Wednesday, October 22, 2025

****ఆలోచించు !

 ఆలోచించు  !
    గమ్యం లేని జీవితం
    దారి తప్పిన ప్రయాణం  వంటిది  !
    లక్ష్యం లేని జీవితం 
    అగమ్య గోచరం   
    ఏ తీరం చేరుతుందో తెలియదు !
    విలువలతో ఎదగడం అనేది 
    బలమైన పునాది గల 
    ఇల్లు వంటిది.   !
    సాధించాలనే తపన ఉంటే 
    మనిషి ఎందాకైనా వెళతాడు   !
    స్తబ్దతలో కూర్చోవడం కంటే 
    శబ్దంతో కూడిన 
    జీవితం విలువైనది.   !
    సమస్య సమిష్టిది అయినప్పుడు 
    కలిసికట్టుగానే కదిలి 
    పరిష్కరించుకోవాలి.  !
    కష్టం లేకుండా ఫలితం రాదు 
    ఫలితాన్ని నిలబెట్టుకోవడానికి కూడా 
    కష్టపడాల్సి ఉంటుంది.  !
    జీవితానికి లక్ష్యం 
    ఏర్పరచుకున్న వారు
    ఎన్ని అడ్డంకులు ఎదురైనా 
    లెక్క చేయక అధిగమిస్తారు.   !
    జీవితం పట్ల పూర్తి అవగాహన ఉంటే 
    ఆలోచించి అడుగులు వేస్తారు.  !
    విలువలు తప్పిన సమాజంలో 
    విద్రోహులు పురుడు 
    పోసుకుంటారు.  !
    శిక్షలు లేని సమాజం లో 
    నేరస్తులు చెల్లరేగిపోతారు.  !
    పైపై మెరుగులకు ఆకర్షితులైతే 
    దీప కాంతికి ఆకర్షితమైన పురుగులా 
    ఆహుతి గాక తప్పదు. !
    స్వేచ్ఛ సమాజంలో 
    విచ్చలవిడితనం 
    అనర్థదాయకమైనది  !
    కష్టపడకుండా 
    అన్ని దేవుడిపై భారం వేసేవారు 
    బద్ధకస్తులుగా మారిపోతారు
    ఎందుకు పనికి రారూ
    అవమానాల పాలవుతారు.  !
    స్వశక్తి పై ఆధారపడిన వారు 
    ఎవరి సహాయానికి ఆశపడరు.   !
    కనువిప్పు కలగనంతవరకు 
    గతపు మంచి చెడులు అర్థం కావు.   !
    ఆదిపత్యపు ధోరణులు అన్నీ 
    అంతరించి పోవడానికే .!
    స్వార్థపు రాజకీయ చదరంగంలో 
    బలి అయ్యేవారు అమాయకులే.   !
    విచక్షణ వివేచణ లోపిస్తే 
    అంధకారమవుతుంది 
    జీవిత ప్రయాణం.  !
    మార్పు కావాలి అనుకుంటే 
    ముందుగా నువ్వు మారాలి.   !
    సుఖము శాంతి లోపించడమే 
    నరకమని గుర్తించుకోవాలి.   !
    ఆనంద జీవితానికి ఒత్తిడిని
    తగ్గించుకోవాలి    !
    మనం మంచి వారమే కావచ్చు 
    అందరూ అలాగే ఉంటారని
    ఊహించకు ఎప్పుడూ. !
    స్వార్థపు ఆలోచనలే 
    తప్పుడు మార్గంలోకి మల్లి స్తాయి.   !
    బాధ్యతలు అనేవి 
    కుటుంబం పట్లనే కాదు 
    సమాజ పరంగా కూడా ఉండాలి.   !
    ఎత్తు పల్లాలను సరి చేయనిదే 
    బ్రతుకు బండి సాఫీగా సాగదు.   !
    ఎవరో వస్తారు ఏదో చేస్తారని 
    ఎదురు చూసే  బదులు 
    ఆ వ్యక్తివి నువ్వే అయ్యి 
    సమస్యలు పరిష్కరించుకోవాలి.  !   !
                                 ___ రా జ్

No comments:

Post a Comment