Saturday, April 18, 2026

మరణం లేని యోగ శక్తి | అద్భుత రహస్య విద్య | Hindu Mythology God Stories in Telugu

మరణం లేని యోగ శక్తి | అద్భుత రహస్య విద్య | Hindu Mythology God Stories in Telugu

Author Name:Ruthwikam

Youtube Channel Url:https://www.youtube.com/@Ruthwikam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=BFZQL3XuJrs



Transcript:
(00:02) ప్రాణం పోయి విగతజీవిగా పడి ఉన్న ఒక దేహం అకస్మాత్తుగా లేచి కూర్చుంటుందా ఒకరి శరీరం నుండి ప్రాణం పోయాక ఆ మృతదేహంలోకి వేరొకరి ఆత్మ ప్రవేశించడం సాధ్యమైనా అసలు ఒక దేహం నుండి ఆత్మ బయటకు ఎలా వస్తుంది? మన భారతదేశంలోని మహాయోగులు వేల సంవత్సరాల క్రితమే మరణాన్ని జయించారు. తమ శరీరాన్ని ఒక చొక్కాలా భావించి ప్రాణం లేని మరొకరి శరీరంలోకి తమ ఆత్మను సునాయాసంగా ప్రవేశింపజేశారు.
(00:29) వినడానికి రోమాలు నిక్కబడుచుకునే ఈ భయంకరమైన అత్యంత ప్రమాదకరమైన అష్టసిద్ధి పేరే పరకాయ ప్రవేశం. ఇది ఎవరైనా చేయగలరా? ఒకవేళ ఆత్మ శరీరాన్ని వదిలి బయటకు వెళితే ప్రాణం లేని ఆ యోగి సొంత దేహానికి ఏమవుతుంది? ఆ శరీరంలో గుండె కొట్టుకుంటుందా రక్తం ప్రవహిస్తుందా ఆత్మ లేని ఆ శరీరం కుల్లిపోదా జంతువుల పాలవ్వదా వేల సంవత్సరాల క్రితమే పతంజలి మహర్షి ఈ అద్భుతమైన ప్రక్రియ గురించి తన యోగ సూత్రాలు ఏం చెప్పారు? లోక కళ్యాణం కోసం మరణించిన రాజుదేహంలోకి ఆత్మను పంపిన జగద్గురువు ఒకరైతే మూగజీవాల కన్నీరు తుడవడానికి ప్రాణాలను పణంగా పెట్టి 3000 ఏళ్లు పశువుల కాపరిగా బతికిన మహాశివ
(01:08) భక్తుడు మరొకరు. ఒక మహాయోగి ఏకంగా 17 శరీరాలు మార్చి 723 ఏళ్లు బతికాడు. ఈరోజు మన సనాతన ధర్మం సత్తాను మన యోగశాస్త్రం యొక్క అద్భుతమైన శక్తిని నిరూపించే పరకాయ ప్రవేశ ఘట్టాలను ఒకే వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తయ్యేసరికి మనిషి శరీరం పట్ల ఆత్మ పట్ల మీకున్న ఆలోచన విధానమే మారిపోతుంది. వీడియోని చివరి వరకు చూడండి.
(01:32) మీ రోమాలు నిక్కబడుచుకోకపోతే అడగండి. ఈ ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి. వీడియో ప్రారంభించే ముందు ఆ శివయ్యని కలుస్తూ ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(02:19) [సంగీతం] [సంగీతం] సుమారు 1200 సంవత్సరాల క్రితం సనాతన ధర్మం క్షీణిస్తున్న సమయంలో సాక్షాత్తు ఆ శివుడే శంకరాచార్యులుగా అవతరించాడు. భారతదేశంంతా పర్యటిస్తూ ఎందరో పండితులతో వాదించి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపిస్తున్నారు. ఆ క్రమంలోనే మహిష్మతి నగరానికి చెందిన మండన మిశ్రులు అనే గొప్ప పండితుడితో వాదన జరిగింది.
(02:54) ఆ వాదనకు న్యాయ నిర్ణయత ఎవరో తెలుసా? సాక్షాత్తు ఆ సరస్వతీ దేవి అంశతో జన్మించిన మండన మిశ్రుని భార్య ఉభయ భారతి. వారిద్దరి మధ్య వాదన హోరాహోరీగా సాగింది. చివరికి శంకరుల అపారమైన జ్ఞానం ముందు మండన మిశ్రులు ఓటమే అంగీకరించారు. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఉభయభారతి చిరునవ్వుతో ముందుకు వచ్చి శంకరాచార్యులతో ఇలా అన్నది. ఓ శంకర మీరు నా భర్తను ఓడించారు.
(03:16) కానీ భార్య అంటే భర్తలో సగం ఆయన అర్ధాంగిని అయిన నన్ను కూడా ఓడిస్తేనే మీరు సంపూర్ణంగా గెలిచినట్లు నాతో వాదనకు సిద్ధమేనా అని సవాలు విసిరింది. శంకరాచార్యులు చిరునవ్వుతో అంగీకరించారు. జ్ఞానానికి ప్రతీక అయిన ఉభయభారతి అడిగిన వేద వేదాంత ప్రశ్నలన్నిటికీ శంకరులు అవలీలగా సమాధానాలు చెప్పారు. శంకరుల జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆమె ఎలాగైనా ఆయనను ఓడించాలని ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది.
(03:43) అదే కామశాస్త్రం వెంటనే ఆమె శృంగారానికి దాంపత్య జీవితానికి సంబంధించిన ఎన్నో క్లిష్టమైన ప్రశ్నలను అడిగింది. అక్కడ సభలో ఉన్న వారంతా నిశబ్దమైపోయారు. ఆది శంకరాచార్యులు బాల బ్రహ్మచారి సన్యాసి ఆయనకు ప్రపంచంలో అన్నీ తెలుసు కానీ సంసార జీవితం కామశాస్త్రం భార్యా భర్తల మధ్య ఉండే అనుబంధం గురించి తెలియదు. ఆ ప్రశ్నలకు సమాధానం చెబితే ఆయన సన్యాస ధర్మానికి భంగం కలుగుతుంది.
(04:07) సమాధానం చెప్పకపోతే వాదనలో ఓడిపోయి అద్వైత స్థాపన ఆగిపోతుంది. అప్పుడు ఆదిశంకరాచార్యులు ఉభయభారతితో అమ్మ ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నాకు ఒక నెల రోజుల గడువు కావాలి అని అడిగి శిష్యులతో కలిసి అరణ్యానికి వెళ్ళారు. అలా అడవిలో వెళ్తుండగా ఒక పెద్ద చెట్టు కింద సైనికులు ఆహాకారాలు చేస్తున్నారు. ఏమైందని ఆరాధిస్తే అమురుకుడు అనే మహారాజు వేటకు వచ్చి గుండెపోటితో అకస్మాతుగా మరణించాడని తెలిసింది.
