*కోడి నుంచి KFC చికెన్ దాక !*
మాయాలోకం లో... మన పయనం !
తిరుపతి లో ఒక కుటుంబం ..
KFC చికెన్ అంటే వీరికి... ఎంత ఇష్టమంటే నెలకొక సారి చెన్నై కి వెళ్లి KFC చికెన్ ఎంజాయ్ చేసేవారు.
కేవలం KFC కోసమే... కారులో చెన్నై వెళ్లి వచ్చిన ... వారాంతాలు ఎన్నో!
KFC చికెన్ ఔట్లెట్ తిరుపతి కి వచ్చాక వీరు పండగ చేసుకొంటున్నారు ..
హైదరాబాద్ విమానాశ్రయం ..
ఎన్నో రెస్టురెంట్లు ..
KFC కిటకిటలాడుతుంటుంది .
ముప్పై ఏళ్ళు వెనక్కు వెళదాము .
KFC భారతీయ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది .
బెంగళూరులో రెస్టురెంట్ ఏర్పాటు .
భారతేదేశం లో పెద్ద ఎత్తున నిరసనలు .
దీనితో KFC మన దేశం నుంచి నిష్క్రమించింది .
ఆ రోజుల్లో KFC ని ఎందుకు వ్యతిరేకించారో ... ఇప్పటి తరానికి కనీసం తెలియదు .
నిరసనలు సద్దు మణిగాక... KFC ... 1999 లో తిరిగీ భారత్ లో ప్రవేశించింది .
ఇప్పుడు దేశ వ్యాపితంగా 300 దాక ఔట్లెట్ లు ఉన్నాయి.
ఇప్పటి తరానికి చికెన్ అంటే... KFC .
అన్నట్టు 1990 ల లో KFC వివాదం ... సివిల్స్, గ్రూప్ - 1 పరీక్షల్లో ఇంపార్టెంట్ ప్రశ్న .
టేస్ట్ !
ఏది గొప్ప ?
*"పైన ఎండిన చికెన్ లాగా .. లోన ఉడికీ ఉడకకుండా"*
... ఇదీ చికెన్ పై నాటి తరం విమర్శ.
*"క్రాంచీ అవుట్ సైడ్ .. జ్యూసీ ఇన్ సైడ్ .. "*
నేటి KFC స్లోగన్ .
ఏదైతే దాని లోపం అనుకున్నారో... దాన్నే... ఆ కంపెనీ వాడు తన స్పెషలిటీ అని ప్రకటించుకున్నాడు .
మీరు నాన్ వెజ్ తింటారా ?
అయితే మొసలి గుడ్డును .. పచ్చిగా తాగుతారా ?
ఒక దేశంలో క్రొకోడైల్ పార్క్ ఉంది.
అక్కడ చిన్నవి పెద్దవి కలుపుకొని వేల సంఖ్యలో మొసళ్ళు .
అదే పార్క్ లో క్రొకోడైల్ రెస్టురంట్ ..
అక్కడ అన్నీ మొసలి మాంసం తో.. గుడ్డు తో... చేసిన వంటకాలే .
మొసలి మాంసం తినడం అనే ఆలోచనే నాకు... వాక్ అనిపించింది .
నాకెదురుగా ఒక లండన్ వాసి .
మొసలి గుడ్డు తీసుకొన్నాడు .
నా కళ్ళకెదురుగా దాన్ని కొట్టి తాగి .. నోరు చప్పరిస్తూ *"యమ్మీ"* అన్నాడు .
టేస్ట్ అనేది వ్యక్తిగత విషయం...
మనం జపాన్ ఫుడ్ తినలేము .
జపాన్ వాళ్ళు మన ఫుడ్ అంటే భయపడుతారు.
ప్రతి సమాజం ఫుడ్ విషయం లో... టేస్ట్ విషయం లో తన కొత్త తరానికి బ్రెయిన్ వాష్ చేస్తుంది .
చిన్నపటి నుంచి ఏది అలవాటు చేస్తే అదే టేస్టీ అనిపిస్తుంది .
