Saturday, February 15, 2020

నా జీవితం లోనివి కష్టాలు కాదు, భగవంతుని వరాలు...

నా జీవితం లోనివి కష్టాలు కాదు, భగవంతుని వరాలు...

•నేను శక్తిని అడిగాను -- భగవంతుడు నాకు కష్టాన్ని ఇచ్చి శక్తిని పొందమన్నాడు.

•నేను సంపదను అడిగాను-- భగవంతుడు నాకు మట్టిని ఇచ్చి బంగారం చేసుకోమన్నాడు.

•నేను ధైర్యాన్ని అడిగాను -- భగవంతుడు నాకు ప్రమాదాలు ఇచ్చి ధైర్యం వహించమన్నాడు.

•నేను వరాలు అడిగాను -- భగవంతుడు నాకు అవకాశాలు ఇచ్చాడు.

•నేను ఆయన ప్రేమను అడిగాను- భగవంతుడు ఆపదల్లో ఉన్నవారి చెంతకు నన్ను పంపించాడు.

•నేను జ్ఞానాన్ని అడిగాను - భగవంతుడు నాకు సమస్యల్ని ఇచ్చి పరిష్కరించమన్నాడు.

•నేను పురోగతి అడిగాను - భగవంతుడు నాకు అవరోధాలు కల్పించి సాధించమన్నాడు.

•నేను లోకానికి మంచి చెయ్యాలని అడిగాను - భగవంతుడు ఇబ్బందులు కల్పించి అధిగమించమన్నాడు.

•నేను ఆయన్ను మరువకూడదు అని అడిగాను -- భగవంతుడు భాధలు ఇచ్చి ఆయన్ను గుర్తుంచుకోమన్నాడు.

•నేను పాపాలు క్షమించమని అడిగాను -- భగవంతుడు ధ్యాన సాధన చేసుకోమన్నాడు.

అలా జీవితంలో నేను కోరుకున్నదేదీ పొందలేదు - నాకు కావలసిందే నేను పొందాను.

ఈ విధంగా జీవితంలో జరిగే ప్రతీ సంఘటననుండి నాకు అవసరమైనది పొందటం నేను నేర్చుకున్నాను.

చివరకు ఏది జరిగినా నా మంచికే అని అర్ధం చేసుకున్నాను.

జరిగేది అంతా మన మంచికే.

ఓం నమఃశివాయ...🙏🏻🚩

No comments:

Post a Comment