(04:33) అప్పుడు శంకరుల మధ్యలో ఒక విరుపులాంటి ఆలోచన వచ్చింది. ఉభయభారతి అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే గృహస్థ జీవితాన్ని అనుభవించాలి. సన్యాసిగా అది సాధ్యం కాదు కాబట్టి చనిపోయిన ఈ రాజు శరీరంలోకి ప్రవేశించి ఆ రాజు ద్వారానే ఆ అనుభవాలను తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన శిష్యులను పిలిచి ఒక రహస్య ప్రదేశంలో ఉన్న గుహలోకి తీసుకువెళ్ళాడు.
(04:55) శిష్యులారా నేను నా సూక్ష్మ శరీరాన్ని ఈ భౌతిక దేహం నుండి వేరుచేసి ఆ మరణించిన రాజ శరీరంలోకి పంపుతాను. సరిగ్గా ఒక నెల రోజుల పాటు నా ఈ భౌతిక శరీరాన్ని ఈ గుహలోనే భద్రంగా కాపాడండి. ఏమాత్రం ప్రమాదం జరిగినా నేను తిరిగి రాలేను అని హెచ్చరించాడు. పద్మపాదులు వంటి ప్రియ శిష్యులు కన్నీటితో గురుదేవుని అగ్ని శిరసావహించారు. ఆదిశంకరాచార్యులు పద్మాసనంలో కూర్చొని కళ్ళు మూసుకున్నారు.
(05:18) మెల్లగా ఆయన శ్వాస గుండె చప్పుడు ఆగిపోయింది. తన ప్రాణశక్తిని మూలాధారం నుండి ఆజ్ఞ చక్రానికి తీసుకువచ్చి బ్రహ్మరంద్రం గుండా తన ఆత్మను శరీరం నుండి బయటకు పంపాడు. గాలిలో ప్రయాణించిన ఆ మహాజ్యోతి అడవిలో విగతజీవిగా పడి ఉన్న అమరుక మహారాజు దేహంలోకి ప్రవేశించింది. అంతే ప్రాణాలు విడిచిన ఆ రాజు అమాంత కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు.
(05:38) మరణించాడనుకున్న రాజు బతికి రావడంతో సైనికుల ఆనందానికి అవధులు లేవు. జయ జయ ద్వానాల మధ్య రాజును నగరానికి తీసుకువెళ్ళారు. రాజు శరీరంలో ఉన్న ఆది శంకరాచార్యులు అంతఃపురంలోకి వెళ్లి సన్యాస ధర్మానికి ఏమాత్రం భంగం కలగకుండా గృహస్థాశ్రమ ధర్మాలను కామశాస్త్ర రహస్యాలను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. కానీ ఇక్కడ ఒక గొప్ప రహస్యం ఉంది. తామరాకు మీద నీటి బిందువు ఎలాగైతే అంటకుండా ఉంటుందో శంకరాచార్యుల ఆత్మ కూడా ఆ భోగాలను అనుభవిస్తున్న వాటికి బానిస కాలేదు.
(06:06) శంకరుల మనసు శివుని పాదాల దగ్గరే ఉంది. శరీరం మాత్రం రాజుది. మనసు మాత్రం ఒక వైరాగిది. అయితే కొద్ది రోజుల్లోనే రాజుగారి మంత్రులకు రాణులకు ఒక అనుమానం రావడం మొదలైంది. ఒకప్పుడు ఎప్పుడు భోగాలలో తేలియాడే రాజుగారు ఇప్పుడు ఎంతో జ్ఞానిలా ధర్మబద్ధంగా మాట్లాడుతున్నాడు. రాజ్యంలో పేదలకు ఎన్నో దానధర్మాలు చేస్తున్నాడు. కచ్చితంగా ఎవరో మహాయోగి పరకాయ ప్రవేశం చేసి మన రాజు శరీరంలోకి వచ్చాడు.
(06:32) ఆ యోగి ఎప్పటికీ మన రాజు దేహంలోనే ఉండిపోవాలంటే ఆయన అసలు శరీరాన్ని వెతికి తగలబెట్టేయాలి అని కుట్రపన్నారు. వెంటనే దేశమంతటా ఒక చాటింపు వేయించారు. రాజ్యంలో ఎక్కడ అనామక శివాలు కనిపించినా వెంటనే దహనం చేసేయమని రాజుగారి పేరుతోనే రహస్యంగా ఆజ్ఞలు జారీ చేశారు. సైనికులు అడవుల్లో గాలిస్తూ గుహలో ఉన్న ఆదిశంకరాచార్యుల శరీరాన్ని కనుగొన్నారు.
(06:55) శిష్యులను చితకబాది శంకరుల వారి పవిత్ర దేహాన్ని బయటకు లాగి ఒక చితి పేర్చి దానికి నిప్పు పెట్టారు. శిష్యులు గుండెలు బాధుకుంటూ ఏడుస్తున్నారు. గురుదేవా మీ శరీరం కాలిపోతుంది. వెంటనే రండి అంటూ ఆహాకారాలు చేస్తున్నారు. నెల రోజుల గడువు తిరిగిపోతుందని గ్రహించిన శంకరాచార్యులు తన సూక్ష్మ శరీరంతో వేగంగా అరణ్యానికి చేరుకున్నాడు. కానీ అప్పటికే జరగకూడని గోరం జరిగిపోతుంది.
(07:16) చితిమంటలు శంకరుల పాదాల వరకు వ్యాపించాయి. కాలిపోతున్న ఆ దేహంలోకి ఆయన తన ఆత్మను ప్రవేశపెట్టారు. అయితే ఆ చతిమండల వేడిని తట్టుకోలేక ఆ ఆర్తనాదంతో సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ప్రార్థిస్తూ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పటించాడు. భక్తికి కరిగిపోయిన స్వామి అగ్నిని చల్లార్చి శంకరాచార్యులకు ప్రాణదానం చేశారు.
(07:37) శంకరులు ఎంతో తేజస్సుతో చిరునవ్వు చిందిస్తూ మంటల్లోనుంచి బయటకు వచ్చేసరికి శిష్యుల ఆనందానికి అవదులు లేవు. ఆ తరువాత జగద్గురు ఆదిశంకరాచార్యులు కామశాస్త్ర జ్ఞానంతో ఉభయభారతి దగ్గరకు వెళ్లి ఆమె అడిగిన అన్ని ప్రశ్నలకు సంపూర్ణమైన జ్ఞానంతో సమాధానాలు ఇచ్చి అద్వైత సిద్ధాంతాన్ని నలుదిశల వ్యాపింపజేశారు. చూశారుగా ఒక మహా కార్యం కోసం ధర్మ సంస్థాపన కోసం ఒక యోగి పడిన తపన ఇది.
