Tuesday, January 28, 2020

అన్ని రోగాలకూ కారణమూ "మనస్సే", విరుగుడూ "మనస్సే"

అన్ని రోగాలకూ కారణమూ "మనస్సే", విరుగుడూ "మనస్సే"

🤔 “జపాన్ శాస్త్ర వేత్తలు చేసిన వివిధ ప్రయోగాలలో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ఇంత కాలం మనం "గుడ్డి"గా నమ్ముతున్న అనేక ఆరోగ్య సమస్యలకు మూలాలు మనం తీసుకునే ఆహారం లో లేవని,కాదు.

"మనం జీవించే
విధానం లోనే
ఉన్నాయని",
మనసును హాయిగా ఉంచు కున్న వారికి ఏ రోగాలు రావని వారు తేల్చి చెబు తున్నారు. అమెరికాలో జరిగిన మరో సర్వేలో కూడా మనసు బాగున్న వారు ఎక్కువ కాలం జీవిస్తున్నారని తేల్చారు. మనసు కలత బారితే లేని పోని ఆలోచనలు చోటు చేసుకుని వాటి నుంచి బైటపడ డానికి "బలహీనతలు" పెంచు కోవడం, వాటికి బానిసలై "దురలవాట్ల" పాలై పోవడం వంటివి చేస్తున్నారని వారు తేల్చారు.

ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్లు కీలక రోగాలకు మందులు ఇవ్వడం తగ్గించి, "జీవన శైలిని" సరిదిద్దే పనిలో పడ్డారు.

అందుకే డయాబిటిక్, బిపి వంటి నిరంతర అనారోగ్యకర అంశాలకు డాక్టర్లు ట్రీట్‌ మెంట్ ఇచ్చే పద్ధతి మార్చు కున్నారు.

ఇది వరకు తిన కూడదు అన్న అనే డాక్టర్లే, అన్ని రకాల ఆహారాన్ని నిరభ్యంతరంగా తిన మంటున్నారు.

పొద్దుటే వాకింగ్ వెళ్ళే వారు ప్రశాంతమైన మూడ్‌లో ఉండాలని అందు కోసం నచ్చిన పాటలు విన మంటున్నారు.

ఏం చేస్తే ఉత్సాహంగా అనిపిస్తుందో అది చేయ మంటున్నారు. కొందరు వాకింగ్ ఇష్టపడితే, మరి కొందరు జిమ్‌కు వెళ్ళాలను కుంటారు. ఇంకొందరు బ్రిస్క్‌వాక్ చేయాలనుకుంటే, ఇంకొందరు స్టెయిర్ కేస్ వాక్ చేయాలను కుంటుంటారు. అందుకని డాక్టర్లు పేషెంట్ల ఇష్టానికే విడిచి పెట్టి ఎంతో కొంత వ్యాయామం మాత్రం చేయ మని సూచిస్తున్నారు.

ఒక్క సారిగా వీరి వైఖరి ఇలా మారి పోడానికి కారణం సరికొత్త అధ్యయనాలలో వెలుగు చూస్తున్న అంశాలే కారణం.

ఇలా వెల్లడైన అనేక పరి శోధనల ఫలితాలలో జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన, అధ్యయనం సరికొత్తది. దీనిలో పాల్గొన్న సైంటిస్టులు ఏం చెబు తున్నారో మనస్సు పెట్టి చూద్దాం.

➢ "మానసిక ఒత్తిడి" వల్ల గ్యాస్ ::
కడుపులో గ్యాస్ సమస్యను వాయువు అంటారు. ఇది రావ డానికి, ముదర డానికి కారణం ఆహార లోపాల వల్ల కాదట,
మానసిక ఒత్తిడి వల్లే ఎక్కువ వస్తుంది.

➢ "ఆవేశ కావేశాల" వల్లే అధిక రక్తపోటు ::
ఉప్పు ఎక్కువగా తినే వారి కంటే
ఆవేశ కావేశాలను అదుపులో పెట్టుకోని వారిలోనే అధిక రక్తపోటు ఎక్కువట!.

➢ "అతి బద్ధకం" వల్ల చెడు కోలెస్టరాల్ ::
కొవ్వు పదార్థాలు తినేవారిలో కంటే అతిబద్ధకం వలన కొవ్వు పెరిగిన వారిలోనే
చెడు కోలెస్టరాల్ ఎక్కువట!

➢ "మధుమేహం" సమస్య: తీపి పదార్థాలు అధికంగా తినే వారిలో కంటే,
"అధిక స్వార్ధం",
"మొండితనం"
ఉన్నవారి లోనే ఎక్కువట.

➢ "అతి విచారం" వల్ల ఆస్త్మా ::
ఊపిరి తిత్తులకు గాలి అందక పోవడం కంటే,
అతివిచారం వల్లనే ఊపిరి తిత్తులలో మార్పులు వచ్చి ఆస్త్మా వస్తుందట...

➢ "ప్రశాంతత" లేక గుండె జబ్బులు ::
ధమనుల్లో రక్తం ప్రసరణ లోపాల కంటే ప్రశాంతత లోపించడం వల్లనే గుండె కొట్టు కోవడంలో మార్పులు వస్తున్నాయట,అందువల్ల మనిషికి గుండెజబ్బులు వస్తున్నాయట.

మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకు
మూల కారణాలు తరచి చూస్తే ఆహార అలవాట్ల వల్లకాదని లైఫ్‌ స్టయిల్ సంబంధ మైన వేనని తెలుస్తోంది. అందుకు వారు వివిధ కారణాలను చూపించారు.వారి అధ్యయనం ప్రకారం.

50% ఆధ్యాత్మికత
లోపంవల్ల,
25% మానసిక కారణాల వల్ల,
15% సామాజిక, స్నేహబాంధవ్యాల లోపం వల్ల
10% శారీరక కారణాల వల్ల...
రోగాలు వస్తున్నాయి. అందువల్ల
కడుపు మాడ్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరాటపడేకన్నా, జీవన శైలి ని మార్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మేలని జపాన్ సైంటిస్టులు అంటున్నారు.

వీరి సూచనల ప్రకారం మనం ఆరోగ్యంగా ఉండా లంటే
- స్వార్ధం,
- కోపం,
- ద్వేషం,
- శత్రుత్వం,
- ఆవేశం,
- అసూయ,
- మొండితనం,
- బద్ధకం,
- ఇగో,
- విచారం,
పైన చెప్పిబడిన
వ్యతిరేక భావాల ను మన నుండి వదిలించు కోవాలి.
- కారుణ్యం,
- త్యాగం,
- శాంతం,
- క్షమ,
- నిస్వార్ధం,
- స్నేహభావం,
- సేవాభావం,
- కృతజ్ఞత,
- హాస్య ప్రియత్వం,
- సంతోషం ,
- సానుకుల దృక్పథం
పెంచు కోవాలి.

ఆలోచించండి --- ఆచరించండి*

No comments:

Post a Comment