సులోచనమే సౌందర్యం
👉 చూసే చూపులో దోషమేకాని భగవంతుడి సృష్టిలో దోషం లేదు. జ్ఞానేంద్రియాల్లో ప్రధానం నయనం. దృష్టి భగవంతుడి వరం. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలను ప్రసాదించిన భగవంతుడు వాటి వినియోగాన్ని మనిషి విచక్షణకే వదిలిపెట్టాడు. మనసులోని భావమే బాహ్యంలో కనిపిస్తుంది. నల్ల కళ్లద్దాలు ధరిస్తే నల్లగా, ఎరుపు అద్దాలతో ఎర్రగా కనిపించడం సహజం. రంగుతేడా అద్దాలదేకాని లోకంలో లేదు. మనం చూసే చూపు మనసును ప్రతిబింబిస్తుంది.
భీష్ముడు ధర్మరాజును, దుర్యోధనుణ్ని పిలిచి ఒక మంచివాడిని, ఒక చెడ్డవాడిని వెతికి తీసుకొని రమ్మని పంపించాడు. ధర్మరాజుకు అంతా మంచివాళ్లే కనిపించారు, దుర్యోధనుడికి అందరూ చెడ్డవాళ్లే కనిపించారు. వారిలోని మంచి, చెడు గుణాలే అందరిలోనూ కనిపించాయి.
కొంతమందికి అద్భుతంగా దర్శనమిచ్చే విషయాలు మరికొందరికి విసుగు కలిగిస్తాయి. దేవుడికి అభిషేకించే ద్రవ్యాలను కొందరు పవిత్రంగా భావిస్తే, వాటినే వృథాగా చూస్తారు కొంతమంది. ఉన్నత వ్యక్తిత్వంగల మహా పురుషుడిగా కనిపించినవారే గిట్టనివారికి అసమర్థులుగా స్ఫురిస్తారు. అన్నీ అందరికీ ఒకేలా తృప్తిని ఇవ్వవు. ఇది వారివారి విచక్షణ ఫలితమే.
వేదాంతం భగవంతుణ్ని అనేక రూపాలుగా, నామాలుగా వర్ణించింది. లింగరూపమైనా, రంగరూపమైనా శక్తి ఒక్కటేనని గుర్తించడం మహాపురుషుల లక్షణం. పశువుల రంగు ఎలా ఉన్నా పాలు తెలుపుగానే ఉంటాయి. ఆభరణాల రూపం వేరైనా వాటిలోని బంగారం ఒకటే. దైవరూపాలు వేరు... భక్తితత్వం ఒకటే. సమాజమే దైవంగా, సేవయే పూజగా చేసినా, విగ్రహారాధనతో షోడశోపచార పూజగావించినా కలిగేది సంతృప్తి ఫలితమే.
పాములో, చీమలో, బ్రహ్మలో శివకేశవాదుల్లో ప్రేమను చూపే సీతారామా నన్నుబ్రోవరా అన్నాడు త్యాగరాజు. చెట్టును, గుట్టను, మట్టిని, నీటిని పూజించే సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వమని చాటాడు వివేకానందుడు.
చూసే చూపును ప్రతిబింబించేది మనసు. పచ్చని పైరుపంటలతో భూమి ఆకుపచ్చ రంగు చీర ధరించిందని వర్ణించిన కవికి సస్యశ్యామలమై మనసు ద్రవిస్తుంది. ఆకాశంలో మేఘాలు, వర్షంలో ఏర్పడే ఇంద్రధనుస్సు, గోధూళిలో సోయగం, పక్షుల కిలకిలారావాలు, పశువుల అరుపులు... మనసును తట్టే ఆనందాల ఊటలు. వీటిని ఆస్వాదించి ఆనందించేవారు కొందరు, ఈసడించేవారు మరికొందరు.
లంకలో ప్రవేశించిన హనుమంతుడు ఇల్లిల్లూ తిరుగుతూ సీతాదేవిని వెతకసాగాడు. ఎన్నో దృశ్యాలు కనిపించాయి. రాజమందిరంలో పడుకొని నిద్రపోతున్న అనేకమంది స్త్రీలను చూశాడు. మధువు సేవించి ఆదమరచి నిద్రపోతున్నవారి స్థితి ఉన్మత్తంగా కనిపించింది. చూడరాని దృశ్యాలు చూసి పాపం చేశానేమో అనుకున్నాడు హనుమంతుడు. స్త్రీలను అనేక కోణాల్లో చూసినా నాలో ఎలాంటి దుర్భావంలేదు. కేవలం సీత అవునా, కాదా అనే పరిశీలించాను. చూసే చూపులో తేడాలేదు. దాన్ని అనుభూతితో ఆస్వాదించే మనసులోనే దోషంవస్తుంది అనుకున్నాడు హనుమాన్.
మంచి, చెడు మనం చేసే పనుల ఫలితాలే. కర్మచేసే ఇంద్రియాలు నిమిత్త మాత్రం. చేయించే మనసే కారణం. తనపై మన్మథ శరాలు వేసిన కాముణ్ని భస్మం గావించింది శివుడి అగ్నినేత్రం. పార్వతీదేవి ప్రార్థనతో తిరిగి బతికించింది ప్రేమనేత్రం.
సమాజాన్ని హృదయంతో వీక్షించాలి. రుగ్మతలను సహృదయంతో అర్థంచేసుకుని వాటిని ప్రక్షాళన గావించాలి. బలహీనత్వం శాపం కాదు. దయ, జాలి, కరుణగల హృదయం దైవమందిరమై సమాజాన్ని దేవాలయంగా మారుస్తుంది.👍

No comments:
Post a Comment