(08:00) అయితే ఆది శంకరాచార్యుల వారి దేహం అగ్నిలో కాలితే ఆయన దేవుడిని ప్రార్థించి బతికించుకున్నారు. కానీ ఒక మహాయోగి తన దేహాన్ని వదిలి వెళితే ఆ శరీరాన్ని దేవుడే మాయం చేశాడు. ఆ తర్వాత ఆయన పరిస్థితి ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం కైలాస పర్వతం మీద సుందరనాథర్ అనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. కైలాసంలో ఆ పరమశివుడి వాహనమైన నందీశ్వరుని వద్ద అష్ట సిద్ధులను పరకాయ ప్రవేశ విద్యను నేర్చుకున్న గొప్ప సిద్ధుడు ఆయన.
(08:27) ఒకరోజు సుందరనాథకు దక్షిణ భారతదేశంలో ఉన్న అకాస్య మహామునుని కలవాలని కోరిక పుట్టింది. వెంటనే గురువు ఆజ్ఞ తీసుకొని కైలాసం నుండి కాలి నడకన దక్షిణ దిశగా ప్రయాణం ప్రారంభించాడు. అలా నడుస్తూ నడుస్తూ కేదార్నాథ్, పశుపతినాథ్, కాశీ, శ్రీశైలం, కాళహస్తి ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ కావేరీ నది తీరాన ఉన్న సాతనూర్ అనే ఒక చిన్న గ్రామానికి చేరుకున్నాడు.
(08:49) అయితే ఆ గ్రామం పులిమేరలో నడుస్తున్న ఆయనకు గుండెని పిండేసే ఒక దృశ్యం కనిపించింది. అక్కడ వందలాది ఆవులు ఒక గుంపుగా చేరి ఒక చోట నిలబడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాయి. మనుషులు ఏడ్చినంత దీనంగా గుండెలు పగిలేలా రంకెలు వేస్తూ ఆ ఆవులు కన్నీరు కారుస్తున్నాయి. ఆవులకు అంత బాధ ఎందుకు వచ్చిందో అర్థం కాక సుందరనాథ దగ్గరికి వెళ్లి చూశాడు.
(09:11) ఆవుల మధ్యలో ఒక యువకుడు విగతజీవిగా పడి ఉన్నాడు. అతని పేరు మూలన్ అతను ఒక సాధారణ పశువుల కాపరి రోజు ఆ ఆవులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాటిని ప్రేమిస్తూ జీవించేవాడు. అలాంటి మూలన్ను ఒక విషనాగు కాటు వేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. తమను ప్రాణంగా చూసుకుని అతను కింద పడిపోవడంతో ఆ మూగజీవాలకు ఏమీ అర్థం కాలేదు.
(09:32) ఆ గోవులు మూలన్ ముఖాన్ని నాకుతూ తమ కొమ్ములతో నెట్టుకుంటూ అతన్ని నిద్ర లేపడానికి ప్రయత్నిస్తున్నాయి. అతను ఎంతకీ లేవకపోవడంతో ఆ ఆవుల కలలో నుండి దారాలుగా కన్నీరు కారుతుంది. సాక్షాత్తు కైలాసంలో ఉండి కామక్రోధ మోహాలను జయించిన సుందరనాథ్ ఆ మూగజీవాల కన్నీటిని చూసి చలించిపోయాడు. ఆవులకు తమ యజమాని బతికొచ్చాడు అన్న ఆనందాన్ని ఒక్కసారైనా ఇవ్వాలని ఆ మహాయోగి అనుకున్నాడు.
(09:55) వెంటనే సుందరనాథ్ చుట్టుపక్కల అంతా వెతికాడు. ఎవరికంటా అప్పడని ఒక సురక్షితమైన చెట్టు తొర ఆయనకు కనిపించింది. తన అద్భుతమైన యోగి శరీరాన్ని ఆ చెట్టు తొరలో భద్రంగా దాచి పద్మాసనంలో కూర్చున్నాడు. తన శరీరంలోని ప్రాణవాయువును ఆజ్ఞ చక్రం ద్వారా బయటకు పంపాడు. గాలిలో అదృశ్య రూపంలో ప్రయాణించిన సుందర్నాథ్ ఆత్మ మరణించిన పశువుల కాపరి మూలన్ శరీరంలోకి ప్రవేశించింది.
(10:18) చనిపోయాడు అనుకున్న మూలన్ ఒక్కసారిగా కళ్ళు తెరిచేసరికి ఆ ఆవుల ఆనందానికి అవధులు లేవు. అతని చుట్టూ తిరుగుతూ సంతోషంతో గంతులు వేశయి. ఆ మూగజీవాల కలలో ఆనందం చూసి సుందర్నాథర్ కూడా ఎంతో సంతోషించాడు. సాయంత్రం అయ్యేవరకు ఆవులతో గడిపి వాటిని సురక్షితంగా గ్రామానికి తీసుకువెళ్ళాడు. అయితే మూలన్ రూపంలో ఉన్న సుందర్నాథర్ని చూసి మూలన్ భార్య ఆప్యాయంగా దగ్గరకు రాబోయింది.
(10:43) కానీ సుందర్నాథర్ వెనక్కి తగ్గాడు. తల్లి నేను నీ భర్తను కాను నన్ను ముట్టుకోకు నాకు ఈ ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి తన శరీరం దాచిపెట్టిన చెట్టు తొర దగ్గరకు వెళ్ళాడు. కానీ అక్కడ సుందర్నాథరికి ఒక ఊహించని షాక్ తగిలింది. తాను దాచిపెట్టిన శరీరం అక్కడ లేదు. ఆ చెట్టు తొర ఖాళీగా ఉంది. ఏమైనా జంతువులు లాకెళ్ళలాయా ఎవరైనా దొంగిలించారా అని అనువనువు వెతికాడు.
(11:06) కానీ అతని దేహం ఎక్కడా కనిపించలేదు. తాను ఎప్పటికీ ఈ పశువుల కాపరి శరీరంలోనే ఉండిపోవాలా అగస్త్య మునుడిని కలవాలన్న నా కోరిక ఏమైపోవాలి అని తీవ్రమైన ఆవేదనకు గురయ్యాడు. వెంటనే తన దివ్య దృష్టితో చూశాడు. సుందరనాథ దేహాన్ని మాయం చేసింది మరెవరో కాదు సాక్షాత్తు ఆ శివుడే కైలాసంలో ఉన్న వేదజ్ఞానం ఒక సామాన్య పశువుల కాపరి శరీరం ద్వారా ఈ లోకానికి తెలియాలని పరమశివుడి సంకల్పం తన కైలాస యోగ శరీరం దక్కలేదనే బాధను పక్కన పెట్టి ఈశ్వరుని ఆజ్ఞను శిరసావహించాడు.
(11:36) ఆ రోజు నుండి ఆయన పేరు తిరుమూలర్ గా మారింది. తిరుమూలర్ ఆ పక్కనే ఉన్న తిరుగావడదురై అనే గ్రామంలో ఒక రావి చెట్టు కింద ధ్యానంలో కూర్చున్నాడు. అతని తపస్సు ఎలాంటిది అంటే సంవత్సరంంతా కదలకుండా ధ్యానంలోనే ఉండేవాడు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే కళ్ళు తెరిచేవాడు. కళ్ళు తెరిచి తన జ్ఞానంతో ఒక్క పద్యం రాసేవాడు. మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయేవాడు.
