Thursday, October 23, 2025

Punarjanama fact | Hindu Dharma scientific facts telugu | Dharma the Hindu |

Punarjanama fact | Hindu Dharma scientific facts telugu | Dharma the Hindu |


https://youtu.be/oJKTPqCKx_g?si=PioC0iK4GzIbOavT


చనిపోయిన వ్యక్తి బ్రతికితే ఎలా ఉంటుంది ఒక బాబు రోడ్డు మీద ఆడుకుంటూ కారుకి అడ్డంగా పడితే మొండం నుంచి తలభాగం వేరుపడి ఆ బాలుడు చనిపోతే మళ్ళీ బ్రతికించినటువంటి సంఘటన మీరు చూసే ఉంటారు ఇది ఇజ్రయేల్ లో జరిగింది. అయితే దీనికన్నా మించినటువంటి చాలా మిస్టీరియస్ సంఘటనల గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ అండ్ డాక్టర్ జిమ్ టక్కర్ లాంటి పరిశోధకులు కొన్ని వందల పైగా కేసుల్ని డీల్ చేశారు. అసలు పునర్జన్మ ఉందా మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మిస్తాడా లేదా కామెంట్ లో రాయండి. అయితే వీళ్ళు మూడు నుంచి ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని కొన్ని వందలకు పైగా కేసుల్ని నమోదు చేయడం జరిగింది. అమెరికాకు చెందినటువంటి ఒక చిన్నారి జేమ్స్ లెనింజర్ 2000 సంవత్సరంలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అతడు ఏం చెప్పాడంటే తను ఒక విమానాన్ని చూసి నేను గత జన్మలో యుద్ధ విమానం నడుపుతుండగా యుద్ధ విమానంతో పాటు పసిఫిక్ సముద్రంలో కిందపడి కూలిపోయి చనిపోయానని చెప్పాడు. వాస్తవానికి వస్తే అతను చెప్పినటువంటి పైలెట్ పేరు గాని పసిఫిక్ సముద్రంలో కూలిపోయినటువంటి విమానం పేరు గాని కూలిపోయి పడిపోయినటువంటి విమానంలో ఇంకా తెలియనటువంటి రహస్యాల గురించి కూడా తను చెప్పడం జరిగింది. అంత చిన్న వయసులో విమానం గురించి ఏమాత్రం కూడా తెలియనటువంటి నాలెడ్జ్ ని కూడా షేర్ చేస్తూ తెలియజేశాడంటే తను చెప్పింది నిజమా కాదా అని ఇయన్ స్టేమిన్సన్ అనే శాస్త్రవేత్త ఈ కేసుని డీల్ చేస్తూ తను కూడా ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడం జరిగింది. ఎక్కువగా మూడు నుంచి ఆరేళ్ల పిల్లలే గతజన్మ జ్ఞాపకాలు గుర్తించగలుగుతున్నారని డాక్టర్ ఈఎన్ స్టీమ్సన్ తన యొక్క డిక్షనరీలో రాయడం జరిగింది. వరల్డ్ వార్ 2 లో నిజంగా కూలిపోయినటువంటి యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని రీసెర్చ్ చేయగా అతను చెప్పినటువంటి పైలట్ పేరు గాని కలర్ గాని ఆ యుద్ధ విమానం మోడల్ నెంబర్ తో పాటు ఆ విమానంలో ఉన్నటువంటి లోపాలను కూడా తెలియజేస్తూ తను చెప్పినటువంటి ఆధారాన్ని పోల్చి చూడగా నిజమేనని తేలింది. ఢిల్లీకి చెందినటువంటి శాంతిదేవి 1926వ సంవత్సరంలో జన్మించింది. ఆమె చెప్పినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అప్పట్లో చాలా దుమారమై రేపింది. తను మూడేళ్ల వయసు నుంచి కూడా తన తల్లిదండ్రులతో ఏం చెప్తుందంటే ఇది తన ఇల్లు కాదని తనకు మధురాలో ఇంకొక ఇల్లు కూడా ఉందని తనక ఒక భర్త కూడా ఉన్నాడని తను ఒక బాబుకి కూడా జన్మని ఇచ్చిందని చెప్పడం జరిగింది. 