Sunday, March 1, 2026

******Why Do We Think We Know Everything? | Socrates Psychology in Telugu podcast

Why Do We Think We Know Everything? | Socrates Psychology in Telugu podcast

Author Name:Nagna Satyam

Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=sh3En6SHUc4



Transcript:
(00:05) మనకి నిజంగా తెలిసింది చాలా తక్కువ కానీ అన్నీ తెలిసినట్టు అనిపించేది మాత్రం చాలా ఎక్కువ. మనందరికీ పాలిటిక్స్ గురించి రిలేషన్షిప్స్ గురించి సక్సెస్ గురించి మంచి స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉంటాయి. కానీ అవన్నీ నీకు ఎలా తెలుసు? అసలు నీకు నిజంగా తెలుసా లేక తెలిసినట్టు బిల్డప్ేనా కోవిడ్ టైం లో చాలామందివాట్ లో వచ్చిన మెసేజ్ చదివి లేదా వీడియో చూసి ఈ మందు వేసుకుంటే వైరస్ పోతుంది అని నమ్మారు.
(00:35) అటు డాక్టర్లు సైంటిస్టులు సంవత్సరాలుగా చదివి రీసెర్చ్లు చేస్తుంటే ఐదు నిమిషాల వీడియో చూసిన మనిషి కాన్ఫిడెంట్ గా ఒక అడ్వైస్ ఇచ్చే స్థాయికి ఎడుగుతాడు. కొంత సమయం తర్వాత ఆ సమాచారం తప్పు అని తెలియగానే ఉలుకు పలుకు లేకుండా పోతారు. ఇలాంటివి జరిగినప్పుడే నాకు అనిపిస్తుంది. వీళ్ళు నిజంగా తెలిసి మాట్లాడతారా లేక తెలిసినట్టు బిల్డప్ ఇస్తారా సాక్రటీస్ కూడా ఇదే చెప్పాడు.
(01:02) తను ఉన్న కాలంలో డెల్ఫీ అనే టెంపుల్లో ఒరాకిల్ అతడే అత్యంత జ్ఞాని అని చెప్పిందని విన్నాడు. అది విన్న తర్వాత నేను నిజంగా అంత జ్ఞానినా అది ఎలా నిజమో తెలుసుకోవాలి అని అతనికి అనిపించింది. ఆ నిజాన్ని తెలుసుకోవడానికి రాజకీయ నాయకులు, కవులు, శిల్పులు, పండితులను కలిసి వాళ్ళందరితో మాట్లాడాడు. కానీ ఫైనల్ గా సాక్రటీస్ కి ఒకటి అర్థమైంది.
(01:28) వాళ్ళు తమకు తెలియని విషయాలను కూడా తెలుసుకున్నామనే భావనతో మాట్లాడుతున్నారని. చివరికి అతను గ్రహించిన విషయం ఏమిటంటే వాళ్ళకన్నా తాను గొప్పవాడిగా ఉన్నది తనకు తెలియని విషయం తెలియదని తెలిసినందుకే అందుకే చెప్పాడు నాకేమీ తెలియదని నాకు తెలుసు దీనికి అర్థం సాక్రటీస్ అజ్ఞాని అన్నది కాదు తనకు తెలిసింది తెలుసు తెలియనిది తెలియదని చెప్పినోడే జ్ఞాని ఎందుకంటే ఒక చిన్న దీపం వెలిగితే చీకటి ఎంత పెద్దదో కనిపించినట్టే జ్ఞానం పెరిగే కొద్దీ తెలియని ప్రపంచం ఎంత పెద్దదో కనిపిస్తుంది.
(02:06) అందుకే తెలివైనవాడు జ్ఞానవంతుడు నాకు అన్నీ తెలుసు అని గొప్పగా చెప్పుకోడు. సైలెంట్ గా ఉండి శ్రద్ధగా విని చివరికి నేర్చుకుంటాడు. నాకేమీ తెలియదు అని ఒప్పుకోవడంలో పెద్ద వీక్నెస్ ఏమీ లేదు. అక్కడే నీకున్న అహంకారం బయటపడుతుంది. అవివేకం కనిపిస్తుంది. మనిషి మెదడు నిజం కోసం కాదు సేఫ్ గా బ్రతకడానికి పని చేస్తుంది. ఏమీ తెలియకపోవడం మన బుర్రకి అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