(11:58) అలా ఏడాదికి ఒక పద్యం చొప్పున ఏకంగా 3000 సంవత్సరాలు ఆ పశువుల కాపరి శరీరంలోనే జీవించి 3000 పద్యాలు రాశాడు. ఆ 3000 పద్యాల కలయకే ఈరోజు తమిళనాడులో ఎంతో పవిత్రంగా పూజించబడే మహా గ్రంథం తిరుమంత్రం. ప్రాణాయామం గురించి యోగ విద్య గురించి మనిషి దేవుడిలో ఎలా లీనం అవ్వాలి అనే విషయాల గురించి ఈ పుస్తకంలో ఎంతో అద్భుతంగా రాశారు తిరుమూలర్ అయితే ఇప్పటికీ తమిళనాడులోని తిరువావడతురై ఆలయంలో తిరుమూలర్ గారి జీవ సమాధి ఉంది.
(12:27) చూశారుగా మిత్రులారా దేవుడి ప్రణాళికలు ఎంత అద్భుతంగా ఉంటాయో కేవలం కొన్ని మూగజీవాల కన్నీరు తుడవడం కోసం తన అత్యంత శక్తివంతమైన దేహాన్ని వదిలేసి ఒక పశువుల కాపరి దేహంలో 3000 ఏళ్లు బ్రతికి కోట్లాది మంది హృదయాల్లో తిరుమూలర్గా శాశ్వతంగా నిలిచిపోయాడు. కానీ ఈ పరకాయ ప్రవేశం గురించి వింటుంటే మీకు ఇంకో అనుమానం రావచ్చు.
(12:50) మనిషి ఆత్మ కేవలం మనిషి శరీరంలోకి వెళ్తుందా జంతువుల పక్షుల శరీరాల్లోకి వెళ్ళలేదా అంటే వెళ్ళింది. ఒక మహాభక్తుడు స్వర్గలోకం నుండి ఒక దివ్యమైన పుష్పాన్ని తీసుకురావడానికి తన మనిషి దేహాన్ని వదిలి ఒక చిలుక శరీరంలోకి పరకాయ ప్రవేశం చేశాడు. కానీ ఆయన చిలుక రూపంలో స్వర్గలోకానికి వెళ్ళిన సమయంలో ఇక్కడ భూమిమీద ఆయన దేహాన్ని మంటలో తగలబెట్టారు. తన మానవ దేహం బుడిద అయిపోతే అతడు జీవితాంత చిలుక రూపంలోనే ఉండిపోయాడా? అసలు చిలుక శరీరంలో ఉండి దేవుడిని ఎలా కొలిచాడో ఇప్పుడు తెలుసుకుందాం.
(13:21) 15వ శతాబ్దంలో అరుణగిరినాథ అరుణాచలంలో ఉండేవాడు. ఆయన సాక్షాత్తు శివపార్వతుల ముద్దుల పట్టి అయిన కుమారస్వామికి పరమ భక్తుడు. ఆయన నోరు తెరిస్తే మురుగనిపై పుట్టే అద్భుతమైన పాటల ప్రవాహమే తిరుపుగల్ అరుణగిరినాథర్ భక్తికి కవిత్వానికి ఆకర్షితుడైన ఆనాటి రాజు ప్రౌడదేవరాయలు ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చేవాడు. కానీ ఎంత గొప్పవాడినికైనా శత్రువులు ఉండటం సహజం కదా అదే ఆస్థానంలో సంబంధాన్నన్ అనే ఒక దుష్ట పండితుడు ఉండేవాడు.
(13:49) అరుణగిరి నాధర్కు రాజు ఇస్తున్న గౌరవం చూసి ఊర్వలేకపోయాడు. సరిగ్గా అదే సమయంలో రాజుగారికి కంటి చూపు మందగించింది. ఇదే అదనుగా భావించిన సంబంధాండన్ రాజా మీ కంటిచూపు తిరిగి రావాలంటే స్వర్గలోకంలో ఇంద్రుడు నందన వనంలో మాత్రమే పూసే పారిజాత పుష్పాన్ని తీసుకురావాలి. అది కేవలం అరుణగిరి నాధర్ వల్ల మాత్రమే సాధ్యం అని నూరుపోశాడు. రాజుకు వేరే దారి లేక అరుణగిరి నాధుడిని ఆశ్రయించాడు.
(14:13) లోక కళ్యాణం కోసం రాజుగారి క్షేమం కోసం అరుణగిరి నాధర్ ఆ కఠినమైన పనికి సిద్ధపడ్డాడు. అతను అరుణాచలేశ్వర ఆలయ గోపురం పైకి వెళ్లి ఎవరి కంటపడని ఒక రహస్య గదిలో తన శరీరాన్ని దాచాడు. స్వర్గ లోకానికి వెళ్ళాలంటే పక్షిరూపం సరైనదని భావించగా అప్పుడే గోపురం పైన చనిపోయి పడి ఉన్న ఒక చిలుక అతని కంటపడింది. వెంటనే కుండలిని శక్తిని మేలుకొల్పి తన శరీరంలోని ఆత్మను బయటకు పంపాడు.
(14:37) గాలిలో ప్రయాణించిన ఆ దివ్యమైన ప్రాణశక్తి ప్రాణం లేని ఆ చిలుక దేహంలోకి ప్రవేశించింది. నిర్జీవంగా పడి ఉన్న ఆ చిలుక ఒక్కసారిగా రెక్కలు ఆడిస్తూ ఆకాశంలోకి ఎగిరింది. ఆ చిలుక రూపంలో ఉన్నది సాక్షాత్తు ఆ మహాభక్తుడు అరుణగిరి నాదరే కుమారస్వామి నామాన్ని స్మరిస్తూ మేఘాలను చీల్చుకుంటూ స్వర్గలోకం వైపు పయణమయ్యాడు. కానీ ఈ భూమి మీద ఒక ఘోరం జరగబోతుంది.
(15:00) దుష్టుడైన సంబంధాన్న గోపురంఅంతా గాలించాడు. ఒక చీకటి గదిలో ధ్యాన ముద్రలో ప్రాణం లేకుండా పడి ఉన్న అరుణగిరినాథ దేహాన్ని చూడగానే సంబంధాండన్ కలలో క్రూరమైన ఆనందం ఇదే అదను ఈ దేహాన్ని నాశనం చేస్తే అరుణగిరినాథన్ ఇంకెప్పటికీ తిరిగిరాడు అని నిర్ణయించుకున్నాడు. వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్లి మహారాజ పారిజాత పుష్పం తేవడానికి వెళ్ళిన అరుణగిరినాథన్ దారిలోనే ప్రాణాలు విడిచాడు.
