీసుకొని ఏకకాలంలో ఏటిని దాటడం సాధ్యం కాదని ఆమె గ్రహించింది. కాబట్టి ఆమె పెద్ద బిడ్డను తీరం వద్దనే నిలబెట్టి, శిశువుతో ఆ వైపు తీరాన్ని చేరుకున్నది. అక్కడ ఒక బండరాయి మీద కొన్ని ఆకులను పరిచి దానిపై శిశువును పరుండబెట్టి, మళ్ళీ ఆకులతో శిశువును కప్పి ఉంచింది.

🥀తదుపరి పెద్ద బిడ్డను తోడ్కొని రావడానికి ఆ వైపు తీరానికి బయలుదేరింది. ఏటిలో సగం దూరం దాటినప్పుడు, ఒక పెద్ద రాబందు శిశువు వైపుగా వేగంగా ఎగురుకుంటూ పోవడం ఆమె చూసింది.

🥀పటాసార మనస్సు తల్లడిల్లిపోయింది. ఆమె రాబందును తరిమికొట్టడానికి రెండు చేతులను పైకెత్తి అదలిస్తున్నట్లు ఊపసాగింది. ఆమె సైగను తీరం ఒడ్డున నిలబడి ఉన్న పెద్ద బిడ్డ చూసింది. తనను తల్లి వెంటనే రమ్మని పిలుస్తున్నదని భావించి నీళ్ళలోకి దిగింది! పటాసార ఏ బిడ్డనూ రక్షించే స్థితిలో సమీపంలో లేదు! ఏకకాలంలో శిశువును రాబందు ఎత్తుకుపోవడమూ, పెద్ద బిడ్డ ఏటి వెల్లువలో కొట్టుకుపోవడమూ ఆ అభాగ్యురాలి కళ్ళ ముందే జరిగిపోయింది.

🥀భర్త అకాల మరణం, బిడ్డల దుర్మరణంతో ఆమె కుప్పకూలిపోయింది. దిక్కు తోచని స్థితిలో, ఏకాకిగా మిగిలిపోయిన పటాసార శ్రావస్తి నగరంలోని తండ్రిగారి ఇంటికి కాళ్ళీడ్చుకుంటూ బయలుదేరింది. కాని క్రితం రోజు కురిసిన కుంభవృష్టి కారణంగా ఆమె పుట్టి, పెరిగిన పాత భవనం కూలి, నేలమట్టమైపోయి ఉంది. ఇల్లు కూలి, నేలమట్టమైనప్పుడు ఆమె తల్లిదండ్రులు, సోదరుడు మరణించారనే విషయం ఊరి జనం ఆమెకు తెలిపారు.

🥀పటాసాకు తల గిర్రున తిరిగిపోయింది. లోకం యావత్తు గిరగిరా తిరిగిపోతున్నట్లుగా ఆమెకు అనిపించింది. పిచ్చిపట్టినట్లయింది; అవును నిజంగానే ఆమెకు పిచ్చి పట్టింది. ఇప్పుడు ఆమె వీధుల్లో తిరిగే పిచ్చి అయిపోయింది.

🥀ఒక కాలఘట్టంలో మందీమార్బలంతో అడుగులకు మడుగులు ఒత్తించుకుంటూ వైభవంగా జీవితం గడిపిన ఆ కులకాంత, ఇప్పుడు పేలికలైన మాసిపోయిన దుస్తులతో వీధుల్లో తిరుగాడుతున్నది.

🥀ఇలా ఉండగా ఒక రోజు, ఆమె పూర్వజన్మ సుకృత ఫలంగా బుద్ధభగవానుని కృప ఆమెపై వర్షించింది.

🥀ఒకసారి బుద్ధుడు శోకతప్తులైన జనులను ఉద్దేశించి ధర్మోపదేశం చేస్తున్నాడు. అప్పుడు కాకతాళీయంగా ఆయన ఈ పిచ్చిదాన్ని చూశాడు. ఆ కరుణామూర్తి ఆమెకు చిత్తస్వాస్థ్యం కలిగేలా అనుగ్రహించాడు.

🥀అంతే! మతిస్తిమితం పొందడంతో ఆమె ప్రవర్తనలో, వస్త్రధారణలో మార్పు ఏర్పడింది. తరువాత ఆమె బుద్ధుని ఎదుటకు వచ్చి ఆయనకు ప్రణామం చేసింది. తాను గతంలో అనుభవించిన అష్టకష్టాలను పూసగుచ్చినట్లు ఆయనకు వివరించి చెప్పింది. కరుణా సింధువైన బుద్ధదేవుడు ఆమెను తపోమయ జీవితానికి నివేదనగా సమర్పించాలని భావించాడు. ఆయన ఉట్టిపడే కారుణ్యంతో, "తల్లీ! ఈ విధంగా 'నా అన్నవారినందరినీ కోల్పోయి నువ్వు కన్నీరుమున్నీరవడం, నీ గత జన్మలలో ఎన్నెన్నోసార్లు తటస్థించింది! అమ్మా, నువ్వు స్రవించిన కన్నీటిని చేరుస్తే నాలుగు సముద్రాలు నిండుతాయి. ఒకరి దుఃఖాన్ని ఏ బంధువో, కుమారుడో లేదా కుమార్తె అయినా సరే తీర్చడం అసాధ్యం.

🥀దుఃఖాలు లేనిది, బంధాలు లేనిది, జన్మలు లేనిది, అత్యున్నతమైనది - నిర్వాణంగా పేరుగాంచిన స్థితే అది" అంటూ జీవితం గురించిన నగ్నసత్యాలను తెలియజేశాడు.

🥀అంతులేని దుఃఖాలు, చేసిన పాపాలు, దుష్కర్మలు ఆత్మజ్ఞాని ఒక్క కడగంటి చూపు మాత్రాన పలాయనమౌతాయనటం పటాసార విషయంలో అక్షర సత్యమైంది. పటాసార మనస్సు స్పష్టతను సంతరించుకొంది. లౌకిక జీవితాన్ని ఉన్నదున్నట్లు చూడగలిగే పరిపక్వ స్థితిని ఆమె చేరుకోగలిగింది. తత్ఫలితంగా ఆమె భిక్షుణిగా బౌద్ధ సంఘంలో చేరి సన్న్యాస జీవితాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించింది.

🥀సన్న్యాస జీవిత కట్టుబాట్లను తు.చ. తప్పక పాటిస్తూ అనతికాలంలో ఆమె ప్రథమ శ్రేణికి చెందిన భిక్షుణిగా రాణించసాగింది. ఆమె అనేక దివ్యదర్శనాలను పొందింది; బౌద్ధ తత్త్వాలలో నిష్ణాతురాలుగా విరాజిల్లింది.

🥀ఆమె నిర్దుష్ట ధార్మిక వర్తన చూసీ, కర్తవ్యతా పరాయణతను బౌద్ధ సంఘం ఆమెకు పటాసార నామధేయాన్ని ప్రసాదించింది. గాంచీ ఆమె కఠోర తపోమయ జీవితాన్ని, ప్రతిభాపాటవాలను స్వయంగా బుద్ధభగవానుడే అనేక సమయాల్లో ప్రశంసించి మాట్లాడాడు.

🥀పటాసార నేతృత్వంలో ముప్పైమంది భిక్షుణీలు శిక్షణ పొంది ఉన్నత ఆధ్యాత్మిక స్థితులను పొందారు. తాను దైవసమానురాలై ఇతరులు సమున్నత స్థితిని చేరడానికి పాటుపడిన పటాసారకు బౌద్ధ సంఘ చరిత్రలో ఎన్నటికీ చెరిగిపోని కీర్తి లభించిందనటం నిర్వివాదాంశం.


🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒

సేకరణ

కథ పేరు: చీర కొని చూడు, రచన: లక్ష్మి చివుకుల

రచన: లక్ష్మి చివుకుల

కథ పేరు: చీర కొని చూడు

"అత్తయ్య గారూ ! ఎలా వున్నారూ"? ఆషాడమాసంలో పుట్టింటికి వెళ్లిన కొత్త కోడలు మంజూష అత్తగారికి ఫోన్ చేసి కుశలమడిగింది.

"నేను బావున్నానమ్మా! నువ్వెలా వున్నావు?"

"నేనూ బాగున్నానండీ! అత్తయ్య గారూ! మా అమ్మ నేనూ చీరలు కొనడానికి షాపింగ్ మాల్ కి వెళుతున్నామండీ! ఆషాడమాసం కదా చీరలకి డిస్కౌంట్ పెట్టారు. మీకు కూడా చీర కొందామను కుంటున్నాను. మీకు ఎలాంటి చీర కొనమంటారు ?"

"అలాగా! మంచిదమ్మా! నాకు షాపింగ్ కు వెళ్లే శ్రమ తగ్గించావు. నువ్వు అడిగావు కాబట్టి చెపుతున్నాను. చీర మీద నా అభిప్రాయాలు నా ఇష్టాఇష్టాలు చెపుతాను. దాన్ని బట్టి ఒక చీర సెలెక్ట్ చేయమ్మా.

అందరూ ఆ చీర చూసి ఆహా! ఓహో! అనాలి. ఏ షాప్ లో కొన్నారు ? 'ఏ కాలేజీలో చదువు తున్నారు' ? అనే లెవెల్ లో ఉండాలి.

చీర మరీ ఎక్కువ ఖరీదు వుండకూడదు. ఎందుకంటే, అంత ఖరీదైన చీర కట్టుకుని బిగుసుకుపోయి, జీవితంలో మొట్ట మొదటి సారి ఫొటో తీయించుకునే వాళ్ల లాగా, ఎక్కడ కూర్చుంటే ఏమి అంటుకుంటుందో అనే భయ పడేలా వుండకూడదు.

బెనారస్ చీర, కంచి పట్టు చీర బరువుగా వుంటాయి. అలాంటి చీరలు కొనకమ్మా! జిమ్ కి వెళ్ళి బరువులు ఎత్తినట్టుగా రోజంతా అలా బరువైన చీరలు మోయలేనమ్మా.

కాంజీవరం, కుబేర పట్టు చీరలకు పెద్ద పెద్ద బోర్డర్లు ఉంటాయి. అలాంటివి కొనకమ్మా! ఈ వయసులో పెద్ద బోర్డర్ ఉన్న చీర కట్టుకుంటే చూసే వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉండి బావుండదు కదమ్మా!? పైగా దిష్టి తగిలినా తగలచ్చు. అంటే చీరకు కాదమ్మా..., నాకూ....

ఈ మధ్య కుప్పడం చీరలని వస్తున్నాయట. అసలు అదేం పేరమ్మా? అప్పడం లాగా! వద్దమ్మా వద్దు అలాంటి చీరల జోలికి పోనే పోకు.

ఇక పోతే.... చీర అస్సలు పలచగా వుండకూడదు. లోపల పెటీకోట్ రంగు కూడా అసలు ఎవరికీ కనిపించకూడదు. మా చిన్నతనంలో చీర కొంచెం పలుచగా వుంటే చాలు.... దేవతా వస్త్రాలు అంటూ ఎగతాళి చేసే వారు. మరి నాలాంటి వాళ్ళు ఈ వయసులో ఇలా పల్చటి చీరలు కడితే చూడడానికి బావుండదు కదమ్మా!

అన్నట్టు మరచి పోయా... చీర అస్సలు గుచ్చుకో కూడదు. లంబాడీ వాళ్ళలాగా చీరకి అద్దాలు గానీ, పూసలు గానీ, అలాగే మెరిసి పోయే చెమ్కీలు గానీ, ఎంబ్రాయిడరీ వర్క్ గానీ అస్సలు ఉండకూడదు. మే నెలలో మిట్ట మధ్యాహ్నం సూర్య భగవానుడి ఎండ లాగా చీర కట్టుకుంటే చెమటలు పట్టి వళ్ళంతా చిర చిర లాడుతూ చిరాగ్గా వుండకూడదు.

ఆర్గంజా చీర కానీ ఆర్గండీ చీర గానీ నెట్ చీర గానీ కోరా చీర గానీ నాకు అస్సలు నచ్చనే నచ్చవు.
తలబిరుసు తనంతో ఎవరి మాట లెక్క చేయని వాళ్లలా అవి పొగరుగా నిలబడి వుంటాయి ఒక పట్టాన లొంగవు.

అన్నట్టు కోడలు పిల్లా! షిఫాన్, జార్జెట్, టిష్యూ, సాటిన్ మోడల్ లో ఎలాంటి చీరా కొనకమ్మా! అప్పుడప్పుడే బుడిబుడి నడకలు నేర్చుకుంటున్న చిన్న పిల్లలని ఎవరైనా ఎత్తుకుంటే క్రిందకు ఎలా జారిపోతూ వుంటారో, అలాగే సిల్కీగా వున్న చీర కట్టుకుంటూ వుంటే చీర కుచ్చిళ్ళు జారిపోతూ వుంటాయి అలాంటి జారిపోతూ వుండే చీరలు కొనకమ్మా.

చీర రఫ్ గా మొరటుగా గరుక్కాయితంలా గరగర లాడుతూ వుండకూడదు. సినిమాలు, టీవీ సీరియల్స్ లో ఉండే ఆడ విలన్ లా కనిపిస్తాను. అంత మోటుతనం రఫ్ నెస్ నేను క(త)ట్టుకోలేను.

చికెన్ వర్క్ చేసిన లక్నోచీర సంగతైతే నువు మర్చి పోవడమే మంచిది. అవి అస్సలు వద్దమ్మా! ఎందుకంటే, చీరకి అగరబత్తి కాల్చి కన్నాలు పెట్టినట్టుగా కనిపిస్తుంది.

చీర మీద పెద్ద పెద్ద పూలు ఉండకుండా చూడు. మనం పూలతోటలో నిలబడితే బావుంటుంది గానీ మనమే పూలతోటలా కనిపించకూడదు కదా.

చీర మరీ డార్క్ కలర్స్ లో వుండకుండా చూసుకో. మనం కట్టుకున్న చీరని చూసి ఎదుటి వారు వాంతి చేసుకునేలా వుండకూడదు కదమ్మా.

చీర మరీ ప్లెయిన్ కలర్ ఉండకుండా చూడు. మరీ స్కూల్ యూనిఫామ్ లాగ వుంటుంది.

చీర మరీ చిన్నగా ఉండకూడదు. చీర కడితే కుచ్చీళ్ళు ఎక్కువ రావాలి, అలాగే పమిట కొంగు కూడా మోకాళ్ళు దాటేంత పెద్దగా రావాలి.

నైలాన్, క్రేప్ చీర అయితే ఒకోసారి వంటికి చుట్టబెట్టుకు పోతుంది. అడుగు ముందుకు వేయడానికి రాదు. కాళ్ళకి అడ్డంపడి ముందుకు పడి ముఖం పగిలే ప్రమాదం ఉంటుందమ్మా...వద్దు మ్మా వద్దు.

బాందినీ చీర ఊసే వద్దు. పాత గుడ్డలా, మాసికలు పట్టినట్టు ముడతలు పడి ముడుచుకు పోయి ఉంటుంది..

చీర ముడతలు పడకుండా, పదే పదే చీరకి గంజి పెట్టక్కర్లేకుండా, చీర ఐరన్ చేయక పోయినా కట్టుకునేలా ఉండాలి ఇస్త్రీ ఖర్చు కలిసొచ్చేలా.

చీర మరీ ఫేన్సీగా వుండకూడదు. గాజులకీ, మెడలో గొలుసులకీ, కాలి పట్టీలకీ తగులుకొని దారం పోగులు రాకుండా వుండేలా చూడమ్మా!.

కాటన్ చీరలు మాత్రం అసలు కొనకమ్మా! వాటికి గంజి పెట్టడం ఐరన్ చేయడం నా వల్ల కాదు. వాటిని మెయింటైన్ చేయలేను. చీర కట్టుకున్న వెంటనే ఎలక్షన్ లో నిలబడ్డ అభ్యర్థి లాగ చాలా ఠీవిగా నిలబడి వుంటుంది. గంట గడిచాక డిపాజిట్ కోల్పోయిన అభ్యర్థి లాగ డీలా పడిపోతుంది.

మరీ లేత రంగు చీర కొనకమ్మా! (మరక మంచిదే అది టి.వి.లో ప్రకటన వరకే) దాని మీద మరకలు చాలా క్లియర్ గా కనిపిస్తాయి. ఉతికితే ఒక పట్టాన మరకలు పోవు.

కలంకారీ ప్రింట్ చీర వద్దు. ఎందుకంటే అమ్మవారి ఫేస్ తో, బుద్ధుడు ఫేస్ తో, దేవుడి ఫేస్ తో వున్న చీర కట్టుకుంటే ఆ బొమ్మ కుచ్చీళ్ళు వున్న చోట కాళ్ళకి తగులుతూ ఉంటే దేవుడిని తన్నుతున్న ఫీలింగ్ తన్నుకొస్తుంది.. అది చాలా తప్పు అనిపిస్తుంది. అందుకని కలంకారీ గానీ, దేవుడి బొమ్మలతో వున్న ఏ చీరలు కొనకమ్మా!

చీరకి అడ్డ గళ్ళు వుంటే మాత్రం కొనకమ్మా! మరీ పొట్టిగా లావుగా కనిపిస్తాను.

అలాగే వెంకటగిరి చీర గానీ, ఖాదీలో గానీ, గుంటూరు నేత చీర గానీ అసలు ఎటువంటి నేత చీర గానీ కొనకమ్మా! మరీ వయసులో పెద్ద దానిలా కనిపిస్తానని మీ మామగారు అస్సలు కట్టనివ్వరు.

చీర కొంటే డ్రై వాష్ కి డబ్బులు పోసే అవసరం లేకుండా ఉండాలి.

అన్నట్టు మంజూ! నీతో అతి ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను.

చీరలో వాళ్లు ఎటాచ్ చేసిన జాకెట్ ముక్క కట్టు చెంగు వైపు వుండాలి. పమిట చెంగు వైపు వుండ కుండా చూసుకో.

