Devotees 🙏is beacarefull 👍about this maayaa 😱.(How to fight to maayaa)🤔
Author Name:చూడామణి1M
Youtube Channel Url:https://www.youtube.com/@chudamani812
Youtube Video URL:https://www.youtube.com/watch?v=rTqaTQ1XMd4
Transcript:
(00:00) ఓం నమో నారాయణాయ ఇవాళ భక్తులకి ముఖ్యమైన వీడియో అన్నమాట భక్తి మార్గంలో ప్రవేశించి భక్తి చేస్తూ ఉన్న వాళ్ళకి భక్తిని దూరం చేయడానికి మాయ మనల్ని భ్రమలకి గురి చేస్తూ ఉంటది అన్నమాట అంటే భగవంతుడు నిత్య సత్యం కాదు కొన్ని ఎంజాయ్మెంట్స్ కానివ్వండి కొన్ని కోరికలు కానివ్వండి వాటి మీదకి మనల్ని మన మనసు అనేది వాటి మీదకి వెళ్లేటట్టుగా మనల్ని రెడీ చేస్తది అన్నమాట ఈ మాయ అనేది మాయ అంటే మళ్ళీ వేరే ఏంటో అని అనుకోవడం అనేది
(00:46) చాలామంది చేస్తుంటారు మాయ అంటే ఏదో కాదు మాయ అంటే అది మన ప్రారబ్ధ పాపకరమే ఆ ఎందుకంటే ఇక్కడ చెప్పేది వినండి జాగ్రత్తగా మాయ మాయ అందరినీ భ్రమలకు గురి చేయడము మాయ అందరిని సతాయించడము అందరిని ఏడిపించడము ఇలాంటివి చేయదు అవునా ఎవరికైతే కర్మ అనేది రాసుకొచ్చుకొని పుడతామో పూర్వజన్మలలో మనం ఏమైనా లోపాలు పాపాలు ఏమైనా చేసిన వాళ్ళం అయతామో మళ్ళీ అలాంటి వాళ్ళకే మాయ వచ్చి మనల్ని భ్రమలకు గురి చేయడము మనల్ని ఆ ప్రారబ్ధ పాప కర్మ అనుభవించేటట్టు చేయడం కోసము మనల్ని భక్తి మార్గంలో నుంచి లాగి
(01:30) బయట అవతల వారేయడం కోసం అది మనల్ని బ్రమలకు గురి చేస్తది అన్నమాట ఎందుకంటే భక్తి మార్గంలో మనకు కర్మద్ధంసం జరుగుతది కదా మరి అవునా మనకు కర్మద్ధంసం జరిగి మన కర్మ కరిగిపోయి పరమాత్మ మన కర్మను కరిగించేసి మనకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు కదా మరి కాబట్టి మాయ తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి మన జీవితంలో జొరబడతది అన్నమాట ఎవరి జీవితంలో మనలాంటి మనలాంటి అంటే ఇప్పుడు ఉదాహరణకు నేనే ఉన్నా నేనే అబ్బా ఎంత కర్మ రాసుకొచ్చుకున్నా అంటే నేను భయంకరమైన పాపకర్మలు ఉన్నాయ అన్నమాట చేసి ఉంటా నేను కాబట్టి ఎన్ని రకాలుగా కష్టాలు రావాలో అన్ని
(02:12) రకాలుగా వచ్చినయి అవునా కొత్తగా ఇప్పుడిప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళు వెనకాలకి వెళ్లి వీడియోస్ చూడండి ప్రతిఒక్క వీడియో చూడండి చాలా బాగుంటాయి మీకు మోటివేషనల్ గా ఉంటాయి నా లైఫ్ గురించి తెలిస్తే ఇక మీ లైఫ్ గురించి అసలు బాధపడరు ఆహా అంటే ఇంత ఘోరమైన లైఫ్ ఉన్నవాళ్ళు కూడా ఉంటారా ఉండి కూడా ఇంత బాగా ఈమె జీవిస్తుందా ఇంత బాగా మళ్ళీ ఇంకా ఒక ఛానల్ రన్ చేస్తుందా [నవ్వు] ఛానల్ లో మాకు మళ్ళీ మోటివేషన్ చేస్తుందా అని చెప్పేసి మీకు ఇంకా ఎక్కువ మోటివేషన్ కలుగుతుది అన్నమాట [నవ్వు] కాబట్టి నా లైఫ్ అనేది మై లైఫ్ విత్ కుండలిని
(02:51) అవేకనింగ్ అని ఉంది మళ్ళీ ఇంకా మై లైఫ్ విత్ ఐబిడి ఐబిడి పేషెంట్ ని కదా నేను కాబట్టి దాని గురించి కూడా ఉంటది. ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తది అసలు మీరు ఇక దేని గురించి బాధపడరు లైఫ్ లో దేని గురించి కూడా ఏడవరు ఎందుకంటే ఇప్పుడు నన్ను చూసి ధైర్యం తెచ్చుకుంటారు అన్నమాట మీరు మోటివేషనల్ గా నన్నే తీసుకుంటారు మీరు కాబట్టి చూడండి ఓకేనా ఎంత ధైర్యంగా బ్రతకాలో అదన్నమాట కొంతమందికి అన్ని ఉంటాయి.
