జగద్గురు శ్రీకృష్ణుడు చేసిన సాధనలు- సాందీపన మహర్షి || Untold Secrets: Krishna Became Jagadguru
https://youtu.be/tmQjPzc0-ro?si=shGxH-G6XQoSRhEk
కృష్ణ ఈ శబ్దం చెవుల్లో ధ్వనించగానే ఒక అద్వితీయమైన తేజస్వితమైన రూపం కళ్ళ ముందు ప్రతిబింబిస్తుంది. సమస్త బ్రహ్మాండం యొక్క తేజస్సు మరియు పురుషార్థం నిండి ఉన్న ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కళ్ళ ముందు సాకారంవుతుంది. ఒకవైపు సంపూర్ణ శుద్ధమైన ప్రేమతత్వం సంపూర్ణ భౌతిక జీవనం జీవించిన రారాజు మరోవైపు సాక్షాత్తు బ్రహ్మమయమైన గొప్ప యోగి శ్రేష్టమైన ఋషులు మునులు సైతం తన చరణాల చెంత చేరాలని తపిస్తారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమయి పశ్యతి అన్ని ధర్మాలను త్యాగం చేసేసి నా శరణలోకి వచ్చేయి మరియు ఎవరైతే నన్నే సర్వమని భావించి నాపై దృష్టి నిలుపుతారో వారిని సర్వ విధాలుగాను రక్షిస్తాను. ఈ రకమైన మాటల్ని ఎవరైనా సామాన్య వ్యక్తి అనగలడా ఎవరైనా సామాన్య వ్యక్తి ఈ రకమైన ఖచ్చితమైన భరోసా ఇవ్వగలడా ఇవ్వలేడు ఎవరైతే సాక్షాత్తు పూర్ణ పురుషోత్తముడో ఎవరైతే సాక్షాత్తు బ్రహ్మమును ఆత్మ యందు కలిగి ఉన్నాడో ఆ వ్యక్తిత్వమే ఈ రకమైన భరోసా ఇవ్వగలడు. అయితే శ్రీకృష్ణుడు ఇంతటి శ్రేష్టమైన స్థాయికి ఎలా చేరుకున్నాడు ఇంతటి స్థాయికి చేరుకోవడానికి శ్రీకృష్ణుడు చేసిన సాధనల్లో తన గురువైన సందీపన మహర్షి స్వయంగా సాధన చేయించిన ఐదు సాధనలు ఏమిటి? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుంటారు. వీడియో నచ్చినట్లైతే లైక్ చేసి షేర్ చేయండి. ద్వాపర యుగ సూత్రధారి అయిన శ్రీకృష్ణుని ఉపనయన సంస్కారాల తర్వాత వారి కుల గురువైన గర్గ మహర్షి ఒక విషయం గురించి చింతించసాగాడు. అదేంటంటే ఏ గురువు వద్దకు పంపించినట్లయితే శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తముడుగా మహోన్నత వ్యక్తిత్వంగా తయారవుతాడో అన్న విషయం గురించి చింతించసాగాడు. ఇంకో విషయం ఏంటంటే గర్గ మహర్షి తానే స్వయంగా ఒక యోగి ఈ విషయం తెలియక కాదు. కానీ శ్రీకృష్ణుని ఒక యుగ పురుషునిగా తయారు చేయాలన్నా పురాణ పురుషునిగా తయారు చేయాలన్నా సోడశ కళాపూర్ణుడిగా తయారు చేయాలన్నా తనకంటే శ్రేష్టమైన గురువు వద్దకు పంపాలని గర్గ మహర్షి నిశ్చయించుకున్నాడు. మరియు ఆ కాలంలో ఉజయని ప్రాంతంలో ఉంటున్న సాందీపన మహర్షి అందరికంటే సమర్థవంతుడు మరియు యోగ్యమైన గురువు అనే విషయం గర్గ మహర్షికి తెలుసు. అందుకే శిక్షణ మరియు దీక్ష కొరకు శ్రీకృష్ణుని సందీపన మహర్షి వద్దకు పంపడం జరిగింది. భగవాన్ మహాకాలుని నగరం ఉజ్జయని జలజలా పారుతున్న క్షిప్రా నది చుట్టూ వినిపిస్తున్న మంత్రధ్వని యజ్ఞాల్లో నుండి పైకి లేస్తున్న ధూమ్రము స్వాహా స్వాహా అనే రాగధ్వనులు వేద మంత్రాల ఉచ్చారణ అదే క్షిప్రా నది వడ్డున సాందీపన మహర్షి ఆశ్రమము సాన్నిపన మహర్షి స్వరూపము ఉన్నతమైన కురులు పొడవాటి ఊగుతున్న గడ్డము తపస్శక్తితో బంగారు వర్ణ సమానమైన ముఖము కళ్ళలో సూర్యుని తేజస్సు ఒకరోజు ప్రాతఃకాలమున గురు సాందీబనుడు తన దైనందిన సాధన పూర్తి చేసుకొని కుటీరం