అందమైన బంధం
మనిషి ఎంతో తెలివిగా సృష్టించుకున్న అందమైన భావనల్లో ముఖ్యమైనవి- సంబం ధాలు. వాటికోసం మానసిక, ఆధ్యాత్మిక శక్తులను పెట్టుబడిగా పెడతాడు. మొదటి సంబంధం ఎవరితో వారికి. ఆ తరువాతే మిగిలినవన్నీ. సంబంధాల అవసరం ఏంటి? ఆనందమా.. భద్రతా..? ఈ రెండింటి కోసమైతే మూలమైన దైవంతోనే సంబంధాన్ని స్థిరపరచుకోవాలి. దైవత్వం ప్రతిచోటా ఉంటుంది. మరి నిత్య జీవితంలో జీవిత భాగ స్వామిలో దైవత్వం ఎలా కనుగొంటాం? విశ్వాసంగా, నిష్కపటంగా వ్యవహరించడం వల్ల. ఏం ఆశించకుండా ప్రేమను అందిస్తే అప్పుడదో అందమైన బంధమవుతుంది. సంబంధాలు రెండే రకాలు. పరిపక్వత కలిగినవి, లేనివి... అంతే. పరిపూర్ణమైన సంబంధాలు చాలా అరుదు. మనుషులే పరిపూ ర్జులు కానప్పుడు ఇక వారు ఏర్పరచుకునే సంబంధాలు పరిపూర్ణమెలా అవుతాయి? జీవిత మనే దారిలో రాకపోకలే సంబంధాలు. అహాన్ని మూలకు నెట్టి, ఇతరులలోని తేడాలు, పరిమితు లను స్వీకరించగలగాలి. జీవిత నాణ్యతను అను భవాలే నిర్ణయిస్తాయి. ఎప్పటికప్పుడు మనల్ని మనం మెరుగుపరచుకుంటుండాలి. మంచి నావి కుడికి తెలుసు, గమ్యం చేరుకోవాలంటే గాలి దిశను మళ్లించడం సాధ్యం కాని విషయమని. కాబట్టి తానే తెరచాపలను సర్దుబాటు చేసుకుని ప్రయాణం సాగిస్తాడు
నీతో ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా, ఆహ్లా దంగా ఉంటుందని ఇతరులు అనుకుంటే అది అందమైన సంబంధం. నిన్నను నిన్నకే విడిచిపె ట్టడం పరిపక్వత. నిన్నటి సంబంధాలలోని పొర పాట్లను, తప్పులను ఈ రోజు వెతుక్కోకూడదు. ఎవరికీ ఏమీ నిరూపించాల్సిన అవ సరం లేదు. జీవితం ప్రశాంతతను కోరుకుంటుంది.
పరిపక్వత అంటే- ఇతరులు మనతో ఉన్నప్పుడు తల్లి గర్భంలో బిడ్డకు ఎలా భద్రంగా ఉన్నట్లుంటుందో అలా అనిపించాలి. అలా ఒక్కరికి అనిపించేలా ఉండగలి గినా గొప్ప ఆశీర్వాదమే. ప్రపంచంలో దేన్ని నిర్వచించాలన్నా మన సంబంధం ఏంటో కూడా నిర్వచించాలి. గురువును ఉపాధ్యాయుడనుకుంటే నువ్వు విద్యార్థివి. భగవంతు డిగా చూస్తే భక్తుడివి. ప్రియమైన వ్యక్తి అనుకుంటే ప్రేమికుడివి. సమకాలికుడనుకుంటే స్నేహితుడివి. ఒక శిష్యుడు గురువును అడిగాడు. 'నేను మిమ్మల్ని ఎలా చూడాలి' అని. 'నువ్వు నన్ను ఎలా చూసినా, నాకు ఎటువంటి తేడా ఉండదు. ఆ తేడా అంతా నీకే చెప్పాడు గురువు. దశరథుడు రాముడిలో కొడుకును చూశాడు. ఎడబాటును భరించలేక మరణించాడు. సీత రాముడిలో భర్తను చూసుకుంది. భార్యగా కష్టాలను పంచుకుంది. హనుమ రాముడిలో దేవుణ్ని చూశాడు. తానూ దైవమయ్యాడు.
సముద్రంలోని ఉప్పునీరు ఆవిరై స్వచ్ఛమైన వర్షపునీరుగా భూమ్మీద పడుతుంది. మురుగు కాలువలు, దుర్వాసనలు వెదజల్లే చెరువులు.. ఎక్కడి నుంచి అయినా, ఏ రూపంలోనైనా నీరు ఏ స్థితిలో ఉన్నా ఆవిరై పైకెళ్లి వర్షమై పవిత్రమైపోతుంది. అలాగే మనిషి పైనున్న శక్తితో సంబంధం ఏర్పరచుకుంటే స్వయంశుద్ధి జరుగు తుంది. అతడి ఆలోచనలు, భావాలు, జీవం.. అన్నీ ఆ దైవసంబంధం వల్ల పవిత్ర మవుతాయి. ప్రార్థనలు పైకి వెళ్లినప్పుడు, ఆశీస్సులు కిందకు చేరతాయి.
మంత్రవాది. మ హేశ్వర్
No comments:
Post a Comment