Wednesday, July 31, 2024

లిపి_విజ్ఞాన_శాస్త్రం

 పోస్ట్ పెద్దదే కానీ మంచి సమాచారం అందరూ చదవండి.. 👍🚩

#లిపి_విజ్ఞాన_శాస్త్రం

🍁18 మరియు 19 వ శాతాబ్దికి చెందిన కొందరు పాశ్చాత్య పరిశోధకులు ఒక భ్రమను వ్యాపింపచేసారు. ప్రాచీనకాలంలో భారతీయ ఋషులకు వ్రాత పరిజ్ఞానం లేదు. 300-400 BCE సంవత్సరాల పూర్వం భారతదేశంలో వాడు కలోనున్న #బ్రాహ్మీ_లిపి మరియు ఇతర లిపులు భారతదేశం బయట పుట్టినవే. 

🔹డా.ఓర్ ఫ్రీడు మరియు మ్యుయెలర్ అనువారు మరో ప్రతిపాదన ప్రచారం చేసారు. భారతదేశానికి లేఖన విద్య గ్రీకుల నుండి లభించినది. 
🔸సర్ విలియం జోన్స్ అనునతడు భారతీయుల బ్రాహ్మీలిపి సెమెటిక్ లిపి నుండి ఉత్పన్నమైనదనే మరో భ్రమను ప్రచారం చేసాడు. 
🔹ప్రొ. బేన్ ఫ్రే మరియు బేవర్ అనువారు బ్రాహ్మీలిపి మూలం ఫోనీషియన్ లిపి అని ప్రచారం చేసారు. 
🔸డా.డేవిడ్ డిరింజర్ అనునతడు అరేమిక్ లిపి నుండి బ్రాహ్మీ లిపి ఉత్పన్నమైనదనే ఊహను ప్రచరం చేసాడు .
🔹సంస్కృత సాహిత్య చరిత్ర వ్రాసిన మాక్స్ ముల్లర్ భారతదేశంలో లేఖన కళ 400 BCE సంవత్సరాల పూర్వం నుండి మాత్రమే వాడుకలోనున్నదని మరో భ్రమను ప్రచారం చేసాడు. మన దౌర్భాగ్యం కారణంగా తర్వాత కాలంలో పరిశోధనలు చేసిన భారతీయులు కూడా పాశ్చాత్యులనే ఆదర్శంగా తీసుకొని వారితో గొంతు కలిపారు. వారి భ్రమాత్మక సిధ్దాంతాలనే వీరు సత్యాలని ప్రతిపాదించారు. ఈ పరిశోధన, ప్రతిపాదన ప్రక్రియలో ఎవ్వరు కూడా మన దేశ పరంపరను, గ్రంధలిపి వికాసగాధలను పరిశోధించే ప్రయత్నం ఏ మాత్రము చేయలేదు.

ఈ పరిస్థితిలో వాస్తవాన్ని పరిశీలిద్దాం!
---------------------------------------------------
 
🍁ప్రసిధ్ధ పురాతత్వవేత్త మరియు లిపి పరిశోధకుడు అ.బ.వాలావల్కర్ మరియు ప్రఖ్యాత లిపికారుడు పద్మశ్రీ వాకణకర్ – అనువారు తమ పరిశోధనలో భారతీయ లిపి జన్మస్థానం భారతదేశమే అని నిరూపించారు. ధ్వన్యాత్మకత ఆధారంగా లేఖన పరంపర భారతదేశంలో వేదకాలము నుండి బాగా వాడుకలో ఉండి ప్రసిధ్ధి చెందింది. దీనికి అనేక పురాతత్వ సాక్ష్యాలున్నాయని వారు నిరూపించారు. 
రోమను లిపికి చెందిన ‘గిల్ సాంస్’ అనే రకమైన అక్షరాల నిర్మాత ఎరిక్ గిల్ అనునతడు ఇలా చెప్పాడు : ఒకానొక అక్షరము ఒకానొక సమయంలో ఒకానొక ధ్వనికి పర్యాయవాచకంగా ఉంది ఉంటుంది. కాని రోమను లిపి అధ్యయనం చేస్తే ఒకానొక అక్షరం, ఒకానొక ధ్వనికి పర్యాయపదంగా ఉంటుందని చెప్పలేము. ఉదా: Ough – ఈ నాలుగు అక్షరాలు 7 రకాలుగా ఉచ్చరించబడతాయు (ఓహ్, అఫ్,ఆఫ్,ఆఊ,ఔ,ఊ,ఆ) ఇవి వ్రాసిన తర్వాత గిల్ తన సిధ్ధాంతంగా ఒక సత్యాన్ని ఇలా చెప్పారు  : “మా రోమను అక్షరాలు ధ్వనియొక్క లేఖనము, ముద్రణము సరిగ్గా చేస్తాయని చెప్పడం మూర్ఖత్వమే అవుతుంది.”

రెండవ వైపు భారతదేశంలో ధన్యాత్మక లేకహంపరంపర యుగ యుగాలుగా వస్తున్నది. దీనికి అనేక ఋజువులు మన ప్రాచీన వాజ్మయములో లభిస్తున్నాయి.

🍁1.యజుతైత్తరీయ సంహితలో ఒక కధ ఉన్నది. దేవతలకు ఒక సమస్య వచ్చిపడినది. మాట(వాణి) అనేది మాట్లాడిన తర్వాత అదృశ్యమైపోతుంది. ఈ నిరాకారమైన మాటను సాకారం చేయడమెలా? దేవతలు ఇంద్రుని వద్దకు వెళ్లి ఇలా అడిగినారు : “ వాచంవ్యా కుర్వీత’ అనగా వాక్కుకు ఆకారమును ఇవ్వండి. అప్పుడు ఇంద్రుడన్నాడు. దీనికోసం నేను వాయువును సాయం తీసికోవాలి. అనగానే దేవతలు అందుకు సమ్మతించారు. అపుడు ఇంద్రుడు వాక్కుకు ఆకారమునిక్చినాడు. వాక్కుకు ఆకారమును ఇవ్వడమే లేఖనవిద్య. ఇది ‘ *ఇంద్రవాచన్య వ్యాకరణమ్*’ అనే పేరున ప్రసిధ్ధమైనది.

🍁2.అధర్వవేదములో గణక ఋషికృతసూక్తం ‘ *గణపతి_అథర్వశీర్షం*’ పేరుతో ఉన్నది. దీనిలో లేకహన్ విద్య యొక్క ఉత్పత్తికి సంబంధించిన ప్రమాణములున్నవి. క్రింది వాక్యాలలో ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. 

గణాదిం పూర్వముచ్చార్యవర్ణాదిం తదనన్తరమ్ | అనుస్వారః పరతరః |
అర్ధేందులసితమ్ | తారేణరుధ్ధం | ఏతత్ తవ మనుస్వరూపమ్ | గకారః
పూర్వరూపమ్ | అకారో మధ్మమరూపమ్ అనుస్వారశ్చాస్త్య రూపమ్ |
బిందురుత్తర రూపమ్ | నాదః సంధానమ్ | సంహితా సంధిః | సైషా గణేశ విద్యా | 

దీని అర్ధము : మొదట ధ్వనియొక్క గణమును ఉచ్చారణ చేయాలి . తర్వాత అదే క్రమములో వర్ణములను రంగుల సాయంతో వ్రాయాలి. తదనంతరం అక్షరము పైన అనుస్వారము అర్ధచంద్రాకారంలో వ్రాయాలి. ఈ విధంగా హే గణేశ్ ! మీ చిత్ర స్వరూపము ఈ విధంగా గ్ అనే హల్లు మరియు మధ్యస్వర భాగము అనగా అకార రూపదండము మరియు అంతముక్త అనుస్వారము అవుతుంది . దీనినాదము లేదా సంధి రూప ఉచ్చారణ చేయుట – ఇదియే గణేశ విద్య. దీనిని గణపతి తెలిసికొనియున్నాడు.

🍁3.ధ్వని సూత్రములనిచ్చే దేవుడు శంకరుడు. భిన్న భిన్నమైన వేదశాఖలు చెప్పేఆరు మృత్యువాత పడిన కారణంగా ఆ శాఖలు లుప్తమంపోవుచున్నవి. అందువలన వానిని కాపాడే దృష్టితో సనకాది సిధ్ధులు దక్షిణాదినున్న చిదంబరంలో నున్న శివుని వద్దకు వెళ్లి ప్రార్ధించినారు. ఆ ప్రార్ధన నాలకించి పరమశివుడు అలౌకికమైన శివతాండవ నృత్యము చేస్తూ మధ్యలో తన డమరుకమును తొమ్మిది మరియు ఐదు అనగా పదునాలుగుసార్లు మ్రోగించినాడు. దాని నుండిఉ 14 ధ్వని సూత్రాలు వెలువడినవి. దీనినే మాహేశ్వర సూత్రములన్నారు. దీన్ని వర్ణిస్తూ ఇలా చెప్పబడినది

నృత్యావసానే నటరాజ రాజౌ సనాద ఢక్కాం నవ పంచవారమ్ |
ఉధ్ధర్తు కామః సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్ర జాలమ్ || 
                                      - కౌశిక సూత్ర –I

పదునాల్గు మాహేశ్వర సూత్రములు : అ, ఆ, ఇ,ఈ,ఌ,ౡ,ఋ,ౠ ,ఏ,ఐ,ఓ,ఔ – ఈ సూత్రముల ఉపదేశము పాణిని మహర్షికి లభించింది. దాని ఆధారంగా ఆ మహర్షి తన వ్యాకరణ గ్రంధము ‘అష్టాధ్యాయి’ రచించినారు.ఆ గ్రంధమే ధ్వన్యాత్మక భాషను,దాని వికాసాన్ని శాస్త్రీయంగా ఉంచుతుంది. 

🍁4.వేదముల స్మరణ మరియు శుధ్ధత చిరస్థాయిగా నుండుట కొరకు అనేకమంది మహర్షులు అనేక జటిల పథన పధ్ధతులు వికసింపచేసినారు. అవి జటా,మాలా,శిఖా,రేఖా,దండ,రధ,ధ్వజ మరియు ఘనపాఠ – ఈ వేదపఠన పధ్ధతులు వ్రాత లేకుండా సురక్షితంగా ఉంచుట సాధ్యంకాదు.

🍁5.మహాభారత కర్త వ్యాసమహర్షి మహాభారత రచనకు ఉపక్రమించునపుడు ఏర్పడిన సమస్య. దీనిని ఎవరు వ్రాస్తారు? దాని కొరకు గణేశుణ్ణి స్మరించారు. ‘కావ్యస్యలేఖ నార్ధాయ గణేశం స్మర్యతామ్ మునే’ – అప్పుడు గణేశుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు వ్యాసుడన్నాడు ‘లేఖకో భారతస్యాస్య భవ గణనాయకః’ –మీరు మహాభారత గ్రంధ లేఖకులు కావాలన్నాడు. దీని నుండి తెలియు విషయం మన గణేశుడు ఆనాటి మూర్ధన్యలిపికారుడు అని అర్థమగుచున్నది.

🍁పాణిని మహర్షి ‘ *ఋగ్వేదవిద్య*’ లో ఇలా వివేచించి చెప్పినాడు – వాక్కు తన నాలుగు పదములలోని చివరి పదమైన ‘వైఖరి’ లో బయలు వెడలుతుంది. మనుష్యుని శరీరంలోని ఐదు అవయవాల సాయంతో ధ్వని ఉత్పన్నము అవుతుంది. దీని ఆధారంగా అచ్చులు, హల్లులు ఏ అవయవ సాయంతో ఉచ్చరిస్తామో ఆ అవయవాన్ననుసరించి వర్గీకరించుట క్రింది విధంగా జరిగింది. 

🔸1. *కంఠ్యములు* : శ్వాస కంఠము నుండి వెలువడుతుంది. అప్పుడు ఏ ధ్వనులు వెలువడుతాయో అవి ఈ వర్గము క్రిందకు వస్తాయి. అ, ఆ, క, ఖ,గ,ఘ,ఙ ,హ మరియు విసర్గ (ః) 
🔹2. *తాలవ్యములు* : కంఠము నుండి కొద్దిపైన దంతములు దగ్గర కఠిన తాల భాగముపై నుండి శ్వాస బయలు వెడలినప్పుడు ఆ ధ్వని, ఇ, ఈ, చ, ఛ,జ,ఝ,ఞ, య మరియు శ – అను అక్షరములు ద్వారా అభివ్యక్తీకరించబడును.
🔸3. *మూర్ధన్యములు* : నాలుక కొనను కొంచెం వెనుకకు తీసికొని కోమల తాల భాగముపై తాకి ధ్వని వెడలినప్పుడు ఈ అక్షరాలు పలుకుతాయి. ఋ, ౠ, ట,ఠ,డ,ఢ,ణ,ష
🔹4. *దంత్యములు* : నాలుక దంతములకు తాకునప్పుడు ఈ అక్షరముల్ పలుకుతాము. త,థ,ద,ధ,న,ల,స – 
🔸5. *ఓష్ఠ్యములు*: రెండు పెదవులు సాయంతో ఈ అక్షరములు పలుకుతాము – ఉ,ఊ,ప,ఫ,బ,భ,మ మరియు వ – 
మిశ్రిత అక్షరములు : పై అక్షరములు కాకుండా మిగిలినవి. ఏ,ఐ,ఓ,ఔ,అం,ఆః

పైన తెలుపబడిన ధ్వని శాస్త్రముననుసరించి లిపి వికసించబడింది. మరియు కాలక్రమమలో లిపులు మార్పులు చెందుచుండినవి. దీని ఆధారంగానే ధ్వనిశాస్త్రం యొక్క మూల సిధ్ధాంతము ఏర్పడినది. ప్రఖ్యాత పురాతత్వవేత్త వాలావాల్కర్ గారు ప్రాచీన ముద్రలతో లభించిన లిపులను అధ్యయనం చేసారు. ఈ అధ్యయనము ద్వారా వారు మూలరూపంలో మహేశ్వరి లిపి అనబడే వైదిక లిపి ఏర్పడినట్లు వారు ఋజువు చేసారు. కొద్దికాలం తర్వాత అదే బ్రాహ్మీలిపిగా, నాగరలిపిగా అభివృధ్ధి చెందినది. ప్రఖ్యాత లిపి శాస్త్రవేత్త శ్రీ వాకణకర్ ద్వారా తయారు చేయబడిన క్రింది చార్టులో మనం ఇదంతా గమనించవచ్చు. 

🍁 *పురాతత్వ ఋజువులు* : లిపి యొక్క అభివృధ్ధి క్రమము, పురాతత్వ ఋజువులపై శ్రీ వాలావాల్కర్ మరియు శ్రీవాకణకర్ విస్తృతంగా పరిశోధనలు గావించారు. అనేక ప్రతిపాదనలు చేసారు. వారి ప్రతిపాదనలను గూర్చి డా|| మురళీమనోహర జోషి తన ప్రసిధ్ధ వ్యాస పరంపర ‘లిపి’ విధాత గణేశ్’ లో అనేక అంశాలను ప్రస్తావించారు. అనేక ఋజువులు చూపించినారు. అతి ప్రాచీనకాలము నుండియే భారతదేశంలో లిపి విద్య, లేఖన కళ ప్రచారమందున్నది. అది పూర్తిగా ధ్వనిశాస్త్రముపై ఆధారపడి తయారైంది. ఈ శాస్త్రీయ దృష్టి ప్రపంచంలోని ఏ ఇతర లిపులలోను లేదు.
‘ఇప్పుడు పురాతత్వ శాస్త్రంలోని ఋజువుల గురించి చర్చిద్దాం! బ్రిటిష్ మ్యూజియంలో ఒక ముద్ర (సీల్) ఉన్నది. దాని క్రమసంఖ్య : 31-11-366/1067-47367-1881. 6 BCE శతాబ్దానికి చెందిన ఈ ముద్రలో బాబిలోనియాకు చెందిన కీలాక్షరలిపి మరియు మన బ్రాహ్మి లిపి రెండూ కలిసియున్నవి. కీలాక్షరలిపి 1936 లో మాత్రమే చదవగలిగినారు. మధ్యలో నున్న పంక్తిని తెలియని అజ్ఞాతలిపిగా వదిలివేసారు. పురాతత్వ లేఖనవేత్త వాలావాల్కర్ మాత్రమే ఈ అజ్ఞాతలిపిని చదివి చూపినారు. యూరపు పండితుల వాదనలను బూటకమని ఋజువు చేసారు. భారతీయ లిపికి మూలాధారము ఇతర దేశములయందున్నదే వాదనలను పటాపంచలు చేసారు. ఈ ముద్ర ఆశోకునికి పూర్వము మహేశ్వరీ లిపిలో వ్రాయబడిన సంస్కృత భాషకు సాక్శీభూతముగా న్నన్నది. ఈ పంక్తి పాఠము ఇలా ఉన్నది. ‘అవఖేజ్ఞరాఖను ఔహర్మమభ్యః దదదు’ – ఇది గ్రీకు కీలాక్షర లిపిలో వ్రాయబడిన అనుబంధమునకు సంస్కృతభాషలో వ్రాయబడిన అనువాదము. ఈ ఋజువుతో పాశ్చాత్య లిపి పరిశోధకులైన మెక్డోనల్ మరియు బ్యూహలర్ లు ప్రతిపాదించిన లిపి సిధ్ధాంతాలు బూటకములని తేలిపోయినవి. భారతీయులు 5 BCE  శతాబ్దిలో లిపిని విదేశాల నుండి అరువు తెచ్చుకొన్నారనే సిధ్ధాంతం పచ్చి అబద్ధమని వారి పరిశోధనలు భారతదేశానికి సంబంధించినవి అన్నీ బూటకములని తెలియుచున్నది. పాశ్చాత్య లిపి పరిశోధనలు నిస్సారములని తేలిపోయినవి – ఇదే విధంగా మరో మహత్యపూర్ణమైన పురాతత్వ సాక్ష్యం లభించింది. ఇది ప్యారిస్ మ్యూజియంలో ఉన్నది. (లూన్రే మ్యూజియం) ఇది 3000-2400 BCE నకు చెందినది. పాలస్తీనాలో త్రవ్వకాలు జరిపినప్పుడు లభించిన నాణెము . ఇది సార్గన్ అను రాజు కాలానికి చెందినది. ఈ నానేపు ముద్రను చూసి జాన్ మార్షల్ ఆశ్చర్యం వ్యక్తం చేసాడు. దీని యొక్క పురాతత్వ ఫలితాలు అత్యంత సంభ్రమాన్ని కల్గిస్తున్నాయి. సింధులోయ నాగరికత నాటి ముద్రతో దీనికి పోలిక ఉన్నది. దీనితో భారతీయ లిపి పుట్టుక విదేశీయమైనదనే పాశ్చాత్య వాదనకు కాలదోషం పట్టినది. ఇప్పుడు కనీసం మన దేశీయపండితులు భారతీయ లిపి బయట నుండి అరువు తెచ్చుకొన్నదనే వాదనన్ కట్టిపెట్టినారు. అయినప్పటికీ భారతీయ లిపి ప్రాచీనతను సంబంధించిన ప్రశ్నలపి ఆంగ్ల మానస పుత్రులైన మన దేశీయ పండితులు మౌనమే పాటిస్తున్నారు. మనువాదాన్ని సరిగా వినిపించడంలేదు.

🍁 *వైదిక ఓంకారము* :
------------------------
ఇదే క్రమములో మనం 6 BCE శతాబ్దానికి చెందిన సోహగరా తామ్రశాసనమును పరిశీలించాము. ఈ శాసనము మొదటి పంక్తిలోనే ఓంకార చిత్రము చెక్కబడియున్నది . ఈ ఓంకారము వాలావాల్కర్ ప్రదర్శించిన చార్టులో ముద్రింపబడినదే – ప్రక్కనున్న ఇతర చిత్రాలను పరిశీలించినప్పుడు కూడా వానిలోను వైదిక ఓంకారము,స్వస్తిక్ వంటి హిందూ ఆధ్యాత్మిక చిహ్నాలు ముద్రింపబడినవి. ఇవి అన్నీ నాణెములకు సంబంధించిన చిత్రములే. వైదిక ఓంకారము ఈ ఆకృతిలో ఎందుకు ఉందనే ప్రశ్నకు సమాధానం ‘జ్ఞానేశ్వరి’ లో వివరించబడినది. 
అ-కార చరనయుగళ | ఉ- కార ఉదర విశాల |
మ-కార మహామండల | మస్తకా – కారే || 19
హేతీన్హీ ఏకవటలే | తేవ శబ్ద బ్రహ్మ కవళల | 
తే మియాం గురుకృపా నమిలే | ఆదిబీజ || 20 
- ‘జ్ఞానేశ్వరి’ 

🍁(ఎ) జ్ఞానేశ్వరి మరియు వాలావాల్కర్ చెప్పిన వైదిక ఓంకారముల సామ్యము
శబ్ద బ్రహ్మ లేదా ఏకాక్షర బ్రహ్మ, ప్రణవము యొక్క ఆకృతిని గూర్చి ‘జ్ఞానేశ్వరి’ లోని వర్ణన చాలా మహత్వపూర్ణమైనది. ఆధునిక దేవనాగరి లిపిలో వ్రాయబడుచున్న ॐ తో ఈ వర్ణన పూర్తి సామ్యము లేకున్నా వాలావాల్కర్ గారు చూపించిన వైదిక ఓంకారముతో పూర్తి సామ్యమును కలిగియున్నది. మహేశ్వరి సూత్రములలోణి ‘అర్ధేందు సిధ్ధాంతమును’ గూర్చి లోతుగా ఆలోచన చేసినచో ఈ చిక్కు సమస్యకు సమాధానం లభిస్తుంది. వైదిక ఓంకార చిత్రమును పరిశీలిద్దాం. మొదట క్రింద రెండు అర్ధచంద్రాకారములున్నవి. ఇవి ‘అ’ కారము  ప్రతీకలు. వీనిపైన ఒక అర్ధచంద్రాకరమున్నది. ఇది ‘ఉ’ కారమునకు ప్రతీక. అన్నింటి పైన ఒక వృత్తము మరియు అర్ధచంద్రబిందు సహితము ఉన్నది. ఇది ‘మ’ కారమునకు ప్రతీక – ఈ విధంగా జ్ఞానేశ్వరిలో వర్ణించిన ఓంకారము, గీత మరియు ఉపనిషత్తులలో వర్ణించిన ఏకాక్షర బ్రహ్మ లేదా ప్రణవము – మరే పేరుతో చెప్పినా , అది మహేశ్వరి సూత్రములలోని ‘ *అర్దేందు_సిధ్ధాంతము* ‘ ననుసరించి చెప్పిన ఓంకారము – అది నిర్ణయింపబడిన నాదముల యొక్క ప్రతీకయే ! ఈ నాదముల ప్రతీకలను క్రమపధ్ధతిలో జోడించినప్పుడు ఏర్పడిన ఒక నిశ్చిత ఆకృతియో! దేవనాగరి ॐ లో కూడా ఇదే సూత్రము వర్తించుచున్నది. వైదిక ఓంకార చిత్రమును 90 డిగ్రీల నుండి గడియారపు ముల్లు దిశలో త్రిప్పినచో దేవనాగరి *ఓంకారముతో* చక్కగా సరిపోవును. – వైదిక ఓంకారము ప్రస్తుత దేవనాగరి ఓంకారమునకు రూపాంతరము చెందిన యాత్రయే భారతీయ లిపి యొక్క వికాసగాధ! దీనిని మనము *ఋగ్వేదము* నుండి *పద్మపురాణము* వరకు పరిశోధించి చూడవచ్చు. 
*** Source from : భారతీయ ఉజ్వల వైజ్ఞానిక పరంపర page : 181-190

మీ 

*ధర్మవీర్ ఆధ్యాత్మిక చైతన్య వేదిక*

జీవుడు - మోక్ష మార్గాలు ["ఆర్షవిజ్ఞాన సర్వస్వం" అను గ్రంధం నుంచి గ్రహించబడినది.]