నుండి బయటకు వస్తాడు. ఎదురుగానే వినమ్ర భావంతో ప్రణామం చేస్తూ గురు చరణాలను స్పర్శించి తనను తాను సంపూర్ణంగా గురు చరణాలకు సమర్పిస్తున్న ఒక బాలుడు దాంతో గురు సాందీపనుడు లే బాలక ఎవరు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అంటాడు. శ్రీకృష్ణుడు తనను పరిచయం చేసుకుంటూ నేను యదుకుల వంశానికి చెందిన కృష్ణుడను నేను గోకులమైన బృందావనం నుండి వచ్చాను మీరే నా గురువులు మీరే నాకు దీక్షను ప్రసాదించగలరు అన్నాడు. సాందీపన మహర్షి శ్రీకృష్ణుని తీక్షణంగా చూస్తాడు. శ్రీకృష్ణుని చూపులు కిందికి ఉన్నాయి. సాందీపన్ మహర్షి మనసులోనే ప్రసన్నుడు అవుతూ అయినా గాని బయటికి తనను తాను నియంత్రించుకుంటూ కొద్దిగా గట్టి స్వరంతో ఓ బాలకా ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏం బృందావనం మధుర నుండి ఉజ్జయని దాకా మధ్యలో ఋషులు గాని మునులు గాని లేరా మీ తల్లిదండ్రులు అక్కడ నీకు ఎటువంటి శిక్షణా సౌకర్యాలు కల్పించలేదా నువ్వు నా వద్దకు యదువంశ రావకుమారుడిగా వచ్చావా లేక లేక ఒక విద్యార్థిగా వచ్చావా నువ్వు చూడడానికి చాలా మృదువైన శరీరంతో కోమలమైన చేతులతో ఉన్నావు. ఈ గురుకుల మర్యాదలన్నీ పాటించగలవా నాలుగు రోజులకే తిరిగి వెళ్ళిపోవు కదా ఇక అతి ముఖ్యమైన విషయం నీ జీవిత లక్ష్యం ఏంటి అని అంటాడు. శ్రీకృష్ణుడు మెల్లగా తన తల పైకెత్తి గురువు యొక్క కళ్ళలోకి చూస్తూ గురుదేవా నేను నా తల్లిదండ్రుల అనుమతితోనే మీ వద్దకు వచ్చాను. నేను మీ నుండి విద్యను నేర్చుకోవడానికి వచ్చాను మరియు నేను మీ నుండి సాదా సీదా విద్యలను కోరుకోవడం లేదు నేను ఒక అద్వితీయమైన జ్ఞానాన్ని విలక్షణమైన విద్యల్ని మీ నుండి పొందాలనుకుంటున్నాను. నేను పూర్ణ పురుషోత్తముడిగా మారాలనుకుంటున్నాను. నేను విన్న దాని ప్రకారం మీరు మంత్రశాస్త్రం యోగశాస్త్రం దర్శనాలు మీమాంసలు మొదలైన వాటిల్లో సర్వశ్రేష్టులు అని తెలుసుకున్నాను. నేను నా జీవితంలో సర్వశ్రేష్టంగా తయారవ్వాలనుకుంటున్నాను. అలా జరగాలంటే కేవలం ఒక పరిపూర్ణమైన సర్వశ్రేష్టమైన గురువుకు మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి సర్వశ్రేష్టమైన విద్యలు కలిగిన మీరే సమర్ధులని నమ్ముతున్నాను అని అన్నాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలకు మన పురాణ ఇతిహాసాలే సాక్ష్యంగా నిలిచాయి. సందీపన మహర్షి శ్రీకృష్ణుడి చేత అన్ని రకాల పనులు చేయించాడు. శ్రీకృష్ణుడి చేత ఆశ్రమంలోని అన్ని రకాల కార్యక్రమాలను చేయించాడు. సాందీపన మహర్షి నిరుపేద బాలకుడైన సుధామ మరియు కృష్ణుడిలోనూ ఎటువంటి భేదభావాన్ని చూపించలేదు. శ్రీకృష్ణుడికి విద్య నేనేర్పే క్రమంలో గురు సాందీపనుడు పలు పలు విధాలుగా పరీక్షించిన తర్వాత శ్రీకృష్ణులోని సమర్పణ శ్రద్ధ విశ్వాసము మనసులో కోమలత్వం దేహంలో దృఢత్వం అన్నింటిని గమనించిన తర్వాత ఇప్పుడు నీవు అడిగిన ఆ శ్రేష్టమైన విద్యలని అర్థం చేసుకోవడానికి వాటిని సాధించడానికి అవసరమైన అర్హత నీకు లభించింది. నువ్వు అద్వితీయమైన వ్యక్తిత్వంగాను మహా పురుషుడిగాను తయారవ్వగలవు అన్నాడు ఈ భూ ప్రపంచం మొత్తం మీద