Sunday, February 2, 2020

విజ్ఞానం మనల్ని ఎక్కడి నుండి ఎక్కడికి తెచ్చిందో చూడండి ...

🔹 మొదట : బావులలో నీరు త్రాగి వందేళ్ళు బ్రతికేవారు
🔸ఇప్పుడు : ఫిల్టర్ నీరు త్రాగుతూ 40 యేళ్ళకే ముసలి వాళ్ళం అయిపోతున్నాము

🔹 మొదట : నూనె గింజలు గానుగ ఆడించిన నూనె తిని వృద్దాప్యములోనూ గట్టిగా వుండేవారు
🔸ఇప్పుడు : డబల్ ఫిల్టర్ రిఫైండ్ ఆయిల్ తింటూ కూడా చిన్న వయసులోనే హృదయాఘాతానికి గురి అవుతున్నాము

🔹 మొదట : రాళ్ళ ఉప్పును సేవించినా ఆరోగ్యవంతులుగా వుండేవారు
🔸ఇప్పుడు : అయోడిన్ ఉప్పు సేవిస్తున్నా హై బీ.పి & లో బీ.పి తో బ్రతుకుతున్నాము

🔹 మొదట : వేప పుల్లలు, బొగ్గు, ఉప్పుతో పల్లు తోమి 80 సంవత్సారాలలో కూడా చెరుకుగడలు చీల్చుకుని తినేవారు
🔸ఇప్పుడు : కోల్గేట్ తో పల్లుతోముతూ కూడా డెంటిస్ట్ దగ్గరకు పరుగెత్తుతాం

🔹 మొదట : నాడి పట్టుకుని రోగం ఏంటో చెప్పేసేవారు
🔸ఇప్పుడు : అన్ని స్కానింగులు చేసి కూడా రోగం ఏంటో చెప్పలేక పోతున్నారు

🔹 మొదట : 7 లేదా 8 మందికి జన్మనిచ్చిన తల్లి తన 80 వ యేట కూడ పొలం పనులు సునాయాసంగా చేసేది
🔸ఇప్పుడు : మొదటి నెల నుండి వైద్యుల పర్యవేక్షణలో వున్నా ఆపరేషన్ తోనే పిల్లలు పుడుతున్నారు

🔹 మొదట : బెల్లం పిండి వంటలను కడుపు నిండా తినేవారు
🔸ఇప్పుడు : తినక ముందే షుగర్ వచ్చేసి వుంటుంది

🔹 మొదట : వృద్దులకు కూడా కీళ్ళ నొప్పులు వుండేవి కావు
🔸ఇప్పుడు : యవ్వన దశ నుండే కీళ్ళ జబ్బులు, నడుం నొప్పులు మొదలు అయిపోతున్నాయి

చివరగా.. ఇది విజ్ఞానపు యుగమా లేక అజ్ఞానపు యుగమో తెలియడం లేదు... విధి విచిత్రము కాకపోతేనూ!

ఇది నా ఫ్రెండ్ షేర్ చేసాడు నిజమే అనిపించింది. నేను మీతో పంచుకుంటున్నాను.

🥦

No comments:

Post a Comment