 [7/31, 15:51] +91 73963 92086: జీవుడు - మోక్ష మార్గాలు
["ఆర్షవిజ్ఞాన సర్వస్వం" అను గ్రంధం నుంచి  గ్రహించబడినది.]
🙏🌹🪷🌹🪷🕉️🌹🪷🌹🪷🙏

🪷 జ్యోతిష్యశాస్త్రపరంగా తారామండలంలోని నక్షత్ర వీధులు, వాటివలన ఏర్పడే మార్గాలు, మరణించిన తరవాత జీవుడు పయనించే మూడు ముఖ్యమైన ఉత్తర, దక్షిణ, మధ్య [ మోక్ష] మార్గాల గురించి ఆసక్తి ఉన్న వాళ్ళు తెలుసుకోండి♪.

🪷 ఈ భూమ్మీద జీవుడు మరణించాక సూక్ష్మ దేహాన్ని ధరించి అంతరిక్ష మార్గం ద్వారా పరలోకానికి వెళ్తాడు అని మనపురాణాలు చెప్తున్నాయి♪. జీవుడు చేసుకున్న కర్మల ప్రకారం అతడి సూక్ష్మశరీరం ఏ మార్గం గుండా వెళ్తుంది, అంతరిక్షంలో ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయి అన్నది వాయు పురాణంలో విపులంగా చెప్పబడింది♪. దీనికి జ్యోతిష్య శాస్త్రంతో సంబంధం ఉండటం విశేషం♪.

👉 అదేంటో ఎలాగో ఇప్పుడు చూద్దాం♪.!!!!!

🪷 మన భారతీయ వేదాంగాలలో ప్రముఖమైనదిగా చెప్పబడే జ్యోతిష్యశాస్త్ర ప్రకారం,  తారామండలాన్ని గణిత సౌలభ్యం కోసం మన ఋషులు మొత్తం 27 నక్షత్రాలు గా విభజించారు♪. వాటిల్లో మూడేసి నక్షత్రాలని ఒక జట్టు చొప్పున పెడితే అది ఒక *“వీధి”* అవుతుంది♪. అలాంటివి మూడు వీధులు కలిపి ఒక *“మార్గం”* అవుతుంది♪. ఆ విధంగా అంతరిక్షంలో మూడు మార్గాలు ఉన్నాయని శాస్త్రం చెపుతోంది♪. ఇక్కడ “మార్గము” అంటే జీవుడు మరణించిన తరవాత సూక్ష్మ దేహాన్ని ధరించి తన కర్మానుసారం పరలోకాలకు వెళ్ళే మార్గం అని అర్ధం♪.

🪷 సూర్యమండలం ద్వారా అంతరిక్షంలోకి ఉత్తర, దక్షిణ, మధ్య అనే మూడు మార్గాలున్నాయి♪. పైన చెప్పినట్టు మూడేసి నక్షత్రాలని ఒక జట్టుగా పెడితే అది ఒక వీధి అవుతుంది♪. అలా మూడు వీధులు కలిస్తే ఒక మార్గం అవుతుంది♪. ఆ విధంగా 27 నక్షత్రాలని మూడేసి చొప్పున ఒక జట్టుగా చేస్తే ..

🪷 మొదటి మూడు నక్షత్రాలు అయిన *అశ్వని, భరణి, కృత్తిక* ఈ మూడు కలిపితే దాన్ని “నాగవీధి” అంటారు♪. *రోహిణి, మృగశిర, ఆరుద్ర* ఈ మూడు కలిపితే దాన్ని “గజవీధి” అంటారు♪. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఈ మూడు కలిపితే దాన్ని “ఇరావతవీధి” అంటారు♪.

✅👉 అలా, పైన చెప్పిన మూడు నక్షత్ర వీధులని కలిపితే దాన్ని “ఉత్తరమార్గం” లేదా “దేవయానమార్గం” అని అంటారు♪.

🪷 తరువాత నక్షత్రాలు అయిన *మఖ, పుబ్బ, ఉత్తర* ఈ మూడు కలిపితే దాన్ని “ఆర్షతీవీధి” అంటారు♪. హస్త, చిత్త, స్వాతి ఈ మూడూ కలిపితే దాన్ని “గోవీధి” అంటారు♪. విశాఖ, అనురాధా, జ్యేష్ఠ ఈ మూడూ కలిపితే దాన్ని “జారద్గవీవీధి” అంటారు♪.

✅👉 అలా పైన చెప్పిన మూడు నక్షత్ర వీధులని కలిపితే దాన్ని “మధ్యమమార్గము” అంటారు.

🪷 తరువాత నక్షత్రాలు అయిన మూలా, పూర్వాషాడ, ఉత్తరాషాడ ఈ మూడు కలిపితే దాన్ని “అజవీధి” అంటారు. శ్రవణ, ధనిష్ట, శతభిషం ఈ మూడు కలిపితే దాన్ని “మృగమార్గం” అంటారు. *పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి* ఈ మూడు కలిపితే దాన్ని “వైశ్వానరీవీధి" అంటారు.

✅👉 అలా పైన చెప్పిన మూడు నక్షత్ర వీధులని కలిపితే దాన్ని “దక్షిణామార్గం” లేదా “పితృయానం” అంటారు.

🪷 గగనమండలంలో ఉన్న అగస్త్యముని నక్షత్రానికి ఉత్తరంగా “అజవీధికి” దక్షిణంగా ఉన్నది “దక్షిణమార్గం” లేదా “పితృయానం” మార్గం. ఈ దక్షణమార్గంలో అగ్నిహోత్రాదులని చేసే మహాత్ములైన ఋషులు బ్రహ్మదేవుని ఋజ్మంత్రములతో స్తుతిస్తూ ఉంటారు♪. ఈ మార్గమే చలనము [ వినాశన స్వభావము ] కలది అవటం వలన ప్రతి యుగంలోనూ బ్రహ్మ దీన్ని మళ్ళీ పునఃసృష్టి చేస్తూ ఉంటాడు♪. 

🪷 ప్రతిఫలాపేక్షతో ఎవరైతే కర్మలు చేస్తారో వాళ్ళే ఈ దక్షిణమార్గం నుంచి వెళ్తారు♪. చేసిన కర్మలు వాటి ఫలాలు మళ్ళీ అనుభవించడం కోసం వాటికి తగ్గట్టుగా మళ్ళీ వాళ్ళ వాళ్ళ సంతతికి చెందిన కుటుంబాల్లోనే పుడతారు♪. అలా మితిలేని కోరికలతో పుడుతూ చస్తూ రాక పోకలు చేసేవాళ్లకే ఈ దక్షిణమార్గం అని చెప్పబడింది♪.

🪷 తరువాత, “ఉత్తరమార్గము” లేదా "దేవయానమార్గము”. ఇది కూడా అగస్త్యముని నక్షత్రానికి ఉత్తరముగానూ, “నాగవీధి” దేనికి ఉత్తరమవుతుందో, సప్తఋషీమండలము దక్షిణమవుతుందో అదే సూర్యునికి కూడా ఉత్తర మార్గము అవుతుంది. దానినే “ఉత్తరమార్గము” లేదా “దేవయాన మార్గము” అని అంటారు♪.

🪷 పరమ సిద్ధులు, బ్రహ్మచారులే ఈ “దేవయానమార్గం” లోకి ప్రవేశిస్తారు. సంతానాన్ని ఎవరైతే నిరసిస్తారో [ అంటే ఇంకా ఏ విధమైన మమతానురాగబంధాలు లేకుండా] వాళ్ళే మృత్యువుని కూడా జయిస్తారు అని చెప్పబడింది♪.

🪷 ఈ దేవయాన మార్గానికి ఎనభైవేల మంది ఊర్ధ్వరేతస్కులైన [ అస్కలన ]మునులు రక్షణగా ఉంటారని చెప్పబడింది♪. ఆభూతసంప్లవము వరకూ [ సమస్త వాసనలు అణు మాత్రమూ కూడా మిగలకుండా నశించే వరకూ ] వాళ్ళు అక్కడే ఉంటారు♪.

🪷 ఎందుకంటే, కామలోభోపహతులు కాకుండా కేవలం మైధునాన్ని వర్జించిన వాళ్ళు మళ్ళా అటువంటి వాటిపైకి తిరిగే అవకాశం ఉండటం వలన. కేవలం పరిశుద్ధాంతఃకరణులైన వాళ్ళే శాశ్వతమైన అమృతత్వాన్ని, జన్మరాహిత్యాన్ని పొందుతారు గనక వాళ్ళు ఆభూతసంప్లవము వరకూ [ సమస్త వాసనలు అణు మాత్రమూ కూడా మిగలకుండా నశించే వరకూ ] వాళ్ళు ఈ మార్గంలోనే ఉంటారు అని చెప్పబడింది•.
[7/31, 15:51] +91 73963 92086: 🪷 తరువాతది, “మధ్య మార్గము’. సప్తఋషి మండలానికి పైన ఉత్తరంగా ఎక్కడ ధృవనక్షత్రం స్థిరంగా ఉంటుందో అది మూడవ మార్గమైన “మధ్యమార్గము”. ఇది గగనమండలంలో చాలా దేదీప్యమానంగా ఉంటుందని చెప్పబడింది. దీన్నే “విష్ణుపదం” “మోక్షపదం” అంటారు. ఈ పదం పరమపదం.

🪷 ఇది నిర్దోషులైన సంయతాంతఃకరణులైన యతులకు వాళ్ళ పుణ్యపాపములు సమూలంగా నాశనమవ్వడం వలన లభిస్తుంది♪. అశేషమైన పుణ్యపాపాలు నశిస్తే గానీ పూర్తిగా దుఃఖం నశించదు♪. ఎక్కడ దుఃఖం ఉండదో అదే విష్ణుపదం♪. అదే పరమపదం♪. ఇది మామూలు కంటికి ఎంత మాత్రమూ కనపడనిది♪. ఎవరు జ్ఞానయోగంలో తన్మయులవుతారో కేవలం వాళ్ళ జ్ఞాన నేత్రాలకు మాత్రమే అది కనపడుతుంది♪. అలాంటి వాళ్ళందరూ అక్కడ సుఖంగా ఉంటారు•.

🪷 ఇలాంటి అనేక విషయాలతో కూడిన జ్యోతిష్య శాస్త్రం అనంతమైన కాలపరిజ్ఞానానికి ఎంతో ఉపయుక్తమైంది. “అప్రత్యక్ష్య మన్యశాస్త్రం ప్రత్యక్ష్యం జ్యోతిషంస్కృతం” అన్న ప్రమాణం నిజంగా నిజమైనది♪! -

        ❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు
🚩 హిందువునని గర్వించు
🚩 హిందువుగా జీవించు

సేకరణ:
🙏🪷🌹🪷🌹🕉️🌹🪷🌹🪷🙏
 హరిఓం  ,  

"*సృష్టిలో దైవము తప్ప ఏదీ శాశ్వతము కాదు.. 
సృష్టిలో  అన్నింటికన్నా విలువైనది కాలము.. 

అట్టి కాలము కూడా శాశ్వతం కానపుడు, ఇంకా విలువలేనివి 
ఏ విధముగా శాశ్వతము అవుతాయి?*

ఈనాడు మీకు జీవనము భారముగా ఉన్నదంటే కారణము కుటుంబ సమస్యలు కానే కాదు! 
కేవలము మీరు శాశ్వతములు అనుకున్నటువంటి అశాశ్వతములు వలనే మీకు  దుఃఖములు, కష్టములు!

రోగికి టానిక్కులు బలాన్ని ఇస్తాయని జీవితమంతా టానిక్కులే తీసుకుంటారా?
లేదు కదా!! 

శరీరమునకు మంచి ఆహారము వలనే ఆరోగ్యము.
అది శరీరము పుష్టికి శాశ్వతము.

అలానే వస్తు విషయాలు, బందు మిత్రులు మొదలగు అందరూ అశాశ్వతము.. 
అశాశ్వతములు వలన కలిగే ఆనందం అత్యల్పమే అగును.

కానీ భగవంతుడు శాశ్వతుడు. కనుక ఆయన వలన కలిగే ఆనందము శాశ్వతము. 

ఇట్టి శాశ్వత ఆనందమును పొందాలంటే  దైవమును విడువక పట్టుకోవాలి. విషయాల పట్ల వాంఛలను వదులుకోవాలి."``........`
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*........                               -                                                      -         ******                              -              *"ధైర్యం"*

"మనిషికి జీవితాంతం తోడుండేవాడు ఎవడు?" అని యక్షుడు ధర్మరాజును అడిగాడు. ఎవరైనా ఈ ప్రశ్నకు భార్య అనో భర్త అనో, పిల్లలు, పేరు ప్రతిష్ఠలు అనో సమాధానం చెబుతారు. 

కానీ ధర్మరాజు మాత్రం “మనిషికి జీవితాంతం తోడుండే వారు ఎవరూ లేరు. అలా ఉంటారనుకోవడం భ్రమ. అన్ని రకాల అనుబంధాల్లోనూ ఎవరి అవసరాలు వారికుంటాయి. అందుచేత మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు"అని చెప్పాడు. 

ప్రపంచంలో తెలివైన వారెవరైనా అంగీకరించకుండా ఉండలేని విషయమిది. మనిషిని నిజంగా కాపాడేది భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో కూడిన గుండె ధైర్యమే...............                    -                                                                  -           🙏🙏 .......                                                           -         వలిశెట్టి లక్ష్మీశేఖర్ ...                 -           30 .07 .2024.....                                   -            98660 35557 ...
 సగర్భ జపం ఉత్తమోత్తమం.

ప్ర: 'సగర్భప్రాణాయామం,' 'సగర్భజపం' -   అంటే ఏమిటి. రెండు ఒకటేనా?

జ: ప్రాణాయమం చేసేటప్పుడు  ఉచ్ఛ్వాసనిశ్వాసలతో మంత్రాన్ని కలిపి మౌనంగా జపించడమే సగర్భ ప్రాణాయామం. సగర్భ జపమన్నా అదే.

ఉచ్ఛ్వాసతో ఒకమారు, నిశ్వాసతో ఒకమారు మంత్రాన్ని మౌనంగా జపించాలి. శ్వాస, మంత్రం ఏకమవడమే గొప్ప సాధన. రేచక, పూరకల్లోనే కాక కుంభకంలో మంత్రాన్ని జపించడాన్ని కూడా సగర్భ జపమనే అంటారు.
 
మంత్రాన్ని బయటకు ఉచ్చరిస్తే అధమం, పైకి వినబడకుండా పెదవి కదుపుతూ చేయడం మధ్యమం, మనస్సుతో జపించడం ఉత్తమం. సగర్భ జపం ఉత్తమోత్తమం.
 అరుణాచలమే జ్ఞానమార్గం,
నీ శరీరం దేవుడు కట్టుకున్న గుడి.
నీ హృదయం ఆయన గర్భగుడి.
అందులో స్పందనగా ఆ భగవంతుడే కొలువై ఉన్నాడు.

మనస్సే ఆ గర్భగుడికి గడప. ఆయన కట్టుకున్న గుడి నిజం పులిలాగ నిజమైన గుడి.
నువ్వు కట్టించిన గుళ్ళు పేపర్ టైగర్ లాగ బొమ్మల కొలువులో గుళ్ళు.

ఎంతసేపూ, ఆవారాగా, గుడి బయట దుకాణాల మధ్య తిరుగుతూంటావు బతుకంతా. పరుసు కొట్టేశారని కొన్నాళ్ళు, భక్తుడవై, గుళ్లో ప్రదక్షణాలు చేస్తూ తిరుగుతూంటావు.

ఇంకా ముదిరితే, పూజారివై, దేవుడి గడప దగ్గర కూర్చుని పూజలూ అర్చనలూ చేస్తావు, పొద్దల్లా..

మోహమాటపడకు. గడప దాటి గర్భగుడి లోపలికి వెళ్ళు. దేవుడు తప్పుకుంటాడు. ఆ చోటు నీకోసం ఇన్నాళ్లూ పట్టి ఉంచానంటాడు.
పరాయివాణ్ణి కానంటాడు.
కొంతసేపటికి కనుమరుగై ఇక్కడ ఎప్పుడూ కూడా ఇద్దరం లేమే.. చూసుకో.. అని కథా శ్రవణం ముగిస్తాడు.

ఆలస్యం చెయ్యకు. అడుగుపెట్టు. అక్కడా ఇక్కడా తిరగకు, గుడి మూసేస్తారు.

అరుణాచలశివ🙏🏻

****శ్రీ రమణీయం - 38🌹 👌ఎవరైనా ఆశ్రయించాల్సింది దేవుని గుణాలనే..👌

 [7/31, 04:38] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 38🌹
👌ఎవరైనా ఆశ్రయించాల్సింది దేవుని గుణాలనే..👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️

🌈 38. ఎవరైనా ఆశ్రయించాల్సింది దేవుని గుణాలనే..🌹

✳️ జన్మరాహిత్యం అంటే బొక్కెనలో విడిగా కనిపిస్తున్న నీటిని బావిలో కలపడం లాంటిదే. నీళ్ళలో మునిగి ఉన్నంతవరకూ బొక్కెనలో ఉన్న నీటికి ప్రత్యేక ప్రతిపత్తిలేదు. కానీ నీళ్ళలోనుండి బయటకురాగానే వాటిని బొక్కెనలో నీళ్ళని అంటాం కానీ బావిలో నీళ్ళని అనటంలేదు. వివేకంతో ఆలోచిస్తే బొక్కెన అనే పరిధిచేరినా ఆనీళ్ళు బావినీళ్ళు కాకుండా పోయాయా? నీవు ఎలా ఉన్నా ముక్తుడివేనని భగవాన్ చెప్పిన మాటలో ఆంతర్యం అది. *మన దేహపరిధి చేత మనసు అని అంటున్నా... అది విశ్వమనసు (పరమాత్మ) లో భాగమేనన్న భావస్వేచ్చే మోక్షం.♪*

✳️ దేహ పరిధిచేత మనసుకి ఏర్పడిన మైల, మోహం వదలడానికి సమయం పడుతుంది. నామజపంవల్ల కదిలే విశ్వమనసు దైవానుగ్రహంగా మన ప్రయత్నాన్ని సులభంచేస్తుంది. విశ్వమనసులో మనమూ భాగమైనప్పటికీ పరిధి చేత ఆ పవిత్రత మన మనసుకి లేకుండాపోతుంది. దైవం అంటే విశ్వమనసే. అది ఎక్కడ, ఎప్పుడు, ఎవరు పిలిచినా పలుకుతుంది. ఆపదలో ఉన్నప్పుడు ఏడుకొండలవాడిని మనం ఉన్నచోటునుండే మొక్కుకుంటాంగానీ, తిరుపతి వెళ్ళి మొక్కుకోవడంలేదుకదా! కాకపోతే,  మొక్కు తీర్చుకునేందుకు తిరుపతి వెళ్తాం. మన మనసు ఇప్పుడు అల్పంగా ఉంది. సర్వశక్తివంతం, పరమ పవిత్రము అయిన ఆ విశ్వమనసులోని అణు మాత్రాన్ని తెచ్చుకొని కర్తృత్వాన్ని పొందుతున్నాము. అదే ఇంత నాటకానికి కారణం అయింది. మనం ఈ విశ్వంలో ఎంతటి అస్వతంత్రులమో విచారిస్తే ఈ కర్తృత్వం పోతుంది. ఆ విశ్వమనసు సర్వత్రా నిండిఉందన్న సత్యదృష్టిచేతనే మనం రాతివిగ్రహంలో కూడా దైవాన్ని చూడగలుగుతున్నాం. దైవం రూపంలేని వాడని అంటున్నామంటేనే రూపం తీసుకోలేని అసమర్థుడని చెప్పినట్లు అవుతుంది. పోనీ రూపరహిత ధ్యానమే ఉత్తమం అనుకున్నా నామజపం మనోబలాన్నిచ్చి ఆస్థితికే చేరుస్తుంది♪.

✳️ జ్ఞానిబోధ అర్థం కావాలంటే మనం జ్ఞానులమైనా అయి ఉండాలి, లేదా జ్ఞాని మాటపై పరిపూర్ణ విశ్వాసమైనా ఉండాలి♪. హాస్టల్లో చేరిస్తేగానీ పిల్లాడికి తల్లి విలువ తెలియనట్లు జ్ఞాని ఉన్నంతకాలం వారిని దేహమాత్రుడిగా చూస్తాం. వారు అంతర్ధానం అయిన తర్వాత గౌరవించి గుడికడతాం. మనకు పురాణాలను అందించిన మహాజ్ఞానుల మాటల్లో కూడా వికారాలనే వెతకటం అలవాటైంది. మనం అన్నింటినీ మనవైపు నుంచి ఆలోచించి ఆక్షేపిస్తున్నాం♪. 

