అరుణాచలం రాతి కొండ కాదు.. అగ్ని పర్వతం! నాసా (NASA) కూడా చెప్పలేని నిజం | 2.6 Billion Years History
https://youtu.be/YrSAr55LHC4?si=3cViz0eRjRHjHUax
https://www.youtube.com/watch?v=YrSAr55LHC4
Transcript:
(00:00) ఓం నమఃశివాయ ఈ విశాల విశ్వంలో ఆ పరమేశ్వరుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. కానీ సాక్షాత్తు ఆ ముక్కంటి అనుమతి లేనిదే కనీసం ప్రవేశం కూడా దొరకని ఏకైక క్షేత్రం ఏదైనా ఉందంటే అది అరుణాచలం మాత్రమే. కేవలం ఆ పేరు స్మరిస్తే చాలు జన్మ జన్మల పాపాలు పటాపంచలై ముక్తి కలుగుతుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. పంచభూతాలలో మొదటిది అత్యంత శక్తివంతమైనది అగ్ని.
(00:37) సృష్టి ఆరంభంలో ఆ పరమశివుడు ఒక అఖండమైన అగ్నిగోళంగా ఆవిర్భవించిన పవిత్ర ప్రదేశమే ఈ అరుణాచలం. సాధారణంగా మనిషి జీవితాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చని పెద్దలు చెబుతారు. ఒకటి అరుణాచల దర్శనానికి ముందు రెండు అరుణాచల దర్శనం తర్వాత ఎందుకంటే ఒక్కసారి ఆ కొండని చూస్తే మనిషి తలరాత మారిపోతుంది. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఈ ప్రపంచంలోని అత్యంత పురాతనమైన పర్వతాలలో అరుణాచలగిరి ఒకటి దీని వయసు దాదాపు 260 కోట్ల సంవత్సరాలు అని నిర్ధారించారు.
(01:16) ఇక్కడి మట్టిలో గాలిలో లెక్కలేనన్ని ఔషధ గుణాలు ఉన్నాయని విజ్ఞాన శాస్త్రం కూడా అంగీకరించింది. తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలో [సంగీతం] ఉన్న ఈ క్షేత్రాన్ని అన్నం మలయార్ ఆలయం అని కూడా పిలుస్తారు ఇక్కడ స్వామి వారు అరుణాచలేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు. సాధారణంగా దేవుడిని చూడాలంటే మనం కొండైక్కి పైకి వెళ్తాం.
(01:42) కానీ ఇక్కడ మాత్రం ఆ కొండే దేవుడు అవును ఆ రాతి పర్వతమే సాక్షాత్తు శివ స్వరూపం అందుకే భక్తులు కొండ ఎక్కకుండా ఆ కొండ చుట్టూ ప్రదీక్షణ చేస్తారు. అసలు ఈ కొండ వెనుక ఉన్న రహస్యం ఏమిటి? కృతయుగం నాటి అగ్ని పర్వతం కలియుగంలో రాతి కొండగా ఎలా మారింది? బ్రహ్మ విష్ణువులకు పట్టిన అహంకారాన్ని శివుడు ఎలా అణచివేసాడు? ఈ రోజుకి ఆ ఆలయం గోపురం మీద ఒక చిలుక రూపంలో సంచరిస్తున్న మహానుభావుడు ఎవరు? రండి మానవ మేదస్సుకు అందని ఎన్నో అద్భుతాలు మరెన్నో రహస్యాలు దాగి ఉన్న అరుణాచల సమగ్ర చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం.
(02:23) కాంత పురాణం ప్రకారం పూర్వం ఒకానొక సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి స్థితికారుడైన శ్రీ మహావిష్ణువుకి మధ్య ఒక పెద్ద వాగ్వాదం జరిగింది. నేను సృష్టిస్తున్నాను కాబట్టి నేనే గొప్పవాడిని అని బ్రహ్మ నేను లోకాన్ని కాపాడుతున్నాను కాబట్టి నేనే గొప్పవాడిని [సంగీతం] అని విష్ణువు ఇలా ఇద్దరి మధ్య అహంకారం తారాస్థాయికి చేరింది.