(15:25) అతని మృతదేహం గోపురంలో దొరికింది అని అబద్ధం చెప్పాడు. అప్పటి నియమాల ప్రకారం మృతదేహాన్ని ఉంచకూడదు కాబట్టి రాజు దహన సంస్కారాలకు అనుమతి ఇచ్చాడు. కొద్దిసేపటికి ఆకాశం నుండి ఆ చిలుక ఒక దివ్యమైన పారిజాత పుష్పాన్ని నోట కరుచుకొని సంతోషంగా ఎగురుకుంటూ నేరుగా తాను శరీరం దాచిపెట్టిన గోపురం గదిలోకి వెళ్ళింది. అక్కడ అరుణగిరినాథ శరీరం లేదు. తన దేహానికి ఏం జరిగిందో అర్థమయింది.
(15:46) కానీ అరుణగిరినాథ కోపంతో రగిలిపోలేదు. కుమారస్వామికి నా పాత శరీరం ఇష్టం లేనట్లుంది. అందుకే నాకు ఈ పవిత్రమైన పక్షి దేహాన్ని ప్రసాదించాడు అనుకున్నాడు. ఆ చిలుక దేహంలోని జీవితాంతం ఉండిపోయి అరుణాచలం గోపురం మీద కూర్చొని తన మధురమైన గొంతుతో కందర్ అనుభూతి అనే కావ్యాలను రచించి సుబ్రహ్మణ్య స్వామిలో ఐక్యమయ్యాడు ఆ మహాభక్తుడు.
(16:08) ఇప్పటికీ మీరు అరుణాచలం వెళితే అక్కడ గుడిలో కిలుగోపురం అంటే చిలుకగోపురం అనే ఒక కట్టడం కనిపిస్తుంది. అది మరెవరిదో కాదు పక్షిగా మారిన అరుణగిరినాథ త్యాగానికి నిలువెత్తు సాక్ష్యం. అయితే ఇదే పరకాయ ప్రవేశ విద్యను ఒక మహారాజు పదే పదే తన సొంత ప్రయోజనాల కోసం శత్రువుల మీద విజయాల కోసం రకరకాల శరీరాల్లోకి మారుతూ ప్రయోగించాడు. తన రాజ్యాన్ని అంతపురంలోని మహారాణులను ఆ కామాంధుడి భార్య నుండి ఎలా కాపాడుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.
(16:36) పూర్వం ఉజ్జైనీ మహానగరాన్ని విక్రమాదిత్యుడు పాలిస్తున్నాడు. ఆయన కేవలం ఒక మహారాజు మాత్రమే కాదు సాక్షాత్తు ఆ మహాకాళీ అమ్మవారి అనుగ్రహం పొందిన ఉపాసకుడు. ధైర్య సాహసాలతో పాటు తంత్ర మంత్ర యోగ విద్యలన్నిటిని అవపోస పట్టిన మహాజ్ఞాని విక్రమార్కుడి దగ్గర పరకాయ ప్రవేశం అనే ఒక బ్రహ్మాస్త్రం ఉందని కొందరికి మాత్రమే తెలుసు.
(16:57) విక్రమార్కుడు పతంజలి యోగ సూత్రాలను సాధన చేసి ఈ సిద్ధిని పొందాడు. మహారాజు కీర్తి ప్రతిష్టలు దేశ దేశాలకు పాకాయి. అయితే ఒకరోజు ఉజ్జైనీ నగరానికి ఒక కాపాలిక మాంత్రికుడు వచ్చాడు. ఆ మాంత్రికుడు అష్టసిద్ధులను దుర్వినియోగం చేస్తూ రాజ్యాలను ఆక్రమించుకోవాలని కుట్రలు పన్నేవాడు. ఎలాగైనా విక్రమార్కుడి రాజ్యాన్ని ఆయన అంతపురంలో ఉన్న అందమైన రాణులను సొంతం చేసుకోవాలని ఆశపడ్డాడు.
(17:19) కానీ విక్రమార్కుడిని యుద్ధంలో ఓడించడం ఎవరి తరం కాదు. అందుకే ఆ మాంత్రికుడు ఒక కుటిల పన్నాగాన్ని ఎంచుకొని సాధువు వేషంలో విక్రమార్కుడి ఆస్థానానికి వెళ్ళాడు. తన మాయ మాటలతో జ్యోతిష్యంతో రాజుగారికి అత్యంత ఆప్తుడిగా మారిపోయాడు. విక్రమార్కుడు కూడా ఆ సన్యాసిని నమ్మాడు. అయితే ఒకరోజు ఆ కపట మాంత్రికుడు విక్రమార్కుడిని ఒంటరిగా అడవిలోకి తీసుకువెళ్లి అక్కడ చనిపోయి ఉన్న ఒక పక్షిని చూపించి మహారాజా మీకు నిజంగా పరకాయ ప్రవేశం వస్తే ఆ పక్షిలో ప్రవేశించి చూపించండి అని రెచ్చగొట్టాడు.
(17:49) విక్రమార్కుడు నిజం నిరూపించడానికి తన రాజదేహాన్ని పక్కన పెట్టి మూలాధారం నుండి ప్రాణశక్తిని పైకి తీసుకువచ్చి ప్రాణం లేని ఆ పక్షి శరీరంలోకి ప్రవేశించాడు. అంతే నిర్జీవంగా పడి ఉన్న ఆ పక్షి ఒక్కసారిగా రెక్కలు ఆడిస్తూ లేచింది. కానీ ఇక్కడే మహాద్రోహం జరిగింది. పక్కనే ఉన్న అదుష్ట మాంత్రికుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన ముసలి దేహాన్ని వదిలేసి తన ఆత్మను ప్రాణం లేకుండా పడి ఉన్న విక్రమార్కుడి శరీరంలోకి ప్రవేశింపజేశాడు.
(18:15) అంతే విక్రమార్కుడి కళ్ళు తెరుచుకున్నాయి. కానీ ఆ శరీరంలో ఉన్నది విక్రమార్కుడు కాదు కామాందుడైన మాంత్రికుడు. పక్షి రూపంలో ఉన్న నిజమైన విక్రమార్కుడు ఈ మోసం చూసి షాక్. సాటిలేని మహావీరుడు లక్షలాది సైన్యానికి అధిపతి అయిన ఒక చక్రవర్తి ఇప్పుడు కేవలం ఒక చిన్న పక్షిగా మారిపోయాడు. నకిలీ రాజు సగర్వంగా అంతపురంలోకి వెళ్లి రాణుల మీద కన్నేశాడు.
(18:37) పక్షి రూపంలో ఉన్నప్పటికీ విక్రమార్కుడి అపారమైన మేదస్సు తగ్గలేదు. ఎలాగైనా ఆ మాంత్రికుడిని తన శరీరం నుండి బయటకు రప్పించాలని ఒక అద్భుతమైన పథకం పన్నాడు. వెంటనే మహారాణి గదిలోకి వెళ్లి ఆమె భుజం మీద వాలాడు. ఆ చిలుక మనుషుల భాషలో అద్భుతమైన ధర్మ సూక్ష్మాలను మహారాణికి మాత్రమే తెలిసిన రహస్యాలను చెప్పడం మొదలు పెట్టింది.