(03:25) చక్కటి మొన్న విజయశాంతి రెడ్డి అని ఒక ఆమె బలవన్ మరణానికి పాల్పడింది కదా ఆమెకు అన్ని ఉన్నాయండి అంత బాగా అంత మంచి లైఫ్ ఉంది ఆమెకు జబ్బులు లేవు ఏమి ఆ అన్ని తినగలదు అన్ని ఏ జ్యూస్ తాగాలనుకున్నా ఏ పండు తినాలనుకున్నా ఏ ఏ తినాలనుకున్నా ఆమె తినగలదు అంత మంచి స్టేజ్లో ఉంది పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారు చదువుకుంటున్నారు చక్కగా ఆ ఆమె ఉద్యోగాలక ఏడుస్తున్నారు కానీ ఆమెకు ఉద్యోగం ఉంది సాఫ్ట్వేర్ ఉద్యోగం లీడర్ టీం లీడర్ అయినా కూడా చూడండి ఆమె ఎట్లా ప్రవర్తించిందో ట్రైన్ ముందరికి వెళ్లి ఆ మంచి భర్త అమాయకుడైన భర్త ముఖ్యంగా చూసినాం కదా మనము అమాయకుడైన
(04:07) భర్త భర్త దగ్గరుండి షాడిస్టిక్ గా హింసించే భర్తలు ఉంటే కూడా చాలామంది ఆడవాళ్ళు పిల్లల కోసం అని చెప్పేసి బ్రతుకుతూ జీవనాన్ని సాగిస్తున్నారు ఆమెనేమో భర్త దూరంగా ఉంటే ఆమెకు ఒంటరిగా ఫీల్ అయిందంట మళ్ళీ కన్నతల్లి కన్నతల్లి మాట్లాడుతూ ఉంటే మనకి గుడ్ హార్మోన్స్ విడుదల అవుతాయి ఎందుకంటే తల్లి అనే టైం మనకి మోటివేషనల్ చేస్తూ ఉంటది నాకు కూడా నేను నాకు ఎప్పుడెప్పుడు కష్టాలు వస్తున్నాయి అన్నప్పుడల్లా ప్రతిసారి మా అమ్మ నాకు మోటివేషనల్ చేసిందన్నమాట మోటివేషనల్ గా నన్ను ముందుకు తీసుకెళ్ళింది.
(04:43) సెల్ ఫోన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇక ఫోన్ చేసి ఎప్పటికప్పుడు ఆ అమ్మ మా అమ్మతో కొద్దిసేపు మాట్లాడితే నాకు కాస్త రిలీఫ్ గా అనిపిస్తది అన్నమాట. సెల్ ఫోన్ లేకముందు రాకముందు సెల్ ఫోన్లు రాకముందు అయితే కొంచెం కష్టం అయ్యేది కొంచెం ఎప్పుడైనా అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ మోటివేషన్లు చేసి పంపించేది అన్నమాట అట్లా కానీ విడాకులు తీసుకో అని చెప్పడము విడిపో అని చెప్పడం అలాంటివి మా అమ్మ చేయలేదుఅన్నమాట అట్లాంటివి చేయలేదు.
(05:13) అయితే ఆ ముఖ్యంగా ఇక్కడ తొందరగా జ్ఞానోదయం అనేది అయ్యింది కాబట్టి నాకు ఇప్పుడు ఈ భక్తి మార్గంలో తొందరగా జ్ఞానోదయం అయింది నాకు 24 25 ఇయర్స్ కే నేను భక్తి మార్గంలోకి రాగానే కుండలిని జాగరణ అనేది జరిగి పూర్వజన్మ కృప వలన జ్ఞానోదయం అనేది మెలిమెల్లిగా జరుగుతూ ఉందన్నమాట ఆ ప్రాసెస్ లోకి భగవంతుడు తీసుకెళ్ళిండు అంతా మాయే నేనే సత్యం నేనే నిత్యం అని పరమాత్మ తెలియ చేస్తూ నన్ను భక్తి మార్గాల్లో ముందుకు తీసుకెళ్తూ జీవితంలో కూడా పరమాత్మే ముఖ్యం పరమాత్మే మన కన్నతండ్రి ప్రతి జన్మలోని మారని తండ్రి పరమాత్మ మనకన్న తండ్రి ఆయనే మనము ఈ మాయాలోకంలో ఉన్న ఈ తల్లిదండ్రులైనా ఈ
(05:56) పిల్లలైనా భర్తలైనా భర్త అయినా ఎవరైనా కోటి కోట్ల జన్మలు ఎత్తుతూ మనం కోటి కోట్ల ఆత్మలతో సంబంధాలు కలిగి ఉన్నాం కాబట్టి వాళ్ళఎవర ముఖ్యం కాదు వాళ్ళని ఎవరిని మనము వాళ్ళ కోసమని మన జీవితాన్ని ఆ అంటే ఇప్పుడు విజయశాంతి రెడ్డి లాగానో లేకపోతే కొంతమంది భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని నిన్న మొన్ననే ఒక ఒక వీడియోలో చూసిన లేండి అంటే నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ భర్త అక్రమ సంబంధం పెట్టుకుండని ఆమె కన్న కొడుకు ముందే చిన్న పిల్లగాడంట కన్న కొడుకు ముందే ఏడుస్తుంటే కూడా ఆమె బలవన్ మరణానికి పాల్పడింది ఊరేసుకొని కాబట్టి ఇలాంటివి ఇలాంటివన్నీ జరగకుండా