✳️ దారుకావనంలో శివుడు నగ్నంగా తిరిగినా, అక్కడే ఉన్న ఋషులు, ఋషి పత్నులకు వికారం కలగలేదు. కానీ అది చదువుతుంటే మనకు వికారం కలుగుతుంది. మన మానసిక స్థితి అలా ఉంది. సీతాదేవిని వెదికేటప్పుడు హనుమంతుడు ఒంటిపై దుస్తులులేని అనేక మంది స్త్రీలను చూశాడని రామాయణంలో వ్రాశారు. వాల్మీకి రచనలోని నిజాయితీ కూడా మనకు వికారంగా కనిపిస్తే అది ఆ జ్ఞానితప్పా? మన తప్పా? తాముచూసిన సత్యాన్ని ప్రపంచానికి అందించిన జ్ఞానుల్లో 90 శాతం మన భారతీయులే. నామం, జపం, రూపం మన ఇష్టానికి అడ్డుకావచ్చుగానీ ధ్యానానికి మాత్రం అడ్డుకాదు. కాబట్టే పురాణాలు మనకందించిన వ్యాసభగవానుడు మాత్రమేకాదు, అద్వైతాన్ని బోధించిన ఆదిశంకరాచార్యుల వంటి మహానుభావులు కూడా మనకి అనేక దేవతా మూర్తుల స్తోత్రాలను అందించారు. నడక వచ్చేంతవరకూ పిల్లాడికి చక్రాలబండి ఊతంగా ఇస్తాం. మనం కొనివ్వకపోతే వాడైనా గోడలు పట్టుకునే నడుస్తాడు. నీకు నడక నేర్పిన గోడ మరొకరికి అక్కర్లేదనటం ఎంతవరకూ వివేకం అవుతుంది♪.

✳️ మనలో ప్రేమ ఉంటే రాయిరప్ప కూడా మన మాట వింటాయి. ఈ విశ్వంలో అణువణువులో ఉన్న మనసు జ్ఞానికి, యోగికి తెలుస్తుంది. వారు ఆ విశ్వ చైతన్యాన్ని అణుమాత్రమైనా వృథా చేయరు కనుక అవి వారి మాటవింటాయి. అదే మనకు మహత్యంగా కనిపిస్తుంది. ఇంట్లో మన మాట వినే పిల్లాడు ఉంటేనే పేపరు తెచ్చుకోవడానికి బద్ధకించి వాడితో తెప్పించుకుంటాము. కానీ, ప్రకృతి అంతా తన మాట వింటున్నా జ్ఞాని ఏ మాత్రం బద్ధకించక తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తాడు. ప్రకృతి తమ మాట వింటుంది కాబట్టే శ్రీకృష్ణుడు ద్రౌపది మానాన్ని రక్షించగలిగాడు. షిర్డిసాయిబాబా కూలిపోతున్న భవనాన్ని తన మాటతో ఆపారు. ఒక మఠాధిపతి రాష్ట్రపతి కోసం వర్షాన్నే ఆపారు. మన ప్రక్కనే ఉన్న పిల్లవాడు ప్రమాదంలో పడితే మనం రక్షించుకోలేము. మరి రాఘవేంద్రస్వామి ఎక్కడో నీళ్ళలో పడిన బాలుడ్ని రక్షించారు.

✳️ సత్యాన్ని నిర్గుణంగా దర్శించిన ద్రష్టలు మనకోసం దైవానికి రూపనామాలు ఏర్పాటుచేస్తే మనం మాత్రం నేరుగా ధ్యానం చేస్తానంటే సాధ్యపడే పనికాదు. గతజన్మలోనే సాధనను పూర్తి చేసుకున్న కృతోపాసకులకు సాధ్యమయ్యే మార్గాలను మనకు అన్వయించుకోకూడదు. హోటల్కి వెళ్లి కూడా నేనే వండుకుని తింటాననటం ఎలాంటిదో మన పూర్వులు చూపిన సర్వజనీన మార్గాన్ని వదిలి సొంతప్రయత్నం చేయడం అలాంటిది♪. 

✳️ *సాధనలో ఒక మార్గం గొప్పది, ఒకమార్గం అల్పమైనది అనిలేదు. ఫలం శ్రద్ధలో ఉంది గానీ మార్గంలో లేదు. భక్తి, జ్ఞాన, యోగాల మిళితమైన నామజపం ఇవ్వలేని ఫలం అంటూ ఏదీలేదు♪.*
[7/31, 04:38] +91 73963 92086: ✳️ మనం చేసే సాధన మన భావితరాలకు సరూపంతో అందిస్తేనే అది నిలుస్తుంది కనుక రూపనామాల విషయంలో సందేహం అక్కర్లేదు. భగవంతుడికి రూపం లేదని చెప్తున్న మతాలు కూడా ఏదో ఒక స్థలాన్నో, నిర్మాణాన్నో ఆశ్రయిస్తున్నారే గానీ గాలిలో ప్రార్థనలు ఎవరూ చేయడంలేదు. దైవం, జ్ఞాని, గురువు దేహపరంగా సమానులు కాకపోవచ్చు కానీ కనిపించని శక్తిగా వారంతా సమానులే. మహానుభావులు దేహానికి పరిమితంకాని విశ్వచైతన్య మూర్తులు కనుకనే వారిని తలుచుకుంటున్నాం. మనం నిజంగా ప్రార్థించేది దేహాన్నే అయితే మన ఇంటి ప్రక్కవాడినే ప్రార్థించవచ్చు కదా. మన రక్షణ మనచేతిలోనే ఉంటే దైవాన్ని ఎందుకు ప్రార్థిస్తాం. రోడ్డు ప్రమాదాలను ఎందుకు జరగనిస్తాము. మామూలుగా నాలుగు అడుగులు వేస్తేనే కాళ్ళునొప్పులు పుట్టే వ్యక్తికి తిరుపతికొండ ఎక్కితే ఏ బాధా ఎందుకు ఉండటంలేదు? 

✅👉 ఆధ్యాత్మిక ప్రయాణంలో మన అనుభవాలే మనకు విశ్వాసాన్ని, నమ్మకాన్ని, బలాన్ని ఇస్తాయిగానీ కేవలం విన్నదీ, చదివిందీ మనను ముందుకు సాగనివ్వదు.

꧁☆•┉┅━•••❀🔯❀•••━┅┉•☆꧂

🌈 మనసు - విశ్వమనసు: 💫

✳️ మనకు మనసు ఉన్నట్లే ఈ విశ్వానికి కూడా ఒక మనసు ఉంది. ఈ విశ్వమంతా ఒకానొక శక్తి వ్యాపించి ఉంది. విషయాన్ని గ్రహించి దానికి తగ్గ క్రియచేసే ఆ శక్తికే మనసు అని పేరు. ఇది సృష్టి అంతటా ఉంది. వేడిదగ్గరకు వెన్నను చేరిస్తే అది కరిగిపోతుంది. ఈ ప్రక్రియలో మంటకు వెన్న గురించి, వెన్నకు మంట గురించి తెలియదు. కానీ కరిగిపోవడం అనే క్రియమాత్రం జరిగిపోతుంది. మనిషికైతే ఇలా తెలియకుండా ఏ క్రియా జరగదు. అంటే మనిషికి తెలిసినట్లుగా ప్రకృతిలో ప్రతీదానికి తెలియడం అనే గుణం ఉండనక్కర్లేదు. కానీ సృష్టిలో మాత్రం తెలియడం అనే క్రియలేకుండానే తెలివితో నిరంతరం అనేక పనులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఏటా ఒకే కాలానికి పూత వేయాలని చెట్టుకు ఎలా తెలుసు? ఏ కాలానికి ఎక్కడ, ఎంత మోతాదులో వర్షించాలో మేఘాలకు ఎలాతెలుసు?. ఇలా గ్రహించి అదృశ్యంగా పనిచేస్తున్న శక్తే మనసుగా పిలవబడుతుంది, ఈ అదృశ్య శక్తినే సైన్స్ సహజం అంటుంది. ఆ సహజాన్నే మనం భగవంతుడని అంటాము. ప్రార్థిస్తే వినేశక్తి ఆ విశ్వమనసుకి ఉంది. తన్మయత్వంతో క్షణకాలం పాటు మనకు ఇష్టమైన ఏ రూపంలో తలుచుకున్నా విశ్వమనసుగా ఉన్న శక్తి మనని అనుగ్రహిస్తుంది. నిత్యము, నిరతము విశ్వమంతా నిండి ఉండేది జ్ఞానం. అది మన మనసు ద్వారా వ్యక్తమైతే భక్తి అయింది♪. 

✳️ దైవానికి రూపం లేదనే విశ్వాసం కొందరిది. వారు కూడా రూపం అనే ఒక్క గుణం మినహాయించి మిగిలిన అన్ని గుణాలను దైవానికి ఆపాదిస్తూనే ఉన్నారు. ఏ మతం వారైనా దైవాన్ని వరాలు ఇవ్వడం, పిలిస్తే పలకడం, రక్షించడం వంటి అనేక గుణాలతో కొలుస్తున్నవారే. అందరికీ.. అందుబాటులో ఉండేలా మనం రూపం అనే గుణంకూడా ఏర్పాటు చేసుకున్నాం. ఒక్క రూపాన్ని తీసేసినంత మాత్రాన ఏవరూ భగవంతుణ్ణి ఏ గుణంలేని వాడుగా ఆరాధించటంలేదు కదా! పెళ్ళిచూపులకు వెళ్లేముందు వధూవరుల గుణగణాలన్నీ అడిగి రూపం బాగుంటుందా అంటారు. అంటే రూపం గుణాల్లో ఒకటేగానీ అదిమాత్రమే గుణంకాదు. మనకి రూపం లేదని తెలిసేవరకూ మనం దైవాన్ని ఒక రూపంతో పూజించడం వల్ల లాభమే గానీ నష్టంలేదు. దైవాన్ని మనకి ఇష్టమైన రూపంలో ఎదురుగా ఉంచుకున్నా కొలిచేదిమాత్రం అందులోని అదృశ్యశక్తినే అయినప్పుడు రూపంవల్ల వచ్చిన నష్టం ఏముంది. భగవంతుడు మన హృదయంలో ఉన్నాడన్న అనుభవం కలిగేవరకూ రూపధ్యానం, నామజపం అవసరం. భగవంతుని విషయంలో రూపం, నామం, శక్తి వేరుగాలేవు. ఏ వస్తువునుండీ రూపాన్ని వేరుచేయలేము.

🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🚩 హిందువునని గర్వించు
🚩 హిందువుగా జీవించు

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️

Tuesday, July 30, 2024

****మూడు తలల పాము

 మూడు తలల పాము

'గురువర్యా! మీరు అవధిలేని ఆనందం నాలోనే ఉందం టారు. అది నా స్వభావమూ, సాత్తూ అంటారు. కానీ నేను మాత్రం దాన్ని అనుభవించలేక పోతున్నాను. ఏం చేయాలి?'

'శిష్యా! ముందు, అలా అనుభవించలేక పోవడానికి కారణమేమిటో తెలుసుకోవాలి. నిత్య, శుద్ధ, బుద్ధ, చైతన్య స్వరూపుడివైన నీకు, ఈ దేహం ఇంద్రియ-మనో బుద్ధు లతో సంబంధం ఏర్పడి, ఆ శరీరాదులే నేను అనే తాదాత్మ్యతా, భ్రమా ఏర్ప డ్డాయి. ఇలా నిన్ను 'నేను-నాది' అన్న పరిమితులలో బంధిస్తున్నది 'అహం 'కారం' అనే అజ్ఞానం. అది ఆనందమయ మైన నీ స్వస్వరూపాన్ని కప్పేస్తున్నది.' 'మరేం చేయాలి?'

'నీ దగ్గర పెద్ద పెట్టెలో నీ సొంత ధనరాశులు బోలెడున్నాయి. ఒక రోజు తెల్లారి చూసేసరికి, ఒక కాల సర్పం ఆ పెట్టెను చుట్టుకొని విషం చిమ్ముతూ, బుసలు కొడుతున్నది. అప్పుడు నువ్వేం చేయాలి? నిరుపేదనయి పోయానని బిచ్చమెత్తుకుంటూ ఊరంతా తిరుగుతావా? లేక, ఏదో ఒక విధంగా ఆ సర్పాన్ని చంపి నీ సొమ్ము స్వాధీనం చేసుకోవాలా?'

'ఏదో ఒక ఉపాయంతో సర్పాన్ని చంపడమే తెలివి.

'అదీ విషయం! అహంకారం అనే మూడు తలల

పాము, బ్రహ్మానందమనే నీ సొత్తును చుట్టుకొని కూర్చొని

ఉంది. దాన్ని వేదాంత జ్ఞానం అనే ఖడ్గంతో నరికివేసి, నీ సాత్తు నువ్వు అనుభవించడం వివేకం!'

'కానీ ఆ సర్పాన్ని నరకగల సామర్థ్యం నాకెలా వస్తుంది?'

'చాలాసార్లు చెప్పాను. అది అభ్యాసం ద్వారా, వైరాగ్యం ద్వారా అబ్బుతుంది. ఇంద్రియాలకు నువ్వు లొంగకుండా, వాటిని నువ్వే అదుపు చేసుకొని, ఇంద్రియ సుఖాలవల్ల లాభం స్వల్పం, క్షణికం; నష్టమే అపారం' అని గ్రహించి, వాటిపట్ల అనాసక్తి పెంచుకోవడం వైరాగ్యం. ఈ నశ్వరమైన దేహాది జడ విషయాలు నీవు కాదనీ. నీవు చైతన్య స్వరూపు డివనీ, శాశ్వతుడివనీ, పరిమితులు లేని సర్వవ్యాపివనే సత్యాన్ని మననం చేస్తూ, ఆ సత్యం మీదే ఏకాగ్రత నిలిపే ప్రయత్నం అభ్యాసం.'

ఎం. మారుతి శాస్త్రి
 ఉత్తిష్ఠ భారత Uthishta Bharata 

చిన్న ప్రయోగం..పెద్ద ఫలితం..హరహర మహదేవ్..
మన వ్యాపారసంస్థలకు ప్రతి శుక్రవారం షాప్ లోపల సాంబ్రాణి దూపం వేయించడం....
గల్లా పెట్టెకు కూడా సాంబ్రాణి పొగ వేసి నిమ్మకాయ మార్చడం అనాదిగా చేస్తున్నాం.
చాలా షాపుల వారు ప్రతి శుక్రవారం పూజారి గారి చేత పూజ చేయిస్తారు..

అయితే ఇది కొన్నాళ్లుగా పూజారి వ్యవస్థలో వచ్చిన మార్పులు, అలాగే అక్కడ ఇలా షాపులకు తిరిగి చేసే వ్యక్తులు తగ్గడం వలన గత పదేళ్లుగా ముస్లింలు ఈ పని లోకి చొరబడ్డారు.

వాళ్ళు ప్రతి శుక్రవారం, షాపుల వెంట తిరగడం నిమ్మకాయలు కట్టీ, సాంబ్రాణి దూపమ్ వేయడం చేస్తున్నారు. వాళ్ళు ఏకండిషన్లో వస్తారో తెలీదు..
స్నానం, కూడా చేయనివారు కొందరు..
అలాగే వారికి లక్ష్మీదేవి నివాసమైన మన గల్లా పెట్టె కూడా  చూపించాల్సి వస్తుంది..
నిమ్మకాయలు కూడా జస్ట్ అలా కట్టేసి వెళ్ళిపోతాడు దీనికి మొత్తంగా 50 రూపాయల వరకూ చార్జ్ చేస్తారు.

ఇది చాలామంది షాపుల యజమానులు జీర్ణించుకోలేక పోతున్నారు..
ఈ సందర్భంలో కొందరి మిత్రుల ఆలోచన మేరకు హిందూ చైతన్యవేదిక ప్రాంత సహ సంయోజకులు శ్రీ అంబటి మారుతీరాం గారి ఆధ్వర్యంలో కొందరు జంగమ దేవరలకు శిక్షణ ఇచ్చి వారికి కావలసిన ప్లేట్స్..సాంబ్రాణి..నిమ్మకాయలు ఉచితంగా ఇచ్చి ప్రతి సోమవారం హిందూ షాప్స్ కు వెళ్ళి సాంబ్రాణి వేసి నిమ్మకాయలు కట్టేవిధంగా మాట్లాడారు..

ఇది విజయవంతంగా జరుగుతున్నది.

జంగమ దేవరలకు కూడా ఒక్కొకరికి 500 రూపాయల చొప్పున మేము 4 వారాల పాటు ఇచ్చే విధంగా మాట్లాడాము.
వారికి కూడా ఉపాధి దొరుకుతుంది అలాగే ఇలా సాంబ్రాణి దూపం వేయించుకుంటున్న ప్రతి హిందూ వ్యాపారి కూడా తృణమో ఫణమో వారికి ఇస్తున్నారు..

చాలా తక్కువ ఖర్చుతో మనం మరచిపోతున్న మన ఆచారాలను ఇలా కాపాడుకోవచ్చు..

మీరు కూడా మీమీ ప్రాంతాల్లో ప్రయత్నం చేయండి..మంచి ఫలితం ఉంటుంది..
జైశ్రీరాం..
 ముస్లింలు దోషులేనా? ఆలోచిద్దాం. 
నిన్న మా ఆఫీస్ లో ఒక చిత్రమైన ఘటన జరిగింది – మేము ముగ్గురు, నలుగురు హిందువులం కూర్చొని ఉన్నాం. ఒక దీర్ఘమైన చర్చ జరుగుతున్నది – ఉత్తరప్రదేశ్ (ఉత్తరాఖండ్) లలో, ముజఫర్ నగర్ జిల్లా యంత్రాంగం, దుకాణాల ముందు దుకాణం పేరు, యజమాని పేరు తప్పనిసరిగా ప్రదర్శించమని ఆదేశాలు ఇచ్చింది కదా, ఆ విషయం మీద, ఇది సరైనదా కాదా అనేది చర్చ. ఇంతలో ఒక తెలిసిన ముస్లిం వృద్ధుడు గఫార్ మియా వచ్చాడు, తాను కూడ చర్చలో పాల్గొన్నాడు. అతడు అంటాడు – ‘ఈ నేమ్ ప్లేట్, పేరున్న బోర్డ్ వ్రాసి పెట్టినంత మాత్రాన ఏమౌతుంది? ఏమీ తేడా రాదు. హిందువులు, సిక్కులు ఎప్పటిలాగానే, ఎవరు వాళ్ళతో ఉంటారో, ఎవరు వాళ్ళకి సహాయం చేస్తారో, వాళ్ళతోనే పోట్లాడుతూ, గొడవ పడుతూనే ఉంటారు. ఇప్పుడు మా ఆజ్మీర్ ఖాజా మొహిద్దీన్ చిస్టీనే తీసుకోండి, అతడు పృథ్వీరాజు కుమార్తెలను చెరచి, బహిరంగంగా అత్యాచారాలు చేయించాడు, ఇవాళ హిందువులు అతని సమాధిని తాకి, ముద్దు పెట్టేందుకు తహతహలాడుతూ ఉంటారు. ఇక మా ముస్లిం మొఘల్ పాలకులు, ఇస్లాం  స్వీకరించనందుకు, సిక్కుల గురుగోవింద సింగ్ ను బహిరంగంగా హత్య చేశారు, ఆయన పిల్లలను సజీవంగా ఉంచి, సమాధి కట్టేశారు. ఇవాళ వాళ్ళ వారసులు, ముస్లింల కాళ్ళు పట్టుకొనేందుకు  కూడా సిద్ధం అయ్యారు కదా (నేటి కెనడా-పాకిస్తాన్ సంబంధాలు). 1984 అల్లర్లలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వందలాది సిక్కులను బహిరంగంగా ఊచకోత కోశారు. ఇప్పుడేమయింది? అదే కాంగ్రెస్ పార్టీతో, సిక్కులు అంటకాగుతున్నారు. ములాయం యాదవ్, రామభక్తులైన హిందువులపై కాల్పులు జరిపించాడు, మరి ఇప్పుడో? హిందువులు అతడి కొడుకైన అఖిలేష్ యాదవ్ కాళ్ళకి మొక్కుతున్నారు, అతడికి ఎర్రతివాచీ పరుస్తున్నారు. అందుకని సార్, మాకేమీ తేడా రాదు. ఒకవేళ మేము ముస్లిం నేమ్ ప్లేట్ పెట్టి, హిందువులకు మామిడిపళ్లు రూ.10 లకు తక్కువకి ఇస్తామంటే, వాళ్ళు మా దగ్గరే కొంటారు. హిందువుల దగ్గర కొనరు గాక కొనరు. కాదా, చెప్పండి? మోడీ జీ కానివ్వండి, యోగీ జీ రానివ్వండి, హిందువుల బానిస గుణం, బానిస మనస్తత్వం పోదు. లేకపోతే, గుప్పెడు మంది ఉన్న తురకలు, వందల్లో ఉన్న ఆంగ్లేయులు, ఇన్ని వేల ఏళ్లు హిందువులను బానిసలుగా ఎలా చేసేవాళ్ళు? ఆలోచించండి.”
గఫార్ మియా మాటలు విన్న తర్వాత, మా నలుగురం హిందువులం అవాక్కయ్యాం, నోట మాట రాలేదు. ఎందుకంటే, ఎవరి వద్దా అతని వాదనకు సరైన సమాధానం లేదు. మేమలాగే ఉండిపోతే, గఫార్ మియా మళ్ళీ అన్నాడు –“ మీరందరూ జనరల్ హిందువులు, ఏమీ చేయరు, చేయలేరు.  కూరలు రూ.10 తక్కువకు దొరికితే, మీ మతాన్నే అమ్మేస్తారు, మా ముస్లింల దగ్గరే సరకులు కొంటారు. చూస్తూ ఉండండి. మీరేమో వ్యాసాలు వ్రాస్తారు కదా – ఆఫ్ఘనిస్థాన్ తీసుకున్నారు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాగేసుకున్నారు, అని మీరు ఏడుస్తారు కదా. ఇంకా కాశ్మీర్, బెంగాల్, కేరళ కూడా త్వరలో మావే అవుతాయి. కావాలంటే, మీరు నాతో పేపర్ మీద వ్రాయించుకోండి. ఎవరిది ఎక్కువ జనాభా అయితే, వాళ్ళదే ఈ దేశం.” 
నాకు అనిపిస్తోంది – ఇందులో ముస్లింల తప్పు ఏముంది? వాళ్ళు మిషన్ గజ్వా-ఏ-హింద్ (అంటే, హిందుస్థాన్ ను కూడా ఇస్లామిక్ దేశంగా మార్చటం) మొదలు పెట్టేశారు కదా. హిందువులే మేల్కొని, అందరినీ ఐక్యం చేయాలి. లేకపోతే, మన తర్వాతి తరాలు హిందువులుగానే ఉంటాయని చెప్పలేం.  🤝🚩🙏

