Saturday, October 18, 2025

 🦚జ్ఞాన ప్రసూనాలు🚩
17/10/25

1) ఏ నది ప్రవాహం దానిదే. ఒక దానికొకటి సంబంధమే లేదు. ఎవడి జీవనశైలి వాడిదే. ఒకడికొకడికి సంబంధమే లేదు.

2) ఆకాశం - దైవం
కిటికీలు - గురువులు
ఆకాశానికి ప్రాముఖ్యతనివ్వండి.
కిటికీల వద్దే ఆగిపోకండి.

3)తలంపుల రూపంలో ఉన్నది కూడా భగవంతుడే అని నీవు ఉన్నప్పుడు తలంపులు వచ్చినా తలవనివాడివే అవుతావు.

4) “నేను” యొక్క మూలాన్ని కనుగొంటే సృష్టి రహస్యాన్ని కనుగొన్నట్టే

5) ఏడు వారాల దేవతలను మ్రొక్కవద్దు.
ఒకే దేవుణ్ణి పట్టుకో.
ఏడు వారాల దేవతలను మ్రొక్కడంలో మన ఉద్దేశం ఏమంటే మనం ఆపదలో చిక్కుకున్నప్పుడు ఒక దేవుడు కాకపోయినా ఇంకో దేవుడు కాపాడతాడని. జరిగేదేమంటే ఆ దేవుడు కాపాడుతాడని ఈ దేవుడు ఈ దేవుడు కాపాడుతాడని ఆ దేవుడు అందరూ ఊరకుండిపోతారు.
తరువాత నీ పరిస్థితి ఏమి?
అందుకే ఒకే దేవుణ్ణి నమ్ముకుంటే, అరె వీడు నన్నొక్కణ్ణి నమ్ముకున్నాడు. తప్పకుండా వీణ్ణి కాపాడి తీరాలని పరిగెత్తుకు వచ్చి కాపాడుతాడు.  

No comments:

Post a Comment