🌹🌾🌹🌾🌹🌾🌹🌾🌹
*🌈🌺"ప్రణో దేవీ సరస్వతీ" అంటూ వాగ్దేవి వైభవాన్ని రుగ్వేదం సముచిత రీతిలో కీర్తించింది. తనకు నమస్కరించే వారినందరినీ కాపాడే "సరస్వతి" మనల్నీ కాపాడుతుందని దాని అర్థం🚩*.
*🌈🌺అజ్ఞానమనే చీకటిని దూరం చేస్తూ విజ్ఞాన కాంతి కిరణాలను నిరంతరం వెదజల్లే జ్ఞాన ప్రదాయిని సరస్వతీదేవి. సరస్వతి అంటే- అక్షరం, అక్షయం, ఆద్యంత రహిత శక్తిస్వరూపం. సరస్వతి అమ్మ వీణాపాణి, గీర్వాణి, వేదవాణి, వాక్కులరాణి. సర్వవిద్యలకు, సకల శాస్త్రాలకు అధిదేవత. సర్వత్రా వ్యాపించిన ఒక మహత్తర చైతన్యస్రవంతి*.
*🌺🌈బ్రహ్మాండపురాణం ప్రకారం- మాఘ శుద్ధపంచమి నాడు ఆవిర్భవించిన సరస్వతీదేవిని శరన్నవరాత్రి పూజల్లో మూల నక్షత్రం రోజున ప్రత్యేకంగా ఆరాధించడం దక్షిణాదిన ఆనవాయితీ. ఆరోజు ఆదిశక్తిని మహాసరస్వతి రూపంలో కొలుస్తారు. సరస్వతి తన నాలుగు చేతుల్లో పుస్తకం, మాల, నీటికుండ, వీణలను ధరించి ఉంటుంది*.
*🌈🌺పుస్తకం వేదాలకూ జ్ఞానానికీ ఆధ్యాత్మిక పరిపక్వతకూ చిహ్నం. స్పటికమాల నిరంతర ధ్యానసంపదకు ఆలవాలం. నీటికుండ లోకంలోని మంచిచెడుల విచక్షణకూ జ్ఞానామృతానికీ గుర్తు. 'కచ్చపి' వీణ ప్రపంచంలోని సకల సృజనాత్మక విజ్ఞానానికీ ప్రాతినిధ్యం వహిస్తుంది. సరస్వతీదేవిని పూజించిన వారికి విద్యాసంపదను, ధనధాన్యాలను ప్రసాదిస్తుందంటారు. అందుకే ఆ తల్లిని 'వాజేభిర్వాజినీవతీ, ధీనామ విత్ర్యవతు' అని రుగ్వేదం స్తుతించింది*.
*🌺🌈అమ్మ ధరించే ధవళ వస్త్రాలు స్వచ్ఛతకు, కమలం వికాసానికి సంకేతం. నీటిని వేరుచేసి హంస కేవలం పాలను మాత్రమే ఎలా స్వీకరిస్తుంది, అలా మనం కూడా చెడును వదిలేసి మంచిని మాత్రమే గ్రహించాలనే పరమార్థాన్ని హంసవాహనం సూచిస్తుంది.*
*🌺🌈చదువులతల్లి ప్రఖ్యాత ఆలయాలుగా కశ్మీర్లోని మహాసరస్వతి శక్తిపీఠం, శృంగేరిలోని శారదాపీఠం పేరొందాయి. తెలుగు రాష్ట్రాల్లోని బాసర జ్ఞానసరస్వతి, వర్గల్ విద్యాసరస్వతి, ఇందుపల్లి జ్ఞానసరస్వతి ఆలయాల వంటివి ఎంతో ప్రసిద్ధిగాంచాయి. సరస్వతీదేవిని బౌద్ధంలో మంజుశ్రీగాను, జైనంలో శ్రుతసదనగాను, షోడశ విద్యాదేవతగాను ఆరాధిస్తారు. మనదేశం నుంచి చైనా ద్వారా జపాన్ చేరిన సరస్వతి అక్కడ 'బెంజైటెన్' పేరుతో జ్ఞానదేవతగా పూజలందుకుంటోంది*.
*🌈🌺సరస్వతీ అమ్మ అనుగ్రహం వేదవ్యాసుడితో మహాభారతం రాయించింది. వాల్మీకితో రామాయణాన్ని, ఆదిశంకరాచార్యులతో కనకధారాస్తవాన్ని పలికించింది. త్యాగయ్యను నాదబ్రహ్మను, అన్నమయ్యను పదకవితా పితామహుడిని చేసింది. ఆదికవి నన్నయతో మొదలు పెట్టి ఎందరో కవులు తమ రచనలను సరస్వతీ ప్రార్ధనతోనే శ్రీకారం చుట్టారు. జ్ఞానజ్యోతిని వెలిగించే అక్షరాన్ని ఆరాధించడమే సరస్వతీ పూజ*.
*🌈'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార...' అంటూ పోతన స్తుతించినట్లుగా మనం కూడా నిత్యం సరస్వతి అమ్మను పూజిద్దాం. ఆమె కరుణాకటాక్ష వీక్షణాదులకు పాత్రులమవుదాం!🙏*
🍁🌈🍁🌈🍁🌈🍁🌈🍁
No comments:
Post a Comment