Sekarana
 రామాయణమ్ 10
.
విశ్వామిత్రమహర్షి మాటలు విన్నాడు దశరధుడు.
మనసొప్పటంలేదు ఆయనకు! ఇలా అంటున్నాడు!
.
ఊన షోడశ వర్షేణ రామో రాజీవ లోచనః
న యుద్ధయోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసైః
.
రాజీవ లోచనుడైన నా రామునకు పదహారు సంవత్సరాలు ఇంకారాలేదు ( పదహారుకు ఒకటి తక్కువ ,ఊన అంటే -1 )
రాక్షసులతో యుద్ధం చేసే యోగ్యత ఉన్నదని నేను అనుకోవడంలేదు! .
.
నా రాముడు ఇంకా బాలుడయ్యా! పూర్తిగా ఇంకా విద్యలే నేర్వలేదు ! అస్త్రాలు ఇంకా తెలువవు ! అలాంటి వాడు మాయావులైన రాక్షసులతో ఎలా యుద్ధం చేయగలడు ! కోరి కోరి కొడుకును కొలిమిలో ఎవరైనా నెట్టివేస్తారా!.
.
మహర్షీ నేనే ధనుస్సు ధరించి మీవెంట నడుస్తాను ,నా వెంట మెరికల్లాంటి యోధులు ఒక అక్షౌహిణి సైన్యం నడుస్తుంది!
మీ యాగసంరక్షణ నేనుగావిస్తాను మునీంద్రా! .
.
నా రాముడు బాలుడు! ముక్కుపచ్చలారని ముద్దుబిడ్డడు వాడిని విడచి ఒక్కక్షణమైనా నేను బ్రతుకజాలను!.
.
అంతగా నీకు రాముడే కావలెనంటే అతనితోపాటు నన్ను నా చతురంగబలాలనూ కూడా తీసుకొని వెళ్ళు,అంతేకానీ ఒంటరిగా రాముని నే పంపజాలను!.
.
మునిచంద్రా అసలు ఆ రాక్షసులు ఎవరు? ఎవరు పంపగా వారు నీ యాగానికి విఘ్నం గావిస్తున్నారు?.
.
రాజా ఆరాక్షసులు రావణాసురుడు పంపగా వచ్చినవారు ,రావణుడు బ్రహ్మవరప్రసాది ! విశ్రవసు పుత్రుడు! 
వాడిచే ప్రేరేపింపబడి మారీచ సుబాహులనెడి వారు యజ్ఞవిఘ్నానికి పూనుకొన్నారు!
.
అసలు విషయం వినగానే దశరధమహారాజు తీవ్రమైన వేదనకు గురి అయి మహర్షీ ! 
దేవ,దానవ,యక్ష,గంధర్వ, పతగ,పన్నగులలో రావణుని ఎదిరించువారులేరే ! 
నా పసికూన! రాముని ,వానికి ఎదురు వెళ్ళమంటావా! నన్ను క‌నికరించు మహర్షీ! నా కొడుకు పట్ల అనుగ్రహము చూపు !.
.
మహర్షీ ! అంతటి బలవంతుడికి నేనుగానీ,నాసైన్యముగానీ ,నా కుమారుడుగానీ ఎదురునిలవలేము! యుద్ధము చేయజాలము!
.
ఆ మారీచ ,సుబాహులు మాయావులు మహాబలవంతులు వారిలో నా స్నేహితులతో కలసికూడా ఎవరో ఒకరితోనే తలపడగలను అలాంటిది ఇద్దరితో  తలపడమని రాముని పంపటమా నా వల్ల కాదు! పంపనుగాక పంపను ! అని ఖండితముగా పలికాడు దశరధుడు!
.
దశరధుడి ఈ అసంబద్ధ ప్రేలాపనలు విని మహర్షి ఒక్కసారిగా తోకతొక్కిన త్రాచు అయినాడు! యజ్ఞ కుండంలో నేయివోయ భగ్గున లేచిన పెనుమంట అయినాడు ,తీవ్రమైన కోపంతో కనులు అరుణ వర్ణం దాల్చాయి!.
.
అడిగినది ఇస్తానని ప్రతిజ్ఞ చేసి మాట తప్పుతున్నావ్ దశరధా!ఇది రఘువంశ సంజాతులు చేయవలసిన పనికాదు! సరే నీ కొడుకుతో ,బంధుమిత్రులతో సుఖంగా ఉండు వచ్చిన దారినే నే వెడతాను అని తీవ్రమైన ఆగ్రహావేశాలతో కంపించిపోయాడు!.
.
విశ్వామిత్రుని గురించి సకలము తెలిసిన మహర్షి వసిష్ఠుడు కల్పించుకొని !రాజా ! నీవు ఇక్ష్వాకుడవు ! నీ వంశమెట్టిది? లోకంలో మీరే ఆడిన మాట తప్పితే ఇంక మాటమీద నిలబడే వారెవరయ్యా! నీ మనసులో ఏ విధమైన శంకకు తావివ్వకు రాముని విశ్వామిత్రునితో యాగసంరక్షణార్ధమై పంపు!.
.
ఈ విశ్వామిత్రుడెవరనుకొన్నావు? ఈయన సంరక్షణ లొనున్న రామునికి అస్త్రములు తెలిస్తే నేమి? తెలియకున్న నేమి?.
.
విశ్వామిత్రుడు మూర్తీభవించిన ధర్మము! పరాక్రమవంతులలో శ్రేష్టమైన వాడు!
.
ఈయనకు తెలిసినన్ని అస్త్రములు సకలభువనాలలో ఎవరికీ తెలియవు! మరి భవిష్యత్తులో కూడా ఈయనకంటే ఎక్కువగా ఎవరికీ తెలవవు!.
.
ఈయనకు తెలిసిన శస్త్రాస్త్రాలెలాంటివో చెపుతాను విను!
.

జానకిరామారావు వూటుకూరు గారి 
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

Monday, July 29, 2024

శ్రీ రమణీయం - 37🌹 👌 మనజీవితమే దేవుని పూజగా మారాలి👌

 [7/29, 15:10] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 37🌹
👌 మనజీవితమే దేవుని పూజగా మారాలి👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️

37. మనజీవితమే దేవుని పూజగా మారాలి

✳️ కేవలం దేవుని పూజమాత్రమే కాదు శ్రద్ధాభక్తులతో చేస్తే ప్రతిపనీ ధ్యానమే| అవుతుంది. నిద్రలో అందరికీ లభిస్తున్న శాంతి మనిషికి శ్రద్ధగా చేసే పనిలోకూడా లభిస్తుంది. ఎన్ని మార్గాల్లో దేవుణ్ణి పూజించినా వివేకం లోపిస్తే ఆ సాధన వ్యర్థమౌతుంది. ఏ మార్గాన్ని మనం వద్దని చెప్పనక్కరలేదు. విచారణ, విశ్లేషణలతో ఆ సాధనను పరిపూర్ణం చేసుకోవాలి. మనకు పెద్దలు సూచించిన నామజపం మనసును ఖాళీగా ఉంచకుండా చేసేందుకే. శ్రద్ధగా చేసే పనిలో ఎలాగూ మనసు ఖాళీగా ఉండదు. శ్రద్ధ లోపించినప్పుడే మంత్రజపం మన మనోచాంచల్యానికి ఔషధంలాగా పనిచేస్తుంది.

✳️ ఎంతటి మహానుభావులైనా జీవనవిధానంలో మనతో సమానంగానే ఉన్నారు. సాక్షాత్తు అవతారమూర్తులైన రాముడు, కృష్ణుడు కూడా మనలాగానే నిద్రాహారాలతోనే జీవించారు. వీటికీ అతీతంగాలేరు. వారి దివ్యత్వం అంతా వారి మనోనిర్మలత్వమే. ఏ వెంపర్లాట, ఆరాటం లేకుండా జీవించడమే వారు ఆచరించి చూపించిన ఆదర్శం. మహానుభావులు తమకు ఏది ఉన్నా, లేకున్నా సరిపెట్టుకొని జీవించారు. మనకిమాత్రం ఫలానాది ఉంటేనే జీవించగలమనే బలహీనత ఉంది. రాకుమారుడిగా వెలుగొందిన శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసాన్ని ఆనందంగా అంగీకరించిన సహనమే ఆయనను ఆదర్శపురుషుడ్ని చేసింది. రాముడ్ని పూజించడం అంటే ఆ పురాణ పురుషుడి గుణాలను గౌరవించి స్వీకరించడమే. జ్ఞాని ప్రపంచాన్ని దాటడు. ప్రపంచంపై ఉన్న బంధాన్ని అధిగమిస్తాడు. ప్రపంచాన్ని దాటటం అంటే దేహాఅవసరాలను దాటటమే. అది ఎవరికీ కుదరదు. ఏవో కొన్ని అవసరాలు అధిగమించినా అన్నింటినీ ఆపటం అసాధ్యం. విరాగులై చరించిన మహర్షులు కూడా చేతిలో కమండలంతోనే తిరిగారు. స్థిరంగా స్థాణువుగా ఉండటంకూడా ఒక వికారమే అవుతుంది. జ్ఞానులు అలా ఉండరు. మనతోనే, మనలాగానే సంచరిస్తారు. కాకపోతే వారికి ఏ కోరిక ఉండదు కనుక వారిని ఏదీ బాధించదు. వారి ప్రతి కదిలిక మనకు బోధగా ఉంటుంది. మంత్రదీక్షలు తీసుకోకపోయినా ఏ నష్టం లేదుగానీ, అవి తీసుకుని కూడా మనోశుద్ధి జరగకపోతే చాలా నష్టపోతాము. గురువునే ఈశ్వరుడిగా, ఆయన మాటలను భగవద్గీతగా భావించి అనుసరిస్తే ఆధారపడ్డ వస్తువే నీకు అన్నీ నేర్పుతుంది.

✳️ మనం దేవుడి వద్దకుకూడా స్వార్ధంతో వెళ్తాం. నాకోర్కెలు ఎన్ని తీరుతున్నాయని లెక్కించుకుంటున్నాంగానీ ఆ దైవసన్నిధిలో నామనసు ఎంత మారింది అని గుర్తించడంలేదు. కులం, మతం, పూజలు కాదు మనని ఉద్ధరించేది. దీక్షలు తీసుకుంటూపోతే ఏ ప్రయోజనం ఉండదు. అందులో దాగిన ధార్మిక జీవనాన్ని మనం అలవర్చుకోవాలి. మన తాత ముత్తాతలు ఎలా జీవించారో తరచిచూస్తే అర్ధమౌతుంది. వారంతా ధర్మం వల్లనే శాంతిగా ఉన్నారు. సచ్ఛీలంగురించి చెప్తే ఎవరికివారు అది తమకు కాదనుకుని తప్పించుకుంటున్నారు. మనిషిలో స్వార్థం రూపుమాపటం కోసం పెద్దలు పూజా పునస్కారాలను నిర్దేశిస్తే వాటిని కూడా స్వార్ధానికి వాడుకుంటున్నాము.

✳️ మన జీవితమంతా సద్గుణాలను నేర్చుకునే సాధనగా మారాలి. మనం మన పిల్లలను కూడా అలానే పెంచాలి. ఇంట్లో వృద్ధులు ఉంటే చిన్నపిల్లలకు వృద్ధాప్యం గురించి తెలుస్తుంది. వారికి జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలు తాతయ్యలు, బామ్మలనుండి కథల రూపంలో నేర్చుకుంటారు. ముసలివాళ్ళకు సేవచేయడం ద్వారా వాళ్ళకి పుణ్యం వస్తుంది. నేడు మనం వృద్ధులకు చేసే సేవచూస్తేనే రేపటి మన వృద్ధాప్యంలో మన పిల్లలు తిరిగి మనకు ఆ సేవ చేయగలుగుతారు. బడిలో అనేక పాఠ్యాంశాలు చెప్తారుగానీ జీవితపాఠాలు చెప్పరు. మనకట్టు, బొట్టు, సాంప్రదాయంగురించి భోధించే బామ్మలు తాతయ్య లను అనాథాశ్రమాల్లో చేరిస్తే వారు మన ఆత్మీయతను మాత్రమే నష్టపోతారు. మనం, మన పిల్లలు జీవితానికి అవసరమైన ఏన్నో మార్గదర్శ కత్వాలను కోల్పోతాం. మన వినోదానికి, టి.వి. సీరియళ్ళకు వృద్ధులు అడ్డమనుకుంటే రేపటి మన వృద్ధాప్యం ఏమిటి? వారి మాటలు చాదస్తాలుకావు. జీవితసత్యాలు. వృద్ధులులేని ఇంట్లో నేడు సుఖం పొందుతున్నామని భ్రమిస్తున్నాము కానీ రేపటి సుఖసంతోషాలనిచ్చే పుణ్యాన్ని కోల్పోతున్నామని తెలుసుకోలేక పోతున్నాం. 

✳️ జబ్బు వచ్చిందని తెలిస్తే వీధి చివర ఉన్న వారినైనా వెళ్ళి పలకరించే సంస్కృతి మనది. మంచానపడ్డ తల్లిని కూడా పలకరించే బాధ్యత లేని జీవితం విదేశాలది. మనందరం మనమన జీవన విధానాలను ప్రశ్నించుకోవాలి. విచారమార్గం అంటే భగవంతుడ్ని, ఆత్మను గురించిన విచారణ' మాత్రమే కాదు. మనజీవనంలో ప్రతిబింబించే మన మనస్తత్వాన్ని విశ్లేషించు కోవడం, ప్రతిక్షణం వివేకంతో మెలగటం, తెలివితో బుద్ధిగా వ్యవహరించడం ద్వారా జీవితమంతా విచారమార్గంగానే సాగాలి. 

✳️ జీవితంలో సబ్బుల్ని మార్చినంత సులభంగా మనసును మారుస్తూ వెళ్తేఎలా? మనసుకు దృఢత్వం నేర్పాలి. మనసు దృఢత్వాన్ని తగ్గించేవి మనలోని వాసనలు. వాసనలంటే మనను ఇష్టంరూపంలో ప్రేరేపించే వికారాలు. అవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. నాలుగునెలల పాప యోగాసనాలు వేస్తుంది. అలావేయటంలోని ఆంతర్యం ఆ జీవుడి పూర్వ సంస్కారంలోని వాసనలే.
[7/29, 15:10] +91 73963 92086: మనం వినే విషయంకూడా మన పూర్వ వాసనలను బట్టే మనకు అవగాహనలోకి వస్తుంది. బాధించే వాసనలను జయించడంతోపాటు. కొత్త వాసనలు ఏర్పడేటప్పుడే తగిన జాగ్రత్తలో ఉండాలి. మంచి మాటలు చెప్పే తల్లిదండ్రుల కన్నా తాయిలాలు పెట్టే పక్కింటివారినే పిల్లలు ఇష్టపడతారు. మన ప్రవృత్తికూడా అలానే ఉంది. ధర్మంచేప్పే గురువులకన్నా ఆశలుచూపే గురువులనే అధికంగా ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే ఒక మార్గంలో హాయిగా గడిపేవాడని తన మార్గంలోకి మార్చాలని మరొకడి ప్రయత్నం. తాను నమ్మిన దైవాన్ని నమ్ముకోమని చెప్పే అలాంటివాడి ఇంట్లో అప్పటికే అనేక కష్టాలు, రోగాలు ఉంటాయి. మన సాంప్రదాయాన్ని మరిచి తాను వ్యాపారంలో దివాళా తీసిన వ్యక్తికూడా తాను నమ్మిన మార్గాన్నే అందరికీ బోధించాలని చూస్తాడు. దైవం ఎడల విశ్వాసం ఉండాలిగానీ మార్గాలపై మూఢనమ్మకం కీడుచేస్తుంది.

✳️ మన గుణదోషాలను మనోవిశ్లేషణ ద్వారా మార్చుకోగలం గానీ తాయత్తులు, విబూదులతో మార్చుకోవాలనుకోవడం వివేకం కాదు. మన అహంకారాన్ని వివేకంతో దాటాలి. భార్యను తిట్టటం, భర్తను వేధించడం వ్యాధిలక్షణమని కొందరనుకుంటారు. అదే నిజమైతే వారు అందరి వద్ద అలానే ఉండాలి కదా! తన కూతురుకి అత్తగారు లేకుండా ఉంటే బాగుండని కోరుకునే తల్లి తన కోడలు మాత్రం తనమాట వినాలని అనుకుంటుంది. ఎవరి బలం అధికంగా ఉంటే వారి అహంకారం గెలవాలని చూస్తారు. బుద్ధికి మగ, ఆడ అని లేదు. పిల్లలకు బొమ్మలు కొనేటప్పుడు కూడా ప్రేమను మరిచి మన అహంకారమే గెలవాలని చూస్తాం. మనసుకు వివేకం, విశ్లేషణ, సత్యదృష్టి ఉంటే ప్రతివ్యక్తి మనకి జీవితాన్ని నేర్పే గురువే అవుతారు. జీవితంలోని అన్ని కోణాలను సన్మార్గంలోకి మార్చటం నిజమైన ఆధ్యాత్మికత అవుతుంది. అది మాత్రమే నిజమైన శాంతిని మనకి అందిస్తుంది. కేవలం పూజాసమయంలోనే మనసును నిగ్రహించాలనుకోవడం అవివేకం. మన జీవితమంతా వివేకదృష్టితో ఉంటేతప్ప దైవాన్ని దర్శించడం కష్టం.

🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🚩 హిందువునని గర్వించు
🚩 హిందువుగా జీవించు

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️
 *శ్రీ గురుభ్యోనమః*
 
        *దక్షిణామూర్తి  మౌన  స్వరూపుడు !   మౌన  స్వరూపం  భగవత్  స్వరూపం !  మౌనంతో  జ్ఞానాన్ని  ప్రసాదించగల  వాడికి  మాటలతోను,  ఊసులతోనూ  పనిలేదు.* 

        మౌనంగా  ఉన్నవాడికి  ఎక్కువ  శక్తి  కలుగుతుంది,  వాడికి  బుద్ధి  సూక్ష్మత  వస్తుంది,  గౌరవింపబడతాడు.  కొంతమంది  ఎక్కువ  మాట్లాడరు,  అవసరమైతేనే  మాట్లాడతారు.  వాళ్ళే  సమాజంలో  ఎక్కువ  గౌరవం  పొందుతారు.  వాళ్ళ  మాటకి  విలువ  ఉంటుంది.  వాళ్ళ  మాటకి  బరువు  ఉంటుంది.  వాళ్ళ  మాటకి  తూకం  ఉంటుంది.  వాగుడు  కాయలు  గౌరవింపబడరు.  వారిని  ఇంట్లో  వాళ్ళే  పట్టించుకోరు.  అలా  వాగుతూ  ఉంటాడు  పట్టించుకోకండి  అంటారు.  అందుచేత  మౌనంలో  ఉన్న  తూకం  మాటలో  లేదు.  

        కొంతమంది  కోపం  వచ్చినప్పుడు  నోరు  మూసుకొని  కూర్చుంటారు.  అది  మౌనం  కాదు.  అత్తగారి  మీద  కోపం  వస్తే  రెండు  రోజులు  మాట్లాడకుండా  ఉంటారు.  అది  మౌనం  అనుకోకండి.  మీ భర్త  కూర  బాగోలేదు  అంటారనుకోండి ..  అప్పుడు  మీకు  కోపం  వచ్చి  రెండు  రోజులు  మాట్లాడటం  మానేయచ్చు.  ఎందుకంటే  కూర  బాగోలేదంటే  మీ అహంకారానికి  గాయం  తగులుతుంది.  

        ఎక్కడయితే  మాట  అణిగిందో ..   ఎక్కడయితే  మనసు  అణిగిందో ..  ఎక్కడయితే  తలంపులు  అణిగిపోయాయో ..  *శేషం  లేకుండా ..*  అది  మౌనం !  అక్కడ్నించి  ఉబుకుతుంది  జ్ఞానం !  అంతేగాని  కోపాలు  వచ్చి  నోటికి  తాళం  వేసుకుంటే  మౌనం  కాదది.  కొంతమంది  ఇంట్లో  కోపం  వస్తే   2, 3  రోజులు  మాట్లాడరు.  ఇవన్నీ  మౌనాలు  కాదు.  
       
*శ్రీ నాన్నగారి  అనుగ్రహ  భాషణం -*
*మురమళ్ళ :*  2005 / 02 / 09 
                     
🪷🙏🏻🪷🙏🏻🪷
 *భారతీయ యోగ.. రహస్యం...*

మన ఋషులు ఎందుకు అన్ని ఏళ్లు బ్రతికారో 
ఆ రహస్యం ...

*శ్వాస*
-------------
మనిషి నిమిషానికి "15 సార్లు" శ్వాస తీస్తాడు...100 నుండి 120 సం.. బ్రతుకు తాడు.తాబేలు నిమిషానికి "3 సార్లు" శ్వాస తీస్తుంది...500 సం. లు బ్రతుకు తుంది.

ఐతే ప్రాణాయామం ద్వారా 'శ్వాస' లు తగ్గించడం వలన ఆయుష్షు ఎలా పెరుగు తుంది....?

దీనిని సశాస్త్రీయం గా వివరించే 'వ్యాసం' ఇది...
అప్పుడు ప్రాణాయామం యొక్క శక్తి,గొప్ప దనం ఏమిటో మనకు తెలుస్తుంది.

