Sunday, February 9, 2020

కోరికల మీద వ్యామోహం మొదటికే చేటు తెస్తుంది. కథ

💐మహావిష్ణువు మృత్యులోక సందర్శన💐
((())))(((())))

శ్రీ మహా విష్ణువు మృత్యులోక సందర్శనకు వచ్చినప్పుడు ఏం జరిగిన వాస్తవాలివి

ఒకనాడు శ్రీ మహా విష్ణువు మృత్యు లోకాన్ని సందర్శించాలని కోరుకున్నాడు. ఈ విషయం గురించి లక్ష్మి దేవితో చర్చించినప్పుడు, తనతో పాటు ఆమె కూడా మృత్యు లోకానికి రావాలనే కోరికను వ్యక్తం చేసింది.అయినప్పటికీ, ఈ ప్రదేశంలోని అన్ని నియమాలు ఆమెకి తెలియని కారణం చేత, ఆ ప్రదేశానికి వెళ్లడం అంత సురక్షితం కాదని విష్ణువు సూచించాడు. అయినప్పటికీ తనను తీసుకెళ్లవలసినదేనని పట్టుపట్టింది. తనకున్న స్వీయ కుతూహలం కారణంగా. పర్యవసానాల గురించి తెలిసిన శ్రీ మహా విష్ణువు, భార్య కోరిక కాదనలేక ఒప్పుకోక తప్పలేదు.
1. లక్ష్మి దేవి నిరాశకు లోనవడం ఇష్టంలేని శ్రీ మహా విష్ణువు, తనతో పాటు లక్ష్మీ దేవిని కూడా మృత్యు లోకానికి తీసుకుని వెళ్ళనారంభించాడు. ఎటువంటి భంగం కలుగకుండా తాను చెప్పిన సూచనలన్నింటినీ అనుసరించాలని ముందుగానే ఆమెను కోరాడు. ఏ విధమైన నిబంధనను ఉల్లంఘించరాదనీ, తనకు తాను స్వీయనిర్ణయాలు తీసుకోరాదని కూడా సూచించారు. ఏమాత్రం నిబంధనలు ఉల్లంఘించినా అవాంఛిత పరిస్థితులు తలెత్తవచ్చునని హెచ్చరించాడు కూడా. అందుకు లక్ష్మీ దేవి అంగీకరించిన పిమ్మట, ఇద్దరూ మృత్యు లోకం వైపునకు ముందుకు సాగారు. తన ఆజ్ఞలను శ్రద్ధగా అనుసరిస్తూ, లక్ష్మీ దేవి, శ్రీ మహా విష్ణువు చెప్పినట్లుగా నిశ్శబ్దంగా పరిసరాలను గమనిస్తూ వెంట నడిచింది. కొంత దూరం వెళ్ళిన పిమ్మట, తాను తిరిగి వచ్చే వరకు అక్కడే వేచి ఉండమని లక్ష్మీ దేవికి సూచించగా, అంగీకరించి వేచిచూడసాగింది.
2. శ్రీ మహా విష్ణువు కొంత ఆలస్యం చేసిన కారణంగా, వేచి చూడలేని లక్ష్మీ దేవి, కుతూహలంతో విష్ణువు వెళ్ళిన దిశలో నెమ్మదిగా ముందుకు కదిలింది. కొంత దూరంలో, ఆమె ఆవాల మొక్కలతో నిండిన క్షేత్రాన్ని చూసింది. పసుపు పూలతో అందంగా ఉండి, ఆక్షేత్రం లక్ష్మి దేవిని ఆకర్షించింది. ఆమె విష్ణువు యొక్క సూచనలను మరచిపోయి క్షేత్రంలో అడుగు పెట్టి, ఒక పువ్వును తుంచి, తన జుట్టుకు అలంకరించుకుంది.
3. క్రమంగా పండ్లతో నిండిన ఒక తోట కనిపించగా, కొంత దూరం నడిచి ఆ అందమైన పండ్ల తోటను చేరుకుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక పండును కోసుకుని తినింది. తన వ్యతిరేక దిశ నుండి విష్ణువు రాకను గ్రహించిన లక్ష్మీ దేవి, తాను స్వీయ నిర్ణయాలను తీసుకోకూడదు అన్న విషయాన్ని గుర్తించింది.
4. విష్ణు భగవానుడు తిరిగి లక్ష్మీ దేవిని చేరుకొని, లక్ష్మీ దేవి చేసిన పొరపాటును గ్రహించి, ఆ క్షేత్రం కేవలం భ్రమ అని, భూమిపై ఉన్న ఒక రైతు ప్రాతినిధ్యంలో ఉన్న క్షేత్రమని, అతను మంచి మానవత్వం కూడుకుని, ఉదార వ్యక్తిగా ఉన్నాడని, క్రమంగా తన అనుమతి లేకుండా తన వ్యవసాయ క్షేత్రం నుండి పండ్లు తీసుకున్నవారు పన్నెండు సంవత్సరాల పాటు రైతు అవసరాలను తీర్చేలా శిక్షకు గురవుతారని ఆమెకు చెప్పగా, పన్నెండు సంవత్సరాలు రైతు ఇంటిలోనే ఉండేందుకు లక్ష్మి దేవి అనుమతి కోరింది.
5. క్రమంగా లక్ష్మీ దేవి చేరుకున్న కారణంగా, పన్నెండు సంవత్సరాల్లోనే, రైతు అత్యంత సంపన్నునిగా పేరు పొందాడు. లక్ష్మీ దేవి అనుగ్రహంతో అచిరకాలంలోనే ఊహకందని లాభాలను గడించిన రైతు, 12 సంవత్సరాల కాలం తర్వాత తిరిగి వెళ్ళబోతున్న లక్ష్మి దేవిని మరికొంత కాలం తనతోనే ఉండవలసినదిగా కోరాడు.
6. నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది, అయిననూ ఎవ్వరైతే త్రయోదశి రోజున, ఇల్లు శుభ్రం చేసి, దీపం వెలిగించి, తన విగ్రహానికి పూజ చేస్తారో, వారికి లక్ష్మీకటాక్షం సిద్దిస్తుందని సూచించింది. క్రమంగా లక్ష్మీదేవి సూచించినట్లు పాటించిన ఆ రైతు, లక్ష్మీ దేవి అనుగ్రహంతో దినాదినాభివృద్ది చెందుతూ పేరు ప్రఖ్యాతలతో విరాజిల్లాడని చెప్పబడింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఈ త్రయోదశిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దీనినే ధన త్రయోదశి అని కూడా పిలుస్తారు.
ఈ కథలో ఒక నిఘూడ అంతరార్ధం దాగి ఉంది. కోరికల మీద వ్యామోహం మొదటికే చేటు తెస్తుంది. పూలు పండ్ల మీద కోరికతో, భర్తకు 12 సంవత్సరాల పాటు దూరంగా ఉండవలసి వచ్చింది లక్ష్మీ దేవి. కావున, ఏ వ్యక్తి కూడా తనకు మించిన కోరికల గురించి అనాలోచిత ఆలోచనలు చేయడం కోరి నష్టాలను చవిచూడడంతో సమానం. ఇక్కడ లక్ష్మీ దేవి ఒకరికి లాభం చేసినా, తాను 12 సంవత్సరాలు శ్రీ మహా విష్ణువుకి దూరంగా ఉండాల్సి వచ్చింది.

No comments:

Post a Comment