Thursday, February 20, 2020

ఉత్తమ పురుష లక్షణం..!!

☀ఉత్తమ పురుష లక్షణం..!!☀

కార్యేషు యోగీ,
కరణేషు దక్షః
రూపేచ కృష్ణః ,
క్షమయాతు రామః,
భోజ్యేషు తృప్తః,
సుఖదుఃఖ మిత్రం,
షట్కర్మయుక్తః ఖలు
ధర్మనాథః " (కామందక నీతిశాస్త్రం)

1.కార్యేషు యోగీ :-
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె,
ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.

2. కరణేషు దక్షః :-
కుటుంబాన్ని నడపడంలో,
కార్యాలను నిర్వహించడంలో
నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి.
సమర్ధుడై ఉండాలి.

3. రూపేచ కృష్ణః :-
రూపంలో కృష్ణుని వలె ఉండాలి.
అంటే (ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకోమని కాదు)
ఎల్లప్పుడూ ఉత్సాహంగా,
సంతోషంగా ఉండాలి.

4. క్షమయా తు రామః :-
ఓర్పులో రామునిలాగా ఉండాలి.
పితృవాక్య పరిపాలకుడైన రాముని వలె
క్షమించే గుణాన్ని కలిగిఉండాలి.

5. భోజ్యేషు తృప్తః :-
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా
(వంకలు పెట్టకుండా) భుజించాలి.

6. సుఖ దుఃఖ మిత్రం :-
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె
అండగా ఉండాలి.
మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.
ఈ షట్కర్మలు -
ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు
ఉత్తమ పురుషునిగా ,
ధర్మనాథునిగా కొనియాడబడతాడు.

🌹🙏ఓం నమో వేంకటేశాయా🙏🌹
🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉

No comments:

Post a Comment