మన శరీరం  కోట్ల కణాల  కలయిక వలన ఏర్పడింది. ఒక గ్రామ్ మానవ మాంసం లో కోటాను కోట్ల కణాలు ఉంటాయి. వీటినే " సెల్స్" అంటాం. ఈ ప్రతి కణంలోనూ 'మైటోకాండ్రియా (హరిత రేణువు) అనే ప్రత్యేక కణ వ్యవస్థ ఉంటుంది.

ఈ మైటోకాండ్రియా- మనం శ్వాస తీసు కున్నప్పుడు,గాలి లోని 'ఆక్సిజన్' ను తీసుకుని మండిస్తుంది. 
దీని ద్వారా "ఉష్ణం" జనిస్తుంది.
ఈ ఉష్ణమే మనం ప్రాణాలతో ఉండటానికి కావలసిన " ప్రాణశక్తి".
ఇలా శరీరంలోని కాలి గోరు నుండి తల వెంట్రుకలు చివర వరకూ ఉన్న ప్రతి కణం లోనూ ఉష్ణం జనిస్తున్నది...

ఇలా ఒక్కొక్క కణం నిమిషానికి,15 సార్లు ఉష్ణాన్ని జనింపజేస్తుంది.
ఎందుకంటే, మనం నిమిషానికి "15 సార్లు" శ్వాస తీసుకుంటాం కాబట్టి...
ఇలాంటి కణం 3 రోజులు ఏకధాటి గా పని చేసి, తరువాత ఉష్ణాన్ని పుట్టించే సామర్థ్యం కోల్పోయి మరణిస్తుంది...
ఇలాంటి మృత కణాలు మలినాల రూపం లో శరీరం లోంచి బయటకు వెళ్లిపోతాయి.
ఎప్పుడైతే ఒక మృత కణం బయటికి వెళ్లిందో,ఆ స్థలంలో ఒక కొత్త కణం మనం తీసుకొనే ఆహారం ద్వారా తయారవు తుంది......

ఉదాహరణకు - మన  గుండెలో 1000 మృత కణాలు తయారయ్యాయి,అను కుంటే...
ఆ కణాలన్నీ విసర్జన అనగా చెమట,ఉమ్మి,మూత్రం ద్వారా బయటికి వెళ్ళి పోయి, గుండెలో ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమే...
ఆ స్థలంలో కొత్తకణాలు తయారవు తాయి.

పాత వాటిని ఖాళీ చేస్తేనే...
కొత్తవి రాగల్గుతాయి.
అందుకే ప్రతి దినం మన మల విసర్జన క్రియ అతి ముఖ్యమైనది.

ఎవరైతే మల విసర్జన సరిగా చెయ్యరో... 
వారి శరీరం నిండా ఈ "మృత కణాలు(toxins)" నిండిపోయి,
సరిగా ఉష్ణం జనించక......
తీవ్ర రోగాల బారిన పడతారు...

కనుక ఈ టాక్సిన్ లను
బయటికి పంపే "డిటాక్సీఫీకేషన్
(విసర్జన)"
చాలా ముఖ్యం.

ఒక కణం 15 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...3 రోజులు జీవిస్తుంది.

అదే కణం 14 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...

5 రోజులు జీవిస్తుంది......

13 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...

7 రోజులు జీవిస్తుంది......

ఈ విధంగా మనం.. 'శ్వాస' ల సంఖ్యను తగ్గించే కొద్దీ...
మన కణాలు పని చేసే కాలం పెరుగు తుంది.

ఎలా ఐతే ఒక యంత్రం దగ్గర ఎక్కువ పని చేయిస్తే...త్వరగా చేస్తుందో......
అలాగే ఈ కణాలు కూడా......

భారతీయ యోగులు ...
కణం యొక్క జీవిత కాలాన్ని...
3 నుండి 21 రోజుల వరకూ
పెంచి...2100 సంవత్సరాలు కూడా జీవించ గలిగారు.

మనం శ్వాసను ఎక్కువ తీసుకునే కొద్దీ...

శరీరంలోని ప్రతీ కణం పై తీవ్ర పని ఒత్తిడి పడి...
ఆ కణం త్వరగా పాడై పోతుంది.

*ప్రాణ యామ సాధన ద్వారా "శ్వాస"* ల సంఖ్యను తగ్గించి కణాల పని రోజులని పెంచ గల్గితే......
మన శరీరంలోని ప్రతి అవయం మరి కొన్ని రోజులు ఎక్కువగా పని చేస్తుంది...

ఎందుకంటే......

అవయవాలు అంటే...
కణాల సముదాయమే.

ఇలా మనలోని ప్రతీ అవయవం యొక్క...
ఆయుష్షు పెరిగితే...

*మన ఆయుష్షు కూడా పెరిగినట్టే కదా.!!*

*మనం ఒక్క "శ్వాస"ను తగ్గించ గల్గితే...*
*20 సంవత్సరాల ఆయుష్షును*
*పెంచు కోవచ్చు...*

*యోగులు...*
*ఈ శ్వాసల సంఖ్యను గణించడం ద్వారానే...*
*తాము... ఏ రోజు...మరణించేదీ...*
*ముందే చెబుతారు 🙏🏻*

         *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

            *ఏది మన గమ్యం?* 
నీటిలో మునిగితే- అది స్నానం. నీలో మునిగితే- అది ధ్యానం. నీలోకి నీవు మునిగిపోవడం నీళ్ళలో మునిగినంత తేలిక కాదు.

స్నానానికి సాధనతో పనిలేదు. ధ్యానానికి సాధన తప్ప వేరే దారి లేదు.

ధ్యానం కుదరడం లేదని ఫిర్యాదు చేసే  చాలామంది చెరువు గట్టున నిలబడి చూసేవారే కాని, నీళ్లలోకి దిగినవారు కారు.

తన వద్ద శిష్యరికం చేసిన పూర్వ విద్యార్థిని పిలిపించి బుద్ధుడు ధ్యానం గురించి అడిగాడు.

శిష్యుడికి అది రెండో ఎక్కం లాంటిది. రకరకాల ప్రక్రియలు, ధ్యాన దశల గురించి అప్పటికే విశేషంగా చదివి ఉన్నాడు. పరిశోధనలు చేశాడు. ఆ విద్యలో గట్టి పాండిత్యం సాధించాడు.  కనుక బుద్ధుడు అడిగీ అడగ్గానే ఎన్నో సాధనా విధానాలను గడగడా వల్లించాడు.

బుద్ధుడు శిష్యుడికేసి ప్రసన్నంగా చూస్తూ “మంచిది భిక్షూ!  ఇక ధ్యాన సమయంలో నీవు పొందిన అలౌకిక అనుభూతులను కొన్నింటిని వివరించు!” అని అడిగాడు.

తెల్లబోయాడు శిష్యుడు. నోట మాట రాలేదు.

”ఎవరికైనా  ధ్యానం గురించి పాఠం చెప్పడానికి తగినంత పరిజ్ఞానాన్ని సాధించావే తప్ప నీవు నిజమైన ధ్యానివి కాలేకపోయావు!” అన్నాడు బుద్ధుడు.

లోకంలో సాధకులమనుకునే వారిలో చాలామందిది ఇదే పరిస్థితి.

నిజానికి ధ్యానమంటే గాఢమైన అనుభూతే తప్ప, ఆలోచన కానేకాదు. ధ్యానంలో ఆలోచించడానికి ఏమీ లేదు. వెదురుబొంగు లోపల దట్టంగా అలముకున్న గుజ్జు, పోగులు పూర్తిగా కాలిపోయి, ఖాళీ అయ్యాక- వేణువు కావడానికి సిద్ధమవుతుంది.

ముసురుకున్న ఆలోచనలను తుడిచేశాక, ధ్యానం తానుగా మనసులోకి  వచ్చి చేరుతుంది.

ఆపై నెమ్మదిగా గుండెల్లో ప్రశాంతత ఆవరిస్తుంది. ఆనందం వరిస్తుంది. శరీరం గొప్ప శక్తి కేంద్రమై తరిస్తుంది. ఈలోగానే  ఆలోచనలు తిరిగి దాడి చేస్తాయి. పాత జ్ఞాపకాలు తరుముకొస్తాయి. అవి చాలా బలమైనవి. వాటిని ప్రతిఘటిస్తే మనిషి విఫలమవుతాడు. పారిపోతే దొరికిపోతాడు. వాటితో ఘర్షణ వృథా! సాధకుడు వాటిని స్వేచ్ఛగా లోనికి  అనుమతించాలి.

చిరునవ్వుతో పలకరించాలి. ఆలోచనలకు దారివ్వడమంటే మనసును మచ్చిక చేసుకోవడమని అర్థం. ఆ సాక్షీభూత స్థితిలో మనిషికి, మనసుకు మధ్య స్నేహం కుదురుతుంది. ఆలోచనలనేవి ఎప్పుడూ స్థిరంగా ఉండవు.

వేగంగా కదిలిపోతూ ఉంటాయి. వాటంతటవి తొలగిపోయేవరకు మనిషి ఓపిక పట్టాలి.

ఆ సంధి  సమయంలో మనిషికి సహనమే గొప్ప వరం. ధ్యానం కోసం వేచి చూసే స్థితికి చేరుకోవడం విజయంలో తొలిమెట్టు. ఆ స్థితిలో మనసులోకి వచ్చి పోతున్నా పట్టించుకోని విషయాలే స్వయంగా మనిషిని ధ్యానంలోకి తోసేస్తాయి. పరిశీలనలోంచి మనసును అనుభూతిలోకి, ఆస్వాదన లోకి నెట్టేస్తాయి. లీలగా మనిషి ధ్యానంలో లీనమవుతాడు.

సాధన  క్రమంలో ఒళ్ళు జలదరించడం, ఆవలింతలు రావడం, అకారణమైన ఆనందమేదో గుండె తలుపు తట్టడం గాని  జరిగితే- అవన్నీ ధ్యానంలో పురోగతికి సూచనలని  మనం గ్రహించాలి.

పరమహంస యోగానందజీ  చెప్పినట్లు వాటి  ప్రోత్సాహంతో మరింత లోతులకు ప్రయాణం సాగించాలి.

ఆ అనుభూతులు వాటంతటవే రావాలి తప్ప మనం ఎదురు చూడకూడదు,  వాటికోసం ప్రయత్నించకూడదు. వైకుంఠపాళిలో  నిచ్చెనల్లాంటివవి.

ధ్యానానికి గమ్యం- ఆ నిచ్చెనలు కావు... పరమపద సోపానం!


తత్వమసి - భగవద్దర్శనం

*అమృతం గమయ*

*తత్వమసి - భగవద్దర్శనం*

నీ దేహమే సమస్త విశ్వానికి సంకేత రూపం. అట్టి దేహమందున్న ఆత్మయే విశ్వ చైతన్య దైవం. దేహ బుద్ధులకు బద్ధుడై పరిమితమైనవాడు జీవుడు కాగా చైతన్యమూలం గా ఉండి సర్వవ్యాప్తమైన వాడు పరమాత్ముడు. చైతన్య మూలంలోనికి ప్రవేశించినప్పుడు దేహమే దేవాలయానుభవ దర్శనం కలుగుతుంది.

భగవంతున్ని చిత్రాలలో అన్వేషించకండి చిత్తములో అన్వేషించండి అని రమణమహర్షి బోధ. అంటే భగవంతుడు నీ హృదయంలోనే ఉన్నాడు. కానీ దేహ భ్రాంతుల నీకు కానరావడం లేదు కావున అన్వేషించవలసిన అవసరము. 

ఎందువలన కాన రావడం లేదు అని విచారణ చేస్తే మన మనస్సులో ఉన్న మాలిన్యాల వలన అని తెలుస్తుంది. మనలో ఉన్న దేవుడు కనబడపోవడానికి ప్రధాన కారణాలు రెండే రెండు మనోవికారాలు.  *నేను అనే భ్రాంతిని కలుగచేసే ఆహంకారం. నాది అనే భ్రాంతిని కలుగ చేసే మమకారం.* ఈ రెండు మాలిన్యాలు తొలగించబడితే జీవుడనబడే నీవు భగవంతుడివి అవుతావు.  

మన హృదయములో స్థిరమై ఉన్న పరమాత్ముడు పరమ పవిత్రుడు. ఆ పరమపవిత్రుడుని దర్శించాలంటే నీవు పవిత్రం కావాలి. ప్రతిరోజూ పూజగదిలో పూజకు ముందు నీవు చేసే పని ప్రతిరోజు దేవాలయంలో అర్చక స్వామి మొదట చేసే పని -  ముందు రోజు నిర్మాల్యములను తీసేసి పుజాసామగ్రిని పూజగదిని శుభ్రపరిచి అన్నీ శుద్ధి చేసిన తర్వాతే పూజ ప్రారంభించడం.

ఈ విధంగానే హృదయమునందున్న భగవంతుడిని దర్శించాలంటే ముందుగా మనో మాలిన్యాలను తొలగించాలి. అజ్ఞానము, అవిద్యలను నిర్మాల్యములను తీసేయాలి. ముందురోజు శేషాలను ఎలా తొలగిస్తామో అలాగునే అంతరంగమున కర్మఫల శేషాలును తొలగించాలి. కర్తృత్వ భావనను తొలగించుకోవాలి. మనలో ఉన్న అజ్ఞాన నిర్మాల్యములను తొలగించడానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములనెడి అరిషడ్వర్గములను తొలగించాలి. 

సత్కర్మాచరణ, సజ్జన సాంగత్యం, సర్వేశ్వరుని స్మరణ, సదావగాహన, సత్వగుణ సాధన, సేవాతత్పరత, శుద్ధాహారములనబడే సాధనతో ఈ నిర్మాల్యములను తొలగించవచ్చు. 

శుద్ధ ఆహారమంటే కేవలం శరీర పోషణకై నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు, మానసిక క్రమశిక్షణకై మనోనికాస స్థిరత్వానికై పంచేంద్రియాలు ద్వారా అంటే నోరు, కన్ను, ముక్కు, చెవి, చర్మముల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది. 

మనస్సును బుద్ధిని సంస్కరించుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ మన ఆలోచనల్లో మాటల్లో చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి. 

నీ సద్గతికైనా, నీ దుర్గతికైనా కారణం నీ మనస్సే. మన మనోచాపల్యమే మన అశాంతులకు కారణం.  మన కర్మలే మన సుఖదుఃఖాలకు కారణం. మనలో అనేక బలహీనతలుంటాయి అలాగే లోకంలో అనేక ఆకర్షణలుంటాయి. ఇలాంటప్పుడే బుద్ధిని వినియోగించాలి.

హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసి కూడా దాని గురించి ఆలోచించం. ఇదే మాయ. శారీరకంగా, మానసికంగా దేహాన్ని శుద్ధపరుచుకోవాలి.  దేహధర్మం ప్రకారం కుటుంబ, సమాజ, ఋషి రుణాలు తీర్చుకుంటూ ఈ దేహం శిధిలమవ్వకముందే హృదయమందున్న దేవుడిని పట్టుకోవాలి. 

నీవు సత్య నిత్య ఆనందం అనుభవించాలంటే  ప్రేమ, జ్ఞానం పెంపొందించుకో. నీవు భగవంతుడివే అవుతావు. *తత్వమసి.*

*సత్ చిత్*
 *‘ఆత్మజ్ఞానం’*

మాయా ప్రభావంతో జీవులు ఈ మనోబుధ్యాహంకార వికారాలలో తాదాత్మ్యము చెంది ఈ సంసారమున బందీలగుచున్నారు. కానీ జ్ఞానులు వాటిని తమనుండి వేఱుగా పరిగణించి శాశ్వతచైతన్యవంతమగు ఆత్మయందే దృష్టిపెట్టి సంసారబంధము నుండి  విముక్తి పొందుతున్నారు.
ఈ విషయాన్నే ఆదిశంకరులు, తన "నిర్వాణ షట్కము", మొదటి శ్లోకంలోనే తెలియజేసేరు. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము నేను కాదు. అలాగే పంచభూతాత్మకమగు, పంచ కర్మేంద్రియాలకు, పంచ జ్ఞానేంద్రియాలకు విధేయుడను కాను. చిదానందరూపుడైన శివుడను నేను! శివుడను తప్ప వేరెవ్వరినీ కాను! 
అందుకే శ్రీ రమణులు, "నేను ఎవరు?" అని జీవుడు నిత్యము తనను తాను ప్రశ్నించుకుంటూ, ఇంకో ఆలోచనలేక సాధనచేస్తూ వుంటే, తాను "ఆత్మస్వరూపుణ్ణి" అన్న సత్యం బోధబడుతుందని, తాను అనుభవించి మనకు తెలియజేసేరు.
జ్ఞానులు మనస్సుతో గాక మనస్సాక్షితో తాదాత్మ్యము చెందుతారు. అంటే ఈ జడమైన ప్రకృతికి ఆధారభూతుడై, అదే ప్రకృతియందు సర్వత్రావ్యాపించియున్న ఆత్మస్వరూపాన్ని దర్శిస్తారు జ్ఞానులు. ఆ ఆత్మస్వరూపమే "పరమాత్మ".
శాశ్వతమైనదాన్ని, ఆత్మస్వరూపంగా వెలుగొందుదానిని, చైతన్యవంతమైనదానిని, అన్నింటానెలకొని ప్రకాశించుదానిని, పరమానందాన్ని కలుగజేసేదానిని, పరమాత్మగా పిలవబడేదానిని గ్రహించడానికి, వర్ణించడానికి ఎంతోమంది మహనీయులు ఎన్నోసాధనలు చేసేరు. తుదకు దానిని వర్ణించడం అసాధ్యమని, అనుభూతి ద్వారా మాత్రమే ఆ పరమసత్యాన్ని గ్రహించగలమని తేల్చిచెప్పేసారు.
ఈ అనుభూతిని పొందడానికి వేషభాషలు, ఆడంబరత, పాండిత్యము, విశేష శాస్త్రపరిజ్ఞానం అవసరంలేదు! భగవంతుడు సహజంగా అందరి మానవులకు ప్రసాదించిన జ్ఞానం సరిపోతుంది! తమకున్న పరిమిత జ్ఞానంతో పశుపక్ష్యాదులు కూడా పరమాత్మ వైభవాన్ని గ్రహించగలవు! 
నశించే స్వభావము కలిగిన ఉపాధులు(పదార్ధములు) అధిభూతము. దీనినే అపరప్రకృతి అని అంటారు. పరప్రకృతి అయిన పురుషుడే అధిదైవము. సకల దేహములందు అంతర్యామిగా ఉండే పరమాత్మే అధియజ్ఞము. అన్ని యజ్ఞములందు ఆరాధింప బడేది ఇదే.
సర్వము నెఱింగినవాడు, సనాతనుడు, అన్నింటిని శాసించువాడు, అతి సూక్ష్మమైనవాడు, కోటి సూర్యుల కాంతి కలవాడు, విశ్వమంతటికి ఆధారభూతుడు, ఆలోచింప శక్యంకాని రూపమును కలవాడు, అజ్ఞానానికి అతీతుడైనవాడే పరమాత్మ. 
దానిని గ్రహించాలంటే ప్రతినిమిషం ఆత్మనిష్ఠలో వుండాలి. అన్నింటా, అన్ని ఉపాధులందు పరమాత్మను దర్శించాలి. పరమాత్మయందే విశ్వమంతా వున్నది. విశ్వమంతా పరమాత్మ వ్యాపించియున్నాడు. ఆత్మజ్ఞానముతో అతనిని పొందవచ్చును.

ప్రారబ్దం అంటే ఏమిటి - దీనిని వదిలించుకునే మార్గం ఎలా??

