ఒక పెద్ద మనిషి
ఓ బ్యాంకులోంచి డబ్బులు తీసుకుని, డబ్బుల పెట్టెను భుజాన వేసుకుని ద్విచక్రవాహనంలో వెళ్తున్నాడు.
ఆ పెట్టెలో వంద రూపాయల కట్టలు వంద ఉన్నాయి.
అయితే మార్గమధ్యంలో, గతుకుల రోడ్డుపై వెళ్తుండడంతో పెట్టె మూత కొద్దిగా తెరచుకుంది. అందులోంచి ఓ వంద రూపాయల కట్ట కింద పడిపోయింది.
అది చూసుకోకుండానే అతను వేగంగా వెళ్ళిపోతున్నాడు.
కిందపడిన నోట్ల కట్టలోంచి,
ఒక్క నోటు మాత్రం బయటికొచ్చి గాల్లో ఎగిరెళ్ళి కాస్తంత దూరంగా పడిపోయింది.
ఆ నోటు పడిన పక్కగా-ఒకతను నడుచుకుంటూ వచ్చాడు.
అతను ఆ ఒక్క నోటూ తీసుకుని దగ్గర్లో ఉన్న ఇరానీ కేఫ్‌కి వెళ్ళాడు.
ప్లేటు దోసె, ప్లేటు ఇడ్లీ తిని, ఒక కాఫీ తాగాడు.
ఆ తర్వాత అక్కడికి దగ్గర్లో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళాడు.
అక్కడి హుండీలో
ఓ పదిరూపాయల నోటు వేసి, దేవుడికి కృతజ్ఞతగా దణ్ణం పెట్టుకున్నాడు.
సంతోషంతో ఇంటికి చేరాడు.
పడిపోయిన నోట్ల కట్టలో 99 అక్కడే ఉన్నాయి.
ఆ దార్లో కాస్సేపటికి ఒకడు వచ్చాడు.
అతను ఆ నోట్ల కట్ట తీసుకున్నాడు. వెంటనే లెక్కపెట్టాడు.వంద రూపాయల నోట్లు 99 ఉన్నాయి.
మళ్ళీ మళ్ళీ లెక్కించాడు. ఎన్నిసార్లు లెక్కించినా 99 ఉన్నాయి.
బ్యాంకులో 99 నోట్లున్న కట్ట ఇవ్వరు. కనుక మిగిలిన నోటు ఆ పక్కనే ఎక్కడో పడి ఉండవచ్చని అనుకుని వెతకడం మొదలుపెట్టాడు.
చాలాసేపు వెతికాడు.
కానీ ఫలితం లేకపోయింది. అయినా వెతుకులాట మానలేదు.
ఈ కథను చెప్పి,గురువు ఫకాలున నవ్వాడు.
ఒక్కనోటు దొరికిన వ్యక్తి దర్జాగా హోటల్ కు వెళ్ళి ఇడ్లీ తిన్నాడు. కాఫీ తాగాడు.కానీ 99 నోట్లు దొరికిన వ్యక్తి వాటిని ఖర్చు పెట్టుకోక మరో నోటు కోసం వెతకడం మొదలుపెట్డాడు.మనలో చాలా మంది
ఈ తరహానే.లభించిన దానినో ,ఉన్నదానినో అనుభవించరు. దాంతో తృప్తిపడరు.లేని దానికోసం బుర్రలు పాడుచేసుకుంటారు. ఉన్నదాని పట్ల శ్రద్ధ ఉండదు. దేహం ఓ వైపు లాగుతుంటే మనసు మరోవైపు పోతుంటుంది. ఈ రెండింటి మధ్య సమన్వయం లేకుంటే ఎంతున్నా అసంతృప్తి తప్పదు.
🙏🙏🙏🙏

No comments:
Post a Comment