(06:41) పరమాత్మ అంతా మాయే అందరూ మాయా మనుషులే అంతా మాయే అని చెప్పేసి మోటివేషనల్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్ళండి అన్నమాట ఇట్లాగే ఆ ఈ మాయ అనేది నన్ను కూడా బ్రమలకు గురి చేసింది అన్నమాట ఆ భర్త అనే ఒక మాయ కొంతమందికేమో డబ్బు అనే మాయలో పడతారు డబ్బే ముఖ్యం డబ్బు ఉంటేనే బ్రతుకుతాం లేకపోతే లేదు అనుకుంటారు డబ్బు లేని వాళ్ళు కూడా బ్రతుకుతుంటారు మీరు అబ్జర్వేషన్ చేస్తే అడవులలో కొన్ని కుటుంబాలు పంటలు పండించుకొని అవే తినుకు వాటినే తినుకుంటూ చక్కగా ఒక చెరువు దగ్గర ఒక గుడిసేసుకొని ఆ చెరువు నీళ్లుు తాగుతూ బ్రతుకుతుంటారు ఎట్లాగైనా బ్రతకొచ్చు బ్రతకదలుసుకుంటే
(07:21) డబ్బు ఉంటేనే ఏం బ్రతకాలని ఏం లేదు ఉద్యోగం ఉంటేనే బ్రతకాలని ఏం లేదు ఏదైనా కష్టం చేసుకొని కూడా బ్రతకొచ్చు అర్థమైందా బీటెక్లు ఇంజనీరింగ్లు చేస్తేనే బ్రతకాలని ఏం లేదు తెలివి ఉంటే ఎట్లనైనా బ్రతకొచ్చు కాబట్టి ఆ బ్రమలకు మాయలకు భక్తి మార్గంలో మనం ప్రవేశించినప్పుడు అతిభక్తులం అయిపోయి భగవంతుని మీద ఎక్కువ ప్రేమ కలిగిపోయి మన మనసు మన ఆత్మ మన మైండ్ అంతా భగవంతుడి మీదకి వెళ్ళిపోయి అనుక్షణం భగవంతుడి గురించే ఆలోచిస్తూ ఉండే స్థాయికి మనం వస్తామ అన్నమాట అప్పుడు ఈ మాయ అనేది మనకు అటాక్ అవుతూ ఉంటది అప్పుడప్పుడు ఎలా ఏ విధంగా ఎన్ని రకాలుగా అంటే ఈ ఈ మాయ మాయ
(08:07) అనేది ఎట్లా ఉంటదిఅంటే ఇప్పుడు ఎడారిలో నీళ్ళక నీళ్ళలాగా కనిపిస్తది కానీ దగ్గరికి పోతే అది ఇసికే అవునా అట్లా అన్నమాట మనకి ఇప్పుడు ఉదాహరణకు డబ్బు అనేది చాలా ఇష్టం ఉన్నవాడు కూడా భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు భగవంతుడు తోని మమేకమయి భగవంతుడు యొక్క తోని భగవత్ దర్శనాలు కావడం భగవంతుడు ఆ యొక్క అనుభూతులు కలగడము అంటే దివ్య శక్తుల యొక్క అనుభూతులు కలగడము భగవంతుడు స్పందించడము అనాహత ధ్వనులు వినిపించడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి డబ్బు అనే మాయల నుంచి బయట పడిపోతాడు డబ్బు అనేది అది తుచ్చమైనదిగా అనిపిస్తది అతనికి ఎందుకు ఈ
(08:54) ఆనందమే కోటరేట్లుగా అనిపిస్తది అనుభవించిన వాళ్ళకే తెలుస్తది లేండి అది ఇప్పుడు నేను చెప్తే అర్థం కాదు అంటే అందరికీ కాదు అనుభవం లేని వాళ్ళకి అర్థం కాదు అది అనుభవంలోకి వస్తేనే అర్థమైతది ధ్యానంలో కూడా భగవంతుడితో మమేకమైనప్పుడు వచ్చే ఆనందం ఉంటది అది ఆ సముద్ర తరంగాలు ఉప్పొంగి పొంగి పొర్లుతాయి చూడండి అట్లా వస్తది అన్నమాట అప్పుడు ఏమి అవసరం లేదు అనిపిస్తది ఎవరు ఎవరు లేకున్నా బ్రతకొచ్చు అనిపిస్తది అంత ఆనందం వస్తది అన్నమాట అది మాయ అనేది మనకు అర్మే ఆ అయితే ఈ మాయను తప్పించుకోవడం ఎట్లా అంటే మాయను తప్పించుకోవడం ఎట్లా అంటేభ భగవంతుని
(09:36) పాదాలు వదిలి పెట్టొద్దు ఆ అదే ముఖ్యం మీ మనసులో మీ మనసే గర్భగుడి మీ శరీరమే దేవాలయము అర్థమవుతుందా మీ మనసే గర్భగుడి ఆ గర్భగుడిలో మీ మీ ఇష్ట దైవాన్ని ప్రతిష్టాపించుకోవాలి ప్రతిష్టాపించుకొని ఆ దైవాన్ని ఎప్పటికి ఉన్నాడు నా మనసులోనే నా పరమాత్మ ఉన్నాడు ఎక్కడో గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలకు పోతూనే ఉన్నాడు అని కాదు ఉన్నాడు ఆయన అంతా గమనిస్తున్నాడు ఆయన నావాడు ఆయన నాతోనే ఉన్నాడు అనే ఒక ఒక విశ్వాసం నమ్మకంతోని ఉన్నప్పుడు ఎటువంటి మాయనైనా కూడా మనము చేదిస్తూ భేదిస్తూ ముందరికి వెళ్ళిపోతాం అన్నమాట ఆ ఇప్పుడు ఇంకా ఇంకా మాయ గురించి
(10:22) కొంచెం చెప్తా వినండి కొంతమంది భర్త అనే మాయలో పడిపోతారు కొంతమంది భార్య అనే మాయలో పడిపోతారు అంటే వాళ్ళ ప్రేమ కోసం అల్లలల్ల ఆడిపోతారుఅన్నమాట అల్లలల్ల ఆడిపోతారు ఏదో ఒక సినిమాలో ఉంటదిన్నమాట ఆ డైలాగ్ గుర్తొచ్చింది. ఆ అట్లా అల్లల అల్ల ఆడిపోయే వాళ్ళకి ఏం చేస్తాడంటే భగవంతుడు ముట్టికాయ వేసి ఆ ఆ ఎవరినైతే ప్రేమిస్తున్నామో వాళ్ళు మనల్ని ఆ వాళ్ళు వాళ్ళని మనం అసహించుకునేటట్టు వాళ్ళ ప్రవర్తన ఉంటదిన్నమాట అక్కడ వాళ్ళ గుణగణాలు కూడా అట్లానే ఉంటాయి.