1930 వ సంవత్సరంలో ఈమె చేసినటువంటి వాక్యాలకి అప్పట్లో గాంధీ గారు కూడా ఈమె చెప్పినటువంటి విషయాలు వాస్తవమా కాదా అని చెప్పి ఒక హై కమిటీని నిర్మించడం జరిగింది. అలాగే ఇక్కడ తను ఆసక్తికరంగా తన భర్త పేరు కేదార్నాథ్ గాను తన తల్లిదండ్రులు పెట్టిన పేరు శాంతిదేవి. కానీ తను చెప్పుకునేటువంటి పేరు లుబ్ది దేవి గాని తనక ఒక బాబు కూడా ఉన్నాడని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ తాను చెప్పినటువంటి విషయాలు వాస్తవమా కాదా అని తెలుసుకోవడానికి తను నిజంగా మధురాయికి తీసుకు వెళ్ళగా తను మార్గ మధ్యంలోనే తన ఇంటిని గుర్తుపట్టడం జరిగింది. అక్కడ కొంతమంది వ్యక్తుల్ని లైన్ లో నించోబెడితే తన భర్తని కూడా తను గుర్తుపెట్టడం జరిగింది. ఇక్కడ కీ పాయింట్స్ ఏంటంటే తాను నిజంగా ఇంటి మూల మూలకి వెళుతూ తాను గత జన్మలో ఉంచినటువంటి వస్తువులను కూడా గుర్తుపట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఆసక్తికరంగా తాను మరణించిన విధానం కూడా తెలియజేయడం జరిగింది. అయితే తను ఒక కుమారుడికి ప్రసవిస్తూ మరణించినట్టుగా తను చెప్పడం జరిగింది. ఇక్కడ వాస్తవంగా కేదార్నాథ్ అనే వ్యక్తి తన యొక్క భార్య పేరు లుక్దీదేవి గాను తాను నిజంగానే తన యొక్క భార్య ప్రసవిస్తూ చనిపోయినట్టుగాను ఈ విషయాలు ఆశ్చర్యకరంగా తాను కూడా వెల్లడించడం జరిగింది. అయితే ఇక్కడ అతను కూడా ఇంకా ఆమె చెప్పినటువంటి కొన్ని కొన్ని విషయాలు తనికి చేయగా నిజమని తేలింది. స్వర్ణలత మిశ్ర 1948వ సంవత్సరం ఒక మధ్యప్రదేశ్లోని సహోదల్లో జన్మించింది. ఇక్కడ ఆమె తన యొక్క తల్లిదండ్రులతో చిన్నతనం నుంచి కూడా వంతగా మాట్లాడేది. నా ఇల్లు కతిరినే అని ఊర్లో ఉంది కదా నేను ఇక్కడ ఎలా జన్మించాను నాకు మరి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు కదా అంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన యొక్క భర్త ఒక ప్రసిద్ధ బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగాను తను పాటలు పాడటం డాన్స్ చేయటం చాలా ఇష్టమని చెప్పింది. ఇక్కడ తన మరణం గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలు కూడా తెలియజేయడం జరిగింది. తనకు గర్భం వచ్చినప్పుడు చాలా అనారోగ్యంతో మరణించినట్టుగా ఆమె తెలియజేయడం జరిగింది. ఇయాన్ స్టీవెన్సన్ అనే శాస్త్రవేత్త ఆమె చెప్పినటువంటి వాక్యాలని ఆమె చెప్పినటువంటి విషయాలు వాస్తవమా కాదా అని తెలియజేయడం కోసం తను రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాడు. ఆమె చెప్పినటువంటి ఊరు పేరు కుటుంబం నిజంగా ఉన్నాయా అని పరిశీలించగా శ్రీదేవ్ పాండే అనే వ్యక్తి నిజంగానే ఆ ఊరిలో ఉన్నాడని ఆమె యొక్క భార్య పేరు బియా పాండే అని ఆమె కొన్ని సంవత్సరాల క్రితం గర్భంతో మరణించినట్టుగా శ్రీదేవ్ పాండే అనే వ్యక్తి చెప్పడం జరిగింది. స్వర్ణలత అనే ఆమెను ఆ గ్రామానికి తీసుకువెళ్ళగా ఇక్కడ తను తన యొక్క భర్తను గుర్తుపట్టడమే కాకుండా ఆమె యొక్క ముగ్గురు పిల్లల్ని