(02:49) ఆ గొడవ ప్రళయానికి దారి తీసేలా ఉండడంతో వారి అజ్ఞానాన్ని తొలగించడానికి పరమేశ్వరుడు రంగంలోకి దిగాడు. హటాత్తుగా వారిద్దరి మధ్య ఒక అద్భుతం జరిగింది. భూమి నుండి ఆకాశం వరకు ఆది అంతం లేని ఒక భయంకరమైన అగ్ని స్తంభం ప్రత్యక్షమయింది. అందులోంచి శివుడు ఉద్భవించి మీ ఇద్దరిలో ఎవరైతే ఈ లింగం యొక్క మొదలును గాని చివరిను గాని కనుగొంటారో వారే గొప్పవారు అని పరీక్ష పెట్టాడు.
(03:19) వెంటనే శ్రీ మహావిష్ణువు వరాహ రూపం దాల్చి ఆ లింగం యొక్క అడుగు భాగాన్ని కనుగొనడానికి భూమిని తవ్వుకుంటూ పాతాళానికి వెళ్ళాడు అటు బ్రహ్మదేవుడు హంస రూపం దాల్చి ఆ లింగం యొక్క శిఖరాన్ని చూడటానికి ఆకాశంలోకి ఎగిరాడు కొన్ని వేల సంవత్సరాలు గడిచాయి విష్ణువు ఎంత లోతుకు వెళ్ళినా ఆ అగ్నిస్తంభం మూలం దొరకలేదు బ్రహ్మ ఎంత పైకి వెళ్ళినా దాని అంతం కనిపించలేదు చివరకు మహావిష్ణువు తన ఓటమిని అంగీకరించి వెనక్కి వచ్చి శివుడికి నమస్కరించాడు.
(03:54) స్వామి నీ ఆది అంతాలను కనుగొనడం నా వల్ల కాదు అని సత్యం పలికాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం అహంకారాన్ని వీడలేదు పైకి వెళ్తున్న బ్రహ్మకు ఆ అగ్నిలింగం పైభాగం నుండి కిందకు రాలుతున్న ఒక కేతకీ పుష్పం కనిపించింది. బ్రహ్మ ఆ పువ్వుని చూసి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. దానికి ఆ పువ్వు నేను శివుడి తల మీద నుండి రాలుతున్నాను కిందకు ప్రయాణించి ఇప్పటికే కొన్ని వేల ఏళ్లు అయ్యిందని చెప్పింది.
(04:28) అది విన్న బ్రహ్మకు ఒక దురాలోచన వచ్చింది. శివుడి దగ్గరికి వెళ్లి అబద్ధం చెప్పాలనుకున్నాడు. తనకు సాక్ష్యంగా ఉండమని ఆ మొగలి పువ్వును అక్కడే ఉన్న ఒక కామధేనువును ఒప్పించాడు. కిందకు వచ్చిన బ్రహ్మ శివుడితో నేను నీ శిఖరాన్ని చూశాను. దానికి సాక్ష్యం ఈ పువ్వు ఈ ఆవు అని చెప్పాడు. [సంగీతం] అప్పుడు మొగలి పువ్వు అవును బ్రహ్మ చూసాడు అని అబద్ధం చెప్పింది.
(04:56) ఆవు మాత్రం భయంతో తలతో అవును అని ఊపుతోనే తోకతో కాదు అన్నట్లుగా సైగ చేసింది. సర్వాంతర్యామి అయిన శివుడికి ఆ నిజం తెలిసిపోయింది. ఆగ్రహంతో ఊగిపోయిన రుద్రుడు బ్రహ్మదేవుడికి ఒక శాపం ఇచ్చాడు. సృష్టికర్తవైన నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి ఇకపై భూలోకంలో నీకు గుడి కానీ [సంగీతం] పూజలు కానీ ఉండవు అని శపించాడు. అబద్ధానికి సహకరించిన మొగలి పువ్వుతో ఇకపై [సంగీతం] నా పూజకు నువ్వు పనికి రావద్దు అని ఆజ్ఞాపించాడు.
(05:29) కానీ నిజం చెప్పడానికి ప్రయత్నించిన ఆవు తోకను పవిత్రంగా భావించి గోమాత ముఖం కంటే తోక వైపే లక్ష్మీదేవి నివసిస్తుంది. అక్కడే పూజలు అందుకుంటుంది [సంగీతం] అని వరం ఇచ్చాడు. తన తప్పు తెలుసుకున్న బ్రహ్మదేవుడు శివుడి పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. స్వామి నా అహంకారాన్ని అనిచి వేసావు లోక కళ్యాణం కోసం నువ్వు ఇదే అగ్ని రూపంలో ఇక్కడ కొలువై ఉండు.