(10:57) అది మన కర్మ అయ్యో నా కర్మ నాకు ఇలాంటి భర్త దొరికిందే అయ్యో నా కర్మ నాకు ఇలాంటి అత్త దొరికిందే అయ్యో నా కర్మ నాకు ఇలాంటి అమ్మ దొరికిందే ఎందుకంటే కొంతమంది అమ్మలు కూడా పిల్లల్ని ప్రేమగా చూసుకోరు ఎట్టికి పెంచుతారు అన్నమాట ఇలాంటి అమ్మ దొరికిందే ఇలాంటి తల్లి దొరికిందే ఇలాంటి తండ్రి దొరికిందే ఇలాంటి భర్త దొరికిందే ఇలాంటి భార్య దొరికిందే అని ఏడవకుండా వీళ్ళంతా మాయే ఎన్నో ఎన్నో జన్మల నుంచి నుంచి కోటి జన్మల నుంచి ఎంతో మంది భర్తలను కలిగి ఉన్నాం ఎంతో మంది తల్లిదండ్రులను కలిగి ఉన్నాం ఎంతో మంది బిడ్డలను కొడుకులను కలిగి ఉన్నాం అత్తలను మామలను బంధుమిత్రులను
(11:38) కలిగి ఉన్నాం కాబట్టి ఇది శాశ్వతం కాదు పరమాత్మే శాశ్వతం అనే ఆ అనే ఒక దానికి మనం వచ్చేస్తాం అన్నమాట ఏ విధంగా ఏ విధంగా మాయని చేదిస్తాం మనం భక్తి భక్తిలో విశ్వాసం నమ్మకం దాని వల్లనే మనం మాయని చేదించగలుగుతాం అన్నమాట ఎవరైతే మాయను చేదించలేరో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటదో కూడా చెప్తా అర్థమవుతది మీకు ఇప్పుడు ఉదాహరణకు డబ్బే ముఖ్యం అనుకున్నోడు ఇక పరమాత్మను పట్టించుకోడు డబ్బే ముఖ్యం డబ్బు లేకపోతే బ్రతకలేవు ఆ నువ్వు ఒకవెయ్యి సంవత్సరాల కోసం వచ్చినావు ఇక్కడ భూమి మీద డబ్బు లేకపోతే బ్రతకలేవు నువ్వు నీకు డబ్బు ఉన్నా తెల్లారుతది పొద్దు ముక్కుతది డబ్బు లేకున్నా
(12:21) తెల్లారుతది పొద్దు ముక్కుతది నీ ఆయుష్షు కరిగిపోతూనే ఉంటది అవునా 50 40 60 70 80 వస్తాయి అప్పుడు గుడ్డు పెడతాం ఎక్కడికి పైకి పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతాం అవునా ఎప్పటికీ జీవించి ఉండం కదా డబ్బు ఉన్నా కూడా ఎప్పటికీ జీవించాం డబ్బు లేకున్నా కూడా ఎప్పటికీ జీవించం ఎలాగైనా జీవించొచ్చు కానీ కానీ ఎలాగైనా బ్రతకొచ్చు రేషన్ బియ్యం తీసుకొని కూడా బ్రతకచ్చు రేషన్ బియ్యం తీసుకొని ఎక్కడనైనా ఈ కూల్ నేల్లు పని చేసుకొని కూడా బ్రతకొచ్చు ఎట్లానైనా బ్రతకొచ్చు కానీ బ్రతకలేక సాకులు చెప్పి మరి కొంతమంది విజయశాంతి రెడ్డి లాంటి వాళ్ళు ఆమె బలవన్ మరణానికి
(13:02) పాల్పడడం కాకుండా ఇంకా పాపకర్మ ఎత్తినేసుకొని పోయింది. అవునా ఆమె ఆత్మ ఘోషిస్తూ ఉంటది అన్నమాట ఆమె ఆత్మ ఘోషిస్తూ ఏడుస్తూ ఉంటది పిల్లల ఆత్మలు కూడా ఆమె పక్కకే ఉంటాయి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు మమ్మల్ని ఎందుకు చంపినావు మమ్మీ అని అర్థమైందా అందుకని అలాంటి మహాపాపాలు చేయకూడదు. ఇంకో ఎట్ట అయిందంటే ముఖ్యంగా ఈ మాయలకు గురి చేసే ఈ ఈ మాయ ఈ మాయ అని ఉంది కదా ఇదే ప్రారబ్ధ పాపకర్మ అనుకోండి ఈ సమయంలో అనుభవించే గ్రహదోషాల సమయంలో మనకి భక్తి తగ్గిపోతది ఆసక్తి తగ్గిపోతది భక్తి మీద భక్తి మీద ఆసక్తి తగ్గిపోయి పూజ కూడా చేయాలని అనిపించదు. మనకి రోగాలు కూడా వచ్చే
(13:46) ఆస్కారం ఉంటది దాని గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తున్నా ఆ వీడియోలో నేను మీకు చెప్తా జబ్బులు ఉన్నవాళ్ళు రోగాలు ఉన్నవాళ్ళు చేతగాని వాళ్ళు పూజలు చేయలేరు. అవునా చేయగలరా కాలు చెయ్యి బాగున్నవాళ్ళు ఆ గట్టిగా ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు వాళ్లే వ్రతాలు దీక్షలు ఆ రోజు నిత్య పూజలు చేయగలరు.
