Thursday, October 23, 2025

 కనిపించే *మనిషిని* మోసం చేస్తూ కనిపించని *దేవున్ని* మొక్కిన తర్వాత *మంచి* వాళ్ళము అయిపోము చేసిన *కర్మలు* వదిలి వెళ్లి కారణజన్ములము అయిపోము *సోమరితనం* లక్ష్యాలను చంపేస్తుంది *అహంకారం* మన ఎదుగుదలను ఆపేస్తుంది *భయం* కలలను చెరిపేస్తుంది *అనుమానం* ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తుంది *అసూయ* ప్రశాంతతను దూరం చేస్తుంది *కోపం* వివేకాన్ని అంతం చేస్తుంది .

      మీలోని ఆ అవలక్షణాలను వదిలించుకోవడం *మీ చేతుల్లో* మాత్రమే ఉందని గుర్తుంచుకోండి నువ్వు *గుడికి వెళ్లి గుండెలు* బాదేసుకున్నంత మాత్రాన *పూజలు* చేసి *పొర్లుదండాలు* పెట్టినంత మాత్రాన నువ్వు అడిగిన *ప్రతిదీ* నీకు అందదు నీకు ఎంత *అర్హత* ఉంటే అంతే దక్కుతుంది . 

      ఏమీ లేకుండా *పుట్టి* అన్ని కావాలని *పరిగెత్తి* ఏది *శాశ్వతం* కాదని తెలిసి *ప్రాణం* కూడా *సొంతం* కాదని *అర్థమై* ఏదో ఒక రోజు *ప్రపంచాన్ని* వదిలి దూరమవడమే *జీవితం* .

   *అందు* కలడు *ఇందు* కలడు ఎందెందు వెతికినా నీ *యదయందే* కలడు ఆ *పరమేశ్వరుడు*  మన *జీవితంలో* నిన్న ఒక *చరిత్ర* రేపు ఒక *రహస్యం* ఈరోజు అందమైన *బహుమతి*.
🙏🕉️🙏

No comments:

Post a Comment