(05:56) భక్తుల అజ్ఞానాన్ని పోగొట్టాలి అని కోరుకున్నాడు. బ్రహ్మ కోరికను మన్నించి ఆ అరుణాచలంలో శివుడు తేజోలింగంగా స్థిరపడ్డాడు. అయితే ఆ అగ్ని పర్వతాన్ని చూసిన దేవతలు మునులు భయపడ్డారు. స్వామి ఇంతటి వేడిని మేము తట్టుకోలేము దయచేసి శాంతించు అని ప్రార్థించారు. భక్తుల కోసం బోలాశంకరుడు తన రూపాన్ని మార్చుకోవడానికి అంగీకరించాడు.
(06:24) అందుకే అరుణాచలగిరి కృత యుగంలో భగబగమండే అగ్ని పర్వతంగా ఉండేది. త్రేతా యుగంలో మెరిసిపోయే మాణిక్య పర్వతం అంటే వజ్రాల కొండగా మారింది. ద్వాపరి యుగంలో పొన్నుమలై అంటే బంగారు పర్వతంగా దర్శనమిచ్చింది. ఇప్పుడు మనం ఉన్న కలియుగంలో కేవలం రాతి కొండగా కనిపిస్తుంది. రాతి రూపంలో ఉన్నా సరే ఇప్పటికీ అది అగ్ని స్వరూపమే అని సిద్ధులు చెబుతారు.
(06:51) అందుకే ఆ గర్భగుడిలో ఎంత చల్లని వాతావరణం ఉన్నా విపరీతమైన వేడి ఆవరిస్తూనే ఉంటుంది. గౌతమ మహర్షి స్వయంగా ఈ క్షేత్ర నియమాలను పూజా విధానాలను నిర్ణయించారు. ఇక్కడ క్షేత్ర పాలకుడు సాక్షాత్తు ఆ కాలభైరవుడే. అరుణాచల ఆలయ వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే. దాదాపు 24 ఎకరాల విశాలమైన స్థలంలో ఆకాశాన్ని తాకే గోపురాలతో ఈ ఆలయం నిర్మితమైంది.
(07:22) మొత్తం నాలుగు దిక్కుల నాలుగు పెద్ద గోపురాలు [సంగీతం] లోపల ఐదు చిన్న గోపురాలు ఉన్నాయి. తూర్పు దిక్కున ఉన్న ప్రధాన ద్వారాన్ని రాజగోపురం అంటారు. దీని ఎత్తు అక్షరాల 217 అడుగులు. ఇది తమిళనాడులోని రెండవ అతి పెద్ద గోపురం. దీన్ని నిర్మించింది ఎవరో కాదు మన తెలుగు చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు రాయలవారు ఈ ఆలయం మీద ఉన్న భక్తితో 1000 స్తంభాల మండపాన్ని కట్టించాలని సంకల్పించారు.
(07:53) అప్పట్లోనే 500 బంగారు నానేలు వెచ్చించి స్థలాన్ని కొని ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించారు. ఇక ఉత్తరదిక్కున ఉన్న గోపురానికి ఒక కన్నీటి కథ ఉంది. ఆ గోపురాన్ని అమ్మని అమ్మన్ గోపురం అంటారు. అమ్మని అమ్మన్ అనే ఒక పరమ భక్తురాలు ఈ గోపురాన్ని కట్టాలని సంకల్పించింది. కానీ ఆమె దగ్గర చిల్లి గవ్వ లేదు అయినా వెనకడుగు వేయలేదు ఇంటింటికి తిరిగి భిక్షమెత్తి వచ్చిన డబ్బుతో ఒక్కొక్క రాయిని పేర్చుకుంటూ ఆ గోపురాన్ని పూర్తి చేసింది.
(08:28) ఎవరైనా డబ్బులు లేవని అబద్ధం చెప్తే ఆమెకు వెంటనే తెలిసిపోయేదట. అంతటి మహిమ కలిగిన తల్లి ఆమె. [సంగీతం] ఆమె భక్తికి మెచ్చిన ఆ శివుడు ఆమె పేరునే ఆ గోపురానికి శాశ్వతం చేశాడు. అరుణాచలంలో అడుగు పెడితే దేవుడు భక్తుడి కోసం ఎంతవరకైనా దిగి వస్తాడు అనడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ బల్లల మహారాజు చరిత్ర. హోయసలా సామ్రాజ్యానికి రాజైన వీరబల్లాలుడు అరుణాచలాన్ని రాజధానిగా చేసుకొని పాలించేవాడు.
