అది రాంచీ. జార్ఖండ్‌లోని రాజ్రప్ప సీసీఎల్ టౌన్షిప్... 30 ఏళ్లుగా ఇక్కడి వీధులు శుభ్రం చేసిన ఓ పెద్దావిడ పదవీ విరమణ చేస్తోంది... ఆమె చివరి పనిదినం రోజున గౌరవంగా వీడ్కోలు చెప్పేందుకు తోటి పారిశుద్ధ్య సిబ్బంది, స్థానికులు కొన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఓ నాలుగవ తరగతి ఉద్యోగిగా రిటైరవుతున్నఆమె చివరి పనిదినం ఇంత ప్రత్యేకంగా ముగుస్తుందని ఎవరూ ఊహించలేదు. ఉన్నట్టుండి అక్కడికి మూడు కార్లు రావడంతో ఈ కార్యక్రమం వాతావరణమే మారిపోయింది. మొదట ఓ జిల్లా కలెక్టర్ బుగ్గకారు దిగివచ్చి ఆమె పాదాలకు నమస్కారం చేశాడు. ఆ వెంటనే మరో రెండు కార్లలో వచ్చిన పెద్దమనుషులు ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. తీరా వీళ్లంతా ఆమె కుమారులని తెలిసి ఆమె తోటి సిబ్బంది, స్థానికులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. సుమిత్రా దేవి అనే పారిశుద్ధ్య కార్మికురాలి విజయగాథ ఇది...
ఆమె పెద్ద కుమారుడు వీరేంద్ర కుమార్ రైల్వే ఇంజినీర్‌గా పనిచేస్తుండగా... రెండో కుమారుడు ధీరేంద్ర కుమార్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇక మూడో కుమారుడు మహేంద్ర కుమార్ బీహార్‌లోని సివాన్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. పదవీ విరమణ సందర్భంగా తన కుమారులను చూసి సుమిత్రా దేవి భావోద్వేగానికి గురైంది. ‘‘సార్, 30 ఏళ్ల నుంచి నేను ఈ కాలనీ వీధులు శుభ్రంచేశాను. కానీ నా కుమారులు మీలాగే పెద్ద సార్లు అయ్యారు..’’ అని ఆనంద భాష్పాలు రాలుస్తూ వారిని పై అధికారులకు పరిచయం చేసింది. ఓవైపు ఆమెలాంటి ధీరవనితతో కలిసి పనిచేయడం తమకు గర్వకారణంగా ఉందంటూ తోటి సిబ్బంది పేర్కొనగా... తల్లి తమను విజయతీరాలకు ఎలా చేర్చిందో గుర్తుచేసుకుంటూ కుమారులు ఉప్పొంగిపోయారు.
‘‘మా అమ్మ మాకోసం చాలా త్యాగం చేసింది. మమ్మల్ని ఎప్పుడూ ఓడిపోనివ్వలేదు. బాగా చదువుకోవాలని, బాగా చదివితే మంచి ఆఫీసర్లు కావచ్చంటూ నిత్యం ప్రోత్సహించేది. ఆమె కుమారుడిగా నేను గర్విస్తున్నాను..’’ అని సివాన్ కలెక్టర్ మహేందర్ కుమార్ పేర్కొన్నారు. మంచి చదువులు చదివించడం కోసం ఆమె కష్టపడి పనిచేసేదని గుర్తుచేసుకున్నారు. తమ తల్లి కష్టాన్ని చూసిన తర్వాత సమాజానికి ఏదైనా మంచి చేయాలని ముగ్గురు కుమారులం నిర్ణయించుకున్నామన్నారు. ‘‘జీవితంలో ఏ ఉద్యోగమూ కష్టం కాదు. నిజాయితీగా కష్టపడి పనిచేస్తే అన్ని సాధ్యమే. మా తల్లి, మేము మా జీవితాల్లో చాలా కష్టకాలాన్ని ఎదుర్కొన్నాం. అయినప్పటికీ ఆమె ఎప్పుడూ మాకు ఇబ్బంది తెలియనివ్వలేదు. నిరాశ దరిచేరనివ్వలేదు. ఆమె కష్టానికి తగినట్టుగా మేమంతా ఉన్నత స్థాయిలో ఉన్నందుకు నేను గర్విస్తున్నాను...’’ అని కలెక్టర్ పేర్కొన్నారు.
కాగా తన పిల్లలు ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ.... ఆమె ఇప్పటివరకు వీధులు శుభ్రం చేయడం మానుకునేందుకుగానీ, ఉద్యోగాన్ని వదిలిపెట్టేందుకు గానీ ఇష్టపడకపోవడం గమనార్హం. ‘‘ నా పిల్లల్ని చదివించేందుకు ఈ ఉద్యోగమే ఆసరాగా నిలిచింది. నా కలలు నిజం చేసిన ఈ ఉద్యోగాన్ని ఎలా వదిలిపెడతాను..?’’ అంటూ సుమిత్రాదేవి తన వృత్తిపట్ల కృతజ్ఞత వెలిబుచ్చింది.
నీతి: పని మన వంతు ఫలితం ఇవ్వడము పరమేశ్వరుని వంతు
మన పనే మన దైవం అది లేక పోతే మరణమే శరణం,
ఈ భూమి మీద నీవు గతం లో చేసిన, వర్తమానం లో అనుభవించావలసిన ఖర్మ ను మరియు సుఖం ను బట్టి నీవు చేయవలసిన పని నిర్ణయించ బడుతుంది, అందు చేత నీ పని ని నీవు ఇష్టం తో చేయవలను అంతే కాని కష్టం అని భావించి చేయరాదు, అలా చేస్తే నీ ఖర్మ పూర్తి కాదు, నీ సత్ ఫలితం లబించాదు.
👏👏👏

No comments:
Post a Comment