(19:00) ఆ పక్షి తెలివితేటలకు దాని మాటలకు రాణులందరూ ముగ్దులై దానిని ప్రాణంగా చూసుకోవడం మొదలు పెట్టారు. ఆ పక్షిని చంపాలని మాంత్రికుడు ప్రయత్నించిన కుదరలేదు. అప్పుడు పక్షి రూపంలో ఉన్న విక్రమార్కుడు ఒక నాటకం ఆడాడు. ఓ మహారాజా నీకు నిజంగా అంత శక్తే ఉంటే బయట చనిపోయి ఉన్న ఆ మేక శరీరంలోకి ప్రవేశించి చూపించు అని నకిలీ రాజు అహంకారాన్ని దెబ్బ తీసేలా అందరి ముందు సవాలు విసిరాడు.
(19:21) ఆ పక్షి మాటలకు మహారాణులు సందేహం మొదలైంది. ఒక చిన్న పక్షి అవమానిస్తుంటే అహంకారం దెబ్బతిన్న ఆ మాంత్రికుడు ఆలోచించకుండా సింహాసనం మీద ఉన్న విక్రమార్కుడు రాజ శరీరాన్ని వదిలేసి ఆ మేఘ శరీరంలోకి ప్రవేశించాడు. ఇదే అతని కోసం చూస్తున్న విక్రమార్కుడు మెరుపు వేగంతో చిలుక శరీరాన్ని వదిలి తన సొంత రాజదేహంలోకి ప్రవేశించాడు.
(19:42) సింహంలా నిద్రలేచిన విక్రమార్కుడు కత్తి దూసి ఆ మేఘ రూపంలో ఉన్న మాంత్రికుడిని ఒకే వేటితో అంతం చేశాడు. తన అపారమైన బుద్ధి బలంతో ఒక చిన్న పక్షి దేహంలో ఉండి కూడా తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు విక్రమాదిత్యుడు. అయితే ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు? ఒకప్పుడు 100 ఏళ్లు బతికేవారు. ఇప్పుడు ఆ ఆయుషషు 60 లేదా 70 ఏళ్లకు పడిపోయింది.
(20:04) మానవుని ఆయుషషును పెంచడానికి ఆధునిక సైన్స్ మెడికల్ టెక్నాలజీ ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. కానీ మన భారతదేశంలో ఈ ఆధునిక యుగంలోనే ఒక మహాయోగి ఏకంగా 723 సంవత్సరాల పాటు జీవించాడు అని చెబితే మీరు నమ్ముతారా? అవును అక్షరాల 723 ఏళ్ళు ఆయన పుట్టినప్పుడు ఢిల్లీ సుల్తానులు ఉన్నారు ఆ తర్వాత మొగల్ సామ్రాజ్యం వచ్చింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు.
(20:26) చివరికి భారతదేశానికి స్వతంత్రం కూడా వచ్చింది. ఇన్ని వందల ఏళ్ళు ఒకే మనిషి ఎలా బతికాడు? మనిషి శరీరానికి ముసలితనం రాదా అంటే వచ్చింది. కానీ ఆయన శరీరానికి ముసలితనం వచ్చిన ప్రతీసారి భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు చిరిగిపోయిన బట్టలు తీసివేసి కొత్త బట్టలు వేసుకున్నంత ఈజీగా తన ప్రాణాన్ని పాత శరీరం నుండి తీసివేసి ఒక కొత్త యువకుడి శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసేవాడు.
(20:50) అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 వేరు వేరు శరీరాల్లోకి తన ఆత్మను మార్చుకుంటూ అద్భుతాలు సృష్టించిన ఆ మహా దార్శనికుడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణ భారతదేశం అందులోనూ కేరళ రాష్ట్రం ఎన్నో మాంత్రిక తాంత్రిక ఆయుర్వేద మరియు యోగ విద్యలకు పుట్టినలు శబరిమల కొండల్లో ఆ దట్టమైన అడవుల్లో ఎందరో మహాయోగులు తపస్సు చేసుకుంటూ ఉంటారు.
(21:12) అలాంటి వారిలో దేవుడితో సమానంగా భక్తులు పూజించే ఒక గొప్ప సిద్ధ పురుషుడు శ్రీ శివ ప్రభాకర్ సిద్ధయోగి ఆయనకు అష్ట సిద్ధులతో పాటు గాలిలో తేలడం పులి మీద స్వారీ చేసుకుంటూ అడవిలో తిరగడం ఒకే సమయంలో రెండు మూడు చోట్ల కనిపించడం వంటి ఎన్నో అద్భుతమైన శక్తులు ఉండేవి. కానీ ఆయన సాధించిన అతి పెద్ద యోగసిద్ధి పరకాయ ప్రవేశం. తన ఆత్మను ఒక దేహం నుండి ఇంకో దేహంలోకి సునాయసంగా మార్చగల అపారమైన శక్తి ఆయన సొంతం.
(21:37) ఆ యోగి అసలు వయసు ఎంతో ఎవరికీ తెలియదు. ఆయన శిష్యులు భక్తులు చెప్పేదాని ప్రకారం సుమారు 723 సంవత్సరాల క్రితం ఆయన మొదటి శరీరాన్ని ధరించారు. హిందూ ధర్మ రక్షణ కోసం అరణ్యాలలో యోగ సాధన చేసే ఎందరో మునులకు మార్గదర్శనం చేయడం కోసం ఆయన ఈ భూమి మీద ఎక్కువ కాలం ఉండాలని నిర్ణయించుకున్నాడు. కానీ ప్రకృతి నియమం ప్రకారం ఏ శరీరానికైనా ఒక వయసు వచ్చాక అది క్షీణించిపోవడం కాయం. కణాలు చనిపోతాయి.
(22:02) ముసలితనం వస్తుంది. 80 90 ఏళ్లు రాగానే తన శరీరం ఇక పనికి రాదు అని ఆ యోగికి అర్థమయ్యేది. అప్పుడు ఆయన ఏం చేసేవాడో తెలుసా ఎవరికీ చెప్పకుండా దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయేవాడు. అక్కడ ఎవరైనా ఒక యువకుడు ప్రమాద వశాంత చనిపోవడం గానీ లేదా పాముకాటికి గురై ప్రాణాలు విడవడం గానీ జరిగితే ఆ మృతదేహం దగ్గరికి వెళ్ళేవాడు. ఆ యువకుడి శరీరం ఆరోగ్యంగా ఉందా లేదా అని తన దివ్య దృష్టితో చూసేవాడు.