బాల్యం లో తిన్న ఫుడ్.. అమీజిల్డా ... ఆర్బిట ఫ్రంటల్ కార్టెక్స్... గష్టటోరీ కార్టెక్స్... లాంటి మెదడు భాగాలపై ప్రభావం చూపి వాటిని గుర్తుంచుకునేలా చేస్తుంది .
బాల్యం లో ... తిన్న ఫుడ్ .. దాని టేస్ట్... జీవిత కాలం ఫేవరేట్ ఫుడ్ గా మిగిలిపోతుంది .
ఇది సైన్స్ .
KFC , మెక్డొనాల్డ్ లాంటి మల్టీనేషనల్ ఫుడ్ కంపెనీ లు దీని ఆధారంగానే పని చేస్తాయి .
అదే వారి మార్కెటింగ్ విధానం .
చిన్నప్పుడే పిల్లలను ఆకట్టుకుంటే వారు తమ జీవితాంత కస్టమర్స్ గా మిగిలిపోతారు .
సమస్య ఎక్కడ ?
రుచి అనేది వ్యక్తిగతం .
యాభై దాటిన వారికి KFC చికెన్ టేస్ట్ నచ్చక పోవచ్చు .
టీన్ ఏజ్ లో ఉన్నవారికి చికెన్ అంటే KFC .
టేస్ట్ బట్టి ఫలానా ఫుడ్... గొప్ప లేదా చెత్త అని చెప్పకూడదు .
ఎవరి టేస్ట్ వారిది .
అందులో ఆక్షేపించాల్సిన అవసరం లేదు .
ఏమి తింటున్నాము? .. దానిలోని పోషకాలు ఏంటి??
... అనేది మాత్రం ముఖ్యం . .
విమానాశ్రయం లో తిన్నా..
దుబాయ్ లోని పామ్ జుమారా హోటల్ లో తిన్నా ..
కోటీశ్వరుడు అయినా ..
బీద అయినా ..
ఏ దేశం అయినా ...
మానవ శరీర నిర్మాణం స్థూలంగా ఒక్కటే .
మన శరీరానికి తెల్సిన భాష.. పోషకాలే.
*మీకు తెలుసా ?*
KFC లో దొరికే చికెన్ { ఆ మాటకొస్తే అనేక ఫుడ్ జాయింట్స్ లో కూడా } వియత్నాం లేదా అమెరికా... బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకొంటారు .
ఒకప్పుడు .. ఇంట్లో కోళ్లు పెంచుకొనే వారు .
ఆ కోళ్లు సహజ సిద్ధమయిన ఆహారం తినేవి .
ఇప్పుడు నాటు కోళ్లు తగ్గిపోయాయి .
వాటి గుడ్లను సూపర్ మార్కెట్ లో *"బ్రౌన్ ఎగ్స్"* పేరుతొ ఎక్కువ ధరకు అమ్ముతున్నారు .
... ఎందుకంటే వాటిలో పోషకాలు ఎక్కువ .
ఇంటికి గెస్ట్ వస్తే .. లేదా కోడి కూర కావాలనుకున్నప్పుడు కోడి ని పట్టి కోసి వండేవారు .
మూడు గంటల్లో కోడి నుంచి కోడి కూర దాక .
ఇప్పుడో ?
వియత్నాం నుంచో అమెరికా నుంచో కోడి మాంసం రావాలి.
అక్కడ కోళ్లను కత్తిరించి శుభ్రం చేసి ప్యాక్ చేస్తారు .
అటు పై కోల్డ్ స్టోరేజ్.
విమానంలో లేదా ఓడలో వాటిని ఇండియా కు రవాణా చేస్తారు .
ఇండియా లో వివిధ ఔట్లెట్ కు భూ మార్గం లో రవాణా .
అక్కడ నిల్వ .
చివరిగా KFC చికెన్ వంటకాల తయారీ .
వియత్నాం లో కోడి ని చంపిన సమయం నుంచి అది బెంగళూరు లో KFC చికెన్ ప్రియుడి ప్లేట్ లో డిష్ గా మారడం వరకు మధ్య టైం గ్యాప్ ఎంత ?