ఎందుకంటే నేనూ చీరలో ఇచ్చిన జాకెట్ ముక్క కట్ చేయకుండా విడిగా మేచింగ్ బ్లౌజ్ పీస్ తీసుకుని కుట్టించు కుంటాను. దాని వలన చీర నిడివి పెరిగి ఎక్కువ కుచ్చిళ్ళు వస్తాయి. అందుకని చీర రన్నింగులోనే జాకెట్ పీస్ కూడా వుండాలి.

అలా లేదనుకో నేను మళ్లీ దానిని కట్ చేసి కట్టు చెంగు దగ్గర అతుకు పెట్టి కుట్టించు కోవాలి. అలా చేస్తే మళ్లీ అది అతుకుల చీరలా అవుతుంది. 'అతుకుల చీర కట్టుకోకూడదు' అని మా అమ్మ చెప్పేది.

అర్థం..... అవుతోందా? మంజూ! అయినా నాదేముందమ్మా నేను షాపింగ్ కి వెళ్ళక్కర లేకుండా నేను ఇప్పుడు చెప్పినట్టుగా నువ్వే ఒక మంచి చీర సెలెక్ట్ చేసి కొనేసేయి....

మంజూ! వింటున్నావా?.... నేను చెప్పింది అర్ధం అయిందా!?

ఎంతసేపూ నేను మాట్లాడడమే కానీ నువ్వు ఏమీ మాట్లాడడం లేదు. హలో! హలో! నేను చెప్పింది విన్నావా?...

ఏమి కోడలో ఏమో!? "ఫోన్ పెట్టేస్తున్నాను అత్తయ్యా" అని చెప్పకుండానే మర్యాద లేకుండా ఫోన్ కట్ చేసింది.

అప్పుడే వియ్యపు రాలి నుండి ఫోన్ వచ్చింది...

"వదిన గారూ! ఇప్పటివరకూ మీ కోడలితో మీరేం మాట్లాడారో ఏమి షాకింగ్ న్యూస్ చెప్పారో గానీ మంజూ ఇక్కడ స్పృహ తప్పి పడిపోయింది.

అక్కడ మీ ఇంట్లో వాళ్ళు మీ చుట్టు పక్కల ఉన్న వాళ్ళు అందరూ బాగానే వున్నారుగా?" ఆదుర్దాగా అడిగింది వియ్యపురాలు....

## ------------ ##

సేకరణ

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

అద్దం మన ముఖం పై మచ్చను చూపించేటప్పుడు మనం అద్దాన్ని పగలు గొట్టం,మన ముఖాన్నే శుభ్రం చేసు కుంటాం...

అదేవిధంగా మన లోపాలు చెప్పే వారిపై కోపం చూపించే బదులు,మన లోపాలను దూరం చేసుకోవాలి కాబాట్టి ఈ రోజు నుంచి నీలోని కోపాన్ని వీడి మనం

మన లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు పోయిన రోజే నిన్ను విజయం వరించగలదు..._

వర్షం కురిసి వెరిసినా తర్వాతే ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది

జీవితం కూడా అంతే

సమస్యలు కష్టాలు దాటాకే జీవితం సంతోషంగా సాగుతుంది

ఎంత తగ్గితే అంత ఎదుగుతావు
ఎంత భరిస్తే అంత బాగుపడతావు
ఎంత ఓర్చుకుంటే
అంత నేర్చుకుంటావు

ఎవరికి నీ విలువ అర్థం కాదో
వాళ్ళని పట్టించుకోకు
ఎవరు నీ విలువను గౌరవిస్తారో
వాళ్ళను అశ్రద్ధ చేయకు

శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏

సేకరణ

నేటి జీవిత సత్యం.

నేటి జీవిత సత్యం.

మన జీవన మార్గంలో నడిచే దారి మంచిదే అయితే .... భగవంతుడు మన జీవితాన్ని పూల బాట గా మారుస్తాడు . తినడానికి తిండి లేని స్థాయి నుండి తినడానికి సమయం లేని స్థాయికి ఎదగడం ఎంత గొప్పో ... అంతకంటే మనం మనశ్శాంతి గా తింటూ ఇంకొకరికి మనస్ఫూర్తిగా పెట్టే స్థాయికి ఎదగడం ఇంకా గొప్పగా వుంటుంది .

ఎవరికీ తల వంచనిది ఆత్మ గౌరవం , ఎవరి ముందు చేయి చాచనిది ఆత్మాభిమానం , ఎవరినీ కాదనలేనిది ఆత్మీయత . ఈ మూడు కలిసిన జీవితం ఆదర్శనీయం .

కిరణానికి చీకటి లేదు , సిరిమువ్వకి మౌనం లేదు , చిరునవ్వుకి శత్రుత్వం లేదు , మంచి స్నేహానికి అంతం లేదు .

మనిషిలో భక్తి పెరిగితే దేవుడి ని చూడాలనే కోరిక ఉంటుంది . మనిషిలో రాక్షసత్వం పెరిగితే దేవుడికే ఆ మనిషిని చూడాలన్న కోరిక ఉంటుంది .

దుష్ట శిక్షణ... శిష్ట రక్షణ... కోసం ఆ భగవంతుడు ఏదో రూపంలో మనలోనే ఉంటాడు అన్న సత్యాన్ని తెలుసుకున్న రోజు తప్పులు చేయకుండా మంచి మార్గాన్ని ఎంచుకుంటారు మన మానవ జాతి . ఇదే జీవిత సత్యం .

*శుభోదయం తో మానస సరోవరం

సేకరణ

స్పూర్తినిచ్చే అథ్బుత కథ. బిచ్చగాడి నుండి వ్యాపారిగా🤹‍♂️

స్పూర్తినిచ్చే అథ్బుత కథ. బిచ్చగాడి నుండి వ్యాపారిగా🤹‍♂️

ఒకసారి, ఒక బిచ్చగాడు రైలులో భిక్షాటన చేస్తున్నప్పుడు, చక్కగా దుస్తులు ధరించిన వ్యాపారి సూట్ మరియు బూట్లు ధరించడం గమనించాడు.
ఈ వ్యక్తి చాలా ధనవంతుడని, అతను భావించాడు. కాబట్టి నేను అతనిని అడిగితే అతను ఖచ్చితంగా దానం చేస్తాడు అనుకోని, అతను దగ్గరకు వెళ్లి ఆ వ్యక్తిని భిక్ష కోసం అడిగాడు.

ఆ వ్యక్తి బిచ్చగాడిని చూసి, "మీరు ఎల్లప్పుడూ అడుక్కుంటూ, ప్రజల నుంచి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా...., మరి మీరు ఎవరికైనా ఏదైనా తిరిగి ఇస్తున్నారా?" అని అడిగాడు ఆ వ్యక్తి.

ఆ బిచ్చగాడు, "సార్, నేను బిచ్చగాడిని, నేను ప్రజలను డబ్బును మాత్రమే అడగ గలను. కానీ నేను ఎవరికైనా,... ఏదైనా ఎలా ఇవ్వగలను చెప్పండి అన్నాడు.?"

ఆ మాట విన్న ఆ వ్యక్తి ఇలా జవాబిచ్చాడు బిక్షగాడితో , "మీరు ఎవరికీ ఏమీ ఇవ్వలేనప్పుడు, అప్పుడు మీరు కూడా ఇతరులను అడిగే హక్కు లేదు కదా . నేను ఒక వ్యాపారవేత్తని అంతేకాక లావాదేవీలను మాత్రమే నమ్ముతాను.మీరు నాకు ఇవ్వడానికి ఏదైనా ఉంటే, నేను కూడా చేయగలను మీకు ప్రతిఫలంగా ఏదైనా ఇవ్వడానికి" అనడం జరిగింది.

అప్పుడే, రైలు ఒక స్టేషన్‌కు రావడం జరిగింది. ఆ వ్యాపారవేత్త ట్రైన్ దిగి వెళ్లిపోయాడు.

బిచ్చగాడు ఆ వ్యాపార వేర్త చెప్పిన దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. అతని మాటలు ఎలాగోలా బిచ్చగాడి హృదయాన్ని చేరుకున్నాయి.

ప్రతిఫలంగా నేను ఎవరికీ ఏమీ ఇవ్వలేనందున నేను భిక్షలో ఎక్కువ డబ్బు పొందలేను అని అనుకొంటూ... ఆలోచించడం మొదలుపెట్టాడు. కానీ నేను బిచ్చగాడిని, ఎవరికైనా ఇవ్వడానికి ఏమీ నా దగ్గర విలువైనది లేదు కదా.....!!.
అయినా ఎంతసేపు నేను ఇతరులకు ఏమీ ఇవ్వకుండా..... ప్రజలను దానం అడుగుతూనే ఉండడం ఏమి బాగా లేదు . అని లోతుగా ఆలోచించిన తరువాత, భిక్షగాడు దానం అడిగే దాని కన్నా ముందు ఏదైనా తన వద్ద వుంటే,అప్పుడు ఆ దానం చేసిన వ్యక్తికి ప్రతిఫలంగా అది తిరిగి ఇవ్వాలనినిర్ణయించుకున్నాడు.

కానీ ఇప్పుడు వున్న ప్రశ్న ఏమిటంటే, అతను భిక్షకు బదులుగా ఇతరులకు ఏమి ఇవ్వగలడు? రోజంతా దీని గురించే ఆలోచిస్తూ గడిచింది. కానీ అతని ప్రశ్నకు సమాధానం దొరకలేదు.

మరుసటి రోజు అతను స్టేషన్ దగ్గర కూర్చున్నప్పుడు, అతని కళ్ళు స్టేషన్ చుట్టూ ఉన్న మొక్కలపై వికసించిన కొన్ని అందమైన పువ్వుల మీద పడ్డాయి. అతనికి ఒక ఆలోచన వచ్చి, వాళ్ళు చేసే దానానికి బదులుగా ప్రజలకు కొన్ని పువ్వులు ఎందుకు ఇవ్వకూడదు అని అనుకొన్నాడు.

అతనికి ఈ ఆలోచన నచ్చి.....వెంటనే అక్కడ నుండి కొన్ని పువ్వులు తెచ్చుకున్నాడు. భిక్షాటన చేయడానికి రైలు ఎక్కాడు.

ఎవరైనా అతనికి భిక్ష ఇచ్చినప్పుడు, అతను వారికి ప్రతిగా కొన్ని పువ్వులు ఇచ్చేవాడు. ప్రజలు ఆ పువ్వులను తమతో సంతోషంగా ఉంచుకునేవారు.

ఇప్పుడు భిక్షగాడు ప్రతిరోజూ కొన్ని పువ్వులు తెచ్చుకుని, భిక్షకు ప్రతిఫలంగా ఆ పువ్వులను ప్రజలకు పంచుతూ ఉండేవాడు.
కొద్ది రోజుల్లోనే అతను చాలా మంది తనకు భిక్ష పెట్టడం మొదలు పెట్టడాన్ని అతడు గ్రహించాడు. అతను స్టేషన్ దగ్గర ఉన్న పూలన్నింటినీ తెంపేవాడు. అతనికి పువ్వులు ఉన్నంత వరకు, చాలామంది అతనికి భిక్ష పెట్టేవారు. కానీ అతనితో ఎక్కువ పువ్వులు లేనప్పుడు, అతనికి పెద్దగా భిక్ష వచ్చేది కాదు . ఇలా ప్రతిరోజూ కొనసాగుతూ ఉండేది.

ఒక రోజు అతను భిక్షాటన చేస్తున్నప్పుడు, అదే వ్యాపారవేత్త రైలులో కూర్చుని ఉండడం చూశాడు, అతని కారణంగా అతను పువ్వులు పంపిణీ చేయడానికి ప్రేరణ పొందాడు.

భిక్షగాడు వెంటనే అతని దగ్గరకు వెళ్లి , "ఈ రోజు మీరు ఇచ్చే భిక్షకు బదులుగా కొన్ని పువ్వులు నా దగ్గర ఉన్నాయి అవి మీకు ఇస్తాను " అన్నాడు.
అప్పుడా వ్యాపారవేర్త అతనికి కొంత డబ్బు ఇవ్వడంతో,ఆ బిచ్చగాడు అతనికి ప్రతిగా కొన్ని పువ్వులు ఇచ్చాడు. ఆ వ్యాపారవేర్తకు బిక్షగాడి ఆలోచన బాగా నచ్చింది. మరియు బాగా ఆకట్టుకున్నాడు.

అతను, "వావ్! ఈ రోజు మీరు కూడా నాలాగే వ్యాపారవేత్తగా మారారు అని అతన్ని అభినందించి." బిచ్చగాడి నుండి పువ్వులు తీసుకొని, అతను ప్రక్క స్టేషన్‌లో దిగిపోయాడు.

మళ్ళీ మరోసారి, ఆ వ్యాపారవేర్త మాటలు బిచ్చగాడి హృదయంలోకి చేరుకున్నాయి. అతను ఆ వ్యక్తి చెప్పిన దాని గురించి పదే పదే ఆలోచిస్తూ సంతోషంగా ఉండటం ప్రారంభించాడు.

అతని కళ్ళు ఇప్పుడు ప్రకాశించటం ప్రారంభించాయి, అతను ఇప్పుడు తన జీవితాన్ని మార్చుకోగల విజయానికి బాటని కనుకొన్నాను అని అతను భావించాడు.

అతను వెంటనే రైలు నుండి దిగి ఉత్సాహంగా ఆకాశం వైపు చూస్తూ.... చాలా బిగ్గర గొంతుతో ఇలా అన్నాడు, “నేను ఇకపై బిచ్చగాడిని కాదు, నేను ఇప్పుడు వ్యాపారిని, నేను కూడా ఆ పెద్దమనిషిలా పెద్ద వ్యాపారిగా మారగలను, నేను కూడా ధనవంతుడిని కాగలను" అని అనడం జరిగింది.

అక్కడున్న ప్రజలు అతడిని చూసి, బహుశా ఈ బిచ్చగాడు పిచ్చివాడై ఉంటాడని అనుకున్నారు. మరుసటి రోజు నుండి ఆ బిచ్చగాడు మళ్లీ ఆ స్టేషన్‌లో కనిపించలేదు.

నాలుగు సంవత్సరాల తరువాత, సూట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఒకే స్టేషన్ నుండి ప్రయాణిస్తున్నారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నప్పుడు, అందులో ఒక వ్యక్తి చేతులు జోడించి మరొకరికి నమస్కరించి, "మీరు నన్ను గుర్తించారా?" అని అడిగాడు.

మరొక వ్యక్తి "లేదు! బహుశా మనం మొదటిసారి కలుస్తున్నామేమో." అని అనడం జరిగింది.

మొదటి వ్యక్తి మళ్లీ అన్నాడు, "సర్, నన్ను గుర్తు పట్టడానికి ప్రయత్నించండి, మనం మొదటిసారి కలుసుకోవడం కాదు...., ఇది మూడోసారి" అన్నాడు.

రెండవ వ్యక్తి, " అవునా....సరే, నాకు గుర్తులేదు. మనం ఎప్పుడు కలుసుకున్నాము?" అని అడగడం జరిగింది.

అప్పుడా మొదటి వ్యక్తి నవ్వి, "మనం ఇంతకు ముందు ఒకే రైలులో రెండుసార్లు కలుసుకున్నాము. నేను జీవితంలో ఏమి చేయాలో మొదటి సమావేశంలో మీరు చెప్పిన అదే బిచ్చగాడిని, రెండవ సమావేశంలో 'నేను నిజంగా బిజినెస్ మ్యాన్' అని మీరు నన్ను మెచ్చు కొన్నారు అది కూడా నేనే"......!!

"ఫలితంగా, ఈ రోజు నేను చాలా పెద్ద పూల వ్యాపారిని ఇప్పుడు.... అదే వ్యాపారానికి సంబంధించి నేను వేరే నగరానికి వెళ్తున్నాను."

"మొదటి సమావేశంలో మీరు నాకు ప్రకృతి నియమాన్ని చెప్పారు ... దాని ప్రకారం "మనం ఏదైనా ఇచ్చినప్పుడు మాత్రమే మనకు ఏదైనా లభిస్తుంది" అని.
ఈ లావాదేవీ నియమం నిజంగా పనిచేసింది. నేను దానిని బాగా అనుభూతి చెందాను, అంతకు మునుపు నేను ఎప్పుడూ.... నన్ను నేను బిచ్చగాడిగానే భావించుకొనే వాణ్ని , నేను దాని కంటే పైకి ఎదగాలని ఎప్పుడూ అనుకోలేదు.

కానీ..... నేను మిమ్మల్ని రెండోసారి కలిసినప్పుడు, నేను... ఒక వ్యాపారవేత్త అయ్యానని మీరు నాకు తెలియపరిచారు . మీకు ధన్యవాదాలు, ఆ రోజు నుండి, నా దృక్పథం మారిపోయింది. ఇప్పుడు నేను వ్యాపారవేత్తగా మారాను, నేను ఇకపై బిచ్చగాడిని కాదు. ”అని ఆ వ్యాపారవేర్తతో అనడం జరిగింది.

బిచ్చగాడు తనను తాను బిచ్చగాడిగా భావించినంత కాలం, అతను బిచ్చగాడుగానే ఉండేవాడు.మరియు తనను తాను వ్యాపారవేత్తగా భావించినప్పుడు, అతను ఒక వాపారవేర్తగా ఎదగడం జరిగింది.

*కాబట్టి మిత్రులారా! మీ గురించి మీరు తెలుసుకోండి.......బిచ్చగాడిగానే ఉండిపోతారా, వ్యాపారిగా, కోటీశ్వరునిగా అవుతారా. మీ గురించి మీరు తెలుసుకోండి. ఈ సంగమ యుగములో మీవద్ద అతి పెద్ద మరియు శుద్ధమైన అస్త్రం సంకల్పాలు. పితామహ పత్రీజీ ఇచ్చిన అనేక శక్తులు ఉపయోగించి భాగ్యవంతులు అవ్వండి. 👏

సేకరణ. మానస సరోవరం 👏

Friday, April 29, 2022

ఇది మనం సాధించిన పురోగతా ? లేక మనకు మనం తెచ్చుకున్న అధోగతా?

