నా మనసు కోతి రా రామా....
🍁🍁🍁🍁
మనస్సు కోతిలాంటి దని మనకు తెలుసు...కానీ దానిని ఎలా అదుపు లో పెట్టాలి ??
దానికి ఒక తాడు కావాలి . దానినే మనం దైవం అంటాం . సరే తాడు కోతికి కట్టినా ఉపయోగం లేదు .
అప్పుడు ఆ తాడుని ఒక రాట కి కడతాం . ఆ రాటే మంత్రం లేదా ఒక రూపం -లేదా ఒక భావం .
రోజుకి కొన్ని వేల ఆలోచనలు చేస్తుంది మనస్సు . వాటిలో మెజారిటీ ఆలోచనలు ఒకే విషయం గురించి అదీ వ్యతిరేక భావనలు ,రాజస తామస భావనలు ... భద్రతకు , అత్యాశ ,దురాశ కి చెందిన వై
ఉంటాయి .
వీటన్నింటి నుండి మనస్సుకి విముక్తి కలిగించాలీ అంటే
,మనస్సుకి ఏదో ఒక్క విషయం మాత్రమే ఇవ్వాలి . అదీ సాత్విక పరమైన అహంకార రహిత మైన భావం ఐతే మంచిది .
మరి సాత్విక ఆలోచనలు అంటే ఏవి ?
నిస్వార్ధం , తృప్తి , సహనం , క్షమ ,కరుణ ,పరోపకారం , పరహితం ,పర్యావరణ హితం ,లోక కళ్యాణ కారకం ...
వీటిని మన రోజు వారీ జీవనం లో అన్వయించు కొని మన " వృత్తి - ప్రవృత్తి -కుటుంబ -సంఘ " బాధ్యతలను
నిర్వర్తించడం . ఇదే కర్మ యోగ మార్గం .
"దైవం ' అనే భావనలో సాత్వికత ఉంది . ఎలా గంటే, దైవం చెప్పేది వింటాం( మనస్సాక్షి చెప్పేది ) . అదే ప్రార్ధన .
ప్రార్ధన అంటే మన కోరికల చిట్టా విప్పడం మాత్రం కాదు . దైవం అంటే సర్వ కాల సార్వ జనీన భావన .
కష్ట నష్టాలు వచ్చిన ప్పుడు మనిషి కి ఓ తోడు , ఆలంబన కావాలి .
అలాగే సుఖ సంతోషాలను పంచు కోవడానికి ఒకరు కావాలి .
వీటన్నింటినీ సమర్ధం గా పూరించే భావనే దైవం .
కొందరికి దైవం అంటే విగ్రహం కనబడాలి . మరి కొందరికి దైవం అంటే మంత్ర తంత్రాలు ఉండాలి .
మరి కొందరికి తీర్ధయాత్రలు ,వ్రతాలు ,నోములు ,హోమాలు ఉండాలి .
మనిషి లో ఉన్న వాసన గుణాలను బట్టి వివిధ పద్దతులు ఇష్ట పడతారు .
కానీ ఇవన్నీ, 'అహంకార రహిత మైన శరణా గతి తో నిర్వర్తించి నప్పుడే సాత్విక మవుతాయి .
దీనినే భక్తీ యోగ మార్గం అంటాం .
కళ్ళు తెరిస్తే కనబడే విషయాలు మనిషి ఆలోచనలను చిందర వందర చేస్తాయి .
కళ్ళుమూసి మనకు ఇష్ట మైన శబ్దం లేదా రూపము పై మన ధ్యాసను పెట్టాలి .
అది కూడా సంపూర్ణ శర ణా గతి తో ఉన్నప్పుడే ,ఎలాంటి ఆందోళన లేకుండా ఆ ధ్యాస ఒకే విధం గా ఉండి
ధారణ గా మారుతుంది .
మనస్సుకి ధారణ అలవాటు చేయడం ద్వారా మనస్సుని స్వాధీనం చేసు కొంటాం .
మనస్సుని చంపేయండి అంటే నిజ మైన అర్ధం మనస్సులోని ఆలోచనలను రూపు మాప మని ...
వేల ఆలోచనలు వద్దు . ఒకే ఒక్క సాత్విక మైన ఆలోచన ...
అహంకార రహిత సంపూర్ణ
శరణాగతితో కూడిన భావన .. అది నిలిచే వరకు మనం రోజూ అభ్యాసం
చేయడమే సాధన ...

No comments:
Post a Comment