*అంతా శంకరయ్యది...*
నా కన్నతలి నాది కాదు
నా భార్య నాది కాదు
నా బిడ్డా నాది కాదు
నేనున్న ఇల్లు నాది కాదు
నే నమ్మిన చేను నాది కాదు
అంతెందుకు
నాది నాది అంటున్నా...
ఈ తనువు నాది కాదు
అజ్ఞానికి ఇదో పెద్ద సోది...
జ్ఞానికి శాంతినిచ్చిన సత్యమిది...
నేల నింగి నిప్పు నీరు
బంధం బలగం
బరువు బాధ్యత అంతా శంకరయ్యది...
వందేళ్ళ కూలికి వచ్చి.., తన్నుకుచస్తున్న తనువు కొయ్యిది...
తనువు సంద్రాన ఆశనది
కోరిక సందులో స్మరణమది
ప్రాణం అన్నది సృష్టినడిపే మాయది...
నాది నాదనే మోహం మాచెడ్డది...
చచ్చాకే పోతది
చచ్చేదాక చంపుకుతింటుంది...
నేను అన్నది ఓ రోజు లేనిది
నేడు ఉన్నది
ఏదోనాడో మాయమైతది
నమ్మాల్సిన సత్యమిది
నమ్మిన కూడా మాయలో మునిగే తనువు ఇది...
కొడుకు తండ్రి
పదవి పేరు ప్రతిష్ట
ఆస్తి పాస్తి
స్నేహం అభయం
కష్టం నష్టం
సుఖము దుఃఖం
అంతా శంకరయ్యది
వాడి ఆటలో బాగంగా కొన్నాళ్ళే
ఈ కింకరుడిది...
*అభిరామ్ 9704153642*
No comments:
Post a Comment