గతంలో సంసారం చీకట్లోనే జరిగేది , జీవితాలు వెలుగులో ఉండేవి , నేడు సంసారం వెలుగు లోకి వచ్చి జీవితాలు చీకట్లో మగ్గుతున్నాయి కప్పుకోవాల్సిన వాటిని చూపిస్తూ చూపించాల్సిన అందమైన ముఖాన్ని కప్పేస్తున్నారు నాడు కొందరికే మందు విందు అలవాటు ఉండేది. నేడు కొందరు మాత్రమే వీటికి దూరం నాడు కష్టమొస్తే కుటుంబంలోని పెద్దలు ధైర్యం చెప్పేవారు నేడు కొన్ని కుటుంబాలలో కలహాలకు పెద్దలే కారణం మవుతున్నారు నాడు తినడానికి శ్రమించి సంపాదించే వాళ్ళం నేడు కదల కుండా కూర్చుని సంపాదిస్తూ తిన్నది అరగడానికి వాకింగ్ చేస్తూ శ్రమిస్తున్నాం.

నాడు పండ్లు , పాలు తిని బలంగా బోలెడు మంది సంతానాన్ని కని పోషించారు , ఇప్పుడు సంసారం చేయడానికే మందులు మింగుతున్నారు ఇంక పిల్లలెక్కడ అందుకేగా అన్ని చోట్లా సంతాన సాఫల్యకేంద్రాలు గతంలో అందరూ హార్డవేర్ ఇంజనీర్లే మనసు మాత్రం సాఫ్టు ఇప్పుడు అంతా సాప్ట్ వేర్ ఇంజనీర్లే మనసు మాత్రం హార్డు ! అప్పుడు వైద్యుడు ఇల్లిల్లూ తిరిగి వైద్యం చేసేవాడు , అమృతాంజనానికే జబ్బులు తగ్గేవి! ఇప్పుడు తలకాయనొప్పికే ఇళ్ళమ్ముకునేంత ఖర్చు ఔతోంది ! నాడు దొంగలు నట్టింట్లో పడి దోచుకెళ్ళేవారు, నేడు దొంగలు దొరల్లాగా నెట్ఇంట్లో దోచేస్తున్నారు

ఒకప్పుడు చదువులేనోడు దొంగగా మారేవాడు గతిలేక . ఇప్పుడు దొంగతనాలు చేయడానికే కొత్త కోర్సులు చదువు తున్నారు సైబరు నేరగాళ్ళు అప్పుడు అప్పు చేయాలంటే తప్పు చేసినట్లు బాధపడే వాళ్ళం , నేడు క్రెడిటు కార్డు మీద అప్పుతో కొనుక్కోవడమే క్రెడిటు గా ఫీలౌతున్నాం , ఒకప్పుడు పాలు , పెరుగు అమ్మి, సొమ్ము చేయలేక తాగేవాళ్ళం. ఇప్పుడు రెడీమేడ్ చపాతీలు పొంగలి దాంట్లోకి కూరతో సహా అన్నిటిని కొనుక్కొచ్చుకొని తింటున్నాం...

చైనా నుండి ఒకనాడు పింగాణీ వస్తువు లొచ్చేవి. నేడు తినే కంచం నుంచి దాంట్లోకి ప్లాస్టిక్ బియ్యం తో సహా అన్ని అక్కడినుంచే , ఇది మనం సాధించిన పురోగతా ? లేక మనకు మనం తెచ్చుకున్న అధోగతా దయచేసి మీరే ఆలోచించండి

సేకరణ

Bhagvat Gita message with everyone, to know the meaning of life !!!

Bhagvat Gita message with everyone, to know the meaning of life !!!

A man died...

When he realized it, he saw God coming closer with a suitcase in his hand.

Dialogue between God and Dead Man:

God: Alright son, it’s time to go.

Man: So soon? I had a lot of plans...

God: I am sorry but, it’s time to go.

Man: What do you have in that suitcase?

God: Your belongings.

Man: My belongings? You mean my things... Clothes... money...

God: Those things were never yours, they belong to the Earth.

Man: Is it my memories?

God: No. They belong to Time.

Man: Is it my talent?

God: No. They belong to Circumstance.

Man: Is it my friends and family?

God: No son. They belong to the Path you travelled.

Man: Is it my wife and children?

God: No. they belong to your Heart.

Man: Then it must be my body?

God: No, No... It belongs to Dust.

Man: Then surely it must be my Soul!

God: You are sadly mistaken son. Your Soul belongs to me.

Man, with tears in his eyes and full of fear, took the suitcase from God's hand and opened it...

Empty...

Heartbroken and tears falling down his cheeks, he asks God...

Man: I never owned anything?

God: That’s right. You never owned anything.

Man: Then? What was mine?

God: Your MOMENTS.
Every moment you lived was yours.

Do Good in every moment
Think Good in every moment
Thank God for every moment

Life is just a Moment.

Live it...
Love it...
Enjoy it... It is the soul of BHAGVAT GITA

సేకరణ

SOME SOCIAL RULES THAT MAY HELP YOU

SOME SOCIAL RULES THAT MAY HELP YOU:

1. Don’t call someone more than twice continuously. If they don’t pick up your call, presume they have something important to attend to;

2. When someone shows you a photo on their phone, don’t swipe left or right. You never know what’s next;

3. If a person is speaking directly to you, staring at your phone is rude;

4. Praise publicly. Criticize privately;

5. If a colleague tells you they have a doctors' appointment, don’t ask what it’s for, just say "I hope you’re okay". Don’t put them in the uncomfortable position of having to tell you their personal illness. If they want you to know, they'll do so without your inquisitiveness;

6. Never order the expensive dish on the menu when someone is giving you a lunch/dinner. If possible ask them to order their choice of food for you;

7. If you tease someone, and they don’t seem to enjoy it, stop it and never do it again. It encourages one to do more and it shows how appreciative you're;

8. Don’t ask awkward questions like ‘Oh so you aren’t married yet?’ Or ‘Don’t you have kids’ or ‘Why didn’t you buy a house?’ Or why don't you buy a car? For God’s sake it isn’t your problem

9. Always open the door for the person coming behind you. It doesn’t matter if it is a guy or a girl, senior or junior. You don’t grow small by treating someone well in public;

10. Return money that you have borrowed even before the other person remembers lending it to you. It shows your integrity and character. Same goes with umbrellas, pens and lunch boxes;

11. If you take a taxi with a friend and he/she pays now, try paying next time;

12. Respect different shades of opinions. Remember what's the digit. 6 to you will appear the digit 9 to someone facing you. Besides, second opinion is good for an alternative;

13. Never interrupt people talking. Allow them to pour it out. As they say, hear them all and filter them all;

14. Say “thank you” when someone is helping you.

15. There’s almost never a reason to comment on someone’s weight. Just say, “You look fantastic.” If they want to talk about losing weight, they will;

16. Treat the cleaner with the same respect as the CEO. Nobody is impressed at how rude you can treat someone below you but people will notice if you treat them with respect;

17. Never give advice until you’re asked;

18. When meeting someone after a long time, unless they want to talk about it, don’t ask them their age and salary;

19. Mind your business unless anything involves you directly - just stay out of it;

20. Remove your sunglasses if you are talking to anyone in the street. It is a sign of respect. More so, eye contact is as important as your speech;

21. Never talk about your riches in the midst of the poor. Similarly, don't talk about your children in the midst of the barren.

22. After reading a good message, try to say" Thanks for the message". APPRECIATION remains the easiest way of getting what you don't have.

సేకరణ

విష్ణు పురాణము లోని చిన్న కధ యద్భావం తద్భవతి🙏

విష్ణు పురాణము లోని చిన్న కధ యద్భావం తద్భవతి🙏

ఒక ఊరిలో ఒక ఆస్తికుడు, ఒక నాస్తికుడు ఎదురెదురు ఇళ్లల్లో ఉండేవారు.

ఆస్తికుడు పరమ విష్ణు భక్తుడు. ఆ ఇద్దరూ కొద్దిరోజుల తేడాలో చనిపోయారు. ముందు నాస్తికుడు చనిపోగా.. ఆ తరువాత ఆస్తికుడు మరణించాడు.

విష్ణుదూతలు వచ్చి ఆస్తికుణ్ని వైకుంఠానికి తీసుకుని వెళ్లి అక్కడ సభలో విష్ణువును చూపించారు. ఆహా తన భక్తి పండింది అనుకున్నాడు ఆస్తికుడు. ఆ స్వామిని ఎన్నో స్తోత్రాలతో స్తుతి చేశాడు,ఇంతలో విష్ణు దూతలు వచ్చి అతణ్ని ‘‘పద... పద’’ అని సభలోంచి తీసుకెళ్లడం ప్రారంభించారు.

దానికి అతడు అయోమయంతో... ‘‘ఎక్కడికి తీసుకుపోతున్నారు?’’ అని వారిని అడిగాడు.

‘‘నువ్వు చేసుకున్న పుణ్యం అయిపోయింది. తిరిగి భూలోకానికి తీసుకుని పోతున్నాం’’ అని విష్ణుదూతలు చెప్పారు.

‘‘నా పుణ్యం అయిపోవడం ఏమిటి? నేను గొప్ప విష్ణు భక్తుణ్ని. నిత్యం ఆ స్వామిని కొలిచాను!’’ అన్నాడు ఆస్తికుడు.

‘‘అది నిజమే. కానీ నువ్వు మూడు కారణాలవల్ల తొందరగా వెనక్కి భూలోకానికి వెళ్లిపోతున్నావు.

ఒకటి... నీకు నీ జీవితంలో భక్తి ఒక భాగం మాత్రమే. అందుకే రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక విధినిర్వహణలా పూజచేస్తూ మిగిలిన సమయంలో విష్ణువును ఆలోచనలలోనికి కూడా రానిచ్చేవాడివి కాదు.

రెండో కారణం... ‘స్వామీ! నన్ను వచ్చే జన్మలో గొప్ప ధనవంతుడిగా పుట్టించు.’ అని రోజూ ఆ దేవదేవుని కోరేవాడివి. అంటే.. నీకు మళ్లీ పుట్టాలని, అదీ ధనవంతునిగా జన్మించాలని కోరిక ఉంది.

ఇక మూడో కారణం... రోజూ పూజ పూర్తవగానే ‘ఒక్కసారి కనబడు తండ్రీ... చాలు’ అని కోరేవాడివి. అందువల్ల నీకు కేవలం ఒక్కసారి మాత్రమే విష్ణు దర్శనం అయింది. మళ్లీ పుట్టాలనే కోరిక ఉన్నందున భూలోకానికి వెళ్తున్నావు’’ అని చెప్పారు.

అదే సమయంలో... ఆస్తికునికి విష్ణు సభలో నాస్తికుడు కనిపించడంతో అతడు నివ్వెరపోయాడు.

వీడెలా వచ్చాడిక్కడికి ? వీడు నాస్తికుడు కదా?’’ అని అతడు విష్ణు దూతలను అడిగాడు.

దానికి వారు... ‘‘అవును, నిజమే. అయితే, బతికి ఉన్నంతకాలం ఇతడు ‘దేవుడు లేడు. దేవుడు లేడు’ అంటూ.. తెలియక చేసినా నీకంటే ఎక్కువగా భగవన్నామ స్మరణ చేశాడు. ఎలాగైనా తప్పులు పట్టాలనే ఆలోచనతో పురాణ ఇతిహాసాలను, ఉపనిషత్తులను ఎన్నో మార్లు చదివాడు. వ్యతిరేకంగానైనా సరే... నీకంటే ఎక్కువగా భగవంతుడి గురించి ఆలోచించాడు.

మరొక ముఖ్యకారణం. ఇతడి ఇంట్లో ఇతడు తప్ప అందరూ ఆస్తికులే. ఇతడి భార్య విష్ణుమూర్తి భక్తురాలు. కొడుక్కి నారాయణ అని పేరుపెట్టుకుంది. గడచిన నెలలో వైకుంఠ ఏకాదశి మరునాడు ఉదయం ఆమె పాయసం చేసింది.

వీడు ఇంటి అరుగు మీద కూర్చుని ఆ పాయసం తింటుండగా పొలమారింది. విపరీతంగా దగ్గుతూ ‘నారాయణా చచ్చిపోతున్నానురా!’ అంటూ కొడుకుని పిలిచి, అతడు మంచినీళ్లు తెచ్చేలోపునే మరణించాడు. ఏ కోరికా లేకుండా తన ప్రసాదం తిని, నారాయణ నామస్మరణ చేస్తూ మరణించినందున శ్రీమహావిష్ణువు వీడికి వైకుంఠంలో నివాసం కల్పించారు’’ అని చెప్పారు.

భక్తితో పాటు భావన కూడా చాలా ముఖ్యమని ఆస్తికుడు చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు. అయితే... మరుజన్మలో అతడు తన పాత తప్పుల్ని పునరావృతం చేయలేదు.

మనసారా విష్ణువును కొలిచి, చేసిన కర్మల ఫలితాన్ని ఆ పరమాత్మకు ధారపోయడం ద్వారా పాప, పుణ్యాలు అంటని మహా యోగి అయ్యాడు. తెలియక చేసినా భగవన్నామ స్మరణతో నాస్తికుడు వైకుంఠంలో స్థానం పొందితే...

మరుజన్మలో స్వామిని త్రికరణశుద్ధిగా పూజించిన పుణ్యంతో ఆస్తికుడు చివరకు ఆ స్వామి హృదయంలోనే చోటు సంపాదించుకున్నాడు. జనన, మరణ చక్రం నుంచి విముక్తి పొందాడు.
🙏🙏🌹🌹🕉️🌹🌹🙏🙏

సేకరణ

అబ్దుల్ కలాం గారు ఎంతో ముందుచూపుతో రాసిన అరుదైన లేఖ

మీ అబ్దుల్ కలాం...!!