(22:28) అతని శరీరం యోగ సాధనకు అనుకూలంగా ఉంటే ప్రభాకర యోగి తన పాతదైన ముడతలు పడిపోయిన ముసలి దేహాన్ని ఒక గుహలో వదిలేసి తన ప్రాణశక్తిని బ్రహ్మరంద్రం గుండా ఆకాశంలోకి పంపి ఆ మరణించిన యువకుడి శరీరంలోకి ప్రవేశించేవాడు. అతని పాత శరీరం క్షణాల్లో నిర్జీవంగా పడిపోతుంది. మరణించాడు అనుకున్న ఆ యువకుడు ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు.
(22:48) యువకుడిలా కనిపిస్తున్న ఆ శరీరంలో ఉన్నది మరెవరో కాదు వందల ఏళ్ల జ్ఞానం ఉన్న శ్రీ ప్రభాకర సిద్ధయోగి ఆయనకు శరీరం అనేది కేవలం ఒక పనిముట్టు మాత్రమే తన భక్తుల కష్టాలు తీర్చడానికి అజ్ఞానంలో ఉన్న మనుషులకు జ్ఞానోపదేశం చేయడానికి ఆయన ఏకంగా 17 సార్లు తన శరీరాలను మార్చాడు అని కేరళాలోని ఆశ్రమవాసులు ఎందరో మహానుభావులు నేటికీ బలంగా నమ్ముతారు.
(23:10) ప్రభాకర సిద్ధయోగి తన జీవిత కలల్లో ఎంతో మంది గొప్ప యోగులకు గురువుగా మారారు. అడవుల్లో పులులను క్రూర జంతువులను పెంపుడు కుక్కల్లా మార్చుకొని ఆడుకునేవారు. అలా 17 శరీరాలను మార్చిన ఆ మహాయోగి తన ప్రస్తుత దేహంతో 1986వ సంవత్సరంలో కేరళాలోని ఓమల్లూరు అనే గ్రామంలో జీవ సమాధి అయ్యారు. ఇప్పటికీ ఆ జీవ సమాధి ఓమల్లూరులో ఉంది. నేను చేయాల్సిన లోక కళ్యాణం పూర్తయింది అని తన భక్తులకు ముందే చెప్పి నవ్వుతూ సమాధిలోకి వెళ్ళిపోయారు.
(23:38) ఇది మన భారతదేశంలో జరిగిన ఒక మహా అద్భుతం. కానీ ఈ ఆధునిక యుగంలో ఇవన్నీ కేవలం మూఢ నమ్మకాలు పాతకాలపు కట్టు కథలు అని కొట్టి పారేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సరిగ్గా ఇలాగే 20వ శతాబ్దంలో ఒక విదేశీయుడు మన దేశానికి వచ్చి మన యోగులను తక్కువ చేసి మాట్లాడాడు. ఆ విదేశీయుడు అహంకారాన్ని అణచివేయడానికి మన భారతీయ యోగశాస్త్రం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి పండిట్ తారానాథ్ అనే ఒక మహాయోగి రంగంలోకి దిగాడు.
(24:05) పండిట్ తారానాథ్ 20వ శతాబ్దానికి చెందిన గొప్ప ఆయుర్వేద వైద్యుడు స్వాతంత్రయ సమరయోధుడు మరియు అద్భుతమైన యోగశక్తులున మహా సిద్ధుడు ఆయన దగ్గరికి ఒకసారి ఒక విదేశీయుడు వచ్చి మీ యోగశాస్త్రం అంతా అబద్ధం ఆత్మ దేహాన్ని వదిలి వెళ్ళడం నేను నమ్మను దమ్ముఉంటే నా కళ్ళ ముందు నిరూపించండి అని సవాలు విసిరాడు. అందుకు పండిట్ తారానాథ్ చిరునవ్వు నవ్వారు.
(24:26) అజ్ఞానంతో ఉన్న ఆ విదేశీయుడికి మాటలతో చెబితే అర్థం కాదు. అనుభవపూర్వకంగా చూపిస్తేనే మన భారతీయ సనాతన ధర్మం గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుందని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఆ విదేశీయుడిని ఆశ్రమం బయట ఉన్న అడవిలోకి తీసుకువెళ్ళాడు. దారిలో వారికి ఒక చనిపోయిన పాము కనిపించింది. పండిట్ తారానాథ్ అక్కడే ఆగిపోయారు.
(24:46) అయ్యా నువ్వు ఆత్మ లేదన్నావు కదా ఇప్పుడు నా ఆత్మను దేహం నుండి వేరు చేసి మరణించిన ఆ పాము శరీరంలోకి పంపిస్తాను. నీ కళ్ళతో నువ్వే చూడు అన్నాడు. ఆ విదేశీయుడు నవ్వుతూ ఇది అసాధ్యం చేసి చూపించండి అన్నాడు.పం పండిట్ తారనాథ్ వెంటనే పద్మాసనంలో కూర్చొని కళ్ళు మూసుకున్నారు. తన కుండలిని శక్తిని మేలుకొల్పి సహస్రార చక్రం ద్వారా తన చైతన్యాన్ని ఆ ప్రాణం లేని పాము శరీరంలోకి ప్రవేశింపజేశారు.
(25:12) అంతే మరణించిన ఆ పాము ఒక్కసారిగా ప్రాణం వచ్చినట్లు కదిలింది. మెల్లగా పైకి లేచి తన పడగను పూర్తిగా విప్పి ఆ విదేశీయుడి కలలోకి నేరుగా చూస్తూ భయంకరంగా బుసలు కొట్టడం మొదలు పెట్టింది. ఆ దృశ్యం చూసి ఆ విదేశీయుడికి చెమటలు పట్టి నోటమాట రాలేదు. గుండె ఆగిపోయినంత పనింది. ప్రాణభయంతో వణికిపోయాడు. ఎందుకంటే ఆ పాము రూపంలో పాము కలలో నుండి చూస్తున్నది పండిట్ తారానాథ్ అని అతనికి స్పష్టంగా అర్థమైపోయింది.
(25:36) కొన్ని క్షణాల తర్వాత ఆ పాము మళ్ళీ కింద పడిపోయి నిర్జీవంగా మారిపోయింది. అదే సమయంలో ధ్యానంలో ఉన్న పండిట్ తారనాథ్ కళ్ళు తెరిచాడు. ఆ విదేశీయుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మహాయోగి పాదాల మీద పడి మన భారతీయ యోగ శాస్త్రానికి క్షమాపణలు చెప్పాడు. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక అతి పెద్ద సందేహం రావచ్చు. ఒక మనిషి తన శరీరాన్ని వదిలి పాములోకి లేదా పక్షిలోకి లేదా మరొకరి దేహంలోకి ఆత్మను పంపినప్పుడు ప్రాణం లేకుండా పడి ఉన్న ఆ యోగి సొంత శరీరానికి ఏమవుతుంది? అది చనిపోయినట్లు కుల్లిపోదా అని సాధారణంగా ఒక మనిషి చనిపోతే ప్రాణం పోయిన కొన్ని గంటలకే శరీరం కుల్లిపోవడం మొదలవుతుంది. కానీ పరకాయ
(26:12) ప్రవేశంలో అలా జరగదు. ఎందుకంటే అది మరణం కాదు. అది ఒక అద్భుతమైన యోగనిద్ర. దీనిని మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక కారు ఇంజన్ ఆన్ లో ఉంచి డ్రైవర్ బయటకి వెళ్తే ఎలా ఉంటుందో ఈ ప్రక్రియ కూడా అలాగే ఉంటుంది. యోగి తన దేహాన్ని వదిలి వెళ్ళినప్పుడు గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ఊపిరి తిత్తులు శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది.