 *ప్రారబ్దం అంటే ఏమిటి - దీనిని వదిలించుకునే మార్గం ఎలా???*
🥗🥗🥗 🥗🥗🥗 🥗🥗🥗

*ఎక్కడ సంబంధాలు అక్కడ వరకే... అక్కడ నువ్వు దుఃఖిస్తూ దైన్యంతో వదలలేక వదిలి పెడుతూ దేహాన్ని వదిలి వేస్తె అయ్యో నువ్వు వెళ్ళిపోతున్నావే అని దుఃఖిస్తూ కొందరు ఉంటే... క్రొత్తగా నువ్వు వస్తున్నావు  అని మరికొందరు సంబరాలు చేసుకుంటూ ఉంటారు... రాక పోకల మధ్య నువ్వు మంచో  చెడో ఏవో కర్మలు చేస్తూనే ఉంటావు.*

*కర్మలు చేస్తూ చేస్తూ దానికి ఓ బ్యాగ్ తయారు చేసి దానిలో బేలెన్స్ చేస్తావు ఆబ్యాగ్ "సంచిత కర్మలు",*

*అవి పెరిగి పెద్దవి అయి మేరు పర్వతాన్ని మించి కరడు గట్టిన ఓ కొండ గుట్టగా తయారుఅవుతాయి. ‘’అవే ప్రారబ్దం" ఆ ప్రారబ్దం అనే బరువును నెత్తిన పెట్టుకుని ఇపుడు ఈ జన్మ తీసుకుంటావు. ఈ ప్రారబ్దం క్లియర్ అయ్యే వరకు నీకు జన్మలు తప్పవు. 🙇🏻‍♀️(సుఖము దుఃఖము... ఐశ్వర్యము ఆకలి రోదనలు, ఇలా రెండు ఇనుప బంగారు రెండు సంకెళ్ళే).*

*మరి ప్రారబ్దం కరిగించుకునే మార్గం :??*

*నీకు దేహ భావన ఉన్నంత వరకు ప్రతి కర్మ నిన్ను అంటుకునే ఉంటుంది. మరి ఇక ఈ దేహం వదిలివేస్తే... అది కరెక్ట్ కాదు. 'నీ ప్రారబ్దం నిన్ను వదలదు. మట్టి కుండలో మంచి నిరు దాహం తీరుస్తుంది. కాబట్టి కుండ పగలకుండా జాగ్రత్త చేసుకోవాలి. లేనిచో దాహం తీరదు. ఈ దేహాన్ని ఆధ్యాత్మిక భోదకు యోగ సాధనకు జాగ్రత్త చేసుకోవాలి.*

*ఈ పరికరంతోనే ఏదైనా చేయగలవు. ఇది లేకుంటే ఏది చెయ్యలేవు . ఎపుడు ఎరుకతో ఉంటూ... “ జ్ఞానాగ్ని దగ్ద కర్మాణి “ ఎందుకంటే జ్ఞానం వలన క్రొత్త కర్మలు ఏర్పడవు, కానీ ప్రారబ్దం మాత్రం అనుభవించాలిసిందే ‘’🙇🏻‍♀️ ఇది ఎవరూ తప్పించ లేరు’ కాని’ అన్యాదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ మమ’’ అంటూ వాని పాదాలు పట్టుకుంటే తలకు తగలవలసిన దెబ్బ తలపాగాకు తగిలి వెళ్ళిపోతుంది...*

*చేసే ప్రతి పని నిష్కామంగా చేస్తూ ఉంటావో ఇదేదీ నాది కాదు’’ అసలు నేను ఇది కాదు ‘’*
*అనే భావంతో సంసారంలో ఉంటావు కాని సంసారం నీలో ఉండ కూడదు. నావ సంద్రంలో ఉండాలి కాని సంద్రం నావలో ఉండకూడదు. నీటి కోడి నీటిలో ఉన్నా దాని రెక్కలకు తడి అంటనట్లు,... ఇలా ఉండటం సాధ్యమా ? నీకు నువ్వు ప్రశ్నించు కో !*

*ఆ మార్గంలో ఆ స్దితిలో నువ్వు వెళుతున్నావు అంటే ఇక నీ కర్మలు క్లియర్ అవుతున్నట్లే దీనికి నువ్వే న్యాయ నిర్నేతవు... బయట వాళ్ళు ఎవరూ మార్కులు వేయరు. నీ మనస్సాక్షి నీకు మార్కులు వేస్తుంది.*

*ఈ స్దితికి నువ్వు ఎదిగినపుడు ఇక ఆగామి లేదు సంచితం లేదు ప్రారబ్దం లేదు... నువ్వు కేవలం "సాక్షివి" మాత్రమే.!*
           
        *🙏🌻శుభమస్తు🌻🙏*
♻️♻️♻️ ♻️♻️♻️ ♻️♻️♻️
 *🕉️🙏 లగాన్ అంటే భజనే*
     *"మహాభారతం"ద సారాంశ...*
     *ఒంబత్తు వాక్యాలలో..🕉️🙏*

     🕉️🙏

     *🕉️🙏1.      మీ పిల్లల అపరిమిత కోరికలను, గొంతెమ్మన కోరికలను ఆశిస్తూ వెళితే, కాలక్రమేణ వారి హిడిత తప్పుతుంది... మరియు మీరు వారి నియంత్రణకు కట్టుబడి ఉంటారు.      🕉️🙏*

     *"గౌరవ" వంటి.     🕉️🙏*

     *🕉️🙏2.      మీరు ఎంతగానో శక్తిశాలిగా ఉండండి, మీ ఆయుధాలు ఎంతగానో శక్తిశాలిగా ఉండాలి.. మీకు ఎంత నైపుణ్యం ఉన్నప్పటికీ.

     *ఉదాహరణ: "కర్ణన్" 🕉️🙏*

     *🕉️🙏3.      గుణాలను గుర్తించకపోతే మరియు కొడుకు వాత్సల్యానికి అర్హత లేనివారికి అసాధ్యమైన జ్ఞానాన్ని అందించకపోతే మీరు నాశనం అవుతారు 🕉️🙏*

     *🕉️🙏ఉదాహరణ:- "అశ్వథామ".🕉️🙏*

     *🕉️🙏4.      వారి చరిత్రను గుర్తించడం వారికి కురుడు హామీలను అందజేస్తే, వారి సామర్థ్యం 'దుర్బల'గా జీవించడానికి బలవంతంగా వారి జీవిత గులామగిరికి బలి అవుతుంది.

     *🕉️🙏 ఏక:-"భీష్మ."🕉️🙏*

     *🕉️🙏5.    సంపద, అధికారం, అధికారం మరియు ఆత్మను బలపరిచేటటువంటి అహంకారాన్ని అన్యాయంగా ఉపయోగించినట్లయితే అది వినాశనానికి దారితీసింది.     🕉️🙏*

     *🕉️🙏 లైక్ :- "దుర్యోధన" 🕉️🙏*

     *🕉️🙏 6. "స్వార్థి, దురాస, అహంకారి, తెలివైన, కానీ కురుడ, తన ప్రజల నుండి మోడీ చేయబడ్డ."

     *ఉదాహరణ: "Tradarasht."      🕉️🙏*

     *🕉️🙏 7. బుద్ధితో 'ధర్మం, సుక్యాన్' కూడుకుంటే విజయం ఖాయం.🕉️🙏*

     *ఉదాహరణ: "అర్జున్".🕉️🙏*

     *8.      'సాల్, బూటాటికే,' 🕉️🙏*

     *🕉️🙏 ఏక: "శకున."🕉️🙏*

     *9.      మీరు నైతిక విలువలను అనుసరిస్తే, సరైన మార్గాన్ని అనుసరించండి మరియు మీ ధర్మాన్ని అనుసరిస్తే, ఏదైనా శక్తి మీకు హాని చేయదు.🕉️🙏*

     *🕉️🙏ఉదాహరణ: "యుదిష్ఠిర."🕉️🙏*

     *దయవిట్టు సేవ్*...🙏

నేటి ఆధ్యాత్మిక సాధన..

 *_🌹'నేటి ఆధ్యాత్మిక సాధన..'🌹_*

*_యోగము అంటే కలయిక అని అర్థం .అంటే జీవాత్మ పరమాత్మ కలయిక యోగము అంటున్నారు ._*

*_మనము పరమాత్మ నుండి వేరైనప్పటి నుంచి అనేక జన్మలు ఎత్తి అజ్ఞానము తో తిరిగి తిరిగి జన్మిస్తూ ఉన్నాము._*

*_ఒక సాలిపురుగులాగా ఒక గూడు నిర్మించుకొని ఇదే జీవితం అనుకుని మనము అలాగే జీవిస్తూ ఉన్నాము. అంటే ఈ భూమిపైన మనం నివసించే ఈ భూమి సాలి పొరుగు గూడు లాగా అనుకుంటే మన వ్యవహార శైలి ఈ భూమి పైన జీవనము జీవిస్తూ ఉన్నాము._*

*_ఇలా ప్రతి జన్మలోను జరుగుతూనే ఉంది. కానీ మనము ఎందుకు పుడుతున్నాము ఎందుకు మరణిస్తున్నారు అని తెలుసుకోవడానికి మానవజన్మ అనేది .మట్టి అగ్ని వాయువు నీరు ఆకాశము అనే పంచతత్వాలతో ఈ భౌతిక దేహాన్ని పరమాత్మ తయారు చేశారు ._*

*_మట్టిలో ఉండే ఎలక్ట్రాన్ ప్రొటన్ న్యూట్రాన్ ఈ అణువులే మన కణాల్లోనూ ఉన్నవి. మరి ఇవి అంతా ఒక దగ్గర చేర్చి ఈ మానవ దేహం తయారు చేయడం అనేది ఎంతో అద్భుతమైన సృష్టి ._*

*_ఏ జీవికి లేని ప్రత్యేకత మానవ జన్మకి ఉంది అదే జ్ఞానం .ఈ జ్ఞానము చేత మనము సర్వ జీవులను అర్థం చేసుకొని వాటిని మనం నియంత్రిస్తున్నాము . ఈ భూమిపైన లభించే ప్రతి వస్తువును మనకోసం ఉపయోగించుకుంటున్నాము. అన్ని జీవులు అవి పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా అదే జీవన శైలిని కలిగి ఉంటాయి._*

*_కానీ,మనం ఎన్నో మార్పులు చేసుకొని సుఖాల కోసం ప్రకృతిని నాశనం చేస్తూ ఉన్నాము .ప్రకృతిలోని జీవులు అంతరిస్తే ఒక నాటికి మానవ జన్మకి ముప్పుగలుగుతుంది ._*

*_పక్షులు లేకపోతే ప్రకృతి పెరగదు కారణం పక్షులు గింజలు తిని, అనేక చెట్ల పైన వాలి విసర్జన వల్ల తిరిగి గింజలు మొలకెత్తి ప్రకృతి పెరుగుతూ ఉంటుంది .ప్రకృతి ఉంటేనే మనకి వర్షాలు కురుస్తాయి. కాబట్టి వన్యప్రాణులను కాపాడుకోవడం కూడా మన బాధ్యత .చెట్లను కూల్చకూడదు._*

*_మీరు ఆ ప్రకృతిలో కూర్చుని మీరు ధ్యానిస్తూ ఉంటే చుట్టూ వాతావరణం కూడా ప్రభావితం అవుతుంది .అవి మొక్కలు గ్రహిస్తాయి .అంటే మీలో ఉండే కాంతి మొక్కలలో కూడా వెళుతూ ఉంటుంది. అవి ఎంతో పచ్చదనంతో ఉంటాయి . సూర్యరశ్మి వల్ల ఎలా ఆహారం సంపాదించుకుంటాయో ఆ కారణం చేత పచ్చదనం అనేది వస్తుంది .మీరు చేసే ధ్యానం వల్ల కూడా ఆ కాంతితో ఆ మొక్కలలో ఈ శక్తి వెళ్లడం వల్ల అక్కడ మొక్కలు కూడా పచ్చదనంతో ఉంటాయి ._*

*_పూర్వకాలంలో ఋషులు ఎక్కడ ఉంటే అక్కడ ఎంతో ఆహ్లాదంగా ఉండేది వాతావరణం . చంద్రుడు ప్రకాశించే వెన్నెల వల్ల కొన్ని దివ్య ఔషధ మొక్కలు పెరుగుతాయి. సత్యయు గంలో ఇవి ఎక్కువగా ఉండేవి. ఈ కలియుగంలో కొన్ని దివ్య ఔషధ మొక్కలు వాటిలోని ప్రభావాన్ని కోల్పోయాయి. మానవుల లాగే._*

*_సత్య యుగంలో మానవులు ఎంతో తేజస్సుతో ఎంతో జ్ఞానముతో ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. వారిలోని ఆత్మ తత్వం కూడా ఎంతో ప్రకాశవంతంగా ఉండేది. కారణం వారు ఆ కాలంలో సత్య ధర్మాలను పాటించేవారు .ఆత్మ ప్రకాశానికి కారణం ధర్మబద్ధమైన జీవనం .ఆ కాలంలో భగవంతుడు పిలిస్తే పలికేవారు మరి ఈ కాలం ఎంతో గొప్ప తపస్సు చేస్తే తప్ప ఆ పలుకులను వినలేక పోతున్నాము. అది మనలోని లోపమే.._*

*_మన ఆత్మ చైతన్యాన్ని కోల్పోవడం వల్ల అంటే అజ్ఞానం మనసును ఆవరించడం వల్ల భగవంతునికి దూరం అయినాము .తిరిగి మనము ఆ భగవంతుని ధ్యానం చేత ఆయనకు దగ్గరవడానికి మన వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాము._*

*_ఇక్కడ ధ్యానము అంటే మన ఆత్మ ఆ పరమాత్మ అనుసంధానమే. మన ధ్యానము ఈ భౌతిక దేహం పడిపోయిన ఈ ఆత్మ భగవంతుని చేరుకునే దాకా మన ఆత్మని మనం తెలుసుకోవడం అనేది ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం ._*

*_ధ్యానం ద్వారా మీరు ఏ లోకంలో ఉండాలనుకుంటే అక్కడ ఎంత కాలమైనా ఉండవచ్చు .శరీరం లేదు కాబట్టి ఏ లోకాలకైనా క్షణాలలో వెళ్లే శక్తి మీ ఆత్మకు ఉంటుంది. కాంతి కంటే వేగంగా ప్రయాణించే శక్తి ఆత్మకు ఉంటుంది._*

*_ఎప్పుడైతే మీరు నాతో కలిసి ఈ మాటల ద్వారా వింటూ ఉన్నారు.మీరు తప్పకుండా జన్మజన్మల నుండి మీరు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు .కాబట్టి మనము ఈ జన్మలో కూడా తిరిగి ఈ విధంగా కలిసాము._*

*_ఈ జన్మలో కూడా ఆత్మ ప్రకాశానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కావలసింది ఇదే ప్రయత్నం అనేది మానకుండా గట్టిగా పట్టుబట్టాలి. ఎన్ని పనులు ఉన్నా రోజు కొంత సమయం ధ్యానం కొరకే కేటా యించి ఏకాగ్రతతో ధ్యానం చేస్తూ ఉంటే ఎప్పటికైనా భగవంతుని అనుగ్రహం పొందవచ్చు.☝🏾✍🏾_*

*_'శ్రీ గురుభ్యో నమః '🙏🏾_* 

 *_'సర్వం కృష్ణార్పణమస్తు.. 🚩🙏🏾_*

 *_-మీ డా. తుకారాం జాదవ్. 🙏🏾_*
 రామాయణమ్ 9
...
కుశిక వంశీయుడు,గాధి కుమారుడు అయిన విశ్వామిత్రుడు వచ్చినాడని మీ రాజుకు ఎరుక పరచండి! మహారాజ దర్శనం కోరుతూ వచ్చిన ఒక మునిపుంగవుడు పలికిన పలుకులివి.
.
ద్వారపాలకులు ఆ వచ్చిన వ్యక్తిని చూచి భయముతో వణకిపోయి దశరధసముఖమునకు శీఘ్రమే చేరి మహర్షివిశ్వామిత్రుని ఆగమనాన్ని ఆయనకు తెలిపినారు!.
.
అంతటి పరమపూజనీయుడయిన మహర్షి తన నగరుకు రావటాన్ని తన పుణ్యఫలంగా భావించి, దశరధుడు ఆయనకు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులనిచ్చి, ఒక ఉచిత ఆసనం అలంకరింపచేసి అంజలిఘటించి నిలుచున్నాడు.

మహారాజు వినయ విదేయతలకు సంతసించిన మహర్షి దశరధుడిని కుశలప్రశ్నలు వేసి అందరి క్షేమము విచారించినాడు!.
.
మహర్షి ఎదుట నిలుచున్న దశరధుడు ఆయన రాకలోని ఆంతర్యమేమిటో తెలియనివాడై ,మహర్షిని ఏ పని మీద మీరు ఇచటికి వచ్చినారో సెలవిండు ,మీ కార్యము ఎటువంటిదైనా తప్పక నెరవేర్చెదను, నా వద్దనున్న సమస్తము మీ పాదాక్రాంతము చేస్తున్నాను మీ కేమికావాలో తీసుకొనుడు అని సవినయంగా ప్రార్ధించాడు.
.
అప్పుడు బ్రహ్మర్షి తాను వచ్చిన పని బయటపెట్టాడు ! 
.
మహర్షికోరిక తెలుసుకొని ఒక్కసారిగా నవనాడులూ కృంగిపోయి ,జవసత్వాలుడిగినవానిలాగా నీరసించాడు దశరధుడు! .
.
ఆ కోరిక ఏమై ఉంటుంది? .
.
మహారాజును పంచప్రాణాలు అడిగినా సంతోషంగా అప్పటికప్పుడు ఇచ్చేవాడు ,
కానీ ఆయన అడిగింది ! శ్రీరాముని తనతో పంపమని !
.
 క్రూర,ఘోర రాక్షసులైన మారీచ ,సుబాహులనుండి మహర్షి చేసే యాగాన్ని రక్షించడం కోసం ముక్కుపచ్చలారని తన ముద్దుబిడ్డడిని పంపాలట!
.
మహర్షి కోరిక వినగానే మ్రాన్పడిపోయాడు దశరధుడు!
.
మహర్షి కోరిక ఆయన హృదయాన్ని నిలువునా కత్తితో చీల్చినట్లయినది ,తన ముద్దులమూట,ముక్కుపచ్చలారని పసికూన ,నిండా పదహారు నిండనివాడు ,అరవిచ్చినతామరల వంటి కన్నులుగల తన గారాలపట్టిని ఈ మహర్షివెంట అడవులకు పంపడమా! మనసు ససేమిరా అంటున్నది!.
.
మహారాజు మదిలోని ఆలోచనలు పసిగట్టిన మహర్షి !
దశరధా ! 
రాముని గురించి నీ కేమి తెలుసని అలా ఆలోచిస్తున్నావు!
.
అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమమ్
వసిష్టోపి మహాతేజా యే చేమే తపసి స్థితాః.
.
రాముడెవరో నాకు తెలియును,నీ కుల గురువైన వసిష్ఠునకు తెలియును, ఈ ముని సంఘాలకూ తెలియును! 
.
రామునికి తప్ప నా కార్యము చేయుటలో ఎవరికినీ సామర్ధ్యము లేదు! రాముని ఎదుట మారీచ,సుబాహులు ఏవిధముగనూ నిలువజాలరు!
.
న చ తౌ రామమాసాద్య శక్తౌ స్థాతుం కథం చన!.
.
అని ఇంకా చెపుతున్నారు మహర్షి!..
..

జానకిరామారావు వూటుకూరు గారి 
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
 *🌺 ఓం నమఃశివాయ 🌺*


*' త్యాగే నైకే అమృతత్వ మానసు: '....అంటుంది వేదం....*

*అంటే త్యాగము ద్వారానే అమృతత్వం సిద్ధిస్తుంది..*

 *నిండిన కుండ ఖాళీ అయితేనే మళ్ళీ నింపడానికి వీలు పడుతుంది..*

 *గుడి ముందు ఉన్న యాచకులను బాగుచేయలేని వాడు దేవుడెలా అవుతాడు !?*

 *మనల్ని ఎలా బాగు చేస్తాడని  కొందరు మూర్ఖులు ప్రశ్నిస్తూ ఉంటారు..*

*అయితే  ఆ యాచకులను ఆదుకొమ్మనే దేవుడు తమకు ధనాన్ని ఇచ్చాడని, వారిని తన దృష్టిలో పడేలా చేశాడని మాత్రం తెలుసుకోరు!*

 *వారికి పైసా విదల్చరు కానీ దేవుని ఉనికిని ప్రశ్నిస్తారు!! ఇది తగని పని..*

 *ఉన్నదానిని పది మందికి పంచి ఆదుకోవాలి..*
 *భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.*

  *తమ గురించి తాము ఎటువంటి ఆందోళన చెందకుండా భగవంతునిపై విశ్వాసం ఉంచుకోవాలి.*

 *మీ పాత్ర ఖాళీ అవుతుంటే భగవంతుడు దానిని మళ్ళీ నింపుతుంటాడు.*

 *తద్వారా త్యాగమనే చక్రం నిరంతరం తిరుగుతూ ఉండాలి.._*

*🌹ఓం నమఃశివాయ 🌹*

రామాయణమ్.8 ... రాముడికి ఎవరు సహాయం చేస్తారు?

 రామాయణమ్.8
...
రాముడికి ఎవరు సహాయం చేస్తారు?
.
మీరంతా రావణ సంహారం జరగాలని కోరుకున్నారు . విష్ణువు దశరధమహారాజు కొడుకుగా జన్మించాడు ,మరి రావణుని తో జరిగే పోరాటంలో ఎవరు పాల్గొంటారు? 
.
ఆయన సైన్యం ఎవరు? విష్ణువుకు సైన్యసహకారం ఎవరిస్తారు? 
ఆందరు దేవతల మదిలో ఈ ఆలోచన పుట్టించి వారిని ప్రేరేపించాడు బ్రహ్మదేవుడు .
.
ఒకప్పుడు రావణాసురుని నందీశ్వరుడు శపించాడు!
నీకు వానరుల(కోతుల)వలన భయం కలుగుగాక ! అని
.
ఈ శాపాన్ని తమకు వరంగా మార్చుకోవాలనుకున్నారు ! దేవతలంతా!.
.
దేవతలంతా వానర స్త్రీల యందు మహాబలశాలురయిన పుత్రులుగా జన్మించారు! 
.
అంతకుఎన్నో ఏళ్ళ  పూర్వమే జాంబవంతుడు బ్రహ్మదేవుడి ఆవులింతనుండి జన్మించాడు.
.
ఋషులు,సిద్ధులు,విద్యాధరులు,ఉరగులు,చారణులు  దివ్యశక్తులు కలవారంతా తమతమ కుమారులుగా వీరాధివీరులైన వానరులను సృజించారు.
.
దేవేంద్రుడు వాలిని,
 సూర్యుడు సుగ్రీవుని, 
దేవగురువు బృహస్పతి తారుడు అనే బుద్ధిశాలి అయిన వానరుడిని,
కుబేరుడు ; గంధమాధనుని
విశ్వకర్మ : నలుడిని
అగ్ని : నీలుడిని
అశ్వనీ దేవతలు : మైంద ,ద్వివిదులను
వరుణుడు : సుషేణుడిని
పర్జన్యుడు: శరభుని
వాయుదేవుడు ,శ్రీమంతుడు,వీర్యవంతుడు,వజ్రమయ దేహముగలవాడు,గరుత్మంతునితో సమానవేగము గలవాడు ,శత్రుభయంకరుడు అయిన హనుమంతుని సృజించాడు.
.
ఏ దేవుడికి ఏ రూపము,ఏ వేషము ,ఏ పరాక్రమము ,ఏ తేజస్సు ఉండెనో ముమ్మూర్తులా అవే లక్షణాలతో అనేక కోట్ల వానరులు జన్మించారు!.
.
ఈ వానరులంతా కూడా అమితబల సంపన్నులు !
యుద్ధంలో పెద్దపెద్ద కొండల వంటి రాళ్లు శత్రువుల మీద విసిరివేయగలరు,మహా వృక్షాలు వేళ్ళతో సహా పెకిలించి వైరివీరులను చావచితక కొట్టగలరు!
సముద్రాలను కలియబెట్టగలరు,భూమిని నిట్టనిలువుగా చీల్చివేయనూగలరు!
అరణ్యాలలో స్వేచ్చగా తిరిగే మదగజాలను ( ఏనుగులు) పిల్లిపిల్లల్లా చంకనవేసుకొని తిరుగగలరు!
వారి సింహనాదాలకు ముల్లోకాలు కూడా కంపించి పోతాయి!
.
ఇలాంటి లక్షణాలున్న వానరవీరులంతా రామసహాయార్ధము భూమినిండా జన్మించి ఉన్నారు!.
.
అక్కడ అయోధ్యలో రాముడు శుక్లపక్ష చంద్రునివలే దినదిన ప్రవర్ధమానమవుతున్నాడు! ఆయన చేసే అల్లరికి అంతేలేకుండా ఉన్నది ! ఆయన ఏమిచేసినా ఆ తండ్రికి మురిపెమే  !
రారా  నారామా ! అని గుండెలమీద కొడుకుని పరుండపెట్టి అంత పెద్ద మహారాజు తాను కూడా చిన్నపిల్లవాడై వయసుమరచి,రాజునని మరచి కొడుకుతో ఆటలు ,పాటలు.
.
రాముని విడిచి ఒక్క క్షణముండలేని మరో ప్రాణి కూడా ఉంది అయోధ్య లో ! ఎవరో కాదు లక్ష్మణస్వామి ఆయన ! 
రాముడి నీడ ఎలా ఉంటుంది ? అని అడిగితే ఇదిగో ఇలా ఉంటుంది అని లక్ష్మణుడి వైపు వేలెత్తి చూపటం అలవాటు చేసుకున్నారు అయోధ్యానగరవాసులు!
ఇక అన్నగారికి తమ్ముడంటే పంచప్రాణాలు సౌమిత్రి ప్రక్కనలేనిదే ఈయనగారు ఏ పనీ చేయరు ! అన్నం తినడు! ఆఖరుకు నిద్రపోవాలన్నా ప్రక్కన తమ్ముడు ఉండవలసినదే! 
అదేవిధంగా మరొక జంట భరతశత్రుఘ్నులు 
ఇలా నలుగురు కుమారులు ఆయన ఆనందాన్ని పెంపొందిస్తూ ఉండగా కాలం ఎలా గడచిపోతున్నదో తెలియరావటం లేదు దశరధమహారాజుకు!.
.
ఆ కుమారులు నలుగురూ కూడా ధనుర్విద్యలో అపారపాండిత్యం సంపాదించారు,వేదవేదాంగాలు వారికి కరతలామలకం!
తల్లిదండ్రులను,పెద్దలను సేవించటంలో వారితరువాతనే ఎవరైనా,
సకలసద్గుణాలతో శోభిల్లే వరాల మూటలు దశరధతనయులు!.
.
కాలమిలా గడుస్తుండగా ఒకరోజు!
.