►►అబ్దుల్ కలాం గారు ఎంతో ముందుచూపుతో రాసిన అరుదైన లేఖ◄◄

2002 లో దేశంలో నీటి కరువు అధికంగా ఉండడంతో...
అబ్దుల్ కలాం గారు 2070 వ సంవత్సరంలో
నీటి కరువు ఎలా ఉండబోతుందో ఊహిస్తూ ఒక లెటర్ ని రాసారు..
ఆ లెటర్ ని ఒక బ్రిటిష్ పత్రిక వాళ్ళకి
ప్రెజెంటేషన్ లాగా అబ్దుల్ కలాం పంపించారు..!!
అబ్దుల్ కలాం చేసిన ఈ ఊహా చాలా మందిని భయపెట్టింది…!!
దానితో పాటే ప్రకృతి ని రక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేసింది..!!
.
ఆ లెటర్ యధాతథంగా మీకోసం..!!
.
ఇది 2070..!!
నేను ఇప్పుడే 50 ఏళ్ళు దాటాను..!!
కానీ నా రూపం చూడటనికి 85 ఏళ్ళుగా అనిపిస్తుంది..!!
నేను తీవ్రమైన మూత్రపిండ సమస్యలను ఎదురుకుంటున్నాను..!!
ఎందుకంటే నేను ఎక్కువగా నీరు త్రాగను, త్రాగలేను..!!
అంత నీరు ఇప్పుడు అందుబాటులో లేదు..!!
నేను ఇక ఎక్కువ కాలం బ్రతకను, అదే నాకున్న పెద్ద భయం..!!
ఇప్పుడున్న‌ సమాజంలో..
అతి ఎక్కువ వయసున్న వ్యక్తులలో నేను కూడా ఒకడిని..!!
.
నాకు గుర్తుంది అప్పుడు నాకు 5 ఏళ్ళు..!!
అప్పడంతా పరిస్థితి వేరుగా ఉండేది..!!
ఉద్యానవనాల్లో ఎన్నో చెట్లు ఉండేవి..!!
ఇళ్ళలో చక్కని తోటలు ఉండేవి..!!
దాదాపు అరగంట పాటు షవర్ స్నానం చేసి ఆనందించేవాడిని..!!
కానీ ఇప్పుడా పరిస్థితి లేదు..!!
ఇప్పుడు అంత నీరెక్కడుంది కనుక..!!
అందుకే మేమిప్పుడు రసాయనపూత పూసిన
టవల్స్‌తో శరీరాన్ని శుభ్రపరుచుకుంటున్నాము..!!
స్నానం చేయడమనేది అసలు లేనేలేదు..!!
రసాయనాలతో శరీరం తుడుచుకోవడమే అందరూ చేస్తున్నారు..!!
.
ఇంతకముందు ఆడవాళ్ళకు అందమైన జుట్టు ఉండేది..!!
కానీ ఇప్పుడు నీటి వాడకం తగ్గించడనికి అందరూ..
రోజు తల మొత్తం నున్నగా షేవ్ చేసుకుంటున్నారు..!!
అప్పట్లో మా నాన్నగారు కారుని పైప్‌తో కడిగేవారు..!!
ఇప్పుడా విషయం మా అబ్బాయికి చెప్తే,
అంత నీరెలా వృధా చేస్తారంటూ నమ్మడంలేదు..!!
నాకు గుర్తుంది, నీటిని కాపాడండి,
సేవ్ వాటర్ అంటూ హెచ్చరికలు, వాల్ పోస్టర్లు ఉండేవి..!!
రేడియో, టి.వీ.ల్లో కూడా ప్రచారం చేసేవారు..!!
కానీ అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు..!!
నీరనేది ఎప్పటికీ తరగని వనరని మా భావన..!!
.
కానీ ఇప్పుడు చూస్తే, నదులు, చెరువులు, బోర్లు
డ్యాములన్నీ పూర్తిగా ఎండిపోయాయి,
లేదా పూర్తిగా కలుషితమయ్యాయి..!!
పరిశ్రమలు కూడా నిలిచిపోయాయి,నిరుద్యోగం దారుణంగా పెరిగిపోయింది..!!
నీటి నుంచి ఉప్పును వేరు చేసే ప్లాంట్లు
మాత్రమే అధికశాతం ఉద్యోగ అవసరాలు తీరుస్తున్నాయి..!!
వాటిలో పని చేసే కార్మీకులు
డబ్బులకు బదులుగా నీటిని జీతం రూపంలో తీసుకుంటున్నారు..!!
నీరు కొనుక్కోవడమే గగనం అయ్యింది..!!
.
రోడ్డు మీద నీటి బాటిళ్ళు తీసుకువెళ్ళేవారిని చంపి..
ఆ నీటిని దోచుకోవడం కోసం చేసే నేరాలు పెరిగిపోయాయి..!!
నీటిబాటిల్ కోసం అగంతకులు గన్‌తో భయపెడుతున్నారు..!!
80% ఆహారం అంతా కృతిమమే..!!
నీరు లేకపోతే ఏం పండుతుంది..??
.
గత రోజులలో కాస్త వయసున్న వ్యక్తి
రోజుకి కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని సిపార్సు చేసేవారు..!!
ఇప్పుడు కేవలం అరగ్లాసు నీరు త్రాగే ‘అవకాశం’ మాత్రమే ఇస్తున్నారు..!!
అంతకంటే ఎక్కువ నీరు త్రాగనివ్వరు..!!
ఇప్పుడు మేము వాడి పడేసే బట్టలు ఉపయోగిస్తున్నాము..!!
ఇంతకముందు వలే నేసిన బట్టలు వాడే రోజులు ఎప్పుడో పోయాయి..!!
అటువంటి బట్టలు ధరించినా, వాటిని శుభ్రపరచడానికి నీరుంటే కదా..!!
.
ఇప్పుడు మేము డ్రైనేజి వ్యవస్థకు బదులుగా సెప్టిక్ ట్యాంకు వాడుతున్నాము..!!
ఎందుకంటే డ్రైనేజి వ్యవస్థకు కూడా నీరు అవసరం..!!
జనాల యొక్క బాహ్యరూపం చాలా భయంకరంగా ఉంది..!!
ముడతలు పడి, డిహైడ్రేషన్ కారణంగా కృశించి,
అతినీలలోహిత కిరణాల కారణంగా శరీరం మొత్తం కురుపులు పడి,
ఓజోన్ పొర లేని కారణంగా చాలా దారుణమైన
చర్మవ్యాధులతో జనం తారసపడుతున్నారు..!!
.
చర్మక్యాన్సర్, మూత్రపిండ సంబంధిత
వ్యాధులే మరణాలకు ముఖ్యకారణాలు..!!
చర్మం అధికంగా పొడిబారడం వలన
20 ఏళ్ళ యువకులు 40 ఏళ్ళ వారిలా కనిపిస్తున్నారు..!!
శాస్త్రవేత్తలు పరిశోధించినా, ఎటువంటి మార్గం కనుగొనలేకపోతున్నారు..!!
నీటిని ఉత్పత్తి చేయలేము, చెట్లు, పచ్చదనం తగ్గిన
కారణంగా ప్రాణవాయువు నాణ్యత తగ్గిపోయింది..!!
ఆధునికతరాల వారి మేధాశక్తి దారుణంగా క్షీణించిపోయింది..!!
పురుషుల వీర్యకణాల్లో కూడా తేడాలు సంక్రమించాయి..!!
ఆ కారణంగా కొత్తగా పుట్టే పిల్లలు అనేక
అవయవ లోపాలతో, రోగాలతో పుడుతున్నారు..!!
.
గాలి పీలుస్తున్నందుకు గానూ ప్రభుత్వం
ఇప్పుడు మా దగ్గరి నుంచి డబ్బులు వసూల్ చేస్తోంది..!!
137 కూబిక్ మీటర్ల గాలి మాత్రమే తీసుకునే అవకాశం ఇస్తోంది..!!
ప్రజల ఊపిరి తిత్తులు ఎప్పుడో చెడిపోయాయి,
అందుకే ఇప్పుడు సౌరశక్తితో నడిచే యాంత్రికమైన ఊపిరి తిత్తులు కనుగొన్నారు..!!
వాటిని వెంటిలేటేడ్ జోన్స్ అనే ప్రత్యేక స్థలాల్లో అమరుస్తారు..!!
డబ్బులు కట్టలేని వాళ్ళని వెంటిలేటేడ్ జోన్స్ నుండి వెళ్ళగొడతారు..!!
అక్కడ కూడా ప్రజలు పీల్చే గాలి
మంచిదేమీ కాదు కానీ ఏదో పూటగడుస్తుందంతే..!!
కొన్ని దేశాల్లో ఇప్పటికి నదుల పక్కన పచ్చని మైదానాలు ఉన్నాయి..!!
కానీ వాటిని రక్షించడం కోసం
దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యం అక్కడ ఉంది..!!
నీరు ఎంతో ప్రియమైనదిగా మారిపోయింది..!!
బంగారం, వజ్రాలకంటే విలువైనదిగా అయిపోయింది..!!
.
నేనుడే చోట వృక్షాలు అసలే లేవు..!!
ఎందుకంటే అక్కడ వర్షాలు అస్సలుకే పడవు..!!
ఎప్పుడైన వర్షం పడినా, అది యాసిడ్ వర్షమే అవుతుంది..!!
20 వ శతాబ్ధంలో పరిశ్రమలు చేసిన కాలుష్యం,
అణు ప్రయోగాల కారణంగా ఋతువుల క్రమం దెబ్బతిన్నది..!!
అప్పట్లో ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడమని ఎందరో మొత్తుకున్నారు..!!
కానీ ఎవరూ వినలేదు, విన్నా పట్టించుకోలేదు..!!
నా కొడుకు, నా యవ్వనం గురించి మాట్లాడమన్నప్పుడు
పచ్చని బైళ్ళ గురించి, అందమైన పువ్వుల గురించి,
వానల గురించి, నదులు, డ్యాముల్లో ఈత కొట్టడం గురించి,
చేపలు పట్టడం గురించి, కడుపు నిండుగా
నీరు త్రాగడం గురించి, ప్రజల ఆరోగ్యం గురించే మాట్లాడుతాను..!!
.
అప్పుడు వాడు
‘నాన్నా.. ఇప్పుడు నీళ్ళెందుకు లేవు..??’ అని
అడగ్గానే నా గొంతులో వెలక్కాయ పడినట్టు అవుతుంది..!!
నాకు కలిగే అపరాధభావం నుంచి బయటపడలేను..!!
ఎందుకంటే నా తరమే పర్యావరణవినాశనానికి దోహదపడింది..!!
ఎన్ని హెచ్చరికలు చేసిన బేఖాతరు చేసింది..!!
ఇప్పుడు నా పిల్లలు దానికి భారీ మూల్యం చెల్లిస్తున్నారు...!!
నిజాయతీగా చెప్పాలంటే ఈ భూమి మీద జీవం ఇక ఎంతో కాలం ఉండదు...!!
పర్యావరణ విధ్వంసం దారుణమైన
స్థితికి చేరుకుంది, ఇప్పుడేమి చేసినా ఫలితం ఉండదు..!!
కాలంలో వెనక్కు వెళ్ళి మానవాళికి ఎలా చెప్పాలని ఉంది...!!
ఈ భూమాతను కాపాడటానికి
ఇంకా మనకు సమయం మిగిలే ఉందని..కానీ అదెలా సాధ్యం..!!
.
మీ అబ్దుల్ కలాం...!!
.
ఇంకా సమయం మిగిలే ఉంది..
భూమాతను, ప్రకృతిని కాపాడటానికి...!!
రండి చేయి, చేయి కలుపుదాం…!!
.
2002 వ సంవత్సరంలో 2070 పరిస్థితిని ఊహించి రాసిన లెటర్ ని
చూస్తుంటే కలాం గారు రాసింది 2070 కంటే ముందే జరిగేలా ఉంది..!!
ప్రస్తుతానికి తాగడానికి , వాడుకోవడానికి నీళ్లు ఉన్నాయి కదా అని
నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ లో నీళ్ల కోసం యుద్దాలు చేసే పరిస్థితి రావొచ్చు..!!

సేకరణ

కవిత: జ్ఞప్తికున్నవా సఖీ!

జ్ఞప్తికున్నవా సఖీ!
---------------------------
నీ స్మృతులలో
ఎచటయినా
మనసు పొరల మాటున
ఎపుడైనా
మల్లెల మాపుల పరిమళాల స్పర్శ చాటున
ఒక పిచ్చివాడి గీతాలాపన జ్ఞప్తికున్నదా సఖీ!
నీ కనురెప్పల
సోయగాలలో
స్వప్నాలు అద్దిన ధూళిలో
ఒక ఆర్ధ్ర చిత్త భాష్పాలలో
ఏ రాత్రినైనా
ఒక పిచ్చివాడి విలాపన జ్ఞప్తికున్నదా సఖీ!
నీ చరణ
మంజీరాలు
నడయాడిన
ఈ వనాల సీమలలో
పూవాటికలలో,
సెలయేరుల జలంజలలలో
ఒక పిచ్చివాడి కన్నీళులు జ్ఞప్తికున్నవా సఖీ!
నీ ఎద లోయల
మధురోహలలో
కదలాడిన స్మృతిగీతికలలో
వ్యక్తావ్యక్తంగా నైతేనేమి
రాగయుక్తంగా అయితేనేమి
ఒక పిచ్చివాడి వలపుగీతికలు జ్ఞప్తికున్నవా సఖీ!!
-- దండమూడి శ్రీచరణ్
9866188266

సేకరణ

⚜మనసు బుద్ధి దేనిని ఏది సంస్కరించాలి?:⚜

⚜మనసు బుద్ధి దేనిని ఏది సంస్కరించాలి?:⚜

భగవంతుడు కేవలం శరీరమును మాత్రమే సృజింపడు. దానితో పాటు ఒక మనస్సును కూడా ఇస్తాడు. ఈ మనస్సు ఉందే, అది తోకలేని కోతి. ఈ మనస్సు ఎప్పుడూ సంకల్ప వికల్ప సంఘాతమై ఉంటుంది. ఇందులో స్పందన వేరు, కదలిక వేరు, కార్యము వేరు.

ఉదా: ఒక బావిలో కానీ, ఒక కొలనులో కానీ, నీరు చాలా ప్రశాంతముగా ఎలాంటి స్పందన, కదలిక లేకుండా ఉంటాయి. అందులో మనము ఒక రాయి వేస్తే, ఆ రాయి వెళ్ళి నీళ్ళ పై పడినపుడు, ఆ నీళ్ళలో కదలికలు ఏర్పడతాయి. ఆ కదలికల వలన స్పందన కలుగుతుంధి. ఆ స్పందన వలన సంకల్పము జరుగుతుంది. ఎప్పుడూ సంకల్పము జరిగిందో అది కార్యరూపము దాల్చుతుంది. కార్యమైతుంది.

మనసు నిజంగా చిన్నపిల్లవాడు లాంటిది. పిల్లవాడికి, నీటికి-మూత్రమునకు తేడా తెలియదు. అన్నానికి-మలమునకు తేడా తెలియదు. అగ్గికి-చల్లదనమునకు తేడా తెలియదు. మనస్సు కూడా అంతే.
సంకల్పము-పట్టుకోవడం
వికల్పము-విడిచిపెట్టడం
మనస్సు-చిన్నపిల్లవాడు
బుద్ధి-అమ్మ

ఉదా:- చిన్న బిడ్డ తెలియకుండా మట్టిలేదా, మలము తింటుంటాడు. అప్పుడు అమ్మ చూచి బిడ్డను ఒక దెబ్బ కొట్టి దూరంగా తీసుకెళ్ళి, బిడ్డ చేతులు కాళ్ళు శరీరం అంతా శుభ్రంగా కడిగి, ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చోబెట్టి, తర్వాత బిడ్డ ఉన్నచోట శుభ్రం చేసి తర్వాత వస్తుంది. ఔనా? ఆలోచించండి? ఇక్కడ ఒక విషయం గమనించండి. ఆ బిడ్డను మరలా మట్టిగాని మలము తినాలని అనిపించినా దొంగతనంగా తింటాడు ఔనా? ఎందుకు? అమ్మ చూస్తే కొడుతుంది అని. బుద్ధిమంతుడైతే ఇక దానిని ముట్టుకోడు. దాని జోలికి వెళ్ళడు.ఔనా? కాదా? కాబట్టి బుద్ధి (అమ్మ) ఎప్పుడూ మనసు(బిడ్డ) పట్ల సర్వావస్తల యందు జాగృతమై బలంగా ఉండి మనస్సును (బిడ్డను) గమనిస్తూ ఉండాలి. లేదంటే మనస్సును అలా వదిలేస్తే బిడ్డ తినకూడని వన్నీ తిని అనారోగ్యం పాలై చివరకు బిడ్డ దక్కకుండా పోతుంది. ఔనా ఆలోచించండి.

కాబట్టి బుద్ధి బాగా పనిచేస్తే మనస్సు సంస్కరింపబడుతుంది. ఆ మనసు సంస్కరింపబడితే మనసు బుద్ధి రెండూ కలసి మంచి పనులు చేస్తాయి. అందుకే ఒక కవిగారన్నారు.
“గొరుగుచుందురు జుత్తు కొన్నివందల సార్లు
దాని పాపమేమె కానరాదు
అఖిల పాపములకు నిలయమైన
మనసు గొరగడేమి మానవుండు”
చూశారా మనసు పరిస్థితి.

మనసు ముందుకెళ్ళడానికి సాధన అవసరంలేదు. ముందుకు అంటే అనవసర ఆలోచనలకు అరిషడ్వర్గావలంబనకు సాధన సహాయము ఆసరా అవసరం లేదు.
ఉదా:- చిన్న బిడ్డను ఏదైనా అడిగితే “ఆ ఇది నాది” అంటాడు. ఎవరునేర్పారు. అలాగే మనస్సును వెనుకకు సత్యశోధనకు లాగడానికి సాధన కావలయును. హంస అంటే నీటిని, పాలను వేరు చేయగలదు. అవునా?ఎవరైనా హంసను చూచిన దాఖలాలు, చూచినట్లు సాక్ష్యం ఉందా? లేదు. అందుకే పరమహంస అంటే పరమాత్మను,జగత్తును విడకొట్టి సత్యాసత్యములను తెలియజేయునది. ఇది గ్రహిస్తే మనము ఏమిటో, మనకు మన పరిస్థితి తెలుస్తుంది. పూజ ఎందుకో భక్తి ఎందుకో మనకే అర్థమవుతుంది. మనము ఏమి చేయాలి అనే విషయం మనకే తెలుస్తుంది.

Thursday, April 28, 2022

మంచికథ-మనం జీవితంలో శాంతి ఎక్కడ దొరుకుతుంది ?

మంచికథ-మనం జీవితంలో శాంతి ఎక్కడ దొరుకుతుంది ?

ఒకసారి ఒక రాజు అత్యుత్తమంగా శాంతిని వర్ణించే చిత్రాన్ని గీసిన కళాకారుడికి బహుమతి ఇస్తానని తన రాజ్యంలో ప్రకటించాడు.

ఈ పోటీలో రాజ్యంలోని ఎందరో గొప్ప చిత్రకారులు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా పాల్గొన్నారు. వారు రాజుకు చాలా చక్కని చిత్రాలను పంపారు. ఆ చిత్రాలు అన్నీ రాజభవనంలో ఒక ప్రదర్శనలో పెట్టారు.

అన్నీ చిత్రాలలో ఒక్కదానిపై అందరి చూపు పడింది. ఆ చిత్రంలో ఒక నిర్మలమైన సరస్సు చిత్రీకరించి ఉంది, ఎత్తైన మంచుతో కప్పబడిన పర్వతాలు చాలా ప్రశాంతంగా ఉన్న సరస్సులో ప్రతిబింబిస్తున్నాయి. చిత్రంలో తెల్లటి మేఘాలతో కూడిన స్పష్టమైన నీలి ఆకాశం కనిపిస్తూ ఉన్నాయి. ఈ చిత్రం ప్రతి విషయంలోనూ శాంతిని ప్రతిబింబిస్తోంది. పంపబడిన అన్ని చిత్రాలలో ఇది ఉత్తమమైనదిగా చాలా మందికి అనిపించింది. ఈ చిత్రానికే మొదటి బహుమతి వస్తుందని అందరూ భావించారు. ఆ చిత్రకారుడు కూడా నిశ్చింతగా, ఉత్సాహంగా ఉన్నాడు.

కానీ రాజు విజేతను ప్రకటించేసరికి అందరూ అవాక్కయ్యారు! బహుమతి గెలుచుకున్నచిత్రం తుఫానును వర్ణిస్తోంది, పర్వతాలను కూడా కలిగి ఉంది, కానీ అవి కఠినమైనవిగా, ఎగుడుదిగుడుగా, నిర్జీవంగా ఉన్నాయి. ఆకాశమంతా ఎర్రగా ఆవేశంతో నిండిపోయి, మెరుపుల చారలతో మెరుస్తోంది. ఉధృతంగా ప్రవహించే నీటి జలపాతం కూడా ఉంది. ఈ చిత్రంలో శాంతిని చిత్రీకరించేది ఏదీ లేదు. కళాకారుడు తన చిత్రాన్ని శాంతికి బదులుగా పొరపాటున తుఫానును వర్ణిస్తూ సమర్పించినట్లుగా అనిపించింది.

రాజు తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ ఆశ్చర్యపోయారు. తాను గెలుస్తానని నమ్మిన చిత్రకారుడు రాజును వేడుకున్నాడు, "అయ్యో మహారాజా, నా చిత్రం శాంతికి ప్రతీకగా ఎంపిక చేయబడలేదు. కానీ తుఫానును వర్ణించే ఈ చిత్రాన్ని మీరు శాంతికి చిహ్నంగా ఎందుకు ఎంచుకున్నారో నేను తెలుసుకోవచ్చా?"