(09:01) అతనికి సిరి సంపదలు ఉన్నా సంతానం లేదనే లోటు ఉండేది. అయినా శివుడినే నమ్ముకొని [సంగీతం] ఎవరు ఏది అడిగినా దానం చేసేవాడు. అతని భక్తిని పరీక్షించడానికి ఒకరోజు శివుడు జంగమ దేవర సన్యాసి వేషంలో వచ్చాడు. రాజు అందరికీ సాపర్యాలు చేశాడు. చివరికి ఆ సన్యాసి నాకు సేవ చేయడానికి ఒక స్త్రీ కావాలి అని కోరాడు. అప్పుడు అక్కడ ఉన్న దేవదాసీలుఎవరు అందుబాటులో లేకపోవడంతో సాక్షాత్తు మహారాణియే ముందుకు వచ్చి నేను సేవ చేస్తాను అని ఆ సన్యాసి పాదాలు తాకింది.
(09:39) ఆమె తాకగానే ఆ సన్యాసి వేషంలో ఉన్న శివుడు ఒక పసిబిడ్డగా మారిపోయాడు. ఆశ్చర్యపోయిన రాణి ఆ బిడ్డని ఎత్తుకొని రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు ఆ బిడ్డని చేతుల్లోకి తీసుకోగానే ఆ పసివాడు మాయమైపోయి ఆకాశం నుండి ఒక మాట వినిపించింది. రాజా సంతానం లేదని బాధపడకు నీ అంత్యక్రియలు చేయడానికి నేనే స్వయంగా కొడుకుగా వస్తాను అని మాటిచ్చాడు. ఆ మాట ప్రకారమే బల్లాల మహారాజు మరణించినప్పుడు ఆ పరమేశ్వరుడే మనిషి రూపంలో వచ్చి తన చేతులతో స్వయంగా అంత్యక్రియలు నిర్వహించాడు.
(10:16) ప్రపంచంలో ఏ దేవుడు భక్తుడికి తలకొరివి పెట్టిన దాఖలాలు లేవు. ఒక్క అరుణాచలేశ్వరుడు తప్ప నేటికీ బల్లల మహారాజు చనిపోయిన రోజున గుడిలో స్వామి వారికి పత్రిక చదివి వినిపిస్తారు. ఉత్సవమూర్తిని పల్లకిలో తీసుకెళ్లి దగ్గరలోని చెరువులో స్నానం చేయించి రాజుగారికి పిండ ప్రదానం చేస్తారు. ఇది ఈ కలియుగంలో జరుగుతున్న ప్రత్యక్ష అద్భుతం. అరుణాచల ఆలయంలో కిలిగోపురం అనే ఒక ప్రదేశం ఉంది.
(10:48) అక్కడ ఇప్పటికీ ఒక మహానుభావుడు చిలుక రూపంలో జీవించి ఉన్నారని ప్రతీతి ఆయనే అరుణగిరి నాథర్ ఆయన జీవితం ఒక సంచలనం చిన్నప్పుడే వేదాలు చదివిన అరుణగిరి యవ్వనంలో దారి తప్పాడు. వేశ్యాల మోజులో పడి ఉన్న ఆస్తిని ఆరోగ్యాన్ని ఆఖరికి తన కుటుంబాన్ని కూడా నాశనం చేసుకున్నాడు. సొంత అక్క తనకోసం పడుతున్న బాధను చూసి పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. నాకు ఈ జన్మ వద్దు అనుకొని ఆలయ గోపురం పై నుండి కిందకు దూకేశాడు.
(11:22) కానీ కింద పడకముందే రెండు చేతులు అతన్ని గాలిలో పట్టుకున్నాయి. కళ్ళు తెరిచి చూస్తే సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్య స్వామి. స్వామి తన వేలాయుధంతో అరుణగిరి నాలుక మీద బీజాక్షరాలు రాశారు. అంతే అప్పటివరకు కామంతో నిండిన ఆ నోటి నుండి అద్భుతమైన కవిత్వం గంగల ప్రవహించింది. తిరుపుగ్గల్ అనే పేరుతో వేల కీర్తనలు రాశాడు. అయితే ఆ స్థానంలో సంబంధన్ ఆండన్ అనే మరో కవి ఉండేవాడు.