జానకిరామారావు వూటుకూరు గారి 
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

****హిందూ బంధువుల్లో ఉన్న సాయి భక్తులకు చిన్న వివరణ

 జైశ్రీరామ్ మన హిందూ బంధువుల్లో ఉన్న సాయి భక్తులకు నాదొక చిన్న వివరణ సాయిబాబా హిందువా ముస్లిమా అనేది కొంచెం సేపు పక్కన పెడదాం కానీ షిరిడీలో ఉన్న సాయి మందిరాన్ని నిర్వహిస్తున్నది ముస్లిమ్స్ వాళ్లు పూర్తి ఆధారాలతో సహా సాయిబాబా మా ముస్లిం వ్యక్తి ఇక్కడికి వస్తున్న హిందువుల డబ్బులు మేము మా ముస్లింల రక్షణ కొరకు మాత్రమే మాకు ఇష్టం వచ్చిన వారికి మాత్రమే వాడుకుంటాము అని కోర్టులో వాదించి గెలిచారు దాన్లో భాగంగానే మసీదులకి మక్కా యాత్రలకు కొన్ని కోట్ల రూపాయలు హిందువుల ద్వారా వచ్చిన షిరిడీలోని హుండీ ఆదాయాన్ని పంచారు అంటే మన హిందువులం అమాయకంగా మనకు  ఉన్న దేవుళ్లను వదిలేసి శిరిడీలోని ఆ ముస్లిం సాయిబాబా దేవాలయంలో డబ్బులు కుమ్మరించి మన తల నరకటానికి ముస్లింసు కత్తి కొనుక్కోమని సహకరించినట్టుగా ఉంది దయచేసి అర్ధం చేసుకొని మీకు సాయిబాబా మీద భక్తి ఉంటే మీ ఇంట్లోనే మీ మనసులోని ధ్యానించుకొని దేవాలయానికి వెళ్లాలంటే కాశీ రామేశ్వరం తిరుపతి శ్రీశైలం అరుణాచలం వంటి ప్రదేశాలకు మాత్రమే వెళ్లవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జైహింద్
Sri Sri:
ముస్లిం  ఫకీర్    సాయిబ్ బాబా*  నే  short Cut లో  *సాయి బాబా* అని  అంటున్నాము.
సాయిబ్ బాబా అసలు పేరు - సైఫుద్దీన్ బాబా. ఇతను 1918 లో మరణించినాడు.

ముస్లిం అయినా,  సాయిబు బాబా కు,  హిందూ మతం నకు ఎలాంటి సంబంధం లేదు..
1000 సంవత్సరాలనుండి ముస్లిం ల. దండయాత్ర లకు వ్యతిరేకంగా. పోరాటం చేస్తూ,, 
మళ్ళీ 1970 తర్వాత ఒక ముస్లిం ఫకీర్ సాయిబ్ ను  సాయిరాం, సాయి కృష్ణ అంటూ పూజించడం  మన. హిందువుల అజ్ఞానము / అమాయకత్వం..     ఇది . ప్రధాన దేవుళ్ళ పై  జరుగుతున్న   జిహాద్..

1950 వరకు  షిర్డీ లో. ఉన్నది. సమాధి (దర్గా ) మాత్రమే.. 
హిందువుల అమాయకత్వం ను ఆసరాగా చేసుకొని " దర్గా " ను  మందిరం అని పిలవడం ప్రారంభించిన్నారు.. అప్పటి నుంచే  ముస్లిం ఫకీర్ ను హిందువులు,.  హిందూ దేవుని పూజించడం ప్రారంభించారు..

(దర్గా/ సమాధి  అంటే Extention ఉండదు..  కానీ  దేవుని మందిరలు ఎన్నైనా నిర్మించుకోవచ్చు..  అందుకే 1950 తర్వాత ఈ  సమాధి /దర్గా ను. ఒక plan ప్రకారం మందిర్ అని పిలవడం ప్రారంభించారు....  అప్పటి నుంచే ముస్లిం ఫకీర్ సాయిబ్ కు గుడులు కట్టించడం  ప్రారంభం అయ్యింది )

*సాయిరాం / సాయికృష్ణ అంటే కూడా అర్ధం తెలియనంత  అజ్ఞానము లోకి పోయిన్నారు.
*సాయి అంటే ఫకీర్*  అని* అర్ధం..*
*సాయిరాం / సాయి కృష్ణ అంటే  ఫకీర్. రామ్ / ఫకీర్ కృష్ణ.  అని అర్ధం..  
  ఇలా తెలియకుండానే, మన దేవుళ్ళ కు. ముస్లిమికరణ/ ఇస్లామికరణ   చేస్తూ,  ముస్లిం మతం లో కలిపేస్తున్నారు..*

విచిత్రం ఏమిటంటే..  ముస్లిం ఫకీర్ సైఫుద్దీన్ ( సాయిబు బాబా ) భక్తులు *99.9* % చదువుకున్న  హిందువులే..

1950 వరకు వచ్చిన. News పేపర్స్ లలో కానీ,  సాహిత్యం లో  కానీ ఎక్కుడ   కూడా ఈ ముస్లిం సాయిబాబా గురించి  వ్రాయలేదు..   1970 తర్వాత నే మొదటి సారి ఈ సాయిబ్ గురించి ఒక పాట సినిమా లో వచ్చింది. ఆలా ముస్లిం సాయిబ్ ను హిందూ దేవుడు అని ప్రచారం చెయ్యడం లో   వామపక్ష వాదులు / కమ్యూనిస్ట్ లు  విజయం సాధించారు..
ముస్లిం లు కూడ ఈ సాయిబ్ బాబా, మా  ముస్లిం నే అని అంగీకరిస్తున్నారు..  కానీ, హిందువులకే ఇంకా జ్ఞానోదయము కావడం లేదు..
కానీ, విచిత్రం  ఏమిటంటే,  శాస్రాలు, హిందుత్వం గురించి అవగాహనా ఉన్న చాలా మంది  బ్రాహ్మణులూ  ఈ ముస్లిం ఫకీర్ సాయిబ్ కొలవటం చాలా విచిత్రం.. 

దేశం, ధర్మం అంటూ  ఇస్లాం కు. వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న, జాతీయ వాదులు  చాలా మంది,   ఈ ముస్లిం ఫకీర్ సాయిబ్ ను పూజించడం చాలా. విచిత్రం..

ముఖ్యం గా, ఈ సాయిబ్ గుడులు  ఒక్క మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల లోనే ఉన్నాయి..  ఇప్పుడిప్పుడే  ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్నారు..

హిందువులు, ముఖ్యం గా  జాతీయ వాదులు ఈ ప్రమాదం ను   అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి.
* *
సైఫుద్దీన్ బాబా,(సాయిబాబా అసలు పేరు,),
ఏ ఒక్క రోజు హిందూ దేవుళ్ళ నీ     పూజించని  ఫకీర్ బాబా( ముస్లిం) ను,  "హిందూ దేవుడు"  గా  హిందువులు  పూజించడం  ఏమిటి?,,   కొంచెం అయినా  ఆలోచన   ఉండాలి కదా? 

శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్,  షిర్డీ వారు  ప్రచురించిన  " శ్రీ  సాయి  సచ్చరిత్రము "

ఫకీర్ కు,    సాయి అనే పేరు ఎలా వచ్చేను,,  పేజీ no.41, 42, 43

సాయిబాబా కు   కోపం వచ్చినప్పుడు  భక్తులపై ఇటుక / రాళ్లు విసిరేవారు. బిగ్గరగా  తిట్టుచుండిరి,, " పేజీ no. 59, 62, 63, 92, 105,,.  etc. 
(  దేవుడు అయితే,  కోపం వస్తే,  భక్తులపై  రాళ్లు,  ఇటుకలు  విసిరి వేయడం  ఏమిటి?,  భక్తులను  తిట్టడం  ఏమిటి?  )

" నేనొక  ముసల్మాన్ (ముస్లిం ) ",   అని,  ఒక మహమ్మదియున్ అని  సాయి బాబా నే  స్వయంగా  చెప్పినారు 
" పేజీ No. 103 &
" సాయి బాబా ఒక  మహమ్మదియున్ ( ముస్లిం ) అని  చెప్పినారు 
" పేజీ No. 112,  226, 232,  ( బాబా గారే  తను  ముస్లిం అని చెప్పిన,  హిందువుల దేవుడు ఎలా అయినారు )

సాయిబాబా,  పొగాకు పీల్చుట / తాగుట ,,  పేజీ no.48,  126,  etc.
               * *
సాయి బాబా  అసలు పేరు - సైఫుద్ధిన్ బాబా,,  
ఫకీర్ లను పర్షియన్ భాష లో  " సాయి ' అని అంటారు,,   ఆవిధంగా  ఫకీర్ పేరు క్రమం గా  " సాయి" గా  మారినది. 
తన జీవితాంతం  మసీదు లోనే గడిపినారు.  ఎప్పుడు   "అల్లా మాలిక్ " అని చెప్పేవారు. 
  * * *
ఏ ఒక్క రోజు  సాయి బాబా  హిందు దేవుళ్ళ ను  పూజించలేదు. 
తను ముస్లిం కాబట్టి,  మసీదు లోనే ఉండి  అల్లా  ను ఆరాధించేవారు. / నమాజ్ చేసే వారు,,
    **  
త్రిమూర్తుల  అంశ తో ఏర్పాడిన అవధూత అవతారం   ధాత్తాత్రేయ,,  
అవతారం నకు  మరో అవతారం  ఉండదు,, 
విష్ణు మూర్తి అవతారం  శ్రీ రాముడు,   కానీ  శ్రీ రాముడు కి  మరో అవతారం  ఉండదు.
విష్ణు మూర్తి అవతారం  శ్రీ కృష్ణుడు,,   కానీ  శ్రీ కృష్ణుడు కి  మరో అవతారం  లేదు,,
అదే విధంగా   దాత్తత్రేయ స్వామీ నే  ఒక అవధూత అవతారం,,  మళ్ళీ  ఒక అవతారం నకు  మరో అవతారం  ఉండదు,,
కానీ,  సాయిబాబా  ధాత్తాత్రేయ   అవతారం గా ఎలా ప్రచారం చేస్తారు,,  కొంచెం అయినా  ఆలోచించాలి గదా?

ఇందులోనే   పెద్ద కుట్ర  ఉన్నది..!!

అయినా మనకు ఎంత మంది గురువు లేరు...,

ఇప్పుడిప్పడే
మన హిందువులు భగవాన్ రమణ మహర్షి ఆశ్రమం చూడటానికి తిరువన్నామలై వెళ్తున్నారు,
ఆదిశంకరాచార్యులు వారు నడయాడిన ప్రదేశాలు చూడటానికి కాలడీ వెళ్తున్నారు,  బేలూరు రామకృష్ణ మఠంకు వెళ్తున్నారు, శృంగేరి మఠంకు వెళ్తున్నారు,

Sekarana

కడుపు నింపే దేవాలయ నిర్మాత!

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


  *కడుపు నింపే దేవాలయ నిర్మాత!*
              ➖➖➖✍️

ఆ నవయువకుడు తనది కాని దేశంలో ఉద్యోగం చేయడానికి కడుపు చేతితో పట్టుకుని వచ్చాడు. 
కావేరి, గోదావరి నదుల దగ్గర ఉద్యోగం చేశాడు. ధవళేశ్వరంలో ఉద్యోగ నిమిత్తం కాపురం ఉన్నాడు. 

ఓసారి ఆతని ఇంటిలో పనిచేసే ఆమె ఓ పదిరోజులు పనిలోకి రాలేదు. పదకొండో రోజున పనిలోకి వచ్చిన పనిమనిషిని ఆతని భార్య నిలదీసింది 'పనిలోకి ఇన్ని రోజులనుంచి ఎందుకు రాలేదని?' 

అంతే..!
ఆ పనిమనిషి భోరున ఏడవడం మొదలుపెట్టింది. ఆ దొరసాని పనిమనిషిని ఓదార్చి వివరం కనుక్కుంది. ఆరోజులలో గోదారి సీమ అంతా కరువు కాటకాలతో తల్లడిల్లిపోతోంది. కడుపుకింత అన్నం కూడ లేదు. గోదారి ఒండ్రు మట్టిని కూసింత గంజిలో కలుపుకుని అదే అమృతంగా ఇంటిల్లిపాదీ రోజూ తాగి కడుపు నింపుకునే వారు. బతుకు కొనసాగించేవారు. 

అలాంటి వేళలో ఎవరో కాస్త కలిగిన మహానుభావులు ఆ పనిమనిషి సంతానమైన ఆడపిల్లను కొనుగోలు చేసేందుకు వచ్చారు. ఆతల్లి ముందు- వెనుకలాలోచించకుండా తన సంతానాన్ని అమ్మేసింది! డబ్బుకోసం కాదు!! 
తనెలాగూ తన బిడ్డను పోషించలేదు. కాస్త కలిగిన చోట పడితే కనీసం అదన్నా బతుకుతుందని!!! 
ఆ చేతిలో పడ్డ కాసులతో మిగతా కుటుంబం కాలం వెళ్ళదీయచ్చునని!

అమ్మడమంటే అమ్మేసింది కాని అమ్మ మనసును గట్టిపరుచుకోవడానికి సమయం పట్టింది. అందుకే పనిలోకి రాలేకపోయింది. ఇదంతా దొరసానికి భోరున విన్నవించుకుంది.

ఆతర్వాత ఆ దొరసానికి రెండు రాత్రుళ్ళు కంటికి నిద్ర లేదు.  నోటికి ముద్ద పోలేదు. భర్తేమో ఊళ్ళో లేడు. 

భర్త రాగానే ఈ విషయాన్నంతటినీ వివరించింది. “మీరు ఇంజనీర్ కదా...
ఇంతటి గోదావరి మహానది ప్రవహిస్తున్నా ఇక్కడి ప్రజానీకాన్ని ఇలాంటి దుర్గతి నుండి తప్పించలేరా”అని నిలదీసింది.

ఆ దొర గారు అప్పుడు ఆలోచించారు.
ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాడు. గోదారి నీళ్ళను బీడు భూములలోనికి ప్రవహింప చేయాలనుకున్నాడు. పంటలు పండించి అందరి కడుపు నింపాలనుకున్నాడు.
వెంటనే ప్రభుత్వానికి మహజరు పంపాడు. ఎన్నో తిప్పలు పడి విదేశీ ప్రభుత్వాన్ని ఒప్పించాడు.

కాని ఇప్పుడొచ్చింది అసలు సమస్య!!
మహోధృతంగా ఉత్తుంగ తరంగంగా ప్రవహించే గోదావరి నదికి తాను అడ్డుకట్ట వేయగలడా!?
దైవప్రేరేపణ కాకుంటే అసలు తనకా ఆలోచన ఎందుకు వచ్చింది? అని తర్కించుకున్నాడు!
వెంటనే ఓ మెరుపు మెరిసింది!!
తాను కావేరీ నదీ పరీవాహాన్ని అధ్యయనం చేసినప్పుడు ఆనదిపై 900 సంవత్సరాల క్రితమే ‘రాజరాజ చోళుడు’ ఇసుకతో ఆనకట్టను నిర్మించిన ఘట్టం గుర్తుకొచ్చింది. తాను మాత్రం ఆవిధంగా ఎందుకు చేయకూడదు?అనుకుని తన మిత్రుడు అయిన ‘వీరం వీణెన్న’ను వెంటబెట్టుకుని రంగంలోకి దిగిపోయాడు. గోదావరి సీమ అణువణువూ గాలించేశాడు. గోదారమ్మ పాయలుగా చీలుతున్న ‘ధవళేశ్వరం- ర్యాలి’ గ్రామాల మధ్యన ఆనకట్ట కట్టేడు.

కోట్లాది మంది కడుపులు నింపాడు. శతాబ్దాలకు, సహస్రాబ్దాలకు సరిపడే సంపద కూర్చి పెట్టేడు!!!!!!

ఆ దొర గారే... సర్.ఆర్ధర్.కాటన్.....!

అంత కష్టపడ్డందుకు ఆయనకు కలిగిన ఫలితం...
ఆయన ఆనకట్ట పనిమీద దూరంగా ఉన్నప్పుడు ఆయన ముద్దుల కూతురు ఆయన లేకుండానే తుది శ్వాస విడిచింది..!

ఆ పాప సమాధి ధవళేశ్వరంలో ఉంది.

ఆనకట్ట కట్టిన తరువాత ఆయన దాని పర్యవేక్షణలో కోనసీమలో తిరుగుతుండగా ఓ అగ్రహారంలో ఓ ఉదయాన్న ఓ పండితుడు "కాటన్ మహాశయం తన్నమమ" అంటూ సూర్యభగవానునికి అర్ఘ్యమిస్తుండగా చూశాడు. 

వెంటనే డఫేదారుని అలా ఎందుకంటున్నాడో కనుక్కు రమ్మని పంపేడు.

“ఇక్కడ ఇంత గోదారి ఉన్నా మాకు మన్నేగాని అన్నమేనాడూ లేదు. కాటన్ దొరగారి పుణ్యమా అని మాకందరకూ అన్నపానాలకు, సిరిసంపదలకూ లోటులేకుండా బ్రతుకు గడిచిపోతోంది. ఆయనే మా ప్రత్యక్ష దైవం! అందుకే మా సూర్యునితో పాటుగా ఆయనకూ అర్ఘ్యమిస్తున్నాను" అని అన్నాడట ఆ ఘనాపాటి.

“ఇంతకన్నా నాకింకేం కావాలి?!”
అని తన జీవితచరిత్రలో వ్రాసుకున్న అల్పసంతోషి సర్.ఆర్ధర్ కాటన్.

ఆ ప్రత్యక్ష దైవానికి ఆయన పుట్టినరోజు సందర్భంగా మా రైతులందరి పక్షాన....
అనేకానేక కృతజ్ఞతాంజలులు"✍️

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

దేహతాదాత్మ్యము

 #దేహతాదాత్మ్యము..*

ఒక పట్టణంలో ఒక గొప్ప శిల్పి ఉన్నాడు. అతడు జీవకళ ఉట్టిపడేటట్లు శిల్పాలను చెక్కుతాడు. అతడు శిల్పాలను చెక్కితే అది శిల్పంలాగా కాక ఆ మనిషే అక్కడ నిలబడి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆయనకు ముసలితనం వచ్చింది. ఎప్పుడో ఒకప్పుడు చావు తప్పదు అని అతడికి తెలుసు. అయినప్పటికి చావును తప్పించుకోవాలనుకొని ఒక ఆలోచన చేశాడు. రూపం, రంగు, ఒడ్డు, పొడుగు, డ్రెస్ అన్నీ తనలాగే అచ్చు గ్రుద్దినట్లుగా ఉండే 9 శిల్పాలను తయారుచేశాడు. వాటిని చూసిన వారెవరైనా వాటిని శిల్పాలు అని అనుకోరు. ఆ శిల్పియే అనుకుంటారు. ఆ తొమ్మిదింటిని జాగ్రత్తగా దాచిపెట్టాడు. కొంతకాలం గడిచింది.

అతడికి జబ్బు చేసింది. డాక్టర్లు పరీక్షించి ఇక ఎంతోకాలం జీవించటం జరగదు. బహుశా రెండు మూడు గంటలు మాత్రమే అని చెప్పారు. అప్పుడా శిల్పి తన ఇంటి బయట 9 శిల్పాలను పరుండబెట్టి అన్నింటిపై ఒకేరకం వస్త్రాన్ని కప్పి, తాను కూడా వాటి మధ్య పడుకొని అదే రకం వస్త్రాన్ని కప్పుకున్నాడు. మరణ సమయం ఆసన్నమైంది. యమధర్మరాజు చేత పాశాన్ని ధరించి ఆ శిల్పి కోసం వచ్చాడు. అయితే అక్కడ 10 మంది శిల్పులు పరుండినట్లు గమనించాడు.ఆదిత్యయోగీ.