అక్కడ ఉన్నవారంతా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఉత్సుకతతో ఉన్నారు. అప్పుడు రాజు చిరునవ్వు నవ్వి,"ఈ చిత్రాన్ని శ్రద్ధగా, ఏకాగ్రతతో చూడండి. అలా చూస్తున్నప్పుడు మీలో కలిగే స్థితిని కూడా అనుభవించండి", అన్నాడు.
ఆ చిత్రంలో రాతి పగుళ్లలో ఒక చిన్న పొద పెరుగుతూ కనిపించింది. ఒక పక్షి ఆ పొదలో గూడు కట్టుకుంది. ఈ తుఫాను వాతావరణంలో, పక్షి స్థిరంగా, ప్రశాంతమైన మనస్సుతో తన గూడులోని పిల్లలను కాపాడుతూ కూర్చుంది.

అందరూ ఓపికగా, ఏకాగ్రతతో ఆ చిత్రం వైపు చూశారు. అందరి ముఖాల్లో శాంతి, సంతృప్తి కనిపించింది. అక్కడి వాతావరణం అంతా ప్రశాంతంగా మారింది.

శాంతి అంటే శబ్దం, అలజడి లేని ప్రదేశంలో ఉండడం కాదు. శాంతి అంటే అన్ని గందరగోళాల మధ్య కూడా హృదయంలో నిశ్చలంగా, ప్రశాంతంగా ఉండటం. అంతర్గత శాంతి లేకుండా, బాహ్య శాంతి అర్థరహితం. ఈ చిత్రంలో, పక్షి చుట్టూ ఎంత అల్లకల్లోల వాతావరణం ఉన్నప్పటికీ, చాలా ప్రశాంతమైన మనస్సుతో తన పిల్లలను కాపాడుతోంది.

నిజానికి, ఈ చిత్రం శాంతిని సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో వర్ణిస్తోంది. ఎందుకంటే, శాంతి అనేది మనం బయట వెతుక్కునేది కాదు, శాంతి అనేది మనం లోపల అనుభూతి చెందేది. శాంతి అనేది ఒక మానసిక స్థితి, మనం ఉన్న పరిసరాల స్థితి కాదు.

♾️

శాంతి, ఆనందం - ఆత్మ యొక్క సహజమైన లక్షణాలు. నిజమైన ధ్యానం ద్వారా మనం మనలో అలాంటి స్థితులను సృష్టించుకుంటాం, అది వాటిని వికసించేలా చేస్తుంది. 🌼

సేకరణ. మానస సరోవరం 👏

👵కొత్త గా పెళ్ళి చేసుకున్న కొడుకుకు ఒక తల్లి చెప్పిన 5 ముఖ్య విషయాలు... ప్రతి తల్లి ఇలాగే చెప్పగలిగితే అంతా శుభమే!👵

👵కొత్త గా పెళ్ళి చేసుకున్న కొడుకుకు ఒక తల్లి చెప్పిన 5 ముఖ్య విషయాలు... ప్రతి తల్లి ఇలాగే చెప్పగలిగితే అంతా శుభమే!👵

📚✍️ మురళీ మోహన్

1.నీ భార్యను ఎప్పుడూ అమ్మతో పోల్చవద్దు...ఎందుకంటే మీ అమ్మకు 20 సంవత్సరాల అనుభవం ఉంది. నీ భార్యకు నీలాగే ఇది కొత్త అనుభవం.
నిన్ను నేను ఎలా పెంచానో తనని వారి తల్లిదండ్రులు అలాగే పెంచి ఉంటారు కదా!
తనకు అలవాటు అయ్యేదాకా నువ్వే మంచిగా చూసుకో.తప్పకుండా తను కూడా మంచి గృహిణి గా,మంచి తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తుంది.

2.నీ భార్యను ఒక మంచి స్నేహితురాలిగా భావించి అన్ని విషయాలను తనతో పంచుకో...
నీ తల్లికి నిన్ను చూసుకోవడమే పని..నీవు మమ్మల్ని,నీ భార్యను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.
మీరిద్దరూ ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకుని ప్రేమగా ఉండాలి.

3.నీతో సమానంగా తనని చూసుకో...నీ జీవితంలో నువ్వు తీసుకోబోయే నిర్ణయాలను ఆమెతో కూడా చర్చించి తీసుకో!నీ మంచిచెడులో నీకు జీవితాంతం తోడుగా తనే ఉంటుంది.

4. పుట్టింటి నుంచి వచ్చిన ఆ అమ్మాయికి ఇక్కడ పద్ధతులు, అలవాట్లు కొత్తగా ఉంటాయి. తనని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి...కాస్త మోహమటంగా ఉండచ్చు...నువ్వే తనకి తోడుగా ఉండి తను సంతోషంగా ఉండేటట్లు చెయ్యి.

5.నీ భార్యను మాకంటే ఎక్కువగా నువ్వే ప్రేమించాలి...
ప్రేమించడానికి వయస్సుతో పనిలేదు.చిన్న,చిన్న సర్ప్రైజ్ లు,కానుకలు ఇచ్చి తనని సంతోషంగా ఉండేలా చూసుకో..వారాంతంలో బయటికి తీసుకుని వెళ్లు. పుట్టింటికి తనతో కలసి వెళ్ళు.
నీ లాంటి భర్త, మా లాంటి అత్తమామలు లభించడం తన అదృష్టం అని చెప్పుకునేలా మనం అందరం ప్రవర్తిద్దాం...

ఇవన్నీ నేను మీ నాన్న దగ్గర పొందాను...అనుభవిస్తున్నాను..నా అనుభవాలను నీతో చెపుతున్నాను...నువ్వు కూడా మీ నాన్నలా ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉంటూ,నువ్వు సంతోషంగా ఉంటూ...మమ్మల్ని సంతోషంగా ఉంచుతావని నమ్ముతున్నాను...నిండు నూరేళ్లు ఆనందంగా మీరు జీవించాలని కోరుకుంటున్నాను...ఇష్టకామ్య ర్థ సిద్ధి రస్తు....❤❤❤❤👩‍👩‍👧‍👧

సాధన

🍁 సాధన🍁

✍️ మురళీ మోహన్

ఒకసారి ఇంద్రుడు రైతులు పనిచేస్తున్న తీరుపై అసంతృప్తి చెందాడు. వెంటనే
"నేటి నుండి మరో పన్నెండు సంవత్సరాల వరకు వర్షం కురవదు, కాబట్టి మీరు వ్యవసాయం చేయలేరు" అని ప్రకటించాడు.

రైతులంతా కలిసి ఇంద్రుడిని వేడుకోగా, అప్పుడు ఇంద్రుడు "సరే... పరమ శివుడు ఎప్పుడు డమరుకం వాయిస్తే, అప్పుడు వర్షం కురుస్తుంది" అని వరమిచ్చినట్టే ఇచ్చి, వచ్చే పన్నెండు సంవత్సరాల పాటు డమరుకం వాయించ వద్దని రహస్యంగా శివునికి చెప్పాడు.

రైతులు పరమ శివుడి దగ్గరకు వెళ్లి ఎంత బతిమాలినా... పన్నెండు సంవత్సరాల తరువాత మాత్రమే డమరుకం వాయిస్తానని చెప్పాడు.

రైతులు ఏమి చేయాలో తెలియక, పన్నెండు సంవత్సరాలు గడవడం కోసం వేచి చూడసాగారు.

కానీ ఒక రైతు మాత్రం తోటి రైతులు వెక్కిరిస్తున్నా లెక్క చేయకుండా ప్రతి సంవత్సరం పొలం దుక్కి దున్నడం, విత్తడం, ఎరువులు వేయడం వంటి పనులు క్రమం తప్పకుండా చేస్తూనే వున్నాడు.

మూడు సంవత్సరాల తర్వాత, ఎప్పటి లాగానే ఆ రైతు పంట వేశాడు. మిగిలిన వారు అందరూ కలసి వెళ్లి "వర్షం పడదని తెలిసి కూడా ఎందుకు సమయం మరియూ శ్రమ వృధా చేస్తున్నావూ" అని అడగ్గా...

దానికి ఆ రైతు "వర్షం లేకుంటే పంట పండదు అని నాకూ తెలుసు, కానీ తీరా పన్నెండు సంవత్సరాల తరువాత వర్షం కురిసినా అప్పటికి వ్యవసాయం పనులు మరిచి పోకుండా వుండేటందుకే ఈ పనులు చేస్తున్నాను" అని చెప్పాడు.

ఇదంతా విన్న పార్వతి ఆ రైతు వ్యక్తిత్వం గురించి శివునికి గొప్పగా చెప్పి... తమరు డమరుకం వాయించడం మరచి పోలేదు కదా, అన్నది చమత్కారంగా.
అంతట పరమ శివుడు ఇదిగో చూడు అంటూ అప్రయత్నంగా డమరుకం వాయించాడు.

తక్షణమే వర్షం కురిసింది. దీంతో ఆ రైతు పొలంలో పంట బాగా పండగా... మిగిలిన రైతులకు కడుపు మంటే మిగిలింది.

కాబట్టి మిత్రులారా......

మనం ఏ వృత్తి చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా దానికి సంబంధించిన విషయాలలో నైపుణ్యాన్నీ మరియూ జ్ఞానాన్నీ పెంచుకునేందుకు నిరంతర ప్రయత్నం చేయాలి.

ముగింపు : ఎదురు చూస్తూ సమయం వృథా చేయకుండా... రేపటి రోజున ఏమి చేయాలో దానికి సన్నద్ధం కావాలి.



"సాధనమున పనులు సమకూరు ధరలోన"*

🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

సిరి బాల్యం🌹బాల్యంలో మనం విన్న పెద్దల మాటలు🌹

---------సిరి బాల్యం--------🌹బాల్యంలో మనం విన్న పెద్దల మాటలు🌹

నిన్న మధ్యాహ్నం భోజనం చేస్తుంటే పొలమారింది. నెత్తి మీద కొట్టుకుని మంచినీళ్లు తాగుతుంటే "ఎవరో తలుచుకుంటు న్నట్లున్నారు. బహుశా పెద్ద మనవడేమో?" అంది మా ఆవిడ.

"అయ్యుండొచ్చు" అన్నాను నేను కాస్త నిమ్మళించాక.

అన్నం తిని సోఫాలో కూచోగానే, చిన్నప్పటి మా ఇంటి భోజనాల సీను జ్ఞాపకం వచ్చింది. 'ఇప్పటిలా టేబుల్స్ లేవు గదా, ఇంట్లో ఉన్నవాళ్ళం అందరం బావి దగ్గిరకు వెళ్లి కాళ్ళూచేతులు శుభ్రంగా కడుక్కున్నాకే, నేల పీటల మీద బాసింపట్టు వేసుకుని కూచుని భోంచేసేవాళ్ళం'.

వంటకన్నీ ఇత్తడి గిన్నెలే ఉండేవి ఎక్కువగా. కంచాలు,గ్లాసులు మాత్రం స్టీలువి ఉండేవి. మంచినీళ్ళు తాగే చెంబులు కంచువి కూడా ఉండేవి. చాలా పాత్రల మీద ఎంతో గుండ్రంగా తెలుగు అక్షరాలతో పేర్లు చెక్కి ఉండేవి. కట్టె పొయ్యల మీదే వంటంతా...

అమ్మ పక్కనే కూచుని వడ్డిస్తూ ఉండేది. "ఇంకొంచెం కలుపుకో, నెయ్యి వేసుకున్నావా" అంటూ అందరినీ కనుక్కుంటూ వడ్డించేది.

ఒకవేళ భోంచేస్తున్నప్పుడు ఎవరికైనా పొలమారితే గానీ, పచ్చడి కారానికి ఎక్కిళ్ళు వస్తేగాని, పక్కనే కూచున్న అమ్మ కొన్ని నీళ్లు తీసుకుని వారి నెత్తి మీద జల్లి "నీ పేరేంటి, ఏ ఊళ్ళో పుట్టావు చెప్పు?" అని అడిగేది.

నేను అయితే అడవిపాలెం అని, మా అక్కయితే కాకినాడ అని చెప్పేవాళ్ళం. కాస్త స్థిమిత పడ్డాక నా పేరుకి, ఊరు పేరుకీ, ఎక్కిళ్ళకి ఏమి సంబంధం అని ఆడిగితే, "ఏమో తెలీదు గానీ నీకు ఎక్కిళ్ళు పోయాయా లేదా" అని తిరిగి ప్రశ్న వేసేది అమ్మ. నిజంగానే గమ్మత్తుగా ఎక్కిళ్ళు ఆగిపోయేవి.

ఇలాగే ఇంకో కిటుకు ఉండేది అమ్మ దగ్గిర. "మీ ఫ్రెండ్ రాము గాడి సైకిల్ పోయిందిట గదా" అనో "పక్కింటి పిన్నిగారు ఇంట్లో బిందె ఎవరో ఎత్తుకుపోయారుట" అంటూ ఏవో వింత వార్తలు చెప్పేది.

"నిజమా??" అంటూ మన దృష్టి అటు వెళ్ళేది. ఈ లోపల ఎక్కిళ్ళు, పొలమారడం తగ్గిపోయేవి ఆశ్చర్యంగా.

అమ్మ నవ్వేసి " ఊరికే...నీ దృష్టి మళ్ళిద్దామని" అనేది నవ్వుతూ

అలాగే "అన్నం తినేటప్పుడు అస్సలు మాట్లాడవద్దు" అనేవారు పెద్దలు. మాట్లాడుతూ తింటే అన్నం వంటికి పట్టదుట.

"అన్నం తింటూ మధ్యలో కంచం దగ్గిరనుంచి లేవకూడదు" అనేవారు.

కంచంలో ఏమీ వదిలేయకుండా తినాలి, వృధా చేయకూడదు, కంచంలో చేయి కడగకూడదు అని చిన్నప్పటినుంచే తెలుసుకున్న తరం మనది.

మనతో కూచున్న అందరూ అన్నం తినడం అయ్యాకే లేచి చేయి కడుక్కునేవాళ్ళం.

అమ్మ మాత్రం అందరం తిన్నాక, నాన్నగారు తిన్న పళ్ళెంలోనే తానూ అన్నం తినేది.

రాత్రిపూట "ఉప్పు" అని అడిగేవారు కాదు పెద్దవాళ్ళు. ఎందులోనైన ఉప్పు తగ్గినా, మజ్జిగలోకి కావలసి వచ్చినా, "కాస్త చవి చూపించు" అనేవారు. కంచములో ఒక పక్కకి వేసేవారు గానీ చేతిలో వేసేవారు కాదు.

అలాగే ఆదివారం రోజూ, మళ్లీ ప్రతిరోజూ రాత్రి పూట ఉసిరికాయ పచ్చడి నిషేధం. తినకూడదు అనేవారు.

వడియాలు పెట్టాలంటే ఆ బూడిద గుమ్మడికాయ మీద మగవాళ్ల చేతికి కత్తి ఇచ్చి ఒక చిన్న గాటు పెట్టించిన తరవాత ఆ కాయని ముక్కలు చేసేది అమ్మ

చీకటి పడితే చెట్టు మీద చేయి వేయవద్దు అనేవారు. పూలు గానీ, పళ్ళు గానీ, కరివేపాకు గానీ సూర్యాస్తమయం ముందే కోయాలి అనేవారు.

పసిపిల్లలు ఉయ్యాలలో లేనప్పుడు ఖాళీ ఉయ్యాలని ఊపవద్దు అనేవారు. అమ్మాయికి పుట్టిన పిల్లలకి నామకరణం చేసిన తర్వాత మూడో నెలలోనో, ఐదో నెలలోనో వారి నాయనమ్మగారి ఇంటికి సారె పెట్టి మనవళ్లను పంపిస్తు, ఉయ్యాలలో చందనం బొమ్మ పెట్టే వైనం ఇప్పటికీ జ్ఞాపకం.

ఆడపిల్లలు బియ్యం తింటుంటే నీ పెళ్లి సమయానికి పెద్ద వాన వస్తుంది అని భయపెట్టి ఆ అలవాటు మానిపించేవారు.

ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షం వస్తుంటే ఉరిమినప్పుడల్లా "అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి" అంటూ దండం పెట్టుకుని మమ్మల్నీ అలా చేయమనేది అమ్మ.

వినాయకచవితి నాడు సాయంత్రం చుట్టుపక్కల అందరి ఇళ్ళకి వెళ్లి ఆ ఇంటి వినాయకుడిని చూసి రమ్మనేవారు. ఎంతమంది వినాయకులకు మొక్కితే అంత బాగా చదువు వస్తుంది అనేవారు.

నాన్నగారూ ఏదైనా పని మీదో, లేక ఏదైనా ఊరికో ప్రయాణమవుతుంటే శకునం చూసి మరీ రోడ్ ఎక్కేవాళ్ళు.

"పాలమ్మాయి వస్తోంది. మంచిది వెళ్ళిరండి"అని అమ్మ అనేది. ఎవరూ ఎదురు రాకపోతే అమ్మ గానీ, అక్క గానీ అటు వెళ్లి ఇటు ఇంట్లోకి శకునంగా రావడం కూడా జరిగేది మధ్యేమార్గంగా.

గడప మీద కూచోకూడదు అని చెప్పేవారు. ఏదైనా ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా గడప దాటి చేయమనేవారు.

ఆడపిల్లలు జుట్టు విరబోసుకుని ఉండకూడదు అనేవారు.

దొడ్లో కాకి ఆగకుండా కావు కావుమంటుంటే చుట్టాలు వస్తారు అనుకునేవాళ్ళం. అలాగే ఎవరైనా చుట్టాలు అనుకోకుండా వస్తే "రండి రండి" అని సంతోషంగా ఆహ్వానిస్తూనే "పొద్దున్న కాకి అరచినప్పుడే అనుకున్నా ఎవరో ఇంటికి వస్తారని..." అనేవాళ్ళం.

ఒక కాకి చనిపోతే దాని చుట్టూ పది కాకుల గుంపు చేరి కావు కావుమంటూ వాటి సంఘీభావమో, సంతాపమో తెలియచేస్తే వాటి స్నేహాభావాన్ని మెచ్చుకున్నాము. ఆబ్దికాలలో కాకి పిండం తిన్న కాకులను మన పితృదేవతలలాగా భావించి శిరస్సు వంచి మరీ దండం పెట్టేవాళ్ళం.

