Saturday, October 18, 2025

 _*జీవితం అందమైన జన్మ*_
✳️🌹🥀🪷🌻✳️🌻🪷🌹🥀✳️

💫 *ఎదురయ్యే కష్టాదలను, సవాళ్లను తప్పించుకోవడంవల్ల ఒత్తిళ్లను, ఉద్రిక్తతలను తగ్గించుకోవచ్చుననే ఆలోచన తప్పు.  బాధ్యతల నుంచి తప్పించుకోవడంవల్ల శాంతి చేకూరదు. ఎదుగుదలా ఉండదు. మనిషి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ జీవనసమరంలో గెలుపు సాధించాలి.*

✅ *నిజమైన విజయం అంటే గొప్ప జీవితపాఠాన్ని నేర్చుకోవడం.* 

💫 మనిషి అనంతమైన స్వేచ్ఛవైపు అడుగులేయడం నిజమైన గెలుపు. అటువంటి విజయమే అసలైన ప్రశాంతతను కలిగిస్తుంది- తనకు, తన చుట్టూ ఉన్నవారికీ.

💫 చాలామంది రెండు పక్కలకు లాగిపట్టి ఉంచిన పరిస్థితిలో - ఒకలాంటి స్థితి స్థాపకతలో ఉంటారు. చేస్తున్నది ఒకటైతే, కోరుకునేది మరొకటి. కోరుకునేదానిపైన దృష్టి నిలపకపోవడం, చేయాల్సిన విధులనుంచి తప్పించుకోవడం!

💫 కష్టాలు మనిషి ఎదుగుదలకు అవకాశం కల్పిస్తాయి. భగవంతుడికి సమర్పణ భావంతో పనిలో నిమగ్నమైతే, ఆ ప్రక్రియలోనే గొప్ప ఉత్సాహం లభిస్తుంది. అంతకుమించి ఆనందం పొందే వీలుంటుంది. చేయాలనుకున్నది మనిషి అంతరంగ భావన. ఇతరులు రకరకాలుగా అనుకోవచ్ఛు విమర్శనాస్త్రాలూ సంధించవచ్ఛు దాన్ని పట్టించుకుంటే అడుగు ముందుకు పడదు.

✅ *పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని దూరం చేస్తుందని, దైవాన్ని అమితంగా ప్రేమిస్తే భయపడాల్సిన పని ఉండదని, ఆయనే తోడుగా నిలుస్తాడని పవిత్రగ్రంథాలు చెబుతున్నాయి. ఆ స్థాయి ధైర్యం కోసం పనిచేయడం చాలా ముఖ్యం.*

✅ *‘పరిస్థితులు ఎప్పుడూ తటస్థంగానే ఉంటాయి. మంచీ చెడు అనేవి అనుకూలమైనా, ప్రతికూలమైనా అవి మనోవైఖరిపైన ఆధారపడి ఉంటుంది’* అంటారు పరమహంస యోగానంద.

💫 *‘నువ్వు ఒకే నదిలో రెండోసారి కాలు పెట్టలేవు’* అంటారు గ్రీకు తత్వవేత్త హెరాక్లిటస్‌. 

✅ *ఒకసారి నదిలో కాలుపెట్టి తీసి మళ్ళీ కాలుపెట్టే వ్యవధిలో కొంత నీరు ప్రవహించేస్తుంది. అంటే, ఇప్పుడు అదే నది కాదు.* 

💫 అందుకే, ప్రతి క్షణం ప్రత్యేకం. పోల్చశక్యం కానిది. ముందున్న స్థితి, తరవాత ఉండదు. జీవితం అంతే. ప్రతిదీ ప్రవాహమే. ఆగడమనేది ఉండదు. చూసినప్పుడు అలాగే ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రతిదీ మార్పు చెందుతూ ప్రవహిస్తుంటుంది.

💫 నిరంతరం మార్పుచెందే ప్రపంచంలో శాశ్వతంగా ఒకేలా అతుక్కుని ఉండటం అంటే నరకాన్ని సృష్టించుకోవడమే. ఎప్పటికప్పుడు గ్రహణశక్తిని నవీకరించుకుంటూ సొంతమార్గాన్ని ఏర్పరచుకుంటూ సాగిపోతే స్వర్గమే.

💫 *గుంపులో ఉన్నప్పుడు ఎవరైనా ఒకటే. జీవించడంలోని ఆనందమేమిటో అనుభవించగలిగేది - గుంపును అధిగమించి ప్రత్యేకంగా నిలవగలిగినప్పుడు, భిన్నమార్గంలో నడవగలిగినప్పుడే.*

💫 మనిషి తన విశ్వాసం కన్నా, జనం చేత గుర్తింపు పొందడమే ముఖ్యమైన కోరికనుకుంటే.. తన ప్రశాంతత, సంతోషాల తాళం చెవులను ప్రపంచానికి అప్పజెప్పినట్లే. 'నేను - నా వ్యక్తిత్వం' అన్న ధోరణిలో దృష్టి నిలిపితే మచ్చలేని వ్యక్తిత్వం ఏర్పడుతుంది. భగవంతుడూ హర్షిస్తాడు.

💫 జీవితం ఎడతెగని పునర్జన్మ. ఎప్పుడూ మార్పుచెందే వాస్తవాలతోపాటు మనిషి గ్రహణశక్తీ పునర్జన్మ ఎత్తాల్సిన అవసరం ఉంది. 

✅ *‘నిన్న’ నిన్ననే ముగిసిపోయింది. ఈ రోజు కొత్త సూర్యోదయం!*

✅👉 *పుట్టడం, గిట్టడం... మనిషి నిర్ణయించలేడు.*

💫 *ఒకటి జరిగిపోయింది. రెండోది జరగాల్సి ఉంది.*

✅ *ఈ రెండింటి నడుమ ప్రతిదీ మనిషి చేసుకునే ఎంపికే. జీవితం అనేది ఎంపికల పరంపర తప్పితే మరేమీ కాదు!*
                                   
          ❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*


✳️🌹🥀🌻🪷✳️🌹🥀🪷🌻✳️

No comments:

Post a Comment