(11:51) అతనికి అరుణగిరి మీద అసూయ పుట్టింది. ఎలాగైనా అవమానించాలని ఒక పోటీ పెట్టాడు. నాకు కాళికా దేవిని పిలిచే శక్తి ఉంది దమ్ముంటే నువ్వు నీ సుబ్రహ్మణ్య [సంగీతం] స్వామిని ఇక్కడికి రప్పించు అని సవాలు విసిరాడు. అరుణగిరి భక్తికి మెచ్చిన సుబ్రహ్మణ్య స్వామి ఒక స్తంభం నుండి ప్రత్యక్షమై అందరికీ దర్శనం ఇచ్చాడు. ఆ స్తంభాన్ని ఇప్పటికీ మనం గుడిలో చూడవచ్చు.
(12:17) స్తంభోద్భవ సుబ్రహ్మణ్య ఆలయం. ఈ సంఘటనతో సంబంధంకి కోపం పెరిగిపోయింది. రాజుని మభ్య పెట్టి స్వర్గంలో ఉండే పారిజాత పుష్పాన్ని తెస్తే [సంగీతం] మీ కంటి చూపు మెరుగుపడుతుంది అని నమ్మించాడు. ఆ పువ్వును తేవడానికి అరుణగిరిని పంపమని సలహా ఇచ్చాడు. అరుణగిరి నాథర్ తన భౌతిక శరీరాన్ని ఒక గూడ్లో దాచిపెట్టి పరకాయ ప్రవేశం విద్య ద్వారా ఒక చిలుక శరీరంలోకి ప్రవేశించి స్వర్గానికి వెళ్ళాడు.
(12:47) ఇదే అదనుగా భావించిన సంబంధం గూటిలో ఉన్న అరినగిరి నాదర్ మనిషి శరీరాన్ని కాల్చి బూడిద చేశాడు. స్వర్గం నుండి పారిజాత పుష్పంతో తిరిగి వచ్చిన అరుణగిరి చిలుక తన శరీరం కాలిపోవడం చూసి చలించిపోయాడు. కానీ వెంటనే అది దైవ నిర్ణయంగా భావించాడు. [సంగీతం] ఇకపై నేను ఈ చిలుక రూపంలోనే ఉంటూ ఆ పరమశివుడిని కీర్తిస్తాను అని ఆ గోపురం మీద ఉండిపోయాడు.
(13:16) అందుకే ఆ గోపురానికి కిలిగోపురం అనే పేరు వచ్చింది. అదృష్టం ఉంటే [సంగీతం] ఇప్పటికీ అక్కడ ఆ చిలుక కనిపిస్తుందని భక్తుల నమ్మకం. అరుణాచలంలో అత్యంత వైభవంగా జరిగే ఉత్సవం కార్తీక దీపోత్సవం. శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించిన రోజున కృతిక నక్షత్రం నాడు 2668 అడుగుల ఎత్తులో ఉన్న ఆ కొండ శిఖరం మీద మహా దీపాన్ని వెలిగిస్తారు. దాదాపు 3000 సంవత్సరాల నుండి ఈ ఆచారం వస్తుంది.
(13:48) వేల కిలోల నెయ్యి భారీ వత్తులతో వెలిగించే ఈ జ్యోతి సుమారు 35 కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తుంది. వరుసగా 11 రోజుల పాటు ఈ దీపం ఆరిపోకుండా వెలుగుతూనే ఉంటుంది. ఆ జ్యోతిని దర్శిస్తే 21 తరాల పాపాలు నశించిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో కొండ మొత్తం శివనామ స్మరణతో మారుమోగిపోతుంది. [సంగీతం] అది చూసి తీరాల్సిందే తప్ప మాటల్లో వర్ణించలేము.
(14:17) చివరగా అరుణాచలంలో అన్నిటికంటే ముఖ్యమైనది గిరి ప్రదీక్షణ. అక్కడ గుడిలో ఉన్న విగ్రహానికి ఎంత శక్తి ఉందో తెలియదు కానీ ఆ కొండ చుట్టూ తిరుగుతూ వచ్చే శక్తి మాత్రం అనంతం దాదాపు 14 కిలోమీటర్ల దూరం ఉండే ఈ గిరి ప్రదీక్షణ మార్గంలో కంటికి కనిపించని కోట్లాది మంది సిద్ధ పురుషులు యోగులు అఘోరాలు గాలి రూపంలో సంచరిస్తూ ఉంటారు.