(14:15) అప్పుడప్పుడు జబ్బులు వచ్చి ఈ కొన్ని జబ్బులు ఉంటాయి ఇప్పుడు నాకున్న ఐబిడి ఉంది అప్పుడప్పుడు అటాక్ అవుతది ఫైవ్ ఇయర్స్ బాగానే ఉన్నా మళ్ళీ అటాక్ అయింది అంటే అటాక్ కావడం కాదు యక్టివ్ అయింది అది యక్టివ్ అయింది. అది నిద్రావస్థలో ఉండే మళ్ళీ ఆక్టివ్ అయింది అదే గ్రహ దోషాలు ప్రారబ్ధ పాపకర్మ టైం అన్నమాట అది ఆ టైంలో నేను మరి పూజలు చేయలేను అట్లా అని చెప్పేసి భగవంతుడు నన్ను వదిలేస్తాడా నేను పూజలు చేయకపోతే ఈ టాపిక్ గురించే నేను ఒక వీడియో తయారు చేస్తున్న దాంట్లో చెప్తా నేను ఆ విషయం ఓకేనా ఈ ప్రారబ్ధ పాపకర్మ టైంలో మనల్ని ఆ రోగాలు లేకపోయినా కూడా కొంతమందికి పూజ మీద
(14:53) పూజ మీద ఆసక్తి తగ్గిపోతది భక్తి ఆసక్తి తగ్గిపోతది అంతే అంతేకాదు ఈ ప్రారబ్ధ పాపకర్మ ఈ మాయను జయించగలిగితే మనము ఈ గ్రహదోషాల టైం పీరియడ్ అయిపోగానే మళ్ళీ మనకి భక్తి మీద ఆసక్తి కలుగుతది భగవంతుడు తలుచుకోగానే రోమాలు నిక్కబడుచుకుంటాయి కళ్ళల్లో నీళ్ళ వస్తాయి కానీ ఈ మాయ అనేది ఆవహించినప్పుడు ఏం జరుగుతది అంటే మనకి ఈ టైంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి భక్తి అంటే ఆసక్తి తగ్గిపోయి భగవంతుడు ఇక రోగాలు తోని పెయిన్స్ తోని బాధపడుతున్న వాళ్ళయితే ఇంకా ఇంకా ఎక్కువ భగవంతుడి మీద కోపం వచ్చే ఆస్కారం కూడా ఉంటది.
(15:32) అవును ఆ దీన్నే మనం కొంచెం మేనేజ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు భక్తరామదాసుకి జైల్లో వేసి కొడుతున్నప్పుడు రామదాసే కదా ఆక్త రామదాసు ఆ భక్తరామదాసే అనుకుంటా సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము రామచంద్ర అని ఒక పాట ఉంటది చూడండి ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని పాడతాడు కదా అట్లా మనము దూషించే ఆస్కారం కూడా ఉంటది భగవంతుని కోప్పడే ఆస్కారం కూడా ఉంటది అలిగే ఆస్కారం ఉంటది భగవంతుడి మీద ఆ అట్లాంటివి కూడా జరగకుండా ఉండాలంటే ఇదే నా మాయను జయించాలంటే అప్పుడు ఇది నా కర్మే నేను పూర్వజన్మలలో ఎవరికో
(16:21) ఏదో అన్యాయం చేసిన కాబట్టే ఈ ఈ కర్మ నేను అనుభవిస్తున్న ఈ బాధ నేను అనుభవిస్తున్నా కాబట్టి ఓ ఆత్మలారా మీకు ఎవరికీ నేను అన్యాయం చేసినో కానీ నన్ను క్షమించండి నన్ను క్షమించండి అని కన్నీరు రిస్తూ పశ్చాత్తాప పడాలన్నమాట. పశ్చాత్తాపం వలన మన కర్మ కర్మ కరిగిపోతూ ఉంటది. ఆ ఆత్మలు మళ్ళీ పుట్టి ఉంటాయి కదా మరి వాళ్ళు వాళ్ళక ఎట్లా మన క్షమాపణలు అందుతాయి అంటే అవి అందుతాయి.