తెలియదు .
తెలుసుకోవలసిన అవసరం లేదు .
ఇదీ నేటి ప్రపంచం !
పాతరోజుల్లో అయితే కోడి నుంచి కోడి కూర దాక మూడు గంటలు .
ఇప్పుడు KFC లో ..
15 రోజులు ?
నెల ?
ఇంకా ఎక్కువ ?
అడిగేవాడెవ్వడు ?
చెప్పాల్సిన అవసరం వాడికేముంది ?
మాంసం త్వరగా కుళ్ళి పోతుంది .
అలాంటిది రెండు నుంచి నాలుగు వారాల్లో ... ఎంత బాగా డీప్ ఫ్రీజ్ చేసినా ... నాణ్యత దెబ్బతినదా?
డీప్ ఫ్రీజ్ చెసిన వంటకాలు ఒంటికి మంచివేనా ?
ఎవడూ అడగడు .
నాలాంటోడు పనీపాటలేక చెప్పినా .. *"అంటే మనం తినే హోటల్ లో చికెన్ డీప్ ఫ్రీజ్ నుంచి వచ్చింది కాదా?"* అని ప్రశ్న .
పక్కోడు పనికిమాలినోడు అయితే ... మన పనికి మాలిన తనం జస్టిఫై అయినట్టే .
ఇదే నేటి నీతి.
*ఫ్రోజెన్ ఫుడ్ .. సమస్యలు* :
పోషకాలు పోతాయి .
ముఖ్యంగా నీటిలో కరిగే విటమిన్స్ .
కొన్ని సార్లు ఫ్రోజెన్ ఫుడ్స్ కు సోడియం కలుపుతారు .
ఎక్కువ సోడియం ఆరోగ్యానికి హానికరం .
బిపి కలుగ చేస్తుంది .
ఫ్రోజెన్ ఫుడ్ లో కృత్రిమ పదార్థాలు కలుపుతారు .
ఇది గట్ హెల్త్ ను దెబ్బతీస్తుంది .
ఉదరం లో మంచి చేసే బాక్టీరియా చనిపోతే జీర్ణ సమస్యలు .. మెంటల్ హెల్త్ కూడా దెబ్బ తింటుంది .
చద్దన్నం... ప్రో బయోటిక్ ఫుడ్ .
గట్ హెల్త్ ను కాపాడుతుంది .
KFC... ఫ్రోజెన్ ఫుడ్ .
గట్ హెల్త్ కు మంచిది కాదు .
చద్దన్నం తిన్నోళ్లు అనాగరికులు.. చదువు సంధ్య లేని పల్లెటూరోళ్ళు .
మోడరన్ డ్రెస్ లో KFC ఔట్లెట్ కు వెళ్లి కోక్ సిప్ చేస్తూ... చికెన్ తిన్నోళ్లు... ట్రెండీ... నాగరికులు .
ఫుడ్ తింటూ దానితో బాటే అతి చల్లని డ్రింక్ తాగితే ఆరోగ్యం ఎంత సర్వనాశనం అయిపోతుందో తెలుసుకోలేని... తెలివితేటలు.
మనం ఎంత ప్రగతి సాధించామో ఆలోచించండి .
ఇక్కడ KFC అనేది కేవలం ఉదారణకు మాత్రమే .
పిజ్జా లు ... బర్గెర్ లు... సాఫ్ట్ డ్రింక్స్... KFC కంటే 100 రెట్లు ఆరోగ్యం పై ఎక్కువ నెగటివ్ ప్రభావం చూపుతాయి .
*కొన్ని ప్రశ్నలు*:
*1*. మన ఆహార అలవాట్లు ఇంతలా మారడానికి కారణం ఏంటి ?
మనంత మనమే మారిపోయామా?
లేక ఒక ప్రణాళిక ప్రకారం...
ప్రకటనలు... మీడియా పరోక్ష సహకారం ద్వారా మన బ్రెయిన్ వాష్ చేసారా ?