ఇప్పటి తరానికి ఇవన్నీ చాదస్తాలు, పిచ్చి నమ్మకాలు లాగ అనిపించవచ్చు గానీ ఇవన్నీ వింటూ, చూస్తూ, ఆచరిస్తూ పెరిగిన తరం మనది. ఎందుకు అని ఎదురు తిరగలేదు, ఇప్పటి వారిలా వితండవాదం చేయలేదు, చాదస్తాలు అని కొట్టి పారెయ్య లేదు.
పెద్దల మాట చద్ది మూట అనుకుంటూ ఆచరించాం. హాయిగా ఆనందంగా పెరిగాము...

కాదంటారా?

🙏🙏🙏🙏🇮🇳🙏🙏🙏🙏ఒక మిత్రుడు పంపించగా మనసుకు హాయిగా అనిపించింది. అందుకే మీకూ పంపిస్తున్నాను. ఒక్క సారి ఆనందంగా బాల్యంలో గడిపేయండి.💐🌹🇮🇳🌹💐

తూర్పు గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారు అని ఒక మహాతల్లి ఉండేవారు....



ఇటువంటి మహానుభావురాలు మన తెలుగింటి ఆడపడుచు అయినందుకు ఎంతో గర్వాంగా ఉంది...

# ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కాసీతమ్మ గారి... #వర్ధంతి నేడు
💐💐💐 💐💐💐 💐💐💐

తూర్పు గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారు అని ఒక మహాతల్లి ఉండేవారు. ఆవిడ పేరు మీద ఆక్విడెక్ట్ కూడా కట్టారు. ఆవిడ గొప్ప నిరతాన్నదాత. వచ్చిన వాళ్లకి లేదనకుండా అన్నం పెట్టేవారు. ఆవిడ ధృతి, దీక్ష ఎంత గొప్పవంటే - ఆవిడ జీవితములో ఒకే ఒక్కసారి అంతర్వేది లక్ష్మినరసింహ స్వామి దర్శనానికని బయలుదేరారు. బయలుదేరి, గోదావరి వంతెన వద్ద పల్లకి ఆపారు. ఆవిడ పల్లకిలో కూర్చునారు, బోయీలు అలసిపోయి గట్టు మీద కూర్చున్నారు. అటుగా పి.గన్నవరం వైపు వెళ్ళిపోతున్న ఒక బృందంలో పిల్లలు ఆకలి అని ఏడుస్తుంటే, పెద్దవాళ్ళు "ఒక్క అరగంటలో గన్నవరం వెళ్ళిపోతాం... అక్కడ సీతమ్మ గారు మనకు అన్నం పెడతారు" అని మాట్లాడుకోవటం విన్నారు సీతమ్మగారు. వెంటనే ఆవిడ అంతర్వేది వెళ్ళటం మానేసి, పల్లకి వెనక్కి తిప్పెయ్యండి... వీళ్ళకి అన్నం పెట్టాలి అని వెనుకకు వెళ్ళిపోయారు. అంతటి నిరతాన్న దాత ఆవిడ.

ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్లిపోయిందంటే, అందరికీ పెట్టి పెట్టి, ఆ దంపతులకి తినటానికి ఏమీ లేకుండా పోయింది. ఒకానొకప్పుడు ఆవిడ భర్తగారు "ఎందుకు ఇంకా ఈ అన్నదానం? మనకి కూడా తినటానికి ఏమీ లేదు. వచ్చి ఎవరైనా తలుపుకొడితే సిగ్గేస్తోంది! పెట్టడమా మానవు! ఇంత అన్నం పప్పైనా పెడతావు..." అన్నారు. దానికి ఆవిడ "నేను నిస్వార్థముగా పెట్టేటప్పుడు, వచ్చిన వారు తింటున్నప్పుడూ వచ్చినదీ, తింటున్నదీ శ్రీ మహా విష్ణువుని నమ్మి పెట్టాను. ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టే చేతిని ఎందుకు నరికేస్తాడు? మనకి వాడే పెడతాడు" అని చెప్పి పెట్టింది. ఇన్నాళ్ళ నుంచి దున్నుతున్న అదే పొలానికి వెళ్లి సీతమ్మ గారి భర్త ఒక రోజు సాయంకాలం గొయ్యి తవ్వుతున్నారు. గునపానికి ఏదో తగిలి ఖంగుమంది. ఆయన మట్టి తీసి చూస్తే ఒక బిందె కనపడింది. బిందె మూత తీస్తే, దాని నిండా బంగారు నాణాలే. తీసుకొచ్చి ఇంట్లో బంగారు కాసుల రాశులు పోసి, మళ్లీ రొజూ కొన్ని వందల మందికి అన్నదానం చేసారు.

ఆశ్చర్యం ఏమిటంటే బ్రిటిష్ చక్రవర్తి తూర్పు గోదావరి జిల్లా కలక్టరుకి డొక్కా సీతమ్మ గారి ఫోటో తీసి పంపించమని ఉత్తరం వ్రాసాడు. దేనికి అంటే "నాకు పట్టాభిషేకము జరిగేటప్పుడు ఆవిడకు నమస్కారం పెట్టాలి. కానీ ఆవిడ సముద్రము దాటి రారు కాబట్టి, ఆ సమయములో ఒక సోఫా వేసి, ఆవిడ ఫోటో అందులో పెట్టి, ఆవిడకు నమస్కారము పెట్టి అప్పుడు పట్టాభిషేకము చేసుకుంటా" అని వ్రాసాడు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టరు గారు ఫోటోగ్రాఫర్ ని తీసుకుని ఆవిడ దగ్గరకు వెళ్తే, "నేను ఈ సన్మానాల కోసం, ఫోటోల కోసం, నమస్కారాల కోసం అన్నదానం చెయ్యలేదు. విష్ణుమూర్తికి అన్నం పెడుతున్నాని పెట్టాను. దీనికి ఫోటోలు పట్టభిషేకాలు ఎందుకు, వద్దు" అన్నారు ఆవిడ. "అమ్మ ఇది బ్రిటిష్ ప్రభువుల ఉత్తరం. మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారు" అని ఆ కలెక్టరు గారు చెబితే, "నీ ఉద్యోగం పోతుంది అంటే, తీయించుకుంటా, నువ్వు అన్నం తినాలి" అని తీయించుకున్నారు ఆవిడ. బ్రిటిష్ చక్రవర్తి నిజంగానే ఒక సోఫాలో ఆవిడ ఫోటో పెట్టి, నమస్కరించి, పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆవిడకి పంపించిన పత్రం కూడా ఇప్పటికీ ఉంది. ఒక మనిషి నిస్వార్థముగా, ధృతితో, పట్టుదలతో లక్ష్య సిద్ది కోసం పాటుపడితే, వారు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు, వారిని దైవం కూడా నిరంతరం కాపాడుతారు. డొక్కా సీతమ్మ గారి జీవితమే దీనికి నిదర్శనం...

( బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనముల నుండి సేకరణ)

ఓం శ్రీ అన్నపూర్ణా దేవ్యై నమః

#dokkasettamma
🙏🙏🌹🌹 💎 🌹🌹🙏🙏

నేటి ఆణిముత్యాలు. జ్ఞానం_అజ్ఞానం

నేటి ఆణిముత్యాలు. జ్ఞానం_అజ్ఞానం

సమాజంలో నేడు అత్యధికమైన దృశ్యం మనిషి అజ్ఞానంలో పుట్టి అజ్ఞానంలో పెరిగి చివరికి అజ్ఞానంలోనే పోతూ తన వారసులకు కూడా అజ్ఞానాన్ని పంచి ఇచ్చిపోతున్నాడు.

భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు మనిషి అంతిమ లక్ష్యం ఆత్మజ్ఞానం పొందటమే అని చెప్పడం జరిగింది.

జ్ఞానం వేరు తెలివి వేరు. రెండూ వేరు వేరు కానీ ఇది అర్థం కాక ఒకటే అనుకుని తెలివిగా వుండి వంకర పనులు చేస్తూ అక్రమంగా సంపదలు కూడపెట్టి ఇదే జ్ఞానం అనుకుంటున్నారు .

కానీ జ్ఞానం అంటే సంపదలు లేకపోయినా నైతిక విలువలు కలిగి మానవ విలువలు ఎరిగి కుటుంబ బంధాలను గుర్తెరిగి సమాజం పట్ల స్పృహ కలిగి సత్యమార్గంలో జీవిస్తూ ధర్మాన్ని ఆచరించడమే జ్ఞానం అంటే.

అదే ఆత్మజ్ఞానం ద్వారా మోక్షానికి మూలం ఇదే గీతా సారాంశం. అర్థం కావాలి అంటే రోజూ కొద్ది సేపు ధ్యానం మౌనం శాకాహారం అంతేనండి.

నమస్తే 👏

నేటి మంచిమాట. చావు బతుకులు అంటే ఎక్కడో లేవు.....

నేటి మంచిమాట.

మానవునికి చావు బతుకులు అంటే ఎక్కడో లేవు.....

మనతోనే అవి ఉంటుంది....

ధైర్యం., సేవ లో బ్రతుకు ఉంటుంది..,

తప్పు చేసినప్పుడు చావు అన్నది మనల్ని వెంటాడుతుంది....

మంచి చేసినంతకాలం బ్రతుకు అన్నది మన వెంటే ఉంటుంది స్నేహితులారా.....

మీకు మీరు సేవ చేసుకోండి.., అలాగే జీవించినంత కాలం సమాజానికి కూడా సేవ చేయండి.....

ఉషోదయం తో మానస సరోవరం 👏

కర్మసిద్ధాంతం -

కర్మసిద్ధాంతం -

ఏది విత్తుతావో ఆ పంటే కోసుకుంటావు..ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి ఫలితాలు పొందుతారు
మామిడి విత్తనం నాటితే మామిడిపండు, వేప విత్తనం నాటితే వేపపండు, వరి విత్తనాలు నాటితే వరి పంట వస్తుంది.అలాగే ఈ సృష్టిలో ఏ కర్మలు లేదా పనులు చేస్తే అలాంటి ఫలితమే అనుభవించాలి. ఏ పంట కావాలంటే అలాంటి విత్తనాలు నాటుతామో, అలాగే జీవితంలో ఎలాంటి ఫలితం కావాలంటే అలాంటి కర్మలు, పనులు చేయాలి.

ఒక రకం పనులు చేసి ఇంకొక రకం ఫలితాలు కావాలంటే రాదు .ప్రార్థించినా ప్రయోజనం లేదు
పనులుచేసేటప్పుడుఆలోచించి చేయాలి. మన భవిష్యత్తు, ఎలా ఉండాలి అనుకుంటామో అలాంటి కర్మలు చేయాలి.

లోకంలో అందరూ చేసేది ఒకటి, కోరుకునేది ఇంకొకటి.
అందుకే అందరూ దుఃఖంతో ఉన్నారు. హింస చేస్తారు. ఆనందం కోరుకుంటారు. కోరుకుంటే మాత్రం ఆనందం ఎలా వస్తుంది. అందుకే కర్మలు,పనులు,చేసేటప్పుడు, ఆలోచించి చేయాలి.చేసుకున్న కర్మ కంటే వేరుగా దైవం గానీ,,, ప్రారబ్దం గానీ, ఏదీ లేదు..

సేకరణ. మానస సరోవరం 👏

నేటి జీవిత సత్యం. స్త్రీ మూర్తి...!! గొప్పతనం

నేటి జీవిత సత్యం.
స్త్రీ మూర్తి...!!గొప్పతనం గురించి తెలుసుకుందాం.


తెలిసి తెలియని వయసులో అమ్మ తలవెంట్రుక.. తినే వాటిలో వస్తే.. తల వెంట్రుక వచ్చిందని… అమ్మపై గట్టిగా అరిచే వాడిని, చిరాకు పడేవాడిని!

కొంతకాలానికి నా వయసుతో పాటు ఆలోచన కూడా మారింది.

తన రక్తం పంచుకుని పుట్టిన నేను నా పుట్టుకకి కారణం అయిన తనని, చిన్న తల వెంట్రుక .. తినే వాటిలో వచ్చిందని "కోప్పడటం" సరైనది కాదు అనుకున్నాను.

అప్పటినుండి ఇప్పటి వరకూ ఎన్ని సార్లు తినే వాటిలో "తల వెంట్రుక" కనిపించినా తీసి పక్కన పడేసి తింటాను.

కారణం : -

వాళ్ళు అలా అయిపోవడానికి కారణమే మనం,
వాళ్ళ ఆరోగ్య సమస్యలకి కారణం మనం,

వాళ్ల నడుం నొప్పులకు, కాళ్ళ నొప్పులకు, ఆయాసానికి, తలపోట్లకు, కారణం మనం.

అలాంటప్పుడు.... తల వెంట్రుక వచ్చిందని, కూరలో ఉప్పు లేదని, కారం లేదని, రుచిగా లేదని, సరిగా ఉడకలేదని, ఇలాంటి మాటలు అనడం కరక్ట్ కాదు .

ఎందుకంటే వాళ్ళు మనకి చేసిన వాటితో పోలిస్తే మనం వాళ్ళకి చేస్తున్నది చాలా తక్కువ.

వాళ్ళ జీవితకాలం మొత్తం మనకోసం మాత్రమే కష్టపడ్డారు. కష్టపడుతూనే ఉన్నారు.

వాళ్ళ కష్టానికి విలువ ఇవ్వకపోయినా పర్వాలేదు, పొగడకపోయినా పర్వాలేదు, కానీ చిరాకు పడకండి, కోపడకండి, విసుక్కోకండి, అసహ్యంగా మాట్లాడకండి.

తిన్నావా అని అడగకపోయినా పర్వాలేదు గానీ.... మనకోసం వండి పెట్టిన వాటికి పేర్లు పెట్టకండి. భగవంతుడు మిమ్మల్ని క్షమించడు.

పైన చెప్పినవన్నీ కూడా మనకోసం రోజంతా కష్టపడే తల్లికి, భార్యకు ప్రతి స్త్రీ మూర్తికి వర్తిస్తుంది.

తల్లి నడక నేర్పిస్తే....
భార్య ఆ నడకను జీవితాంతం నడిపిస్తుంది.

ఒకరు ఎక్కువ కాదు. ఇంకొకరు తక్కువా కాదు.
మగాడి జీవితంలో "తల్లి" "భార్య" ఇద్దరూ రెండు కళ్ళతో సమానం.

బంధాలు దూరం అయ్యాక అలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది అని బాధ పడేకంటే ఉన్నప్పుడే జాగ్రత్తగా బాధ్యతగా చూసుకోవడం మంచిది...✍️

సేకరణ. మానస సరోవరం 👏

నేటి కథ ✍🏼 హితోపదేశం

✍🏼 నేటి కథ ✍🏼

హితోపదేశం

రెండువేల సంవత్సరాల క్రిందటి మాట. అశోక చక్రవర్తికి విపరీతమైన రాజ్యకాంక్ష ఉండేది. దురాశ కొద్దీ ఆయన చిన్న రాజ్యమైన కళింగపై దండెత్తాడు.

అయితే ఆయన ఊహించనంత పెద్ద యుద్ధం జరిగింది. కళింగవీరులు ఎందరో రాజ్య రక్షణ కోసం ప్రాణాలు ధారపోసారు తప్ప ఓటమిని మాత్రం అంగీకరించలేదు. ఆ వీరయోధుల రక్తం ఏరులై ప్రవహించింది. యుద్ధభూమి మొత్తం కళేబరాలతో నిండిపోయింది. అవయవాలు తెగి పడి ఉన్నాయి- నెత్తురు మడుగులు...

ఇదంతా చూసిన అశోకుడు ఆలోచనలో‌ పడ్డాడు. "తను చేసింది తప్పు" అన్న ఆలోచన అతనిలో‌ మొదలై, మెల్లగా అతని హృదయాన్ని దహింపజేసే భయంకర జ్వాలగా మారింది. ఆనాటి యుద్ధంలో కళింగరాజ్యపు స్త్రీపురుషులు ప్రదర్శించిన స్థైర్యం అశోకుడిని విచలితుడ్నిని చేసింది. అతనిలో వేదన మొదలైంది. కళింగ రాజ్యాన్నే కాదు; తాను జయించిన ప్రతి రాజ్యాన్నీ స్వతంత్రంగా విడచి పెట్టాలని నిశ్చయించుకున్నాడు. బుద్ధ భగవానుడి బోధనల సారం ఏమిటో అతనికి కొద్ది కొద్దిగా అర్థమౌతున్నట్లు అనిపించింది.

గుండెనిండా వేదనతో యుద్ధ భూమిలో తిరగటం మొదలు పెట్టాడు-

అక్కడ ఒక చెట్టు క్రింద కూర్చొని కనబడింది ఒక ముసలమ్మ. ఆమె జుట్టు రేగిపోయి ఉన్నది. కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయి. భయంకరమైన గొడ్డలిని ఒకదాన్ని రాతి పైన రంగరిస్తూ పదునుపెడుతున్నదా క్రోధ మూర్తి. ఆమె దగ్గరికి వెళ్ళి అడిగాడు అశోక చక్రవర్తి-

"అవ్వా! ఏంచేస్తున్నావు? యీ వయస్సులో, యీ ఎండలో- ఇలాంటి ప్రదేశంలో‌ కూర్చొని నువ్వు చేస్తున్న పనేమిటి? అడవికి పోయి కట్టెలు కొడతావా? ” అని.

అవ్వ కోపంతో ఊగిపోయింది. "కాదు నాయనా, కాదు! నా ప్రయత్నం కట్టెపుల్లల కోసం కాదు! నా కొడుకులందరినీ పొట్టన పెట్టుకొన్న రాక్షసుడు- ఆ అశోకుణ్ణి రేపటి యుద్ధంలో హతమార్చనున్నాను నేను. నాతో పాటు నాలాంటి వేలాది తల్లుల ఉసురు పోసుకున్న ఆ దుర్మార్గుడు ఊరికే చావడు! ఈ గొడ్డలికి ఎంత పదును పెడతానంటే, దీనితో ఒక్క వేటుకు వాడి తల తెగి పడాలి!" అని అరిచింది.