(16:52) ఇప్పుడు మన తాతలు మన తాతలు ముత్తాతలు చనిపోయినా కూడా వాళ్ళకు తద్దినాలు పెడుతూ ఉంటాం వాళ్ళకి అందవా అట్లా అన్నమాట పితృ దేవతలకి వాళ్ళు శాంతి ఇస్తారన్నమాట అట్లా అన్నమాట మనము ఏమైనా పూర్వజన్మలలో కర్మలు పాప కర్మలు చేస్తేనే ఈ జన్మలో మనము వాటిని అనుభవించడానికి మనం పుడతాం అన్నమాట అంతే చూడండి పూజలు అసలు చేయని వాళ్ళు కూడా ఆనందంగా సంతోషంగా అష్టే ైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారు అసలు ఇంట్లో దీపం వెలగదు స్తోత్రం ఉండదు అసలుకు టోటల్ గా వాళ్ళు తింటుంటారు జాబులు చేస్తుంటారు డబ్బులు సంపాదిస్తుంటారు ఎంజాయ్ చేస్తుంటారు అంతే దేవుడి మీద భక్తే ఉండదు కొంతమంది నయం ఇంకా అట్లా ఉన్నా కూడా
(17:35) భక్తి చేస్తుంటారు. కానీ అస్సలు చేయని వాళ్ళు కూడా బాగానే ఉంటారు. దానికి కారణం ఏందంటే మన పూర్వజన్మ ప్రారబ్ధ పాపకర్మ అనేది రాసుకొచ్చుకొని పుట్టిన పుట్టిన వాళ్ళం మనమైతే మనలాంటి వాళ్ళు కష్టాలు అనుభవిస్తారు వాళ్ళేమో రాసుకొచ్చుకోలేదు అన్నమాట పుణ్యకర్మ రాసుకొచ్చుకున్నారు ఈ జన్మలో గనుక పుణ్యం చేయకుండా ఆ పుణ్యం అంతా అనుభవిస్తూ ఉంటే నెక్స్ట్ జన్మలో వాళ్ళకి భయంకరమైన జన్మలు వస్తాయి అన్నమాట అది పాపం వాళ్ళకు తెలవదు అన్నమాట కాబట్టి పుట్టడం ఒకటే కాదు పుట్టినందుకు జన్మ సార్ధకత్వం చేసుకోవాలి ఎవరికైనా సహాయం చేస్తూ ఉండాలి దానధర్మాలు గాని ఇతర సహాయ
(18:11) సహకారాలు గాని అందించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. దానివల్ల కూడా మన ప్రారబ్ధ పాపకర్మ కరిగిపోతూ ఉంటది. జీవజంతు జాలాలకు కూడా మనము ఆహారాన్ని సమర్పిస్తూ ఉండాలన్నమాట. కాకులైనా పక్షులైనా కుక్కలైనా పిల్లులైనా వేటిని కూడా అసహించుకోకుండా వాటికి ఇంత ఆహారం పెట్టడానికి చూస్తూ ఉండాలన్నమాట. దానివల్ల కూడా చాలా వరకు ప్రారబ్ధ పాపకర్మ నశిస్తది.
(18:41) ఇంకోటి ఏందంటే కొంతమంది మాయలో పడతారు ఏందంటే అందం మాయలో ఆహా నేను అందంగా ఉన్నానా లేదా నేను ఫేషియల్ చేయించుకోవాలనా లేకపోతే నేను హెయిర్ స్టైల్ చేయించుకోవాలనా అనే ఈ మాయలో కూడా పడతారు. భక్తి అనేది ఎక్కువైనప్పుడు అందం మీద ఆసక్తి కూడా తగ్గిపోతది అలంకరణ మీద కూడా ఆసక్తి తగ్గిపోతది అంత పెద్దగా అలంకరించుకోవాలని ఉండదు. కాకపోతే ఇక్కడ నేను ఒక్కటి చెప్తా అమ్మవారి భక్తులు ఎవరైనా కూడా భక్తులు అమ్మవారిలాగా రెడీ కావడానికి ఇష్టపడతారు.
(19:08) కాకపోతే ఆ నేను అట్లా తయారయ్యి నన్ను అందరూ చూసి నేను అందంగా ఉంది నేను అందంగా ఉన్నా అని చెప్పి అందరూ నన్ను వచ్చి పొగడాలి అని ఒక అభిప్రాయం మాత్రం వాళ్ళకు ఉండదు అస్సలు ఉండదు. అస్సలు ఉండదు. ఇంకా ఎక్కువ అతి అయితే అతి భక్తి అయితే అమ్మవారిలాగా అలంకరణ కూడా ఉండదు. ఇప్పుడు యోగినిలు చిరిగిపోయిన చీరలు కూడా కట్టుకొని అసలు వస్త్రాలు కూడా లేకుండా ఉంటారు చూడండి వాళ్లకు అంటే దిగంబర యోగినిలు.