ఇలాంటి అద్భుతమైన వ్యక్తిత్వం ఉంటే ఒకడే ఉండాలి అది కృష్ణుడై ఉండాలి ఒకే ఒక లక్ష్యం జీవితాంతం కర్మయోగాన్ని పాటిస్తూ ఈ భూ ప్రపంచం మొత్తం మీద అతి దుర్లభమైన జ్ఞానాన్ని విద్యల్ని సాధిస్తూ అద్వితీయమైన యోధునిగా తయారవ్వాలి. యోగవిద్యలో అఖండమైన జ్ఞానాన్ని సంపాదించి అద్వితీయమైన నీతి పురుషునిగా తయారయి ఈ ప్రపంచం మొత్తానికి మార్గ నిర్దేశనం చేయగలగాలి. ఇదే శ్రీకృష్ణుడు కోరుకున్న అద్వితీయమైన వ్యక్తిత్వం ఇలాంటి అద్వితీయమైన వ్యక్తిత్వం కావాలనే దృఢ సంకల్పంతో శ్రీకృష్ణుడు సాందీపన మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఇక్కడి నుండే ఇతిహాసంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలైంది. ఒక శ్రేష్టమైన శిష్యునికి ఒక శ్రేష్టమైన గురువు దొరికాడు. అలాగే ఒక శ్రేష్టమైన గురువుకి అన్ని రకాల యోగ్యతలు కలిగిన శిష్యుడు దొరికాడు. తన వద్దనున్న జ్ఞానము విద్యలు మొత్తాన్ని తృప్తి తీర శిష్యునికి ఇవ్వాలన్న తపనతో ఉన్న గురువు ఏమాత్రము సిధిలత్వం లేకుండా సరిైన అర్హతలు గల శిష్యుడు. ఈ కలయకతో జరిగిన పరిణామం ఒక సామాన్య బాలకుడు అత్యున్నతమైన శిఖరాలని చేరుకొని ఈ రోజుటికి కూడా కోట్ల మంది ద్వారా పూజింపబడుతున్నాడు. వేల వేల మందిరాల్లో హారతులు అందుకుంటున్నాడు. ఇదంతా కేవలం సాందీపన మహర్షి ప్రసాదించిన అద్వితీయమైన అతిరహస్యమైన సాధనల ద్వారానే సాధ్యమైంది. ఈ విద్యలని ప్రసాదించడానికి సందీపన మహర్షి శ్రీకృష్ణుని ఎన్నో విధాలుగా పరీక్షించాడు. అన్ని పరీక్షల్లోనూ శ్రీకృష్ణుడు విజయం సాధించాడు. సందీపన మహర్షి శ్రీకృష్ణునికి ఎలాంటి దివ్య సిద్ధులను ఇచ్చాడంటే ఆ సిద్ధుల వల్లనే శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడూ కూడా ఓడిపోలేదు. చిరకాలం చిరయవ్వనంతో సమ్మోహన రూపంతో ఉండగలిగాడు. సంపూర్ణ వైభవంతో సంపదలతో జగద్గురువుగా ఈ ప్రపంచంలో నిలిచిపోయాడు. శాస్త్రాల ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మ సాధించిన ఈ విద్యలు అత్యంత రహస్యమైనవి. వీటిని ఒక గురువు తన పుత్రునికి కూడా ఇవ్వకూడదని గ్రంథాల్లో రాసి ఉంది. ఈ సాధనల్ని శ్రీకృష్ణ పరమాత్ముడు క్షిప్రా నది వడ్డున తన గురువు సందీపన మహర్షి ఆశ్రమంలో సాధన చేసి గురుకృప ద్వారా సిద్ధిని పొందాడు. శ్రీకృష్ణ పరమాత్మ చేసిన సాధనాలు అన్నింటిలో అతి ముఖ్యమైన సాధనలు శత్రుబాధ నివారణ కోసం సదా విజయం కోసం సుదర్శన ప్రయోగ సాధన ముల్లోకాల్లోనూ నిరంతరం అత్యంత సంపన్నుడిగా ఉండడానికి అక్షున్న లక్ష్మి సాధనా ప్రయోగం సంపూర్ణ జగత్తును తన ఇష్టానుసారం నడిపించగల సూర్య సమ్మోహన సాధన సమస్త కోరిక కని తీర్చగల గోవింద ప్రయోగము అద్వితీయమైన అత్యంత బలాన్ని పొందడానికి మహాబాహు ప్రయోగము ఆరోగ్యకరమైన దేహము ప్రశాంతమైన మనసు ఆ మనస్సు దేహంతో నిరంతరం చేసే గురు ధ్యానంతో పాటుగా యోగేశ్వరుడైన కృష్ణుని ధ్యానం ఈ విధమైన జీవన విధానం మనందరికీ అనుసరణీయం. సరే మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లైతే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి
No comments:
Post a Comment