ఆవిడ క్రోధాన్ని చూసి అశోకుడి గుండెలోంచి శోకం తన్నుకొచ్చింది. ఇంతమంది తల్లులకు గర్భశోకం కల్గించిన తను నిజంగా శిక్షకు పాత్రుడే అనిపించింది. కొంచెం సేపు అతని నోట మాట రాలేదు. తరువాత అన్నాడు "అశోకుడు మగధ సామ్రాట్టూ, మహాయోధుడున్నూ. ముసలి దానివి, నువ్వు వాడిని ఏం చేస్తావు?” అని.

అవ్వ నవ్వింది- ఆ నవ్వులోని శోకం అశోకుడి హృదయాన్ని పిప్పి పిప్పి చేసింది- "కళింగ స్త్రీల శౌర్యం నీకు తెలీదల్లేఉంది నాయనా! మూడు కాళ్ల ముసలిదైనా పగవాడిని మూడు చెరువుల నీళ్లు త్రాగించగలదు. అశోకుడు గెలిచే కళింగలో నరపురుగు అన్నదే ఉండదు చూస్తుండు!" స్థిరంగా పలికింది అవ్వ.

అశోకుడి కన్నీరు కాల్వలైంది. "అవ్వా! నువ్వన్నట్టు ఆ దుర్మార్గుడు రాక్షసుడే! వాడికి ఏ శిక్ష విధించినా చాలదు. వాడి పాపానికి వేరే నిష్కృతి లేదు" అన్నాడు దగ్గుత్తికతో.

"రేపు రానివ్వు వాడిని! కనిపించగానే వాడిని ఎలా యీ గొడ్డలికి బలి చేస్తానో చూడు" ఆవేశంతో ఊగిపోయింది అవ్వ.

అశోకుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. అన్నాడు- "అవ్వా! ఒక్క క్షణం ఆలోచించు. నువ్వు ఆ అశోకుడి ప్రాణాలు తీస్తే ఆ క్షణంలోనే నీ ఆగ్రహం చల్లారి పోతుంది; వాడికి ఇక మరే బాధా ఉండదు. అట్లా కాకూడదు. వాడు బ్రతికే ఉండాలి- బ్రతికి ఉన్నన్ని రోజులూ వాడు నేలమీద పొర్లాడుతూ చిత్రహింసను అనుభవించే మార్గం చూడు. అట్లా జరిగితే తప్ప వాడి ఈ పాపాగ్ని చల్లారదు" అన్నాడు అశోకుడు.

"అయితే వాడి కాళ్లు నరుకుతాను. అటు ప్రాణాలూ పోక, ఇటు కాళ్ళూ లేక వాడు చిత్రహింసలు అనుభవించాలి!" కసిగా అంది అవ్వ.

అశోకుడు తలవంచుకొని నిలబడ్డాడు- "అవ్వా! ఆ కసాయి అశోకుడు వీడే! ఇదిగో, ఇక్కడే- నీ కళ్ల ముందు ఉన్నాడు. తెగనరుకు, వాడి కాళ్ళు!" అన్నాడు నెమ్మదిగా.

అవ్వ తలెత్తి చూసింది. మాసిన వస్త్రాలతో, ఎర్రని తలపాగాతో కన్నీళ్లు కార్చుతూ దీనంగా నిలబడ్డ అశోకుడు కనిపించాడు.

చాలాసేపటివరకూ ఆ అవ్వ ఏమీ మాట్లాడలేదు. తర్వాత అన్నది- “నువ్వు చేసినది మామూలు తప్పు కాదు. రాజ్య కాంక్షతో‌ ఇంతమందిని బలి తీసుకున్నావు. నిజంగానే నీకు ఏ శిక్ష వేసినా చాలదు. అయితే నువ్వు ఈనాడు నిజంగా పశ్చాత్తాపంతో పరితపిస్తున్నావని అర్థమైంది నాకు. పశ్చాత్తప్తులను శిక్షించరాదు.
నువ్వు కూడా‌ నా కుమారులవంటివాడివే- ఏమంటే, నా కుమారులు దేశంకోసం వీరమరణం చెందారు; నువ్వు వాళ్లందరి ఉసురూ పోసుకొని హంతకుడివైనావు. అయినా పశ్చాత్తాపం చెందిన నిన్ను నేను ఏమీ చెయ్యను. పో, ఇక్కడినుండి" అని కన్నీళ్ళపాలైంది.

"అవ్వా! నా కాళ్లు నరికి నా అహంకారాన్ని పటాపంచలు చెయ్యి. లేదంటే నా పాపానికి నిష్కృతి లేదు" అశోకుడు ఆమె పాదాలపై పడ్డాడు. దు:ఖంతో‌ అతని గొంతు పూడిపోయింది.

పిడికెడు ఉప్పు

🍁 పిడికెడు ఉప్పు🍁

✍️ మురళీ మోహన్

"స్వామీజీ...
నా జీవితమంతా కష్టాలే.
ఈ జీవితాన్ని భరింoచలేకపోతున్నాను.
దయచేసి నా కష్టాలు తీరే మార్గo చెప్పండి."

గురువు ఆ యువకుడి వైపు చూశాడు.

ఒక గ్లాసు నీటిలో ఒక పిడికెడు ఉప్పు వేయమన్నాడు.
యువకుడు అలాగే చేశాడు.

"తాగు"

యువకుడు గ్లాసు పైకెత్తాడు. నీటిని తాగాడు.
వెంటనే ఉమ్మేశాడు...

"అబ్బ... భరిoచలేని ఉప్పు...."

ఇంకో పిడికెడు ఉప్పు తీసుకుని ఆ యువకుడిని చెరువు దగ్గరకు తీసుకెళ్లాడు గురువు.

"ఈ ఉప్పు ఈ చెరువులో వెయ్యి. ఈ నీటిని తాగు"

యువకుడు చెరువు నీటిని గడగడా తాగేశాడు.

"ఎలా ఉంది?"

"నీరు తీయగా ఉంది"

"అదే పిడికెడు ఉప్పు. అప్పుడెందుకు భరించలేకపోయావు.
ఇప్పుడెలా భరించావు?"

అది తక్కువ నీరు.
గ్లాసుడు నీరు.
అందుకే ఉప్పగా ఉంది.
ఇది చెరువు.
అంటే ఎక్కువ నీరు...
అందుకే ఉప్పదనం లేదు."
అన్నాడు యువకుడు.

"నాయనా...
సమస్యలు పిడికెడు ఉప్పు లాంటివి.
అది గ్లాసులోనూ పిడికెడే.
చెరువులోనూ పిడికెడే.
కానీ నీ జీవితం గ్లాసులా ఉండాలా...
చెరువులా ఉండాలా అన్నది మాత్రం నువ్వే నిర్ణయించుకోవాలి.
నీ పరిధి పెరిగితే పిడికెడు ఉప్పు తక్కువవుతుంది.
నీ పరిధి సంకుచితమైతే పిడికెడు ఉప్పు భరించలేనంత అవుతుంది"
అన్నాడు గురువు. 👍

Wednesday, April 27, 2022

🤔 ఎక్కడుందో రహస్యం..🙄

🤔 ఎక్కడుందో రహస్యం..🙄

చిన్నప్పుడు
ఏ పండక్కో..పబ్బానికో
Dress కుట్టిస్తే..
ఎంత ఆనందమో...👗👕

ఎప్పుడు పండగ
వస్తుందా, ఎప్పుడు
వేసేసుకుందామా
అన్న ఆతృతే...🥳

ఇంటికి చుట్టాలొచ్చి
వెళ్తో వెళ్తూ..
చేతిలో రూపాయో...
అర్ధరూపాయో పెడితే
ఎంత వెర్రి ఆనందమో...😊

చుట్టాలొచ్చి వెళ్లిపోతుంటే
దుఃఖం తన్నుకు వచ్చేది...
ఇంకా ఉంటే బాగుండు
అన్న ఆశ...
ఎంత ఆప్యాయతలో...💞

సినిమా వచ్చిన ఏ
పదిహేను రోజులకో
ఎంతో ప్లాన్ చేసి
ఇంట్లో ఒప్పించి
అందరం కలిసి
నడిచి వెళ్లి..
బెంచీ టికెట్
కొనుక్కుని సినిమా
చూస్తే ఎంత ఆనందమో...🥰

ఇంటికొచ్చాకా
ఒక గంటవరకూ
ఆ సినిమా కబుర్లే...
మర్నాడు స్కూల్ లో
కూడా...
ఆ ఆనందం ఇంకో పది
రోజులుండేది...💖

అసలు రేడియో విచిత్రం..
అందులోకి మనుషులు
వెళ్లి మాట్లాడతారా అన్న
ఆశ్చర్యం...అమాయకత్వం..🙄

పక్కింట్లో వాళ్లకి రేడియో
ఉంటే..ఆదివారం
మధ్యాహ్నం వాళ్ళ గుమ్మం
ముందు కూర్చుని
రేడియో లో సంక్షిప్త
శబ్ద చిత్రం (ఒక గంట కి
కుదించిన) సినిమాని
వింటే ఎంత ఆనందం...
మనింట్లో కూడా రేడియో
ఉంటే...అన్న ఆశ...😇

కాలక్షేపానికి లోటే లేదు...
స్నేహితులు
కబుర్లు, కధలు
చందమామలు
బాలమిత్రలు...🥰

సెలవుల్లో మైలు దూరం
నడిచి లైబ్రరీ కి వెళ్లి
గంటలు గంటలు
కథల పుస్తకాలు
చదివి ఎగురుకుంటూ
ఇంటికి రావడం....🏃🏻‍♂️

సర్కస్ లు,
తోలు బొమ్మలాటలు
లక్కపిడతలాటలు...
దాగుడు మూతలు...
చింత పిక్కలు
వైకుంఠ పాళీ
పచ్చీసు..
తొక్కుడు బిళ్ళలు..
ఎన్ని ఆటలో...☺️

మూడు గదుల రైలుపెట్టి
లాంటి ఇంట్లో అంతమంది
ఎంత సంతోషంగా ఉన్నాం...
వరుసగా కింద చాపేసుకుని
పడుకున్నా ఎంత హాయిగా
సర్వం మరిచి నిద్రపోయాం...😴

అన్నంలో కందిపొడి..
ఉల్లిపాయ పులుసు
వేసుకుని తింటే
ఏమి రుచి...
కూర అవసరమే లేదు..🤷‍♂️

20/-రూపాయలు తీసుకెళ్లి
నాలుగు కిలోల
బియ్యం తెచ్చేది...
ఇంట్లో, చిన్నా చితకా
షాపింగ్ అంతా నేనే...
అన్నీ కొన్నాకా షాప్
అతను చేతిలో గుప్పెడు
పుట్నాల పప్పో, పటికబెల్లం
ముక్కో పెడితే ఎంత
సంతోషం...
ఎంత బరువైనా
మోసేసేవాని..💓

ఎగురుతున్న విమానం
కింద నుండి
కళ్ళకు చెయ్యి అడ్డం
పెట్టి చూస్తే ఆనందం...🥰

తీర్థం లో ముప్పావలా
పెట్టి కొన్న ముత్యాల దండ
చూసుకుని మురిసి
ముక్కలైన రోజులు...

కొత్త పుస్తకం కొంటే
ఆనందం...వాసన
చూసి మురిపెం..
కొత్త పెన్సిల్ కొంటే
ఆనందం...
రిక్షా ఎక్కితే...
రెండు పైసల
ఇసుఫ్రూట్ తింటే
ఎంత ఆనందం..?🤩

రిక్షా ఎక్కినంత తేలికగా...
ఇప్పుడు విమానాల్లో
తిరుగుతున్నాం...✈️
మల్టీప్లెక్స్ లో ఐమాక్స్
లో సినిమా చూస్తున్నాం.
ఇంటర్వెల్ లో
ఐస్ క్రీం తింటున్నాం..🍧

బీరువా తెరిస్తే మీద పడి
పోయేటన్ని బట్టలు...
చేతినిండా డబ్బు...
మెడలో ఆరు తులాలనగ....
పెద్ద పెద్ద ఇళ్ళు, కార్లు...
ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు...
హోమ్ థియేటర్లు...
సౌండ్ సిస్టమ్స్,
చేతిలో ఫోన్లు...
అరచేతిలో స్వర్గాలు...
అనుకోవాలే గానీ క్షణంలో
మన ముందు ఉండే
తిను బండారాలు..
సౌకర్యాలు...😍

అయినా చిన్నప్పుడు
పొందిన ఆ ఆనందం
పొందలేకపోతున్నాం
ఎందుకు ...?
ఎందుకు...? ఎందుకు...?🤔

చిన్నప్పుడు కోరుకున్నవి
అన్నీ ఇప్పుడు
పొందాము కదా...
మరి ఆనందం లేదేం...
ఎందుకంత మృగ్యం
అయిపోయింది...
ఎండమావి
అయిపోయింది..

మార్పు ఎందులో...?🤔
మనలోనా...?
మనసుల్లోనా...?
కాలంలోనా...?
పరిసరాల్లోనా...?
ఎందులో... ఎందులో...?
ఎందులో ...?
చెప్పరా తెలిస్తే....!!

ప్లీజ్. తెలిస్తే గట్టిగా అరవాలనిపిస్తుంది
(

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

"తలుపులు" మూసుకుని కూర్చున్నంత మాత్రాన,
"తలరాతలు మారిపోతాయా...?
"తలరాత" గురించే ఆలోచిస్తూ కూర్చుంటే,
ఉన్న తల పాడైపోతుంది...?
"తలపులు" (ఆలోచనలు) మార్చుకుంటే,
"తలరాతలు" సైతం మారిపోతాయి..
మారే కాలంతో పాటే నీ ఆలోచనలను,
నీ అభిరుచులను మార్చుకో!
కానీ వ్యక్తిత్వాన్నీ మార్చుకోకు..

కలుపు మొక్కలు ఏరే కొద్ది పుడతానే ఉంటాయి,
చెడ్డ వారిని తప్పించుకు పోయే కొద్ది ఎదురు పడుతునే ఉంటారు..
కొంతమంది మనుషులు "మేఘాలు" లాంటివారు,
వాళ్లు వెళ్లిపోయాక ఆకాశం అందంగా ఉంటుంది!_

🌅శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏

మనం అంతమయ్యే వరకు...అన్ని అనుభవించాల్సిందే...బాధలైనా ,సంతోషాలైన...

ఎందుకంటే ఆపదకి సంపద నచ్చదు...
సంపదకి బంధాలు నచ్చవు.. బంధాలకి బాధలు నచ్చవు...
బాధలు లేని బ్రతుకే లేదు..బ్రతుక్కి చావు నచ్చదు...

ఇన్ని నచ్ఛకున్నా మనల్నినలుగురు మోసే వ్యక్తుల
మనసులో ప్రేమ సంపాదించనప్పుడు

మనం బ్రతికివున్న శవమే....

శుభ మధ్యాహ్నం తో మానస సరోవరం 👏

దైవం మానుష రూపేణా

దైవం మానుష రూపేణా
➖➖➖

’మానుష రూపేణ’ అంటే దైవం ఎక్కడో లేదు మనిషి రూపంలోనే మన దగ్గర ఉంటుంది అని అర్థం..! మరి ఆ యొక్క దైవస్వరూపం ఎవరు అంటే .. మొదటగా మనను నవమాసాలు మోసి, జన్మనిచ్చిన తల్లి,(రెండవది మనం ఈ భౌతిక శరీరధారణకు కారణమైన 'తండ్రి'), మూడవది మన చుట్టూ ఆవరించి ఉన్న చీకట్లు, అజ్ఞానం తొలగించిన గురువు. చివరిగా నాలుగవది.. మనకు సేవకు అవకాశం కల్పించిన భగవత్ స్వరూపం అతిథి..!

అందుకే మన సనాతనధర్మం నినదిస్తుంది .. ‘మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ !’ అని.


మాతృదేవోభవ:

ఇలలో తల్లిని మించిన దైవం లేదు అన్న ప్రాథమిక సత్యాన్ని ప్రతిఒక్కరూ గుర్తెరగాలి.. డిల్లీకి రాజు అయినా తల్లికి బిడ్డే కదా..! అసలు భూలోకంలో అద్భుతం ఏదైనా ఉంది అంటే అది 'నువ్వే'.

మరి అటువంటి అద్భుతాన్ని సృష్టించిన తల్లికి మించిన వేరే దైవం ఏమి ఉంటుంది. తన రక్త మాంసంతో మనిషిని సృష్టించి, ప్రత్యక్షంగా కంటికిరెప్పలా కాపాడుతూ పెంచి, పోషించి, ప్రయోజకుడిగా సరిదిద్దడంతో తల్లిపాత్ర ప్రతి మనిషి జీవితంలోనూ సుస్పష్టం..! మరి అటువంటి తల్లి ఒకరోజు వృద్ధురాలు అయినప్పుడు ఆ యొక్క తల్లితో మనం ఎలా వ్యవహరిస్తున్నాం? మనకు మనం ఏం ఇచ్చి ఋణం తీర్చుకోగలం? తనకు స్వాంతన కలిగించడమే మనం తల్లి ఋణం తీర్చుకోవడం.. తల్లితో అమర్యాదగా వ్యవహరించకపోవడమే ఋణం తీర్చుకోవడం ! తల్లిని గౌరవించడమే.. తల్లికి అగ్రతాంబూలం..!!


పితృదేవోభవ:

తల్లి .. తండ్రి.. రెండుకళ్ళు ప్రతి మనిషికి. నిరాకార భగవంతునికి సాకార ప్రత్యక్షమే తండ్రి.. మన ఎదుగుదలకు అనుక్షణం ఆరాటపడుతూ.. జీవితంలో ప్రత్యక్షం పోరాడుతూ.. మన ఉన్నతికి బాటలు వేసిన అలుపెరుగని యోద్ధుడు ‘తండ్రి..!’ సమసమాజంలో మనకోసం గౌరవం, బాధ్యత, కర్తవ్యం, భద్రత, కీర్తి, వంశం, ప్రతిష్ట మొదలగు పదాలకు స్వరూపం నాన్న.