(19:36) కొంతమంది యోగినిలేమో అసలు వాళ్ళు ఏదో ఒక్క చీర మీందే చానా ఇప్పుడు చిత్రకూట పర్వతం దగ్గర యోగినిలు ఉంటారు బృందావనం సైడ్ అడవులల్లో మళ్ళీ శ్రీశైలం అడవులలో కూడా యోగిని మాతలు ఉంటారు. యోగిని యోగులు ఉంటారు యోగిని మాతలు ఉంటారు వాళ్ళకు వస్త్ర అలంకార వస్త్రధారణ మీద కూడా ఎక్కువ పెద్దగా ఉండదు ఒక బ్యాగ్ లో ఒక చీరు ఉంటది వాళ్ళ ఒంటి మీద ఒక చీర ఉంటది అంతే అంతే ఇగ ఆ రుద్రాక్షలు అవి ఏమిటి ఏమిటో ఉంటాయి అంతేగాని ఆ ఇట్లా విభూదులు అవి దొంగ దొంగ స్వామినీలు ఉంటారు కదా ఆడవాళ్ళు కొంతమంది ఇప్పుడు మనకు అక్కడక్కడ కనిపిస్తుంటారు ఇట్లా నాలుగు బొట్లు పెట్టేసి ఆ
(20:18) రుద్రాక్షలు చేతికి చుట్టుకొని రుద్రాక్షలు ఇంకా వేరే ఏంటి గొలుసులన్నీ వేసుకొని ఆ ఇట్లా తయారైపోయి నేను స్వామీజీ నేను నేను ఒక మాతని నేను ఒక మాతని అని ప్రకటించుకొని ఉంటారు చూడండి ఆ విధంగా కూడా ఉండరు అది కూడా ఒక మాయే నిజం అది కూడా ఒక మాయే భగవంతుని మీదకి పూర్తిగా మనసు లగ్నం అయినప్పుడు అసలు ఆ అలంకరణ కూడా ఉండదు [నవ్వు] పిచ్చివాళ్ళలాగా ఉంటారు నిజానికి కొంద అసలు రుద్రాక్షలు ఏవి వేసుకోకపోయినా కూడా ఆ శ్రీ రామకృష్ణ పరమహంస గారి గురించి చెప్తా కొంచెం రామకృష్ణ పరమహంస గారు ఎట్లా ఉండేవాళ్ళు మీకు రామకృష్ణ పరమహంస గారు ఫోటో చూసినప్పుడు ఆయన మెడలో మీకుఏమైనా
(21:04) రుద్రాక్షలు మాలలు ఆ నుదిటి మీద ఏమైనా బొట్లు నాలుగు బొట్లు కనిపించినాయా కానీ ఆయన కాళీమాతతోని ఆ మామూలుగా నార్మల్ గా మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట అంటే నార్మల్ గా మనం అమ్మతోని మన నాన్నతోని ఎట్లా మాట్లాడుతూ ఉంటాం మన పిల్లలతోని అట్లా నార్మల్ గా కాళీమాత అమ్మ వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉంటది ఆయనను ఒళ్లో పడుకోబెట్టుకొని జో కొడతది అర్థమైందా ఆ ఆయనకు గొంతు క్యాన్సర్ వచ్చినప్పుడు ఆయన నొప్పితోని విలవిలలాడుతుంటే ఆయనను పడుకోబెట్టుకొని ఆయనకు జో కొట్టి ఆ నొప్పి తగ్గే వరకు ఆయనకు నిద్రపోయే నిద్ర పుచ్చేది అన్నమాట కాళీమాత ఆ కాళీమాతకు ఆయన
(21:46) తినిపించేది ప్రసాదాలు గిట అన్నీ ఆ అంటే అంటే ఎంత ఆ ఎంత గొప్ప వ్యక్తి మరి ఆయన రుద్రాక్షలు అవన్నీ మాలలు ధరించి స్వామిజీవేషం వేయలేదే ఆయన ఆయన తాంత్రిక తాంత్రిక విద్యలు కూడా వచ్చు భైరవి మాత అని ఒక ఆమె ఉంటదిన్నమాట ఆమె గురువు అయి తాంత్రిక విద్యలు కూడా నేర్పిస్తది ఆయన ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరం లేదు కాకపోతే మానవులుగా జన్మించినప్పుడు దేవా దేవతలకు కూడా గురువులు అవసరం కదా అట్లానే శ్రీ రామకృష్ణ పరమహంస గారికి కూడా అట్లా భైరవి మాత వచ్చి ఆయనకు తాంత్రిక విద్యలు కూడా నేర్పిస్తది.
(22:21) అయినా కూడా ఆయన ఆయన ఏమి వేసుకోడు ఎప్పుడు తన్మయత్వంతోని సమాధిలో నిమగ్నం అయపోయా అంటే సమాధిలో అంటే ఎప్పుడు అమ్మవారి గురించే అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అంతే కాదు ఆయన ఇతర దేవీ దేవతలను కూడా ఆరాధించిండు ఆయన ఎప్పుడంటే అప్పుడు భగవంతుడితోని మాట్లాడుతున్నట్టు భగవంతుడు తన దగ్గరే ఉన్నట్టు ఇట్లా భావించి సమాధిలోకి వెళ్ళిపోతాడు అన్నమాట ఎప్పుడంటే అప్పుడు అందుకనే శిష్యులు ఎప్పుడు కాపు కాసుకొని ఉండేవాళ్ళ అన్నమాట ఎక్కడ కింద పడిపోతాడో అని నిలబడి నిలబడే సమాధిలోకి వెళ్ళిపోయేవాడు ఆయన రామకృష్ణ పరమహంస గారు నిలబడి నిలబడే తన్మయత్వంలో అమ్మవారిని
(23:01) గుర్తు చేసుకోగానే సమాధి మగ్నుడు అయిపోయేవాడు అట్లా కాబట్టి ఆ అది ఇది ఆయన మాయను పూర్తిగా జయించినవాడు రామకృష్ణ పరమహంస గారు ఎటువంటి మాయ లేదు ఆయన డబ్బులు కూడా ముట్టుకోకపోయేవాడు ఆయన డబ్బులు కూడా ముట్టుకోకపోయేవాడు అట్లా అన్నమాట ఆయన ఆయన చరిత్ర గురించి ఆయన చరిత్ర అయితే చదివింది చదువుతూ ఉంటా నేను కాబట్టి చెప్తున్నా ఇంకా ఇట్లా అన్నమాట ఈ అలంకరణ అనే మాయ కూడా నశించిపోతది మనకి ఈ అలంకరణ అనేది కూడా చేసుకోవాలని అనిపించదు పెళ్లిలు పేరంటాలు అయినప్పుడు మనకి అబ్బా అలంకరించుకోవాలా అని చెప్పి ఒక విసుగు వచ్చేస్తది అన్నమాట ఇక మాయలో
(23:47) ఊరుకపోయే వాళ్ళకు ఏం చేస్తదంటే ఈ మాయ మాయ ఏం చేస్తదంటే అలంకరణ మీదకి ఆసక్తి తీసుకపోతే కొంతమంది పాపం వీక్ పర్సన్స్ ఏమైపోతారంటే ఇంకా అలంకరణ గురించి అందం గురించి కూడా ఆరాటపడుతూ ఉంటారు అన్నమాట అహంకారం గర్వం మోహం ఈ రూపకంలో కూడా మాయ మనల్ని అటాక్ చేస్తది. ఇవి అటాక్ అయినప్పుడు భగవంతుడు కచ్చితంగా దూరమవుతాడు ఎందుకంటే అరిషడ్ వర్గాలు నియంత్రణలో ఉన్నంతవరకే భగవంతుడు మనకు అతి దగ్గరగా ఉంటాడు.
