Monday, October 20, 2025

 

డేల్ కార్నెగీ నుంచి యండమూరి వరకు జీవితంలో ఎలా గెలవాలో, ఎలా విజయం సాధించాలో చెప్పారు కానీ, అసలు ఎలా బతకాలో, ఎలా జీవించాలో చెప్పిన వాళ్లు చాలా తక్కువ మంది.
యథార్థ జీవితం ఎలా ఉంటుందో మొహమాటం లేకుండా మొదట లోకానికి చాటిన వాడు నికొలొ మాకియవెలి. 
అచ్చ తెలుగులో ఆ విషయాన్ని ‘అక్షరం గుద్ది’ మరీ చెప్పిన వారు- కే.ఎన్.వై. పతంజలి.
116 పేజీల ఈ చిన్న పుస్తకంలోని యథార్థ జీవితపు ‘నిజాక్షరాలు’ మనసులో అలజడి రేపుతాయి..
ప్రతి వాక్యం, ప్రతి పదం, ప్రతి అక్షరం.. మనసు పుటల్లోకి చేరి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
మన లోపలి మనిషిని బయటకు లాక్కొస్తాయి..
‘మర్యాద’ ముసుగేసి మూలన కూర్చోబెట్టిన భావాల బూజు దులుపుతాయి.
మధ్య మధ్యలో ఆయా ప్రాంతపు సామెతలు.. చిన్న చిన్న పిట్టకథలు జీవిత వాస్తవాలను కళ్లకు కడతాయి. 

‘‘ఇతరులు మనల్ని చూసి ఆశ్చర్యపోతే మనకు లాభం.
ఇతరుల్ని చూసి మనం ఆశ్చర్యపోతే మనకు నష్టం’’

పుస్తకం పేరు: గెలుపు సరే.. బతకడం ఎలా? (2003)
రచన: కే ఎన్ వై పతంజలి

No comments:

Post a Comment