చిన్నప్పుడు మంచి ఆహారం తీసుకొన్న యాభై వయసు వారే .. ఇప్పుడు లివర్ బోరింగ్ కు తెచ్చుకొని ముప్పై - ఎనభై లక్షలతో కొత్త లివర్ ను వేయించుకొంటున్న పరిస్థితి .
అమ్మ ఒడి దిగక ముందే జంక్ ఫుడ్ తింటున్న కొత్త తరం పిల్లల భవిష్యత్తు ఏంటి ?
*2*. జంక్ ఫుడ్ ... ఎక్కడ విస్తరిస్తే అక్కడ ఆసుపత్రులు .. డయాగ్నస్టిక్ సెంటర్ లు... ఫార్మా కంపెనీ లు పెరుగుతాయి ... ఎందుకు?
*3*. ఫుడ్ జాయింట్స్ , ఫార్మా కంపెనీ లు .. స్టార్ ఆసుపత్రులు .. ఇప్పుడు ఇవన్నీ విదేశీ ఈక్విటీ చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి .
పేరు- ప్రఖ్యాతులు... పరువు- ప్రతిష్ట అని ఎంతో కొంత నైతికత పాటించేవారి చేతుల్లోనుంచి... ఆసుపత్రి విదేశీ కంపెనీ వాడి చేతికి వెళ్ళిపోతే... దోపిడీ మామూలుగా ఉంటుందా ?
మన చుట్టూరా ఎన్ని జరుగుతున్నాయి ?
*4*. చివరిగా ఒక ప్రశ్న .
నా అమాయకత్వాన్ని మన్నించండి .
ఒక కోడిని ..
పోనీ లక్ష కోళ్లను..
స్థానికంగా కొను గోలు చేస్తే తక్కువ రేట్ ?
లేదా అమెరికా నుంచో... బ్రెజిల్ నుంచో .. షిప్ లోనో విమానం లోనో రవాణా చేసుకొంటే తక్కువ ఖర్చు?
ఒకప్పుడు ఫుట్ పాత్ పై కాయగూరలు అమ్మేవారు .
కిరానా షాపుల్లో సరుకులు .
ఇప్పుడు పెద్ద మాల్స్ .
అక్కడ సెంట్రలైజడ్ ఏసీ.
మోడల్స్ లా వారికి దుస్తులు .
ఇంత చేస్తే మాల్ల్స్ లో దొరికే ఫుడ్ చీప్ అని మనం అనుకొంటున్నాము .
ఈ మాయ ఏంటి ?
అంత ఖర్చు పెట్టి భారీ డిస్కౌంట్స్ కు ఎలా అమ్ముతున్నారు ?
పావలా కోడికి ఎనిమిది అణా ల మసాలా అంటే ఇదేనా ?
ఎవడూ మాట్లాడాడు .
ఎవడైనా మాట్లాడితే వాడు మహిళా ద్వేషి .. హాఫ్ నాలెడ్జి గాడు అయిపోతాడు ..
సోషల్ మీడియా లో దాడులు జరుగుతాయి.
ఎందుకు ?ఆలోచించండి .
ముఖ్యంగా పిల్లలో ఆలోచించే... ప్రశ్నించే తత్వాన్ని... అలవాటు చెయ్యండి .
గుడ్డిగా ఫాలో అయ్యేవాడు బకరా .
ట్రెండ్ సెట్ చేసేవాడు నాయకుడు .
మీ పిలల్లు లీడర్స్ కావాలా ?
లేక బకరాలు ?
క్రిటికల్ థింకింగ్ లేక పొతే చెల్లించుకొనే మూల్యం మామూలుగా ఉండదు .
. కనుక భావితరాలకు మంచిని మాత్రమే నేర్పుడం పెద్దల కర్తవ్యం అది ఫుడ్ గానీ సంస్కృతి,సాంప్రదాయం,నడవడిక లేదా విలువలు కట్టుబాట్లు సంస్కారం అనేది....
No comments:
Post a Comment