ఒక్కొక్క శిల్పం మీద వస్త్రాన్ని తొలగించి చూస్తుంటే అందరూ ఒక్కటిగానే ఉన్నారు. ఇందులో ఆయుష్షు తీరిపోయిన శిల్పి ఎవరా? అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఎంత ఆలోచించినా ఆయనకు బోధ పడటం లేదు.

ఒకరికి బదులు మరొకరి మెడలో పాశాన్ని వేయటం తన వృత్తి ధర్మానికే కళంకం. తనకున్న 'సమవర్తి' అనే పేరు తొలగిపోతుంది. అందువల్ల అందరినీ మరొకసారి పరికించి చూచి తిరిగివెళుతూ వెళుతూ "వీడెవడో గాని అన్నింటిని ఎంతో నైపుణ్యంతో, జీవకళ ఉట్టి పడేటట్లుగా చక్కగా చెక్కాడు గాని ఒక్క పొరపాటు చేశాడు" అని పెద్దగా అన్నాడు. ఆ మాట వినటంతోనే విగ్రహాల మధ్య పడుకున్న శిల్పి అమాంతంగా లేచి "ఏమిటయ్యా.. ఆ పొరబాటు..?" అన్నాడు. "..నీవు లేవటమే ఆ పొరపాటు" అని యమధర్మరాజు.. అతడి మెడలో యమపాశాన్ని వేసి ప్రాణాలు గైకొని పోయాడు. ఆ శిల్పి కొద్దిసేపు ఆగితే ప్రాణాలు దక్కేవి. కాని దేహాభిమానం అతణ్ణి వీడలేదు. నేను ఇంతటి గొప్ప శిల్పినే.. నేనేం పొరపాటు చేశాను..? అనే అభిమానం పొడుచుకు వచ్చింది. లేచాడు. పొయ్యాడు. దేహాభిమానమే అతడి కొంప ముంచింది, అతడి ప్రాణాలు తీసింది.
 
దేహాభిమానం గలవారు 'ఈ దేహమే నేను' అనే భావంతో ‘నేను’ 'నేను' అనే అహంకారాన్ని కలిగి ఉంటారు. ఈ దేహానికి సంబంధించిన వారిని 'నావారు' అని, ఈ దేహానికి సంబంధించిన వాటిని 'నావి' అనే మమకారాన్ని కలిగి ఉంటారు. ఈ అహంకార మమకారాల కారణంగానే జీవితంలో ప్రశాంతతను పోగొట్టుకొని, మనస్సును అనవసరమైన ఆందోళనలకు, ఉద్రేకాలకు లోనుగావించుకొని అశాంతిని, దుఃఖాన్ని కొని తెచ్చుకుంటారు. లోకంలో సాధారణంగా అందరూ ఈ అహంకార మమకారాలకు లోనవుతూనే ఉంటారు. అందుకే నిర్గుణోపాసన అనేది కష్టతరమవుతున్నది. ఈ "దేహతాదాత్మ్యమే మానవులు కున్న పెద్దదోషం".

ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించిన అనేక మంది సాధకులు జపధ్యానాదులు, ఉపాసనలు చేస్తున్నప్పటికీ మంచి ఫలితాన్ని పొందలేక పోవటానికి కారణం ఈ దేహాభిమానమే.. దేహతాదాత్మ్యమే.. దేహమే నేను అని భావించే అహంకారమే. క్షేత్రాన్ని శుద్ధం చేయకుండా.. పొలాన్ని సరిగ్గా దున్ని తయారు చేయకుండా విత్తనాలు చల్లితే ఏం ప్రయోజనం.. పునాది గట్టిగా వేయకుండా ఎన్ని అంతస్థుల మేడ కడితే అది ఎంతకాలం ఉంటుంది.. అలాగే అంతరంగం లోని దేహాభిమానం తొలగకుండా పరమాత్మయందు మనస్సు నిలుపుదాం అని ప్రయత్నిస్తే నిలుస్తుందా..? నిలవదు. కనుక ముందుగా దేహాభిమానాన్ని వదలాలి. ఆ దోషం తొలిగితే గాని నిర్గుణోపాసన కుదరదు...!!

****డొక్కా సీతమ్మ

 

డొక్కా సీతమ్మ

ఆంధ్రదేశంలో కొంత కాలం క్రితం వరకు డొక్కా సీతమ్మగారి పేరు తెలియని వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఆమె అన్నదానం ఖ్యాతి ఖండ ఖండాంతరాల్లో నూ వ్యాపించింది. ఆమె గురించి ఈ కాలం వారికి పెద్దగా తెలిసి ఉండకపో వచ్చు ఇప్పుడు ఆమెను గురించి కాంచెం తెలుసుకుందాం..

డొక్కా సీతమ్మగారు తూర్పుగోదావరి జిల్లా లంకల గన్నవరంలో 1841 లో జన్మించింది. ఆమె తండ్రి అనప్పిండి 
భవానీ శంకరుడు... తల్లి నరసమ్మ. వీరి వంశం వారు ఇప్పటికీ లంకలగన్నవరంలో ఉన్నారు.

సీతమ్మ బాల్యం నుంచి వితరణ స్వభావం కలది. పుట్టినింటి వారు అంత సంపన్నులు కారు. సీతమ్మగారు ఉన్నంత లోనే పేదసాదలకు అన్నం పెట్టేది సాయం చేసేది. ఆమెభర్త డొక్కా జోగన్నగారు. అత్తింటివారు సంపన్నులు కావటంతో సీతమ్మగారు భర్త అనుమతితో దానధర్మాలు చేస్తూ ఉండేది. అన్నదానం చేయడంలో ఈమెకు ఎక్కువ ప్రీతి. గొప్ప, బీద,జాతి, మత, కుల భేదాలు లేకుంగా ఏ వేళకు వచ్చి అన్నం అడిగినా లేదన కుండా, విసుక్కోకుండా వాళ్ళని ఆదరించి అన్నం పెట్టి కడుపు నింపి తృప్తి పరచేది. ఈ విషయంలో భర్త కూడా అమెకు అన్ని విధాలా సాయపడుతూ ఉండేవాడు. .

సీతమ్మగారి అన్నదానం గురించి అందరూ చెప్పుకునే కథలు, గాథలు ఆంధ్రదేశంతో ప్రచారంలో ఉన్నాయి. సంతానం లేని ఒక జిల్లా కలెక్టరు సీతమ్మ గారి చేతి చలువ అన్నం వల్లనే తనకు సంతానం కలిగిందని విశ్వసించేవాడు, 'ధాత' కరువు వచ్చినప్పుడు ఈ దంపతులు చేసిన అన్నదానం గురించి చాటు కవులు ఎన్నో విధాల ప్రసంసించారు.

ఆ రోజుల్లో ఒకనాటి రాత్రి బాగా ముసురు పట్టి వర్షం కురుస్తోంది. దానికి తోడు గోదావం పొంగి ప్రవహిస్తోంది. ఒక హరిజనుడు గోదావరి లంకలో చిక్కుకు ని, ఆకలితో అలమటిస్తూ గొంతెత్తి 'అమ్మా, సీతమ్మ తల్లి ఆకలి తో ప్రాణం పోతోందమ్మా - అన్నం పెట్టి పుణ్యం కట్టుకోమ్మా' అని ఆక్రోశిస్తున్నాడట. ఎలాగో ఆ ఆక్రోశం సీతమ్మగారి చెవుల పడింది. వెంటనే ఆమె బయలుదేరింది. ఆ వర్షంలో ఆ గోదావరిలో అన్నం కుండ నెత్తి మీద పెట్టుకుని భర్త సాయంతో ఆ లంక లోకి వెళ్ళి, ఆ హరిజనుడికి అన్నం పెట్టి, ఆకలి తీర్చి, అతడిని వెంటపెట్టుకు ని గోదావరి దాటించి తన ఇంటికి తీసుకు వచ్చి కాపాడింది.

ఒకసారి ఒక దొంగ సీతమ్మ గారి ఇంటికి వచ్చి ఆమె పట్టు చీర దొంగిలించాడు. చుట్టు పక్కల వారు కనిపెట్టి, దొంగని పట్టుకుని కట్టేసి కొట్టబోయారు. సీతమ్మ గారు వారిని వారించి ఆ దొంగని కట్లు విప్పించి, వాడికి అన్నం పెట్టి ఆ పట్టు చీర తానే స్వయంగా ఆ దొంగకి ఇచ్చి పంపించిందట.

మరోసారి సీతమ్మగారు అంతర్వేది తీర్థానికి మేనాలో బయలుదేరింది. దారి లో పెళ్ళివారి గుంపు ఒకటి ఎదురైంది. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ 
'సీతమ్మగారు ఊళ్ళో లేదు. అమే వుంటే మనల్ని ఇలా అభోజనంగా పంపించేదా' అనుకుంటున్నారుట. సీతమ్మగారు అ మాటలు విని, మేనా దిగి వారి సంగతి కనుక్కుని, తాను వెనక్క తిరిగి ఆ పెళ్ళి వారిని వెంటపెట్టుకుని ఇల్లు చేరి అప్పటి కప్పుడు అంతమందికీ వంట చేసి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి పంపించింది.

సీతమ్మగారి అన్నదాన వ్రతనిష్ఠును పరీక్షించడానికి ఒకరోజు రాత్రి పిఠాపురం రాజా గంగాధరరావుగారు, తమ దివాను తో కూడా మారు వేషాలతో వెళ్ళి సీతమ్మ గారి ఇంటి వీధి అరుగు మీద పడుకున్నా రుట - రాత్రి తలుపులు వేసుకోవడానికి వచ్చిన సీతమ్మగారు అరుగుల మీద కొత్త వారిని చూని లోపలికి వచ్చి భొజనం చేసి పడుకోండి' అన్నది. వారిద్దరు తమకు ఆరోగ్యం బాగాలేదని అన్నారుట. ఫరవా లేదు, మికు పథ్యంగానే వండిపెడతానని వాళ్ళని లోపలికి తీసుకువచ్చి ఆ రాత్రి వేళ పథ్యం వంట చేసి పెట్టిందిట సీతమ్మగారు.

సీతమ్మగారి అన్నదాన ప్రశస్తి అనాటి బ్రిటిషు చక్రవర్తి ఏడో ఎడ్వర్డ్ గారికి తెలిసింది. ఆయన ఆమె దాతృత్వాన్ని ప్రశంసిస్తూ యోగ్యతా పత్రాన్ని పంపించా రుట. అంతేకాకుండా ఆ రోజుల్లో ప్రతి సంవత్సరం లండన్ లో జరిగే చక్రవర్తి పట్టాభిషేక ఉత్సవాల్లో దర్బారు హాల్లో సీతమ్మ గారి ఫొటో పెట్టేందుకు  ఆదేశించారుట.

అలా ఆ ఫోటో కోసం ఒకే ఒక్కసారి కెమెరా ముందు కుర్చీలో కూర్చుని ఫోటో దిగారు సీతమ్మగారు. అదే ఈ ఫోటో.

సీతమ్మగారి వలె ఆదరించి అన్నం పెట్టే తల్లుల మూలంగానే ఆంధ్రదేశం అన్నపూర్ణ అయింది.

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Sunday, July 28, 2024

****పాటలతో పరీక్షలో విజయాలు


1. గుర్తుంచుకో - 5 లక్షలు

జ్ఞాపక శక్తిని పెంచుకునేందుకు 
లేనేలేవోయ్ మందులు మాకులు   ||జ్ఞాపక||

మెదడులో ఉంటాయ్ పది వేల కోట్ల న్యూరాన్లు|| 
క్రియాశీలకంగ ఉంటాయందులొ 
జ్ఞాపక శక్తికి సంబంధించి ఐదు లక్షల న్యూరాన్లు !!     అంటే....!
 నువ్వు గురుతుంచుకోవచ్చు 
ఐదు లక్షల విషయాలు !!! 
నీకెందుకింకా? భయాలు     ॥జ్ఞాపక.. ॥

నీ మెదడులో నింపొద్దసలే
అనవసరపు విషయాలు...! 
అదే జరిగితే గురుతుండవసలే
అవసరమైన విషయాలు... 
నీకవసరమైన విషయాలు..!    ॥జ్ఞాపక॥

సినిమాలు.. స్నేహితులతో 
చిట్..చాట్లు....!! చాటింగులూ..!! 
తగ్గించుకోవాలి...!! గాసిప్పులూ కబుర్లూ.....!!! అనవసరమైనవి చేరకుంటే... 
మెదడుకు జ్ఞాపక శక్తీ 
పెరుగుతుంది.. 
చదివిందంతా గుర్తుంటుందీ...!!    ॥ జ్ఞాపక ॥

జ్ఞాపక శక్తీ సమానమేలే..!! 
అందరికి.. మనకందరికీ.. 
బ్రహ్మ సమయంలో చదివితే.. 
ఉంటాయ్ ఎన్నో ప్రయోజనాలూ.. 
ఇక వేసేయ్ మనసుకు కళ్ళెం...!! 
మీవేలే ఇంక విజయాలూ...    ॥ జ్ఞాపక ॥





2. మైండ్ హాలిడే - చదువులకు జాలిడే

ఉంటాయ్ మనసుకు మెదడుకు
వేరు వేరుగా లక్ష్యాలు 
మనసు చెప్పేదికాక..!! మెదడు 
చెప్పేది వినాలోయ్   ॥ ఉంటాయ్ ॥

ఐదు నిమిషాల విశ్రాంతివ్వాలెప్పుడు. 
సబ్జెక్ట్ నుంచి మరో సబ్జెక్ట్ 
చదివేటప్పుడు..!! 
అంటారా విశ్రాంతిని 'మైండ్ హాలిడే'..!! 
చూడొద్దు 'టీ.వీ.' లు..!! చెప్పుకోవద్దు 
కబుర్లప్పుడు..!! 
కళ్ళను చన్నీటి బట్టతో కప్పుకోవాలి..!! 
చదివినదంతా గుర్తుకు తెచ్చుకోవాలి..     ॥ ఉంటాయ్॥

ప్రిపరేషన్ హాలిడేస్' 
లో నిద్రపోవాలి!! మద్యాహ్నం రెండు గంటలు..!!

నిద్రలేచి.. స్నానం చేసి... 
చదివితే చాలు... 
ఉదయంవలెనే.. ప్రశాంతంగా ఉంటారందరు..!!
'ఒకే రోజు రెండు ఉదయాల టెక్నిక్కది'!!
ఆచరించి చూస్తే చాలు..!! 
పొందేరందరు విజయాలూ...   ॥ ఉంటాయ్ ॥ 



3. టెన్షన్ వదులు - అటెన్షన్

టెన్షన్..!! టెన్షన్ 
పరీక్ష వేళల ఒకటే టెన్షన్..!! 
ఉండాలి నీకు అటెన్షన్..!! 
మెదడు లోని కొన్ని చర్యలే 
ఆ టెన్షన్..కు కారణాలు..!! 
పాటిస్తే కొన్ని చిట్కాలు..!! 
పోవునులే ఈ భయాలు..!!     ॥ టెన్షన్ ॥

పరీక్ష రాసే పది నిమిషాల ముందు 
మూసుకోవాలి కళ్ళు..!!
ఓ రెండు నిమిషాలు చాలు...!! 
గుండె నిండా పీల్చుకోవాలి ఊపిరులు...!!
నెమ్మదిగా వదిలితే చాలు..!!     || టెన్షన్ ॥

పిడికిలి బిగించి వదలాలి....!! 
ఇలా చేయాలి... అనేక సార్లు.!!
తగ్గుతాయిలే పరీక్ష వేళల టెన్షన్లు...!!    ॥ టెన్షన్ ||

పరీక్ష రాస్తున్నంత సేపు 
నోట్లో నములుతుండాలి...!! 
ఎలాక్కయను... 
తగ్గుతాయిలే ఒత్తిడులు..!! 
పరీక్ష వేళల టెన్షన్లు..!!      || టెన్షన్ ||


4. చదువూ - నిద్రపో

ఓకే సమయంలో చదవాలోయ్ ప్రతి రోజు..!!
నిద్రపోవాలి ఓకే సమయంలో ఏ రోజు..!!
సగం విజయాలు అవుతాయిలే.. నీ స్వంతాలు..!!    ॥ఓకే॥

బ్రహ్మ ముహూర్తంలో లేస్తే బహు బాగు..!! 
చదివింది బాగా గుర్తుండిపోవు..!! 
రాత్రి పది గంటలకు పడుకుంటేనే..!! 
అది సాధ్యం..!!     ॥ఓకే॥

పెన్నూ.. పుస్తకం ఉంచుకోవాలి.. 
ముఖ్యమైనవి రాసుకోవాలి..!! 
పునశ్చరణలో కొద్ది సమయంలో.. 
ఒకేసారి గుర్తుకొస్తాయి అన్నీ..!!     ॥ఓకే॥ 

ఐదు నిమిషాల వ్యవధి ఉండాలి..!! 
సబ్జెక్ట్ విడిచి సబ్జెక్ట్.. 
మార్చి చదివేటప్పుడు..    ॥ఓకే॥

5. మనసులోనే చదువూ

బయటకు చదువుట తగ్గించాలి..!!
మనస్సులోనే చదవాలి..!!
ఉంటారప్పుడు అలసిపోకుండా.. 
సొంత విశ్లేషణతో.. రాయొచ్చుకూడా..!!    ॥ బయటకు ॥

ఎలా చదివామన్నది కాదు..!! 
ఎంత ఆసక్తిగా చదివామన్నది చూడు..!! 
తప్పులు అసలే రాయొద్దు..!! 
ఆసక్తి లేకుండా చదవొద్దు..     ॥ బయటకు ॥

మనసు పెట్టి.. ఇష్టం పెంచుకు..
భాషా.. విషయాలు.. చదవాలి..!!
బాగా నువ్వు రాయాలి.. 
అందరికి పేరు తేవాలి..      ॥ బయటకు ॥


6. ఆసక్తి - కార్టెక్స్ ఎఫెక్ట్

ఆసక్తి పెంచుకోవాలి.. చదువుపై 
అపుడే కలుగుతుంది.. ఇతర విషయాలపై అనాసక్తి..!! 
చదువుపై 'ఆసక్తి లేని వారూ'!! 
'ఇతరాలపై ఆసక్తి ఉన్నవారూ.!!    ||ఆసక్తి||


ఆసక్తి పెరగాలంటే.. పరిసరాలు ఉండాలి.. 
ఆహ్లాదకరం..!! 
చూసుకోవాలి ఉండేట్టు.. ప్రశాంతంగా 
చుట్టూ వాతావరణం..      ||ఆసక్తి||

ఆసక్తి ఉంటేనే.. గుర్తుంటాయి.. 
అన్ని విషయాలు..!! 
రోజు ఉండాలి.. కొంత సమయం.. 
ఎవరితో.. ఏమీ.. మాట్లాడకుండ..!!   ||ఆసక్తి||

నిశబ్దంగా ఉంటేనే.. పెరుగుతుంది..!!
ఏకాగ్రత.. జ్ఞాపక శక్తీ..!!
నియంత్రించుకోవాలి.. మనస్సు.. 
అపుడే లక్ష్యం చేరటం.. సుళువు..   ||ఆసక్తి||

7. డయేరియా ఆఫ్ టాకింగ్

'అదర్ ఇంటరెస్ట్' ఉండటమే కదా.. అనాసక్తి.!!
ఇతర ఆసక్తులు తగ్గించవా.!! 
చదువుపై ఆసక్తి.. 
గొప్ప చదువులు మరి.. 
చదివేదేలా??!!..
నువ్వు తెలుసుకుంటే పోలా..!!?    ||అదర్||

'టీ.వీ.'లు.. సినిమాలు చూడటం.. 
చిట్..చాట్లు స్నేహితులతో..
తగ్గించాలి బాగా.. గాసిప్పులూ..!! 
'డయేరియా ఆఫ్ టాకింగ్'... 
అంటారు వీటిని.. 
ఉండాలి.. దూరంగ.. 
వాటికీ..!!       ||అదర్||

చదువుకునేప్పుడు.. కట్టేయాలి ..
'టీ.వీ.'ని.. ఇంట్లోని వారందరూ...!! 
లేకుంటే ఉండదు.. ఏకాగ్రత 
పుస్తకాలు ముందేసుకు.. కూర్చున్నా...!!!? 
పక్కనే కూర్చోవాలి ఎదో పనితో 
చదువుకునే వాని పక్కనే పెద్దలు..!!    || అదర్ ||

8. చదవాలి - రాయాలి

ఏర్పాటు చేసుకో..! చదవాల్సిన 
అంశాలున్న సబ్జెక్టును ముందు! 
ఆ తర్వాత.. రాసే అంశాలున్న. 
సబ్జెక్టులను పెట్టుకోవాలి చివర్లో!

దొరుకుతుందిలే సమయం ఎక్కువ.. చదివేందుకు నీకు. 
పరీక్షలో విజయాలే. కల్గుతాయి. నీకూ!    ॥ ఏర్పాటు ॥

చదివేటప్పుడు రాసుకోవాలి.! 
ముఖ్యమైన సంగతులన్నీ.! 
పునశ్చరణ సమయంలో…! 
గుర్తుకు తెచ్చుకోవచ్చు 
కొద్ది సమయంలోనే విషయాలన్నీ..! 
ఇంకెందుకు పోవు । భయాలన్నీ !     ||ఏర్పాటు||


9. సబ్జెక్టు బోరు - మార్కులు నూరు

కొన్ని సబ్జెక్టులంటే- బోరు నాకంటే..! 
పరీక్షల్లో రావు కదా.. మార్కులు నూరు! 
అసలు ఇష్టం లేని సబ్జెక్టు పట్ల 
పెంచుకోవాలి ఇష్టం...! 
లేకుంటే మనకే కష్టం...!     ||కొన్ని||


ఇష్టమైన- ఆసక్తి గల సబ్జెక్టును..!
చదువు కోవాలి.. రెండు ఆసక్తి లేని 
సబ్జెక్టుల నడుమ..! 
ముందు బోర్ కొట్టే సబ్జెక్టు చదవాలి ! 
తర్వాత వెంటనే.. ఇష్టమైన దాన్ని చదవాలి..! 
తగ్గుతుంది బోరు 
పెరుగుతుంది చదువులో జోరు...! 
వస్తాయిలే మార్కులు నూటికి నూరు...!     ||కొన్ని||