Thursday, January 23, 2020

ఎల్లప్పుడు సంతృప్తిగా ఉండేందుకు వేదాలలోని పది ముఖ్య సూత్రాలు

ఎల్లప్పుడు సంతృప్తిగా ఉండేందుకు వేదాలలోని పది ముఖ్య సూత్రాలు

1. ఇతరులను మార్చాలనే ప్రయత్నం మాని నిన్ను నువ్వు మార్చుకోవటం మీద శ్రద్ధ పెట్టు.

2. ప్రతి ఒక్కరూ తమ తమ దృష్టి కోణాల్లో ఎవరికి వారే కరెక్టు అనేది అంగీకరించు.

3. అనవసర అనుమానాలు, అపోహలు లేకుండా ఎలా ఉన్నా ఒక వ్యక్తిని వ్యక్తిగా స్వీకరించు!.

4. ఇతరుల నుంచి ఏదో పొందాలనే ఆశ వదిలిపెట్టి చేతనైన సహాయం చేస్తూ అనుబంధాలను పెంచుకుంటూపో!

5. నువ్వు చేస్తున్నది ఏదైనా సరే ఫలానా వారి కోసం చేస్తున్న అనుకోకుండా, నువ్వు ఏది చేసినా అది నీ మనశ్శాంతి కోసమే చేస్తున్నామని మనస్ఫూర్తిగా అంగీకరించు!

6. నువ్వు ఎంత మేథావివో ప్రపంచానికి ప్రదర్శించి చూపాలని పాకులాడకు!

7.ఇతరులు ఎల్లప్పుడూ నిన్ను ఆమోదిస్తూ నువ్వు చెప్పినది అంగీకరిస్తూ ఉండాలని ఆశించకు!

8.'అవసరానికి' మరియు 'కోరిక' కు మధ్య చాలా తేడా ఉంది, అవసరాన్ని మరియు కోరికను రెండిటిని విడదీసి వాటి మధ్య తేడాను గుర్తించి నీతో నువ్వు ప్రశాంతంగా ఉండటం నేర్చుకో!

9.నిన్ను ఇతరులతో పోల్చుకోవడం లేదా ఇతరులను నీతో పోల్చుకోవడం...ఈ రెండూ వదిలెయ్!

10.శాంతి, ఆనందం, తృప్తి అనేవి సాధనాలతో పొందే ప్రాప్తులు కాదు... సాధనతో మాత్రమే పొందే మానసిక అనుభూతులు అనే సత్యాన్ని గ్రహించు!

ఈ సూక్ష్మమైన ఇటువంటి వేదవాక్కు లను వెనక మనస్సు ద్వారా అర్థం చేసుకొని అంగీకరించి ఆచరించినట్లయితే సుఖమైన జీవితం యొక్క శాతం రోజురోజుకూ పెరుగుతూ ఉంటుంది.

No comments:

Post a Comment