Sunday, February 16, 2020

"భజనలు ఎందుకు మానకూడదు"? అంటే,"స్వామి మాటలలో "...

OM SRI SAIRAM
"భజనలు ఎందుకు మానకూడదు"? అంటే,"స్వామి మాటలలో ".....

1).ఈ కలియుగములో నామసంకీర్తన మాత్రమే భవసాగరాన్ని దాటించే నావ కాబట్టి,

2).అడవిలో, లోతైన బావిలో పడిన వాడు ఎట్లైతే గట్టిగా అరిస్తేనే ఏ బాటసారైనా రక్షిస్తాడో, అట్లే నీవు గొంతెత్తి రామా,కృష్ణా,శివా అని పాడితే, అదే ప్రార్థనగా స్వీకరించి స్వామి రక్షిస్తాడు !

3).భజనే ప్రార్థన,పూజ !

4).చెట్టు కింద, గట్టిగా చప్పట్లు కొడుతూ,"హుష్"అని అరిస్తే పక్షులు ఎగిరి పోయినట్లుగా, మన చప్పట్లతో కూడిన భజన వల్ల, మన మనస్సులోని అరిషడ్వర్గాలైన కామ, క్రోధ,లోభ, మోహాలు తొలగుతాయి,

4).భజన వల్ల B.P.,Sugarలు నియంత్రించబడతాయి,

5).భజన వల్ల మనస్సు ప్రశాంతతను పొంది, ఆందోళనలు తగ్గి,కుదురుగా ఉంటుంది,

6). "నా బిడ్డ అన్నీ పక్కనబెట్టి నాకోసం వచ్చి భజనలో పాల్గొన్నాడే"అని స్వామికి మన మీద దయకలుగుతుంది,

7)."భజన బినా సుఖశాంతి నహీ" అని స్వామి ఎప్పుడూ చెప్పేవారు!

8).రామదాసు, అన్నమయ్య, తుకారాం తదితరులు భజనతోనే తరించలేదా ?

9).భజనలు అన్ని మతాలవారిని ఆకర్షిస్తాయి కాబట్టి, "సర్వమత సమత్వాన్ని, ప్రపంచ శాంతిని" సాధించగలం అని స్వామి చెప్పలేదా? కాబట్టి, మరెందుకింకా ఆలస్యం ,
ఈరోజు నుండి మనందరం కలిసి భజనలలో పాల్గొందాం !

"ఒక పూట భోజనం మానినా ఫర్వాలేదు, కాని, ఒక్క భజన మానినా మనకు నష్టమే !
రండి భజనకు- "
కుటుంబ సమేతంగా" !
జై సాయ్ రామ్!!
OM SRI SAI RAM

No comments:

Post a Comment