(26:34) రక్త ప్రసరణ దాదాపు జీరోకి పడిపోతుంది. కానీ శరీరంలోని ప్రాణశక్తి మొత్తం బ్రహ్మరంద్రంలో అతి సూక్ష్మంగా నిక్షిప్తమై ఉంటుంది. యోగి ఆత్మ బయటకు వెళ్ళినప్పుడు ఆ శరీరం పూర్తిగా చనిపోదు. కుంభక స్థితి అనే ఒక మహా సమాధిలోకి వెళుతుంది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే యోగి ఆత్మ ఎక్కడికి వెళ్ళినా ఆ ఆత్మకు మరియు ఆ దేహానికి మధ్య కనిపించని ఒక శక్తి తీగ కనెక్ట్ అయి ఉంటుంది.
(26:58) దీనినే ఆధ్యాత్మిక పరిభాషలో సిల్వర్ కార్డ్ లేదా ప్రాణబంధం అంటారు. మీరు సెల్ ఫోన్ ని చార్జింగ్ పెట్టి వాడుతున్నప్పుడు వైర్ ఎలా కనెక్ట్ అయి ఉంటుందో ఈ సిల్వర్ కార్డ్ కూడా అలాగే ఉంటుంది. ఈ తీగ తెగిపోనంత కాలం ఆ దేహం చెడిపోదు కుల్లిపోదు. కానీ ఈ సమయంలో ఆ శరీరం చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉంటుంది. ఏ క్రూర జంతువైనా ఆ దేహాన్ని గాయపరిచినా లేదా ఎవరైనా ఆ శరీరాన్ని నాశనం చేసినా ఆ సిల్వర్ కార్డ్ తెగిపోతుంది.
(27:24) అప్పుడు ఆ యోగి శాశ్వతంగా వేరొకరి దేహంలో ఉండిపోవాల్సిందే. తన శరీరంలోకి తిరిగి రాలేడు. అందుకే పరకాయ ప్రవేశం చేసేటప్పుడు కచ్చితంగా నమ్మకమైన శిష్యుల కాపలా అవసరం. అయితే ఇంతటి అద్భుతమైన పరకాయ ప్రవేశం అనే విద్య గురించి ప్రపంచంలోని మొట్టమొదటి సైకాలజిస్ట్ యోగశాస్త్ర పితామహుడు అయిన పతంజలి మహర్షి తన యోగ సూత్రాలు అనే గ్రంథంలో చాలా స్పష్టంగా వివరించారు.
(27:46) పతంజలి యోగ సూత్రాలలోని మూడవ పాదమైన విభోది పాదంలో 39వ సూత్రం ఇలా చెబుతుంది. బంధకారణ శైదిల్యాత్ ప్రచార సంవేదనాచ చిత్తస్య పరశరీరావేషః అంటే మన ఆత్మ మన శరీరంతో ఒక పెవికాల్లాగా అతుక్కుపోయి ఉంటుంది. దీనికి కారణం మన కర్మలు మన కోరికలు దీనినే పతంజలి మహర్షి బంధ కారణం అన్నారు. ఎవరైతే కఠినమైన యోగ సాధన ద్వారా తమ కర్మలను మరియు కోరికలను జయిస్తారో వారి ఆత్మకు మరియు దేహానికి మధ్య ఉన్న ఆ బంధం వదులైపోతుంది.
(28:18) దానికి తోడు ఆ యోగికి శరీరంలో ప్రాణవాయువు ప్రయాణించే దారులు పూర్తిగా తెలిసి ఉంటాయి. ఈ రెండు శక్తుల కలయకతో ఆ యోగి ఎప్పుడు కావాలంటే అప్పుడు తన దేహం నుండి ప్రాణాన్ని బయటకు తీసి వేరొక దేహంలోకి సునాయాసంగా పంపగలడు. ఇదే పతంజలి మహర్షి చెప్పిన రహస్యం అంటే మన శరీరం అనేది ఆత్మ ధరించే ఒక చొక్క లాంటిది అని వేదాలు చెప్పిన మాటను పతంజలి మహర్షి ప్రాక్టికల్ గా ఎలా చేయవచ్చో యోగశాస్త్రంలో నిరూపించారు.
(28:44) విదేశాలు క్వాంటం ఫిజిక్స్ హాస్టల్ ట్రావెల్ అంటూ ఏవేవో పరిశోధనలు చేస్తున్నాయి. కానీ వేల సంవత్సరాల క్రితమే మన భారతీయ ఋషులు మహర్షులు కేవలం తమ మనసును శ్వాసను నియంత్రించడం ద్వారా ప్రకృతి రహస్యాలను చేదించారు. మన సనాతన ధర్మం కేవలం పూజలకు మాత్రమే పరిమితం కాలేదు. అది అంతు చిక్కని సైన్స్ కు కేర్ ఆఫ్ అడ్రెస్ పరకాయ ప్రవేశం అనేది అహంకారం కోసమో స్వార్థం కోసమో చేసేది కాదు.
(29:06) శంకరాచార్యులు లోక కళ్యాణం కోసం తిరుమూలర్ మూగ జీవాల కోసం అరుణగిరినాథ దైవభక్తి కోసం విక్రమార్కుడు ధర్మ రక్షణ కోసం ప్రభాకర యోగి జ్ఞానబోధ కోసం పండిట్ తారానాథ్ సనాతన ధర్మ సత్తా చాటడం కోసం ఇలా ఎందరో మహాయోగులు ఈ పరకాయ ప్రవేశ విద్య ద్వారా అద్భుతాలు సృష్టించారు. ఈ మహాయోగులు మనకు చెప్పేది ఒక్కటే మన శరీరం శాశ్వతం కాదు.
(29:29) దేహాన్ని నడిపించే ప్రాణశక్తి ఆ ఆత్మ అనంతమైనది అద్భుతమైనది. మిత్రులారా పరకాయ ప్రవేశం గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. మన సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటి చెప్పే ఈ పరకాయ ప్రవేశం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. కామెంట్స్ లో ఓం నమఃశివాయ లేదా జై సనాతన ధర్మ అని గర్వంగా కామెంట్ చేయండి.
(29:51) ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకువాట్ లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన రహస్యాల కోసం దేవాలయాల చరిత్రల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. జైహింద్ వందేమాతరం

No comments:

Post a Comment