Friday, October 24, 2025

 [10/24, 06:45] +91 88867 01236: *పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం*
*ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే॥* స్తోత్రం.

ఈ సంసార భ్రమణ పరితాపం వదిలి పోవటానికి రెండు జన్మల మధ్య పరితాపాన్ని త్యజించటానికి తోడ్పడేవాడు ఈశ్వరుడు.
అంతే కాదు మానవ జననానికి కారణం కోరిక. ఈ కోరికకు ఒక రూపం మన్మథుడు. 
అలాంటి మన్మథుడిని తన మూడో కంటి చేత దహనం చేసినవాడు ఈశ్వరుడు. 
అయితే ఈ చర్యలన్నింటిలోను అమ్మవారి ప్రమేయం కూడా ఉంటుంది. అందుకే పరమేశ్వరుడి కన్ను శివుడిది మాత్రమే కాదు పార్వతీ దేవిది కూడా. 
అందుకే ఆమెను త్రిలోచన అని కూడా పిలుస్తారు. తన భక్తులకు శివుడు ఎలాంటి వరాలిస్తాడో అమ్మవారు కూడా అంతే దయతో భక్తులను కనికరిస్తుంది.

అమ్మను ప్రసన్నం చేసుకుంటే భక్తుల కోరికలన్నీ తీరినట్లే అందుకోసమే కార్తీక మాసంలో తిదియనాడు త్రిలోచనగౌరి వ్రతం చేస్తారు. 
ఆ రోజు కొన్ని ప్రత్యేకమైన పూలతో పూజ చేస్తే అమ్మ అనుగ్రహం కలుగుతుంది, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే కొన్ని పద్దతులను పాటించాల్సి వస్తుంతుంది.అవేమిటో గమనిద్దాం. 

 ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఒకరిని బాధపెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు. 
కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకరావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధపెట్టకుండా ఉండాలి.

 "మౌనం" మనస్సును శుద్ధి చేసేది కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయాలి.

 "స్నానం" దేహాన్ని శుద్ధి చేస్తుంది కాబట్టి ఉభయ సంధ్యలలో చన్నిటి స్నానం చేయాలి.

 "ధ్యానం" బుద్దిని శుద్ధి చేస్తుంది కావున నిరంతరం మనం ఏపని చేస్తున్న ధ్యానస్థితిలో ఉంటూ విధ్యుత్ ధర్మాలను నేరవేర్చుకోవాలి... 

 "దానం" మనం ఈ భూమి మీదకు వచ్చేప్పుడు ఏమి తేలేదు, పోయేప్పుడు ఎవ్వరు ఏమి తీసుకుపోలేరు. 
కావున దేని మీద నాది అని బ్రాంతి చెందక సాధ్యమైనంతలో నీకున్న సంపాదనలో ఎంతో కొంత సాటి జీవుల శ్రేయస్సుకోరకు సహాయ పడాగలగాలి.

 "ఉపవాసం" ఉండాలి దీని వలన ఆరోగ్యాం శుద్ది అవుతుంది.

"క్షమాపణ" ఎవరైన తెలిసి తెలియక పొరపాటు చేస్తే క్షమించే గుణం ఉండాలి తద్వార మానవ సంబంధాలను బలపరుస్తుంది.

నీ గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు నీవు వంద మంది గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవాలి.

సత్యం వైపు నీవుండాలనుకుంటే ఒంటరిగా మహావృక్షంలా నిలబడడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ పడిపోవాల్సివస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి.

కరుగుతున్న కాలానికీ జరుగుతున్న సమయానికీ అంతరించే వయసుకీ మిగలిపోయే జ్ఞాపకమే "మంచితనం" అదే మనకు ఆభరణం.

మనిషిలో "అహం" తగ్గిన రోజు "ఆప్యాయత" అంటే అర్ధం అవుతుంది. 
"గర్వం" పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. 
నాలో దైవత్వం ఉండాలని కోరుకోవాలి తప్ప నేనే దేవున్ని అనే గర్వం రానివ్వకుండా వ్యవహరించ గలిగితే ఈ వ్రత ఫలితం దక్కుతుంది. 
నిజానికి ఈ పై సూత్రాలు పాటిస్తే ఏ వ్రతం చేయనక్కరలేదు. సమస్త జీవులలో పరమాత్మను సందర్షించిననాడు నీలో పరమాత్మ అంతర్లీనమై ఉన్నాడని భావం ఆస్థితికి రావడానికి కృషి చేయాలి.

          *_🌹శుభమస్తు🌹_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏
[10/24, 07:15] +91 98666 19196: ఈ శ్లోకం చాలా లోతైన
 భావనలను కలిగి ఉంది!

 *"పునరపి జననం*
*పునరపి మరణం"* 

అంటే...

*ఈ జీవితం ఒక చక్రం లాంటిది,* మళ్లీ మళ్లీ జననం మరియు మరణం జరుగుతాయి.

*ఈ శ్లోకం మనకు జీవితం యొక్క అసలు అర్థాన్ని,*

 *దైవ దయను మరియు కష్టాలను అధిగమించడానికి మనం ఎలా ప్రార్థించాలో తెలియజేస్తుంది.*

ఇక *"అహం"* తగ్గినప్పుడు, మనసులోని ఆప్యాయత పెరుగుతుంది.

 మనం మన స్వార్థాన్ని పక్కన పెట్టి, ఇతరుల పట్ల ప్రేమ మరియు కరుణతో నిండిన మనసుతో చూడగలుగుతాం.

ఇక *"గర్వం"* పోయినప్పుడు, మనం ఇతరులను గౌరవించడం ఎలా చేయాలో అర్థం చేసుకుంటాం.

 ఇది మన సంబంధాలను బలంగా చేస్తుంది మరియు మన చుట్టూ ఉన్న వారితో మంచి అనుభవాలను సృష్టిస్తుంది.

*ఈ భావాలు మన జీవితంలో ఎంతో ముఖ్యమైనవి.*

ఇవి మనం మన అహంకారాన్ని తగ్గించి, ఇతరుల పట్ల ఆప్యాయత మరియు గౌరవంతో ఉండాలో... తెలియజేస్తాయి


*చాలా మంచి సందేశం👏*👏👏💐

No comments:

Post a Comment