(24:20) ఇక అహంకారం గర్వం ఇవి ఒక్కొక్కసారి డబ్బులు అతిగా ఇచ్చి కూడా గర్వం వస్తదా అని కూడా ఆ భగవంతుడు చూస్తాడు అన్నమాట పరమాత్మ మీ ఇష్ట దైవం అతిగా డబ్బులు వచ్చినప్పుడు ఏం జరుగుతది అంటే ఇక భగవంతుడుని మర్చిపోయి ఎంజాయ్మెంట్స్ మీద పడతాం అంతే కాదు గర్వం కూడా అహంకారం కూడా వచ్చే ఆస్కారం ఉంటది. మళ్ళీ ఈ భర్త మీద భార్య భార్య మీద భర్త లేదా ఇది ఇతర స్త్రీల మీద మోహం కలుగుతదా అని చెప్పేసి అందమైన స్త్రీలనైనా అందమైన పురుషులనైనా కూడా భక్తుల ముందరికి తీసుకొచ్చే అవకాశం ఉంటది టెస్టులు పరీక్షలు జరుగుతాయి ఆ అదే మాయ ఆ మాయను కూడా మనము చేదించి భేదించాలంటే భగవన్ నామ స్మరణ చాలా మంచిది ముఖ్యంగా
(25:01) భగవంతుడి యొక్క రుచి టేస్ట్ చూసినప్పుడు భగవంతుడి యొక్క దర్శన షణల టైంలో ఉండే ఆనందం దొరికినప్పుడు అప్పుడు మనం దేనికి లొంగం ఇంకా ఎవ్వరికీ లొంగం కామాన్ని కూడా కట్ చేసి అక్కడ అవతల పారేస్తాం ఒక 16 ముక్కలు అర్థమైందా అట్ల అన్నమాట కామ ఇంకా కామదేవుడు మన్మధువుడు కూడా బాన వేసినా కూడా దాన్ని ఇరిసిరిసి ముక్కలు చేసి అవతల పారేస్తాం అన్నమాట ఎవ్వడు వచ్చి ముందర నిలబడ్డ కూడా మనకు మోహం అనేది కలగదు కామం అనేది కూడా కలగదు ప్రతి ఒక్కరిని ఒక స్త్రీ అయితే ప్రతి ఒక్కరిని పరమాత్మ దృష్టితోనే చూస్తది కన్నతండ్రి దృష్టితోనే పురుషుడైతే స్త్రీలను కన్నతల్లి
(25:43) సోదరి దృష్టితోనే చూస్తాదన్నమాట చూస్తాడన్నమాట ఆ రేంజ్ లోకి మనము వచ్చేస్తాం అన్నమాట మాయను చేదిస్తూ బేధిస్తూ ఉంటే మాయలో పడిపోతే ఏమైతది భర్త ప్రేమ కోసం అల్లల్లా ఆడిపోతారు అన్నమాట భార్య ప్రేమ కోసం అల్లల్లా ఆడిపోతారు అన్నమాట అక్రమ సంబంధాల కోసం లేదా కొంతమంది ఆ అక్క చెల్లెలు కూడా ఏందో విపరీతమైన ప్రేమ అనురాగాలతోనే ఉంటారు చాలా ఓవర్ గా ఉంటారు అన్నమాట అట్లా కూడా ఉంటారు కన్న పిల్లల మీద కూడా ప్రేమ మమకారం ఎక్కువ ఉంటది అది కామన్ అక్కడ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ఇది ఆత్మ మనుషులను మనం ఆత్మల దృష్టితో చూసినప్పుడు మాయను ఈజీగా చేదించి భేదించే భేదించేసేయొచ్చు అన్నమాట
(26:30) మనం కాబట్టి ఆత్మల దృష్టితో చూడడానికి ప్రయత్నించండి ఇదొక టిప్ అన్నమాట నేను చెప్పే టిప్పు ఎందుకంటే మనం ఎన్నో ఆత్మలతోని ఎన్నో జన్మలుగా సంబంధాలను కలిగి ఉన్నాం కాబట్టే మనం ఆత్మల దృష్టితో చూసినప్పుడు మనం మాయని ఈజీగా చేదించి భేధించగలం ఓకేనా ఇట్లా అన్నమాట ఇంకా మీకు మాయల గురించి ఇంకా ఏం చెప్పను చాలా వరకు చెప్పిన కదా [నవ్వు] ఓకే ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఇంకా ఏమైనా నా నుంచి ఎలాంటి ఆధ్యాత్మిక వీడియోస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చేయండి అని చెప్పేసి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నాకు తెలిస్తే నా అనుభవపూర్వకంగా నేను ఎక్స్పీరియన్స్ అయితే
(27:08) ఈజీగా చెప్పగలను కాబట్టి నేను వెంటనే వీడియో చేసేస్తా నాకు తెలిస్తే తెలివనివి చెప్పడం వలన ఏం లాభం చెప్పండి తెలివనివి చెప్పాను నేను తెలిసినవి తప్పకుండా చెప్తా ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం నమో నారాయణాయ
No comments:
Post a Comment