(14:44) మనం నడుస్తున్నప్పుడు [సంగీతం] మనకు తెలియకుండానే వాళ్ళ ఆశీస్సులు మనకు లభిస్తాయి. అంతేకాదు ఆ కొండ మీద ఉండే అరుదైన వనమూలికల నుండి వీచే గాలిని పీల్చితే ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులైన నయమవుతాయని వైద్యశాస్త్రం కూడా చెబుతోంది. రమణ మహర్షి లాంటి మహానుభావులు ఈ కొండని తమ నివాసంగా చేసుకున్నారు. అయితే భక్తులు గమనించాల్సిన మరో ముఖ్య విషయం అష్టలింగాలు.
(15:12) ఈ కొండ చుట్టూ ఎనిమిది దిక్కులలో [సంగీతం] ఎనిమిది శివలింగాలు ప్రతిష్టించబడి ఉంటాయి. ఒక్కో లింగాన్ని దర్శించుకుంటే ఒక్కో ఫలితం కలుగుతుంది. ఒకటవది ఇంద్రలింగం తూర్పు దీన్ని దర్శిస్తే ఐశ్వర్యం కలుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రెండవది అగ్నిలింగం ఆగ్నేయం [సంగీతం] ఇక్కడ శివుడిని దర్శిస్తే మనలో ఉన్న భయాలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు నయమవుతాయి.
(15:36) యమలింగం దక్షిణం మృత్యుభయం ఉన్నవారు జాతక దోషాలు ఉన్నవారు ఈ లింగాన్ని దర్శిస్తే ఆయుష్యు పెరుగుతుంది. నాలుగవది నివృత్తి లింగం నైరుతి సంతానం లేని వారు పిల్లల సమస్యలతో బాధపడేవారు ఇక్కడ మొక్కుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. ఐదవది వరుణ లింగం పడమర దీన్ని దర్శిస్తే నీటి సంబంధిత రోగాలు నయమవుతాయని నమ్మకం. ఆరవది వాయులింగం వాయువ్యం.
(16:07) శ్వాసకోశ వ్యాధుల నుండి గుండె జబ్బులు ఉన్నవారు ఈ లింగాన్ని దర్శిస్తే ఆరోగ్యం కుదుటపడుతుంది. ఏడవది కుబేర లింగం ఉత్తరం. ఆర్థిక కష్టాల్లో ఉన్నవారు అప్పుల బాధలు ఉన్నవారు ఇక్కడ ప్రార్థిస్తే ధనలాభం కలుగుతుంది. ఎనిమిదవది ఈశాన్య లింగం ఈశాన్యం. ఇది చివరి లింగం. దీన్ని దర్శిస్తే మనశ్శాంతి లభిస్తుంది ఈ ఎనిమిది లింగాలను దర్శించుకుంటూ చేసే గిరి ప్రదీక్షణ కాశి క్షేత్రం [సంగీతం] కోటి సార్లు ప్రదీక్షణ చేసిన దానితో సమానం ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే ప్రతి ఆదివారం సాక్షాత్తు ఆ సూర్యభగవానుడే ఆకాశంలో అరుణేచల [సంగీతం] కొండ చుట్టూ ప్రదీక్షణ చేస్తాడట. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా
(16:50) సూర్యుడు ఈ కొండను దాటకుండా పక్కనుండి గౌరవంగా తప్పుకొని వెళ్తాడు. ఇది ఖగోలా అద్భుతం. పుట్టడానికి తిరువారూర్ బ్రతకడానికి కంచి మరణించడానికి కాశీ అంటారు. కానీ కేవలం స్మరిస్తే చాలు ముక్తినిచ్చే క్షేత్రం ఈ అరుణాచలం ఒక్కటే. జీవితంలో ఒక్కసారైనా ఆ అగ్నిలింగాన్ని దర్శించుకోండి. ఆ గిరి ప్రదీక్షణ చేయండి. మీలో ఉన్న అహంకారం నశించి ప్రశాంతత లభిస్తుంది.
(17:23) ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చితే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీపై ఉండాలని కోరుకుంటూ ఓం అరుణాచలేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన గీతా నిత్య తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు స్వస్తి జై హింద్ జై భారత్. ఓం
No comments:
Post a Comment