బ్రహ్మచారి దినచర్య 💯
Author Name:TonsOfVeerya
Youtube Channel Url:https://www.youtube.com/@TonsOfVeerya
Youtube Video URL:https://www.youtube.com/watch?v=n1AHEgs-7rY
Transcript:
(00:00) బ్రహ్మచర్యం గురించి వేదాలు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలు మరియు గురుకుల పరంపరలో చాలా లోతైన వివరణ ఉంది. బ్రహ్మచారి అంటే కేవలం వీర్య నియంత్రణ చేసే వ్యక్తి కాదు బ్రహ్మంలో ధర్మాన్ని ఆచరించేవాడు శరీరం మనసు ఇంద్రియాలు ఆహారం నిద్ర మాట అన్నింటిని నియమంలో ఉంచడం గురుకులం నాటి బ్రహ్మచారి యొక్క సంపూర్ణ దినచర్య గురించి విందాం.
(00:42) మొదటిగా బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయంమూడున్నర నుండినాలుగున్నర మధ్యలో నిద్ర లేవాలి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలని చెప్పారు. అయితే మేము చాలా కష్టపడతాంఅండి రాత్రి కూడా లేట్ గానే పడుకుంటాం అనేవారు ఉదయం 5దు గంటలకు లేవచ్చు. ఈ సమయంలోనే ఎందుకు లేవాలంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కామవికారం తక్కువగా ఉంటుంది. నిద్ర లేవగానే మంచం మీద ఎక్కువ సేపు ఉండకుండా ఉషాపానం అంటే నీరు త్రాగి మలమూత్రాలు విసర్జించి శరీరాన్ని శుభ్రపరుచుకోవాలి.
(01:27) సాధ్యమైతే చల్లటి నీటితో స్నానం ఎందుకంటే చల్లటి స్నానం శరీర ఉష్ణాన్ని సమతుల్యం చేస్తుంది. ఇంద్రియ ఉద్రేకం తగ్గుతుంది. పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి ప్రాణాయామం ధ్యానం గాయత్రి జపం లేదా ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి. ఎందుకంటే మనసు శుద్ధి చేయబడి చంచలత తగ్గుతుంది. ఇక రెండవది వేదాధ్యయనం ధర్మశాస్త్రాన్ని గురించి ధ్యాన శిక్షణ గురించి లేదా మీరు చదువుకునే సబ్జెక్ట్ గురించి అధ్యయనం చేయండి. మూడవది మితాహారం
(02:15) అంటే ఆహార నియమం వేదాల్లో యదాన్నం తదామనః అంటే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే మన మనసు ఆలోచనలు అలాంటివే అవుతాయి. బ్రహ్మచారి స్వీకరించవలసినవి పాలు ఫలాలు సాత్విక అన్నం నెయ్యి కూరగాయలు తేలికైన ఆహారం అలాగే నిషిద్ధమైనవి ఏంటంటే అధికమైన మసాలా వేయించిన పదార్థాలు ఆల్కహాల్ మాంసాహారం అతిగా తినడం రాత్రి భారమైన భోజనం ఎందుకంటే తిన్నది అరిగించడానికి
(03:02) శరీరం వేడిని పుట్టించాల్సి ఉంటుంది. నాలుగవది వ్యాయామం లేదా యోగాభ్యాసం సూర్య నమస్కారం లేదా ప్రాణాయామం అందులో ముఖ్యంగా నాడి శుద్ధి ప్రాణాయామం అనులోమ విలోమ ప్రాణాయామం ఒకవేళ జిమ్ కి వెళ్లేవారు దానికి సంబంధించిన వ్యాయామాలు చేయొచ్చు. గురుకులాల్లో ఒక బ్రహ్మచారి జీవనం ఎలా ఉండేదంటే ఒకే వ్యక్తి చాలా డిపార్ట్మెంట్స్ లో పని చేసేవాడు భోజనం తయారు చేయడం కట్టెలు తీసుకురావడం పూజ సామాగ్రి సిద్ధం చేయడం గురువులకు సేవ చేసేవారు కాబట్టి శరీరం ఎలా కావాలంటే అలా
(03:50) వంగగలగాలి. అలాగే స్టామినా బలం దృఢత్వం అలాగే ఫాస్ట్ అండ్ యక్టివ్ చురుకుగా ఉండాలి ఎలాగంటే చిన్న పిల్లల్లా ఎగురుతూ గంతులేస్తూ ఉండగలగాలి. అంటారు కదా ఫ్లక్సిబిలిటీ ఇస్ లైఫ్ అండ్ రిజిడిటీ ఇస్ డెత్ సన్యాసులు అంటే బ్రహ్మచార్యులు భిక్షాటన చేసుకుని ఆహారాన్ని స్వీకరించేవారు ఎందుకంటే అది వారిలోని అహంకారాన్ని అణచివేస్తుంది అనేది వారి నమ్మకం ఇక ఐదవది ఇంద్రియ నిగ్రహం ఇది బ్రహ్మచర్యం యొక్క హృదయం
(04:36) కామప్రేరిత దృశ్యాలు చూడడం అసహ్యకరమైన సంభాషణ చేయడం అనవసరంగా జననేంద్రియాలను స్పర్శించకూడదు. ఒంటరిగా కూర్చుని వ్యర్థమైన ఆలోచనలు ఊహలు చేయకూడదు. ఎందుకంటే వేదాలు చెప్తున్నాయి దృష్టి నుండి ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వాసనల్ని పుట్టిస్తాయి. ఇక వాసన పుట్టింది అంటే అటువంటి క్రియలు చేయాలనిపిస్తుంది. అందుకనే మొదట దృష్టిని నియంత్రించాలి.