కూడా పేరు పేరున పిలవడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ ఈ కేసు ను కూడా 20 కేసెస్ సజెస్టివ్ ఆఫ్ రీఇన్క్రిేషన్ పుస్తకంలో రికార్డ్ చేశారు. అలాగే శ్రీలంకలోని ఒక బాలుడు తను గత జన్మలో తన చాతి మీద కత్తిపోటుతో గురై చనిపోయినట్టుగా తను చెప్తున్నాడు. తను శ్రీలంక లోని 1960 సంవత్సరంలో ఈ కేసు ని రికార్డు చేయడం జరిగింది. అయితే ఆశ్చర్యకరంగా తాను చూపించినటువంటి ప్లేస్ లోనే అంటే చాతి మీద ఆ చాతి మీదే తనకు ఒక పెద్ద పుట్టుమచ్చు కూడా ఉంది. నన్ను గత జన్మలో ఒక వ్యక్తి ఇక్కడ నన్ను పొడిచి చంపేశాడు. మీరు గనుక ఆ గ్రామానికి తీసుకువెళ్తే నేను దారి చూపిస్తాను. అలాగే ఆ వ్యక్తిని కూడా నేను చూపించగలను అని చెప్పాడు. ఈ బాలుడు చెప్తున్నటువంటి విషయం వాస్తవమా కాదా అని తెలియజేయడం కోసం ఆ తల్లిదండ్రులు ఆ గ్రామాన్ని తీసుకెళ్ళడం జరిగింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని అడగగా కొంత కాలం క్రితం నిజంగానే ఒక వ్యక్తి కత్తిపోటుతో మరణించాడని తెలిసింది. అలాగే తనని పోల్చినటువంటి వ్యక్తి వివరాలు కూడా చెప్పడం జరిగింది. తాను గత జన్మలో చెప్పినటువంటి ఆధారాలు కానీ సంఘటనలు కానీ తన యొక్క ఇల్లును కానీ తన యొక్క కుటుంబం కానీ తన యొక్క గ్రామం కూడా తను గుర్తించడం జరిగింది. ఈ విషయాన్ని కూడా ఇయన్ స్టీమ్సన్ తన యొక్క బుక్ లో రికార్డ్ చేయడం జరిగింది. కమల అహ్మద్ టర్కీలో 1960 వ సంవత్సరంలో తను ఒక గ్రామంలో నివసిస్తున్నప్పుడు రోడ్డు ప్రమాదంలో తను మృతి చెందినట్టు చెప్పడం జరిగింది. తన యొక్క తన ఇంటిని బంధువులను తన యొక్క తల్లిదండ్రులను అలాగే తన యొక్క ఊరిని కూడా చూపించడం జరిగింది. ఆ బాలుడి యొక్క మాటలు విని కుటుంబ సభ్యులు కూడా షాక్కు గురయ్యారు. ఎందుకంటే ఆ బాలుడు చెప్పినటువంటి విషయాలు అన్నీ కూడా సరిగ్గా సరిపోయాయి కాబట్టి. ఈ విషయాన్ని కూడా ఈయఎన్ స్టీమ్సన్ తన యొక్క బుక్లో రికార్డ్ చేయడం జరిగింది. కేవలం ఈ యొక్క ఐదు కేసులే మాత్రమే కాకుండా వందలకు పైగా కేసెస్ ని ఆయన డీల్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి డాక్యుమెంట్ చేసినటువంటి రియల్ ఇన్సిడెంట్స్. ఈరోజు చెప్పుకున్నటువంటి ఈ యొక్క రీబర్త్ ఇన్వెస్టిగేషన్ ఏవైతే ఉన్నాయో ఈ ఐదు కేసులు కూడా హిందూ మరియు బౌద్ధమతంలో ఈ యొక్క పునర్జన్మ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో విశ్వాసాలకి కూడా ఒక మంచి బలాన్ని ఆధారాన్ని చేకూరుతున్నాయి. ఇంతవరకు కూడా ఈ వీడియోని చూశారంటే మీకు వర్త్ అనిపించే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. ఇటువంటి టాపిక్స్ గురించి ఇంకా మీ అభిప్రాయాన్ని ఇంకా కామెంట్ లో రాయండి. అలాగే Instagram ఐడి ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ కూడా ఫాలో అవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ని చేయడానికి ప్రయత్నిస్తాను. జై హింద్ జై భారత్ వందేమాతరం

No comments:

Post a Comment