అందుకే ఒక మహాత్ముడు ఇలా అన్నాడు.. "ఎవరైనా ఒకరికి చేతులు జోడించి నమస్కారం పెడుతున్నాం అంటే ఆ యొక్క వ్యక్తి ఆ స్థాయికి ఎదగడానికి కారణం అయిన అతని తల్లి, తండ్రులకు మొదట నమస్కారం పెట్టాలి." కాని వారిని కన్న తల్లి తండ్రులు.. మరింత గౌరవనీయులు..! తల్లి తండ్రులను గౌరవించడమే .. అసలైన ఆధ్యాత్మికత. వారు శరీరాలను వదిలిన తరువాత విగ్రహాలు నిర్మించడం, ఫోటోలకు దండలు వేయడం, కర్మకాండలు ఆడంబరంగా నిర్వహించడం ముఖ్యం కానేకాదు. వారు జీవించియుండగా వారికి తోడుగా, నీడగా ఉండడమే అసలైన మన ధర్మం..!


ఆచార్య దేవోభవ:

మనతో ఏ మాత్రం రక్త సంబంధం లేకున్నా మన ఉన్నతి కోసం పై లోకాల నుండి దిగివచ్చిన.. మనలను గొప్ప జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి కంకణబద్ధుడై, అపర భగవంతుడే ఆచార్యుడు .. ఇహ, పర జ్ఞానాన్ని మనకు ప్రసాదించి జన్మను సార్థకం చేసుకుని మహా భాగ్యాన్ని మనకు అందించిన గురువుకు సదా కృతజ్ఞుడై ఉండడమే 'ఆచార్య దేవోభవ'.


అతిథి దేవోభవ:

మనకు తల్లి తండ్రుల ద్వారా సంక్రమించిన సంస్కారాన్ని, గురువు ద్వారా అభ్యసించిన జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడానికి.. మనకి విశేష సేవకి అవకాశం కల్పించిన మహాత్ముడే 'అతిథి'. 'పంచుకుంటే పెంచబడుతుంది' అన్నది పరమసత్యం. అతిథి సేవ ద్వారానే మన జీవితంలో ప్రస్ఫుటం అవుతుంది. మనం ఎవరికైనా సేవ చేసే అవకాశం వస్తే.. సాక్షాత్ భగవంతుడికి సేవ చేస్తునట్లే .. అందుకే భగవాన్ శ్రీ సత్యసాయి అందరికీ బోధిస్తూండేవారు .. 'మానవ సేవయే మాధవ సేవ' అని .. ఇలా మనకు సేవకు అవకాశం కల్పించిన మన తోటి మిత్రులే అతిథి దేవుళ్ళు.

మానవ జన్మ తీసుకుని ఎవరైతే ధ్యానసాధన, అహింసపాలనలో ఉంటారో వారు మాత, పితృ ఋణం తీర్చుకున్నవారు అవుతారు. మరి ఎవరైతే ధ్యానప్రచారం, జ్ఞానప్రచారంలో సారధులౌతారో వారు గురు ఋణం తీర్చుకున్నవారు అవుతారు .. ప్రతివ్యక్తికి సేవచేస్తూ.. అందరిలో భగవత్ స్వరూపాన్ని దర్శించుతారో అతిథి ఋణం తీర్చుకున్నవారు అవుతారు. తన జన్మకు ఒక అర్థం, పరమార్థం సాధించుకున్న వారుగా.. ఆచంద్రార్కంగా .. ఆనందంలో జీవిస్తాడు

సేకరణ. మానస సరోవరం 👏

ప్రశాంత్ కిషోర్ !

ప్రశాంత్ కిషోర్ !

అందరికీ ఈ పేరు ఇప్పుడు సుపరిచితమే !

అనేక రాజకీయ పార్టీలు ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకొన్నాయి .. నియమించుకొంటున్నాయి .. నియమించుకొంటాయి .

ఇప్పుడు ఇలాగే మరో వ్యూహకర్త సునీల్ .

వీరి వ్యూహాలు ,
వాటి వల్ల సమాజానికి జరిగే లాభం ఎంత ?నష్టం ఎంత ? ప్రజాస్వామ్యానికి ఇది మంచి చేస్తుందా?
లేక చెడా?
ఈ చర్చ వేరు .
ఈ పోస్ట్ దాని పై కాదు .

ప్రశాంత కిషోర్ ఆదాయం ఎంత ఉంటుంది ? బహుశా వందల కోట్లు .

ఎంత పెద్ద ఉద్యోగం చేస్తే ఇంత సంపాదన . సంపాదనకు మించి పేరు ప్రతిష్టలు . పలుకుబడి ? ఎంత పెద్ద ఉద్యోగం చేస్తే ముఖ్య మంత్రులను నేరుగా కలిసే అవకాశం ఉంటుంది ?

ఇక్కడేమో ముఖ్య మంత్రులే ప్రశాంత్ కిషోర్ లాంటి వారి కోసం ఎదురు చూసే స్థితి .

పదేళ్ల క్రితం ఇలాంటి ఒక వృత్తి ఉంటుందని ఎవరైనా ఊహించారా ?

ప్రపంచం లో ఏదైనా యూనివర్సిటీ ఇలాంటి కోర్స్ ను డిజైన్ చేసిందా ?
లేదు కదా .

మరి ప్రశాంత్ కిషోర్ కు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది ?

దీన్నే లాటరల్ థింకింగ్ అంటారు . భిన్న కోణం లో ఆలోచించడం

మీరు టాక్సీ ఓనర్ కావాలంటే ?
లోన్ తీసుకోవాలి .
కారు కొనాలి .
డ్రైవర్ ను పెట్టుకోవాలి . దానికొక ఆఫీస్ .
ఇలా చేస్తే ఎన్ని కారులకు ఓనర్ అవుతారు ?

ఒక్క కారు కూడా కొనకుండా ,
ఒక్క డ్రైవర్ కు కూడా జీతం ఇవ్వకుండా ప్రపంచం లో అతి పెద్ద కారు రెంటల్ కంపనీస్ వచ్చాయి .

ఉబెర్ .. ఓలా..

జస్ట్ ఒక ఐడియా తో.. భిన్నంగా ఆలోచించడం వల్ల

ఇదే విధంగా రెస్టారెంట్ లు ..

ఒక్క బిల్డింగ్ కూడా లేకుండా ఒక్క కుక్ ను కూడా నియమించుకోకుండా ప్రపంచ రెస్టారెంట్ సామ్రాజ్యం ..

ఒక్క ఐడియా తో .. జొమాటో .. స్విగ్గీ

చికెన్ ఫ్రై ఎంత పెద్ద బిజినెస్ ?

రోడ్డుపైన ఎక్కడో వైన్ షాప్ ముందు పెట్టుకొంటే ..

రోజంతా కస్టపడి పని చేస్తే అయిదు వందల లాభం .

కానీ వాడు భిన్నంగా ఆలోచించాడు .
ప్రపంచ చికెన్ సామ్రాజ్యం .. అదే kfc

ఇది ప్రారంభం మాత్రమే . రానున్నది రోబో యుగం .

ఇప్పుడున్న ఉద్యోగాల్లో సగానికి పైగా ఉద్యోగాలను రోబో లు ఎత్తుకొని పోతాయి .

ఇప్పటికి మనం ఊహించని ఉద్యోగాలు .. అంటే ఇంకా పేరు పెట్టని ఉద్యోగాలు .. అవకాశాలు వస్తాయి .

వాటికి ఫలానా కోర్స్ అంటూ లేదు .

బాబాయ్ హోటల్ ఓనర్ ఏ యూనివర్సిటీ లో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసాడు ?

పుల్లా రెడ్డి గారు ? kfc ఓనర్ ? ప్రశాంత్ కిషోర్ కు ఎన్నికల టక్కు టమారాలు నేర్పిన కాలేజీ ఏది ?
ఉబెర్ ఓనర్ చదివిన యూనివర్సిటీ ఏది ?

రానున్నది కొత్త ప్రపంచం

నువ్వు ఎక్కడ చదివావు అనేది కాదు .
ఎన్ని మార్కులు వచ్చాయి ?
రాంక్ ఎంత అనేది అసలే కాదు .

సరి కొత్త గా ఆలోచించగలవా ?

నీలో భ్యవిష్యత్తు నైపుణ్యాలు...
అంటే...
కాగినీటివ్ ఫ్లెక్సిబిలిటీ , లాటరల్ థింకింగ్ , క్రిటికల్ థింకింగ్ ,
సోషల్ ఇంటలిజెన్స్ , ఎమోషనల్ ఇంటలిజెన్స్,
క్రియేటివిటీ లాంటి స్కిల్స్ ఉన్నాయా ? లేవా ? అనేదే ప్రశ్న .

చదువంటే బట్టి కొట్టి మార్కులు సాధించడం కాదు .

అది వ్యక్తి జ్ఞాపక శక్తికి పరీక్ష .

నీకంటే మిలియన్ రెట్లు ఎక్కువ సమాచారాన్ని నిక్షిప్తం చేసి ప్రాసెస్ చేయగల రోబో లు, కృత్రిమ మేథ ఒక పక్క ఉంటే,

జ్ఞాపక శక్తి తో ప్రపంచం లో రాణించాలంటే, మూడవ ప్రపంచ యుద్ధాన్ని విల్లంబులతో జయించాలని ప్రయత్నం చేయడం లాంటిది .

ఫ్యూచరిస్టిక్ స్కిల్స్ ఏంటి ?

వాటిని బాల్యం నుంచే నేటి తరానికి ఎలా నేర్పాలి ?

సృజనాత్మతక అనేది భవిష్యత్తు లోఅతి కీలక నైపుణ్యం అవుతుంది .

సృజనాత్మకత పుట్టుకతో రావాలి కదా ?

దాన్ని నేర్పడం సాధ్యమా ?

సృజనాత్మకత అనేది ఇది పుట్టుకతో 80% వస్తే ఉన్నదాన్ని ఖచ్చితంగా 20 శాతం అభివృద్ధి చెందిచవచ్చు అంటే ఒక వ్యక్తి 60 శాతం సృజనాత్మకత కలిగి జన్మిస్తే అతని 20 మెరుగుపరచవచ్చు అలాగే 80 ఉన్నవాని 100 చేయవచ్చు కానీ మనం అలాంట బోధన అభ్యసన ప్రక్రియలను చేపట్టవలసి ఉంటుంది
మన విద్యా విధానం వ్యక్తిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి అభివృద్ధి చేసేదిగా ఉండాలి.

మనం చదువుకున్న చదువులు వేరు. ఇపుడు నడుస్తున్న, రాబోయే తరాల విద్యార్ధులు మల్టీ టాలెంటడ్ స్కిల్స్ కలిగి ఉంటే తప్ప కెరీర్ లో రాణించలేరు. Bookish knowledge తో పాటుగా Soft skills like presentation skills, communication skills, decision making, planning and execution skills, time management, positive thinking లతో పాటుగా creativity తో routine కి భిన్నంగా వినూత్న ఆలోచనా విధానం భవిష్యత్తులో కీలకం కానుంది. పిల్లలందరినీ ఆ విధంగా తీర్చిదిద్దాలి.

సేకరణ. మానస సరోవరం 👏

నేటి జీవిత సత్యం. మనిషి కంటే మృగాలే నయం.

నేటి జీవిత సత్యం.
మనిషి కంటే మృగాలే నయం.

ఎంత విజ్ఞానముండియు నేమిఫలము
మానవత్వము కోల్పోయి మనిషి నిలిచె
మానవుల కన్న మృగములే మంచివేమొ
ఇంతకన్నను వేరెద్ది ఎరుకపరతు!

🪴🌷ఒక అడవిలో పులి తరుముతుంటే ఒక వేటగాడు ఒక చెట్టు ఎక్కాడు. చెట్టు మీద ఎలుగుబంటుంది. హడలిపోయాడు. కాని ఎలుగుబంటు ఆ మనిషిపట్ల తన సాత్విక స్వభావం చూపెట్టి అతనికి అపకారం తలపెట్టలేదు. ఇంతలో పులి "ఎలుగుబంటూ ఆ మనిషిని నేను చంపి తినడానికి తరుముకొచ్చాను. వాణ్ణి కిందకు తోసెయ్యి” అంది. ఆ ఎలుగుబంటు " ఓ పులీ! ఈ చెట్టు నా నివాసం. ఇప్పుడా మనిషి నా అతిథి. అతన్ని రక్షించడం నా కర్తవ్యం” అంది.

🩸🌹కొంతసేపటికి ఎలుగుబంటు నిద్రపోయింది. అప్పుడు పులి ఆ వేటకాడితో “నాక్కావల్సింది ఆహారం. నీ ప్రాణం దక్కించుకోవాలంటే ఆ ఎలుగుబంటును కిందకు నెట్టెయ్యి. దాన్ని చంపుకు తింటాను" అంది. మరి మనిషి జంతువు కంటే విజ్ఞానవంతుడు కదా! పులి చెప్పిన ఉపాయం నచ్చింది. వెంటనే తన శక్తినంతా ఉపయోగించి. ఆ ఎలుగుబంటును క్రిందికి నెట్టేసాడు. కాని అదృష్టవశాత్తూ క్రింది కొమ్మ చేతికి చిక్కడంతో క్రింద పడకుండా ఎలుగుబంటు మళ్ళీ పై కొమ్మకి ఎక్కేసింది.

🌴🍁అప్పుడు పులి "చూశావా! నువ్వు వాడికి ఉపకారం చెయ్యబోయావు. కాని వాడు నీకపకారం చెయ్యడానికి వెనుదీయలేదు. ఎందుకా కృతమ్నుని పట్ల జాలి చూపుతావు? తోసెయ్యి, కిందికి" అంది. అప్పుడా ఎలుగుబంటు "ఓ పులీ! వాడి సహజ స్వభావాన్ని వాడు చూపెట్టేడు. మా జాతి స్వభావాన్ని నేను మార్చుకోను, నీ దారిన నువ్వు వెళ్ళు" అంది.

🌻🌹విజ్ఞానం పెరిగేకొలదీ మానవుడు స్వార్థంతో మానవత్వానికి సహజమైన నైతిక విలువలను కోల్పోతున్నాడు. ఈనాడు మానవుని కంటే అడవి మృగాలే మంచివేమో అనిపిస్తుంది.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

చేతితో ఆహారాన్ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు:( As Per Science)

ఎంత ఉపయోగమో!?

డైనింగ్ టేబుల్ మీదికి స్పూన్స్, ఫోర్క్ లు వచ్చి చేతితో భోజనం చేసే వాడిని అనాగరికుడిగా చూస్తూ వెక్కిరిస్తున్న తరుణమిది. తిండేదైనా ఫోర్క్ పక్కా అయి కూర్చుంది ఈ వేళ..? హోటల్ లో ఎవరైనా పద్దతిగా చేతితో అన్నం కలుపుకొని తింటుంటే అందరూ అతడిని వింత గా చూసే పరిస్థితి ఏర్పడింది. ఇక మన ఇంట్లో చిన్న పిల్లలకు సైతం స్పూన్స్ అలవాటు చేస్తున్నారు ఈ తరం తల్లీదండ్రులు. దానికి వాళ్లు చూపిస్తున్న ప్రధాన కారణం.. చేతులు శుభ్రంగా ఉండవు కదా..! అని. అయితే ఓ సారి చేతిని ఉపయోగించి భోజనం చేస్తే కలిగే సైంటిఫిక్ లాభాలను ఓ సారి చూద్దాం. ఇది చదివాక ఎక్కడున్నా…? మీరు పద్దతిగా చేతిని ఉపయోగించి భోజనం చేస్తారని ఆశిస్తున్నాను

చేతితో ఆహారాన్ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు:( As Per Science)
1.చేతిస్పర్శ వల్ల శరీరానికి బలం చేకూరుతుంది.

2.చేతితో ఆహారం తీసుకోవడం వలన కొన్ని మిలియన్ల నరాలు మన మెదడుకు సిగ్నల్స్ ని పంపిస్తాయట.

3.అహారాన్ని చేతితో టచ్ చేయగానే, ఫుడ్ తీసుకునే విషయం మెదడు పొట్టకు సంకేతమిస్తుంది. అలా కడుపులో జీర్ణరసాలు, ఎంజైమ్స్ రిలీజ్ కావడం వలన జీర్ణశక్తి బాగా జరుగుతుంది.

4.చేత్తో ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒకే ధ్యాసలో ఉంటాం.

6.మన ఆహారాన్ని నూనె మరియు ఎక్కువగా ఉపయోగిస్తాం.ఇలా తయారుచేసుకున్న ఆహారాన్ని స్పూన్స్, ఫోర్క్స్ తో తీసుకోవడం వలన ప్రతిచర్య ఏర్పడి రుచిపోతుందట.

7.వేళ్ళతో ఆహారం కలుపుకొని, ముద్దలుగా ఒక్కో పదార్థాన్ని కలుపుకోవడం వలన రక్తప్రసరణ బాగా జరుగుతుందట.

8.చేతివేళ్ళతో ఆహారం తీసుకోవడం వల్ల,వేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది.

9.ఇంకా చేతివేళ్ళతో మనం ఆహారం తీసుకోవడం వలన అనారోగ్యం పాలుకాకుండా,ఆరోగ్యవంతంగా ఉంటారు. జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది. ఇలా చేయడం ఒక వ్యాయామంలా ఉంటుంది. పురణాల పరంగా…
చేతిలో ఉండే ఒక్కో వేలు ఒక్కో తత్వాన్ని కలిగి ఉంటుందట.

బొటనవేలు:అగ్నితత్వం

చూపుడు వేలు:వాయుతత్వం

మధ్యవేలు:ఆకాశం

ఉంగరపు వేలు:భూమి

చిటికిన వేలు:జలతత్వం.. ఈ అయిదు వేళ్ళ స్పర్శ ఆహారానికి తగిలినపుడు జీవశక్తి ఉత్తేజితం అవుతుంది.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