Tuesday, October 21, 2025

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ

   నాలుగు సంవత్సరాల ఒక విదేశీ పాప ఒకసారి ఆశ్రమ సేవకులతో  'ఈ ప్రపంచంలో నాకున్న మంచి స్నేహితులు రమణ భగవాన్ భక్తులే!' అని అన్నది.

   అందుకు ఆశ్రమ సేవకులు "అయితే భగవాన్?" అని అడిగారు. అందుకు ఆ పాప 'భగవాన్ ఈ ప్రపంచంలో లేడుకదా!' అని జవాబు ఇచ్చింది.

  ఇంత చిన్నపిల్ల దగ్గర నుంచి ఈ రకమైన జవాబు రావడం మహర్షికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అనుకోకుండానే మహర్షి వేలు మహర్షి ముక్కు మీదకు పోయింది. మహర్షి తన వేలు అలా ఉంచుకునే "ఎంత తెలివైన పాప! ఇంత చిన్నపిల్ల దగ్గర నుంచి ఎంత మంచి మాట! ఈ మాటలను చాలా గొప్పవాళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోవచ్చు" అని అన్నారు.

  తర్వాత మహర్షి, ఆశ్రమ సేవకులతో "మీరు ఆ పాపను ఆడగాల్సింది! భగవాన్ ఈ ప్రపంచంలో లేకుండా ఇంకెక్కడ వున్నాడని?" అందుకు ఆశ్రమ సేవకులు "మేము ఆ పాపని అడిగాము భగవాన్! భగవాన్ ఈ ప్రపంచానికి వెలుపల ఉన్నారు" అని జవాబు ఇచ్చింది.

No comments:

Post a Comment