(05:13) కళ్ళు ఏమి చూస్తున్నాయి అనేది చాలా ముఖ్యం. ఇక ఆరవది సాయం సంధ్యావేళ. సాయంత్రం మళ్ళీ జపం లేదా ప్రార్థన చేయాలి. ఎందుకంటే రోజంతా వచ్చిన మానసిక కలుషితాన్ని శుద్ధి చేయడానికి. ఏడవది రాత్రి నిద్రపోయే ముందు చేయవలసినవి అర్ధరాత్రి వరకు మేలుకోకుండా వీలైనంత త్వరగా నిద్రపోవాలి. భారమైన భోజనం కాకుండా తేలికైన భోజనం తీసుకోవాలి. కామ చింతన కాకుండా భగవన్ నామ స్మరణ చేయాలి. ఇక ఎనిమిదవది
(05:58) నైట్ ఫాల్ లేదా స్వప్న దోషాన్ని నియంత్రించడానికి వేదాల్లో చెప్పిన మార్గాలు ఏంటంటే మొదటిది రాత్రిపూట అధికమైన భారమైన భోజనం కాకుండా తేలికపాటి ఆహారాన్ని స్వీకరించాలి. రెండవది వ్యాయామం చేయకపోవడం మూడవది పొట్ట మీద పడుకోకుండా కుడి వైపుకు లేదా ఎడమ వైపుకు పడుకోవాలి. నిద్రపోయే ముందు శరీరం యొక్క వేడిని నియంత్రించాలి. అంటే చల్లటి నీటితో స్నానం చేసి పొట్ట కింద భాగాన్ని వీలైనంత ఎక్కువగా ప్రక్షాలన అంటే చల్లటి నీటితో తడపాలి.
(06:48) ఐదవది మీరు పడుకునే గదిలో అధిక వేడిని నివారించి బెడ్రూమ్లో వీలైనంత చల్లటి వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి. అలాగే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి చీకటిగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే చీకటిలోనే మెలటోనిన్ రిలీజ్ అవుతుంది. అది మీరు త్వరగా నిద్రపోయేలా ప్రోత్సహిస్తుంది. ఇక తొమ్మిదవది కొద్ది రోజులైనా తేలికపాటి ఉపవాసం దీని ద్వారా ఇంద్రియాల వేగం తగ్గుతుంది.
(07:25) చివరిగా 10వది సత్సంగం మీరు ఎటువంటి సర్కిల్ లో ఉన్నారో తెలుసుకోండి. మీరు ఎటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తున్నారో ఆలోచించండి. ఎందుకంటే మనసు చెడు ఆలోచనలతో ఉంటే రాత్రి స్వప్నాలు కూడా అలాగే ఉంటాయి. వేదాల యొక్క సందేశం ఏంటంటే వీర్యం అంటే కేవలం శరీర పదార్థం కాదు ఓజస్ అనగా శక్తి, తేజస్సు, ధైర్యము అని భావం. శైవయోగ సంప్రదాయంలో చెప్తారు వీర్యము జీవన శక్తి దానిని కాపాడిన వాడే తేజస్సు
(08:12) పొందును ఇంద్రియ జయం లేకుండా భగవంతుడు సాక్షాత్కరించడు శివతత్వంలో ప్రధాన బోధ కూడా బ్రహ్మచర్యం గురించే ఉంటుంది. మనసుని జయించని వాడు జగత్తుని జయించలేడు కామ క్రోధ మోహ లోభాలు మనస్సుని బంధిస్తాయి బ్రహ్మచర్యమే వాటిని జయించే మొదటి మెట్టు శివ పురాణంలో చెప్పబడిన భావం ఏంటంటే శుద్ధ చిత్తుడు నియమశీలి బ్రహ్మచారి ఈ ముగ్గురి పైన దైవం త్వరగా ప్రసరిస్తాడు ఎందుకంటే అలాంటి టి మనసు ధ్యానానికి సిద్ధంగా ఉంటుంది. అందుకనే కామాన్ని
(08:58) జయించినవాడే నిజమైన వీరుడు అంటారు. రావణాసురుడు కూడా తపస్సు చేసినంత కాలం కామాన్ని కాలు కింద పాముని తొక్కిపెట్టినట్టు తొక్కిపెట్టాడు. దైవదర్శనం కాగానే ఆ పాము ఆయన్ని కాట్లు వేసింది. అంటే నియంత్రణలో లోపం ఆయన పతనానికి కారణమైంది. చూడండి 10 తలకాయలు ఉన్నవాడే నిలబడలేకపోయాడు. ఇక మనమఎంత అందుకనే హనుమంతుడు భీష్ముడు లక్ష్మణుడు వంటి మహనీయులు బ్రహ్మచర్య శక్తికి ఎగ్జాంపుల్స్ అయ్యారు.
No comments:
Post a Comment