(02:34) అసలు తెలియకపోతే ఏమవుతామో అనే భయం వస్తుంది. కంట్రోల్ తప్పినట్టు అనిపిస్తుంది. అందుకే మన బుర్ర వెంటనే ఒక నిర్ణయం తీసుకొని కొద్ది సమాచారాన్ని పూర్తిగా తెలిసినట్టు ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఇది మన అందరిలో జరిగేదే ఉదాహరణకు ఒక న్యూస్ విని వెంటనే జడ్జులం అయిపోతాం. మనమే తీర్పులు ఇచ్చుకుంటాం. ఒక వ్యక్తిని చూసి ఒక నిర్ణయానికి వస్తాం. ఒక సిచువేషన్ జరిగిన వెంటనే నిజం తెలుసుకున్నట్టు అనుకుంటాం.
(03:01) దీనిని నాలెడ్జ్ అనరు. ఇది మన బ్రెయిన్ క్రియేట్ చేసుకున్న షార్ట్ కట్ ఈ షార్ట్ కట్ మనల్ని రక్షించడానికి చాలా తిప్పలు పడుతుంది. కానీ నిజం తెలుసుకోవడంలో ఇదే అడ్డుగా మారుతుంది. అందుకే చాలాసార్లు మనక అంతా తెలుసు అని అనిపిస్తుంది. కానీ మనకు తెలిసింది గోరంత మాత్రమే తెలియాల్సింది కొండంత. ఇప్పటి ప్రపంచంలో డేటాకు కొరత లేదు కానీ అర్థం కొరతుంది.
(03:27) ఏదైనా తెలుసుకోవాలని చేతిలో ఫోన్ తీసుకొనిగగు లో లేదా YouTube లో వీడియో చూసి తెలుసుకుంటాం. ఆ తర్వాత ఒక పర్టికులర్ టాపిక్ మీద మనక అంతా తెలుసన్న ఫీలింగ్ వస్తుంది. ఒక ఆర్టికల్ చదివి డాక్టర్ అవ్వలేం. ఒక మోటివేషనల్ వీడియో చూసినంత మాత్రాన జీవితాన్ని అర్థం చేసుకోలేం. ఇక్కడే ఒపీనియన్ ఫాస్ట్ గా వస్తుంది. నాలెడ్జ్ మాత్రం స్లోగా ఎక్కుతుంది.
(03:51) ఒపీనియన్ కి కాన్ఫిడెన్స్ ఎక్కువ. నాలెడ్జ్ కి వినయం ఎక్కువ. మనకి తెలిసినట్టు అనిపించడం వల్ల మనకి తెలుసుకోవాలనే అవసరం తగ్గిపోతుంది. ఇక్కడే నేర్చుకోవాలనే కసి చచ్చిపోతుంది. నాకో డౌట్ నాకు తెలియదు అని చెప్పడానికి ఏం మాయరోగం? ఎందుకంటే ఇది డేటా సమస్య కాదు నీలో అహంకారం సమస్య. మనకి తెలియదు అని ఒప్పుకుంటే మన ఇమేజ్ దెబ్బ తింటుందేమో అనిపిస్తుంది.
(04:18) మనం చిన్నవాళ్ళం అయిపోతామేమో అని భయం ఎదుటివాడు మనకన్నా ఎక్కువగా కనిపిస్తాడేమో అనే భయం అందుకే మనం రెండు పనులు చేస్తాం. తెలిసినట్టు నటిస్తాం వాదనతో కవర్ చేస్తాం. దీనిని సైకాలజీలో సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటారు. మన ఈగోకి నేను తెలుసుకున్నాను అనే ఫీలింగ్ కావాలి. కానీ నిజానికి ఈగోకి సాటిస్ఫాక్షన్ ఎంత ఎక్కువైతే జ్ఞానం అంత తక్కువగా ఉంటుంది.
(04:45) నాకు తెలియదు అనడంలో నువ్వు చిన్నవాడివి కాదు నువ్వు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావని అర్థం. ఒక్కసారి మనస్ఫూర్తిగా నాకు తెలియదు అని చెప్పి చూడు ఆ క్షణం నీలో ప్రెజర్ తగ్గుతుంది. ప్రశాంతంగా ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటావ్. వినయ శక్తి పెరుగుతుంది. కొత్తగా నేర్చుకునే పాశక్తి వస్తుంది. ఎదుటివాడిని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
(05:07) తెలిసినట్టు నటిస్తున్నప్పుడు మనం మూసుకుపోతాం. తెలియదని ఒప్పుకున్నప్పుడు మనం తెలుచుకుంటాం. ఒకవేళ నువ్వు వాదించాలి అంటే ఏదైనా తెలిస్తేనే వాదిస్తావ్. తెలియకపోతే గుంపులో గొర్రెలాగా తల వంచుకొని పోతావ్.

No comments:

Post a Comment